worst
-
బిహార్‌లో కంపెనీ పెట్టి తప్పు చేశాను.. సీఈవో ఆవేదన
బిహార్‌లో తొలి సెమీకండక్టర్ కంపెనీ సురేష్ చిప్స్ అండ్ సెమీకండక్టర్ ప్రైవేట్ లిమిటెడ్. నాలుగేళ్ల క్రితం ఈ సంస్థ ఏర్పాటైంది. అయితే బిహార్‌లో కంపెనీ పెట్టడం తన జీవితంలో "అత్యంత చెత్త నిర్ణయం" అని వాపోతున్నాడు ఆ కంపెనీ వ్యవస్థాపకుడు, సీఈవో అయిన చందన్ రాజ్. ఈ మేరకు ‘ఎక్స్’ (ట్విటర్)లో ఆయన ఓ పోస్ట్ పెట్టారు.బిహార్‌ను "ల్యాండ్ ఆఫ్ ఫ్రస్టేషన్"గా పేర్కొన్న చందన్ రాజ్ అక్కడ సెమీకండక్టర్ కంపెనీ నడపడానికి అష్టకష్టాలు పడుతున్నట్టు వాపోయారు. ఆ ప్రాంతంలో మౌలిక సదుపాయాలు లేకపోవడంతో తన కంపెనీతో కలిసి పనిచేయడానికి క్లయింట్స్ ఎవరూ ముందుకు రావడం ఆవేదన వ్యక్తం చేశారు. రోడ్డు, మౌలిక సదుపాయాల కోసం గత నాలుగేళ్లుగా ఎదురు చూస్తున్నానని, ఎవరూ సహాయం చేయలేదన్నారు. బిహార్ ప్రభుత్వం సెమీకండక్టర్ పరిశ్రమలను అర్థం చేసుకోలేదని రాసుకొచ్చారు. స్థానిక గ్యాంగ్‌స్టర్ బెదిరిస్తే పోలీసులు కూడా పట్టించుకోరంటూ చందన్ రాసుకొచ్చారు.ఎవరీ చందన్ రాజ్?సెమీకండక్టర్ స్టార్టప్ వ్యవస్థాపకుడైన చందన్ రాజ్.. తన లింక్డ్ఇన్ ప్రొఫైల్ ప్రకారం, ఒడిషాలోని బిజూ పట్నాయక్ యూనివర్శిటీ ఆఫ్ టెక్నాలజీ నుండి ఎలక్ట్రానిక్స్ & టెలికమ్యూనికేషన్‌లో బ్యాచిలర్ డిగ్రీతో 2009లో పట్టభద్రుడయ్యారు.శాంసంగ్ ఎలక్ట్రానిక్స్, మలేషియా, ఇజ్రాయెల్‌లోని ఇంటెల్, రొమేనియాలోని సిలికాన్ సర్వీస్ ఎస్ఆర్ఎల్, షాంఘైలో నోకియా బెల్ ల్యాబ్స్, ఎన్ఎక్స్పీలతో సహా వివిధ సాంకేతిక సంస్థలలో ఇంజనీరింగ్, నిర్వాహక పాత్రలలో పనిచేశారు. 2020 డిసెంబర్లో బిహార్‌లోని ముజఫర్‌పూర్‌లో సురేష్ చిప్స్ అండ్ సెమీకండక్టర్ సంస్థను ఏర్పాటు చేశారు.Bihar - The land of frustration. Lots of problems and struggle to survive here as a semiconductor/VLSI Company.Worst decision of my life to start a company in Bihar— Chandan Raj (@ChandanRaj_ASIC) October 9, 2024 -
అత్యంత వరస్ట్ కర్రీగా చోటు దక్కించుకున్న భారతీయ వంటకం ఇదే..!
అందరూ అన్ని కూరగాయలు తినరు. చాలావరకు ఎక్కవ మంది కాకరకాయ, వంకాయ తినని చెబుతుంటారు. వంకాయల్లో తెల్ల వాటినే ఇష్టంగా ఎక్కువ మంది తినడం విశేషం. కానీ ఊదారంగులో ఉండే వంకాయలంటే చాలామంది నచ్చదు. దీంతో ప్రముఖ చెఫ్‌లు చాలా రకాల వంటకాలు కూడా చేస్తుంటారు. అయితే ఇదంతా ఎందుకు చెబుతున్నానంటే ఈ ఊదారంగు వంకాయతో చేసే భారతీయ వంటకమే అత్యంత వరస్ట్ కర్రీగా చెత్త ఆహారాల జాబితాలో స్థానం దక్కించుకుంది. ఎందువల్లా అనే కదా? ప్రముఖ ఆన్లైన్ ఫుడ్ పోర్టల్ 'టేస్ట్ అట్లాస్' ప్రతి ఏడాది ప్రపంచంలోనే టాప్ వంద చెత్త ఆహారాల జాబితాలను విడుదల చేస్తుంది. అలానే ఈసారి కూడా విడుదల చేయగా.. మనదేశం నుంచి తక్కువ రేటింగ్స్ పొందిన ఆలు భైంగైన్ ఆ జాబితా స్థానం దక్కించుకుంది. ఇది దాదాపు వంద వంటకాల్లో 60వ స్థానాన్ని దక్కించుకుంది. దీన్ని బంగాళదుంప, వంకాయ, ఉల్లిపాయ, టమాటాలు, అల్లం వెల్లులి పేస్టు వేసి చేస్తారు. ఇది గ్రేవీ వంటకం. దీన్ని ఇష్టపడే వారు మన దేశంలో చాలా తక్కువ మంది ఉన్నారు. అందుకే దీనికి తక్కువ రేటింగ్ వచ్చింది. చెప్పాలంటే ఈ రకమైన వంటకాన్ని ఉత్తర భారతదేశంలోనే ఎక్కువగా తింటారట. ప్రపంచంలో అత్యంత వరస్ట్ కర్రీ అత్యంత తక్కువ రేటింగ్‌తో తొలి స్థానం దక్కించుకున్న వంటకంగా హాక్లర్ నిలిచింది. ఇది ఐస్లాండ్కి చెందిన వంటకం. దీన్ని షార్క్ మాంసంతో మూడు నెలల పాటు పులియబెట్టి చేస్తారట. ఇది చాలా ఘాటైన రుచిన కలిగి ఉండటంతో అంత తేలిగ్గా ఎవరికీ నచ్చదట. పైగా తినేవారి సంఖ్య కూడా తక్కువ. ముఖ్యంగా ఐస్లాండ్లో ఉండే స్థానిక ప్రజలే దీన్ని ఇష్టంగా తింటారట. పర్యాటకులు మాత్రం ఆ కూర జోలికి పోనేపోరట. ఇక రెండో స్థానంలో అమెరికాకు చెందని రామన్ బర్గర్ నిలిచింది. దీన్ని రామన్ న్యూడిల్స్‌తో చేసే బర్గర్ ఇది. మధ్యలో మాంసాన్ని నింపి తయారుచేస్తారు. చాలా తక్కువ మందికి మాత్రమే ఇది నచ్చుతుంది. కాగా, ఈ టేస్టీ అట్లాస్ పోర్టల్‌లో ఎవరికీ ఏ ఆహారం నచ్చలేదో ప్రతి దేశానికి చెందిన ప్రజలు పాల్గొని చెప్పొచ్చు. అయితే ఏ వంటకాలు బాగోవని తక్కువ రేటింగ్ ఇస్తారో వాటన్నంటిని వంద చెత్త వంటకాలలో ఎంపిక చేస్తారు. అలా మన దేశం నుంచి ఆలు భైంగైన్ ఈసారి చోటు దక్కించుకుంది. View this post on Instagram A post shared by TasteAtlas (@tasteatlas) (చదవండి: బొటానికల్ వండర్! మానవ పెదవులు పోలిన మొక్క! ఎక్కడుందంటే..?) -
ప్రపంచంలోనే అత్యంత ఘరానా మోసం.. అమెరికా సర్కార్కే షాక్!
ప్రపంచంలో జరిగే మోసాలకు అంతేలేకుండా పోతోంది. అమెరికాలో కరోనా కాలంలో జరిగిన ఒక మోసాన్ని అత్యంత ఘరానా మోసంగా చెబుతుంటారు. పేచెక్ ప్రొటెక్షన్ ప్రోగ్రాం(పీపీపీ) లోన్ సిస్టమ్‌ను ఆధారంగా చేసుకుని $200 బిలియన్లను దక్కించుకుని, దానితో లంబోర్ఘినిలు, వెకేషన్ హోమ్‌లు, ప్రైవేట్ జెట్ ఫ్లైట్లు, కార్టియర్ ఆభరణాలు కొనుగోలు చేసి, వేలాది మంది మోసగాళ్లు విచ్చలవిడిగా అవినీతికి పాల్పడ్డారు. మహమ్మారి సమయంలో అందించిన కోవిడ్ లోన్ స్కీమ్‌ను వారు అక్రమంగా దక్కించుకుని అవినీతికి పాల్పడ్డారు $200 బిలియన్ల మేరకు ఫ్రాడ్ 2020,2021లో అమెరికా ప్రభుత్వం దాదాపు $1.2 ట్రిలియన్ మొత్తాన్ని వివిధ వ్యాపారాల కోసం కోవిడ్ బెయిలౌట్ నగదు కింద కేటాయించింది. ఆర్థిక విపత్తు లోన్ ప్రోగ్రామ్ (ఈఐడీఎల్పీ), పేచెక్ ప్రొటెక్షన్ ప్రోగ్రామ్ (పీపీపీ) స్కీమ్‌ల కోసం ఈ నిధులను ఖర్చు చేశారు. అయితే దీనికి సంబంధించిన స్మాల్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ ఆఫీస్ ఆఫ్ ఇన్స్పెక్టర్ జనరల్(ఎస్బీఏ) నుండి వచ్చిన ఒక నివేదిక ఆశ్చర్యపరిచే విధంగా ఉంది. దీనిలో 17% నిధులు దుర్వినియోగం అయ్యాయని తేలింది. అంటే 200 బిలియన్ డాలర్ల (దాదాపు 16 లక్షల 40 వేల కోట్లు) మేరకు ఫ్రాడ్ జరిగింది. అక్రమంగా మిలియన్ల డాలర్ల లోన్ తీసుకుని.. ఈ మోసపూరిత వ్యవహారంలో 90,000కు మించిన యాక్టివ్ లీడ్లు ఉన్నాయని ఎస్బీఏ అంచనా వేసింది. ఈ ఉదంతంలో ఎస్బీఏ ఇప్పటికే మాజీ న్యూయార్క్ జెట్స్ వైడ్ రిసీవర్, జోష్ బెల్లామీతో సహా పలువురిని విచారణ చేసింది. ఈ జాబితాలో మాన్హాటన్ థీమ్ రెస్టారెంట్ జెకిల్ అండ్ హైడ్ యజమాని డోనాల్డ్ ఫిన్లీ ఉన్నారు. ఈయన పీపీపీ,ఈఐడీఎల్పీ సాయంతో మిలియన్ల డాలర్ల లోన్ తీసుకుని వాటర్‌ఫ్రంట్ వీక్షణ కలిగిన డయోనిస్ బీచ్‌లో నాన్టుకెట్ ఇంటిని కొనుగోలు చేశాడు. ప్రస్తుతం మాన్హాటన్ థీమ్ రెస్టారెంట్ జెకిల్ అండ్ హైడ్ మూతబడింది. ఈ ఘరానా మోసానికి పాల్పడిన ఫిన్లీ 30 సంవత్సరాల జైలు శిక్షను ఎదుర్కొననున్నాడు. అలాగే $3.2 మిలియన్ల మొత్తాన్ని తిరిగి చెల్లించవలసి ఉంటుంది. దీనికితోడు ఆయనపై $1.25 మిలియన్ల మేరకు జరిమానా కూడా విధించారు. మే 2023 నాటికి మొత్తం 803 అరెస్టులు అక్రమంగా నగదును పొందేందుకు మోసగాళ్లు నకిలీ వ్యాపారాలను సృష్టించారని లేదా వారి ఉద్యోగుల సంఖ్య గురించి అబద్ధాలు చెప్పారని లెక్సిస్ నెక్సిస్ రిస్క్ సొల్యూషన్స్ ప్రతినిధి హేవుడ్ టాల్కోవ్ ది పోస్ట్‌కు తెలిపారు. మహమ్మారి ఉధృతంగా ఉన్న సమయంలో రోల్స్ రాయిస్ లేదా హై-ఎండ్ మెర్సిడెస్ వంటి కార్లను కొనుగోలు చేయడం చాలా కష్టమని భావించిన ఈ మోసగాళ్లు పీపీపీ ప్రోగ్రాంను అక్రమంగా వినియోగించుకున్నారని మరో అధికారి టాల్కోవ్ చెప్పారు.మహమ్మారి కాలంలో జరిగిన ఈ మోసానికి సంబంధించి మే 2023 నాటికి మొత్తం 803 అరెస్టులు జరిగాయని ఎస్బీఏ తెలిపింది. ఇది కూడా చదవండి: గూగుల్ మ్యాప్‌ను వినియోగిస్తూ.. ఆ గొంతు తెలియదంటే ఎలా? అత్యంత ఖరీదైన కార్ల కొనుగోలుకు.. పీపీపీ ప్రోగ్రాంను ఫ్లోరిడాకు చెందిన డేవిడ్ హైన్స్(29) అక్రమంగా వినియోగించుకుని $3.9 మిలియన్ల మొత్తాన్ని పొంది, అత్యంత విలువైన లంబోర్ఘిని హురాకాన్ ఎవో స్పోర్ట్స్ కారును కొనుగోలు చేశాడు. అధికారులు ఇతని దగ్గర నుంచి స్పోర్ట్స్ కారును స్వాధీనం చేసుకోవడంతోపాటు, అతని బ్యాంకు ఖాతాల నుండి $3.4 మిలియన్ల మొత్తాన్ని స్వాధీనం చేసుకున్నారు. అధికారుల ముందు హైన్స్ తన నేరాన్ని అంగీకరించాడు. అతను హై-ఎండ్ దుకాణాలు, మయామి హోటల్లో అత్యధికంగా నిధులు ఖర్చుపెట్టాడు. తల్లికి $30,000 పన్నుచెల్లింపుదారుల నగదును పంపినట్లు అతని రికార్డులు చూపిస్తున్నాయి. ఫెడరల్ జైలులో గరిష్టంగా 30 సంవత్సరాల పెనాల్టీ జాక్సన్విల్లే తన ఇంటి, వ్యాపార ఆస్తి తనఖాను చెల్లించడానికి మొత్తం $910,000 పీపీపీ నిధులను అక్రమంగా ఉపయోగించాడు. ఆ తర్వాత తన నేరాన్ని అంగీకరించారు. జాక్సన్విల్లే ఈ నిధులతో 18-క్యారెట్ బంగారు రోలెక్స్ వాచ్, పాతకాలపు జాగ్వార్ ఎక్స్‌కే-ఈ, ఈ-టైప్, రోడ్‌స్టర్‌ను కొనుగోలు చేశాడు. అతను అందుకున్న పీపీపీ రుణాల ఆధారంగా నగదు ఉపసంహరణ ద్వారా $113,000 మొత్తాన్ని అందుకున్నాడు. కాగా ల్యాండర్లు ఫెడరల్ జైలులో గరిష్టంగా 30 సంవత్సరాల పెనాల్టీని ఎదుర్కొనబోతున్నారు. జార్జియాకు చెందిన డారెల్ థామస్‌కు పీపీపీ నిధులను వినియోగించి మెర్సిడీస్ బెంజ్ ఎస్-క్లాస్, ఒక ల్యాండ్ రోవర్,ఒక గోల్డ్ రోలెక్స్‌తో పాటు అకురా ఎన్ఎస్ఎక్స్ కోసం ఖర్చు చేసినందుకు 15 సంవత్సరాల జైలు శిక్ష విధించారు. డిజైనర్ నగలు, దుస్తుల కోసం ఖర్చు చేసి.. పీపీపీ నుండి $11.1 మిలియన్లు దక్కించుకునేందుకు 14 మోసపూరిత రుణాలను పొందానని బ్యాంకును మోసగించానని, మనీ లాండరింగ్‌కు పాల్పడ్డానని థామస్ నేరాన్ని అంగీకరించాడు. ఇదేవిధంగా రెస్టారెంట్ స్కామర్ మాన్‌హట్టన్ తన రెస్టారేటర్ బెసిమ్ కుకాజ్ రెస్టారెంట్ గ్రూప్ కోసం బోగస్ లోన్ల పేరిట $6.1 మిలియన్లను మోసగించినట్లు వెల్లడైంది. అతను నిర్వహిస్తున్న ఇంటర్మెజో, లిమోన్ జంగిల్, కారా మియాలు ఇప్పుడు మూతబడ్డాయి. మాన్‌హట్టన్ డిజైనర్ నగలు, దుస్తుల కోసం విచ్చలవిడిగా ఖర్చు చేసినట్లు విచారణలో తేలిందని అధికారులు తెలిపారు. ఇది కూడా చదవండి: వీరు విమాన ప్రయాణికులేనా.. పెరుగుతున్న ఫిర్యాదుల పరంపర బెయిల్‌పై విడుదలైన తర్వాత కూడా.. మాన్‌హట్టన్ అత్యాశతోనే ఇదంతా చేశాడని, ఈ డబ్బులో కొంత భాగాన్ని ఫ్లోరిడా రియల్ ఎస్టేట్ డెవలపర్‌కు పంపాడు. కార్టియర్, హ్యూగో బాస్ నుండి విలాసవంతమైన వస్తువులను కొనుగోలు చేయడానికి ఉపయోగించాడని న్యూయార్క్ సదరన్ డిస్ట్రిక్ట్ న్యాయవాది డామియన్ విలియమ్స్ అన్నారు. ఈ మోసగాడు అరెస్టు అయి, బెయిల్‌పై విడుదలైన తర్వాత కూడా మహమ్మారి సహాయాన్ని అందుకున్నాడని ప్రాసిక్యూటర్ చెప్పారు. ఈ నేపధ్యంలో ఆయన న్యూజెర్సీలోని ఫోర్ట్ డిక్స్ ఫెడరల్ జైలులో ఆరు సంవత్సరాల ఎనిమిది నెలల శిక్షను అనుభవిస్తున్నాడు. విలాసవంతమైన ప్రయాణాల కోసం.. ప్లాస్టిక్ సర్జరీతో పాటు విలాసవంతమైన ప్రయాణం చేసేందుకు టేనస్సీలోని సర్గోయిన్స్విల్లేకు చెందిన లెస్లీ బెథియా, 2021లో మోసపూరితంగా $20,805 రుణం పొందింది. ఈ నేపధ్యంలో ఆమెకు 78 నెలల జైలు శిక్ష విధించారు. ఫ్లోరిడాలోని సన్నీ ఐల్స్ బీచ్‌లోని ఒక రిసార్ట్‌లో ఐదు రోజులు గడిపేందుకు ఆమె స్కామ్ చేసిన నగదును ఉపయోగించింది. ఆమె తన ఈ పర్యటనలో ప్లాస్టిక్ సర్జరీకి చెల్లించడానికి కూడా పెద్ద మొత్తంలో చెల్లింపులు చేసింది. ఇదేవిధంగా హ్యూస్టన్‌కు చెందిన స్కాట్ జాక్సన్ డేవిస్‌ను ఈ కేసులో జైలుకు తరలించారు. అతను మూడు నకిలీ వ్యాపారాల కోసం పీపీపీ రుణాలను మోసపూరితంగా అందుకున్నాడు. అతను $3.3 మిలియన్లను తిరిగి చెల్లించాలని కోర్టు ఆదేశించింది. తప్పుడు పత్రాలు, తప్పుడు సమాచారంతో.. మాజీ ఎన్ఎఫ్ఎల్ ఆటగాడు జోష్ బెల్లామీ తప్పుడు పత్రాలు, తప్పుడు సమాచారాన్ని ఉపయోగించి 2021లో తన కంపెనీ డ్రిప్ ఎంటర్టైన్మెంట్ ఎల్ఎల్సీ కోసం $1.2 మిలియన్ రుణాన్ని అక్రమంగా పొందాడు. బెల్లామీ ఈ మొత్తాన్ని నగల కొనుగోలుతో పాటు సెమినోల్ హార్డ్ రాక్ హోటల్, క్యాసినోలో బస చేయడానికి ఉపయోగించినట్లు అంగీకరించాడు. ఈ నేరంలో సహ-కుట్రదారుకు $311,000కు మించిన మొత్తాన్ని ఖర్చు చేశాడని విచారణతో తేలింది. పేచెక్ ప్రొటెక్షన్ ప్రోగ్రామ్ అంటే.. పేచెక్ ప్రొటెక్షన్ ప్రోగ్రామ్ (పీపీపీ) అనేది 2020లో అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పరిపాలనలో యునైటెడ్ స్టేట్స్ ఫెడరల్ ప్రభుత్వం ద్వారా ప్రవేశపెట్టిన పథకం. ఇది కరోనావైరస్ ఎయిడ్, రిలీఫ్, ఎకనామిక్ సెక్యూరిటీ యాక్ట్ (కేర్స్ యాక్ట్) ద్వారా కొన్ని వ్యాపారాలకు సహాయం అందించేందుకు ఏర్పాటుచేసిన $953-బిలియన్ల విలువైన వ్యాపార రుణ కార్యక్రమం. పేచెక్ ప్రొటెక్షన్ ప్రోగ్రామ్.. సంస్థాగత ఖర్చులు చెల్లించడానికి తక్కువ వడ్డీతో కూడిన రుణాల కోసం వివిధ కంపెనీలకు అనుమతి కల్పిస్తుంది. పీపీపీ లోన్ అనేది దరఖాస్తుదారు చెల్లించే సగటు నెలవారీ పేరోల్ ఖర్చుల కంటే దాదాపు 2.5 రెట్లు అధికంగా ఉంటుంది. దీనిలో కొన్నిసార్లు దరఖాస్తుదారు సాధారణంగా మొదటి డ్రాతో సమానంగా రెండవ డ్రాను కూడా అందుకోవచ్చు. ఈ రుణం పేరోల్ ఖర్చులు, అద్దె, వడ్డీ, యుటిలిటీలను కవర్ చేయడానికి అందిస్తారు. ఇది కూడా చదవండి: ఎరక్కపోయి వచ్చి ఎలుగుబంటి కంట్లో పడ్డాం.. పరుగో పరుగు -
ఉత్తరాదిని ముంచెత్తిన వర్షాలు.. జనజీవనం అస్తవ్యస్తం..
