MTNL
-
ఎంటీఎన్ఎల్ అప్పు ‘మొండి బకాయి..’
న్యూఢిల్లీ: ప్రభుత్వ యాజమాన్యంలోని ఎంటీఎన్ఎల్ రుణ ఖాతాలను సబ్–స్టాండర్డ్ నాన్–పెర్ఫార్మింగ్ అసెట్స్‌గా (ఎన్పీఏ) స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) ప్రకటించింది. సెప్టెంబర్ 28వ తేదీ నుంచి ఇది అమల్లోకి వస్తుందని ఎస్బీఐ తెలిపింది. సంస్థ జూన్ 30 నుండి వాయిదాలు, వడ్డీని చెల్లించనందున ఎస్బీఐ ఈ చర్య తీసుకున్నట్లు అప్పుల ఊబిలో ఉన్న టెలికం సంస్థ ఒక రెగ్యులేటరీ ఫైలింగ్‌లో తెలిపింది.ఎంటీఎన్ఎల్ రుణ ఖాతాలో మొత్తం బకాయిలు సెపె్టంబర్ 30 నాటికి రూ. 325.52 కోట్లని ఎస్బీఐ అక్టోబర్ 1న పంపిన లేఖను ఎంటీఎన్ఎల్ స్టాక్ ఎక్సే్ఛంజీలకు అందజేసింది. రుణ బకాయిల చెల్లింపుల వైఫల్యం 12 నెలలకన్నా తక్కువ ఉంటే, ఈ పరిస్థితిని సబ్–స్టాండర్డ్ నాన్–పెర్ఫార్మింగ్ అసెట్స్‌గా బ్యాంకుల ప్రకటిస్తాయి. రుణ బకాయిల చెల్లింపుల సామర్థ్యాన్ని ఈ స్థాయి సూచిస్తుంది.చట్టపరమైన చర్యలకూ సిద్ధం..రుణ బకాయిలు చెల్లించడంలో విఫలమైతే చట్టపరమైన చర్యలకు సిద్ధమని కూడా ఎస్బీఐ సూచించింది. పంజాబ్ నేషనల్ బ్యాంక్, యూనియన్ బ్యాంక్‌సహా బకాయిలను చెల్లించనందుకు అనేక బ్యాంకులు ఎంటీఎన్ఎల్పై చర్యలు తీసుకున్నాయి. బకాయిలు చెల్లించనందుకు యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎంటీఎన్ఎల్ అన్ని ఖాతాలను స్తంభింపజేసింది.నష్టాల్లో ఉన్న టెలికం సంస్థ బ్యాంకులు, ఆర్థిక సంస్థల నుండి మొత్తం రూ. 7,873.52 కోట్ల రుణాలను కలిగి ఉంది. కంపెనీ మొత్తం రుణ భారం రూ. 31,945 కోట్లుగా ఉంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో సావరిన్ గ్యారెంటీ బాండ్ల నుండి వచ్చే వడ్డీ చెల్లింపు కోసం ఎంటీఎన్ఎల్ ప్రభుత్వం నుండి రూ. 1,151.65 కోట్లను కోరింది. ఎంటీఎన్ఎల్ బాండ్ల ప్రధాన మొత్తం చెల్లింపు కోసం 3,669 కోట్ల రూపాయలను ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2024–25) కేటాయించింది. -
ఆధునిక సాంకేతిక సారధి.. టెక్నాలజీకి ఆయనొక వారధి!
భారతదేశంలో విప్లవాత్మక మార్పులు తీసుకురావడంలో ప్రధాన పాత్ర పోషించిన దివంగత భారత ప్రధాని 'రాజీవ్ గాంధీ' గురించి అందరికి తెలుసు. ఇందిరాగాంధీ మరణాంతరం ప్రధానమంత్రి పదవిని అలంకరించిన అతి పిన్న వయస్కుడైన ఈయన హయాంలో సమాచార, కమ్యూనికేషన్ పరిశ్రమలో గణనీయమైన అభివృద్ధి జరిగింది. నేడు రాజీవ్ గాంధీ జన్మదిన సందర్భంగా వాటిని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. టెలికామ్ రంగంలో విప్లవం.. అప్పట్లో 'రాజీవ్ గాంధీ' ప్రభుత్వం కమ్యూనికేషన్ నెట్‌వర్క్‌ను విస్తరిస్తూ పట్టణాలలో గ్రామాలలో సహాయక మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేయడానికి అనేక చర్యలను చేపట్టింది. దీనికోసం టెలికమ్యూనికేషన్ ఇంజనీర్ శామ్ పిట్రోడాను సలహాదారుగా నియమించుకుని 'సెంటర్ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ టెలిమాటిక్స్' (C-DOT)ని ప్రారంభించారు. ఆ తరువాత క్రమంగా డిజిటల్ ఇండియా, స్మార్ట్ సిటీలు, భారత్ నెట్, మేక్ ఇన్ ఇండియా వంటి ప్రధాన కార్యక్రమాలు కూడా పురుడుపోసుకున్నాయి. మహానగర్ టెలిఫోన్ నిగమ్ లిమిటెడ్ (MTNL) ప్రారంభం.. రాజీవ్ గాంధీ హయాంలో 1986లో టెలిఫోన్ నెట్‌వర్క్‌ను విస్తరించడం జరిగింది. ఇందులో భాగంగానే మహానగర్ టెలిఫోన్ నిగమ్ లిమిటెడ్ ప్రారంభమైంది. టెలికామ్ నెట్వర్క్ డెవలప్మెంట్.. టెలికామ్ నెట్వర్క్ కూడా ఈయన హయాంలోనే బాగా అభివృద్ధి చెందటం ప్రారంభమైంది. పబ్లిక్ కాల్ ఆఫీస్ (PCO) విప్లవం గ్రామీణ భారతదేశం ఆకాంక్షలను సాకారం చేయడంలో సహాయపడింది. గ్రామీణ & పట్టణ ప్రాంతాల మధ్య అనుసంధానం పెంచడంలో ఇది సహాయపడింది. ఇదీ చదవండి: ఫోన్ కొనుక్కోవడానికి ఏడాది జాబ్.. ఇప్పుడు స్మార్ట్‌ఫోన్ కంపెనీకే సీజీఓ డిజిటల్ ఇండియా.. భారతదేశంలో డిజిటల్ విప్లవం బాగా అభివృద్ధి చెందటానికి రాజీవ్ గాంధీ సైన్స్ అండ్ టెక్నాలజీ, దాని అనుబంధ పరిశ్రమలు చాలా కృషి చేశాయి. అంతే కాకుండా వీరి కాలంలోనే కంప్యూటరైజ్డ్ రైల్వే టిక్కెట్లు కూడా అందుబాటులోకి వచ్చాయి. ఇదీ చదవండి: ఇషా అంబానీ కారు.. దూరం నుంచి అలా.. దగ్గర నుంచి ఇలా! సైన్స్ అండ్ టెక్నాలజీ అభివృద్ధి.. సైన్స్ అండ్ టెక్నాలజీ కూడా వాయువేగంగా అభివృద్ధి చెందటం అప్పుడే ప్రారంభమైంది. ఇందులో భాగంగానే పన్నులు, కంప్యూటర్లు, విమానయాన సంస్థలు, రక్షణ, టెలికమ్యూనికేషన్లపై సుంకాలను (ట్యాక్స్) బాగా తగ్గించారు. దేశ అభివృద్ధికి సైన్స్ అండ్ టెక్నాలజీ కీలకమని భావించి అనేక నిర్ణయాలు తీసుకున్నారు. -
రూ.1100 కోట్ల సేకరణ..! బీఎస్ఎన్ఎల్, ఎమ్టీఎన్ఎల్ ఆస్తుల వేలం..!
