రెక్కల కష్టం ఎగిరిపోయి...
ఆరుగాలం శ్రమించిన రైతన్న రెక్కల కష్టానికి తగిన ఫలితం దక్కలేదు. ఒక వైపు వర్షాభావ పరిస్థితులు పంట నష్టానికి కారణం కాగా... మరో వైపు చేతికొచ్చిన అరకొర దిగుబడికి గిట్టుబాటు ధర లభ్యం కాక అన్నదాత కుదేలయ్యాడు. దళారుల ప్రమేయంతో ధర పతనమైంది. ఖరీఫ్ పంట కాలంపై మట్టి మనిషి పెట్టుకున్న ఆశలు ఒక్కసారిగా ఎగిరిపోయాయి. వడ్లగింజలో చెమ్మను తొలగించేందుకు చెమ్మగిల్లిన కళ్లతో ఆరబెడుతూ... ఈ రోజు కాకపోయినా రేపైనా మంచి ధర రాకపోతుందా అనే ఆశలు పెంచుకుంటున్నాడు శ్రమజీవి. అనంతపురం శివారులోని సోములదొడ్డి, నాగిరెడ్డిపల్లి, వడియంపేట గ్రామాల వద్ద నిత్యమూ కనిపిస్తున్న ఈ దృశ్యాలు వరి రైతు దైన్య స్థితికి అద్దం పడుతున్నాయి.