న్యూఢిల్లీ: ఉత్తరభారతాన్ని భారీ వర్షాలు వణికిస్తున్నాయి. కొండచరియలు విరిగి పడిన ఘటనల్లో 19 మంది చనిపోయారు. ఢిల్లీలోని యమున సహా పలు నదులు పొంగిపొర్లుతున్నాయి. ఆకస్మిక వరదలతో రహదారులపై రాకపోకలు స్తంభించాయి. లోతట్టు ప్రాంతాల ప్రజలు ఇబ్బందులు పడ్డారు. దేశ రాజధానిలో రికార్డు స్థాయిలో వర్షం కురిసింది. 24 గంటల వ్యవధిలో ఏకంగా 153 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. 1982 జూలై తర్వాత, ఈ స్థాయిలో వాన దంచికొట్టడం ఇదే ప్రథమం. అయితే.. ఆయా రాష్ట్రాల్లో మరింత వర్షం సంభవించే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. ఢిల్లీతోపాటు జమ్మూకశ్మీర్, లద్దాఖ్, హిమాచల్ ప్రదేశ్‌ల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ విభాగం హెచ్చరించింది. ఢిల్లీతోపాటు గురుగ్రామ్ సహా పలు నగరాలు పట్టణాల్లో రహదారులపై నీరు నిలవడంతో జనం ట్రాఫిక్ కష్టాలపై వీడియోలు, ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. భారీ వర్షాలు, వరదల కారణంగా ఉత్తర రైల్వే 17 రైళ్లను రద్దు చేసింది. మరో 12 రైళ్లను దారి మళ్లించింది. హిమాచల్ అస్తవ్యస్తం హిమాచల్ ప్రదేశ్‌లోని 7 జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురిశాయి. సిమ్లా జిల్లాలో ఇల్లు కూలిన ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు, కులు, చంబా జిల్లాల్లో ఒక్కరు చొప్పున చనిపోయారు. గత 36 గంటల్లో 14 కొండ చరియలు విరిగి పడిన ఘటనలు, 13 ఆకస్మిక వరదల ఘటనలు నమోదయ్యాయి. వరదలతో కొట్టుకుపోయిన 700 రోడ్లను మూసివేశారు. హిమాచల్‌ప్రదేశ్ రాష్ట్రం లాహోల్ స్పిటిలోని చంద్రతాల్‌లో 200 మంది వరద నీటిలో చిక్కుకుపోయారు. బియాస్ వరదల్లో చండీగఢ్–మనాలి హైవేలోని కొంతభాగం కొట్టుకుపోయింది. మనాలి, కిన్నౌర్, చంబాల్లో వరదల్లో దుకాణాలు, వాహనాలు కొట్టుకుపోయాయి. ఇదీ చదవండి: Heavy Rains: హిమాచల్ ప్రదేశ్‌కు రెడ్ అలర్ట్.. ఉత్తరాఖండ్‌లో ముగ్గురు గల్లంతు ఉత్తరాఖండ్‌లో భక్తులతో వెళ్తున్న జీపు రిషికేశ్–బద్రీనాథ్ నేషనల్ హైవేపై గంగా నదిలో పడిపోయి ముగ్గురు మృతి చెందారు. జీపులో 11 మంది ఉండగా, ఐదుగురిని కాపాడామని, మరో ముగ్గురి కోసం గాలిస్తున్నామని యంత్రాంగం తెలిపింది. కశ్మీర్లో ఇద్దరు జవాన్ల దుర్మరణం జమ్మూకశ్మీర్‌లోని దోడా జిల్లాలో ఆకస్మిక వరదలకు బస్సుపై కొండచరియలు విరిగిపడి ఇద్దరు జవాన్లు కొట్టుకుపోయి దుర్మరణం పాలయ్యారు. పంజాబ్, హరియాణాల్లో భారీ వర్షాలు కురిశాయి. ఇదీ చదవండి: ఉప్పొంగిన బియాస్ నది.. జాతీయ రహదారిపై చొచ్చుకువచ్చి.. వీడియో వైరల్ -
సమస్యల వలయంలో దారుల్ షిఫా ఫుట్ బాల్ గ్రౌండ్
-
మునుగోడులో పెద్దదిక్కుగా ఉండే ఆస్పత్రిపై పాలకుల నిర్లక్ష్యం
-
Big Bash League: సిడ్నీ థండర్ 15 ఆలౌట్!
సిడ్నీ: 0 0 3 0 2 1 1 0 0 4 1... ఇవీ ఒక టి20 మ్యాచ్‌లో వరుసగా 11 మంది ఆటగాళ్ల స్కోర్లు! ప్రతిష్టాత్మక బిగ్‌బాష్ లీగ్...ఐపీఎల్ తర్వాత అత్యంత ప్రజాదరణ ఉన్న టి20 టోర్నీ...ఇప్పటికే ఒక సారి చాంపియన్‌గా నిలిచిన సిడ్నీ థండర్ జట్టు... కానీ అత్యంత చెత్త ప్రదర్శనతో ఆ జట్టు టి20 చరిత్రలో తలదించుకునే రికార్డు నమోదు చేసింది. శుక్రవారం అడిలైడ్ స్ట్రైకర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో సిడ్నీ థండర్ 5.5 ఓవర్లలో 15 పరుగులకే కుప్పకూలింది. ఒక్కరు కూడా రెండంకెల స్కోరు చేయలేకపోగా, ఎక్స్‌ట్రాల రూపంలో 3 పరుగులు వచ్చా యి. టి20 ఫార్మాట్లో విధ్వంసక ఆటగాళ్ల జాబి తాలో నిలిచే అలెక్స్ హేల్స్, రిలీ రోసో సిడ్నీ జట్టు లో ఉన్నారు. కనీసం ఒక్క ఆటగాడు కూడా పరిస్థితిని బట్టి నిలబడేందుకు గానీ, కౌంటర్ అటాక్‌తో పరుగులు రాబట్టేందుకు గానీ ప్రయత్నించలేదు. దాంతో 35 బంతుల్లోనే జట్టు ఇన్నింగ్స్ ముగిసింది. పదో నంబర్ బ్యాటర్ డాగెట్ బ్యాట్‌కు ఎడ్జ్ తీసుకొని ఒకే ఒక ఫోర్ రాగా... స్టేడియంలో ప్రేక్షకులంతా నిలబడి వ్యంగ్యంగా ‘స్టాండింగ్ ఒవేషన్’ ఇవ్వ డం పరిస్థితిని చూపిస్తోంది! 17 బంతుల్లో 3 పరుగులే ఇచ్చి 5 వికెట్లు పడగొట్టిన అడిలైడ్ పేసర్ హెన్రీ థార్టన్ సిడ్నీ పతనంలో కీలక పాత్ర పోషించాడు. వెస్ అగర్ 12 బంతుల్లో 6 పరుగులిచ్చి 4 వికెట్లు తీశాడు. అంతకు ముందు 139 పరుగులు చేసిన స్ట్రైకర్స్ 124 పరుగులతో మ్యాచ్ గెలుచుకుంది. 15: టి20 క్రికెట్లో ఇదే అత్యల్ప స్కోరు. 2019లో కాంటినెంటల్ కప్‌లో భాగంగా చెక్ రిపబ్లిక్‌తో జరిగిన మ్యాచ్‌లో టర్కీ 21 పరుగులకే ఆలౌటైన రికార్డు ఇప్పుడు కనుమరుగైంది. అతి తక్కువ బంతులు (35) సాగిన ఇన్నింగ్స్ కూడా ఇదే. -
కశ్మీర్ ఫైల్స్ సినిమాపై ఇఫీ జ్యూరీ హెడ్ సంచలన వ్యాఖ్యలు.. ‘అదో చెత్త సినిమా’
పణజీ: ఈ ఏడాది దేశవ్యాప్తంగా సంచలన విజయం సాధించిన కశ్మీర్ ఫైల్స్ సినిమాపై 53వ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా (ఐఎఫ్ఎఫ్ఐ) జ్యూరీ హెడ్ నదవ్ లపిడ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘‘కశ్మీర్ ఫైల్స్ చూసి మేమంతా షాకయ్యాం. చాలా డిస్టర్బయ్యాం. ఫక్తు ప్రచారం కోసం తీసిన చెత్త సినిమా అది’’ అంటూ సోమవారం ముగింపు వేడుకల సందర్భంగా వేదికపైనే కడిగి పారేశారు. అసలా సినిమాను ఇఫీ కాంపిటీషన్ విభాగంలో ప్రదర్శనకు ఎలా అనుమతించారంటూ కేంద్ర సమాచార, ప్రసార మంత్రి అనురాగ్ ఠాకూర్ తదితరుల సమక్షంలోనే నిర్వాహకులను నిలదీశారు. ‘‘ఇంటర్నేషనల్ కాంపిటీషన్ విభాగంలో ప్రదర్శించిన 15 సినిమాల్లో 14 చాలా బావున్నాయి. కానీ 15వ సినిమా కశ్మీర్ ఫైల్స్ చూసి అక్షరాలా షాకయ్యాం. కళాత్మక స్పర్థకు వేదిక కావాల్సిన ఇలాంటి ప్రతిష్టాత్మక కార్యక్రమంలో అలాంటి చౌకబారు సినిమాను ప్రదర్శించడం అస్సలు సరికాదు. అందుకే నా అభ్యంతరాలను, అభిప్రాయాలను వేదికపై ఉన్న అందరి ముందే వ్యక్తం చేస్తున్నా’’ అన్నారు. 1990ల్లో కశ్మీర్ హిందూ పండిట్ల మూకుమ్మడి హత్యాకాండ, ఫలితంగా లోయనుంచి వారి భారీ వలసలు నేపథ్యంగా దర్శకుడు వివేక్ అగ్నిహోత్రి రూపొందించిన కశ్మీర్ ఫైల్స్ ఈ ఏడాది బాలీవుడ్లో అత్యధిక కలెక్షన్లు రాబట్టిన సినిమాల జాబితాలో నిలిచింది. అయితే పలు వివాదాలకూ ఇది కేంద్ర బిందువుగా నిలిచింది. వాస్తవాలను వక్రీకరించారంటూ సినిమాపై విమర్శలు వెల్లువెత్తాయి. లపిడ్ ఇజ్రాయెల్‌కు చెందిన సినీ దర్శకుడు. పలు ప్రతిష్టాత్మక అంతర్జాతీయ సినీ అవార్డుల గ్రహీత. కేన్స్ వంటి అంతర్జాతీయ ఫిల్మ్ ఫెస్టివల్స్‌లో జ్యూరీ సభ్యునిగా చేశారు. -
ఆకలి సూచీలో మరీ అధ్వాన్నంగా భారత్
న్యూఢిల్లీ: ఆకలి సూచీలో మన దేశం పరిస్థితి అధ్వాన్నంగా తయారైంది. గ్లోబల్ హంగర్ ఇండెక్స్ ప్రకారం.. 2022 ఏడాదికిగానూ భారత్ 107వ స్థానంలో నిలిచింది. మొత్తం 121 దేశాల జాబితాలో భారత్‌కు ఈ స్థానం దక్కింది. మన పొరుగు దేశాలు శ్రీలంక (64వ ర్యాంక్), నేపాల్ (81), బంగ్లాదేశ్ (84), పాకిస్థాన్ (99) మన దేశం కన్నా ముందు ఉండడం గమనార్హం. చైనా, టర్కీ, కువైట్.. జీహెచ్ఐ ఇండెక్స్‌లో అత్యంత మెరుగైన స్థానంలో ఉండడం గమనార్హం. ఇక దక్షిణాసియా దేశాల్లో ఆఫ్ఘనిస్థాన్ (109 ర్యాంక్) మాత్రమే భారత్ కన్నా దిగువన ఉంది. ఈ క్రమంలో భారత్‌లో ఉన్న ఆకలి కేకల ఘంటికలను ప్రమాదకర స్థాయిలో ఉన్నట్లు ఈ నివేదిక ప్రకటించింది. మన దేశంలో.. చైల్డ్ వేస్టింగ్ రేటు 19.3 శాతంతో ప్రపంచంలో అత్యంత తీవ్ర సమస్యగా ఉంది. 2014 (15.1 శాతం), 2000 (17.15 శాతం) కంటే అధ్వానంగా ఉంది. భారత్‌లో పోషకాహార లోపం తీవ్రంగా ఉంది. ► గ్లోబల్ హంగర్ ఇండెక్స్ (జిహెచ్‌ఐ) అనేది ప్రపంచ, ప్రాంతీయ, జాతీయస్థాయిలో ఆకలిని సమగ్రంగా కొలవడానికి, గుర్తించడానికి ఒక సాధనంగా భావిస్తున్నారు. ► ఐరిష్‌కు చెందిన ఎయిడ్ ఏజెన్సీ ‘కన్సర్న్ వరల్డ్ వైడ్’, జర్మనీకి చెందిన సంస్థ ‘వెల్ట్ హంగర్ లైఫ్’లు సంయుక్తంగా ఈ నివేదికను రూపొందించాయి. ► పోషకాహార లోపం, పిల్లల పెరుగుదల, చైల్డ్ వేస్టింగ్, పిల్లల మరణాలు వంటి నాలుగు అంశాల ఆధారంగా జీహెచ్ఐలో స్కోరు ఇస్తారు. ► ఈ స్కోర్లు ఆధారంగా తక్కువ, మధ్యస్థం, తీవ్రం, ఆందోళన, అత్యంత ఆందోళన అనే కేటగిరీలుగా దేశాలను విభజించారు. ► భారత్‌కు 29.1 శాతం స్కోరుతో తీవ్రమైన ప్రభావిత దేశాల జాబితాలో నిలిచింది. ► భారత్‌లో చైల్డ్ వేస్టింగ్ రేట్ (వయసు కన్నా తక్కువ బరువు, ఎత్తు ఉండటం) 19.3 శాతంతో ప్రపంచంలోనే అత్యంత తీవ్రంగా ఉంది. ► 2021లో 116 దేశాల జాబితాలో భారత్ 101వ స్థౠనంలో నిలిచింది. ఇప్పుడు 121 దేశాల జాబితాలో 107వ ర్యాంకుకు పడిపోవడం గమనార్హం. ► ఇక భారత్ GHI స్కోర్ కూడా క్రమక్రమంగా క్షీణిస్తూ వస్తోంది. 2000 సంవత్సరంలో 38.8 నుంచి 2014-2022 మధ్య 28.2 - 29.1 పరిధికి పడిపోయింది స్కోర్. -
కేంద్రానిదే ‘చెత్త’ చార్జి
సాక్షి, అమరావతి: నిధుల మంజూరుకు కేంద్రం పెట్టిన నిబంధనలతో 2015లోనే ‘చెత్త’ చార్జీలు మొదలయ్యాయి. ఏపీలోని అప్పటి టీడీపీ ప్రభుత్వం కూడా దానిని తూ.చ. తప్పకుండా పాటించింది. రాష్ట్రాల్లో తాము అమలు చేస్తున్న పథకాలకు నిధులు కావాలంటే.. వాటిలో వినియోగించే యంత్రాలు, సిబ్బంది నిర్వహణకు ప్రజల నుంచే వినియోగ(యూజర్) చార్జీలు వసూలు చేయాలని కేంద్ర ప్రభుత్వం 2015లోనే ఉత్తర్వులు జారీ చేసింది. వినియోగ చార్జీలు వసూలు చేయని రాష్ట్రాలకు నిధులు నిలిపివేస్తామని తేల్చిచెప్పింది. స్వచ్ఛ భారత్ మిషన్‌లో భాగంగా ఇంటింటి నుంచి చెత్తను తీసుకెళ్లే వాహనాలు, సిబ్బంది నిర్వహణకు స్థానిక పాలనా సంస్థలు వంద శాతం వినియోగ చార్జీలను.. ప్రతి నెలా ప్రజల నుంచే వసూలు చేయాలని 2015 జూలై 27న ఇచ్చిన ఉత్తర్వుల్లో కేంద్రం స్పష్టం చేసింది. ఆ వెనువెంటనే ఆగస్టు 19న రాష్ట్రంలోని అప్పటి టీడీపీ ప్రభుత్వం కూడా చెత్త సేకరణపై వినియోగ చార్జీల వసూలుకు మెమో జారీ చేసింది. మునిసిపల్ అడ్మినిస్ట్రేషన్ అర్బన్ డెవలప్మెంట్ విభాగం ఈ మెమో (నం.36579/బి2/2015)ను విడుదల చేసింది. ఇంటింటి చెత్త సేకరణకు చార్జీలు వసూలు చేయాలని పట్టణ స్థానిక సంస్థలకు ఆదేశాలిచ్చింది. మరోవైపు వీధుల్లో పారిశుధ్య సౌకర్యాలు మెరుగుపరిచేందుకు, ఇళ్ల నుంచి ప్రతిరోజు చెత్త తరలింపు కోసం గుంటూరు నగరంలోని దుకాణాలు, థియేటర్లు, ప్రైవేట్ హాస్టళ్లు, ఫంక్షన్ హాళ్లు, సూపర్ మార్కెట్లు, టీస్టాళ్ల నుంచి వినియోగ చార్జీలు వసూలు చేయాలని ఆ నగరపాలక సంస్థ 2015 ఏప్రిల్‌లోనే తీర్మానించింది. తర్వాత రాష్ట్రంలోని పలు మున్సిపాలిటీలు కూడా ఇదే నిర్ణయం తీసుకుని అమలు చేశాయి. 75 శాతం వసూలు చేసిన పట్టణ సంస్థలకే నిధులు! కేంద్ర పర్యావరణ, అటవీ శాఖ సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ కోసం 2016 ఏప్రిల్ 8న గెజిట్ నోటిఫికేషన్ ఇచ్చింది. ఇంటింటి చెత్త సేకరణ కోసం స్థానిక పాలనా సంస్థల ద్వారా యూజర్ చార్జీలు వసూలు చేయాలని అన్ని రాష్ట్రాలనూ కేంద్రం ఆదేశించింది. ఘన వ్యర్థాల సేకరణ, రవాణా, ప్రాసెసింగ్‌తో పాటు తరలింపు సేవలను అందించేందుకు ప్రజల నుంచి చార్జీలు వసూలు చేయడాన్ని తప్పనిసరి చేసింది. ప్రతి ఇంటి నుంచి చెత్త సేకరణకు, నిర్వహణకు స్థానిక సంస్థలు తగినంత మంది సిబ్బందిని నియమించాలని సూచించింది. తాము అమలు చేస్తున్న ‘స్వచ్ఛ’ కార్యక్రమాలకు నిధులు కావాలంటే వినియోగ రుసుం వసూలు తప్పనిసరి అని కేంద్రం తేల్చిచెప్పింది. 15వ ఆర్థిక సంఘం సైతం స్థానిక పట్టణ సంస్థలు ఇంటింటి చెత్త సేకరణకు తప్పనిసరిగా ప్రజల నుంచి చార్జీలు వసూలు చేయాలని ఆదేశించింది. 75 శాతం యూజర్ చార్జీలు వసూలు చేసిన స్థానిక పట్టణ సంస్థలకే రెండో విడత స్వచ్ఛ భారత్ మిషన్ నిధులు మంజూరు చేస్తామని స్పష్టం చేసింది. స్వచ్ఛ భారత్ కార్యక్రమాలకే కాకుండా.. కేంద్రం అమలు చేస్తున్న అన్ని పథకాల్లోనూ.. ఎక్కడ ‘నిర్వహణ’ అవసరముంటే అక్కడ తప్పనిసరిగా ప్రజల నుంచి వినియోగ చార్జీలు వసూలు చేయాలని పేర్కొంది. -
ఎగబడి లోన్లు ఇచ్చిన బ్యాంక్.. చివరికి ‘చెత్త’ ఘనత
ఒకప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఎంతో పేరు మోసిన ఆ బ్యాంకు.. భవిష్యత్తు మొత్తం తనదే అనే ప్రతిష్ట సంపాదించుకుంది. కానీ, పరిస్థితులు తలకిందులు అయ్యాయి. బ్యాంకుకు సంబంధించి రియల్టి విభాగం భారీ దెబ్బ వేసింది. పోటీతత్వంలో వెనుకంజ, అడ్డగోలుగా లోన్లు మంజూరు చేయడంతో పాటు ఎవర్‌గ్రాండ్ పరిణామాలు చెత్త బ్యాంక్ ట్యాగ్‌ను తగిలించాయి చివరికి!. చైనాకు చెందిన మిన్‌షెంగ్ బ్యాంకింగ్ కార్పొరేషన్. కొన్నేళ్ల కిందటి దాకా ఆసియాలో ఇదే అతిపెద్ద బ్యాంక్‌గా ఉండేది. ఇప్పుడేమో రియల్ ఎస్టేట్ దిగ్గజం అప్పుల ధాటికి బాధితురాలిగా మారిపోయింది ఈ బ్యాంక్. అడ్డగోలుగా ఇచ్చిన లోన్ల కారణంగా మిన్‌షెంగ్ దారుణంగా పతనం అయ్యింది. గత ఏడాది కాలంలో స్టాక్ ధరలు 31 శాతం దిగువన ట్రేడ్ అవుతున్నాయి. ఈ చెత్త పర్ఫార్మెన్స్ కారణంగా ఇప్పుడు మరో అప్రతిష్ట మూటగట్టుకుంది. బ్లూమ్‌బర్గ్ వరల్డ్ బ్యాంకుల ఇండెక్స్ జాబితాలో ప్రపంచంలోనే అత్యంత చెత్త ప్రదర్శన కనబర్చిన బ్యాంక్‌గా నిలిచింది మిన్‌షెంగ్ బ్యాంకింగ్ కార్పొరేషన్. ఈ సూచీలో ప్రపంచంలోని మొత్తం 155 బ్యాంకులను పరిగణనలోకి తీసుకుంటుంది బ్లూమ్‌బర్గ్. పైకి.. ఆపై పతనం 1996లో బీజింగ్ కేంద్రంగా నాన్-స్టేట్ కంట్రోల్ లెండర్(చైనాలోనే తొలి ఘనత) కార్యకలాపాలను మొదలుపెట్టింది మిన్‌షెంగ్. అనంతి కాలంలోనే ప్రపంచంలో టాప్ 20 బ్యాంకింగ్ దిగ్గజాల సరసన నిలిచింది. ప్రస్తుతం ఆర్థిక ఇబ్బందుల్లో కొట్టుమిట్టాడుతున్న ఈ బ్యాంక్.. 2022 కార్యాచరణను ప్రకటించుకుంది. లోకల్ బ్రాంచ్ మేనేజర్లకు మరిన్ని అధికారాలు కట్టబెట్టడంతో పాటు ప్రాపర్టీ రుణాల హోల్డింగ్లను తగ్గించడం అత్యంత ప్రాధాన్యతగా పాటించేందుకు సిద్ధమైంది. వీటితో పాటు ఉద్యోగుల జీతాలను సగానికి తగ్గించడం లాంటి హేయనీయమైన నిర్ణయాలు సైతం తీసుకున్నట్లు తెలుస్తోంది. ప్రైవేట్ రంగంపై పట్టు కోసం చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్ తీసుకున్న నిర్ణయాలు దేశ ఆర్థిక వ్యవస్థను కకావికలం చేస్తోంది. ముఖ్యంగా ప్రాపర్టీ ఇండస్ట్రీని పునాదులతో సహా కుదిపేస్తోంది. ఈ పరిణామాలను తట్టుకోలేక ఎడాపెడా డిస్కౌంట్లతో ఆకర్షణ కోసం ప్రయత్నించింది రియల్ ఎస్టేట్ దిగ్గజం ఎవర్‌గ్రాండ్. చివరకు డిఫాల్ట్ ప్రకటనతో బాంబుపేల్చగా.. గ్లోబల్ రియల్ ఎస్టేట్‌పై దీని ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది. ఈ క్రమంలోనే ఎవర్‌గ్రాండ్‌కు బిలియన్ డాలర్ల లోన్ కట్టబెట్టిన మిన్‌షెంగ్.. ఇప్పుడు లబోదిబోమంటోంది. సంబంధిత వార్త: పెనుసంక్షోభం అంచున డ్రాగన్.. ఆందోళనలో గ్లోబల్ బ్యాంకింగ్, రియల్టి రంగాలు! -
2021 రౌండప్: అత్యంత చెత్త కంపెనీ ఏదంటే..