Centre Begins Auction Of BSNL MTNL Assets: ప్రభుత్వ రంగ టెలికం సంస్థలు బీఎస్ఎన్ఎల్, ఎమ్టీఎన్ఎల్కు చెందిన రియల్ ఎస్టేట్ ఆస్తులను కేంద్ర ప్రభుత్వం వేలానికి ఉంచనుంది. ఈ వేలంతో సుమారు రూ. 1,100 కోట్లను సేకరించాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. బీఎస్ఎన్ఎల్, ఎమ్టీఎన్ఎల్ సంస్థలకు చెందిన ఆస్తుల విక్రయాల జాబితాను డిపార్ట్మెంట్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ అండ్ పబ్లిక్ అసెట్ మేనేజ్మెంట్ (దీపం) వెబ్సైట్లో ఉంచింది. చదవండి: సామాన్యులకు కేంద్రం షాక్..! భారీగా పెరగనున్న దుస్తులు, చెప్పుల ధరలు ఆస్తుల విక్రయాల జాబితాలో హైదరాబాద్, ఛండీగడ్, భావనగర్, కోల్‌కతా నగరాల్లోని బీఎస్ఎన్ఎల్ ప్రాపర్టీలను రూ. 800 కోట్ల రిజర్వ్ ప్రైజ్‌కు వేలం వేయనున్నట్లు తెలుస్తోంది. వాసరి హిల్, గోరెగాన్ (ముంబై) లలోని ఎమ్టీఎన్ఎల్ ఆస్తులను రూ. 270 కోట్ల రిజర్వ్ ప్రైజ్‌కు వేలం వేయనున్నారు. నాన్ కోర్ అసెట్ మానిటైజేషన్ ప్లాన్‌లో భాగంగా ఎమ్టీఎన్ఎల్కు చెందిన ఓషివారాలోని 20 అంతస్తుల ఫ్లాట్‌ను కూడా అమ్మకానికి పెట్టింది. ఈ ఫ్లాట్‌ను గత ఏడాది డిసెంబర్ 14 న ఈ–వేలం కింద సేల్కు ఉంచారు. రివైవల్ స్కీమ్ కింద బీఎస్ఎన్ఎల్, ఎమ్టీఎన్ఎల్ సంస్థలకు రూ. 69 వేల కోట్లు ఇవ్వాలని 2019 అక్టోబర్‌లో కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. చదవండి: జనరల్ ఇన్స్యూరెన్స్ ఉద్యోగులకు త్వరలో తీపికబురు -
బీఎస్ఎన్ఎల్ పతనం వెనక కారణాలు
సాక్షి, న్యూఢిల్లీ : ముంబై వాసి అమిష్ గుప్తా 2005లో ల్యాండ్‌లైన్ ఫోన్ కనెక్షన్ పెట్టించుకున్నారు. సరిగ్గా ఏడాది క్రితం అది పని చేయడం మానేసింది. ఆయన దాన్ని పట్టించుకోకుండా తన మొబైల్ ఫోన్ మాత్రమే ఉపయోగించడం అలవాటు చేసుకున్నారు. హఠాత్తుగా గత మే నెలలో మళ్లీ ఆయన ఇంట్లోని ల్యాండ్‌లైన్ పని చేయడం ప్రారంభించింది. ఈ విషయమై ల్యాండ్‌లైన్ టెలికాం సర్వీసు ప్రొఫైడర్ అయిన మహానగర్ టెలిఫోన్ నిగమ్ లిమిటెడ్ (ఎంటీఎన్ఎల్)కు ఫిర్యాదు చేయాలని అమిష్ గుప్తా నిర్ణయించుకున్నారు. కేంద్ర ప్రభుత్వ సంస్థ అయిన భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (బీఎస్ఎన్ఎల్)కు ఎంటీఎన్ఎల్ అనుబంధ సంస్థ. ఇది ఢిల్లీ, ముంబై నగరాల్లో టెలికమ్ సర్వీసులను నిర్వహిస్తోంది. ఎలాగు ఫోన్ పని చేస్తోందిగదా! అని గుప్తా ఎంటీఎన్ఎల్ అధికారులకు పది, పదిహేనుసార్లు ఫోన్లు చేశారు. అయినా ఎవరూ పట్టించుకోకపోవడంతో ఆయనే ఓ రోజు వడాలాలోని ఎంటీఎన్ఎల్ కార్యాలయానికి వెళ్లారు. అక్కడ రెండు, మూడు కుర్చీలు, టేబుళ్లు తప్పా అన్ని కుర్చీలు, టేబుళ్లు ఖాళీగా ఉన్నాయి. ఆ రెండు, మూడు టేబుళ్ల చుట్టే ఐదారు సార్లు తిరగాల్సి వచ్చింది. అప్పటికి సరైన సమాధానం లేకపోవడంతో జూలై నెలలో ఆయన తన ల్యాండ్‌లైన్ సర్వీసును రద్దు చేసుకోవాలనుకున్నారు. ‘ల్యాండ్‌లైన్‌ను సరండర్ చేయడానికి నాకు మరో రెండు నెలలు పట్టింది. నేను సహజంగా ఎంటీఎన్ఎల్ లాంటి ప్రభుత్వ సంస్థలను అభిమానిస్తాను. ఎందుకంటే నేను అంభాని అభిమానిని కాదు. ఇంటి నుంచి పనిచేయాల్సిన కరోనా గడ్డుకాలంలో పటిష్టమైన ఇంటర్నెట్ అవసరం కనుక తప్పనిసరి పరిస్థితుల్లో ఎంటీఎన్ఎల్ సర్వీసును రద్దు చేసుకొని ఆ స్థానంలో జియో ల్యాండ్‌లైన్, బ్రాండ్ బ్యాండ్ తీసుకోవాల్సి వచ్చింది’ అంటూ గుప్తా వాపోయారు. రిలయెన్స్ జియో ఇన్ఫోకామ్ ఆసియాలోనే అత్యంత కుబేరుడైన ముకేష్ అంబానీదని తెల్సిందే. ఆ కంపెనీ 2016లో 4జీ సర్వీసులను అత్యంత చౌకగా అందిస్తూ మార్కెట్లోకి ప్రవేశించింది. ‘టెలికం రంగంలో ప్రైవేటు కార్పొరేట్ కంపెనీలను ప్రోత్సహించడం కోసమే బీఎస్ఎన్ఎల్, ఎంటీఎన్ఎల్ సంస్థలను ఉద్దేశపూర్వకంగానే ప్రభుత్వం నీరుగారుస్తూ వచ్చాయి’ ఎంటీఎన్ఎల్ మాజీ డిప్యూటి మేనేజర్ సూర్యకాంత్ ముద్రాస్ వ్యాఖ్యానించారు. 