బిహార్‌లో తొలి సెమీకండక్టర్ కంపెనీ సురేష్ చిప్స్ అండ్ సెమీకండక్టర్ ప్రైవేట్ లిమిటెడ్. నాలుగేళ్ల క్రితం ఈ సంస్థ ఏర్పాటైంది. అయితే బిహార్‌లో కంపెనీ పెట్టడం తన జీవితంలో "అత్యంత చెత్త నిర్ణయం" అని వాపోతున్నాడు ఆ కంపెనీ వ్యవస్థాపకుడు, సీఈవో అయిన చందన్ రాజ్. ఈ మేరకు ‘ఎక్స్’ (ట్విటర్)లో ఆయన ఓ పోస్ట్ పెట్టారు.
బిహార్‌ను "ల్యాండ్ ఆఫ్ ఫ్రస్టేషన్"గా పేర్కొన్న చందన్ రాజ్ అక్కడ సెమీకండక్టర్ కంపెనీ నడపడానికి అష్టకష్టాలు పడుతున్నట్టు వాపోయారు. ఆ ప్రాంతంలో మౌలిక సదుపాయాలు లేకపోవడంతో తన కంపెనీతో కలిసి పనిచేయడానికి క్లయింట్స్ ఎవరూ ముందుకు రావడం ఆవేదన వ్యక్తం చేశారు. రోడ్డు, మౌలిక సదుపాయాల కోసం గత నాలుగేళ్లుగా ఎదురు చూస్తున్నానని, ఎవరూ సహాయం చేయలేదన్నారు. బిహార్ ప్రభుత్వం సెమీకండక్టర్ పరిశ్రమలను అర్థం చేసుకోలేదని రాసుకొచ్చారు. స్థానిక గ్యాంగ్‌స్టర్ బెదిరిస్తే పోలీసులు కూడా పట్టించుకోరంటూ చందన్ రాసుకొచ్చారు.
ఎవరీ చందన్ రాజ్?
సెమీకండక్టర్ స్టార్టప్ వ్యవస్థాపకుడైన చందన్ రాజ్.. తన లింక్డ్‌ఇన్ ప్రొఫైల్ ప్రకారం, ఒడిషాలోని బిజూ పట్నాయక్ యూనివర్శిటీ ఆఫ్ టెక్నాలజీ నుండి ఎలక్ట్రానిక్స్ & టెలికమ్యూనికేషన్‌లో బ్యాచిలర్ డిగ్రీతో 2009లో పట్టభద్రుడయ్యారు.
శాంసంగ్ ఎలక్ట్రానిక్స్, మలేషియా, ఇజ్రాయెల్‌లోని ఇంటెల్, రొమేనియాలోని సిలికాన్ సర్వీస్ ఎస్‌ఆర్‌ఎల్, షాంఘైలో నోకియా బెల్ ల్యాబ్స్, ఎన్‌ఎక్స్‌పీలతో సహా వివిధ సాంకేతిక సంస్థలలో ఇంజనీరింగ్, నిర్వాహక పాత్రలలో పనిచేశారు. 2020 డిసెంబర్‌లో బిహార్‌లోని ముజఫర్‌పూర్‌లో సురేష్ చిప్స్ అండ్ సెమీకండక్టర్ సంస్థను ఏర్పాటు చేశారు.
Bihar - The land of frustration.
Lots of problems and struggle to survive here as a semiconductor/VLSI Company.
Worst decision of my life to start a company in Bihar— Chandan Raj (@ChandanRaj_ASIC) October 9, 2024
Comments
Please login to add a commentAdd a comment