2021 Best And Worst Companies Of The Year: ఎప్పటిలాగే ఈ ఏడాది వ్యాపార రంగంలో ఎన్నో అద్భుతాలు జరిగాయి. అదే టైంలో ఘోరమైన పతనాలు చోటు చేసుకున్నాయి. ముఖ్యంగా గ్లోబల్ ట్రేడింగ్‌లో ఊహించని పరిణామాలే ఎదురయ్యాయి.. ఒమిక్రాన్ ప్రభావంతో ఇంకా ఎదురవుతున్నాయి కూడా. చైనా లాంటి అతిపెద్ద(రెండో) ఆర్థిక వ్యవస్థను.. గ్లోబల్ రియల్టి రంగాన్ని కుదిపేసిన ‘ఎవర్‌గ్రాండ్’ డిఫాల్ట్ పరిణామం ఇదే ఏడాదిలో చోటు చేసుకుంది. ఈ క్రమంలో కంపెనీల పని తీరును, ఇతరత్ర కారణాలను బట్టి జనాల వోటింగ్ ద్వారా బెస్ట్, వరెస్ట్ కంపెనీల లిస్ట్‌ను ప్రకటించింది యాహూ ఫైనాన్స్ వెబ్సైట్. 2021 ఏడాదిగానూ ప్రపంచంలోకెల్లా చెత్త కంపెనీగా నిలిచింది మెటా (ఇంతకు ముందు ఫేస్బుక్). ఒపీనియన్ పోల్‌లో ఎక్కువ మంద పట్టం కట్టడం ద్వారా ‘వరెస్ట్ కంపెనీ ఆఫ్ ది ఇయర్’ గా నిలిచింది. ఈ లిస్ట్‌లో రెండో స్థానంలో చైనీస్ ఈ-కామర్స్ దిగ్గజం అలీబాబా నిలిచింది. అలీబాబా కంటే 50 శాతం అత్యధిక ఓట్లు మెటా దక్కించుకోవడం విశేషం. ఇక ఇలా ప్రతీ ఏడాది బెస్ట్-వరెస్ట్ కంపెనీల జాబితాను యాహూ ఫైనాన్స్ వెబ్సైట్ విడుదల చేయడం సహజం. యాహూ ఫైనాన్స్ హోం పేజీ నుంచి సర్వే మంకీ ద్వారా డిసెంబర్ 4, 5 తేదీల్లో ఈ సర్వేను నిర్వహించారు. వివాదాలు, విమర్శల నేపథ్యంలో.. మెటా కంపెనీకి వరెస్ట్ కంపెనీ హోదాను కట్ట బెట్టడం విశేషం. ఇక యూజర్ల అభిప్రాయంలో ఎక్కువగా ఫేస్బుక్ మాజీ ఉద్యోగిణి ఫ్రాన్సెస్ హౌగెన్ ఆరోపణల గురించి కనిపించింది. ఫేస్బుక్ తీరు, ఇన్స్టాగ్రామ్ యువత మెంటల్ హెల్త్ మీద ప్రభావం చూపడం, పిల్లల మీదా చెడు ప్రభావం కారణాలు.. ఫేస్బుక్ Meta గా మారినా కూడా వరెస్ట్ హోదాను కట్టబెట్టాయి. ఇక ఈ సర్వేలో పాల్గొన్న పదిలో ముగ్గురు మాత్రమే ఫేస్బుక్ తన తప్పులు సరిదిద్దుకోగలదన్న అభిప్రాయం వ్యక్తం చేయడం విశేషం. ఇక యాహూ ఫైనాన్స్ లిస్ట్‌లో బెస్ట్ కంపెనీగా మైక్రోసాఫ్ట్ నిలిచింది. కిందటి ఏడాదితో పోలిస్తే.. వాటా 53 శాతానికి పెంచుకోవడంతో పాటు 2 ట్రిలియన్ మైలురాయి దాటడం, మైక్రోసాఫ్ట్‌కి కలిసొచ్చాయి. చదవండి: చైనీస్ ఆపరేషన్.. మెటా దర్యాప్తులో సంచలన విషయాలు -
అత్యంత చెత్త పాస్‌వర్డ్‌ల జాబితా ఇదే..
సాక్షి, న్యూఢిల్లీ : సైబర్ నేరగాళ్లు చెలరేగిపోతున్న తరుణంలో యూజర్‌నేమ్స్, పాస్వర్డ్లు గుర్తుపెట్టుకోవడం అనేది నిజంగా పెద్ద టాస్కే. బ్యాంకు ఖాతాలు, పేమెంట్ బ్యాంకులు, ఈ-మెయిల్, స్మార్ట్‌ఫోన్ స్క్రీన్ లాక్ పాస్వర్డ్ ఇలా ఒకటా రెండా.. ఎన్ని గుర్తు పెట్టుకోవాలి. వీటికి తోడు సోషల్ మీడియా అకౌంట్లు ఉండనే ఉన్నాయి. వీటన్నింటికి సంబంధించిన యూజర్‌నేమ్స్, పాస్‌వర్డ్‌లను గుర్తుపెట్టుకోవడమంటే కత్తిమీద సామే. అందుకే సులభంగా ఉండేలా 12345 లాంటివి, లేదంటే పుట్టిన రోజు తేదీలను పాస్‌వర్డ్‌లుగా తమ అకౌంట్లకు పెట్టుకుంటుంటారు. అయితే ఇక్కడే హ్యాకర్లకు దొరికిపోతామని టెక్ నిపుణులు హెచ్చరిస్తున్నారు. తాజా పరిశోధనల ప్రకారం, ప్రజలు ఇప్పటికీ "123456789," ఐలవ్ యూ" లాంటి హ్యాక్-టు-హ్యాక్ పాస్‌వర్డ్‌లనే వాడుతున్నారట. నార్డ్‌పాస్ సంస్థ 2020 సంవత్సరానికిగాను అత్యంత చెత్త పాస్‌వర్డ్‌ల జాబితాను విడుదల చేసింది. దీని ప్రకారం "123456" టాప్‌లోఉంది. ఈ ఏడాది 2,543,285 మంది ఇదే పాస్వర్డ్ వాడుతున్నారు. గత కొన్నేళ్లుగా ఆ సంస్థ విడుదల చేస్తున్న అత్యంత చెత్త పాస్‌వర్డ్‌ల జాబితాలో ఇదే మొదటి స్థానంలో నిలుస్తూ వస్తోంది. 2015లో 123456 పాస్ వర్డ్ సదరు జాబితాలో మొదటి స్థానంలో నిలిచింది. తరువాత పాస్వర్డ్ అనే పదం మొదటి స్థానంలో నిలిచింది. ఈ మధ్యకాలంలో 123456 అనే పాస్వర్డ్ చెత్త పాస్‌వర్డ్‌ల జాబితాలో మొదటి స్థానంలో ఉంటూ వస్తోంది. ఇంకా పొకేమాన్, చాకొలెట్ లాంటి పాస్వర్డ్లు కూడా ఇంకా వాడుతున్నారు. అయితే ఏడాది ఈ జాబితాలో పిక్చర్1, సెన్హా (పోర్చుగీసులో పాస్వర్డ్ అని అర్థం) అనే రెండు కొత్త పదాలు కొత్తగా చేరాయని తెలిపింది. 10 మోస్ట్ కామన్ పాస్వర్డ్లు 1. 123456 2. 123456789 3. పిక్చర్ 1 4. పాస్వర్డ్ 5. 12345678 6. 111111 7. 123123 8. 12345 9. 1234567890 10. సెన్హా మీ పాస్వర్డ్ జాబితాలో ఉంటే, తక్షణమే మార్పు చేయాలని సూచిస్తోంది. ప్రతి 90 రోజులకు క్యాప్స్, స్మాల్ లెటర్స్ మిశ్రమంతో పాస్‌వర్డ్‌లను మార్చుకోవాలని, అలాగే ప్రతి ఖాతాకు వేరే వేరే పాస్‌వర్డ్‌ను ఏర్పాటు చేసుకోవాలని నార్డ్‌పాస్ సూచిస్తుంది. అంతేకాదు ఎట్టి పరిస్థితుల్లోనూ ఫోన్ నంబర్, పుట్టిన తేదీ, పెళ్లి డేటు, లేదా పేరు వంటి వ్యక్తిగత వివరాల ఆధారంగా పాస్వర్డ్ ఉపయోగించకూడదని హెచ్చరించింది. హ్యాకర్లు మన ఖాతాలపై ఎటాక్ చేయకుండా ఉండేలా కఠినమైన పాస్‌వర్డ్‌లను తమ అకౌంట్లకు సెట్ చేసుకోవాలని, లేదంటే వ్యక్తిగత డేటాతోపాటు, నగదును కూడా పోగొట్టుకునే ప్రమాదం ఉందని హెచ్చరించింది. -
కరోనా కాటు: వ్యాపార సెంటిమెంట్ బేజారు
సాక్షి, న్యూఢిల్లీ : కరోనా వైరస్ సంక్షోభం ప్రపంచంతోపాటు భారత ఆర్థికవ్యవస్థను తీవ్రంగా ప్రభావితం చేస్తోంది. ముఖ్యంగా దేశవ్యాప్తంగా వివిధ దశల లాక్డౌన్ కారణంగా ఆర్థిక కార్యకలాపాలు నిలిచిపోవడంతో భారతీయ వ్యాపార సెంటిమెంట్ గత దశాబ్ద కాలంలో ఎన్నడూ లేనంతగా దిగజారింది. తొలిసారి ప్రతికూలంగా మారింది. డిమాండ్ క్షీణత లాభాలపై వ్యాపారుల విశ్వాసాన్ని దెబ్బతీసింది. ఈ అనిశ్చితి, ఆర్థిక మందగమనంతో ప్రపంచంలోనే అతి దారుణమైన దుష్ప్రభావాన్ని ఎదుర్కొంటోందని సోమవారం విడుదల చేసిన తాజా సర్వేలో తేలింది.(గుడ్‌న్యూస్: కరోనా డ్రగ్ ధర తగ్గింది) ఐహెచ్ఎస్ మార్కిట్ ఇండియా బిజినెస్ ఔట్లుక్ సర్వే ఫలితాల ప్రకారం జూన్‌లో మునుపెన్నడూ లేని స్థాయికి బిజినెస్ సెంటిమెంట్ పడిపోయింది. బిజినెస్ యాక్టివిటీ నికర బ్యాలెన్స్ జూన్ మాసంలో మైనస్ 30 శాతానికి పడిపోయింది. ఇది ఫిబ్రవరిలో 26 శాతం పుంజకుంది. ఇదే ఈ దశాబ్దంలో అతి తక్కువ నమోదు, అలాగే రికార్డు పతనమని సంస్థ ఎకనామిక్స్ డైరెక్టర్ ఆండ్రూ హార్కర్ అన్నారు. 2009 చివరిలో సిరీస్ ప్రారంభమైనప్పటి నుండి వ్యాపార సెంటిమెంట్ ప్రతికూల దృక్పథంలోకి మారడం ఇదే తొలిసారని వ్యాఖ్యానించారు. అయితే ఈ ఏడాది చివరి నాటికి స్పలంగా పుంజుకునే అవకాశం కనిపిస్తోందన్నారు. -
చెత్త వేస్తే చలానా..!
సాక్షి, హైదరాబాద్: స్వచ్ఛనగరం కోసం గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్(జీహెచ్ఎంసీ) అధికారులు సరికొత్త చర్యలు చేపట్టనున్నారు. ఎక్కడ పడితే అక్కడ చెత్త వేసేవారిపై ప్రత్యేక నిఘా పెట్టనున్నారు. చెత్త వేసేవారిని గుర్తించి చలానాలు విధించనున్నారు. దీనిపై త్వరలో కార్యాచరణ మొదలు పెట్టనున్నారు. ఇప్పటికే పలు కార్యక్రమాలు చేపట్టినా, పలు ర్యాంకులు సాధించినా నగరంలో ‘చెత్త’శుద్ధి కనిపించడంలేదు. తడి–పొడి చెత్తలు వేరుచేసి వేసేందుకు ఇంటింటికీ రెండు రంగుల డబ్బాలు పంపిణీ చేసినా ప్రయోజనం కనిపించడంలేదు. వ్యక్తులు, గృహిణులే కాక పలు కంపెనీలు, హోటళ్లు, ఫంక్షన్‌హాళ్లు, మాల్స్ నిర్వాహకులు ఖాళీ బహిరంగ ప్రదేశాల్లో, రోడ్ల పక్కన చెత్త కుమ్మరిస్తున్నారు. నానా రకాల వ్యర్థాల్ని నాలాల్లో విసురుతున్నారు. ప్లాస్టిక్, ఎలక్ట్రానిక్ పరికరాలతోపాటు దిండ్లు , దుప్పట్లు తదితరమైనవి వాటిల్లో వేస్తుండటంతో వర్షపునీరు పారే దారి లేక పొంగిపొర్లుతోంది. ఇకపై ఇలాంటి వాటికి తావులేకుండా అధికారులు ప్రత్యేక నిఘా వ్యవస్థను ఏర్పాటు చేయనున్నారు. ప్రత్యేక యాప్‌ను కూడా త్వరలో వినియోగంలోకి తేనున్నారు. జీహెచ్ఎంసీ ఈవీడీఎం విభాగంలోని ఎన్ఫోర్స్మెంట్ సిబ్బందికి ట్యాబ్‌లు లేదా స్మార్ట్ఫోన్లు ఇస్తారు. ఎక్కడ పడితే అక్కడ చెత్త పారబోస్తున్న వ్యక్తులు, వాహనాల ఫొటోలను నిఘా సిబ్బంది తీసి సంబంధిత యాప్‌లో అప్లోడ్ చేస్తారు. వాటిని ఆన్లైన్ ద్వారా జోనల్ కార్యాలయాల్లోని అధికారులు గుర్తిస్తారు. నిబంధనలు ఉల్లంఘించి చెత్త, వ్యర్థాలు వేసిన వారికి చలానాలు జారీ చేస్తారు. అవి నేరుగా వారి చిరునామాలకు చేరుతాయి. తొలిదశలో హోటళ్లు,ఫంక్షన్‌హాళ్లపై నజర్ చెత్త వేసే వ్యక్తులను గుర్తించడం కష్టం కనుక తొలిదశలో హోటళ్లు, ఫంక్షన్‌హాళ్లతోపాటు బహిరంగ ప్రదేశాల్లో చెత్తవేసే ఇతర సంస్థలను గుర్తిస్తారు. వాటికి చలానాలు జారీ చేస్తారు. ఇందుకుగాను ఆస్తిపన్ను గుర్తింపు నంబర్(పీటీఐఎన్) వంటి వాటిని కూడా వినియోగించుకుంటారు. చలానాలు చెల్లించనిపక్షంలో సదరు మొత్తాన్ని ఆస్తిపన్నులో కలిపే ఆలోచనలోనూ అధికారులున్నారు. తొలిదశలో ఎక్కువ చెత్తను వెలువరించే సంస్థలు, హోటళ్లపై దృష్టి సారించనున్నారు. చెత్తతోపాటు నిర్మాణవ్యర్థాలు వేసేవారిని, రోడ్లపై వ్యర్థజలాలు వదిలేవారిని కూడా ఎన్ఫోర్స్మెంట్ సిబ్బంది ఫొటోలతోసహా పట్టుకుంటారు. పోస్టర్లతో భవనాలను పాడుచేసేవారిని, గోడలపై రాతలు రాసేవారిని కూడా గుర్తిస్తారు. వీరికి మలిదశలో చలానాలను జారీ చేయనున్నారు. ఉల్లంఘనలను గుర్తించేందుకు ఒక్కో సర్కిల్లో 5 నుంచి 10 మంది ఎన్ఫోర్స్మెంట్ సిబ్బందిని నియమించనున్నారు. వీటితోపాటు పోలీసుల సీసీ కెమెరాల ద్వారా గుర్తించిన ఉల్లంఘనులకు కూడా చలానాలు జారీ చేసే వీలుంది. బహిరంగ మూత్ర విసర్జన, ప్లాస్టిక్ వినియోగం, అనుమతి లేని బ్యానర్లు, ఫ్లెక్సీలు, గోడలపై రాతలు తదితరమైన వాటికి కూడా చలానాలు విధించనున్నారు. జరిమానాలిలా.. జీహెచ్ఎంసీ యాక్ట్, నిబంధనల మేరకు ఏ ఉల్లంఘనలకు ఎంత జరిమానా విధించవచ్చో స్పష్టంగా ఉంది. వాటిల్లో స్వల్పమార్పులు చేసి ఈ చలానాల విధానాన్ని అధికారులు అందుబాటులోకి తేనున్నారు. ఉల్లంఘనలకు విధించనున్న జరిమానాలు -
ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారు
పట్నంబజారు(గుంటూరు): రాష్ట్రంలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారని తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే మొహమ్మద్ ముస్తఫా ధ్వజమెత్తారు. అరండల్‌పేటలోని పార్టీ జిల్లా కార్యాలయంలో శనివారం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నగర అ«ధ్యక్షుడు లేళ్ల అప్పిరెడ్డితో పాటు పార్టీ నేతలతో కలిసి విలేకర్ల సమావేశంలో మాట్లాడారు. కేవలం రాబోయే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా, నీచ రాజకీయాలు చేస్తున్నారని ఆరోపించారు. వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డికి ప్రజా సంకల్పయాత్రలో వస్తున్న ప్రజాదరణ చూసి భయం పుట్టి, ఎన్నికల్లో గెలవలేమోనన్న భయంతో ఓట్లు తొలగించే ప్రక్రియను చేపట్టారని మండిపడ్డారు. ప్రతి నియోజకవర్గంలో 20వేలకు పైగానే ఓట్లును తొలగిస్తున్నారని చెప్పారు. మైనారిటీల అభివృద్ధి ఏ మాత్రం పట్టని చంద్రబాబు ఏ మొఖం పెట్టుకుని ఓట్లు అడుగుతారని ప్రశ్నించారు. కనీసం ఒక్క మైనారిటీకైనా మంత్రి పదవి ఇచ్చారా..బడ్జెట్లో రూ 400 కోట్లు చూపించి ఖర్చు చేసింది ఏముందని మండిపడ్డారు. చంద్రబాబులాగా నాటకాలు ఆడే వ్యక్తులు ప్రపంచలోనే ఎవ్వరూ ఉండరన్నారు. ఎవరెన్ని అవంతరాలు, అవరోధాలు చేసిన 2019లో వైఎస్ జగన్‌ను రాష్ట్ర ప్రజలు ముఖ్యమంత్రిని చేయనున్నారని స్పష్టం చేశారు. బంధాలను విడగొడతారా ? కలిసి ఉన్న కుటుంబాలను చీలుస్తారు.. భార్యభర్తలను విడగొడతారు.. అన్నదమ్ములను వేరు చేసేలా కార్పొరేషన్ అధికారులు దౌర్భగ్యంగా వ్యవహరిస్తున్నారని పార్టీ నగర అధ్యక్షుడు లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. సంపత్‌నగర్‌లో పార్టీ పెదకూరపాడు నియోజకవర్గ సమన్వకర్త కావటి మనోహర్‌నాయుడు, ఆయన కుటుంబ సభ్యులు ఉంటుంటే.. మూడు ఓట్లు అక్కడ, మరికొన్ని విద్యానగర్‌లో, మరో మూడు ఓట్లు వేరే ప్రాంతంలో వచ్చాయంటే.. అధికారుల పనితీరుకు అద్దం పడుతోందన్నారు. రాష్ట్ర ప్రయోజనాలను గాలికి వదిలేసిన చంద్రబాబు, స్వప్రయోజనాల కోసం ఎంతటి దుశ్శాసానికి వెనుకాడటంలేదన్నారు. ప్రజాస్వామ్య చరిత్రలో ఎన్నడూ లేని విధంగా కులమతాలకు అతీతంగా గుంపగుత్తగా ఓట్లు తొలగించే ప్రక్రియలు చేస్తున్నారని మండిపడ్డారు. గుంటూరునగరం, రూరల్ పరిధిలో లక్షా యాభై వేలకు పైగా ఓట్లును తొలగించారన్నారు. ఓట్లు తొలగింపు అంశానికి సంబంధించి సాక్ష్యాధారాలతో సహా అధికారుల దృష్టికి తీసుకువెళ్లినా ప్రయోజనం లేకుండా పోయిందన్నారు. ప్రజలు వారి ఓట్లును సరిచూసుకోవటంతో పాటు, అభిప్రాయాలను ఏ మాత్రం చెప్పవద్దని సూచించారు. అధికార పార్టీ దురాగతాలకు అధికారులు బలికావద్దని, ఓట్లు తొలగింపుపై అవసమైతే న్యాయస్ధానాలను ఆశ్రయిస్తామని స్పష్టం చేశారు. సమావేశంలో వైఎస్సార్ సీపీ రాష్ట్ర కార్యదర్శి రాతంశెట్టి సీతారామాంజనేయులు (లాలపురం రాము), గుంటూరు రూరల్ జెడ్పీటీసీ కొలకలూరి కోటేశ్వరరావు, పార్టీ నేతలు పాదర్తి రమేష్ గాంధీ, మహేష్ తదితరులు పాల్గొన్నారు. -
అత్యంత అధ్వాన్న పీఎస్‌యూలు ఏవో తెలుసా?
సాక్షి, న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ సంస్థలు బీఎస్ఎన్ఎల్, ఎయిర్ ఇండియా, ఎంటిఎన్ఎల్ సంస్థలు అప్రతిష్టపాలైన కంపెనీలుగా నిలిచాయి. 2016-17 ఆర్థిక సంవత్సరంలో భారీ నష్టాలతో ఫెర్పామెన్స్లో అత్యంత అధ్వాన్న పీఎస్యూలుగా నిలిచాయి. మరోవైపు ఇండియన్ ఆయిల్, ఓఎన్జీసీ,కోల్ ఇండియా అత్యధిక లాభాలను సాధించిన కంపెనీలుగా నిలిచాయి. ప్రభుత్వ మంగళవారం పార్లమెంటులో ప్రవేశపెట్టిన సర్వే ద్వారా ఈ విషయాలు వెల్లడయ్యాయి. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల పనితీరుపై నిర్వహించే ‘పబ్లిక్ ఎంటర్ప్రైజెస్ సర్వే 2016-17’ ఈ విషయాన్ని తేల్చింది. భారీ నష్టాలనుమూటగట్టుకున్న టాప్ టెన్ ప్రభుత్వ సంస్థలు 84 శాతం నష్టాలను చవి చూడగా...మొత్తం నష్టాలలో వీటి వాటా 82 శాతంగా ఉంది. ముఖ్యంగా బిఎస్ఎన్ఎల్, ఎయిర్ ఇండియా, ఎంటిఎన్ఎల్ మొత్తం నష్టాల్లో 55.66 శాతం వాటాను ఆక్రమించాయి. మరోవైపు అగ్రశ్రేణి కంపెనీలైన ఇండియన్ ఆయిల్ కార్పోరేషన్ లిమిటెడ్, చమురు, సహజవాయువు కార్పొరేషన్ (ఒఎన్జీసీ), కోల్ ఇండియా లిమిటెడ్ అత్యధిక లాభాలతో టాప్ లో నిలిచాయి. ఇవి వరుసగా 19.69 శాతం, 18.45 శాతం, 14.94 శాతం లాభాలు ఆర్జించాయి. -
చెత్త నుంచి కొత్త ఫర్నిచర్
సాక్షి నాలెడ్జ్ సెంటర్: వీధుల్లోకి వెళితే ఎక్కడ పడితే అక్కడ కనిపించే చెత్త ఏమైనా ఉందీ అంటే అది ప్లాస్టిక్ మాత్రమే. ఇప్పటివరకూ వదిలించుకునే దారి లేదు కాబట్టి నడిచిపోయిందిగానీ ఇకపై మాత్రం అలా కాదు. ఎందుకు అంటారా? సమాధానం ఈ ఫొటోల్లో ఉంది. ప్లాస్టిక్‌తోపాటు స్మార్ట్‌ఫోన్ స్క్రీన్లను కూడా అక్కడికక్కడే రీసైకిల్ చేసే యంత్రం ఇది. పేరు ట్రాష్ ప్రెస్సో. పెద్ద పెద్ద సోలార్ ప్యానెల్స్ ఉత్పత్తి చేసే విద్యుత్తుతోనే ఇది పని చేస్తుంది. పెంటాటోనిక్ అనే కంపెనీ తయారు చేసింది. ఈ కంపెనీ రీసైకిల్ చేసిన ప్లాస్టిక్‌తో కుర్చీలు, టేబుళ్ల వంటి ఫర్నిచర్ తయారు చేస్తుంది. ఇటీవల లండన్‌లో జరిగిన డిజైన్ ఫెస్టివల్లో దీన్ని సోమర్సెట్ హౌస్ వద్ద ప్రదర్శించారు. అక్కడికొచ్చిన వారందరినీ తమ వద్ద ఉన్న వాడేసిన ప్లాస్టిక్ బాటిళ్లను తమకివ్వమని కోరి.. అక్కడికక్కడే ఆ బాటిళ్లతో ఫుట్‌పాత్‌లపై వేసుకోగల టైల్స్‌ను తయారు చేశారు. ఎలాంటి ప్రమాదకర రసాయనాలను వాడకుండా తాము ఈ పని చేయగలుగుతున్నామని, దీనివల్ల ఉత్పత్తి అయ్యే టైల్స్ కూడా పెద్దగా ఖరీదు చేయవని పెంటాటోనిక్ వ్యవస్థాపకుడు జొహాన్ బోడెకర్ తెలిపారు. దాదాపు వారం రోజుల పాటు ఈ యంత్రాన్ని ప్రదర్శించారు. ఈ క్రమంలో తయారైన టైల్స్‌ను నల్లటి గోళాల ఆకారంలో అమర్చి వాటిని అక్కడే అందంగా ఏర్పాటు చేశారు కూడా. అమెరికన్ కంపెనీ స్టార్ బక్స్ యూకే విభాగం ఈమధ్యే పెంటాటోనిక్తో చేతులు కలిపింది. తమ కాఫీ షాపుల్లోని ఫర్నిచర్ మొత్తాన్ని ట్రాష్ ప్రెస్సో లాంటి యంత్రాలు తయారు చేసే రీసైకిల్డ్ ప్లాస్టిక్‌తో తయారు చేసేందుకు ప్రయత్నిస్తోంది. మొత్తమ్మీద చూస్తే ప్లాస్టిక్ చెత్తను ఎక్కడో దూరంగా తరలించి రీసైకిల్ చేసే పద్ధతికి ట్రాష్ ప్రెస్సో ఫుల్స్టాప్ పెట్టేయగలదన్నమాట! -
చెత్త వేశాడని ఇలా చేస్తారా..!