2010లో ముంబై, ఢిల్లీ నగరాల్లో 60 లక్షల ల్యాండ్‌లైన్ వినియోగదారులు ఉండగా, వారి సంఖ్య ప్రస్తుతం 27 లక్షలకు పడి పోయింది. ఇక దేశవ్యాప్తంగా 2016 నాటికి 2.4 కోట్ల మంది ల్యాండ్‌లైన్ వినియోగదారులుండగా, వారి సంఖ్య 2020, జూలై నాటికి 1.9 కోట్లకు పడిపోయింది. ఒక్క మొబైల్ ఫోన్ల వాడకం పెరగడమే దీనికి కారణం కాదని, బీఎస్ఎన్ఎల్, ఎంటీఎన్ఎల్ సర్వీసులు మరీ అధ్వాన్నంగా ఉండడమే కారణమని పలువురు వాటి మాజీ వినియోగదారులు తెలియజేశారు. ఫోన్ పనిచేయడం లేదంటూ ఎన్ని సార్లు ఫిర్యాదు చే సినా వచ్చి చూసేందుకు సిబ్బంది లేరంటూ నెలల తరబడి రాకపోవడంతో 2009లో బీఎస్ఎన్ఎల్ ల్యాండ్‌లైన్‌ను సరెండ్ చేయక తప్పలేదని హర్యానాలోని ఫరీదాబాద్‌కు చెందిన టీచర్ మంజులా గోస్వామి తెలిపారు. 2000 సంవత్సరం నుంచే బీఎస్ఎన్ఎల్లో సిబ్బంది తగ్గుతూ వచ్చింది. సాధారణంగా ప్రతి 500 ల్యాండ్‌లైన్ ఫోన్లకు ఒక టెక్నీషియన్ అవసరమని, అయితే ప్రస్తుతం రెండువేల ఫోన్లకు ఒక టెక్నీషియన్ చొప్పున ఉన్నారని ‘ఫెడరేషన్ ఆఫ్ టెలికామ్ ఆపరేటర్స్ యూనియన్’ అధ్యక్షుడు థామస్ జాన్ తెలిపారు. గతేడాది కేంద్ర ప్రభుత్వ టెలి కమ్యూనికేషన్ల విభాగం ‘స్వచ్ఛంద పదవీ విరమణ పథకం’ ప్రవేశపెట్టినప్పటి నుంచి బీఎస్ఎన్ఎల్, ఎంటీఎన్ఎల్ సంస్థల్లో సిబ్బంది బాగా తగ్గిపోయారు. ఈ వాస్తవానికి ఈ రెండు సంస్థల పునరుద్ధరకు కేంద్ర ప్రభుత్వం 70 వేల రూపాయల నిధులను ప్రకటించగా, అందులో 30 వేల కోట్ల రూపాయలను పదవీ విరమణ పథకానికే కేటాయించడం గమనార్హం. పథకాన్ని అమలు చేసిన తొలి రోజే ఈ రెండు ప్రభుత్వ టెలికమ్ సంస్థల నుంచి 92,300 మంది పదవీ విరమణ పొందారు. ఆ పథకానికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా టెలికం సిబ్బంది ఆందోళన చేసినప్పటికీ ప్రయోజనం లేకపోయింది. 2019 నాటికి బీఎస్ఎన్ఎల్ నష్టాలు 13,804 కోట్ల రూపాయలుకాగా ఎంటీఎన్ఎల్ నష్టాలు 3,693 కోట్ల రూపాయలు. సిబ్బంది కొరత కారణంగానే ప్రభుత్వ టెలికమ్ సంస్థలు దెబ్బతినలేదని, ల్యాండ్లైన్లకు ఉపయోగించిన కాపర్లైన్లను మార్చి కొత్తగా ఫైబర్ కేబుళ్లు వేయాల్సి ఉండగా, అందుకు బడ్జెట్‌ను కేటాయించలేదని ఎంటీఎన్ఎల్ సెక్షన్ సూపర్వైజర్ షర్కీ తెలిపారు. ప్రైవేటు టెలికమ్ సంస్థలను ప్రోత్సహించడంలో భాగంగానే ప్రభుత్వ సంస్థలకు బడ్జెట్ కేటాయింపులు జరపలేదని పేర్లు బహిర్గతం చేయడానికి ఇష్టపడని ఎంటీఎన్ఎల్ అధికారులు మీడియాకు తెలిపారు. 2016లో రిలయెన్స్ జియో సహా అన్ని ప్రైవేటు టెలికమ్ కంపెనీలు 4 జీ సర్వీసులను ప్రవేశపెట్టగా, ప్రభుత్వ సంస్థలు 3 జీ టెక్నాలజీకే పరిమితం అవడం కూడా వాటి పతనానికి దారితీసిందని విశ్లేషకులు విమర్శిస్తున్నారు. ‘బీఎస్ఎన్ఎల్–ఎంటీఎన్ఎల్ సంస్థలకు సంబంధించి ప్రభుత్వం తీసుకున్న ప్రతి నిర్ణయం వాటి ప్రయోజనాలకు వ్యతిరేకమైనదే. వాటిని చంపేయాలనే ఉద్దేశంతోనే వారు అలాంటి నిర్ణయాలు తీసుకున్నారు’ అని ఎంటీఎన్ఎల్ కామ్‌గర్ సంఘ్ అధినేత, శివసేన పార్లమెంట్ సభ్యులు అర్వింద్ సామంత్ ఆరోపించారు. -
బీఎస్ఎన్ఎల్, ఎంటీఎన్ఎల్లో ముగిసిన వీఆర్ఎస్
