బతుకు భారమై.. బడికి దూరమై..
విద్యాహక్కు చట్టాన్ని పటిష్టంగా అమలు చేస్తున్నామని.. బడి ఈడు పిల్లలందరూ బడిలోనే ఉండేటట్లు చేస్తున్నామని ప్రభుత్వం చెబుతున్న చెబుతున్న మాటలు నీటిమూటలే అవుతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా ‘బడి పిలుస్తోంది’ కార్యక్రమం నిర్వహిస్తున్న వేళ.. రామచంద్రపురానికి చెందిన ఇద్దరు బాలురు రాయవరంలో చెత్త ఏరుకుంటూ.. పెదపూడి మండలం పైన గ్రామానికి చెందిన బాలలు చెత్త ఏరుకోవడానికి రిక్షాపై వి.సావరం వెళ్తూ. ఇలా కనిపించారు. బతుకు భారమై.. బడిబాట పట్టాల్సిన బాల్యం చెత్తకుప్పలపాలవుతోంది. చట్టాలెన్ని ఉన్నా అక్కరకు రావడం లేదనడానికి ఇటువంటి చిత్రాలు సాక్షీభూతంగా నిలుస్తున్నాయి. - రాయవరం