అత్యంత చెత్త విమానాశ్రయాలు ఇవే
ప్రపంచ వ్యాప్తంగా ఉన్నటువంటి చెత్త విమానాశ్రయాలు ఏవో మీకు తెలుసా? ఇదే విషయంపై 'ద గైడ్ టూ స్లీపింగ్ ఇన్ ఎయిర్ పోర్ట్స్' అనే ట్రావెల్ వెబ్సైట్... విమాన ప్రయాణికుల అభిప్రాయాలను సేకరించి ఓ జాబితాను విడుదల చేసింది. ఈ జాబితాలో 2015 సంవత్సరానికి గాను ప్రయాణికులకు అత్యంత అసౌకర్యంగా ఉండే 10 ఎయిర్ పోర్ట్ల వివరాలను ప్రకటింది.
దీనిలో విమానాశ్రయాల్లోని కంఫర్ట్, కన్వీనియన్స్, క్లీన్, కస్టమర్ సర్వీస్ అనే నాలుగు అంశాలకు ప్రాధాన్యతను ఇచ్చి ప్రయాణికుల అభిప్రాయాలను సేకరించారు. ఈ సర్వేలో పాల్గొన్న విమాన ప్రయాణికులు ఎక్కువగా విమానాశ్రయంలోని సిబ్బంది నిర్లక్ష్య ప్రవర్తన, అవినీతి, కూర్చోవడానికి సరైన వసతులు కల్పించకపోవడం వంటి వాటిపై ఎక్కువగా అసంతృప్తి వ్యక్తం చేశారు. అయితే నైజీరియాలోని పోర్ట్ హర్కోర్ట్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అత్యంత చెత్త విమానాశ్రాయాల జాబితాలో మొదటి స్థానంలో నిలిచింది.
ఈ జాబితాలో ఉన్న 2015 అత్యంత చెత్త 10 విమానాశ్రయాలు ఇవే..
1. నైజీరియాలోని పోర్ట్ హర్కోర్ట్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్
2. సౌది అరేబియాలోని కింగ్ అబ్దల్లాజిజ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్
3. త్రిభువన్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ (నేపాల్)
4. తాష్కంట్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ (ఉజ్బెకిస్తాన్)
5. సైమన్ బొలీవర్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ (వెనిజులా)
6. టౌస్సెంట్ లూవర్చర్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ (హైతి)
7. హమీద్ కర్జాయ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ (ఆప్ఘనిస్తాన్)
8. టాన్ సన్ నాట్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ (వియత్నాం)
9. బెనజిర్ బుట్టో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ (పాకిస్థాన్)
10. బ్యూవియస్- టిల్లే ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ (పారిస్)