సబ్బవరం: సమాజంలో ఆస్తి కోసమో, డబ్బు కోసమో, పాత కక్ష్యలతో, మరే ఇతర కారణాల వల్ల మనిషిని హత్య చేయటం చూశాం. కానీ చెత్త వేశాడన్న కారణంతో ఓ వ్యక్తిని పొరుగుంటివారు హత్య చేశారు. ఈ ఘటన విశాఖ జిల్లా సబ్బవరం మండలంలోని రావులమ్మపాలెంలో చోటుచేసుకుంది. లాలం శ్రీనివాసులు(40) అనే వ్యక్తి బతుకుదెరువు కోసం రావులపాలెం వచ్చి కుటుంబంతో కలిసి ఓ ఇంట్లో అద్దెకు ఉంటున్నాడు. ఇంటికి పక్కన ఉన్న గదిలో లంక అప్పలనాయుడు కుటుంబం ఉంటోంది. ఈ క్రమంలో ఇరు కుటుంబాల మధ్య చెత్త విషయంలో గురువారం రాత్రి గొడవ జరిగింది. తమ ఇంటి ముందు చెత్త వేశాడని అప్పలనాయుడు, అతని కుటుంబ సభ్యులు కలిసి శ్రీనివాస్‌పై రాయితో దాడి చేశారు. తీవ్రంగా గాయపడ్డ అతను అక్కడిక్కడే మృతి చెందాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. మృతుడు శ్రీనివాస్‌కు భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు. -
ఓ చెత్తకుండీ...16 లక్షల పాత కరెన్సీ!
చిత్తు కాగితాలు ఏరుకొనే మహిళకు దొరికిన వైనం - హైదరాబాద్‌లోని నేరేడ్మెట్లో కలకలం హైదరాబాద్: చిత్తు కాగితాలు ఏరుకొని జీవించే మహిళకు చెత్తకుండీలో రూ.16 లక్షల రద్దయిన పాత నోట్ల కట్టలు దొరికాయి. గురువారం నేరేడ్మెట్ ఠాణా పరిధిలో చోటుచేసుకున్న ఈ ఘటన తీవ్ర కలకలం రేపింది. ఈ వివరాలను సీఐ జగదీశ్‌చందర్ విలేకరులకు వెల్లడించారు. చిత్తు కాగితాలు సేకరించి జీవనం సాగించే నేరేడ్మెట్ వాజ్పేయినగర్వాసి చందా గంగూబాయి (58).. గురువారం ఉదయం సమీపంలోని రైల్వేగేట్ వద్దకు వెళ్లింది. అక్కడి చెత్త కుండీలో కాగితాలు సేకరిస్తుండగా... ఆమెకు పాత రూ.500, రూ.1000 నోట్ల కట్టలు కనిపించాయి. ఇవి చూసి దిగ్భ్రాంతికి గురైన ఆమె.. స్థానికుల ద్వారా పోలీసులకు సమాచారం ఇచ్చింది. అక్కడకు చేరుకున్న పోలీసులు నోట్ల కట్టలను స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ రూ.16 లక్షలని తేల్చారు. దీనిపై కేసు నమోదు చేశామని, ఈ నోట్లు ఎవరు పడేశారనేది తెలుసుకొనేందుకు దర్యాప్తు చేస్తున్నామని సీఐ చెప్పారు. రూ.1.2 కోట్ల పాత నోట్లు స్వాధీనం మార్పిడికి యత్నిస్తున్న ముగ్గురి అరెస్టు సాక్షి, హైదరాబాద్: రద్దయిన పాత రూ.500, రూ.1000 నోట్ల మార్పిడికి యత్నిస్తున్న ముఠాను పశ్చిమ మండల టాస్క్‌ఫోర్స్ పోలీసులు పట్టుకున్నారు. ముగ్గురిని అరెస్టు చేసి రూ.1.2 కోట్ల పాత కరెన్సీ స్వాధీనం చేసుకున్నట్లు డీసీపీ బి.లింబారెడ్డి గురువారం వెల్లడించారు. మంచిర్యాల జిల్లాకు చెందిన సలీమ్ మెహిదీపట్నంలో ఉంటూ కరాటే కోచ్‌గా పనిచేస్తున్నాడు. మంచిర్యాలకు చెందిన ఇతడి బంధువులు, స్నేహితుల్లో అనేక మంది రియల్ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారు. రద్దయిన పాత నోట్లు తమ వద్ద ఉన్నాయని, కమీషన్ పద్ధతిలో వాటిని మార్పిడి చేసిపెట్టాలని గత నెలలో వారు కోరడంతో సలీమ్ అంగీకరించాడు. మొత్తం రూ.1.2 కోట్ల విలువైన పాత నోట్లను తీసుకుని హైదరాబాద్‌కు చేరుకున్నాడు. వీటిని మార్చేందుకు కూకట్‌పల్లికి చెందిన రియల్ఎస్టేట్ దళారి ఎల్.సుబ్బారెడ్డి, విజయ్‌నగర్‌కాలనీకి చెందిన టెంట్‌హౌస్ వ్యాపారి ఎండీ అలీమ్ సహకారం కోరాడు. దీనికి వారు అంగీకరించడంతో ముగ్గురూ కలసి మార్చేందుకు గురువారం కారులో నగదు తీసుకుని పంజగుట్ట ప్రాంతానికి వచ్చారు. దీనిపై సమాచారం అందుకున్న టాస్క్‌ఫోర్స్ ఇన్స్పెక్టర్ ఎల్.రాజావెంకటరెడ్డి నేతృత్వంలోని బృందం దాడి చేసి ముగ్గురినీ అదుపులోకి తీసుకుంది. రద్దయిన నోట్లను స్వాధీనం చేసుకుని, కేసును పంజగుట్ట పోలీసులకు అప్పగించింది. -
చెత్త కదిలింది
► రామాపురం వాసులతో చర్ఛలు సఫలం ► 22 వరకు చెత్త తరలింపునకు అనుమతి ► పేరుకుపోయిన వ్యర్థాలకు మోక్షం ► తరలిన 760 మెట్రిక్ టన్నుల చెత్త ► ప్రత్యామ్నాయంపై తర్జన భర్జన తిరుపతి నగర వాసులు ఊపిరి పీల్చుకున్నారు. నాలుగు రోజులుగా పేరుకుపోయిన చెత్త కదిలింది. సీ రామాపురం ప్రజలు ఈనెల 22వరకూ అనుమతించడంతో అధికారులు హమ్మయ్య అనుకున్నారు. తమ బతుకులను ఇబ్బందిపాల్జేసే చెత్తను ఇక్కడ వేయవద్దంటూ సి.రామాపురం గ్రామస్తులు డంపిం గును అడ్డుకున్న సంగతి తెలిసిందే. దీంతో నగరంలో చెత్త గుట్టలు గుట్టలుగా పేరుకుపోయింది. గ్రామస్తుల అంగీకరించిన వెం టనే శనివారం మధ్యాహ్నం నుంచి చెత్తను డంపింగ్ యార్డుకు తరలించారు. తిరుపతి తుడా/రామచంద్రాపురం: తిరుపతి చెత్త కదిలింది. నాలుగు రోజులుగా ఎక్కడి చెత్త అక్కడ నిలిచిన సంగతి తెలిసిందే. 760 మెట్రిక్ టన్నుల వ్యర్థాలు పేరుకుపోయాయి. శుక్రవా రం సాయంత్రం కొద్దిపాటి వర్షానికి ఈ చెత్త నుంచి దుర్వాసన రావడంతో నగర వాసులు అసౌకర్యానికి లోనయ్యారు. సి.రామాపురంలోని కార్పొరేషన్ డంపింగ్ యార్డ్‌లో చెత్త తరలింపును గ్రామస్తులు అడ్డుకోవడంతో ఈ సమస్య నెలకుంది. గ్రామస్తులు ఎందుకు వద్దన్నారంటే.. రామచంద్రాపురం మండలం రామాపురం పక్కనే ఉన్న డంపింగ్ యార్డుకు తిరుపతిలోని చెత్తాచెదారం, ఇతరత్రా వ్యర్థపదార్థాలను 12 సంవత్సరాలుగా తరలిస్తున్నారు. కంపోస్టు లోడ్‌తో వెళ్లే మున్సిపల్ వాహనాలన్నీ ఈ ఊరు మీదగానే యార్డుకు వెళతాయి. అయితే తమ గ్రామం పక్కనున్న డంపింగ్ యార్డు వల్ల త్వరగా రోగాల బారిన పడుతున్నామని, ఎంతో మందికి డెంగీ జ్వరాలు కూడా వచ్చాయని గ్రామస్తులు ఆందోళన చెందుతున్నారు. ఈ నేపథ్యంలో వారు చెత్త తరలింపును అడ్డుకున్నారు. దీని వల్ల గడచిన 4రోజుల్లో 760 మెట్రిక్ టన్నుల చెత్త తిష్టవేసింది. సమస్య జఠిలం కావడంతో శనివారం ప్రజాప్రతినిధులు సమావేశమై తాత్కాలిక పరి ష్కారం చూపారు. దీంతో చెత్త కదిలింది. 22 వరకే గడువు.. సీ.రామాపురం వద్ద డంపింగ్‌యార్డును తరలించేంతవరకు ప్రజల పక్షాన పోరాటం సాగిస్తామని శాసన సభ్యుడు డాక్టర్ చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, ఎంపీ శివప్రసాద్ చెప్పారు. శనివారం రామాపురంలో గ్రామస్తులతో ప్రజాప్రతినిధులు సమావేశమయ్యారు. సమస్య పరిష్కారానికి చర్చించారు. ఎంపీ శివప్రసాద్, ఎమ్మెల్యేతో చర్చించి సమస్య పరిష్కారానికి మున్సిపల్ అధికారులకు కొంత గడువు ఇప్పిస్తే మంచిదని కోరారు. దీనిపై స్పందించిన చెవిరెడ్డి తిరుపతి ప్రజల సమస్యలను దృష్టిలో ఉంచుకుని కొంత గడువిద్దామని అక్కడి ప్రజలను కోరారు. 22వరకు చెత్త తరలింపునకు అనుమతిద్దామని చెప్పారు. తర్వాత తరలింపు జరగనివ్వమన్నారు. 2012లో మూడు నెలల్లో డంపింగ్ యార్డును వేరే ప్రాంతానికి మారుస్తామని అధికారులు లిఖిత పూర్వకంగా లేఖ ఇచ్చి స్పందిం చకుండా ప్రజలను ఇబ్బంది పెట్టుతున్నారన్నారు. ప్రత్యామయంగా డంపింగ్ యార్డును వేరే ప్రాంతానికి మార్చుకోకపోతే పార్టీలకతీతంగా ఆందోళన చేపడతామని హెచ్చరించారు. దీంతో గ్రామ ప్రజలు శాంతించి ఎమ్మెల్యే ప్రతిపాదనకు అంగీకరించారు. ఆందోళన తాత్కాలికంగా విరమించారు. -
సచిన్,రేఖ తీరుపై విమర్శల వెల్లువ
-
ముప్పుటేరు
భీమవరం అర్బన్ : పశ్చిమగోదావరి, కృష్ణా జిల్లాల మధ్య ఉన్న ప్రధాన డ్రెయిన్ ఉప్పుటేరు సిల్టు, కిక్కిసతో పూడుకుపోతుంది. దీంతో వరదల సమయంలో డ్రెయిన్ పరివాహక ప్రాంతాలు ముంపుబారిన పడుతున్నాయి. ఉప్పుటేరు కొల్లేరు నుంచి ఆకివీడు, కాళ్ల, భీమవరం మండలాలు మీదుగా కృష్ణా జిల్లాలోని కృత్తివెన్ను మండలంలోని గొల్లపాలెంలో సముద్రంలో కలుస్తుంది. దీనిని ఆనుకుని సుమారు 80 వేల ఎకరాల్లో వరి, ఆక్వా సాగుచేస్తున్నారు. ఉప్పుటేరు అభివృద్ధిపై అధికారులు దృష్టిసారించకపోవడంతో ఏటా వర్షాకాలంలో డ్రెయిన్ పొంగి పొర్లుతుంది. దీనికితోడు సముద్రపు ఆటుపోటులకు ఈ ప్రాంత ప్రజలు ఇబ్బంది పడాల్సి వస్తుంది. అంతేకాకుండా ఉప్పుటేరు మొగలో స్లూయిజ్ నిర్మిస్తే కృష్ణా, పశ్చిమ గోదావరి జిల్లాలకు తాగు, సాగు నీరు కొరత తీరుతుందని నిపుణులు సూచిస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. ఉప్పుటేరు కృష్ణా, పశ్చిమగోదావరి జిల్లాల సరిహద్దుగా ఉన్న కొల్లేరు పెద్దింట్లమ్మ ఆలయ సమీపంలో కొల్లేటికోట జీరో మైలు రాయి వద్ద ప్రారంభమై ఆకివీడు, కాళ్ల, భీమవరం మండలాలు మీదుగా సముద్రంలో కలుస్తుంది. సముద్రపు ఆటుపోటులను ఎదుర్కొంటూ ఎగువ ప్రాంతాల్లో ముంపునీటిని సముద్రంలోకి తరలిస్తుంది. దీనిద్వారా ఆయా ప్రాంతాల్లో వ్యవసాయ భూములు, చేపల చెరువులు, లోతట్టు ప్రాంతాలను ఉప్పుటేరు కాపాడుతుంది. అయితే ఉప్పుటేరుపై అధికారులు దృష్టి సారించకపోవడంతో చాలా చోట్ల మూడు మీటర్లు పైగా లోతు ఉండాల్సిన డ్రెయిన్ మీటరు లోతుకు పూడుకుపోయింది. పూడికతీతను మరిచారు సుమారు మూడు దశాబ్దాల క్రితం ఉప్పుటేరు పూడికతీత పనులు అధికారులు చేపట్టారు. అప్పటి నుంచి ఇప్పటివరకు తట్ట మట్టికూడా తీయకపోవడంతో ఉప్పుటేరు పూడుకుపోతుంది. ఇదే పరిస్థితి కొనసాగితే వేలాది ఎకరాలు నీటమునగడంతోపాటు పరివాహక ప్రాంత గ్రామాలన్నీ ఉప్పుకయ్యలుగా మారే ప్రమాదం ఉందని జలవనరుల నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇప్పటికైనా సముద్ర ముఖద్వారం నుంచి ఉప్పుటేరు ఎగువ ప్రాంతం వరకు డ్రెజ్జింగ్ చేసి పూడిక పనులు చేపట్టాలని ఈ ప్రాంత రైతులు కోరుతున్నారు. ముంపు తప్పట్లేదు అధిక వర్షాలు, తుపానుల సమయంలో ఉప్పుటేరు ఉగ్రరూపం దాలుస్తోంది. జిల్లాలోని ప్రధాన డ్రెయిన్లన్నీ పొంగిపొర్లుతూ ఉప్పుటేరులో కలుస్తున్నాయి. దీంతో ఉప్పుటేరు ఉధృతంగా ప్రవహిస్తూ సముద్రం వైపు కదులుతుంది. ఇదే సమయంలో సముద్రపు ఆటుపోటుల కారణంగా సముద్రం నీరు ఉప్పుటేరులోకి ఎగదన్నడం వల్ల వర్షం నీరు గ్రామాలను ముంచెత్తుతోంది. డ్రెయిన్లన్నీ ఉప్పుటేరులోకే.. జిల్లాలోని అన్ని ప్రధాన డ్రైయిన్లు దక్షిణం వైపున ఉన్న ఉప్పుటేరులోనే కలుస్తున్నాయి. కొల్లేరుతోపాటు ప్రధాన డ్రెయిన్లయిన మొగదిండి, కొత్త యనమదుర్రు, బొండాడ, పొలిమేరతిప్ప, పాత యనమదుర్రు, సాల్ట్క్రీక్ డ్రెయిన్లు ఉప్పుటేరులో కలుస్తున్నాయి. పలు చిన్న, మధ్య తరహా డ్రెయిన్లు ఉప్పుటేరులోనే కలుస్తున్నాయి. స్లూయిజ్ నిర్మిస్తే లాభం ఉప్పుటేరు డ్రెయిన్‌కు మొగలో స్లూయిజ్ నిర్మిస్తే పంటలు సస్యశ్యామలం అవుతాయని రైతులు అంటున్నారు. ఏటా జనవరి నుంచి జూన్ నెల వరకు సముద్రం నుంచి ఉప్పునీరు కొల్లేరు వరకు ఎగదన్నడంతో ఈ ప్రాంతం ఉప్పుకయ్యలుగా మారుతోంది. స్లూయిజ్ నిర్మాణంతోనే దీనిని అడ్డుకోవచ్చని రైతులు అంటున్నారు. ఉన్నతాధికారులకు నివేదిస్తాం భీమవరం డివిజన్లో ఉప్పుటేరు 33 మైళ్లు వరకు వ్యాపించి ఉంది. దీని పూడికతీత పనులకు సంబంధించి నివేదిక తయారుచేసి ఉన్నతాధికారులకు సమర్పిస్తాం. ఉప్పుటేరు అభివృద్ధికి కృషిచేస్తాం. – సుజాత, డ్రెయిన్స డీఈ -
అధ్వానంగా మారిన సాంఘిక సంక్షేమ హాస్టల్
-
‘కానుక’ బెల్లంలో పురుగులు
కొవ్వూరు : క్రిస్మస్, సంక్రాంతికి అందించే చంద్రన్న కానుకల్లో నాణ్యత లేదని పదేపదే ఆరోపణలు వస్తున్నా ప్రభుత్వం నిమ్మ కు నిరెత్తి్తనట్టు వ్యవహరిస్తోంది. గతనెలలో క్రిస్మస్ సందర్భంగా ఇచ్చిన కానుక సరుకుల్లో నాణ్యత లేదని నాసిరకం బెల్లం పంపిణీ చేశారని పౌరసరఫరాల మంత్రి పరిటాల సునీత ఆగ్రహం వ్యక్తం చేసినా మార్పు కనిపించలేదు. ఈ క్రమంలో సం క్రాంతి కానుకల్లో అదే పరిస్థితి కొనసాగుతుండటంపై రేషన్ లబ్దిదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నాణ్యత లేని వస్తువులు సరఫరా చేసిన కంపెనీలను బ్లాక్ లిస్ట్‌లో పెడతామని మంత్రులు చెబుతున్నారే తప్ప ఆచరణలో అది అమలు కావడం లేదు. చాగల్లు మండలం దారవరం గ్రామంలో షాప్ నెం.5 లో సంక్రాంతి చంద్రన్న కానుకలో భాగంగా పంపిణీ చేసిన బెల్లంలో పురుగులు, నల్లమట్టి ఉండటంతో లబ్దిదారులు ఖంగుతిన్నారు. కార్దుదారులు వెంటనే సంబంధిత డీలర్‌కు బెల్లం తిరిగి ఇచ్చేసి ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలిసింది. దీనిపై డీలర్ అధికారులను సంప్రదించడంతో హడావుడిగా ఈ బెల్లాన్ని తీసుకుని కొత్త బెల్లాన్ని అందించినట్టు సమాచారం -
‘కానుక’ బెల్లంలో పురుగులు
కొవ్వూరు : క్రిస్మస్, సంక్రాంతికి అందించే చంద్రన్న కానుకల్లో నాణ్యత లేదని పదేపదే ఆరోపణలు వస్తున్నా ప్రభుత్వం నిమ్మ కు నిరెత్తి్తనట్టు వ్యవహరిస్తోంది. గతనెలలో క్రిస్మస్ సందర్భంగా ఇచ్చిన కానుక సరుకుల్లో నాణ్యత లేదని నాసిరకం బెల్లం పంపిణీ చేశారని పౌరసరఫరాల మంత్రి పరిటాల సునీత ఆగ్రహం వ్యక్తం చేసినా మార్పు కనిపించలేదు. ఈ క్రమంలో సం క్రాంతి కానుకల్లో అదే పరిస్థితి కొనసాగుతుండటంపై రేష¯ŒS లబ్దిదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నాణ్యత లేని వస్తువులు సరఫరా చేసిన కంపెనీలను బ్లాక్ లిస్ట్‌లో పెడతామని మంత్రులు చెబుతున్నారే తప్ప ఆచరణలో అది అమలు కావడం లేదు. చాగల్లు మండలం దారవరం గ్రామంలో షాప్ నెం.5 లో సంక్రాంతి చంద్రన్న కానుకలో భాగంగా పంపిణీ చేసిన »ñ ల్లంలో పురుగులు, నల్లమట్టి ఉండటంతో లబ్దిదారులు ఖంగుతిన్నారు. కార్దుదారులు వెంటనే సంబంధిత డీలర్‌కు బెల్లం తిరిగి ఇచ్చేసి ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలిసింది. దీనిపై డీలర్ అధికారులను సంప్రదించడంతో హడావుడిగా ఈ బెల్లాన్ని తీసుకుని కొత్త బెల్లాన్ని అందించినట్టు సమాచారం -
మధ్యాహ్న భోజనానికి పురుగుల బియ్యం
లింగపాలెం : మధ్యాహ్న భోజన పథకం కోసం కె.గోకవరం జిల్లా పరిషత్ హైస్కూల్‌కు పంపిన బియ్యంలో పురుగులు, రాళ్లు అధికంగా ఉండడంతో సోమవారం విద్యార్థులు నిరసన వ్యక్తం చేశారు. ఇన్ని పురుగులు, రాళ్లు ఉన్న బియ్యంతో వండిన అన్నాన్ని ఎలా తినాలని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ విషయం తెలుసుకున్న తహసీల్దార్ సోమశేఖరరావు హైస్కూల్‌కు వెళ్లి బియ్యాన్ని పరిశీలించారు. వంట ఏజన్సీ నిర్వాహకులు పురుగులబియ్యాన్ని ఆయనకు చూపించారు. ఇలాంటి బియ్యాన్ని తింటే తమ పిల్లలు అనారోగ్యానికి గురవుతారని విద్యార్థుల తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై స్పందించిన తహసీల్దార్ వెంటనే బియ్యాన్ని మార్పిస్తానని తెలిపారు. వెంటనే పౌరసరఫరాల గోదాం అధికారికి ఫో¯ŒS చేసి గోకవరం హైస్కూల్‌కు మంచి బియ్యాన్ని అందించాలని ఆదేశించారు. -
నట్టేట మునిగిన నాణ్యత
