ప్రపంచంలోనే ఢిల్లీ వరస్ట్!
వాయు కాలుష్య నగరాల్లో భారత రాజధాని ఢిల్లీ నగరం ప్రపంచంలోనే మొదటి స్థానంలో నిలిచినట్లు వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ (WHO) తాజా నివేదికల్లో వెల్లడించింది. ప్రపంచవ్యాప్తంగా ప్రతి సంవత్సరం మిలియన్ల కొద్దీ జనం కేవలం కాలుష్య వాతావరణం కారణంగానే చనిపోతున్నట్లు నివేదించింది. విశ్వ వ్యాప్తంగా నమోదవుతున్న ప్రతి నాలుగు మరణాల్లో ఒకటి కాలుష్య కారణంగానే జరుగుతున్నట్లు సర్వేల్లో తేలింది.
ఢిల్లీ నగరం ప్రపంచంలోనే వరస్ట్ ప్లేస్ అని... వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ తాజా లెక్కలు చెప్తున్నాయి. ప్రతి సంవత్సరం ప్రపంచ వ్యాప్తంగా నమోదవుతున్న 12.6 మిలియన్ల మరణాల్లో రెండొంతులు, అంటే 8.2 మిలియన్ల ప్రజలు అనారోగ్య వాతావరణం కారణంగా వచ్చే గుండెజబ్బులు, శ్వాసకోశవ్యాధులు, క్యాన్సర్ వంటి రోగాలతోనే చనిపోతున్నారని డబ్ల్యూ హెచ్ ఓ నివేదికలు చెప్తున్నాయి. మరోవైపు యూఎన్ ఓ ప్రజారోగ్య వింగ్ లెక్కల ప్రకారం ఆగ్నేయ ఆసియాలో ఏడాదికి 3.6 మిలియన్ మరణాలు సంభవిస్తున్నట్లు తెలుస్తోంది. డబ్ల్యూ హెచ్ ఓ లెక్కల్లో ఆగ్నేయాసియాలోని బాంగ్లాదేశ్, భూటాన్, ఉత్తర కొరియా, ఇండోనేషియా, మాల్దీవులు, మయన్మార్, నేపాల్, శ్రీలంక, థాయిలాండ్ లతో పోలిస్తే భారతదేశః చాలా పెద్దది. 2006 లెక్కల ప్రకారం చూస్తే మొత్తం 13 మిలియన్ల మరణాలు పెరిగినట్లు లెక్కలు చెప్తున్నాయి. పారిశుద్ధ్య లోపం, అపరిశుభ్ర నీరు వల్ల తలెత్తే ఇన్ఫెక్షన్లు, మలేరియా, డయేరియా వంటి రోగాలకు ముఖ్యంగా వాయు కాలుష్యమే కారణమని చెప్తున్నారు. ఈ కాలుష్యం చిన్నా పెద్దా తేడా లేకుండా ప్రతివారిపైనా పడుతున్నట్లు తెలిపారు. మంచి పర్యావరణంతో సంవత్సరంలో 1.7 మిలియన్ల 5 ఏళ్ళ లోపు పిల్లలను, 4.9 మిలియన్ల 50 నుంచి 75 ఏళ్ళ లోపు వయసున్న పెద్దలను రక్షించుకోవచ్చని ప్రపంచ ఆరోగ్య సంస్థ లెక్కలు చెప్తున్నాయి. ముఖ్యంగా ఐదేళ్ళలోపు పిల్లలు, ఏభై ఏళ్ళు దాటిన వారిపైనే వాతావరణ కాలుష్య ప్రభావం అధికంగా ఉంటోందని లెక్కలు తెలియజేస్తున్నాయి.
ముఖ్యంగా 2014 లోని ప్రపంచ ఆరోగ్య సంస్థ ఎయిర్ క్వాలిటీ డేటాబేస్ ను బట్టి చూస్తే... 91 దేశాలు 1600 నగరాల్లో వాతావరణ, వాయు కాలుష్యాలకు పెట్టింది పేరని, ప్రపంచంలోనే గాలి నాణ్యతకు వరస్ట్ ప్లేస్ గా బహిరంగ చర్చ ద్వారా ఢిల్లీని ప్రకటించింది. గాలి నాణ్యతలో కరాచీ 117UG/m3, ఢాకా 86UG/m3, బీజింగ్ 56ugm/m3 లతో పోలిస్తే.... డబ్ల్యూ హెచ్ ఓ ప్రకారం సంవత్సరానికి కేవలం 10ug/m3 మాత్రమే కలిగి ఉండాల్సిన ఢిల్లీ.. MP 2.5 స్థాయిలో మొదటిస్థానంలో నిలిచింది. ముఖ్యంగా ఊపిరితిత్తులకు, రక్త ప్రసరణకు నష్టం చేకూర్చి, ఆస్తమా, గుండె జబ్బులకు కారణమయ్యే 'అల్ట్రా ఫైన్' ధూళితో నగరం నిండి ఉన్నట్లు తేల్చింది. ఈ పరిస్థితిని మార్చి స్థానిక ప్రజల ఆరోగ్యాలను కాపాడాలంటే ప్రతి ఒక్కరూ పర్యావరణ పరిరక్షణకు సహాయ పడే ప్రయత్నం చేయాలని, నగరంలో వాక్ వేస్, సైక్లింగ్ రూట్స్ ఏర్పాటు చేసి, కాలుష్యాన్ని నివారించే ప్రయత్నం చేయాలని నిపుణులు సూచిస్తున్నారు.