servey
-
USA Presidential Elections 2024: కమలా హారిస్‌దే పైచేయి
వాషింగ్టన్: అమెరికా అధ్యక్ష రేసులో డెమొక్రాటిక్ అభ్యర్థి కమలా హారిస్‌దే పైచేయిగా ఉందని తాజాగా వెల్లడైంది. డెసిషన్ డెస్క్ హెచ్‌క్యూ– ది హిల్ కూర్చిన పోల్ ఆఫ్ ది పోల్స్‌లో దేశవ్యాప్తంగా డొనాల్డ్ ట్రంప్ కంటే హారిస్ 4.2 శాతం ఆధిక్యంలో ఉన్నారు. 45 పోల్స్‌ను క్రోడీకరించి ఫలితాలను వెల్లడించారు. కమలా హారిస్ ఏకంగా 4.2 శాతం ఆధిక్యంలో ఉండగా, మే తర్వాత ఆమె ఏకంగా పది శాతం పుంజుకోవడం విశేషం. హోరాహోరీ పోరు నెలకొన్న ఏడు రాష్ట్రాల్లో ఆరింటిలో ట్రంప్‌పై హారిస్ ఒకశాతం ఆధిక్యంలో ఉన్నారని బెనెన్సన్ స్ట్రాటజీ గ్రూపు– జీఎస్ స్ట్రాటజీ గ్రూపు సర్వే వెల్లడించింది. హోరాహోరీ రాష్ట్రాలైన జార్జియా, మిషిగాన్, నార్త్ కరోలినా, పెన్సిల్వేనియా, విస్కాన్సిన్, అరిజోనాల్లో హారిస్‌కు ఒక శాతం ఆధిక్యం ఉంది. నెవెడాలో మాత్రం ట్రంప్ ముందంజలో ఉన్నారు. నెవెడాలోనూ హారిస్ క్రమేపీ పుంజుకుంటున్నారు. మే నుంచి తీసుకుంటే ట్రంప్‌తో వ్యత్యాసాన్ని ఆరు పాయింట్ల మేరకు తగ్గించారు. ట్రంప్‌తో పోలిస్తే కమలా హారిస్ నిజాయితీ, క్రమశిక్షణ కలిగిన నాయకురాలని అమెరికన్లు భావిస్తున్నట్లు అసోసియేటెడ్ ప్రెస్– ఎన్ఓఆర్సీ సర్వే తెలిపింది. ఆర్థిక వ్యవస్థ, వలసల అంశాల్లో ట్రంప్ మెరుగని భావిస్తున్నారు. అధ్యక్ష రేసులోకి లేటుగా వచ్చినా హారిస్ దూసుకెళ్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో సెప్టెంబర్ 10న ట్రంప్‌తో ఆమె డిబేట్ పోటాపోటీగా ఉంటుందని భావిస్తున్నారు. అందరి దృష్టీ దానిపైనే నెలకొంది. -
ఫార్చూన్ 500 లీడర్లలో మహిళలు అంతంతే ..
న్యూఢిల్లీ: కార్పొరేట్ ప్రపంచంలో మహిళలు దూసుకెడుతున్నా.. కంపెనీలకు సారథ్యం వహిస్తున్న వారి సంఖ్య అంతంతమాత్రంగానే ఉంటోంది. ఫార్చూన్ ఇండియా 500 కంపెనీల్లో కేవలం 1.6 శాతం సంస్థలు మాత్రమే మహిళల సారథ్యంలో ఉండటం ఇందుకు నిదర్శనం. ఫార్చూన్ ఇండియా, ఎస్పీ జైన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ అండ్ రీసెర్చ్ నిర్వహించిన ఒక అధ్యయనంలో ఈ విషయాలు వెల్లడయ్యాయి. కేంద్ర మహిళా, శిశు అభివృద్ధి శాఖ, బిల్ అండ్ మెలిండా గేట్స్ ఫౌండేషన్ దీనికి తోడ్పాటు అందించగా, ముంబై, కోల్‌కతా, బెంగళూరు, ఢిల్లీ–ఎన్సీఆర్లో 16 రౌండ్‌టేబుల్ సమావేశాలు నిర్వహించారు. వీటిలో 130 మంది పైచిలుకు పరిశ్రమ దిగ్గజాలు పాల్గొన్నారు. అలాగే సర్వే ప్రశ్నాపత్రం ద్వారా ఫార్చూన్ 500 కంపెనీల అభిప్రాయాలు కూడా సేకరించారు. ‘మహిళల సారథ్యంలో అభివృద్ధి లక్ష్యాన్ని సాధించే దిశగా పరిష్కరించుకోవాల్సిన సమస్యలను గుర్తించడంలో పరిశ్రమ పారదర్శకంగా వ్యవహరిస్తుండటం ప్రశంసనీయం‘ అని నివేదికను ఆవిష్కరించిన సందర్భంగా కేంద్ర మహిళా, శిశు అభివృద్ధి శాఖ మంత్రి స్మృతి ఇరానీ .. సామాజిక మాధ్యమం ఎక్స్‌లో పేర్కొన్నారు. అధ్యయనం విశేషాలు.. ► ఫార్చూన్ ఇండియా ఏటా అత్యధిక ఆదాయాలు ఆర్జించే 500 టాప్ కంపెనీలతో జాబితా విడుదల చేస్తుంటుంది. అధ్యయనం ప్రకారం వీటిలో కేవలం 1.6 శాతం సంస్థల్లోనే మహిళా ఎండీలు/సీఈవోలు ఉన్నారు. తర్వాత స్థానంలో ఉండే నెక్ట్స్ 500 సంస్థల్లో 5 శాతం, ఫార్చూన్ ఇండియా 1000 కంపెనీల లిస్టులో 3.2 శాతం మంది ఉన్నారు. ► కుటుంబ బాధ్యతల కారణంగా 30–40 శాతం మంది ఉద్యోగినులు .. మిడిల్ మేనేజ్మెంట్ స్థాయికి రాగానే నిష్క్రమిస్తుండటంతో వారి ప్రాతినిధ్యం తగ్గుతోంది. ప్రసూతి సెలవులు తీసుకోవడం, ప్రసవం తర్వాత తిరిగి ఉద్యోగాల్లో చేరడం సవాలుగా ఉంటోంది. ► కార్పొరేట్ మైండ్సెట్పరమైన సమస్యలు కూడా కెరియర్లో మహిళల పురోగతికి సమస్యాత్మకంగా ఉంటున్నాయి. ఉద్యోగినులు ఆరు నెలల పాటు మెటర్నిటీ లీవులు తీసుకునే అవకాశం ఉంటుందనే ఉద్దేశంతో మిడ్–మేనేజ్మెంట్ స్థాయి ఉద్యోగాల్లో మహిళలను తీసుకోవడానికి సంస్థలు సంకోచిస్తున్నాయి. ఇది పెయిడ్ లీవు కావడంతో చాలా మటుకు సంస్థలు – ముఖ్యంగా చిన్న సంస్థలు – పెట్టుబడి పెట్టడానికి ఇష్టపడటం లేదు. అలాగే పిల్లల బోర్డు ఎగ్జామ్ల కోసం, తల్లిదండ్రులు..లేదా అత్తమామల సంరక్షణ కోసం నలభైలలో బ్రేక్ తీసుకోవాల్సి వస్తుండటం వంటివి కూడా మహిళ ఉద్యోగులకు సమస్యాత్మకంగా ఉంటున్నాయి. ► వేరే ప్రాంతాలకు వెళ్లాల్సి వస్తే మహిళలు వెళ్లలేరు, లాభనష్టాల పరిస్థితులను సరిగ్గా చక్కబెట్టగలిగే సామరŠాధ్యలు వారికి ఉండవు అనే మూస అభిప్రాయాలు కూడా వారి పురోగతికి అవరోధాలుగా ఉంటున్నాయి. ఇలాంటి అభిప్రాయాల వల్ల వారిని నేరుగా అడగకుండానే యాజమాన్యాలు మహిళా ఉద్యోగుల విషయంలో ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకునే పరిస్థితి ఉంటోంది. ► అయితే, కంపెనీల్లో లింగ అసమానతలపై అవగాహన పెరుగుతోంది. రూ. 