అత్యంత అధ్వాన్న పీఎస్‌యూలు ఏవో తెలుసా? | BSNL, Air India, MTNL worst performing PSUs in FY 17 | Sakshi
Sakshi News home page

అత్యంత అధ్వాన్న పీఎస్‌యూలు ఏవో తెలుసా?

Published Tue, Mar 13 2018 8:23 PM | Last Updated on Wed, Mar 14 2018 8:24 AM

BSNL, Air India, MTNL worst performing PSUs in FY 17 - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ సంస్థలు బీఎస్ఎన్ఎల్, ఎయిర్ ఇండియా, ఎంటిఎన్ఎల్ సంస్థలు అప్రతిష్టపాలైన కంపెనీలుగా నిలిచాయి.  2016-17 ఆర్థిక సంవత్సరంలో భారీ నష్టాలతో ఫెర్‌పామెన్స్‌లో అత‍్యంత  అధ్వాన్న  పీఎస్‌యూలుగా  నిలిచాయి. మరోవైపు ఇండియన్‌ ఆయిల్‌, ఓఎన్‌జీసీ,కోల్‌ ఇండియా అత్యధిక లాభాలను సాధించిన కంపెనీలుగా నిలిచాయి. ప్రభుత్వ మంగళవారం పార్లమెంటులో ప్రవేశపెట్టిన సర్వే ద్వారా  ఈ విషయాలు  వెల్లడయ్యాయి.

కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల పనితీరుపై నిర్వహించే ‘పబ్లిక్ ఎంటర్ప్రైజెస్ సర్వే 2016-17’ ఈ విషయాన్ని తేల్చింది. భారీ నష్టాలనుమూటగట్టుకున్న టాప్ టెన్‌ ప్రభుత్వ సంస్థలు 84 శాతం నష్టాలను చవి చూడగా...మొత్తం నష్టాలలో వీటి వాటా 82 శాతంగా ఉంది. ముఖ్యంగా  బిఎస్ఎన్ఎల్, ఎయిర్ ఇండియా, ఎంటిఎన్ఎల్  మొత్తం నష్టాల్లో 55.66 శాతం వాటాను ఆక్రమించాయి. మరోవైపు అగ్రశ్రేణి కంపెనీలైన ఇండియన్ ఆయిల్ కార్పోరేషన్ లిమిటెడ్, చమురు, సహజవాయువు కార్పొరేషన్ (ఒఎన్‌జీసీ), కోల్‌ ఇండియా లిమిటెడ్‌ అత్యధిక లాభాలతో టాప్‌ లో నిలిచాయి. ఇవి  వరుసగా 19.69 శాతం, 18.45 శాతం, 14.94 శాతం లాభాలు ఆర్జించాయి.
 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement