wet
-
నిజాయితీకి నిలువుటద్దం కలాం: ఆ చెక్కను జిరాక్స్ తీసి, ఫ్రేమ్ కట్టించి
న్యూఢిల్లీ: ‘ఇతరులు ఇచ్చే కానుకలు, బహుమానాల వెనుక స్వార్థపూరిత కారణం ఉండొచ్చు. మన నుంచి ఏదో ఒకటి ఆశించి ఇలాంటివి ఇస్తుంటారు. అది స్వీకరించే ముందు ఈ విషయం ఆలోచించాలి’.. ప్రఖ్యాత సైంటిస్ట్, భారతరత్న, దివంగత రాష్ట్రపతి డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం బాల్యంలోనే తన తండ్రి వద్ద నేర్చుకున్న పాఠమిది. ఈ పాఠాన్ని జీవితాంతం ఆయన ఆచరించారు. విలువలకు, నిజాయతీకి మారుపేరైన అబ్దుల్ కలాం ఇతరుల నుంచి ఏనాడూ కానుకలు ఆశించలేదు. ఎవరైనా ఇలాంటివి ఇస్తే దాని ధర ఎంతో తెలుసుకొని చెక్కు లేదా డబ్బులు పంపించేవారు. మిస్సైల్ మ్యాన్ కలాం గొప్పతనాన్ని తెలియజేసే మరో సంఘటన వెలుగులోకి వచి్చంది. కలాంకు సంబంధించిన ఈ ఉదంతాన్ని ఐఏఎస్ అధికారి ఎం.వి.రావు తాజాగా సోషల్ మీడియాలో షేర్ చేశారు. 2014లో కలాం ఓ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ‘సౌభాగ్య వెట్ గ్రైండర్’ అనే సంస్థ ఆయనకు ఒక గ్రైండర్‌ను బహూకరించింది. దాన్ని స్వీకరించడానికి ఆయన తొలుత అంగీకరించలేదు. చివరకు బలవంతం మీద స్వీకరించారు. ఆ మరుసటి రోజే దాని ధర తెలుసుకొనేందుకు తన సహాయకుడిని మార్కెట్‌కు పంపించారు. తర్వాత తన వ్యక్తిగత బ్యాంకు ఖాతా నుంచి చెక్కును సౌభాగ్య సంస్థకు పంపారు. చెక్కును ఆ సంస్థ నగదుగా మార్చుకోకపోవచ్చన్న అనుమానం ఆయనకు వచ్చింది. తన బ్యాంకు ఖాతా నుంచి నగదు డెబిట్ అయ్యిందో లేదో కనుక్కున్నారు. కాలేదని తెలిసింది. గడువులోగా నగదుగా మార్చకోకపోతే గ్రైండర్‌ను వెనక్కి ఇచ్చేస్తానని సౌభాగ్య సంస్థకు కలాం సమాచారం పంపారు. ఇక చేసేది లేక ఆ సంస్థ ఆ చెక్కును బ్యాంకులో డిపాజిట్ చేసి, డబ్బులు తీసుకుంది. అబ్దుల్ కలాం ఇచ్చిన చెక్కును జిరాక్స్ తీసి, ఫ్రేమ్ కట్టించి భద్రంగా దాచుకుంది. ఎం.వి.రావు షేర్ చేసిన పోస్టుపై నెటిజన్లు సోషల్ మీడియాలో అభినందనల వర్షం కురిపిస్తున్నారు. కలాం వ్యక్తిత్వాన్ని గుర్తుచేసుకుంటున్నారు. -
రబీ నష్టం రూ.1,023 కోట్లు
- అక్టోబరు నుంచి చినుకు జాడ కరువు - దారుణంగా పడిపోయిన దిగుబడులు - పతనమైన ధరలు - నట్టేట మునిగిన శనగ రైతులు కర్నూలు(అగ్రికల్చర్): రబీ సీజన్ రైతులకు తీవ్ర నష్టాన్ని మిగిల్చింది. అక్టోబరు నుంచి చినుకు జాడ లేకపోవడంతో భూమిలో తేమ ఆరిపోయింది. శనగతో పాటు ఇతర పంటలు దెబ్బతిన్నాయి. ఎన్నడూ లేని విధంగా దిగుబడులు గణనీయంగా తగ్గిపోయాయి. విత్తన సమయంలో ఉన్న ధర.. పంట చేతికొచ్చే సమయానికి తగ్గిపోయింది. రైతులకు పెట్టిన పెట్టుబడుల్లో 50 శాతం కూడా దక్కలేదు. వర్షాభావ పరిస్థితుల్లో ఈ ఏడాది ఖరీఫ్ పంటలు పూర్తిగా దెబ్బతిన్నాయి. ఎన్నో ఆశలతో రబీ పంటలు సాగు చేసిన రైతులకు అప్పులే మిగిలాయి. రబీ సీజన్లో ప్రధానంగా శనగ సాగు అయింది. ఈ పంట సాధారణ సాగు విస్తీర్ణం 1,92,744 హెక్టార్లు. అయితే ఈ ఏడాది 1.79,027 హెక్టార్లలో శనగను సాగు చేశారు. హెక్టారుకు సగటున రూ.30 వేల ప్రకారం ఒక్క శనగ పంటపైనే రూ.537 కోట్ల పెట్టుబడి పెట్టారు. బ్యాంకులు సహకరించక పోవడంతో రైతులు బంగారం ఆభరణాలు తాకట్టు పెట్టి అధిక వడ్డీలకు అప్పులు తెచ్చి పంట సాగు చేశారు. వర్షాలు లేకపోవడం, భూమిలో తేమ శాతం పడిపోవడం, కనీసం మంచు కూడా కురవకపోవడంతో శనగ పంటకు అపార నష్టం వాటిల్లింది. గతంలో ఎన్నడూ లేని విధంగా ఖరీఫ్, రబీ పంటలు పూర్తిగా దెబ్బతినడంతో జిల్లాలో ఏ రైతును కదిలించినా కన్నీళ్లు ఉబికి వస్తున్నాయి. శనగ ధరలు డమాల్.. విత్తనం సమయంలో క్వింటాల్ శనగ ధర రూ.10వేలకు పైగా ఉంది. డిసెంబరు నెలలో శనగ ధర గరిష్టంగా రూ.8840 ఉంది. ఫిబ్రవరి, మార్చి నెలకు వచ్చే సరికి ఈ ధర రూ.5000కు పడిపోయింది. రైతులు కష్టనష్టాల్లో ఉన్నపుడే ధరలు పడిపోయాయి. కర్నూలు, ఓర్వకల్లు, ఆలూరు తదితర ప్రాంతాల్లో శనగ విత్తనాలకు పెట్టిన ఖర్చు కూడ దక్కక రైతులు కన్నీరు మున్నీరవుతున్నారు. పెట్టుబడి మట్టిపాలు.. జిల్లాలో రబీ సాధారణ సాగు 3,54,341 హెక్టార్లు. ఈ ఏడాది 2,92,381 హెక్టార్లలో పంటలు సాగు అయ్యాయి. విత్తనాలు, ఎరువులు, బాడుగలు, పురుగు మందులు, కూలీలు తదితర వాటికి హెక్టారుకు సగటున రూ.35వేలు పెట్టుబడి పెట్టారు. మొత్తంగా ఒక్క రబీ పంటలపై రైతులు రూ.1023 కోట్లకు పైగా పెట్టుబడి పెట్టారు. పంటలు బాగా పండి ఉంటే.. ఈ పెట్టుబడి అదనంగా రూ. 1023 కోట్లు రావాల్సి ఉంది. అయితే పెట్టుబడిలో 50 శాతం కూడా దక్కలేదంటే రైతుల దుస్థితి ఏ విధంగా ఉంటుందో ఉహించవచ్చు. రబీ వేసిన శనగ, జొన్న, ధనియాలు, కుసుమ, మినుము తదితర పంటలన్ని దెబ్బతిన్నాయి. రబీలో శనగ తర్వాత అత్యధికంగా జొన్న సాగు చేశారు. వర్షాభావ పరిస్థితుల వెంటాడటంతో జొన్నలో కూడా దిగుబడులు పడిపోయాయి. రబీ పంటలు బ్బతినడంతో వీటికీ..పరిహారం చెల్లించాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. రబీ పంటలకు బ్యాంకులు.. పంట రుణాలు ఇవ్వకపోవడంతో రైతులు ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజనకు దూరం అయ్యారు. -
రెక్కల కష్టం ఎగిరిపోయి...