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ టెలికం సంస్థలు బీఎస్ఎన్ఎల్, ఎంటీఎన్ఎల్ ప్రవేశపెట్టిన స్వచ్ఛంద పదవీ విరమణ (వీఆర్ఎస్) పథకం మంగళవారంతో ముగిసింది. రెండు సంస్థల్లో 92,700 మంది ఉద్యోగులు వీఆర్ఎస్ ఎంచుకున్నట్లు అధికారవర్గాలు తెలిపాయి. బీఎస్ఎన్ఎల్లో 78,300 మంది, ఎంటీఎన్ఎల్లో 14,378 మంది దీన్ని ఎంచుకున్నారు. ‘ఊహించిన స్థాయిలోనే ఇది ఉంది. మేం సుమారు 82,000 మేర సిబ్బంది సంఖ్య తగ్గుతుందని భావించాం. 78,300 మంది వీఆర్ఎస్ ఎంచుకోగా, మరో 6,000 మంది రిటైరయ్యారు‘ అని బీఎస్ఎన్ఎల్ సీఎండీ పి.కె. పుర్వార్ తెలిపారు. మరోవైపు 14,378 మంది వీఆర్ఎస్ ను ఎంచుకున్నట్లు ఎంటీఎన్ఎల్ సీఎండీ సునీల్ కుమార్ తెలిపారు. వీఆర్ఎస్తో ఇరు సంస్థల వేతన భారం రూ. 8,800 కోట్ల మేర తగ్గనుంది. బీఎస్ఎన్ఎల్లో వేతన పరిమా ణం రూ.14,000 కోట్ల నుంచి రూ. 7,000 కోట్లకు దిగివస్తుందని పుర్వార్ తెలిపారు. ఎంటీఎన్ఎల్ వేతన భారం రూ. 2,272 కోట్ల నుంచి రూ. 500 కోట్లకు తగ్గుతుంది. -
92 వేలకు పైగా వీఆర్ఎస్ దరఖాస్తులు
న్యూఢిల్లీ: స్వచ్ఛంద పదవీ విరమణ పథకాన్ని (వీఆర్ఎస్) ఎంచుకున్న బీఎస్ఎన్ఎల్, ఎంటీఎన్ఎల్ ఉద్యోగుల సంఖ్య ఇప్పటికి 92,000 దాటిందని ప్రభుత్వ వర్గాలు సోమవారం వెల్లడించాయి. రెండు సంస్థల ఉద్యోగుల నుంచీ ఈ పథకం పట్ల విశేష స్పందన కనిపిస్తున్నట్లు ఆ వర్గాలు వెల్లడించాయి. బీఎస్ఎన్ఎల్కు సంబంధించి నవంబర్ 5 నుంచి అమల్లోకి వచ్చిన ఈ పథకం డిసెంబర్ 3 వరకూ అమల్లో ఉంటుంది. సంస్థలో ప్రస్తుతం దాదాపు 1.50 లక్షల మంది పనిచేస్తున్నారు. వీరిలో లక్ష మంది ఈ పథక ప్రయోజనం పొందడానికి అర్హులు. 70,000 నుంచి 80,000 మంది ఈ పథకాన్ని ఎంచుకుంటారని, దీనివల్ల దాదాపు రూ.7,000 కోట్ల వేతన బిల్లు భారం తగ్గుతుందని బీఎస్ఎన్ఎల్ భావిస్తోంది. కేంద్రం అందిస్తున్న పునరుద్ధరణ ప్యాకేజీ ప్రకారం బీఎస్ఎన్ఎల్ తమ ఉద్యోగులకు వీఆర్ఎస్ ప్రకటించింది. నష్టాలు, రుణభారంతో కుదేలవుతున్న బీఎస్ఎన్ఎల్, ఎంటీఎన్ఎల్ను గట్టెక్కించేందుకు కేంద్ర ప్రభుత్వం దాదాపు రూ. 69,000 కోట్ల మేర పునరుద్ధరణ ప్యాకేజీ ప్రకటించిన సంగతి తెలిసిందే. దీని ప్రకారం ఎంటీఎన్ఎల్ బీఎస్ఎన్ఎల్కు కొద్ది రోజుల ముందే తమ ఉద్యోగులకు వీఆర్ఎస్ ప్రకటించింది. రెండు కంపెనీల రుణభారం రూ. 40,000 కోట్ల పైగా ఉంది. -
రెండేళ్లలో బీఎస్ఎన్ఎల్–ఎంటీఎన్ఎల్ విలీనం పూర్తి
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ టెలికం సంస్థలైన బీఎస్ఎన్ఎల్–ఎంటీఎన్ఎల్ల విలీన ప్రక్రియ వచ్చే 18 నుంచి 24 నెలల్లోనే పూర్తికానుందని టెలికం శాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ వెల్లడించారు. లోక్‌సభలో అడిగిన ప్రశ్నకు లిఖితపూర్వక సమాధానం ఇచ్చిన ఆయన ఈ విషయాన్ని స్పష్టంచేశారు. భారీ నష్టాలతో కుదేలవుతున్న ఈ సంస్థలను విలీనం చేసేందుకు అక్టోబర్ 23న కేంద్ర క్యాబినెట్ ఆమోదముద్ర వేసిందని వివరించారు. 2010 నుంచి బీఎస్ఎన్ఎల్ నష్టాల్లో ఉండగా.. గత పదేళ్ల నుంచి ఎంటీఎన్ఎల్ నష్టాలను ప్రకటిస్తోందని చెప్పారు. ఇరు సంస్థల రుణ భారం రూ. 40,000 కోట్లుగా ఉందన్నారు. బీఎస్ఎన్ఎల్ ప్రకటించిన స్వచ్ఛంద పదవీ విరమణ పథకం (వీఆర్ఎస్)కు 77,000 మందికి పైగా, ఎంటీఎన్ఎల్ వీఆర్ఎస్కు 13,532 మంది ఉద్యోగులు దరఖాస్తు చేశారు. -
టెలికాం రేసులో బీఎస్ఎన్ఎల్, ఎంటీఎన్ఎల్
-
60 వేలకుపైగా వీఆర్ఎస్ దరఖాస్తులు