* ఆర్అండ్బీ రోడ్ల నిర్మాణాల్లో అక్రమాలు * రోజుల వ్యవధిలోనే దెబ్బతింటున్న వైనం * రూ.కోట్ల నిధులు తారుమారు కృష్ణా పుష్కరాల్లో భాగంగా కొల్లూరు మండలంలో చేపట్టిన ఆర్అండ్బీ రహదారుల నిర్మాణంలో నాణ్యత నట్టేట కలిపేశారు. మండల వ్యాప్తంగా రూ.15.30 కోట్లతో చేపట్టిన పనులు బూడిదలో పోసిన పన్నీరులా మారాయి. ఏ ఒక్క రహదారీ మన్నికగా లేదనే విమర్శలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి. పనులు దక్కించుకున్న టీడీపీ నేతలు తమ ఇష్టానుసారంగా రోడ్ల నిర్మాణాలు చేపట్టి బిల్లులు తీసుకొని చేతులు దులుపేసుకున్నారు. కొల్లూరు: పవిత్ర కృష్ణా పుష్కరాల మాటున టీడీపీ నేతలు సాగించిన అక్రమాల డొంక రోజుల వ్యవధిలోనే బట్టబయలైంది. మండలంలో రూ. 15.30 కోట్లతో నిర్మించిన రహదారుల్లో నాణ్యతకు మంగళం పాడి కాంట్రాక్టర్లు తమ జేబులు నింపుకున్నారన్న విషయం రహదారుల దుస్థితి చూస్తే బహిర్గతమవుతుంది. రోజుల వ్యవధిలోనే రూ. 5.69 కోట్లతో నిర్మించిన కొల్లూరు–గాజుల్లంక, పెసర్లంక– కొత్తూరులంక రహదారులు దెబ్బతిన్నాయి. తాజాగా మరో రెండు రోడ్లు కాంట్రాక్టర్ల అవినీతికి ఛిద్రమై ఎందుకూ పనికిరా>కుండా పోతున్నాయి. ఏ ఒక్క రోడ్డూ నిర్మాణంలోనూ నాణ్యత పాటించకపోవడంతో రహదారులు నిర్మించి ప్రయోజనం లేకుండా పోయింది. రహదారులపై తారు లేయర్లు తొలగిపోవడం, అంచుల వెంబడి బీటలు వారడం, రహదారి కుంగిపోవడం వంటి లోపాలు బహిర్గతమయ్యాయి. రూ. 3.15 కోట్ల వ్యయంతో కొల్లూరు–కొల్లిపర మండలాల నడుమ 8.12 కిలోమీటర్ల పొడవున చేపట్టిన రహదారి నిర్మాణం, మరమ్మతులు కాంట్రాక్టర్ల అక్రమాలకు వేదికగా మారాయి. నెలలోనే అధ్వానం.. ఈపూరు నుంచి చిలుమూరు మధ్య నూతనంగా నిర్మించిన రహదారి పొడవునా తారు తొలగిపోయి రోడ్డు ఎందుకూ పనికిరాకుండా పోయింది. కనీసం 15 ఏళ్ల పాటు మన్నాల్సిన బీటీ రోడ్డు నెల రోజుల వ్యవధిలో అధ్వాన స్థితికి చేరడం పనుల్లో ఏమేరకు ప్రమాణాలు పాటించారో తేటతెల్లమవుతుంది. కొల్లూరు వద్ద చేపట్టిన రోడ్డు అంచుల పటిష్టత మట్టితో చేపట్టాల్సి ఉండగా ఇసుకతో తూతూ మంత్రంగా ముగించారు. దీంతో అంచులు కోతకు గురై రోడ్డు దెబ్బతినే ప్రమాదం ఉంది. కాంట్రాక్టర్ కక్కుర్తి... రూ. 3.15 కోట్లు వెచ్చించి నిర్మించిన గాజుల్లంక–చింతమోటు రహదారి నిర్మాణంలో కాంట్రాక్టర్ల కక్కుర్తి కారణంగా రహదారి పాడై పాత రోడ్డులా తయారవుతుంది. పోతార్లంక సమీపంలో రోడ్డు పగుళ్ళిచ్చి కుంగిపోయింది. కిష్కిందపాలెం–తడికలపూడి మధ్యలో సైతం రోడ్డు అంచుల్లో తారు పొరలు తొలగిపోవడం, అంచులు పగిలిపోవడం పనుల జరిగిన తీరుకు అద్దం పడుతుంది. రూ. 3.31 వ్యయంతో 6 కిలోమీటర్ల నిర్మించిన తెనాలి–వెల్లటూరు మార్గంలో సైతం లోపాలు బహిర్గతమవుతున్నాయి. క్రాప అడ్డరోడ్డు రోడ్డు అంచులు కుంగి బీటలువారాయి. లోపాలను కప్పిపుచ్చుకునేందుకు అతుకులతో సరిపెట్టారు. పనులు పూర్తవ్యకముందే బిల్లులు చెల్లించి తమ వాటాలు అందుకున్న విశ్వాసాన్ని అధికారులు ప్రదర్శిస్తున్నారు. డీఈ దృష్టికి తీసుకెళ్ళండి.. రహదారుల దుస్థితి, నాణ్యతా ప్రమాణాలపై ఆర్ అండ్ బీ ఈఈ పకీర్బాబును సాక్షి వివరణ కోరగా డీఈ దృష్టికి తీసుకువెళితే అయన ఆ వ్యవహారం ఏమిటో చూస్తారని పేర్కొన్నారు. – పకీర్‌బాబు, ఈఈ -
పట్టణాల్లో చెత్త వేస్తే జరిమానా!: వెంకయ్య
సాక్షి, న్యూఢిల్లీ: పట్టణాల్లోని బహిరంగ ప్రదేశాల్లో చెత్త వే స్తే జరిమానా విధించే అంశాన్ని పరిశీలిస్తున్నట్లు కేంద్ర సమాచార శాఖ మంత్రి వెంకయ్యనాయుడు తెలిపారు. స్వచ్ఛ్ భారత్‌లో ప్రజల భాగస్వామ్యంపై ‘స్కేలింగ్ అప్ సిటిజెన్స్’ పేరిట జరిగిన వర్క్‌షాప్‌ను మంగళవారం ఢిల్లీలో ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా వెంకయ్య మాట్లాడుతూ.. మిషన్‌లో దేశ ప్రజలను పెద్ద ఎత్తున భాగస్వాములను చేసే పద్ధతులపై వర్క్‌షాప్‌లో చర్చిస్తామని చెప్పారు దేశ భద్రత విషయంలో అన్ని పార్టీలూ ఒకే గొంతుకగా వ్యవహరించాలని, కానీ కాంగ్రెస్ అలా వ్యవహరించకపోవడం దురదృష్టకరమన్నారు. ఉగ్రవాదాన్ని పాకిస్తాన్ పెంచి పోషిస్తోందని, పాక్ ఆక్రమిత కశ్మీర్, బెలూచిస్తాన్‌లో మానవ హక్కుల ఉల్లంఘన ఎలా జరుగుతోందో ప్రపంచానికి తెలియాలన్నారు. -
డంపింగ్ యార్డు ఏర్పాటులో జాప్యం
తిరువళ్లూరు: మున్సిపాలిటీ పరిధిలో సేకరించిన చెత్తను డంపింగ్ చేయడానికి స్థలం ఏర్పాటు చేయకపోవడంతో, ప్రభుత్వం ప్రకటించిన సేంద్రీయ ఎరువుల తయారీ పరిశ్రమ ఏర్పాటు అగమ్యగోచరంగా మారింది. దీనిపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తిరువళ్లూరు మున్సిపాలిటీలో దాదాపు లక్ష మందికి పైగా నివాసం ఉంటున్నారు. విద్యాసంస్థలు, కళాశాలలు, హోటల్స్‌తో పాటు ఇతర అవసరాల వల్ల ఏర్పడే చెత్తను మగ్గిన కుప్పలు, మగ్గని కుప్పలుగా వేరు చేసి తలకాంజేరీకి సమీపంలో డంపింగ్ చేస్తున్నారు. అక్కడ చెత్తకుప్పలు గుట్టల్లా పేరుకుపోవడంతో సమీప ప్రాంతాలకు దుర్వాసన వస్తోంది. చెత్తకుప్పలకు నిప్పు పెట్టినప్పుడు పొగలు దట్టంగా విస్తరించడం, హానికర వాయువులు వెలువడుతుండడంతో ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపథ్యంలో చెత్తను పడవేయడానికి కుత్తంబాక్కం సమీపంలో 110 ఎకరాల స్థలంలో డంపింగ్ యార్డును ఏర్పాటుచేసి అక్కడ సేంద్రీయ ఎరువుల తయారీ చేపట్టాలన్న ప్రభుత్వ లక్ష్యం ముందుకు సాగడం లేదు. డంపింగ్ యార్డుకు స్థలం కరువు: తిరువళ్లూరులో సేకరించే చె త్తకుప్పలను డంపింగ్ యార్డును ఏర్పాటు చేసి అక్కడికి తరలించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అయితే కుత్తంబాక్కంలో స్థానికులు డంపింగ్‌యార్డు ఏర్పాటుకు నిరసన వ్యక్తం చేయడంతో ఎగువ నల్లాటూరు వద్ద ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించినా ఆచరణలో సాధ్యం కావడం లేదు. దీంతో తిరువళ్లూరును పారిశుద్ధ్య నగరంగా తీర్చిదిద్దాలన్న ప్రభుత్వం ఆశయం కలగానే మిగిలిపోయే ప్రమాదం ఉందని స్థానికులు వాపోతున్నారు. ప్రభుత్వం స్పందించి డంపింగ్ యార్డును వెంటనే ఏర్పాటు చేసి సేంద్రియ ఎరువుల తయారీ ప్రక్రియను వేగంగా పూర్తి చేయాలని స్థానికులు కోరుతున్నారు. ఎరువుల తయారీ పరిశ్రమకు నిధుల కొరత : తిరువళ్లూరు మున్సిపాలిటీ నుంచి భారీగా వెలువడుతున్న చెత్తవల్ల భవిష్యత్తులో ముప్పు ఏర్పడుతుందన్న కారణంతో ప్రభుత్వం ముందస్తు చర్యగా సేంద్రియ ఎరువుల తయారీ చేపట్టాలని నిర్ణయించింది. ఇప్పటికే ఈ ప్రక్రియ నారావారికుప్పంతో పాటు 8 మేజర్ పంచాయతీల్లో జరుగుతోంది. వాస్తవానికి సేంద్రియ ఎరువుల తయారీ ఖర్చులను ఆయా పంచాయతీలు, మున్సిపాలిటీలే భరించాల్సి ఉంది. అయితే తిరువళ్లూరులో సేకరించిన చెత్త నుంచి సేంద్రియ ఎరువుల తయారీకి భారీగా ఖర్చు అయ్యే అవకాశం ఉండడంతో ఈ ప్రక్రియ సాధ్యం కాదని అధికారులు పేర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో తిరువళ్లూరు మున్సిపాలిటీలో సేంద్రీయ ఎరువుల తయారీకి ప్రభుత్వం ప్రత్యేక చొరవ తీసుకుని నిధులు కేటాయించాలని స్థానికులు కోరుతున్నారు. ముప్పు నుంచి ఉపశమనం : ప్రస్తుతం తిరువళ్లూరులో సేకరించే చెత్తకుప్పలను తలకాంజేరి వద్ద డంపింగ్ చేస్తున్నారు. చెత్తకుప్పలు భారీగా పేరుకుపోతే నిప్పు పెట్టి కాల్చేస్తున్నారని, ఆ సమయంలో పొగలు దట్టంగా వ్యాపించడంతో పాటు హానికర వాయువులు వెలువడుతుండడంతో గుండె సంబంధిత వ్యాధులు వస్తున్నాయని స్థానికులు ఆవేదన చెందుతున్నారు. -
బతుకు భారమై.. బడికి దూరమై..
విద్యాహక్కు చట్టాన్ని పటిష్టంగా అమలు చేస్తున్నామని.. బడి ఈడు పిల్లలందరూ బడిలోనే ఉండేటట్లు చేస్తున్నామని ప్రభుత్వం చెబుతున్న చెబుతున్న మాటలు నీటిమూటలే అవుతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా ‘బడి పిలుస్తోంది’ కార్యక్రమం నిర్వహిస్తున్న వేళ.. రామచంద్రపురానికి చెందిన ఇద్దరు బాలురు రాయవరంలో చెత్త ఏరుకుంటూ.. పెదపూడి మండలం పైన గ్రామానికి చెందిన బాలలు చెత్త ఏరుకోవడానికి రిక్షాపై వి.సావరం వెళ్తూ. ఇలా కనిపించారు. బతుకు భారమై.. బడిబాట పట్టాల్సిన బాల్యం చెత్తకుప్పలపాలవుతోంది. చట్టాలెన్ని ఉన్నా అక్కరకు రావడం లేదనడానికి ఇటువంటి చిత్రాలు సాక్షీభూతంగా నిలుస్తున్నాయి. - రాయవరం -
80 ఏళ్ల బామ్మ 8 ఏళ్లుగా చెత్తలో..
ముంబై: ఒకే ఇంట్లో ఎనిమిదేళ్లుగా 8 ట్రక్కుల మేర చెత్త పేరుకుపోయింది. దీనికి కారణం 80 ఏళ్ల బామ్మ. ఆమె అనారోగ్యానికితోడు ఆ ఇంటిని శుభ్రం చేసే నాథుడులేకపోవడంతో చెత్త గుట్టలుగా పోగైంది. ముంబై శివారులోని ఓ ఇంటి నుంచి భరించలేని దుర్వాసన వస్తోందని హౌసింగ్ సొసైటీ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు వచ్చి చూసేసరికి రెండు వేల చదరపు అడుగుల మేర మూడు గదుల నిండా చెత్త, శిథిలాలు గుట్టలుగా దర్శనిమిచ్చాయి. శిథిలాల మధ్యన బెడ్‌పై 80 ఏళ్ల వృద్ధురాలు అచేతనంగా పడి ఉంది. ఎనిమిది ట్రక్కుల సహాయంతో చెత్తను, శిథిలాలను తొలగించామని, వృద్ధురాలిని స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించామని పోలీసులు తెలిపారు. -
గాడితప్పిన గురుకులం
♦ ఇంటర్ ఫలితాల్లో ఖేడ్ ‘రెసిడెన్షిల్‘ కాలేజీ అధ్వానం ♦ ఫస్టియర్ 10.81, సెకండ్ ఇయర్ 26.67 శాతం ఉత్తీర్ణత నారాయణఖేడ్: ఇంటర్ ఫలితాల్లో కొన్ని ప్రభుత్వ కాలేజీలు ‘ఎవరెస్ట్’ అనిపిస్తే.. మరికొన్ని ‘వరెస్ట్’గా మిగిలాయి. ఇందుకు నారాయణఖేడ్ సాంఘిక సంక్షేమ శాఖ గురుకులమే ఉదాహరణ. క్రమశిక్షణ, విద్యాభివృద్ధికి మార్గదర్శకంగా నిలవాల్సిన ఈ గురుకులంలో బోధన గాడితప్పింది. సిబ్బందిలో క్రమశిక్షణ లేకపోవడం.. అధికారుల పర్యవేక్షణ కొరవడటంతో చెత్త రిజల్ట్స్ వచ్చాయి. వివరాలు.. నారాయణఖేడ్ గురుకుల కళాశాలలో ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరంలో 75 మంది విద్యార్థులు ఉండగా పరీక్షకు 74 మంది హాజరయ్యారు. ఇందులో కేవలం 8 మంది మాత్రమే ఉత్తీర్ణులయ్యారు. అంటే 10.81 శాతం ఉత్తీర్ణత అన్నమాట. ఇక రెండో సంవత్సరానికి సంబంధించి 54 మంది పరీక్షలు రాశారు. వీరిలో జస్ట 12 మంది మాత్రమే పాస్ అయ్యారు. 26.67 శాతం ఫలితం. ‘ఏ’ గ్రేడ్‌లో ఏగుగురు, ‘సీ’ గ్రేడ్‌లో ఇద్దరు, ‘డీ’ గ్రేడ్‌లో ఒకరు ఉత్తీర్ణులయ్యారు. మొదటి సంవత్సరానికి సంబంధించి ‘ఏ’, ‘బీ’ గ్రేడ్లలో ఒక్కొక్కరూ.. ‘సీ’ గ్రేడ్లలో ముగ్గురు, ‘డీ’ గ్రేడ్‌లో 8 మంది పాస్ అయ్యారు. కానరాని పర్యవేక్షణ గురుకులంలో ఇబ్బందులపై అనేకసార్లు పత్రికల్లో కథనాలు వచ్చాయి. భోజనం విషయంలోనూ విద్యార్థులు ఉన్నతాధికారులకు ఫిర్యాదులు చేశారు. అధికారులు తూతూ మంత్రంగా విచారణ జరిపి చేతులు దులుపుకున్నారు. ఫలితంగా దారుణమైన ఇంటర్ ఫలితాలు వెలువడ్డాయి. ఉన్నతాధికారులు మొదట్లోనే క్షేత్రస్థాయి పరిశీలన చేసి, శ్రద్ధ చూపితే ఫలితాలు మెరుగ్గా ఉండేవని విద్యార్థుల తల్లిదండ్రులు పేర్కొంటున్నారు. ఇంటర్ మొదటి సంవత్సరంలో తెలుగు సబ్జెక్టులోనే 16 మంది ఫెయిల్ అయ్యారంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. అత్యధికంగా కెమిస్ట్రీలో 51 మంది తప్పారు. సబ్జెక్టుల వారీగా ఇంగ్లిష్‌లో 34 మంది, మ్యాథ్స్(ఏ)లో 26, (బీ)లో 30, బోటనీ 28, జువాలజీ 22, ఫిజిక్స్ 36 మంది ఫెయిల్ అయ్యారు. ఇక రెండో సంవత్సరం ఇంగ్లిష్‌లో 3, తెలుగు 2, మ్యాథ్స్(ఏ) 8, (బీ) 14, బోటనీ 12, జువాలజీ 13, ఫిజిక్స్ 13, కెమిస్ట్రీలో 9 మంది తప్పారు. ఇదే మొదటి‘సారీ’ ఈ ఏడాదే గురుకులంలో ఇంతటి దారుణమైన ఫలితాలు సాధించింది. గత నాలుగేళ్లలో ఇలాంటి రిజల్ట్స్ రాలేదు. 2012- 13వ సంవత్సరంలో 69 మందికి 28 మంది ఉత్తీర్ణులయ్యారు. అంటే 40.57 శాతం ఫలితం వచ్చినట్టు. 2013-14లో 68 మందికి 39 మంది పాస్ ఉత్తీర్ణత శాతం 57.35. ఇక 2014- 15లో 34 మందికి 22 మంది పాస్ అయ్యారు. అంటే 64.71 శాతం ఉత్తీర్ణత. గురుకులంలో భోజనం, వసతితో కూడిన విద్య అందిస్తారు. ఫిజిక్స్, ఇంగ్లిష్, మాథ్స్ సబ్జెక్టులకు మాత్రమే లెక్చరర్లు ఉండగా కెమిస్ట్రీ, బోటనీ, జువాలజీ, తెలుగుకు అధ్యాపకులు లేదు. ఈనేపథ్యంలో వచ్చే విద్యాసంవత్సరం నుంచి గురుకులం అన్ని సౌకర్యాలున్న అధునాతన భవనంలోకి మారనుంది. అక్కడైనా ఫలితాలు ఎలా ఉంటాయో చూడాలి. -
రోడ్డుపై ఉమ్మితే జరిమానా..
ఉప్పల్: నగరంలోని రోడ్లపై ఉమ్మినా, చెత్త వేసినా జరిమానా విధిస్తామని గ్రేటర్ కమిషనర్ డా.జనార్ధన్‌రెడ్డి తెలిపారు. మంగళవారం ఆయన గ్రేటర్ పరిధిలోని పలు ప్రాంతాల్లో పర్యటించారు. చిన్న రావులపల్లిలో చెత్తనుండి విద్యుత్ ఉత్పాదన కేంద్రాన్ని పరిశీలించిన అనంతరం కాప్రా, ఉప్పల్ సర్కిల్ పరిధిలో అభివృద్ధి పనులను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూగ్రేటర్ హైదరాబాద్‌ను చెత్త రహిత నగరంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నామన్నారు. వంద రోజుల కార్యక్రమంలో భాగంగా చెత్త ఓపెన్ పాయింట్లను దాదాపుగా తొలగించామన్నారు. కార్యక్రమం ముగిసేనాటికి రోడ్లపై ఎక్కడా చెత్త కనబడకుండా చేస్తామన్నారు. ఇకపై రోడ్లపై ఎక్కడపడితే అక్కడ ఉమ్మినా, బహిరంగ మూత్ర విసర్జన చేసినా, గోడలపై రాసినా, బ్యానర్లు కట్టినా జరిమానా విధిస్తామని హెచ్చరించారు. ప్రతి ఒక కార్మికుడు ఇంటింటికి వెళ్లి తడి పొడి చెత్తపై అవగాహన కల్పిస్తారని, ఇందులో విద్యార్థులను సైతం భాగస్వాములను చేయనున్నట్లు తెలిపారు. వేరువేరుగా చెత్త సేకరణ, ప్లాస్టిక్ నిషేధం అమలుపై వచ్చే నెల 2న ఎస్ఎఫ్ఏలకు ప్రత్యేక శిక్షణ ఇవ్వనున్నట్లు తెలిపారు. ఉత్తమ సేవలందించిన పారిశుద్ద్య కార్మికులకు, అధికారులు, గుర్తింపునిచ్చే విధంగా పూలదండలు వేసి సన్మానం చేస్తామన్నారు. ఉప్పల్ సర్కిల్ పరిధిలో పలు అభివృద్ధి కార్యక్రమాలను జోనల్ కమిషనర్ రఘుప్రసాద్, డీసీ విజయకృష్ణ, ఈఈ నాగేందర్‌లతో కలిసి పరిశీలించారు. సిటీజన్ సర్వీస్ సెంటర్ తనిఖీ.. ఎర్లీబర్డ్ ఆఫర్‌కు మరో నాలుగు రోజులు మాత్రమే గడువు ఉండటంతో ఉప్పల్ సర్కిల్ కార్యాలయంలోని సిటీజన్ సర్వీస్ సెంటర్‌ను జీహెచ్ఎంసీ కమిషనర్ జనార్ధన్‌రెడ్డి తనిఖీ చేసి బిల్ కలెక్టర్లను ఆస్థి పన్ను చెల్లింపు అంశాలపై ఆరా తీశారు. అవసరమైతే అధనపు కౌంటర్లను ఏర్పాటు చేయాలని సూచించారు. చలివేంద్రాలు ఏర్పాటు చేయాలి నగరంలో ఎండ తీవ్రత దృష్ట్యా చలివేంద్రాలు ఏర్పాటుకు స్వచ్ఛంద సంస్థలతోపాటు వ్యాపార, వాణిజ్య సంస్థలు ముందుకు రావాల్సిందిగా జీహెచ్ఎంసీ కమిషర్ కోరారు. ఇందుకు జీహెచ్ఎంసీ తరపున అవసరమైన సహాయ సహకారాలతోపాటు జలమండలి ద్వారా ఉచితంగా మంచినీరు అందించే ఏర్పాట్లు చేస్తామన్నారు. -
ప్రపంచంలోనే ఢిల్లీ వరస్ట్!