200 కోట్లు ఆర్జించిన ఎయిర్‌బీఎన్‌బీ మహిళా హోస్ట్‌లు ఆన్లైన్ హోస్టింగ్ ప్లాట్‌ఫాం ఎయిర్బీఎన్బీలోని మహిళా హోస్ట్‌లు (ఆతిథ్య సేవలు అందించేవారు) దేశీయంగా 2023లో రూ. 200 కోట్లు పైగా ఆర్జించారు. స్థానిక ఆర్థిక వ్యవస్థలు, కమ్యూనిటీల వృద్ధిపై మహిళలు చూపుతున్న సానుకూల ప్రభావాలకు ఇది నిదర్శనమని ఎయిర్‌బీఎన్‌బీ తెలిపింది. భారత్‌లోని తమ హోస్టింగ్ కమ్యూనిటీలో సుమారు 30 శాతం మంది మహిళలు ఉన్నారని ఎయిర్‌బీఎన్‌బీ ఇండియా జనరల్ మేనేజర్ అమన్‌ప్రీత్ బజాజ్ తెలిపారు. మహిళా పర్యాటకులకు, మహిళా హోస్ట్‌లకు సురక్షితమైన పరిస్థితులు కలి్పంచేందుకు తాము కట్టుబడి ఉన్నామని ఆయన పేర్కొన్నారు. మహిళా అతిథులు భారత్‌లో ఎక్కువగా గోవా, బెంగళూరు, ఢిల్లీ, పుణె, డెహ్రాడూన్, జైపూర్లను ఎంచుకుంటున్నారని వివరించారు. అంతర్జాతీయంగా లండన్, దుబాయ్, టొరంటో, ప్యారిస్ మొదలైనవి భారతీయ మహిళా పర్యాటకులకు ఫేవరెట్‌గా ఉంటున్నాయని బజాజ్ పేర్కొన్నారు. 2023 మహిళా రుణాల్లో భారీ పురోగతి మహిళా రుణాల విషయంలో 2023లో మంచి పురోగతి కనిపించింది. మహిళా రుణాలు పెరిగినట్లు క్రెడిట్ ఇన్ఫర్మేషన్ కంపెనీ ఒకటి పేర్కొంది. వ్యక్తిగత రుణాలు, ద్విచక్ర వాహన రుణాల పోర్ట్‌ఫోలియో అత్యంత వేగంగా 26 శాతం వృద్ధిని కనబరిచినట్లు అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా క్రిఫ్ హై మార్క్ విడుదల చేసిన నివేదిక పేర్కొంది. నివేదిక ప్రకారం మహిళలకు సంబంధించి మొత్తం రుణ పోర్ట్‌ఫోలియో 2022 చివరి నాటికి రూ. 26 లక్షల కోట్ల నుండి 2023లో రూ. 30.95 లక్షల కోట్లకు ఎగసింది. వ్యాపారవేత్తలుగా మారేందుకు ఆసక్తి మహిళా ఉద్యోగస్థుల్లో అత్యధికుల అభిమతం ఇండియాలెండ్స్ సర్వేలో 76 శాతంమంది ఓటు ఫైనాన్షియల్ ఇన్‌స్ట్రుమెంట్స్‌పై అవగాహనకూ సై దేశీయంగా ఉద్యోగాలు చేస్తున్న మహిళల్లో అత్యధిక శాతంమంది వ్యాపారవేత్తలు(ఎంటర్ప్రెన్యూర్)గా మారేందుకు ఆసక్తిని ప్రదర్శించారు. సొంత బిజినెస్ ప్రారంభించాలనే ఆలోచనను కలిగి ఉన్నట్లు ఇండియాలెండ్స్ నిర్వహించిన సర్వే పేర్కొంది. 24–55 ఏళ్ల మధ్య వయసున్న 10,000 మంది వర్కింగ్ ఉమన్‌తో సర్వే చేపట్టినట్లు వ్యక్తిగత రుణాలు, క్రెడిట్ కార్డుల గణాంకాలు అందించే ఆన్లైన్ మార్కెట్‌ప్లేస్ ఇండియాలెండ్స్ తెలియజేసింది. మెట్రో నగరాలతోపాటు టైర్–1, టైర్–2 పట్టణాలలో ఉద్యోగాలు చేసే మహిళలను సర్వేకు పరిగణించినట్లు వెల్లడించింది. వీరిలో 76 శాతం మంది సొంత బిజినెస్‌ను ప్రారంభించాలనే కోరికను వ్యక్తం చేసినట్లు పేర్కొంది. 86 శాతంమంది మహిళలు బడ్జెటింగ్, పెట్టుబడులు, పొదుపు తదితర విభిన్న ఆర్థిక ప్రొడక్టుల(ఫైనాన్షియల్ ఇన్స్ట్రుమెంట్స్)పై అవగాహనను పెంపొందించుకోవాలనే పట్టుదలను ప్రదర్శించినట్లు వివరించింది. వ్యాపారవేత్తలు సైతం పలువురు మహిళా వ్యాపారవేత్తలను సైతం సర్వేకు పరిగణించినట్లు ఇండియాలెండ్స్ పేర్కొంది. వీరిలో 68 శాతం ఉమన్ ఎంటర్‌ప్రెన్యూర్స్ తమ కంపెనీ ఖాతాలను స్వతంత్రంగా నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. 32 శాతంమంది మాత్రమే ఇందుకు భర్తలు, కుటుంబ సభ్యులు, వృత్తి నిపుణులపై ఆధారపడుతున్నట్లు తెలియజేశారు. ఇక బిజినెస్ ఉమన్‌లో దాదాపు 69 శాతంమంది, వేతనాలు అందుకునే మహిళల్లో 51 శాతంమంది తమ సొమ్మును పెట్టుబడులకు మళ్లిస్తున్నట్లు వెల్లడించారు. వీరిలో 79 శాతంమంది సొంతంగా ఇన్వెస్ట్ చేస్తున్నట్లు తెలియజేశారు. కేవలం 21 శాతంమంది పెట్టుబడులకు సంబంధించి తమ భాగస్వాములు లేదా తల్లిదండ్రుల సహాయం తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు. ఇక 25 శాతంమంది మహిళలు విశ్వాసంలేక సొంత పెట్టుబడి నిర్ణయాలు తీసుకోకపోగా.. మరో 29 శాతంమంది ఫైనాన్షియల్ ఇన్స్ట్రుమెంట్స్పట్ల పరిమిత అవగాహన కారణంగా వెనకడుగు వేస్తున్నట్లు వెల్లడించారు. సర్వే వివరాలిలా సర్వేలో పాల్గొన్నవారిలో దాదాపు 34 శాతంమంది మహిళలు 25–34 మధ్య వయసు కలిగినవారుకాగా.. సుమారు 26 శాతంమంది 35–44 మధ్యవయసు గలవారిగా ఇండియాలెండ్స్ తెలియజేసింది. 22 శాతంమంది 18–24 ఏజ్ గ్రూప్‌కాగా.. 45 ఏళ్లకుపైబడినవారు 19 శాతంగా వెల్లడించింది. ఈ మహిళల్లో 44.5 శాతంమంది ఉద్యోగస్థులు, సొంత ఉపాధిగలవారు 31 శాతంమంది, గృహిణులు 12 శాతంమంది, సీఏలు, అడ్వకేట్లు తదితర వ్యక్తిగత వృత్తి నిపుణులు 4.4 శాతంమందిగా తెలియజేసింది. -
