rain not comes
-
గీతానా మజాకా! రాత్రంతా కచేరి.. రూ.4 కోట్ల నోట్ల వర్షం! వైరల్ వీడియో
సినిమాకు ప్లస్ అయ్యే పాటను ‘కోటి రూపాయల పాట’ అనడం మనకు తెలుసు. మాటలకే పరిమితమైన ఈ విశేషణాన్ని తన పాటలతో నిజం చేసింది గీతా రబరి. ‘కచ్ కోయిల’గా పేరుగాంచిన గీత కచ్ (గుజరాత్) జిల్లాలోని రాపర్ పట్టణంలో ఒక రాత్రి మొత్తం పాటల కచేరి నిర్వహించింది. భజనల నుంచి జానపదాల వరకు ఎన్నో పాటలతో ప్రేక్షకులను ఉర్రూతలూగించింది. ఆమె పాటలకు మైమరచిపోయిన ప్రేక్షకులు నోట్లు వెదజల్లుతూనే ఉన్నారు. కార్యక్రమం పూర్తయ్యేసరికి అలా వచ్చి చేరిన నోట్ల విలువ నాలుగు కోట్ల పై మాటే. గీతపై నోట్ల వర్షం కురిపిస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. కచ్ జిల్లాలోని ఒక గ్రామంలో పుట్టిన గీత అయిదవ తరగతి నుంచే భజనలు, జానపదాలు పాడేది. ‘రోమా సేర్మా’ పాటతో జిల్లావ్యాప్తంగా పేరు తెచ్చుకుంది. View this post on Instagram A post shared by Geeta Ben Rabari (@geetabenrabariofficial) -
ఆశలు ఆవిరి
వరుణదేవుడు కరుణించేటట్లు కనిపించడం లేదు. జిల్లా వ్యాప్తంగా రైతులు వేరుశెనగ విత్తన సాగు కోసం ఎదురు చూస్తున్నా... వర్షాలు కురవకపోవడంతో పొలాలు బీళ్లుగానే దర్శనమిస్తున్నాయి. కొన్ని చోట్ల జూన్ నెలలో కురిసిన అరకొర వర్షాలకు విత్తనం వేసుకున్న రైతుల పొలాల్లో మొలకెత్తిన వేరుశనగ కాస్తా ఎండు ముఖం పడుతోంది. రైతుల బోర్లలో నీరు ఇంకిపోయి పండ్ల తోటలు కూడా వాడు పట్టారు. చాలా ప్రాంతాల్లో తినేందుకు గడ్డి , తాగేందుకు నీళ్లులేక మూగజీవాలు అవస్థలు పడుతున్నాయి. - ఫొటోగ్రాఫర్, అనంతపురం -
దేవుడే దిక్కు !
‘వర్షం జాడ కరువైంది.. అన్నదాత గుండె బరువైంది... చేసిన అప్పులు కళ్ల ముందు తిరుగుతుంటే... ఆకుపచ్చగా మారాల్సిన చేను అరకొరగా వచ్చిన మొలకలతో వెక్కిరిస్తోంది.’ ప్రస్తుతం జిల్లాలో వేరుశనగ సాగు చేసిన రైతుల పరిస్థితి ఇది. వర్షం రాక పంటకూడా సరిగ్గా పైకి రాకపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. అనంతపురం రూరల్ మండలం ఉప్పరపల్లి, పూలకుంట, చియ్యేడు గ్రామాల సమీపంలో తీసిన ఈ చిత్రాలనే దీనికి ఉదాహరణ. - ఫొటోగ్రాఫర్, అనంతపురం -
జాడలేని వరుణుడు..
