రెండో విడత రక్షక తడులకు సర్వే
రెండో విడత రక్షక తడులకు సర్వే
Published Thu, Sep 8 2016 11:45 PM | Last Updated on Mon, Sep 4 2017 12:41 PM
–వీడియో కాన్ఫరెన్స్‌లో కలెక్టర్ విజయమోహన్
కర్నూలు(అగ్రికల్చర్): వర్షాభావంతో ఎండుతున్న పంటలకు రెండో విడత రక్షక తడులు ఇచ్చేందుకు సర్వే చేపట్టాలని రెవెన్యూ, వ్యవసాయ అధికారులను జిల్లా కలెక్టర్ విజయమోహన్ ఆదేశించారు. గురువారం కలెక్టరేట్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రక్షక నీటి తడులు, ప్రజాసాధికార సర్వే తదితర అంశాలపై సమీక్ష నిర్వహించారు. మొదటి విడతలో రెయిన్‌గన్‌ల ద్వారా 34 వేల హెక్టార్లకు నీటì తడులు ఇచ్చామన్నారు. వర్షాభావంతో ఆదోని డివిజన్‌లోని అన్ని మండలాలు, కర్నూలు రెవెన్యూ డివిజన్‌లోని వివిధ మండలాల్లోని పంటలు దెబ్బతింటున్నాయన్నారు. రెండో విడతలో పంటలకు రక్షక నీటితడులు ఇచ్చే కార్యక్రమాన్ని ఈ నెల 11 నుంచి చేపట్టాలన్నారు. ఒక ఎకరా పంట కూడ ఎండరాదని.. ఇందుకు అనుగుణంగా చర్యలు తీసుకోవాలన్నారు. వర్షాభావం ఉన్న అన్ని మండలాల్లో రెయిన్‌గన్‌లు, స్ప్రింక్లర్లు సిద్ధంగా ఉన్నాయని తెలిపారు.
ప్రజా సాధికార సర్వేను వేగవంతం చేయండి....
జిల్లాలో ప్రజా సాధికార సర్వే నత్తనడకన సాగుతోందని దీనిని తక్షణం వేగవంతం చేయాలని కలెక్టర్ తెలిపారు. ఆర్డీఓలు తమ పరిధిలో పర్యటించి సర్వేలో క్షేత్ర స్థాయిలో ఉన్న సమస్యలను గర్తించి పరిష్కరించాలన్నారు. ఎన్యూమరేటర్లు ఉదయం 8 గంటలకే సర్వే ప్రారంభించే విధంగా తహసీల్దార్లు చర్యలు తీసుకోవాలని తెలిపారు. సెలవు దినాల్లోను కూడ సర్వే చేసి 15 రోజుల్లో పూర్తి చేయాలన్నారు. జిల్లాలో 40 లక్షల జనాభా ఉండగా ఇప్పటి వరకు 17 లక్షల మందిని సర్వే చేశారని వివరించారు. వీడియో కాన్ఫరెన్స్‌లో జాయింట్ కలెక్టర్ హరికిరణ్, సీపీఓ ఆనంద్‌నాయక్, జేడీఏ ఉమామహేశ్వరమ్మ, ఏపీఎంఐపీ పీడీ శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.
Advertisement