వాయు కాలుష్య నగరాల్లో భారత రాజధాని ఢిల్లీ నగరం ప్రపంచంలోనే మొదటి స్థానంలో నిలిచినట్లు వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ (WHO) తాజా నివేదికల్లో వెల్లడించింది. ప్రపంచవ్యాప్తంగా ప్రతి సంవత్సరం మిలియన్ల కొద్దీ జనం కేవలం కాలుష్య వాతావరణం కారణంగానే చనిపోతున్నట్లు నివేదించింది. విశ్వ వ్యాప్తంగా నమోదవుతున్న ప్రతి నాలుగు మరణాల్లో ఒకటి కాలుష్య కారణంగానే జరుగుతున్నట్లు సర్వేల్లో తేలింది. ఢిల్లీ నగరం ప్రపంచంలోనే వరస్ట్ ప్లేస్ అని... వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ తాజా లెక్కలు చెప్తున్నాయి. ప్రతి సంవత్సరం ప్రపంచ వ్యాప్తంగా నమోదవుతున్న 12.6 మిలియన్ల మరణాల్లో రెండొంతులు, అంటే 8.2 మిలియన్ల ప్రజలు అనారోగ్య వాతావరణం కారణంగా వచ్చే గుండెజబ్బులు, శ్వాసకోశవ్యాధులు, క్యాన్సర్ వంటి రోగాలతోనే చనిపోతున్నారని డబ్ల్యూ హెచ్ ఓ నివేదికలు చెప్తున్నాయి. మరోవైపు యూఎన్ ఓ ప్రజారోగ్య వింగ్ లెక్కల ప్రకారం ఆగ్నేయ ఆసియాలో ఏడాదికి 3.6 మిలియన్ మరణాలు సంభవిస్తున్నట్లు తెలుస్తోంది. డబ్ల్యూ హెచ్ ఓ లెక్కల్లో ఆగ్నేయాసియాలోని బాంగ్లాదేశ్, భూటాన్, ఉత్తర కొరియా, ఇండోనేషియా, మాల్దీవులు, మయన్మార్, నేపాల్, శ్రీలంక, థాయిలాండ్ లతో పోలిస్తే భారతదేశః చాలా పెద్దది. 2006 లెక్కల ప్రకారం చూస్తే మొత్తం 13 మిలియన్ల మరణాలు పెరిగినట్లు లెక్కలు చెప్తున్నాయి. పారిశుద్ధ్య లోపం, అపరిశుభ్ర నీరు వల్ల తలెత్తే ఇన్ఫెక్షన్లు, మలేరియా, డయేరియా వంటి రోగాలకు ముఖ్యంగా వాయు కాలుష్యమే కారణమని చెప్తున్నారు. ఈ కాలుష్యం చిన్నా పెద్దా తేడా లేకుండా ప్రతివారిపైనా పడుతున్నట్లు తెలిపారు. మంచి పర్యావరణంతో సంవత్సరంలో 1.7 మిలియన్ల 5 ఏళ్ళ లోపు పిల్లలను, 4.9 మిలియన్ల 50 నుంచి 75 ఏళ్ళ లోపు వయసున్న పెద్దలను రక్షించుకోవచ్చని ప్రపంచ ఆరోగ్య సంస్థ లెక్కలు చెప్తున్నాయి. ముఖ్యంగా ఐదేళ్ళలోపు పిల్లలు, ఏభై ఏళ్ళు దాటిన వారిపైనే వాతావరణ కాలుష్య ప్రభావం అధికంగా ఉంటోందని లెక్కలు తెలియజేస్తున్నాయి. ముఖ్యంగా 2014 లోని ప్రపంచ ఆరోగ్య సంస్థ ఎయిర్ క్వాలిటీ డేటాబేస్ ను బట్టి చూస్తే... 91 దేశాలు 1600 నగరాల్లో వాతావరణ, వాయు కాలుష్యాలకు పెట్టింది పేరని, ప్రపంచంలోనే గాలి నాణ్యతకు వరస్ట్ ప్లేస్ గా బహిరంగ చర్చ ద్వారా ఢిల్లీని ప్రకటించింది. గాలి నాణ్యతలో కరాచీ 117UG/m3, ఢాకా 86UG/m3, బీజింగ్ 56ugm/m3 లతో పోలిస్తే.... డబ్ల్యూ హెచ్ ఓ ప్రకారం సంవత్సరానికి కేవలం 10ug/m3 మాత్రమే కలిగి ఉండాల్సిన ఢిల్లీ.. MP 2.5 స్థాయిలో మొదటిస్థానంలో నిలిచింది. ముఖ్యంగా ఊపిరితిత్తులకు, రక్త ప్రసరణకు నష్టం చేకూర్చి, ఆస్తమా, గుండె జబ్బులకు కారణమయ్యే 'అల్ట్రా ఫైన్' ధూళితో నగరం నిండి ఉన్నట్లు తేల్చింది. ఈ పరిస్థితిని మార్చి స్థానిక ప్రజల ఆరోగ్యాలను కాపాడాలంటే ప్రతి ఒక్కరూ పర్యావరణ పరిరక్షణకు సహాయ పడే ప్రయత్నం చేయాలని, నగరంలో వాక్ వేస్, సైక్లింగ్ రూట్స్ ఏర్పాటు చేసి, కాలుష్యాన్ని నివారించే ప్రయత్నం చేయాలని నిపుణులు సూచిస్తున్నారు. -
వాట్సప్ మెసేజ్‌కు స్పందించిన మంత్రి కేటీఆర్
ఎల్బీనగర్: బీఎన్‌రెడ్డినగర్ డివిజన్ గాంధీ చిల్డ్రన్స్ పార్కులో చెత్త పేరుకుపోయి అధ్వానంగా ఉండటంతో స్థానికులు వాట్సప్ ద్వారా మంత్రి కేటీఆర్‌కు సమస్యను చేరవేశారు. వెంటనే స్పందించిన మంత్రి.. చెత్తను తొలగించాలని జీహెచ్ఎంసీ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. దీంతో శనివారం ఎల్బీనగర్ సర్కిల్ డిప్యూటీ కమిషనర్ పంకజ పార్కు వద్దకు చేరుకుని సిబ్బందితో చెత్తను తొలగించారు. -
చెత్త పాస్వర్డ్స్ లో వాళ్లే ముందు!
కంప్యూటర్ల కాలం వచ్చాక పాస్ వర్డ్స్ ప్రాధాన్యం ఎంతో పెరిగిపోయింది. ఆన్ లైన్లో తమ స్వంత వివరాలను భద్రపరచుకొనేందుకు, బ్యాంకులు వగైరా కార్యకలాపాలు నిర్వహించేందుకు ఎవ్వరూ కనిపెట్టలేని పాస్ వర్డ్స్ పెట్టుకోవాలంటూ ఎప్పటికప్పుడు హెచ్చరికలు వస్తూనే ఉంటాయి. అయితే అలా పాస్ వర్డ్స్ ను మెయింటెన్ చేయడంలో సింగపూర్ వాసులు పరమ వీక్ అని రుజువైంది. ఒకే పాస్ వర్డ్ ను.. అదీ అందరికీ తెలిసే పాస్ వర్డ్స్ ను పదే పదే అన్ని సైట్లకూ వాడుతూ ఇప్పుడు ప్రపంచంలోనే వరస్ట్ పాస్ వర్డ్ వినియోగదారులుగా వారు ముందున్నరని తాజా నివేదికలు చెప్తున్నాయి. వివిధ వెబ్ సైట్లలో ఒకే పాస్ వర్డ్స్ వాడటం మంచిది కాదన్న విషయం తెలిసినా పట్టించుకోనివారు ఎక్కువమందే ఉంటారు. 2015 లో సింగపూర్ వాసులు అదే తప్పును చేసి.. భారీగా సైబర్ క్రిమినల్స్ వల్లో చిక్కుకుపోయారని సైబర్ సెక్యూరిటీ నిపుణులు వెల్లడించారు. ప్రైవేటు సమాచారం దొంగిలించాలని చూసే అటువంటి సైబర్ నేరగాళ్ళకు... సింగపూర్ వాసులు లక్ష్యం కావచ్చునని భద్రతాధికారులు హెచ్చరిస్తున్నారు. గతవారం 300 మంది ఖాతాదారుల పాస్ వర్డ్స్ ను చోరీచేసి, సింగపూర్ వీసా అప్లికేషన్లు ఉత్పత్తి చేసే చైనా ఆధారిత సిండికేట్ కు అమ్మకం పెట్టిన ఓ మాజీ నిర్వహణాధికారి పట్టుబడ్డంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. అనేక మంది తమ ఎన్ ఆర్ ఐసీ నెంబర్ నే యూజర్ ఐడీ, పాస్ వర్డ్ గా వాడుతున్నారని... అంచనా వేసిన 39 ఏళ్ళ జేమ్స్ సిమ్ గాన్ లియాంగ్... తన ప్రయత్నం ఫలించడంతో వేలాది పాస్ వర్డస్ ను సునాయాసంగా తెలుసుకోగలిగాడు. ముఖ్యంగా తమ వ్యక్తిగత సమాచారంలోని పదాలను పాస్ వర్డ్స్ గా పెట్టుకోవడంతో సామాజిక మాధ్యమాల ఆధారంగా వాటిని చోరాసురులు టార్గెట్ చేస్తారు. రీసెట్ పాస్ వర్డ్స్ లో కూడ కొన్నిసార్లు ప్రశ్నలకు సులభమైన సమాధానాలు ఇవ్వడంద్వారా కూడా వ్యక్తిగత డేటాను చోరీ చేయగల్గుతారని.. పాలో ఆల్టో నెట్వర్క్స్ భద్రతా సంస్థ నిఘా విశ్లేషకుడు విక్కీ రే చెప్తున్నారు. పాఠశాల పేరు, స్వంత ఊరిపేరు వంటి సమాధానాలను లింక్డ్ ఇన్, ఫేస్ బుక్ వంటి వాటినుంచీ పొందే అవకాశం ఉందని ఆయన హెచ్చరిస్తున్నారు. పాస్వర్డ్స్ ను హ్యాక్ చేయడంలో ఇదో పద్ధతి అని, అలాగే అతి సులభమైన పదాలను, నెంబర్లను పాస్ వర్డ్స్ గా పెట్టుకోవడం వల్ల కూడ హాక్ చేయగల్గుతారని చెప్తున్నారు. అతి తేలికైన పదాలు, అందరికీ అలవాటుగా ఉండే పదాలు వాడే వారిపైనే ధ్యాసపెట్టే హాకర్లు ఇటువంటి పాస్ వర్డ్స్ ను సులభంగా హ్యాక్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా అటువంటి 20 మిలియన్ల అతి చెత్త పాస్ వర్డ్స్ లిస్టును పాస్ వర్డ్స్ మేనేజ్ మెంట్ సంస్థ స్ల్పాష్ డేటా తాజాగా విడుదల చేసింది. ఈ లిస్టులో కీబోర్డుపై మొదటి అక్షరాలు (123456) qwerty వంటి పదాలు.. వరుసగా ఐదో సంవత్సరం కూడ అగ్రస్థానంలో ఉండగా.. పాప్ సంస్కృతికి సూచనగా తాజాగా విడుదలైన చిత్రాల పేర్లు... స్టార్ వార్స్, సోలో, యువరాణి వంటి పాస్ వర్డ్స్ కూడ ఈ లిస్టులో ఉండటం విశేషం. బ్రూట్ ఫోర్స్ సాఫ్ట్ వేర్ ను ఉపయోగించి ఇటువంటి బలహీనమైన, రహస్య పదాలను హ్యాకర్లు ఊహిస్తుంటారు. సాధారణంగా అన్నీ చిన్న అక్షరాలు కలిగి ఉన్న ఆరు నుంచి పది అక్షరాలు ఉండే పాస్ వర్డ్స్ ట్రాక్ చేసేందుకు సైబర్ సెక్యూరిటీ టూల్స్ కు పది నిమిషాలు పడుతుందని సింగపూర్ సెక్యూరిటీ ట్రెండ్ మైక్రో జనరల్ మేనేజర్ డేవిడ్ షా చెప్తున్నారు. అయితే వాటిలో ఓ పెద్ద అక్షరం కలపడం, సింబల్స్ వంటివి కలపడం వల్ల హ్యాక్ చేసేందుకు కనీసం రెండున్నర రోజులు పడుతుందంటున్నారు. అలాగే ఆయా సంస్థలు బలమైన డేటాబేస్ వ్యవస్థను కలిగి ఉండటం కూడ చోరీ కాకుండే ఉండేందుకు సహకరిస్తుందంటున్నారు మరో నిపుణుడు ఛార్లెస్ లిమ్. ముఖ్యంగా పాస్ వర్డ్స్ కనీసం ఎనిమిది క్యారెక్టర్లు ఉండి, లోయర్, క్యాపిటల్ లెటర్లతోపాటు నెంబర్లను, సింబల్స్ ను కలిపి క్రియేట్ చేసుకోవడం ఎంతో అవసరం అని ఆయన యూజర్లకు సలహా ఇస్తున్నారు. అలాగే తరచుగా పాస్ వర్డ్స్ మార్చుకుంటూ ఉండటం వల్ల కూడ హ్యాక్ చేసే అవకాశం ఉండదని, ఒకే పాస్ వర్డ్ ను అన్ని వెబ్ సైట్లలో వాడటం కూడ మానుకోవాలని సూచిస్తున్నారు. -
పారిశుధ్యమా నీవెక్కడ..?
ఎక్కడ చూసినా ‘చెత్త’ గుట్టలే. ఏ రహదారినా వెళ్లినా ముక్కుపుటలదిరే దుర్వాసనే. చెత్త డంపింగ్‌కు కాదేదీ అనర్హం.. అన్నట్టు మహానగరమంతా వ్యర్థాలతో నిండిపోతోంది. పారిశుధ్యం పడకేసి.. చారిత్రక భాగ్యనగరి.. పరమ ‘చెత్త’గా మారుతోంది. ఎందుకీ దుస్థితి..? దీనికి కారణం అధికారుల నిర్లక్ష్యం.. పాలకుల వైఫల్యం కాదా.? అవును ముమ్మాటికీ వారిదే ఈ మూల్యం. గ్రేటర్ ఎన్నికల వేళ మహానగరి మహాసమస్య మళ్లీ ముందుకొచ్చింది. వాగ్దానాల వాగ్బాణాలను ‘చెత్త’ బుట్టలో వేసే నాయకులను నిలదీయాల్సిన సమయం ఆసన్నమైంది. ‘చెత్త’ను కడిగేసే ‘స్వచ్ఛ’మైన హామీలిచ్చే నాయకుడికే పట్టం కడతామంటున్నారు నగరవాసులు. - సాక్షి, సిటీబ్యూరో/కుత్బుల్లాపూర్, అంబర్‌పేట 4 వేల టన్నులు.. ప్రతిరోజు గ్రేటర్లో పోగవుతున్న చెత్త. ఇదీ జీహెచ్ఎంసీ అధికారుల లెక్క. కానీ అసలు లెక్క వేరు. లెక్కకు మిక్కిలి చెత్త నగరంలో పోగవుతోంది. పారిశుధ్యం పడకేసి అదంతా రోడ్లపైనే దర్శనమిస్తోంది. బస్తీలు, కాలనీలు అనే తేడా లేకుండా ఎక్కడ పడితే అక్కడ డంపర్బిన్లు నిండిపోయి చెత్త చెల్లాచెదురవుతోంది. ఫలితంగా దుర్వాసన వెదజల్లి, దోమలు వృద్ధి చెంది ప్రజలకు ప్రాణాంతక వ్యాధులొస్తున్నాయి. సాధారణ చెత్తకు ఎలక్ట్రానిక్ వేస్ట్, ప్లాస్టిక్ వ్యర్థాలు కూడా తోడవుతుండడంతో ఇది మరింత ఎక్కువవుతోంది. ‘స్వచ్ఛ’తకు స్వస్తి..! ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన ‘స్వచ్ఛ హైదరాబాద్’ పథకం మూణ్నాళ్ల ముచ్చటే అయింది. సీఎం కేసీఆర్ సహా మంత్రులు, ఎమ్మెల్యేలు, రాజకీయ, సినీ ప్రముఖులు అందరూ రోడ్లెక్కి చెత్తను ఊడ్చి ఫొటోలకు ఫోజులిచ్చేశారు. సీఎం పార్శీగుట్ట డివిజన్‌ను దత్తత తీసుకోగా.. మంత్రులు, ఎమ్మెల్యేలు ఒక్కో డివిజన్‌కు మెంటార్లుగా వ్యవహరిస్తున్నారు. అయినా ఎక్కడ ‘చెత్త’ అక్కడే ఉండిపోతోంది. కారణం పథకం అమలులో అలసత్వం. నిర్వహణ లోపం. ‘స్వచ్ఛ హైదరాబాద్’ ప్రారంభమై 8 నెలలు అవుతోంది. నెలనెలా జరగాల్సిన ఈ కార్యక్రమం కేవలం తొలి రెండు పర్యాయాలు మాత్రమే జరిగిందంటే పరిస్థితి అర్థమవుతోంది. దీంతో పథకం ‘ఆరంభ శూరత్వం’గానే మారిందనే విమర్శలున్నాయి. మరోవైపు ‘స్వచ్ఛ హైదరాబాద్’లో చేసిన పనులకు ఎనిమిదినెలలైనా ఇంకా బిల్లులు చెల్లించలేదని వాహనాలు అద్దెకిచ్చిన కాంట్రాక్టర్లు లబోదిబోమంటున్నారు. నిర్వహణ లోపమే అసలు సమస్య..! నగరంలో 8 వేల కిలోమీటర్ల రహదారులుండగా.. కేవలం 2 వేల కి.మీ పరిధిలో మాత్రమే పారిశుధ్య నిర్వహణ చేస్తున్నారు. చెత్త పేరుకుపోవడానికి ఇదే అసలు సమస్య. దీనికి తోడు కార్మికులు ఇళ్ల నుంచి చెత్తను సేకరించి డంపర్‌బిన్లలో పడేసి చేతులు దులుపుకుంటున్నారు. చెత్తను డంపింగ్‌యార్డుకు తరలించకపోవడంతో పరిసరాలు పూర్తిగా చెత్త మయమవుతున్నాయి. కొన్ని డివిజన్లలో డంపర్బిన్లు లేక చెత్తను రోడ్లపైనే పడేస్తున్నారు. దీంతో దోమలు వృద్ధి చెంది డెంగీ, మలేరియా లాంటి ప్రాణాంతక వ్యాధులు ప్రబలుతున్నాయి. సమస్యలిలా.. ‘స్వచ్ఛ’తెలా..? * చెత్తను డంపింగ్ యార్డులకు తరలించేందుకు 564 వాహనాలు ఉన్నాయి. చెత్త తరలింపునకు ఇవి ఏ మాత్రం సరిపోవడం లేదు. వీటిలోనూ 458 మాత్రమే జీహెచ్‌ఎంసీవి. మిగతా 106 అద్దె వాహనాలు. వాహనాల్లోనూ సగం తుప్పు పట్టడంతో మరమ్మతులకు కోట్ల రూపాయలు వెచ్చిస్తున్నారు. * పారిశుధ్య కార్మికులు గ్రూపులో ఏడుగురు ఉండాలి. కానీ నలుగురైదుగురు మాత్రమే కనిపిస్తున్నారు. చాలా మంది పేర్లు హాజరుపట్టిలో ఉంటాయి. కానీ మనుషులుండరు. ఇలా సుమారు 5 వేల మంది జీతాలు కొందరి అక్రమార్కుల ఖాతాల్లోకి మళ్లుతున్నాయి. వీటిని పంచకుంటున్న వారిలో శానిటరీ సూపర్వైజర్లలు ఇతర సిబ్బంది, యూనియన్ల నేతలు కూడా ఉండడం గమనార్హం. నూతన జీహెచ్ఎంసీ కమిషనర్ ప్రారంభించిన ‘పరిచయం’ కార్యక్రమంలో ఈ విషయం వెలుగుచూసింది. అవినీతి ఇంత బహిరంగంగా జరుగుతుంటే.. ఇక పారిశుధ్యం ఎప్పటికి బాగుపడుతుంది.? * నగరంలో రోజుకు వందల టన్నుల ప్లాస్టిక్ చెత్త పోగవుతోంది. నిజం చెప్పాలంటే గ్రేటర్ చెత్తలో ఇదే సగం. ప్లాస్టిక్ నిషేధించాలనే ప్రయత్నాలన్నీ పారిశ్రామికవేత్తలు, వ్యాపారుల ఒత్తిడితో నీరుగారిపోయాయి. 40 మైక్రాన్ల లోపు ప్లాస్టిక్ వినియోగంపై నిషేధం విధించినా అమలు లేదు. కొన్నాళ్లు అమలు చేసి తర్వాత చేతులెత్తేశారు. ప్లాస్టిక్‌ను పూర్తిగా నిషేధిస్తేనే చెత్త సమస్యకు చెక్ చెప్పొచ్చు. ఇప్పటికే పేరుకుపోయిన ప్లాస్టిక్ చెత్తను రీసైక్లింగ్ చేయాల్సి ఉంది. * ఐటీలో దూసుకుపోతున్న హైదరాబాద్‌ను ఎలక్ట్రానిక్ వేస్ట్ (ఈ-వ్యర్థాలు) వెన్నంటే వెంటాడుతోంది. ఈ-వ్యర్థాల్లో ముంబై, ఢిల్లీ, బెంగళూర్, చెన్నై తర్వాత స్థానం హైదరాబాద్‌దే. గ్రేటర్లో ఏటా సుమారు 45 వేల టన్నుల ఈ-వ్యర్థాలు పోగవుతున్నాయి. టీవీలు, కంప్యూటర్లు, సెల్ఫోన్లు, ప్రింటర్ల చెత్తే 12 వేల టన్నులు ఉందని ఈటీ పీఆర్ఐ సర్వేలో తేలింది. వీటిలో 55 శాతం సాధారణ చెత్తతో కలుస్తుండడంతో ప్రమాద ఘంటికలు మోగుతున్నాయి. * వీటన్నింటితో పాటే బయోమెడి‘కిల్’ వేస్ట్ గ్రేటర్‌ను కలవరపెడుతోంది. ఆస్పత్రుల నుంచి వెలువడే ఈ డేంజర్ వేస్ట్‌ను సాధారణ చెత్తతో రోడ్లపైనే తగలబెడుతున్నారు. దీంతో 20 శాతం జనాభా అంటువ్యాధుల బారిన పడుతున్నారని పర్యావరణ నిపుణులు హెచ్చరిస్తున్నారు. గ్రేటర్లో ఏడాదికి 18 వేల టన్నుల బయోమెడి‘కిల్’ వ్యర్థాలు వెలువడుతున్నాయని కాలుష్య నియంత్రణ మండలి(పీసీబీ) లెక్కల్లో తేలింది. నగరంలో ప్రతిరోజు 50 టన్నుల బయోమెడికల్ వేస్ట్ పరిసరాల్లో కలుస్తోంది. ఏదీ ‘చెత్త’ శుద్ధి..? సేకరించిన చెత్తను డంపింగ్‌యార్డులకు తరలించడం లేదు. రోడ్లపైనే చెత్తను డంపింగ్ చేస్తున్నారు. దీంతో తీవ్ర దుర్గంధం వెదజల్లుతోంది. జీడిమెట్ల నాలా పక్కన ఎన్నో ఏళ్ల నుంచి చెత్త డంప్ చేస్తున్నారు. గతంలో అధికారులు వచ్చి చూసి వెళ్లినా ఇంత వరకు చెత్తను తరలించలేదు. పారిశుధ్య నిర్వహణ పకడ్బందీగా చేయాలి. ఆ దిశగా కృషి చేసే నాయకులకే నా ఓటు. - సంతోష్, ఆటోడ్రైవర్, జయరాంనగర్ చెత్తతో నిత్యం కుస్తీలే.. పారిశుధ్య నిర్వహణ సరిగా లేక రోడ్లపై చెత్త గుట్టలుగుట్టలుగా పేరుకుపోతోంది. దీంతో రాకపోకలకు తీవ్ర అసౌకర్యంగా ఉంటోంది. చెత్త తరలింపునకు పాలకులు సరైన ప్రణాళికలు రూపొందించడం లేదు. ‘స్వచ్ఛ హైదరాబాద్’ పథకం అమలు లేక అటకెక్కింది. గ్రేటర్ బరిలో నిలిచే పార్టీలు చెత్త నిర్వహణకు సరైన ప్రణాళికలతో ముందుకు రావాలి. ఆ దిశగా కార్యాచరణ రూపొందించే పార్టీకే నా ఓటు. - సిరాజుద్దీన్, అంబర్‌పేట -