న్యూఢిల్లీ: స్వచ్ఛంద పదవీ విరమణ పథకాన్ని(వీఆర్ఎస్) ఎంచుకున్న బీఎస్ఎన్ఎల్, ఎంటీఎన్ఎల్ ఉద్యోగుల సంఖ్య ఇప్పటికి 60,000 దాటింది. టెలికం సెక్రటరీ అన్షూ ప్రకాశ్ శుక్రవారం ఈ విషయాన్ని తెలిపారు. బీఎస్ఎన్ఎల్ విషయంలో గడచిన కొద్ది రోజుల్లో వీఆర్ఎస్కు దరఖాస్తు పెట్టుకున్న ఉద్యోగుల సంఖ్య 57,000కుపైగా ఉందని, ఎంటీఎన్ఎల్ సంబంధించి సంఖ్యను కూడా కలుపుకుంటే ఇది 60,000 దాటుతోందని ఆయన తెలిపారు. బీఎస్ఎన్ఎల్లో ఒక్క శుక్రవారం మధ్యాహా్ననికే వీఆర్ఎస్కోసం దరఖాస్తు పెట్టుకున్న వారి సంఖ్య 40,000 నుంచి 57,000కు చేరిందని సమాచారం. వీఆర్ఎస్ పథకానికి స్పందన ‘‘అసాధారణం’’ అని ఆయన పేర్కొన్నారు. 94,000 మందికి వీఆర్ఎస్ ఇవ్వాన్నది ప్రభుత్వ లక్ష్యంగా సైతం ఆయన సూచించారు. స్పందన బాగుంది: బీఎస్ఎన్ఎల్ సీఎండీ అంతక్రితం బీఎస్ఎన్ఎల్ సీఎండీ పీకే పుర్వార్ మాట్లాడుతూ, సంస్థలో వీఆర్ఎస్ కింద ఇప్పటికి 40,000 మంది దరఖాస్తు చేసుకున్నారని తెలిపారు. ‘‘ఇప్పటి వరకూ 40,000కుపైగా దరఖాస్తులు వస్తే, ఇందులో 26,000 మంది గ్రూప్ ‘సీ’కి చెందినవారు. అన్ని కేడర్ల నుంచీ పథకానికి స్పందన బాగుంది’’ అని పుర్వార్ తెలిపారు. బీఎస్ఎన్ఎల్కు సంబంధించి నవంబర్ 5 నుంచి అమల్లోకి వచి్చన ఈ పథకం డిసెంబర్ 3 వరకూ అమల్లో ఉంటుంది. సంస్థలో దాదాపు 1.50 లక్షల మంది పనిచేస్తున్నారు. వీరిలో లక్ష మంది వీఆర్ఎస్ ప్రయోజనం పొందడానికి అర్హులు. 70,000 నుంచి 80,000 మంది ఈ పథకాన్ని ఎంచుకుంటారని, దీనివల్ల దాదాపు రూ.7,000 కోట్ల వేతన బిల్లు భారం తగ్గుతుందని బీఎస్ఎన్ఎల్ భావిస్తోంది. కేంద్రం పునరుద్ధరణ ప్యాకేజీ ప్రకారం బీఎస్ఎన్ఎల్ ఉద్యోగులకు వీఆర్ఎస్ ప్రకటించింది. నష్టాలు, రుణభారంతో కుదేలవుతున్న బీఎస్ఎన్ఎల్, ఎంటీఎన్ఎల్ను గట్టెక్కించేందుకు కేంద్ర ప్రభుత్వం దాదాపు రూ. 69,000 కోట్ల మేర పునరుద్ధరణ ప్యాకేజీ ప్రకటించడం తెలిసిందే. దీని ప్రకారం ఎంటీఎన్ఎల్ ఇప్పటికే తమ ఉద్యోగులకు వీఆర్ఎస్ ప్రకటించింది. రెండు కంపెనీల రుణభారం రూ.40,000 కోట్ల పైగా ఉంది. -
బీఎస్ఎన్ఎల్ వీఆర్ఎస్కు భారీ స్పందన
సాక్షి, ముంబై: ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ బీఎస్‌ఎన్‌ఎల్‌లోని వీఆర్ఎస్ పథకానికి భారీ స్పందన లభిస్తోంది. స్వచ్చంద పదవి విరమణ (వీఆర్ ఎస్) స్కీంనకు ఉద్యోగులనుంచి ఊహించని స్పందన లభించిందని కేంద్రం శుక్రవారం తెలిపింది. కేవలం 4 రోజుల్లో బీఎస్ఎన్ఎల్ నుంచి 50,000 దరఖాస్తులు రాగా, ఎమ్టిఎన్ఎల్ 3వేల మంది ఉద్యోగులను వీఆర్ఎస్కు దరఖాస్తు చేశారని తెలిపింది. ఎంటీటిఎన్‌ఎల్ నుంచి 15 వేల మందిలో ఇప్పటికే 3వేల మంది ముందుకొచ్చారన్నారు. అలాగే మొత్తం వీఆర్ఎస్ కోసం 83వేల మంది టార్గెట్ అని టెలికాం కార్యదర్శి అన్షు ప్రకాష్ చెప్పారు. కేంద్రం ప్రకటించిన వీఆర్ఎస్ చాలా బాగా ఆలోచించిన పథకమనీ అందుకే ఉద్యోగుల నుంచి మంచి ఆదరణ లభిస్తోందని పేర్కొన్నారు. బీఎస్ఎన్ఎల్ స్వచ్ఛంద పదవీ విరమణ పథకం - 2019 ప్రకారం, బీఎస్ఎన్ఎల్కు చెందిన రెగ్యులర్, పర్మినెంట్ ఉద్యోగులు, డిప్యూ టేషన్‌పై ఇతర సంస్థల్లోకి పంపిన వారు, 50 ఏళ్ల వయసు దాటిన వారు ఈ స్కీంకు అర్హులు. ఎంటీఎన్ఎల్ ఉద్యోగులకు కూడా 3వీఆర్ఎస్ స్కీంను అం దుబాటులోకి తెచ్చింది. ఈ స్కీం నవంబర్ 4 నుంచి డిసెంబర్ 3 వరకు కొనసాగుతుంది. అర్హులైన ఉద్యోగులకు సర్వీసు పూర్తిచేసిన కాలానికి ఏడాదికి 35 రోజుల వేతనం అలాగే మిగిలిన సర్వీసు కాలానికి ప్రతి ఏడాదికి 25 రోజుల వేత నాన్ని లెక్క గట్టి చెల్లిస్తామని కేంద్రం ప్రకటించిన సంగతి తెలిసిందే. -
బీఎస్ఎన్ఎల్ పునరుజ్జీవం