జ్ఞానవాపి మసీదులో పురావస్తుశాఖ సర్వేపై సుప్రీం స్టే
-
వేసవి ప్రయాణానికి రెడీ
న్యూఢిల్లీ: పెరుగుతున్న ఉష్ణోగ్రతలతో పర్యాటకులు చల్లటి ప్రదేశాలకు ప్రయాణం కడుతున్నారు. వరుసగా రెండు వేసవి సీజన్లలో కరోనా కారణంగా ప్రయాణం చేయలేని పరిస్థితులు.. ఈ విడత లేకపోవడం కూడా పర్యాటక రంగంలో సందడిని పెంచింది. గరిష్ట ఉష్ణోగ్రతల నుంచి సేదతీరేందుకు పట్టణ వాసులు మొగ్గు చూపిస్తున్నారు. పర్వత, కొండ ప్రాంతాల్లోని పర్యాటక కేంద్రాలకు ఈ విడత డిమాండ్ అనూహ్యంగా ఉన్నట్టు పరిశ్రమ వర్గాలు తెలిపాయి. హోటళ్లు, ఫ్లయిట్ బుకింగ్‌లు జోరుగా జరుగుతున్నట్టు పేర్కొన్నాయి. ప్రతి ఇద్దరు భారతీయుల్లో ఒకరు ఈ వేసవిలో ప్రయాణం చేయాలని అనుకుంటున్నారు. ఇందులోనూ ఎక్కువ మంది విహార యాత్రలకే మొగ్గు చూపిస్తున్నట్టు ఓయో సర్వేలో తెలిసింది. 64 శాతం మంది వేసవిలో సెలవులు పెట్టేసి నచ్చిన ప్రదేశానికి వెళ్లొద్దామని అనుకుంటుంటే.. 94 శాతం మంది దేశీయంగా ఉన్న పర్యాటక ప్రాంతాలకు వెళ్లేందుకు సుముఖంగా ఉన్నారు. ఉత్తరాదిలో వీటికి డిమాండ్.. ఆన్లైన్లో వివిధ పోర్టళ్లపై బుకింగ్ తీరును పరిశీలిస్తే.. ఉత్తరాదిలో రిషికేష్, హరిద్వార్, సిమ్లా, ముస్సోరీ, డెహ్రాడూన్ ప్రాంతాలకు ఎక్కువ డిమాండ్ నెలకొంది. ఈ ప్రాంతాల్లోని హోటల్స్, రిసార్ట్‌ల్లో దాదాపు గదులన్నీ బుకింగ్ అయిపోయాయి. రూమ్ టారిఫ్‌లు కరోనాకు ముందుతో పోలిస్తే 10–15 శాతం అధికంగా ఉన్నట్టు పరిశ్రమ వర్గాలు వెల్లడించాయి. ముఖ్యంగా రిషికేష్, హరిద్వార్‌లోని అన్ని ఇంటర్నేషనల్ బ్రాండెడ్ హోటళ్లలో మే నుంచి జూన్ చివరికి నాటికి బుకింగ్‌లు పూర్తిగా అయిపోయాయి. ఈ ఏడాది పర్యాటక ప్రాంతాల్లో హోటళ్లకు డిమాండ్ కరోనా ముందు నాటి స్థాయికి చేరుకున్నట్టు, సగటు రూమ్ చార్జీలు 10 శాతం పెరిగినట్టు ఎస్సైర్ హాస్పిటాలిటీ గ్రూపు సీఈవో అఖిల్ అరోరా తెలిపారు. ఎస్సైర్ గ్రూపునకు బిమ్టల్, జిమ్‌కార్బెట్ ప్రాంతాల్లో హోటళ్లు ఉన్నాయి. కరోనా కేసులు స్వల్పంగా పెరుగుతున్నా ప్రయాణాలకు డిమాండ్ తగ్గలేదని అరోరా చెప్పారు. పుంజుకున్న బుకింగ్‌లు.. వేసవి కోసం కశ్మీర్, రాజస్తాన్, హిమాచల్‌ప్రదేశ్, గోవా, అరుణాచల్, మణిపూర్, త్రిపుర ప్రాంతాలు ఆకర్షణీయంగా (అధిక డిమాండ్) మారిపోయాయి. దేశం బయట దుబాయి, మాల్దీవులు, థాయిలాండ్, యూఎస్‌కు డిమాండ్ నెలకొంది. ‘‘మే, జూన్ నెలలకు సంబంధించి ముందస్తు బుకింగ్‌లు పెద్ద ఎత్తున పెరిగాయి. ప్రజలు ఎక్కువ రోజుల పాటు విడిది కోసం వెళ్లాలని చూస్తున్నారు’’అని ఈజ్‌మైట్రిప్ ప్రెసిడెంట్ హిమంక్ త్రిపాఠి తెలిపారు. ఫ్లయిట్ బుకింగ్‌లు కరోనా ముందు నాటికి చేరినట్టు మేక్మైట్రిప్ సీఈవో రాజేష్ మాగోవ్ వెల్లడించారు. సులభ వాయిదాల్లో రుణాలు లభించడం డిమాండ్‌కు తోడ్పడుతున్నట్టు ఆయన చెప్పారు. రికవరీ బలంగా.. 2022 ఏప్రిల్ నెలలో సగటు రోజువారీ ఫ్లయిట్ డిపార్చర్లు 2,726గా ఉన్నాయి. 2021 ఏప్రిల్‌లో రోజువారీ 2,000తో పోలిస్తే మంచి వృద్ధి కనిపిస్తోంది. మార్చి నెలలో రోజువారీ డిపార్చర్లు 2,588తో పోల్చి చూసినా ఏప్రిల్‌లో 5 శాతం పెరిగినట్టు తెలుస్తోంది. విమానాల్లో ప్రయాణికుల భర్తీ కూడా గతేడాది ఇదే నెలతో పోలిస్తే 2022 ఏప్రిల్‌లో 36 శాతం అధికంగా ఉంది. గత నెలలో ఒక ఫ్లయిట్లో సగటు ప్రయాణికుల సంఖ్య 128గా ఉంది. కరోనాకు ముందు సగటు ప్రయాణికులు 135 కంటే కొంచెం తక్కువగా ఉంది. దేశీయంగా ప్రయాణికుల రద్దీ ఏప్రిల్‌లో వార్షికంగా చూస్తే 83 శాతం పెరిగి 10.5 మిలియన్లుగా ఉంది. కరోనాకు ముందున్న 11 మిలియన్ల కంటే ఇది స్వల్పంగానే తక్కువ. పెంటప్ డిమాండ్ ఈ ఏడాది పర్యాటక ప్రాంతాలు, విహార యాత్రా స్థలాలకు డిమాండ్ గణనీయంగా ఉండడానికి.. గత రెండు వేసవి సీజన్లలో ప్రయాణం చేయలేని వారు ఈ ఏడాది ప్రాధాన్యం ఇస్తుండడం వల్లేనని అనుకోవాలి. గుడ్ ఫ్రైడే, విసు వీక్ సందర్భంగా 8 లక్షల బుకింగ్‌లు నమోదయ్యాయని.. 2022లో ఇదే అత్యధికమని ఓయో చీఫ్ సర్వీస్ ఆఫీసర్ షీరంగ్ గాడ్బోల్ తెలిపారు. రానున్న కొన్ని నెలల్లో ఈ డిమాండ్ మరింత పెరుగుతుందని తాము అంచనా వేస్తున్నట్టు చెప్పారు. -
కరోనా వ్యాప్తినియంత్రణలో ఫీవర్ సర్వే కీలక పాత్ర
-
విశాఖలో నేటి నుంచి నగరవ్యాప్తంగా సర్వే
-
2100 నాటికి టాప్‌లో భారత్!