ఆరుగాలం శ్రమించిన రైతన్న రెక్కల కష్టానికి తగిన ఫలితం దక్కలేదు. ఒక వైపు వర్షాభావ పరిస్థితులు పంట నష్టానికి కారణం కాగా... మరో వైపు చేతికొచ్చిన అరకొర దిగుబడికి గిట్టుబాటు ధర లభ్యం కాక అన్నదాత కుదేలయ్యాడు. దళారుల ప్రమేయంతో ధర పతనమైంది. ఖరీఫ్ పంట కాలంపై మట్టి మనిషి పెట్టుకున్న ఆశలు ఒక్కసారిగా ఎగిరిపోయాయి. వడ్లగింజలో చెమ్మను తొలగించేందుకు చెమ్మగిల్లిన కళ్లతో ఆరబెడుతూ... ఈ రోజు కాకపోయినా రేపైనా మంచి ధర రాకపోతుందా అనే ఆశలు పెంచుకుంటున్నాడు శ్రమజీవి. అనంతపురం శివారులోని సోములదొడ్డి, నాగిరెడ్డిపల్లి, వడియంపేట గ్రామాల వద్ద నిత్యమూ కనిపిస్తున్న ఈ దృశ్యాలు వరి రైతు దైన్య స్థితికి అద్దం పడుతున్నాయి. -
16 వరకు రెయిన్గన్లతో పంటలకు నీటి తడులు
– డీడీఏ ప్రభాకర్‌రావు పత్తికొండ టౌన్: వర్షాభావ పరిస్థితుల్లో వాడుతున్న పంటలకు రెండో విడత కింద 16వతేదీ వరకు రెయిన్గన్లు, స్ప్రింక్లర్లతో నీటితడులు అందిస్తామని వ్యవసాయశాఖ జిల్లా డిప్యూటీ డైరెక్టర్ డాక్టర్ సీహెచ్ ప్రభాకర్‌రావు తెలిపారు. శనివారం మండలంలోని హోసూరు, చిన్నహుల్తి గ్రామసమీపాల్లో రెయిన్గన్లతో నీటితడులు అందిస్తున్న పంటలను డీడీఏ పరిశీలించారు. హోసూరు గ్రామసమీపంలో పైగేరి రంగస్వామి అనే రైతుకు చెందిన వేరుశెనగ పంటను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ....జిల్లాలోని 53మండలాల్లో 461 గ్రామాల్లో 29,857 హెక్టార్ల విస్తీర్ణంలో పంటలు వాడిపోతూ బెట్టపరిస్థితుల్లో ఉన్నట్లు గుర్తించామన్నారు. పైలెట్ ప్రాజెక్టు క్రింద రెయిన్గన్లు, స్ప్రింక్లర్లుతో బోరుబావులు, కాలువలు, ఫాంపాండ్లు నుంచి మోటార్లతో నీటిని తోడి పంటలకు అందించే చర్యలు చేపట్టామన్నారు. జిల్లాకు 3038 రెయిన్గన్లు, 2066 స్ప్రింక్లర్లు, 27640 పైపులు వచ్చాయన్నారు. కార్యక్రమంలో పత్తికొండ సబ్‌డివిజన్ ఏడీఏ నారాయణనాయక్, పత్తికొండ, మద్దికెర ఏఓలు రాజకిశోర్, కిరణ్‌కుమార్, ఏఈఓలు రుక్సానా, రంగన్న, యోగీంద్ర తదితరులు పాల్గొన్నారు. -
రెండో విడత రక్షక తడులకు సర్వే
–వీడియో కాన్ఫరెన్స్‌లో కలెక్టర్ విజయమోహన్ కర్నూలు(అగ్రికల్చర్): వర్షాభావంతో ఎండుతున్న పంటలకు రెండో విడత రక్షక తడులు ఇచ్చేందుకు సర్వే చేపట్టాలని రెవెన్యూ, వ్యవసాయ అధికారులను జిల్లా కలెక్టర్ విజయమోహన్ ఆదేశించారు. గురువారం కలెక్టరేట్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రక్షక నీటి తడులు, ప్రజాసాధికార సర్వే తదితర అంశాలపై సమీక్ష నిర్వహించారు. మొదటి విడతలో రెయిన్గన్ల ద్వారా 34 వేల హెక్టార్లకు నీటì తడులు ఇచ్చామన్నారు. వర్షాభావంతో ఆదోని డివిజన్లోని అన్ని మండలాలు, కర్నూలు రెవెన్యూ డివిజన్లోని వివిధ మండలాల్లోని పంటలు దెబ్బతింటున్నాయన్నారు. రెండో విడతలో