ఇంట్లో ఫోన్ సౌకర్యం ఉండటం సమాజంలో గౌరవప్రతిష్టలకు చిహ్నంగా భావించే రోజుల్లో టెలి ఫోన్ విభాగం ఎవరికీ అందనంత ఎత్తులో ఉండేది. సంపన్నులు, రాజకీయ పలుకుబడి ఉన్నవారు ఎవరో ఒకరితో సిఫార్సు చేయించుకుని ఇంటికి ఫోన్ అమర్చుకునేసరికి తాతలు దిగొచ్చేవారు. ఆ విభాగం కాస్తా భారత సంచార్ నిగమ్ లిమిటెడ్(బీఎస్ఎన్ఎల్)గా మారిన తర్వాత క్రమేపీ ఎవరికీ అక్కర్లేని, ఎవరూ పట్టించుకోని సంస్థగా అది రూపాంతరం చెందింది. అంతకు చాలాముందే...అంటే 1986లో న్యూఢిల్లీ, ముంబై మహానగరాల్లో కార్యకలాపాలపై దృష్టిసారించేందుకు మహానగర్ టెలి ఫోన్ నిగమ్(ఎంటీఎన్ఎల్) పేరిట వేరే ఒక లిమిటెడ్ కంపెనీ ఏర్పాటుచేశారు. కొన్నాళ్లుగా ఆ రెండు సంస్థలూ సిబ్బందికి జీతాలు చెల్లించలేని స్థితికి చేరుకున్నాయని, ఎప్పుడు మూతబడతాయో... ఉన్న ఉద్యోగం కాస్తా ఎప్పుడు పోతుందో తెలియని అయోమయావస్థలో సిబ్బంది ఉన్నారని తెలిసినప్పుడు ఆశ్చర్యమూ, బాధ కలుగుతాయి. కానీ బుధవారం జరిగిన కేంద్ర కేబినెట్ సమావేశం దాని పునరుద్ధ రణకు భారీ ప్యాకేజీ ఇవ్వాలని నిర్ణయించి సిబ్బందిలో దీపావళికి ముందే వెలుగులు నింపింది. కేంద్రం నిర్ణయం ప్రకారం ఆ రెండు సంస్థలూ విలీనమై ఒకే సంస్థగా ఏర్పడతాయి. స్వచ్ఛందంగా తప్పుకోవాలనుకునేవారికి మంచి ప్యాకేజీ ఇవ్వాలని కూడా నిర్ణయించారు. వీటితోపాటు సంస్థ మూడే ళ్లుగా ఎదురుచూస్తున్న 4జీ స్ప్రెక్ట్రమ్ కేటాయించాలని కూడా తీర్మానించారు. పదవీవిరమణపై ఒత్తి ళ్లేమీ ఉండబోవని కేంద్ర టెలికాం మంత్రి రవిశంకర్ ప్రసాద్ హామీ ఇచ్చారు. సంస్థల ఆస్తులను అమ్మడం లేదా లీజుకివ్వడం ద్వారా రూ. 37,500 కోట్లు సమకూరుతుందని ప్రభుత్వం అంచనా వేస్తోంది. బీఎస్ఎన్ఎల్లో 1.68 లక్షలమంది సిబ్బంది ఉండగా, ఎంటీఎన్ఎల్లో 22,000మంది ఉన్నారు. ఈ రెండు సంస్థలకూ ఉన్న రుణభారం రూ. 40,000 కోట్లు. టెలికాం రంగంలో గుత్తాధిపత్యం ఉన్నప్పుడు అదొక వెలుగు వెలిగినా, అనంతరకాలంలో ప్రైవేటు ఆపరేటర్లు రంగ ప్రవేశం చేయడంతో ఆ పోటీని తట్టుకోవడం దానివల్ల కాలేదని, కనుకనే క్రమేపీ నీరసించిందని అందరూ అనుకుంటారు. అందులో అర్థసత్యం మాత్రమే ఉంది. బీఎస్ఎన్ ఎల్గా ఆవిర్భవించిన 2000 సంవత్సరం నుంచి 2009 వరకూ అది లాభార్జనలోనే ఉంది. ఆ తర్వాత సైతం ఎంతో కొంత మేర మెరుగ్గానే ఉంది. అన్ని రకాల పోటీలనూ తట్టుకుని అది నిలబడగలిగింది. టెలికాం రంగంలో బీఎస్‌ఎన్‌ఎల్‌కున్న అనుభవం ముందుగానీ, దానికి అందుబాటులో ఉన్న వనరుల ముందుగానీ ఏ సంస్థ అయినా దిగదుడుపేనన్నది మరిచిపోకూడదు. అసలు టెలికాం రంగం నుంచి ప్రభుత్వం తప్పుకోవడం సరికాదని, దాన్ని సంస్థగా మారిస్తే ప్రభుత్వం రూపొందించే విధానాలకూ, దాని నిర్వహణకూ మధ్య అగాధం ఏర్పడుతుందని, అది చివరకు ఎటూ కదల్లేని స్థితికి చేరుతుందని అప్పట్లోనే టెలికాం యూనియన్లు ఆందోళన వెలిబుచ్చాయి. దాన్ని చివరకు ప్రైవేటీకరించే ప్రతిపాద నలు మొదలవుతాయని ఆరోపించాయి. ఆ విభాగాన్ని అలాగే కొనసాగనిచ్చి, వృత్తిపరమైన స్వేచ్ఛనీ యాలని కోరాయి. నిజమే... ఒక కార్పొరేషన్‌గా దాన్ని రూపొందించాలనుకున్నప్పుడు ఆ రంగంలో నిష్ణాతులైనవారికి బాధ్యతలు అప్పగించి, వారికి స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకునే స్వేచ్ఛనివ్వాలి. కానీ విధానపరమైన నిర్ణయాలన్నీ ప్రభుత్వాలు తీసుకుంటూ వాటి పర్యవసానాలకు మాత్రం సంస్థను నిందించడం రివాజుగా మారింది. ఏ పార్టీ నేతృత్వంలోని ప్రభుత్వాలు వచ్చినా ఇదే తంతు నడిచింది. ఇందుకు 4జీ స్పెక్ట్రమ్ కేటాయింపే ఉదాహరణ. ఇతర ప్రైవేటు సంస్థలన్నిటికీ ఎప్పుడో 2016లో దక్కిన ఆ స్పెక్ట్రమ్ కోసం బీఎస్ఎన్ఎల్, ఎంటీఎన్ఎల్ సంస్థలు మూడేళ్లు ఎదురుచూడాల్సివచ్చింది. తీరా దాన్ని కేటాయించాలన్న నిర్ణయం తీసుకునేసరికి ఈ రంగమంతా 5జీ స్పెక్ట్రమ్ కోసం ఉవ్విళ్లూ రుతోంది. ఈ సంస్థల్లో సమస్యలున్నమాట వాస్తవమే. కానీ ఇతర సంస్థలకు దీటుగా నిలబడకపోతే చందాదారులంతా వలసపోతారు. అసలు