పెరుగుట విరుగట కొరకే అంటారు పెద్దవారు. కానీ మన జనాభా పెరుగుతూనే పోతోంది. అది ఇప్పట్లో ఆగదని సర్వేలు చెబుతున్నాయి. 2024 నాటికి మన దేశం చైనా జనాభాను దాటేస్తుందని చాలా సర్వేలు చెబుతున్నాయి. మన జనాభా ఇప్పుడు దాదాపు 130 కోట్లు. చైనా జనాభా 140 కోట్లు. చైనాను దాటడం మనకు పెద్ద కష్టమైన పనేమీ కాదని తెలుసు. అయితే ఈ పెరుగుదల 2060 వరకు కొనసాగుతుందని తర్వాత నెమ్మదిస్తుందనీ వరల్డ్ ఎకనమిక్ చేసిన ఒక సర్వేలో తెలిపింది. 2100 వరకు జనాభా పెరుగుదల రేటు తగ్గినా.. ప్రపంచంలో అత్యధికంగా జనాభా ఉండే దేశం మనదేనట. చైనాలో మాత్రం అనూహ్యంగా జనాభా తగ్గుతుందట. అంతేకాకుండా జనాభా పెరుగుదల రేటు కూడా తగ్గిపోయి, రెండో స్థానంలో ఉంటుందట. విపరీతమైన జనాభా పెరుగుదల ఆ సర్వే తెలిపిన కొన్ని వివరాలు...మన రెండు దేశాల పరిస్థితి ఇలా ఉంటే...ప్రపంచవ్యాప్తంగా ఉన్న కొన్ని దేశాల పరిస్థితి మరీ దారుణంగా తయారవుతుంది. ముఖ్యంగా ఆఫ్రికన్ దేశాల జనాభా విపరీతంగా పెరిగిపోతుంది. అమెరికాను తలదన్ని నైజీరియా మూడో స్థానంలో ఉంటుంది. అమెరికా జనాభా 2100 నాటికి దాదాపు 44కోట్లవరకు చేరుతుంది. పశ్చిమాఫ్రికా దేశాల జనాభా 80కోట్లకు చేరుతుంది. ఇది ప్రస్తుత యూరప్ జనాభా కంటే ఎక్కువ. యూరప్ జనాభా ఈ శతాబ్దాంతం వరకు తగ్గుముఖం పడుతుంది. ఆఫ్రికా దేశాలైన కాంగో, టాంజానియా, ఇథియోపియా, ఉగాండా దేశాల్లో విపరీతమైన జనాభా పెరుగుదల కనిపిస్తుంది. అనూహ్యంగా కాంగో ప్రస్తుత జనాభా 5కోట్లనుంచి 30కోట్ల వరకు చేరుకుంటుంది. దీంతో 2100నాటికి ప్రపంచంలో అత్యధిక జనాభా కలిగిన 8వ దేశంగా అవతరిస్తుంది. ఆసియా దేశాల్లో కూడా జనాభా పెరుగుతుంది. పాకిస్థాన్ జనాభా 35కోట్లకు, ఇండోనేషియా జనాభా 30కోట్లకు చేరుతుంది. తగ్గుతున్న సంతానోత్పత్తి రేటు జనాభా పెరుగుతూ ఉన్నా...సంతానోత్పత్తి రేటు మాత్రం అన్ని దేశాల్లో తగ్గుతుందని పేర్కొన్నారు. సంతానోత్పత్తి రేటు అధికంగా ఉండే ఆఫ్రికా దేశాల్లోనే 2000 -2005 మధ్య 5.1గా ఉన్న సంతానోత్పత్తి రేటు 2010-2015 వచ్చేసరికి 4.7కి పడిపోయిందని తెలిపారు. యూరోప్‌లో జనాభా తగ్గుతూ ఉంది కానీ రేటు మాత్రం 2000-2015 మధ్యలో పెరిగిందని పేర్కొంది. ఏ దేశంలోనైనా సరే అన్ని వయస్కులవారు సమతుల్యంగా ఉండాలి. అలాకాక వృద్దులు, పిల్లలు, యువత ఇలా అందరూ ఉండాలి. ఇలా ఉండాలంటే సరాసరిగా ఆ దేశ సంతానోత్పత్తి రేటు 2.1 ఉండాలి. కానీ, చాలా దేశాల్లో ఇది లోపిస్తుంది. 83 దేశాల్లో ఇలా లేనందువల్లే 2010 నుంచి 2015 మధ్య దాదాపు ప్రపంచ జనాభా 46శాతం తగ్గిందని తెలిపింది. ఇలానే కొనసాగితే... కావల్సినంత సంతానోత్పత్తి రేటు లేకపోవడం వల్ల జనాభాలో వృద్ధుల సంఖ్య పెరిగిపోతుంది. తద్వారా వారి పోషణకు, రక్షణకు చాలా ఇబ్బంది ఏర్పడుతుంది. ఆర్థికంగా వెనుకబడతారు. వృద్ధ జనాభా దాదాపు 3 రెట్లకు పెరుగుతుంది. ప్రస్తుతం ఉన్న 962 మిలియన్ల నుంచి 2100వరకు 3.1 బిలియన్లకు వరకు చేరుతుంది. పరిస్థితి ఇలానే ఉంటే పేదరిక నిర్మూలన, ఆకలి బాధ, ఆరోగ్యం, విద్య, లింగ వివక్షత లాంటి సుస్థిరాభివృద్ధి లక్ష్యాలను చేరుకోలేమని వరల్డ్ ఎకనామిక్స్ ఫోరమ్ సర్వే తెలిపింది. -
మతం మాకు చాలా ముఖ్యం!