తడారిన బోర్లు గుక్కెడు నీటికీ తిప్పలే పెనుకొండ : ఈ ఏడాది ఖరీఫ్ ఆరంభంలోనూ రైతుల ఆశలు ఆడియాసలయ్యాయి. జులై ప్రారంభమైనా కనీసం ఒక బలమైన వర్షం కురవక పోవడంతో అన్నదాతల్లో కలవరం మొదలైంది. 3.3 లక్షల పైచిలుకు జనాభా, 2.05 లక్షల ఓటర్లు ఉన్న పెనుకొండ నియోజకవర్గంలో దాదాపు అన్ని చెరువులూ ఎండిపోయాయి. 90 శాతం బోరుబావుల్లో ఎండిపోయాయి. పెనుకొండ, సోమందేపల్లి, రొద్దం, పరిగి, గోరంట్ల మండలాల్లో ఎటు చూసినా దుక్కి చేయకుండా వదిలేసిన పొలాలు కనిపిస్తున్నాయి. విత్తనం కొనుగోలు చేయలేకపోయిన రైతులు ఖరీఫ్ ఆరంభంలో కొన్ని ప్రాంతాల్లో వర్షం కురిసింది. దీంతో విత్తన పంపిణీకి అధికారులు శ్రీకారం చుట్టారు. అయితే వరుస పంట నష్టాలతో అప్పుల పాలైన రైతుల వద్ద ఈ ఏడాది విత్తనం కొనుగోలు చేసేందుకు ముందుకు రాలేకపోయారు. దీనికి తోడు ఈ ఏడాదీ వర్షాభావ పరిస్థితులు స్పష్టంగా కనిపిస్తుండడంతో పంట సాగుపై రైతులు చేతులెత్తేశారు. ప్రతి రోజూ విత్తన పంపిణీ కేంద్రాలు రైతులు లేక బోసిపోతూ కనిపించాయి. రైతులు దుక్కి చేయని పొలాలు వేల ఎకరాల్లో ఉన్నాయి. ఎండుతున్న తోటలు పెనుకొండ ప్రాంతంలో ఎటు చూసినా తోటలు ఎండిపోతున్నాయి. జిల్లాలో 29,999 హెక్టార్ల మామిడి తోటలు ఉండగా, వీటిలో 5,037 హెక్టార్లలో మామిడి తోటలు పెనుకొండ నియోజకవర్గంలోనే ఉన్నాయి. అడుగంటిన భూగర్భజలాలు, ఎండిన బోర్ల ప్రభావంతో మామిడితో పాటు ఇతర పండ్ల తోటలు నిట్టనిలువునా ఎండిపోతున్నాయి. బీటలు వారుతున్న చెరువులు నియోజకవర్గంలోని అన్ని చెరువులు చుక్కనీరు లేకుండా ఎండిపోయాయి. నెర్రెలు చీలి సీమజాలి చెట్లుకు నిలయంగా మారిపోయాయి. చెరువుల్లో నీరు లేకపోవడంతో బోర్లలో నీరు అడుగంటిపోయింది. కనీసం తాగునీటికి ఇబ్బంది పడాల్సిన పరిస్థితి నెలకొంది. గొల్లపల్లి రిజర్వాయర్ నుంచి పెనుకొండకు తాగునీటిని అందించేందుకు రూ. 5 కోట్లతో చేపట్టిన పైప్‌లైన్ పనులు పూర్తిఅయినా ప్రారంభానికి నోచుకోలేకపోయింది. దారి మళ్లిన జీడిపల్లి రిజర్వాయర్ నీరు జీడిపల్లి నుంచి గొల్లపల్లికి రిజర్వాయర్‌కు చేరుతున్న హంద్రీ-నీవా నీరు కాస్తా దారి మళ్లింది రిజర్వాయర్ నిండకుండానే నేరుగా బుక్కపట్నం చెరువుకు అధికారులు మళ్లించారు. దీనివల్ల పెనుకొండ, మడకశిర, హిందూపురం తదితర ప్రాంతాలకు నీరు అందించే అవకాశాలు సన్నగిల్లాయి. కాలువ పనులు విస్తరించాలన్న ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాలు టీడీపీ నాయకులకు వరంగా మారింది. చెరువులకు నీరు అందించాల్సిన సప్లై చానల్ పనులు చేపట్టడం ప్రశ్నార్థకమవుతోంది. చెరువులు నింపాలి హంద్రీ-నీవా నీటితో చెరువులను నింపితే భూగర్భజలాలు పెరిగి ప్రజల మనుగడ సాగుతుంది. హంద్రీనీవా కాలువ పనులు వేగవంతం చేసి నీటిని గొల్లపల్లి రిజర్వాయర్ నుంచి చెరువులకు మళ్లించాలి. - ఆదినారాయణరెడ్డి, సమతా స్వచ్చంద సంస్థ అధ్యక్షుడు, పెనుకొండ కరువు నివారణా చర్యలు చేపట్టాలి హంద్రీ-నీవా కాలువ ద్వారా గొల్లపల్లి రిజర్వాయర్‌ను పూర్తిగా నింపాలి. లేకుంటే ఉపాధి లభ్యం కాక ప్రజలు వలస పోయే ప్రమాదముంది. రిజర్వాయర్‌కు చేరే నీరు ఇతర ప్రాంతాలకు మళ్లించరాదు. - శ్రీకాంతరెడ్డి, మండల వైఎస్సార్ సీపీ కన్వీనర్, పెనుకొండ -
ఆరుద్ర వచ్చినా .. అర ఇంచు తేమలేదు!