ప్రైవేటు ఆపరేటర్లకు లబ్ధి చేకూర్చడమే ఈ జాప్యానికి కారణమని సిబ్బంది సంఘాలు ఆరోపించాయి. ఈ రెండింట్లో దేన్ని దేనితో కలపాలన్న అంశంలో నిర్ణయం తీసుకోవడానికి పదేళ్లుగా చర్చోపచర్చలు సాగుతున్నాయి. ఎంటీఎన్ఎల్ లిస్టెడ్ కంపెనీ. బీఎస్ఎన్ఎల్ కార్పొరేషన్. ఎంటీఎన్ఎల్ లిస్టెడ్ కంపెనీ ప్రతిపత్తి రద్దుచేయాలా, బీఎస్ఎన్ఎల్ను సైతం ఆ దోవకు మళ్లించాలా అన్నదే ఈ సుదీర్ఘ మీమాంస సారాంశం. ఆ సంగతలా ఉంచితే ఇన్నాళ్లుగా బీఎస్ఎన్ఎల్ 3జీ స్పెక్ట్రమ్‌పైనే బండి లాగిస్తూ, అక్కడక్కడ 4జీ సేవలు అందిస్తోంది. కాబట్టి భారీగా నష్టాలు చవిచూస్తోంది. ఇన్ని కష్టాల్లో కూడా అది 12 కోట్లమంది ఖాతాదార్లతో, మార్కెట్లో 11 శాతం వాటాతో, రూ. 20,000 కోట్లకుపైగా వార్షిక ఆదాయంతో ఉన్నదంటే ప్రజల కున్న విశ్వాసం కారణం. చంద్రబాబువంటి ఏలికలు బీఎస్ఎన్ఎల్ సేవలు ఆపేసి ప్రైవేటుకిస్తా మంటూ బేరాలు పెట్టారు. ఇప్పుడు ప్యాకేజీ ప్రకటించినంత మాత్రాన ఆ సంస్థ సవ్యంగా మనుగడ సాగిస్తుందని తోచదు. ఎందుకంటే 4జీ సేవల కోసం తహతహలాడినవారంతా ఇతర ఆపరేటర్ల వద్దకు వలసపోయారు. ఇది ‘జియో’ యుగం! ఇప్పుడుంతా ధరల పోటీ నడుస్తోంది. ఆ సేవల్లో కొత్తగా అడుగుపెట్టే సంస్థ వాటి కన్నా చవగ్గా, మెరుగ్గా ఉండగలదా అన్నదే ప్రధాన అంశం. పైగా 4జీ కేటాయించాక అది పూర్తి స్థాయిలో అందుబాటులో రావడానికి దాదాపు 12 నుంచి 15 నెలలు పడుతుందంటున్నారు. బీఎస్ ఎన్ఎల్ ఈ సవాళ్లన్నిటినీ ఎలా అధిగమిస్తుందో, ఎంత వేగంగా పనిచేస్తుందో వేచిచూడాలి. కవి తిల కుడు అన్నట్టు ‘చిటారు కొమ్మలో నక్షత్రం చిక్కుకుంది/ శిథిల సంధ్యాగగనం రుధిరాన్ని కక్కుతోంది/ దారంతా గోతులు యిల్లేమో దూరం/ చేతిలో దీపం లేదు, ధైర్యమే ఒక కవచం’. బీఎస్ఎన్ఎల్ సర్వ శక్తులూ కూడదీసుకుని, అవాంతరాలను అధిగమించి కోట్లాదిమందితో మళ్లీ శభాష్ అనిపించుకుం టుందని, లక్షలాదిమంది సిబ్బంది కుటుంబాల్లో వెలుగులు నింపుతుందని ఆశించాలి. -
బీఎస్ఎన్ఎల్–ఎంటీఎన్ఎల్ విలీనం
న్యూఢిల్లీ: భారీ నష్టాలతో కుదేలవుతున్న ప్రభుత్వ రంగ టెలికం సంస్థలు బీఎస్ఎన్ఎల్, ఎంటీఎన్ఎల్ను గట్టెక్కించే దిశగా రూ. 68,751 కోట్ల పునరుద్ధరణ ప్యాకేజీకి కేంద్ర క్యాబినెట్ బుధవారం ఆమోదముద్ర వేసింది. రెండు సంస్థలను విలీనం చేయడంతో పాటు 4జీ స్పెక్ట్రం కేటాయింపు, స్వచ్ఛంద పదవీ విరమణ పథకం మొదలైనవి ఈ ప్యాకేజీలో భాగంగా ఉండనున్నాయి. బుధవారం సమావేశమైన కేంద్ర క్యాబినెట్ ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. విలీన ప్రక్రియ పూర్తయ్యే దాకా ఎంటీఎన్ఎల్ సంస్థ బీఎస్ఎన్ఎల్కు అనుబంధ సంస్థగా పనిచేస్తుందని సమావేశం అనంతరం టెలికం శాఖ మంత్రి రవి శంకర్ ప్రసాద్ తెలిపారు. ప్యాకేజీ ప్రకారం రెండు సంస్థల తక్షణ మూలధన అవసరాల కోసం సార్వభౌమ బాండ్ల జారీ ద్వారా రూ. 15,000 కోట్లు సమీకరించనున్నారు. ఇక దాదాపు 50 శాతం మంది ఉద్యోగులకు రూ. 29,937 కోట్లతో వీఆర్ఎస్ పథకం అమలు చేయనున్నారు. రూ. 20,140 కోట్ల విలువ చేసే 4జీ స్పెక్ట్రంను, దానిపై వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) కోసం రూ. 