► భారత్‌లో 80% మంది.. అమెరికాలో 50% మంది వెల్లడి ► మతానికి ప్రాధాన్యతనిచ్చే జనం ఇథియోపియాలో అత్యధికం ► చైనాలో అత్యల్పం.. 100 మందిలో ముగ్గురే మతవిశ్వాసులు ► 2050 నాటికి మారనున్న మత సమీకరణాలు: ప్యూ రీసెర్చ్ సర్వే భారతదేశంలో 80 శాతం మంది ప్రజలు తమ జీవితంలో మతానికి చాలా ప్రాధాన్యత ఉందని చెప్తున్నారు. అంతర్జాతీయంగా చూస్తే.. ఇటువంటి వారు ఇథియోపియాలో అత్యధికంగా ఉంటే.. చైనాలో అతి తక్కువగా ఉన్నారని ప్యూ రీసెర్చ్ సెంటర్ అధ్యయనం వెల్లడిస్తోంది. 2015లో ప్రపంచ వైఖరుల సర్వేలో భాగంగా.. మతం విషయంలో ప్రజల మనోభావాలు ఎలా ఉన్నాయన్నదానిపై అధ్యయనం చేశారు. ఆఫ్రికా ఖండంలోని ఇథియోపియా ప్రజల్లో ప్రతి 100 మందిలో 98 మంది మతం తమకు చాలా ముఖ్యమైన అంశంగా పరిగణిస్తున్నట్లు తేలింది. సర్వేలో ప్రశ్నించిన వారిలో దాదాపు అందరూ ఇథియోపియన్ ఆర్థొడాక్స్ చర్చ్ అనేది తమ జీవితంలో చాలా ముఖ్యమైన భాగమని బదులిచ్చారు. మరో ఆఫ్రికా దేశమైన సెనెగల్‌లో కూడా దాదాపు ఇదే రకమైన పరిస్థితి ఉంది. మెజారిటీ ముస్లిం మతస్తులైన అక్కడి ప్రజల్లో 97 శాతం మంది మతానికి చాలా ప్రాధాన్యత ఉందని చెప్పారు. ఇక పాకిస్తాన్, ఇండొనేసియా, బుర్కినా ఫాసో తదితర దేశాల్లో 90 శాతానికన్నా ఎక్కువ మంది తమ జీవితంలో మతం చాలా ముఖ్యమైన భాగమని స్పందించారు. అభివృద్ధి చెందుతున్న దేశాల్లోనే అధికం అభివృద్ధి చెందిన దేశాల్లోని ప్రజలకన్నా.. అభివృద్ధి చెందుతున్న దేశాలలో ప్రజలకు మతం చాలా ముఖ్యమైన అంశంగా ఉంది. ఆర్థికంగా శక్తివంతమైన చాలా దేశాల్లో మతం ముఖ్యమైన అంశంగా పరిగణించే జనం 20 శాతం లేదా అంతకన్నా తక్కువగానే ఉన్నారు. ఉదాహరణకు బ్రిటన్, జర్మనీల్లో ప్రతి ఐదుగురిలో ఒకరు మాత్రమే తమ జీవితాల్లో మతాన్ని చాలా ముఖ్యమైన విషయంగా చెప్తున్నారు. రష్యా, ఆస్ట్రేలియాల్లో ఈ సంఖ్య ఇంకొంచెం తక్కువగా ఉంది. అయితే.. అగ్రరాజ్యం అమెరికాలో సగానికన్నా ఎక్కువ మంది మతాన్ని చాలా ముఖ్యమైన అంశంగా పరిగణించడం విశేషం. ప్రపంచ దేశాలన్నిటిలోనూ మతాన్ని ముఖ్యమైన విషయంగా పరిగణించే వారి సంఖ్య చైనాలో అతి తక్కువగా ఉంది. అక్కడ ప్రతి 100 మందిలో ముగ్గురు మాత్రమే మతం చాలా ముఖ్యమైనదని చెప్పారు. 2050 నాటికి క్రైస్తవులతో సమానంగా ముస్లింలు... ప్రపంచ జనావరణాలు, జనాభాలు మారుతున్న పరిస్థితుల్లో.. ప్రపంచంలో మత సమీకరణాలు 2050 నాటికి గణనీయంగా మారతాయని అధ్యయనకర్తలు చెప్తున్నారు. అప్పటికి ముస్లింల జనాభా క్రైస్తవుల జనాభాకు సమానంగా పెరుగుతుందని అంచనా. మరోవైపు.. ఏ మతాన్నీ ఆచరించని ప్రజల సంఖ్య పెరగడం నెమ్మదిస్తుందని.. ఫలితంగా ప్రపంచ జనాభాలో ఇటువంటి వారి శాతం మరింత తక్కువ అవుతుందని విశ్లేషిస్తున్నారు. ► హిందువుల జనాభా 1970లో 46 కోట్లుగా ఉంటే.. 2010 నాటికి 103 కోట్లకు పెరిగింది. ఈ సంఖ్య 2050 నాటికి 138 కోట్లకు పెరుగుతుందని అంచనా. ► క్రైస్తవుల సంఖ్య 1970లో 123 కోట్లుగా ఉండగా.. 2010 నాటికి 217 కోట్లకు పెరిగింది. ఈ జనాభా 2050 నాటికి 292 కోట్లకు పెరుగుతుందని భావిస్తున్నారు. ► ముస్లింల జనాభా 1970లో 57 కోట్లుగా ఉండగా.. 2010 నాటికి 160 కోట్లకు పెరిగింది. వీరి సంఖ్య 2050 నాటికి 276 కోట్లకు పెరుగుతుందని అంచనా వేస్తున్నారు. ► ఏ మతం ఆచరించని వారి సంఖ్య 1970లో 71 కోట్లు కాగా.. 2010 నాటికి 113 కోట్లకు పెరిగింది. వీరి సంఖ్య 2050 నాటికి 123 కోట్లకు పెరుగుతుందని భావిస్తున్నారు. ► బౌద్ధ మతస్తుల సంఖ్య 1970లో 23 కోట్లు ఉంటే.. 2010 నాటికి 49 కోట్లకు పెరిగింది. 2050 నాటికి ఈ మతస్తుల సంఖ్య అంతే ఉంటుందని అంచనా. (సాక్షి నాలెడ్జ్ సెంటర్) -
రోడ్డు ప్రమాదాల నివారణకు చర్యలు
తణుకు : రోడ్డు ప్రమాదాల నివారణకు ఏ చర్యలు చేపట్టాలో సర్వే చేస్తున్నట్టు, ఆ నివేదిక ఆధారంగా ఆయా కూడళ్లలో రక్షణ చర్యలు చేపట్టనున్నట్టు రవాణాశాఖ డెప్యూటీ కమిషనర్ ఎస్.సత్యనారాయణమూర్తి తెలిపారు. తణుకు మండలం దువ్వ వెంకయ్య వయ్యేరు నుంచి పెనుగొండ మండలం సిద్ధాంతం వరకు పదహారో నంబరు జాతీయ రహదారిౖపై ప్రధాన కూడళ్లలో జరుగుతున్న ప్రమాదాలపై బుధవారం ఆయన ఆధ్వర్యంలో సిబ్బంది సర్వే నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తరచూ ప్రమాదాలు జరుగుతున్న ప్రాంతాలపై దృష్టి సారించి ఆయా కూడళ్లలో ఎందుకు ప్రమాదాలు జరుగుతున్నాయి? కారణాలు ఏమిటనే కోణంలో సర్వే చేస్తున్నట్టు చెప్పారు. ప్రమాదాలు జరగకుండా ప్రత్యామ్నాయాలపై దృష్టి సారించినట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో తణుకు ఎంవీఐ శ్రీనివాస్, సిబ్బంది పాల్గొన్నారు. -
కొండపై నీటిసంపు నిర్మాణానికి సర్వే
యాదగిరికొండ : యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి దేవస్థానంపై భక్తులకు మంచినీటికి ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు ఆర్డబ్ల్యూఎస్ అధికారులు దాదాపు 10 లక్షల లీటర్ల సంపును నిర్మించేందుకు మంగళవారం సర్వే చేశారు. శివాలయం పక్కన ఉన్న నీటి ట్యాంకును కూల్చేసి దాని స్థానంలోనే నేల అడుగు భాగంలో విశాలమైన నీటి సంపును నిర్మాణం చేయడానికి అధికారులు స్థల పరిశీలన చేశారు. ఈ పనులు దసరా రోజు నుంచి ప్రారంభిస్తామని అధికారులు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎస్ఈ సురేందర్‌రెడ్డి, ఎస్సీ రమణానాయక్, ఈఓ గీతారెడ్డి, దేవస్థానం అధికారులు డీఈ దయాకర్‌రెడ్డి, ఇంజనీర్లు శ్రీనివాస్‌రెడ్డి, ఈఈ పాపారావు, సంపత్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
రెండో విడత రక్షక తడులకు సర్వే