పంటలకు రక్షక నీటితడులు ఇచ్చే కార్యక్రమాన్ని ఈ నెల 11 నుంచి చేపట్టాలన్నారు. ఒక ఎకరా పంట కూడ ఎండరాదని.. ఇందుకు అనుగుణంగా చర్యలు తీసుకోవాలన్నారు. వర్షాభావం ఉన్న అన్ని మండలాల్లో రెయిన్గన్లు, స్ప్రింక్లర్లు సిద్ధంగా ఉన్నాయని తెలిపారు. ప్రజా సాధికార సర్వేను వేగవంతం చేయండి.... జిల్లాలో ప్రజా సాధికార సర్వే నత్తనడకన సాగుతోందని దీనిని తక్షణం వేగవంతం చేయాలని కలెక్టర్ తెలిపారు. ఆర్డీఓలు తమ పరిధిలో పర్యటించి సర్వేలో క్షేత్ర స్థాయిలో ఉన్న సమస్యలను గర్తించి పరిష్కరించాలన్నారు. ఎన్యూమరేటర్లు ఉదయం 8 గంటలకే సర్వే ప్రారంభించే విధంగా తహసీల్దార్లు చర్యలు తీసుకోవాలని తెలిపారు. సెలవు దినాల్లోను కూడ సర్వే చేసి 15 రోజుల్లో పూర్తి చేయాలన్నారు. జిల్లాలో 40 లక్షల జనాభా ఉండగా ఇప్పటి వరకు 17 లక్షల మందిని సర్వే చేశారని వివరించారు. వీడియో కాన్ఫరెన్స్‌లో జాయింట్ కలెక్టర్ హరికిరణ్, సీపీఓ ఆనంద్‌నాయక్, జేడీఏ ఉమామహేశ్వరమ్మ, ఏపీఎంఐపీ పీడీ శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు. -
రెయిన్గన్లతో పంటలను కాపాడండి
– జిల్లా ఇన్చార్జి మంత్రి అచ్చెన్నాయుడు సమీక్ష కర్నూలు(అగ్రికల్చర్): వర్షాభావంతో ఎండిపోతున్న పంటలకు రెయిన్గన్లతో నీటి తడులు అందించాలని జిల్లా ఇన్చార్జి మంత్రి.. కార్మిక, యువజన సంక్షేమ శాఖ మంత్రి కె.అచ్చెన్నాయుడు అధికారులను ఆదేశించారు. మంగళవారం సాయంత్రం కలెక్టరేట్లోని కమాండ్ ఏరియా కంట్రోల్ రూంలో నిర్వహించిన జిల్లా అధికారుల సమావేశంలో మంత్రి పాల్గొని మాట్లాడారు. ఒక్క ఎకరా పంట కూడా ఎండకూడదని.. ఇందుకోసం జిల్లాకు అవసరమైన రెయిన్గన్లు, స్ప్రింక్లర్లు, పైపులను ప్రభుత్వం సరఫరా చేసిందన్నారు. ఈ విషయంలో నీరు, విద్యుత్ సమస్య తలెత్తకుండా జాగ్రత్త వహించాలన్నారు. ప్రధానంగా వర్షం కురవని ఆదోని డివిజన్‌పై దృష్టి సారించాలన్నారు. జిల్లా కలెక్టర్ సీహెచ్ విజయమోహన్ మాట్లాడుతూ పంటల పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షించడంతో పాటు రైతుల నుంచి వినతులు స్వీకరించేందుకు కలెక్టరేట్లో ప్రత్యేకంగా జేసీ–2 ఆధ్వర్యంలో కంట్రోల్ రూం ఏర్పాటు చేశామన్నారు. సోమవారం రాత్రి వర్షం కురిసినందున కాస్త ఇబ్బందులు తొలిగాయన్నారు. నీటి లభ్యత లేని ప్రాంతాల్లో ఆర్‌డబ్లు్యఎస్ ట్యాంకర్ల ద్వారా నీటిని తరలించి రెయిన్గన్లతో పంటలను తడుపుతామన్నారు. కార్యక్రమంలో జెడ్పీ చైర్మన్ మల్లెల రాజశేఖర్, కర్నూలు, బనగానపల్లె, శ్రీశైలం ఎమ్మెల్యేలు ఎస్వీమోహన్‌రెడ్డి, బీసీ జనార్దన్‌రెడ్డి, బుడ్డా రాజశేఖరరెడ్డి, జేసీ హరికిరణ్, జేసీ–2 రామస్వామి, జేడీఏ ఉమా మహేశ్వరమ్మ, ఏపీఎంఐపీ పీడీ శ్రీనివాసులు, సీపీఓ ఆనంద్‌నాయక్, ఇరిగేషన్ ఎస్ఈ చంద్రశేఖరరావు పాల్గొన్నారు.