అత్యంత చెత్త విమానాశ్రయాలు ఇవే
ప్రపంచ వ్యాప్తంగా ఉన్నటువంటి చెత్త విమానాశ్రయాలు ఏవో మీకు తెలుసా? ఇదే విషయంపై 'ద గైడ్ టూ స్లీపింగ్ ఇన్ ఎయిర్ పోర్ట్స్' అనే ట్రావెల్ వెబ్సైట్... విమాన ప్రయాణికుల అభిప్రాయాలను సేకరించి ఓ జాబితాను విడుదల చేసింది. ఈ జాబితాలో 2015 సంవత్సరానికి గాను ప్రయాణికులకు అత్యంత అసౌకర్యంగా ఉండే 10 ఎయిర్ పోర్ట్‌ల వివరాలను ప్రకటింది. దీనిలో విమానాశ్రయాల్లోని కంఫర్ట్, కన్వీనియన్స్, క్లీన్, కస్టమర్ సర్వీస్ అనే నాలుగు అంశాలకు ప్రాధాన్యతను ఇచ్చి ప్రయాణికుల అభిప్రాయాలను సేకరించారు. ఈ సర్వేలో పాల్గొన్న విమాన ప్రయాణికులు ఎక్కువగా విమానాశ్రయంలోని సిబ్బంది నిర్లక్ష్య ప్రవర్తన, అవినీతి, కూర్చోవడానికి సరైన వసతులు కల్పించకపోవడం వంటి వాటిపై ఎక్కువగా అసంతృప్తి వ్యక్తం చేశారు. అయితే నైజీరియాలోని పోర్ట్ హర్కోర్ట్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అత్యంత చెత్త విమానాశ్రాయాల జాబితాలో మొదటి స్థానంలో నిలిచింది. ఈ జాబితాలో ఉన్న 2015 అత్యంత చెత్త 10 విమానాశ్రయాలు ఇవే.. 1. నైజీరియాలోని పోర్ట్ హర్కోర్ట్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ 2. సౌది అరేబియాలోని కింగ్ అబ్దల్లాజిజ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ 3. త్రిభువన్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ (నేపాల్) 4. తాష్కంట్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ (ఉజ్బెకిస్తాన్) 5. సైమన్ బొలీవర్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ (వెనిజులా) 6. టౌస్సెంట్ లూవర్చర్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ (హైతి) 7. హమీద్ కర్జాయ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ (ఆప్ఘనిస్తాన్) 8. టాన్ సన్ నాట్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ (వియత్నాం) 9. బెనజిర్ బుట్టో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ (పాకిస్థాన్) 10. బ్యూవియస్- టిల్లే ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ (పారిస్) -
నరకానికి నకళ్లు ఈ జైళ్లు
బ్రెజీలియా: బ్రెజిల్‌లోని పెర్నాంబుకో రాష్ర్టంలోని జైళ్లు నరకానికి నకళ్లు. వాటిలో రెండు జాతుల నరులు ఉన్నారు. పెత్తనం చెలాయిస్తూ శాసించే వాళ్లది ఒక జాతికాగా, వారి అమానుషత్వానికి, అఘాయిత్యాలకు బలైపోయే బానిసలు రెండో జాతి. పెత్తనం చెలాయించే వారికి విశాలమైన గదులు, ప్రత్యేక మరుగుదొడ్లు, ఫ్యాన్లు, ఫ్రిజ్‌లు, కాలక్షేపానికి కలర్ టీవీలు, సెల్ఫోన్లు, పనివారలుగా అన్ని పనులు చేసిపెట్టే తోటీ బానిస ఖైదీలు, మత్తిచ్చే కొకైన్లు. మత్తులో మృగాళ్లుగా మారినప్పుడు పైశాచిక సుఖాన్నిచ్చే బానిస ఖైదీలు. మరుగు దొడ్లు కూడాలేని ఇరకు గదుల్లో యమలోకపు హింసలను జైల్లోనే అనుభవించే బానిస ఖైదీల గురించి పట్టించుకునే నాధులే లేరు. పెత్తనం చెలాయించే ఖైదీల పైశాచికత్వానికి రక్తం కక్కుకొని చస్తున్నారు. ఒక్కరిపై పది మంది వరుసగా రేప్‌లు చేస్తున్న సందర్భాలు కూడా ఉన్నాయి. ఈ బాధలను తట్టుకోలేక ఆత్మహత్యలు చేసుకుందామంటే వారికి ఆసరా ఇచ్చే వారు కూడా ఆ జైళ్లలో ఎవరూ లేరు. తాత్కాలికంగానైనా ప్రత్యక్ష నరకాన్ని మరచిపోయేందుకు బలవంతంగా కొకైన్కు బానిసలవుతున్నారు. వారికి కొకైన్ సరఫరా చేసేవారు కూడా పెత్తనం చెలాయించే ఖైదీలే. వీరిని ‘కీ హోల్డర్లు’ అని పిలుస్తారు. ఒక్కసారి కొకైన్ సరఫరా చేసినందుకు 80 రూపాయల నుంచి 800 రూపాయల వరకు వసూలు చేస్తారు. ఇందుకు అప్పులిచ్చి వారానికి ఇంతంటూ వడ్డీలు కూడా వసూలు చేస్తారు. ఇలాంటి నరక కూపంలో బతుకుతున్న బానిస ఖైదీలకు డబ్బులొచ్చే మార్గాలు కూడా ఉండవుగనుక వారి కుటుంబ సభ్యుల నుంచి పెత్తనం చెలాయించే ఖైదీలే వసూలు చేస్తారు. జైలుకు రక్షణగా ఉండే పోలీసులే అందుకు పావులుగా ఉపయోగపడతారు. వినిపించుకోని కుటుంబ సభ్యులను బయటి అరాచక శక్తులనుపయోగించి కీ హోల్డర్లు చంపిస్తారు. అందుకు సెల్ఫోన్లను కూడా యధేశ్చగా ఉపయోగిస్తారు. పెర్నాంబుకో రాష్ట్రంలోని నాలుగు జైళ్ల పరిస్థితిపై ‘హ్యూమన్ రైట్స్ వాచ్’ అనే అంతర్జాతీయ మానవ హక్కుల సంఘం ఇటీవల అధ్యయనం జరిపి నివేదికను వెల్లడించింది. వాటిలో కురాడో జైల్లో పరిస్థితి మరీ దారుణంగా ఉందని తెలిపింది. ఖైదీలను, వారి బంధు మిత్రులను, జైలు అధికారులను ఇంటర్వూలు చేసి ఈ ఘాతుకాలను వెలుగులోకి తీసుకొచ్చింది. జైల్లో తన కొడుకు కొకైన్ కోసం చేసిన అప్పు దాదాపు 40వేల రూపాయలను తాను చెల్లించానని సాండ్రా అనే తల్లి వెల్లడించింది. అందుకోసం ఇంట్లో ఉన్న అన్ని వస్తువులను అమ్మేశానని తెలిపింది. జైల్లో తన మేనళ్లుడిని తీవ్రంగా తోటి ఖైదీలే హింసించారని మారియా అనే ఓ మహిళ వెల్లడించింది. జరగబోయే పరిణామాలను దృష్టిలో పెట్టుకొని ఈ విషయాన్ని జైలు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లలేదని చెప్పింది. 64 మంది ఖైదీలం ఉంటున్న ఓ గదిలో తనపై గ్యాంగ్ రేప్ జరిగిందని 34 ఏళ్ల పావులో తెలిపారు. వారు కనీసం కండోమ్స్ కూడా ఉపయోగించరని, ప్రతిఘటిస్తే హింసిస్తారని వాపోయాడు. బ్రెజిల్లో ప్రతి లక్షమందిలో 870 మందికి ఎయిడ్స్ ఉంటే కురాడో జైల్లో 40 రెట్లు ఎక్కువ ఎయిడ్స్ రోగులు ఉన్నారని హ్యూమన్ రైట్స్ వాచ్ తెలిపింది. పెర్నాంబుకో జైళ్లలో 3,77,000 మందికి వసతి ఉండగా, 6,07,000 మంది ఖైదీలు ఉంటున్నారని పేర్కొంది. జైళ్లు కిక్కిర్సి ఉండడం వల్లనే ఈ దారుణ పరిస్థితులు నెలకొన్నాయని జైలు అధికారులు తెలియజేశారు. వాస్తవానికి కీ హోల్డర్లకు సకల సౌకర్యాలను కల్పిస్తోందని, విధులను నిర్లక్ష్యం చేస్తోందీ ఈ మూడవ జాతే. కొంత మంది జైలు అధికారులు డబ్బులకు ఆశపడి, మరికొంతమంది ప్రాణభీతితో దారుణాలను ప్రోత్సహిస్తున్నారు. -
మున్సిపాలిటీల్లో తిష్ఠవేసిన చెత్త
-
‘చెత్త’నగరం
- పారిశుధ్యంపై‘సమ్మె’ట - త్వరలో తాగునీటి సేవలు బంద్ - చేతులేత్తేసిన అధికారులు విజయవాడ సెంట్రల్ : నగరాన్ని చెత్త ముంచెత్తుతోంది. ఔట్సోర్సింగ్ కార్మికుల సమ్మె ఆదివారానికి మూడోరోజుకు చేరింది. దీంతో ఎక్కడి చెత్త అక్కడే పేరుకుపోయి దుర్గంధం వెదజల్లుతోంది. అంటువ్యాధులు ప్రబలుతాయోమోనని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. నగరంలో రోజుకు 550 మెట్రిక్ టన్నుల చెత్త ఉత్పత్తి అవుతోంది. ఈ లెక్కన 1,650 మెట్రిక్ టన్నుల చెత్త ఉత్పత్తి అవ్వగా కేవలం 200 మెట్రిక్ టన్నుల చెత్తను మాత్రమే పబ్లిక్‌హెల్త్ వర్కర్లు తొలగించగలిగారు. అంతర్గత రోడ్లు, ప్రధాన కూడళ్లలో చెత్త కుప్పలు మేట వేశాయి. పటమట, వన్‌టౌన్ ప్రాంతాల్లో డ్రెయిన్ల నుంచి మురుగు పొంగి పొర్లుతోంది. కాంట్రాక్ట్ పద్ధతిపై కార్మికుల్ని ఏర్పాటు చే ద్దామనుకున్న అధికారుల ప్రయత్నాలు బెడిసికొట్టాయి. ఈక్రమంలో ఎవరి చెత్త వారే ఎత్తుకోవాలంటూ కమిషనర్ జి.వీరపాండియన్ ఉచిత సలహా ఇచ్చి చేతులేత్తేశారు. స్వచ్ఛంద సంస్థలు, ఎన్జీవోల సహకారం తీసుకోవాలని ప్రజారోగ్యశాఖాధికారులను ఆదేశించారు. సమ్మె ఉధృతం ప్రభుత్వంలో చర్చలు విఫలమైన నేపథ్యంలో సమ్మెను ఉధృతం చేయాలని మునిసిపల్ వర్కర్ల యూనియన్ నేతలు నిర్ణయించారు. పట్టుబిగిస్తేనే సర్కార్ దిగివస్తోందని భావిస్తున్నారు. రాజకీయ పక్షాల భాగస్వామ్యాన్ని కూడగట్టేందుకు ప్రయత్నాలు సాగిస్తున్నారు. విపక్షాల సహకారంతో సమ్మెసెగను రగిలించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. త్వరలోనే రాజకీయ పక్షాలతో సమావేశాన్ని నిర్వహించాలని యూనియన్ నాయకులు నిర్ణయించారు. ఆదివారం వన్‌టౌన్‌లో ముఖ్యమంత్రి చంద్రబాబు దిష్టిబొమ్మను దగ్ధం చేసి నిరసన వ్యక్తం చేశారు. సోమవారం తుమ్మలపల్లి కళాక్షేత్రం నుంచి కలెక్టర్ క్యాంప్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించి ముట్టడి చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. సర్కార్‌తో తాడోపేడో తేల్చుకొనే వరకు సమ్మె కొనసాగించితీరతామని కార్మికులు స్పష్టం చేస్తున్నారు. అత్యవసర సేవలైన తాగునీటి సరఫరాను బంద్ చేయాలనే ఆలోచన చేస్తున్నారు. నగరపాలక సంస్థలో తాగునీటి సరఫరా విభాగంలో 60 శాతం మంది ఔట్సోర్సింగ్ కార్మికులే విధులు నిర్వర్తిస్తున్నారు. వీరు సమ్మెబాటపడితే నగరవాసులకు నీటి ఇబ్బందులు తలెత్తె ప్రమాదం ఉంది. -
రోడ్లపై చెత్తవేస్తే జరిమానా
- ఎవరి చెత్త వాళ్లే ఎత్తుకోవాలి - స్వచ్ఛంద సంస్థల సహకారం అవసరం - కమిషనర్ వీరపాండియన్ విజయవాడ సెంట్రల్ : పారిశుధ్య కార్మికుల సమ్మె నేపథ్యంలో ఎవరి చెత్త వాళ్లే ఎత్తుకునేలా చర్యలు చేపట్టాలని నగరపాలక సంస్థ కమిషనర్ జి.వీరపాండియన్ సూచించారు. ఆదివారం వన్‌టౌన్, కాళేశ్వరరావు మార్కెట్, బీఆర్పీ రోడ్డు, కొత్తపేట, చిట్టినగర్, కేదారేశ్వరపేట, రైతుబజార్, మ్యాంగోమార్కెట్ హనుమాన్‌పేట, కృష్ణలంక, రాజీవ్‌గాంధీ హోల్‌సేల్ మార్కెట్ ప్రాంతాల్లో ఆయన పర్యటించారు. రోడ్లన్ని చెత్తమయమై ఉండటాన్ని గమనించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మార్కెట్ సముదాయాలు, షాపింగ్ మాల్స్ నుంచి వచ్చే చెత్త, వ్యర్థాలను రోడ్లపై పడేయకుండా ఉండేలా ఆయా సంఘాల ప్రతినిధులతో చర్చించాల్సిందిగా చీఫ్ మెడికల్ ఆఫీసర్ ఎం.గోపీనాయక్‌కు సూచించారు. మార్కెట్లోని షాపుల యజమానులు ప్రత్యేక వాహనాన్ని ఏర్పాటు చేసుకుని డంపింగ్ యార్డుకు తరలించాలన్నారు. లేనిపక్షంలో ప్రజారోగ్య చట్టం ప్రకారం సంబంధిత షాపుల యజమానుల నుంచి అపరాధ రుసుం విధించాలన్నారు. కార్మికులు సమ్మెలో ఉన్న కారణంగా ప్రజలు రోడ్లపై, ఖాళీ స్థలాల్లో చెత్త పడేయొద్దని కమిషనర్ సూచించారు. ఎవరికి వారు స్వచ్ఛంధంగా చెత్తను దగ్గర్లోని డంపర్‌బిన్స్‌లో వేయాల్సిందిగా సూచించారు. పరిస్థితిని అర్థం చేసుకొని సహకరించాల్సిందిగా సూచించారు. డిప్యూటేషన్‌పై విధులు నిర్వర్తిస్తున్న పబ్లిక్‌హెల్త్ వర్కర్ల డిప్యుటేషన్‌ను రద్దు చేయాల్సిందిగా ఆదేశించారు. పీహెచ్ వర్కర్లు అందరూ తప్పనిసరిగా పారిశుధ్య విధులు నిర్వర్తించాలన్నారు. -
డెంగీ పంజా!
పారిశుద్ధ్య కార్మికుల సమ్మె ప్రభావం వీధుల్లో భారీగా పేరుకుపోయిన చెత్త విజృంభిస్తున్న దోమలు ముసురుతున్న వ్యాధులు సాక్షి, సిటీబ్యూరో: పారిశుద్ధ్య కార్మికులు ఆరు రోజులుగా సమ్మెలో ఉండడంతో నగరంలో ఎక్కడికక్కడ చెత్త పేరుకుపోయింది. దీనికి తోడు వీధుల్లోని రహదారులపై మురుగు నీరు నిల్వ ఉంటోంది. దీంతో దోమలు వ్యాప్తి చెంది... బస్తీల్లో డెంగీ, మలేరియా వ్యాధులు విజృంభిస్తున్నాయి. ఇటీవల కాటేదాన్ పరిధిలోని శ్రీరామ్‌నగర్ బస్తీకి చెందిన ఐదుగురు వ్యక్తులు డెంగీ బారిన పడినట్టు వైద్యులు తేల్చారు. తాజాగా కంచనపల్లికి చెందిన ఉప్పలయ్య(45), శివంపేటకు చెందిన రఘువీర్(28)కు డెంగీ సోకినట్టు తేలింది. ఇలా వారం రోజుల్లోనే ఎనిమిది మంది డెంగీ భారిన పడటంపై సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. నిర్మూలన చర్యలేవీ? వర్షాల వల్ల నివాసాల మధ్య మురుగు నీరు నిల్వ ఉండటంతో మలేరియా, డెంగీ దోమలు విజృంభిస్తున్నాయి. ఫాగింగ్ చేయక పోవడంతో కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. దీనికి తోడు రాత్రి వేళల్లో విద్యుత్ కోత విధిస్తుండడంతో ఇళ్లలో ఫ్యాన్లు తిరగడం లేదు. దీంతో దోమలు స్వైర విహారం చేస్తున్నాయి. మూసీ పరీవాహక ప్రాంతాలైన కూకట్పల్లి, లోయర్ ట్యాంక్ బండ్, అంబర్పేట్, సుల్తాన్‌బజార్, ముసారంబాగ్, మలక్‌పేట్, కొత్తపేట్, నాగోలు, ఉప్పల్, రామంతాపూర్, గోల్నాక, ఉస్మానియా క్యాంపస్ ప్రాంతాలతో పాటు సిటీ శివారుల్లోనూ దోమల బెడద ఎక్కువగా ఉంది. మరోవైపు కలుషిత నీరు, ఆహారం వల్ల డయేరియా కేసులూ పెరుగుతున్నాయి. వివిధ ప్రాంతాల్లోని ఆస్పత్రులకు రోగుల తాకిడి అధికమవుతోంది. -
మహా ‘చెత్త’గా..