–వీడియో కాన్ఫరెన్స్‌లో కలెక్టర్ విజయమోహన్ కర్నూలు(అగ్రికల్చర్): వర్షాభావంతో ఎండుతున్న పంటలకు రెండో విడత రక్షక తడులు ఇచ్చేందుకు సర్వే చేపట్టాలని రెవెన్యూ, వ్యవసాయ అధికారులను జిల్లా కలెక్టర్ విజయమోహన్ ఆదేశించారు. గురువారం కలెక్టరేట్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రక్షక నీటి తడులు, ప్రజాసాధికార సర్వే తదితర అంశాలపై సమీక్ష నిర్వహించారు. మొదటి విడతలో రెయిన్గన్ల ద్వారా 34 వేల హెక్టార్లకు నీటì తడులు ఇచ్చామన్నారు. వర్షాభావంతో ఆదోని డివిజన్లోని అన్ని మండలాలు, కర్నూలు రెవెన్యూ డివిజన్లోని వివిధ మండలాల్లోని పంటలు దెబ్బతింటున్నాయన్నారు. రెండో విడతలో పంటలకు రక్షక నీటితడులు ఇచ్చే కార్యక్రమాన్ని ఈ నెల 11 నుంచి చేపట్టాలన్నారు. ఒక ఎకరా పంట కూడ ఎండరాదని.. ఇందుకు అనుగుణంగా చర్యలు తీసుకోవాలన్నారు. వర్షాభావం ఉన్న అన్ని మండలాల్లో రెయిన్గన్లు, స్ప్రింక్లర్లు సిద్ధంగా ఉన్నాయని తెలిపారు. ప్రజా సాధికార సర్వేను వేగవంతం చేయండి.... జిల్లాలో ప్రజా సాధికార సర్వే నత్తనడకన సాగుతోందని దీనిని తక్షణం వేగవంతం చేయాలని కలెక్టర్ తెలిపారు. ఆర్డీఓలు తమ పరిధిలో పర్యటించి సర్వేలో క్షేత్ర స్థాయిలో ఉన్న సమస్యలను గర్తించి పరిష్కరించాలన్నారు. ఎన్యూమరేటర్లు ఉదయం 8 గంటలకే సర్వే ప్రారంభించే విధంగా తహసీల్దార్లు చర్యలు తీసుకోవాలని తెలిపారు. సెలవు దినాల్లోను కూడ సర్వే చేసి 15 రోజుల్లో పూర్తి చేయాలన్నారు. జిల్లాలో 40 లక్షల జనాభా ఉండగా ఇప్పటి వరకు 17 లక్షల మందిని సర్వే చేశారని వివరించారు. వీడియో కాన్ఫరెన్స్‌లో జాయింట్ కలెక్టర్ హరికిరణ్, సీపీఓ ఆనంద్‌నాయక్, జేడీఏ ఉమామహేశ్వరమ్మ, ఏపీఎంఐపీ పీడీ శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు. -
కర్నూలే నెంబర్ వన్
సాక్షి ప్రతినిధి, కర్నూలు: కృష్ణా పుష్కరాల్లో కర్నూలు జిల్లాకు మొదటి స్థానం దక్కింది. ఏకంగా 93 శాతం మార్కులతో రాష్ట్రంలోనే అగ్రభాగాన నిలిచింది. పుష్కర ఘాట్ల వద్ద సౌకర్యాలు, భద్రత ఏర్పాట్లు, పరిశుభ్రత, భక్తుల అభిప్రాయాలు, మొదలైన 22 అంశాలపై నిర్వహించిన సర్వేలో కర్నూలు జిల్లాకు మొదటిస్థానం దక్కిందని జిల్లా కలెక్టర్ సి.హెచ్.విజయమోహన్ ‘సాక్షి’కి తెలిపారు. అదేవిధంగా 20 అంశాల్లో కృష్ణా, గుంటూరుతో పోలిస్తే కర్నూలుకు మొదటి స్థానం దక్కిందన్నారు. కేవలం రెండు అంశాల్లో మాత్రమే కర్నూలు జిల్లాకు ద్వితీయ స్థానం వచ్చిందని పేర్కొన్నారు. ఐవీఆర్ఎస్ ద్వారా అభిప్రాయ సేకరణ పుష్కరాలకు వచ్చే భక్తుల నుంచి ప్రతిరోజూ అభిప్రాయాలను సేకరించారు. నేరుగా కొంతమంది సిబ్బంది ఈ ప్రక్రియలో పాలు పంచుకున్నారు. మరోవైపు ముఖ్యమంత్రి ఎన్.చంద్రబాబు నాయుడు వాయిస్ ఓవర్ సిస్టమ్ ద్వారా నేరుగా పుష్కర భక్తుల నుంచి అభిప్రాయాలను సేకరించినట్లు కలెక్టర్ వివరించారు. ఇందుకు అనుగుణంగా ర్యాంకులను ప్రభుత్వం కేటాయించిందన్నారు. కర్నూలు తర్వాత 88 శాతం మార్కులతో కృష్ణా జిల్లా ద్వితీయ స్థానంలో నిలవగా, 86 శాతంతో గుంటూరు జిల్లా తృతీయ స్థానం దక్కించుకుంది. ఇది జిల్లా యంత్రాంగం సమష్టి కృషి కృష్ణా పుష్కరాల ఏర్పాట్లు, నిర్వహణలో జిల్లా యంత్రాంగం సమష్టిగా పనిచేసిందని జిల్లా కలెక్టర్ సి.హెచ్.విజయమోహన్ అభిప్రాయపడ్డారు. అందువల్లే రాష్ట్రస్థాయిలో కర్నూలు జిల్లా అగ్రభాగాన నిలిచిందన్నారు. ఇది జిల్లా యంత్రాంగం సమష్టి కషికి నిదర్శనమని అభిప్రాయపడ్డారు. 22న సీఎం రాక శ్రీశైలానికి ఈనెల 22న(సోమవారం) ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రానున్నారు. ఉదయం 11 గంటలకు ఆయన లింగాల ఘాట్‌ను సందర్శించనున్నారు. అయితే రాష్ట్రస్థాయిలోనే ప్రథమ ఘాట్‌గా నిలిచిన సంగమేశ్వరానికి వస్తారా లేదా అన్నది ఇంకా తెలియరాలేదు. -
అసోం వరదల్లో 26 మంది మృతి.. హోం మంత్రి సమీక్ష..
గౌహతిః అసోంలో వరదలు బీభత్సం సృష్టిస్తున్నాయి. రాష్ట్రాన్ని వరదలు ముంచెత్తడంతో లక్షలమంది జనం ఇక్కట్లు పడుతున్నారు. సాధారణ జనజీవనం స్తంభించిపోయింది. ఇప్పటికే వరదల కారణంగా 26 మంది మృతి చెందారు. ఈ నేపథ్యంలో అక్కడి పరిస్థితులను సమీక్షించేందుకు వరద బాధిత ప్రాంతాల్లో హోం మంత్రి రాజ్ నాథ్ సింగ్ ఏరియల్ సర్వే నిర్వహించారు. అసోం ముఖ్యమంత్రి సర్బానంద సోన్వాల్, రాష్ట్ర మంత్రి జితేంద్రసింగ్ లతో కలసి నష్టాలను అంచనావేశారు. ఈ సందర్భంగా మృతుల కుటుంబాలకు కేంద్రం 4 లక్షల రూపాయల చొప్పున సహాయాన్ని ప్రకటించింది. వరదల్లో చిక్కుకున్న అసోం రాష్ట్రంలో కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ పర్యటించారు. అసోం ముఖ్యమంత్రి సర్బానంద సోన్వాల్, రాష్ట్రమంత్రి జితేంద్రసింగ్ లతో కలసి ఏరియల్ సర్వే నిర్వహించారు. అనంతరం వరద పరిస్థితులపై అక్కడి అధికారులతో సమీక్షించిన రాజ్ నాథ్.. సుమారు 60 ఎన్జీఆర్ ఎఫ్ బృందాలు సహాయక చర్యల్లో పాల్గొంటున్నట్లు తెలిపారు. వరదలను జాతీయ విపత్తుగా ప్రకటించడం పరిష్కారం కాదని, రాష్ట్రానికి కేంద్రం పూర్తి సహకారం అందిస్తుందని హామీ ఇచ్చారు. స్థానిక ప్రజా ప్రతినిధులు సైతం సహాయక చర్యల్లో పాల్గొంటున్నారని రాజ్ నాథ్ తెలిపారు. వరద పరిస్థితులను సమీక్షించేందుకు ఉదయం ఢిల్లీనుంచీ గౌహతి బయల్దేరేందుకు ముందుగా ఆయన.. తన పర్యటన వివరాలను ట్వీట్ చేశారు. రాష్ట్రంలోని 21 జిల్లాల్లోని సుమారు 36 లక్షలమంది వరదల కారణంగా తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారని, ఇప్పటి వరకూ వరదల కారణంగా 26 మంది వరకూ మృతి చెందారని రాజ్ నాథ్ తెలిపారు. ఎడ తెరపి లేకుండా కురిసిన వర్షాలకు తోడు.. నదులు పొంగి ప్రవహించడంతో ఈ పరిస్థితి ఏర్పండిందన్నారు. లఖింపూర్, గోలాఘాట్, బొంగాయిగాన్, జోర్హాట్, ధీమాజీ, బర్పేటా, గావాల్పర్, ధుబ్రీ, దర్రాంగ్, మోరిగావ్, సోనిత్పూర్ జిల్లాలు అత్యధికంగా వరదల వల్ల నష్టపోయినట్లు 'అసోం స్టేట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ' (ఏఎస్డీఎమ్ఏ) వెల్లడించింది. అలాగే శివసాగర్, కోక్రజ్హర్, దిబ్రుఘర్, గోల్పారా, తిన్షుకియా,బిశ్వనాథ్, నల్బారీ, బక్సా, ఉదల్ గ్లురీ, కామ్రప్ (ఎం) ఛిరాంగ్ జిల్లాలు కూడా వరద ముంపునకు గురైనట్లు ఏఎస్డీఎమ్ఏ తెలిపింది. గౌహతి, నేమాతిఘట్, తేజ్‌పూర్, గోల్పారా, ధుబ్రీల్లోని బ్రహ్మపుత్రానది ప్రమాదస్థాయిని మించి ప్రవహిస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. రాష్ట్రంలోని 27 అగ్నిమాపక కేంద్రాలతో కలసి స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ (ఎస్డీఆర్ఎఫ్) బృందాలు సహాయక చర్యలు చేపడుతున్నట్లు ఈ సందర్భంగా తెలిపారు. బాధితులకోసం రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 800 తాత్కాలిక షెల్టర్లు ఏర్పాటు చేసి, ఆహారం, మందులు సైతం అందిస్తున్నట్లు ఎస్డీఆర్ఎఫ్ సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. -