ఊరిస్తున్న మేఘాలు తరిమేస్తున్న గాలులు చిరుజల్లులతో సరిపెడుతున్న వరుణుడు వర్షం కోసం ఎదురుచూస్తున్న రైతులు రుతుపవనాల ఆరంభంలో మురిపించిన వర్షాలు... అసలు సమయంలో ముసుగేశాయి. కారుమబ్బులు కమ్ముకొస్తున్నాయే తప్ప.. చినుకు జాడ లేకుండా పోయింది. కోటి ఆశలతో ఖరీఫ్ పంట సాగుకు సిద్ధమవుతున్న అన్నదాతలను మేఘాలు ఊరిస్తున్నాయే కానీ.. ఊరటనివ్వడం లేదు. బలంగా వీస్తున్న గాలుల ప్రభావానికి చిరు జల్లులతోనే వరుణుడు సరిపెడుతున్నాడు. మృగశిర వెళ్లి గురువారం ఆరుద్రకార్తె వచ్చినా పొలాల్లో అర ఇంచు తేమలేని పరిస్థితి నెలకొంది. - గుమ్మఘట్ట (రాయదుర్గం) ఈ ఏడాది రుతుపవనాల ప్రభావంతో సకాలంలో వర్షాలు మొదలైనప్పటికీ పంట విత్తు సమయానికి ముఖం చాటేశాయి. వారం పది రోజులుగా జిల్లా వ్యాప్తంగా ఊరిస్తున్న మేఘాలు చిరుజల్లులకే పరిమితమయ్యాయి. గాలి వేగం తగ్గకపోతే ఆరుద్ర కార్తెలోనూ విత్తనం వేయడం కష్టమవుతుందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వరుణుడి కోసం ఎదురుచూపు వర్షాకాలం ప్రారంభమై రోజులు గడుస్తున్నా.. ఇప్పటి వరకూ పదును వర్షం ఒక్కసారి మాత్రమే కురిసింది. దీంతో జిల్లాలోని పలు మండలాల్లో భూములను రైతులు దుక్కి చేసి విత్తు వేయడానికి సిద్ధమయ్యారు. రాయదుర్గం నియోజకవర్గ వ్యాప్తంగా సుమారు 57 వేల హెక్టార్లలో వేరుశనగ విత్తుకునేందుకు రైతులు సర్వమూ సిద్ధం చేసుకున్నారు. ఇలాంటి తరుణంలో వర్షం కురవకపోతుండడంతో రైతుల్లో ఆందోళన నెలకొంది. గత ఖరీఫ్ చేదు అనుభవాలను గుర్తు చేసుకుని ఈ సారి పంట సాగుకు భయపడుతున్నారు. అదను దాటకముందే వర్షం కురవాలని దేవుళ్లను మొక్కుకుంటున్నారు. ఈ సారి పంటలు పండితే తప్ప.. కోలుకోలేని పరిస్థితి ఉండడంతో జిల్లా వ్యాప్తంగా గ్రామాల్లో వర్షాల కోసం చేయని పూజలు, హోమాలు అంటూ లేవు. మూఢ నమ్మకాలతో కప్పల ఊరేగింపు.. గాడిదల పెళ్లిలూ చేస్తున్నారు. విత్తుకు సర్వం సిద్దం చేశాం ఆరు ఎకరాల పొలాన్ని దుక్కి, చేసి విత్తుకు సిద్ధం చేశాం. ఆరుద్ర కార్తెలో విత్తితే ఆశించిన స్థాయిలో దిగుబడి వస్తుందనే నమ్మకం. నాలుగు పల్లాల విత్తనాలు, ఎరువులు కొనిపెట్టాను. విత్తనం వేయక ముందే ఎకరాకు రూ.15 వేలు ఖర్చు వచ్చింది. రోజూ వర్షం వస్తుందని ఆశంగా ఆకాశం వైపు చూస్తున్నాం. గాలి జోరుగా ఉండడంతో మేఘాలు చెల్లాచెదరైపోతున్నాయి. ఏం చేయాలో అర్థం కావడం లేదు. – నాగిరెడ్డి, రైతు, కోనాపురం