ఒకే ఇంట్లో ఎనిమిదేళ్లుగా 8 ట్రక్కుల మేర చెత్త పేరుకుపోయింది. దీనికి కారణం 80 ఏళ్ల బామ్మ.
ముంబై: ఒకే ఇంట్లో ఎనిమిదేళ్లుగా 8 ట్రక్కుల మేర చెత్త పేరుకుపోయింది. దీనికి కారణం 80 ఏళ్ల బామ్మ. ఆమె అనారోగ్యానికితోడు ఆ ఇంటిని శుభ్రం చేసే నాథుడులేకపోవడంతో చెత్త గుట్టలుగా పోగైంది. ముంబై శివారులోని ఓ ఇంటి నుంచి భరించలేని దుర్వాసన వస్తోందని హౌసింగ్ సొసైటీ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు వచ్చి చూసేసరికి రెండు వేల చదరపు అడుగుల మేర మూడు గదుల నిండా చెత్త, శిథిలాలు గుట్టలుగా దర్శనిమిచ్చాయి.
శిథిలాల మధ్యన బెడ్‌పై 80 ఏళ్ల వృద్ధురాలు అచేతనంగా పడి ఉంది. ఎనిమిది ట్రక్కుల సహాయంతో చెత్తను, శిథిలాలను తొలగించామని, వృద్ధురాలిని స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించామని పోలీసులు తెలిపారు.