వన్‌వే రహదారులపై అధికారుల సర్వే
నాగార్జునసాగర్ పుష్కర స్నానాలకు వచ్చే భక్తులకు ఇబ్బందులు ఎదురుకాకుండా ఉండేందుకు అధికారులు వన్‌వే రహదారుల ఏర్పాటుకు శనివారం సర్వే నిర్వహించారు. నాగార్జునసాగర్‌కు వచ్చి స్నానాలు చేసి తిరుగు ప్రయాణంలో హాలియా వైపు వెళ్లే వారు నెల్లికల్లు క్రాస్‌రోడ్డు నుంచి పిల్లిగుండ్ల తండా మీదుగా పేరూరు నుంచి హాలియాకు చేరేందుకు రోడ్డు ఎలా ఉందో చూడటంతో పాటు ఎంత సమయం పడుతుంది? దూరం ఎన్ని కిలోమీటర్లు వస్తుందనే అంశంపై సర్వే నిర్వహించారు. పుష్కరాలను ప్రతిష్టాత్మకంగా నిర్వహించేందుకు ఉన్న అన్ని అవకాశాలును వినియేగించుకునేందుకు అధికారులు ప్రయత్నాలు మొదలు పెట్టారు. ఈ సర్వేలో స్పెషల్ ఆఫీసర్ మోహన్‌రెడ్డితో పాటు హాలియా సీఐ పార్థసారథి,ఆర్టీసీ అధికారులు ఉన్నారు. -
బరువు తగ్గటానికి బెలూనే బెటర్!
వాషింగ్టన్: ఒబెసిటీ.. ఇది ప్రస్తుతం ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్న సమస్య. ప్రపంచవ్యాప్తంగా స్థూలకాయత్వంతో బాధపడే వారి సంఖ్య 640 మిలియన్లుగా పైగా ఉందంటే పరిస్థితి తీవ్రతను అర్థం చేసుకోవచ్చు. మరి వెయిట్ లాస్ కోసం స్థూలకాయులు చేస్తున్న సాధారణ ప్రయత్నాలు ఫలిస్తున్నాయా అంటే తక్కువనే చెప్పాలి. అహారం తక్కువగా తీసుకోవటం, ఎక్సర్సైజులు చేయటం లాంటి చిన్నచిన్న మార్పులతో టోటల్ బాడీ వెయిట్లో కలిగే వెయిట్ లాస్ సరాసరి 3.59 శాతంగానే ఉందట. అయితే, పొట్టలో గ్యాస్‌తో నింపబడిన ఒబలాన్ బెలూన్ వాడుతున్న స్థూలకాయుల్లో మాత్రం ఈ యావరేజ్ వెయిట్ లాస్ 6.81 శాతంగా ఉందని వాషింగ్టన్ యూనివర్సిటీ పరిశోధకులు నిర్వహించిన తాజా అధ్యయనంలో తేలింది. అహార నియమాలు పాటించడం, ఎక్సర్సైజ్లు లాంటి ప్రయత్నాలతో బాడీ వెయిట్‌ను తగ్గించుకోలేక ఇబ్బంది పడుతున్న వారికి బెలూన్ ట్రీట్మెంట్ చక్కని పరిష్కారం అని పరిశోధనకు నేతృత్వం వహించిన షల్బీ సల్లీవాన్ తెలిపారు. -
మగాళ్లమైతే బాగుండేది..
బీజింగ్: చైనాలో మహిళా ప్రొఫెసర్లు తాము ఎదుర్కొంటున్న లింగవివక్షపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. కొందరైతే తాము మగాళ్లుగా పుడితే తమ అకడమిక్ కెరీర్ చాలా బాగుండేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జీజింగ్ యూనివర్సిటీకి చెందిన లైఫ్ సైన్సెస్ విభాగం.. చైనాలోని ప్రొఫెసర్లలో లింగవివక్షతపై చేపట్టిన సర్వేలో ఈ విషయం వెల్లడైంది. వివిధ యూనివర్సిటీల్లో పనిచేస్తున్న 1600 మంది ప్రొఫెసర్ల అభిప్రాయాలను సేకరించగా.. వారిలో మహిళా ప్రొఫెసర్లు తాము ఎదుర్కొంటున్న లింగవివక్ష పట్ల తీవ్ర నిరాశలో ఉన్నట్లు వెల్లడైంది. పురుష ప్రొఫెసర్లతో పోలిస్తే మహిళా ప్రొఫెసర్ల సంఖ్య కూడా చాలా తక్కువగా ఉందని 67 శాతం మంది అంగీకరించారు. అయితే సర్వేలో పాల్గొన్న పురుష ప్రొఫెసర్లలో కూడా 33 శాతం మంది ఒకవేళ మహిళలమై ఉంటే తమ అకడమిక్ కెరీర్ తక్కువ స్థాయిలో ఉండేదనే అభిప్రాయం వ్యక్తం చేయడం అక్కడున్న లింగవివక్షతకు అద్దం పడుతోంది. -
అత్యంత చెత్త విమానాశ్రయాలు ఇవే
ప్రపంచ వ్యాప్తంగా ఉన్నటువంటి చెత్త విమానాశ్రయాలు ఏవో మీకు తెలుసా? ఇదే విషయంపై 'ద గైడ్ టూ స్లీపింగ్ ఇన్ ఎయిర్ పోర్ట్స్' అనే ట్రావెల్ వెబ్సైట్... విమాన ప్రయాణికుల అభిప్రాయాలను సేకరించి ఓ జాబితాను విడుదల చేసింది. ఈ జాబితాలో 2015 సంవత్సరానికి గాను ప్రయాణికులకు అత్యంత అసౌకర్యంగా ఉండే 10 ఎయిర్ పోర్ట్‌ల వివరాలను ప్రకటింది. దీనిలో విమానాశ్రయాల్లోని కంఫర్ట్, కన్వీనియన్స్, క్లీన్, కస్టమర్ సర్వీస్ అనే నాలుగు అంశాలకు ప్రాధాన్యతను ఇచ్చి ప్రయాణికుల అభిప్రాయాలను సేకరించారు. ఈ సర్వేలో పాల్గొన్న విమాన ప్రయాణికులు ఎక్కువగా విమానాశ్రయంలోని సిబ్బంది నిర్లక్ష్య ప్రవర్తన, అవినీతి, కూర్చోవడానికి సరైన వసతులు కల్పించకపోవడం వంటి వాటిపై ఎక్కువగా అసంతృప్తి వ్యక్తం చేశారు. అయితే నైజీరియాలోని పోర్ట్ హర్కోర్ట్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అత్యంత చెత్త విమానాశ్రాయాల జాబితాలో మొదటి స్థానంలో నిలిచింది. ఈ జాబితాలో ఉన్న 2015 అత్యంత చెత్త 10 విమానాశ్రయాలు ఇవే.. 1. నైజీరియాలోని పోర్ట్ హర్కోర్ట్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ 2. సౌది అరేబియాలోని కింగ్ అబ్దల్లాజిజ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ 3. త్రిభువన్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ (నేపాల్) 4. తాష్కంట్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ (ఉజ్బెకిస్తాన్) 5. సైమన్ బొలీవర్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ (వెనిజులా) 6. టౌస్సెంట్ లూవర్చర్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ (హైతి) 7. హమీద్ కర్జాయ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ (ఆప్ఘనిస్తాన్) 8. టాన్ సన్ నాట్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ (వియత్నాం) 9. బెనజిర్ బుట్టో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ (పాకిస్థాన్) 10. బ్యూవియస్- టిల్లే ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ (పారిస్) -
సర్వేనా? రాజయ్యా..?