అధ్వానంగా పారిశుద్ధ్యం నగర వాసులకు ప్రత్యక్ష నరకం గుట్టలుగా పేరుకుపోయిన చెత్త వీధులు దుర్గంధభరితం ‘అంటు’కోనున్న ‘వ్యాధులు’ ఇప్పటికే డెంగీ కేసులు నమోదు సిటీబ్యూరో: మహా నగరం నాలుగు రోజులుగా ‘చెత్త’మయమైపోయింది. ఎటు చూసినా కుప్పలుగా చెత్త దర్శనమిస్తోంది. ప్రధాన రహదారులపైన కూడా కొండల్లా పేరుకుపోయింది. జీహెచ్ఎంసీ కార్మికులు తమ సమస్యల పరిష్కారం కోసం సోమవారం నుంచి నిరవధిక సమ్మె చేస్తున్నారు. దీంతో పారిశుద్ధ్య పనులు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. వీధులన్నీ చెత్త కుప్పలతో నిండిపోయాయి. ఓ వైపు ‘స్వచ్ఛ హైదరాబాద్’ అంటూ ప్రభుత్వం నగరాన్ని శుభ్రం చేసేందుకు కసరత్తు చేస్తుంటే... మరోవైపు కార్మికుల సమ్మెతో పరిస్థితి అదుపు తప్పింది. ‘స్వచ్ఛ హైదరాబాద్’లో తొలగించిన చెత్తకు దాదాపు మూడింతలు మళ్లీ పోగయ్యింది. గత నాలుగు రోజులుగా చెత్తను తరలించేవారు లేక నగరం దుర్గంధభరితంగా మారింది. కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికే అంటువ్యాధులు మొదలయ్యాయి. దోమలు స్వైర విహారం చేస్తున్నాయి. ఈగలు ముసురుతున్నాయి. ఎక్కడికక్కడ కుళ్లిన చెత్తతో పరిస్థితి భయంకరంగా మారుతోంది. వర్షం లేకపోవడం కొంతలో కొంత ఉపశమనం. వర్షం పడితే పరిస్థితి మరింత అధ్వానంగా మారే ప్రమాదం పొంచి ఉంది. ఇప్పటికే ఐదుగురికి పైగా డెంగీబారిన పడ్డారు. మరోవైపు మలేరియా కేసులూ పెరుగుతున్నాయి. రహదారిపైనే... ఇందిరా పార్కు నుంచి ఆర్టీసీ క్రాస్ రోడ్డుకు వెళ్లే మార్గంలో అశోక్ నగర్ చౌరస్తా వద్ద మినీ చెత్త తరలింపు కేంద్రం మొత్తం చెత్తతో నిండిపోయింది. దీంతో మిగిలినది రోడ్లపైనే పడేస్తున్నారు. దీనివల్ల వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడుతోంది. ఆ మార్గంలో వెళ్లేవారు ప్రత్యక్ష నరకాన్ని చవిచూస్తున్నారు. నగరంలో పారిశుద్ధ్య పరిస్థితికి ఇది మచ్చుతునక. జీహెచ్ఎంసీలోని ఐదు జోన్లు, 18 సర్కిళ్లు.. దాదాపు 1500 బస్తీలు.. 900 కాలనీల్లో ఇదే దుస్థితి. ఎప్పటికప్పుడు తొలగించకపోవడంతో భారీగా చెత్తకుప్పలు పేరుకుపోయాయి. ఒక్కరోజు పారిశుద్ధ్య కార్యక్రమాలు నిలిచిపోతేనే భరించలేని పరిస్థితి. అలాంటిది నాలుగు రోజులుగా చెత్త కదలకపోవడంతో ప్రజల అవస్థలు వర్ణనాతీతం. కార్మికుల సమ్మె ఇంకా కొనసాగుతుండటంతో మున్ముందు పరిస్థితి ఎలా ఉంటుందో చెప్పే అవకాశం లేదు. కార్మికుల సమ్మెతో మిగతా కార్యక్రమాల సంగతిఅటుంచితే... పారిశుద్ధ్యం దారుణంగా దెబ్బతింది. ఇంటింటికీ వెళ్లి దోమల నివారణకు మందు చల్లే కార్మికులు సైతం విధులు బహిష్కరించారు. దీంతో దోమలు మరింతగా విజృంభించే పరిస్థితి నెలకొంది. డంపర్బిన్ల నుంచి చెత్త తొలగించేవారు లేకపోవడంతో వాటి వద్ద పరిస్థితి అత్యంత దారుణంగా ఉంది. సమ్మెలోని యూనియన్లు ఇవీ.... సమ్మెలో పాల్గొన్న యూనియన్లలో సీఐటీయూ, ఏఐటీయూసీ, బీఎంఎస్, హెచ్ఎంఎస్, ఐఎఫ్టీయూ, ఏఐయూటీయూసీ, టీఆర్ఎస్ కేవీ, టీఎన్టీయూసీలతోపాటు జీహెచ్ఎంఈయూ ఉన్నాయి. 16 డిమాండ్లతో ఇవి సమ్మె చేస్తున్నాయి. కార్మికుల పక్షమే జీహెచ్ఎంసీ కార్మికుల డిమాండ్ల పరిష్కారానికి ప్రభుత్వం వెంటనే నిర్ణయం తీసుకోవాలి. వారి సమస్యల పరిష్కారానికి లిఖితపూర్వక హామీనివ్వాలి. కనీస వేతనాన్ని రూ.16,500కు పెంచాలి. కార్మికులపై ప్రేమ ఉందని చెప్పిన మాటలను అమలు చేయాలి. - యు.గోపాల్ (అధ్యక్షుడు, అధికార పార్టీ అనుబంధ యూనియన్ జీహెచ్ఎంఈయూ) డిమాండ్లు తీర్చాల్సిందే కార్మికుల డిమాండ్లు తీర్చేంత వరకు సమ్మె ఆగదు. అన్ని సర్కిళ్లలో శుక్రవారం అర్థనగ్న ప్రదర్శనలు నిర్వహిస్తాం. అప్పటికీ పరిష్కరించకుంటే ఇందిరా పార్కు వద్ద మహాధర్నా చేపడతాం. జీహెచ్ఎంసీ కమిషనర్ మంత్రులను తప్పుదోవ పట్టిస్తున్నారు. ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు ఇచ్చిన జీవోలు ఇప్పుడు చెల్లవంటున్నారు. కమిటీ వేయకుండా, పీఆర్ సీ వర్తింపజేయకుండా కాలయాపన చేస్తున్నారు. బెదిరింపులు మంచిది కాదు. - శంకర్, ఆర్గనైజింగ్ సెక్రటరీ, బీఎంఎస్ సమస్యలు పరిష్కరించాలి వివిధ విభాగాల్లో కార్మికులు సమస్యల పరిష్కారానికి ఆందోళనలు చేస్తున్నా ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోంది. జీహెచ్ఎంసీ పారిశుద్ధ్య కార్మికుల సేవలను తల్లి సేవలతో పోల్చిన సీఎం కేసీఆర్.. వారి సమస్యలు పరిష్కరించడంపై శ్రద్ధ చూపడం లేదు. వారికి పీఆర్సీ వర్తింపజేయాలి. ఉస్మానియాలో, వాటర్‌బోర్డులో సైతం ఉద్యోగులు తమ సమస్యల కోసం ధర్నాలు చేస్తున్నారు. ఈ ప్రభుత్వ హయాంలో ఏ ఒక్కరి సమస్యలూ తీర్చనందునే ధర్నాలు, ఆందోళనలు నిత్యకృత్యమయ్యాయి. ఇకనైనా ప్రభుత్వం సానుకూలంగా స్పందించాలి. - ఆనంద్ కుమార్ గౌడ్, టీడీపీ అధికార ప్రతినిధి మే 17 నుంచి 20వ తేదీ వరకు జరిగిన స్వచ్ఛ హైదరాబాద్‌లో 6,316 మెట్రిక్ టన్నుల అదనపు చెత్తను తొలగించారు. నిత్యం వెలువడేది కాక అదనంగా ఉన్న దానిని తొలగించడంతో నగరం పరిశుభ్రంగా మారుతుందని అందరూ ఆశించారు.సాధారణ రోజుల్లో జీహెచ్ఎంసీ నుంచి నిత్యం 3,800 మెట్రిక్ టన్నుల చెత్తను జవహర్ నగర్ డంపింగ్ యార్డుకు తరలిస్తున్నారు. రంజాన్, తదితర పండుగల సమయాల్లో అదనపు చెత్త వెలువడటం రివాజు. ఇలా నాలుగు రోజులుగా ఎక్కడి చెత్త అక్కడే గుట్టలుగా పోగుపడుతోంది. దీంతో దాదాపు 16వేల మెట్రిక్ టన్నులు పేరుకుపోయింది. -
‘స్వచ్ఛ'...ఇక నిత్యం!
నెలలో ఒక రోజు అధికారులు వస్తారు {పజల సమస్యలు తెలుసుకుంటారు ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటన మండుటెండలో పర్యటన ముగిసిన ‘స్వచ్ఛ హైదరాబాద్’ సిటీబ్యూరో: గ్రేటర్ నగరంలో రెండు లక్షల మంది నిరుపేదలకు డ బుల్ బెడ్ రూమ్ ఇళ్ల నిర్మాణం.. లక్ష మందికి ఇళ్ల పట్టాల మంజూరు..చెత్తపై యుద్ధం... పరిశుభ్రతపై మహోద్యమం.... మార్కెట్లు.. బస్తీలు.. మురికివాడల అభివృద్ధికి హామీలు.. ఇవీ చివరి రోజైన బుధవారం ‘స్వచ్ఛ హైదరాబాద్’ విశేషాలు. మండుటెండను సైతం లెక్క చేయకుండా సీఎం కేసీఆర్ నగరంలో ఏకంగా పదికి పైగా ప్రాంతాలను సందర్శించారు. ప్రజలతో మమేకమయ్యారు. స్థానికుల సమస్యలను ఓపికగా అడిగి తెలుసుకున్నారు. వారి నుంచి వినతిపత్రాలను స్వీకరించారు. పేదలకు గృహాలను నిర్మించేందుకు తమ ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందని స్పష్టం చేశారు. స్వచ్ఛ హైదరాబాద్ నాలుగు రోజులతోనే అయిపోదని.. నెలలో ఒక రోజు అధికారులే ప్రజల వద్దకు వచ్చి వారి సమస్యలపై వినతిపత్రాలు స్వీకరించి... వాటిని పరిష్కరిస్తారని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమం ద్వారా అధికారుల దృష్టికి వచ్చిన సమస్యలపై మేథోమథనం చేసి... సమస్య మూలాలకు వెళ్లి... పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. పాత నగరం సహా శివార్లలోని ఉప్పల్, ఎల్బీ నగర్, మహేశ్వరం, మల్కాజ్గిరి నియోజకవర్గాల్లో ఆయన సుడిగాలి పర్యటన చేశారు. -
'చెత్త' బజార్లు!
హైదరాబాద్: ఓ వైపు 'స్వచ్ఛ భారత్' అంటూ సర్కార్ హడావుడి చేస్తుంటే... మరోవైపు పారిశుద్ధ్యంపై మార్కెటింగ్ శాఖ అధికారుల చిత్తశుద్ధి వాస్తవ పరిస్థితికి అద్దం పడుతోంది. నిత్యం వినియోగదారులతో రద్దీగా ఉండే పలు రైతుబజార్లలో నిర్లక్ష్యం తాండవిస్తోంది. ఇవి అపరిశుభ్రతకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచాయి. రోజుల తరబడి చెత్తను తొలగించని కారణంగా దుర్గంధం వెదజల్లుతూ వినియోగదారులకు అసౌకర్యాన్ని కలిగిస్తున్నారు. ఎర్రగడ్డ మోడల్ రైతుబజార్లో పరిస్థితి మరీ దారుణంగా ఉంది. ఇక్కడి చెత్తను ఏరోజుకారోజు తొలగించకపోవడంతో ఆ ప్రాంతం దుర్గంధమయమైంది. వినియోగదారులు ముక్కు మూసుకొని కూరగాయలు కొనాల్సిన దుస్థితి ఏర్పడింది. గత్యంతరంలేని పరిస్థితుల్లో రైతులు ముక్కుకు గుడ్డకట్టుకొని అక్కడే విక్రయూలు సాగిస్తున్నారు. ఇక్కడ పోగయ్యే చెత్తను ఒక్కరోజు తొలగించకపోరుునా మరునాడు పరిస్థితి దుర్భరంగా తయూరవుతోంది. కాంట్రాక్టు గడువు ఈ నెలాఖరుతో ముగియనుండటంతో ఇక్కడి చెత్తను తొలగించడంపై కాంట్రాక్టర్ శ్రద్ధ చూపట్లేదని తెలుస్తోంది. నెలకు సుమారు రూ.55 వేలకు పైగా బిల్లు చెల్లిస్తున్నా ఎక్కడి చెత్త అక్కడే ఉండటం వాస్తవ పరిస్థితికి దర్పణం పడుతోంది. తగినంతమంది సిబ్బందిని ఏర్పాటు చేయకపోవడంతో రైతుబజార్లో చెత్త గుట్టలుగా పేరుకుపోయింది. దీనికితోడు అక్కడ ఏర్పాటు చేసిన డస్ట్‌బిన్స్‌ను ఏరోజు కారోజు తొలగించాల్సిన మున్సిపల్ సిబ్బంది పట్టించుకోకపోవడంతో కూరగాయలు కుళ్లిపోరుు భరించలేని విధంగా దుర్వాసన వెదజల్లుతోంది. క్యాబేజీ, కాలీఫ్లవర్, ఇతర ఆకుకూరలు, కూరగాయల వ్యర్థాలు ఎర్రగడ్డ రైతుబజార్లో అడుగడుగునా కన్పిస్తున్నాయి. అన్నింటా అదే పరిస్థితి... నగరంలోని మిగతా రైతుబజార్లలో పారిశుద్ధ్యం పరిస్థితి ఇలాగే ఉంది. కూకట్పల్లి రైతుబజార్లో చెత్త తొలగింపు కాంట్రాక్టును కొత్తగా చేపట్టిన వ్యక్తి తగినంతమంది సిబ్బందిని నియమించట్లేదని తెలిసింది. ఇక్కడ పెద్దమొత్తంలో పోగయ్యే చెత్తను బయటకు తరలించే బాధ్యతను కూడా అతనికే అప్పగించారు. అయితే... ఈ తరలింపు ఒక్కరోజు ఆగినా పరిస్థితి ఘోరంగా తయారవుతోంది. ప్రైవేటు కాంట్రాక్టర్లు తగినంత వేతనం ఇవ్వట్లేదన్న కారణంతో పలు రైతుబజార్లలో పనిచేస్తున్న స్వీపర్లు మధ్యలోనే మానేస్తున్నారు. దాంతో సరూర్‌నగర్, అల్వాల్, వనస్థలిపురం, మీర్పేట్, ఫలక్‌నుమా రైతుబజార్లలో పరిస్థితి అధ్వానంగా మారింది. తగినంతమంది సిబ్బంది లేని కారణంగా 2, 3 రోజులకోసారి ఈ పనులు జరుగుతుండటంతో పలు రైతుబజార్ల ఆవరణ అంతా అపరిశుభ్రంగా మారుతోంది. యూజర్ చార్జీకి డిమాండ్ రైతుబజార్లలో పోగయ్యే చెత్తను తొలగించేందుకు యూజర్ చార్జీలు చెల్లించాలంటూ జీహెచ్ఎంసీ సిబ్బంది డిమాండ్ చేస్తున్నారు. రంగారెడ్డి జిల్లా పరిధిలోని రైతుబజార్ల నుంచి చెత్తను ఉచితంగానే తొలగిస్తున్నా.... హైద రాబాద్ పరిధిలోని ఎర్రగడ్డ రైతుబజార్ కాంట్రాక్టర్ నుంచి నెలకు రూ.2వేలు జీహెచ్ఎంసీ సిబ్బంది వసూలు చేస్తున్నట్లు సమాచారం. మిగతా రైతుబజార్లు కూడా యూజర్ఛార్జీ చెల్లిస్తేనే డస్ట్‌బిన్స్ ఏర్పాటు చేస్తామని అక్కడి శానిటరీ ఇన్స్పెక్టర్లు తెగేసి చెబుతుండటంతో రైతుబజార్ సిబ్బంది బిక్కమొహం వేస్తున్నారు. -
ఈ చెత్త మాకొద్దు..
విజయనగరం : ఈ చెత్త మాకొద్దంటూ పార్వతీపురం సర్కిల్ ఇన్స్పెక్టర్ కార్యాలయం ఎదుట బుధవారం రావికోనబట్టివలస గిరిజనులు ఆందోళన చేశారు. పార్వతీపురం మున్సిపాలిటీ చెత్తను డంపింగ్ చేయడానికి రావికోనబట్టివలస వద్ద డంపింగ్ యార్డును ఏర్పాటు చేయనున్నారు. అందుకోసం మున్సిపాలిటీ అధికారులు సన్నాహాలు చేస్తుండటంతో గిరిజనులు నిన్న రోడ్డుపై వాహనాలను అడ్డుకున్నారు. ఈ ఆందోళనలో చుట్టుపక్కల ఉన్న ఆరు గ్రామాల సర్పంచ్‌లతో పాటు గిరిజనులు పాల్గొన్నారు. ఈ చెత్తతో మాకు నిరంతరం దుర్గంధంతో పాటు రోగాలు వస్తాయని, చెత్తను పాత డంపింగ్ యార్డు వద్దే వేయాలని వారు కోరారు. (పార్వతీపురం) -
చెత్త పేరుకుపోకుండా ‘జీరో అవర్’
జీహెచ్ఎంసీ కొత్త విధానం క్లీన్‌సిటీ అమలులో భాగంగా చర్యలు.. సిటీబ్యూరో: నగరంలో పారిశుధ్యకార్యక్రమాలు మెరుగుపరచేందుకు ఇప్పటికే వివిధ చర్యలకు శ్రీకారం చుట్టిన జీహెచ్ఎంసీ తాజాగా చెత్త రవాణా కేంద్రాల్లో చెత్త గుట్టలుగా పేరుకుపోకుండా ఏరోజుకారోజే అక్కడి నుంచి చెత్తను జవహర్‌నగర్ డంపింగ్‌యార్డుకు తరలించేందుకు చర్యలు చేపట్టింది. ప్రతిరోజు సాయంత్రం 4 గంటల సమయాన్ని ‘జీరో అవర్’గా పరిగణిస్తూ, ఆ సమయానికల్లా రవాణా కేంద్రంలో చెత్త అనేది కనిపించ కుండా చేయాలని నిర్ణయించారు. నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి చెత్తను రవాణాకేంద్రాలకు తరలిస్తున్నప్పటికీ, అక్కడి నుంచి జవహర్‌నగర్ యార్డుకు తరలించడంలో జాప్యం జరుగుతోంది. దాంతో రవాణాకేంద్రం పరిసరాల్లో చెత్త గుట్టలు పేరుకుపోయి పరిసరాల్లో దుర్గంధం వెలువడుతుండటంతో పాటు దోమల బెడద తీవ్రమవుతోంది. ఈ సమస్యల పరిష్కారంతోపాటు నగరాన్ని క్లీన్‌సిటీగా చేసేందుకు జీరోఅవర్ విధానాన్ని పాటిస్తున్నట్లు జీహెచ్ఎంసీ కమిషనర్, స్పెషలాఫీసర్ సోమేశ్‌కుమార్ శుక్రవారం విలేకరులకు తెలిపారు. -
మనకేదీ చెత్తశుద్ధి!
ఝాన్సీ కి వాణీ వట్టిమాటలు కట్టిపెట్టోయ్.. గట్టిమేల్ తలపెట్టవోయ్ !! వెన్నుతట్టి లేపిన చిరు పట్టణంలోని చెత్త మూటల నిర్వహణ ముందు మహానగర పెద్దరికం చిన్నబోయింది. గతవారం ఓ సినిమా షూటింగ్ కోసం బొబ్బిలిలో ఉన్నాను. విజయనగరం జిల్లాలోనే ప్రత్యేక స్థానం సంపాదించిన బొబ్బిలిలో విశేషాలన్నీ ఒక్కొక్కటిగా చూస్తున్నాను. బొబ్బిలి కోట, వేణుగోపాల స్వామి దేవాలయం, వీణల తయారీ అన్నీ చూసి చివరగా అక్కడి బెల్లం కూడా బావుంటుందని ఓ బెల్లం బట్టీలో వేడి వేడి బెల్లం కొన్నాను. మట్టి ముంతలోని మెత్తని బెల్లం ముచ్చటగా ఉంది. రాత్రికి గట్టి పడుతుందని జాగ్రత్తగా పట్టుకుని కోటలో షూటింగ్‌కు వెళ్లిపోయాను. ముంత మీద కవర్ కట్టి సీల్ చేయడానికి ఏదైనా పాలిథిన్ కవర్ ఉంటే ఇవ్వమని ఆ కోటలో పని చేస్తున్న సూపర్వైజర్ను అడిగాను. వెంటనే కోటలో హడావిడి మొదలైంది. మేడంగారు మైకా కవర్ అడిగారంటూ కోటంతా పాకిపోయింది. ఇంత చిన్న విషయానికి అంత హడావిడి ఎందుకో అర్థం కాలేదు. చివరికి అక్కడి వంట మనిషి నా దగ్గరకొచ్చి ‘ఎందుకమ్మ మైకా కవర్ కోసం అందరినీ ఇబ్బంది పెడతావు, పేపర్ తెచ్చి తాడుతో కట్టేసుకోవచ్చును కదా’ అని జ్ఞానోపదేశం చేసింది. బొబ్బిలిలో నో పాలిథిన్.. ఇంతకీ మైకా కవర్ వెనుక ఈ హడావిడి ఏంటంటే బొబ్బిలి మున్సిపాలిటీలో పాలిథిన్ నిషేధం. ఇందులో వింతేముంది. మన దగ్గర కూడా ఇంతే కదా అనుకోకండి. ఇక్కడ మనం చుట్టూ ఉన్నా కూడా పట్టించుకోం. అక్కడి ప్రజలు చట్టాన్ని వంట బట్టించుకున్నారు. తు.చ. తప్పకుండా నియమ నిబంధనలను పాటిస్తూ పాలిథిన్ కవర్లు, గ్లాసులు, ప్లేట్లు వంటి వాటిని తమ జీవితాల నుంచి తుడిచి వేసిన ఈ నవనాగరికులను చూసి ఎంతో గర్వపడ్డాను. అక్కడ పర్యావరణం కేవలం నినాదం కాదు జీవన విధానం. నేను కలసిన ఈ కోటలోని ఉద్యోగులే కాదు బయటకు వచ్చి ఎవరిని కదిపినా ఇదే సమాధానం వచ్చింది. అక్కడ పాలిథిన్ వాడినా, రోడ్డుపై చెత్త వేసినా జరిమానా కట్టాల్సిందే. ఇందులో అమలుపరుస్తున్న యంత్రాంగం పాత్ర ఎంతుందో ప్రజల భాగస్వామ్యం కూడా అంతే ఉంది. మహానగరంలో నివసిస్తున్న మహానుభావులంతా.. నాగరికతకు ఆనవాళ్లు అని చాటుకునే వారు దూరంగా విసిరేనట్టున్న మున్సిపాలిటీ నుంచి నేర్చుకోవాల్సింది ఎంతో ఉంది. తడిని తరిమి.. బొబ్బిలి మున్సిపాలిటీలో ప్రతి ఇంటి నుంచి చెత్త సేకరించేటప్పుడే తడి చెత్తని వేరు చేసే బాధ్యతని ప్రజలే అలవరుచుకున్నారు. ఆరెంజ్, బ్లూ రెండు రంగుల బుట్టలో చెత్తను సేకరించి డంపింగ్ యార్డ్‌కు తరలిస్తారు. సారీ, అది డంపింగ్ యార్డ్ అంటే వారు ఒప్పుకోరు. దాని పేరు ఎస్డబ్ల్యూఎమ్ (సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్) పార్క్. నిజంగానే అది సుందరవనంగా కనిపించింది. మన హైదరాబాద్ జవహర్‌నగర్‌లోని డంపింగ్ యార్డ్‌ని బాగుచేయడం ఆ భగవంతుడి తరం కూడా కాదేమో అని అనుమానం వస్తుంది. ఎంత ఆధునిక టెక్నాలజీ సాయం ఉందనుకున్నా.. మన చెత్త కొండలా పేరుకుపోతోంది. ప్రజల భాగస్వామ్యం పెరగనంత వరకూ హైదరాబాద్‌లోని చెత్తకు పరిష్కారం దొరకదు. స్టిక్ ఫర్ నో ప్లాస్టిక్.. ప్లాస్టిక్, పాలిథిన్ మన చెత్తలో అత్యంత పెద్ద సమస్య. దాని నియంత్రణ వినియోగం దగ్గరే జరగాలి. మైక్రాన్ల పెరుగుదల ఒక్కటే పాలిథిన్‌కు పరిష్కారం కాదు. రీసైక్లింగ్ వరకూ రాని ప్లాస్టిక్ ఎటు చూస్తే అటు పేరుకుపోతోంది. పార్కులు, చెరువులు, గుట్టలు, మైదానాలు, నాలాలు.. ఎటు చూసినా ప్లాస్టిక్ మయం. దీనికి పూర్తి విరుద్ధంగా బొబ్బిలి పరిసర ప్రాంతాల్లో ఎక్కడా పాలిథిన్ కనబడదు. వస్తువు కొనాలన్నా, చెత్త మూట కట్టాలన్నా.. కవర్లు కావాలనుకుంటే డబ్బుకు సైతం వెనుకాడకుండా కొనేస్తాం. టీ తాగాలన్నా, పార్సిల్ చేయాలన్నా, పార్టీలైనా ప్లాస్టిక్‌ని యూజ్ అండ్ త్రోగా వాడేస్తాం. కన్వీనియన్స్ మాట అటుంచితే.. చెత్తభారం ఎంత పెచుతున్నామో కనీసం ఆలోచించం. పెరుగుతున్న క్యాన్సర్‌కి పాలిథిన్, ప్లాస్టిక్ వినియోగానికి ఉన్న సంబంధం గురించి తెలిసినా తేలిగ్గానే తీసుకుంటున్నాం. లక్షల్లో ఉన్న జనాభాకి వేలల్లోని జనాభా స్ట్రాటజీలు ఉపయోగ పడకకోవచ్చు. కాని, గ్రామీణ ప్రజలకు ఉన్న అవగాహన నగరవాసుల్లో ఎందుకు లేదు ? అన్నింట్లోనూ ఆధునికంగా జీవిస్తున్న మనం ఇందులో మాత్రమే ఎందుకు వెనుకబడి ఉన్నాం. బొబ్బిలి పరిశుభ్రతలో పది శాతం అయినా పురోగతి హైదరాబాద్ సాధించాలంటే వంద శాతం ప్రజల భాగస్వామ్యం కావాలి. లెట్స్ స్టార్ట్ టు డే! facebook.com/anchorjhansi ఫొటో: ఎస్.ఎస్.ఠాకూర్ -
కుప్పకూలిన ఇళ్లు,కొట్టుకుపోయిన రోడ్లు