
దేవుడే దిక్కు !
‘వర్షం జాడ కరువైంది.. అన్నదాత గుండె బరువైంది... చేసిన అప్పులు కళ్ల ముందు తిరుగుతుంటే... ఆకుపచ్చగా మారాల్సిన చేను అరకొరగా వచ్చిన మొలకలతో వెక్కిరిస్తోంది.’ ప్రస్తుతం జిల్లాలో వేరుశనగ సాగు చేసిన రైతుల పరిస్థితి ఇది. వర్షం రాక పంటకూడా సరిగ్గా పైకి రాకపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. అనంతపురం రూరల్ మండలం ఉప్పరపల్లి, పూలకుంట, చియ్యేడు గ్రామాల సమీపంలో తీసిన ఈ చిత్రాలనే దీనికి ఉదాహరణ.
- ఫొటోగ్రాఫర్, అనంతపురం