-
సర్వేనా? రాజయ్యా..?
వరంగల్‌లో కాంగ్రెస్ అభ్యర్థి ఎంపికపై దిగ్విజయ్ కసరత్తు సాక్షి, హైదరాబాద్: వరంగల్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థి ఎంపికపై ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర పార్టీ వ్యవహారాల ఇన్చార్జి దిగ్విజయ్‌సింగ్ కసరత్తు చేస్తున్నారు. వరంగల్ లోక్‌సభ పరిధిలోని మండలస్థాయి నాయకులతో దిగ్విజయ్ గురువారం విడివిడిగా సమావేశమై అభిప్రాయ సేకరణ చేశారు. మండల కాంగ్రెస్ అధ్యక్షుడి స్థాయి నుంచి, బ్లాక్, నియోజకవర్గ స్థాయి నేతలతో విడివిడిగా సమావేశమై రాతపూర్వకంగా అభిప్రాయాలను తీసుకున్నారు. ఈ అభిప్రాయ సేకరణలో దిగ్విజయ్‌సింగ్‌తోపాటు టీపీసీసీ అధ్యక్షుడు ఎన్.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, కార్యనిర్వాహక అధ్యక్షుడు మల్లు భట్టివిక్రమార్క, ఇతర ముఖ్యనేతలు పాల్గొన్నారు. జి.వివేక్, సర్వే సత్యనారాయణ, సిరిసిల్ల రాజయ్య, రాజారపు ప్రతాప్ పేర్లపై స్థానిక నేతల నుంచి అభిప్రాయాలను తీసుకున్నారు. ఈ ఉప ఎన్నికలో పోటీచేయబోనని, వచ్చే ఎన్నికల్లో పెద్దపల్లి నుంచి మాత్రమే అభ్యర్థిగా ఉంటానని మాజీ ఎంపీ జి.వివేక్ స్పష్టంగా చెప్పారు. దీంతో మిగిలిన ముగ్గురు అభ్యర్థులపై అభిప్రాయాలు సేకరించారు. రాజారపు ప్రతాప్‌కు అభ్యర్థిత్వంపై తక్కువ మంది మొగ్గుచూపుతున్నారని టీపీసీసీ ముఖ్యులు వెల్లడించారు. దీంతో కేంద్ర మాజీ మంత్రి సర్వే సత్యనారాయణ, మాజీ ఎంపీ సిరిసిల్ల రాజయ్యకు పోటీ మిగిలింది. వీరిద్దరి బలాబలాలపై దిగ్విజయ్ చర్చించారు. నియోజకవర్గంలో సర్వేకు ఎక్కువగా పరిచయాలు లేకపోవడం, స్థానిక నేతలతో సంబంధాలు లేకపోవడం వంటి ఇబ్బందులు ఉన్నాయని అధిష్టానం భావిస్తోంది. గత ఎన్నికలో భారీ తేడాతో ఓడిపోవడం, క్షేత్రస్థాయిలో మంచి అభిప్రాయం లేకపోవడం వంటి సమస్యలు రాజయ్యతో ఉన్నాయని భావిస్తున్నట్లు తెలుస్తోంది. గత రెండు ఎన్నికల్లో పోటీచేయడం వల్ల విస్తృతమైన పరిచయాలు రాజయ్యకు ఉన్నా ఆర్థికంగా అధికార పార్టీని దీటుగా ఎదుర్కొనే సామర్థ్యంపై పార్టీ అనుమానాలు వ్యక్తం చేస్తోంది. అయితే గురువారం సాయంత్రమే ఢిల్లీకి వెళ్లిపోయిన దిగ్విజయ్ దీనిపై శుక్రవారం ప్రకటన చేసే అవకాశముంది. ఏఐసీసీ అధినేత్రి సోనియాగాంధీతో శుక్రవారం సమావేశమైన తర్వాత అభ్యర్థిపై ప్రకటన చేయనున్నారు. అభ్యర్థి ఎంపికకోసం ఏ పార్టీలో లేని విధంగా మండలస్థాయి నుంచి అభిప్రాయాలను తీసుకుంటున్నామని, త్వరలోనే అభ్యర్థిని ప్రకటిస్తామని ఢిల్లీ వెళ్లడానికి ముందు దిగ్విజయ్ విలేకరులకు చెప్పారు. -
ఉద్యోగులంతా సర్వే చేసి తీరాల్సిందే!
-
బాబును అతిగా చూపిస్తున్నారు: సాయినాథ్
సీమాంధ్రలో గణనీయ సంఖ్యలో లోక్‌సభ సీట్లను టీడీపీ కైవసం చేసుకుంటుందని చెప్తూ సీఎన్ఎన్-ఐబీఎన్ ఇచ్చిన ఒపీనియన్ పోల్‌పై సీనియర్ జర్నలిస్ట్ పి.సాయినాథ్ తీవ్ర సందేహాలు వ్యక్తం చేశారు. అదే వేదికపై ఆయన ఆ ఒపీనియన్ పోల్‌ను తప్పుబట్టారు. సీమాంధ్రలో జగన్ విజయం సాధిస్తారని పాలగుమ్మి సాయినాథ్ విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. ఇటీవల గంపగుత్తగా కాంగ్రెస్ నాయకులు టీడీపీ వెళ్లడం వల్ల టీడీపీ పరిస్థితి కాసింత మెరుగుపడిందని మాత్రమే భావించగలమని ఆయన చెప్పారు. చంద్రబాబు నాయుడును అతిగా చూపిస్తున్నారని, గత పదేళ్లుగా ఇదే జరుగుతోందని... సీఎన్ఎన్-ఐబీఎన్లోకూడా ఒపీనియన్ పోల్స్ రూపంలో చంద్రబాబు నాయుడును ఎక్కువ చేసి చూపిస్తున్నారని చేశారని సాయినాథ్ విశ్లేషించారు. -
''బాబును అతిగా చూపిస్తున్నారు''