3,674 కోట్లు ప్రభుత్వం కేటాయించనుంది. రెండూ కీలక సంస్థలే.. ‘బీఎస్ఎన్ఎల్, ఎంటీఎన్ఎల్ విషయంలో ప్రభుత్వ వైఖరి స్పష్టంగా ఉంది. ఇవి రెండూ దేశానికి వ్యూహాత్మక అసెట్స్ వంటివి. మొత్తం ఆర్మీ నెట్వర్క్ అంతా బీఎస్ఎన్ఎల్ నిర్వహణలో ఉంది. ఇక 60 ఏళ్లు వచ్చే దాకా కంపెనీలో ఉద్యోగం చేసిన పక్షంలో వచ్చే ఆదాయానికి 125% వీఆర్ఎస్ కింద అర్హులైన ఉద్యోగులకు ఇచ్చేలా ప్యాకేజీని క్యాబినెట్ ఆమోదించింది. తద్వారా.. ఈ రెండు ప్రభుత్వ రంగ సంస్థల్లో పనిచేస్తున్న లక్షల మంది ఉద్యోగుల ప్రయోజనాలను కాపాడేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంది. వీఆర్ఎస్ స్వచ్ఛందమైనదే. వీఆర్ఎస్ తీసుకోవాలంటూ ఎవరిపైనా ఒత్తిళ్లు ఉండవు‘ అని ప్రసాద్ తెలిపారు. బీఎస్ఎన్ఎల్లో సుమారు 1.68 లక్షల మంది, ఎంటీఎన్ఎల్లో 22,000 మంది పైగా ఉద్యోగులు ఉన్నారు. వీఆర్ఎస్ ఎంచుకునే వారిలో 53.5 ఏళ్లు పైబడిన ఉద్యోగులకు .. మిగిలిన సర్వీసు వ్యవధిలో ఆర్జించే వేతనానికి 125 శాతం మేర లభిస్తుంది. అలాగే 50–53.5 ఏళ్ల వయస్సు గల వారికి మిగిలిన సర్వీసు వ్యవధి ప్రకారం వేతనంలో 80–100 శాతం దాకా ప్యాకేజీ లభిస్తుంది. రూ. 40 వేల కోట్ల రుణభారం.. ఈ రెండు సంస్థల రుణభారం రూ. 40,000 కోట్ల పైచిలుకు ఉంది. ఇందులో ఎక్కువభాగం.. కేవలం 2 నగరాల్లో (ఢిల్లీ, ముంబై)నే కార్యకలాపాలు సాగించే ఎంటీఎన్‌ఎల్‌దే కావడం గమనార్హం. 4జీ సేవలు అందించేందుకు స్పెక్ట్రం కేటాయించాలంటూ ఈ సంస్థలు కేంద్రాన్ని కోరుతున్నాయి. 4జీ సేవలు దశలవారీగా విస్తరించేందుకు బీఎస్ఎన్ఎల్కు సుమారు రూ. 10,000 కోట్లు, ఎంటీఎన్ఎల్కు రూ. 1,100 కోట్లు అవసరమవుతాయని టెలికం కార్యదర్శి అన్షు ప్రకాష్ చెప్పారు. మరోవైపు, రెండు సంస్థలకు ఉన్న రూ. 37,500 కోట్ల అసెట్స్‌ను మూడేళ్ల వ్యవధిలో ప్రభుత్వం మానిటైజ్ (విక్రయించడం లేదా లీజుకివ్వం మొదలైన ప్రక్రియలు) చేయనున్నట్లు ఆయన తెలిపారు. -
ఉద్యోగులకు వీఆర్ఎస్, సాహసోపేత విలీన నిర్ణయం
సాక్షి,ముంబై: ప్రభుత్వ రంగ టెలికాం సంస్థలు బీఎస్ఎన్ఎల్, ఎంటీఎన్ఎల్ విలీనానికి ఆమోదం లభించింది. ప్రైవేటు రంగం దిగ్గజాల నుంచి పోటీ కారణంగా సంక్షోభంలో పడిపోయిన బీఎస్ఎన్ఎల్ను గట్టెక్కించేలా కేంద్ర కేబినెట్ ఎట్టకేలకు బుధవారం కీలక నిర్ణయం తీసుకుంది. అలాగే ఉద్యోగుల కోసం ఆకర్షణీయమైన స్వచ్ఛంద విరమణ పథకం(వీఆర్ఎస్)ప్యాకేజీ 4జీ స్పెక్ట్రం కేటాయింపులకు కూడా క్యాబినెట్ ఆమోదించింది. పునరుజ్జీవనం కోసం రూ. 15,000 కోట్లు సార్వభౌమ బాండ్ల జారీకి సూత్రప్రాయంగా ఆమోదం ఇచ్చింది. అయితే 4జీ స్పెక్ట్రం కేటాయింపు 2016 ధరల కనుగుణంగా ఉంటుందని కేంద్ర టెలికాం మంత్రి రవిశంకర్‌ప్రసాద్ మీడియాకు వెల్లడించారు. అలాగే వీటి ఆస్తుల మానిటైజ్ ద్వారా రూ.38,000 కోట్ల రూపాయల డబ్బునున ఆర్జించనున్నట్టు చెప్పారు. వీఆర్ఎస్ ప్యాకేజీని రెండు కంపెనీలకు వర్తింపచేస్తామని కేంద్రమంత్రి వివరించారు. 53 సంవత్సరాలు అంతకంటే ఎక్కువ వయస్సున్న ఉద్యోగి వీఆర్ఎస్ను ఎంచుకుంటే, 60 సంవత్సరాల వయస్సు వరకు జీతం, పెన్షన్, 125 శాతం గ్రాట్యుటీ అందిస్తామన్నారు. జాతీయ ప్రయోజనాలకోసం సాహసోపేతమైన పునరుద్ధరణ ప్యాకేజీతో బీఎస్ఎన్ఎల్,ఎంటీఎన్ఎల్ విలీన నిర్ణయం తీసుకున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి కృతజ్ఞతలు తెలిపిన ఆయన ఈ సంస్థలను లాభదాయకంగా మార్చడానికి రెండు సంస్థల ఉద్యోగులు తీవ్రంగా కృషి చేయాలని పిలుపునిచ్చారు. #Cabinet has decided to offer an attractive Voluntary Retirement plan to the employees of BSNL and MTNL. pic.twitter.com/jaAsIvByrJ — Ravi Shankar Prasad (@rsprasad) October 23, 2019 -
కేంద్ర కేబినెట్ సంచలన నిర్ణయాలు
సాక్షి, న్యూఢిల్లీ: కేంద్ర కేబినెట్ బుధవారం పలు సంచలన నిర్ణయాలు తీసుకుంది. దేశ రాజధాని ఢిల్లీలోని అక్రమ కాలనీలను రెగ్యులరైజ్ చేస్తూ కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయంతో ఢిల్లీలోని నివసిస్తున్న 40 లక్షల మందికి నేరుగా ప్రయోజనం చేకూరనుంది. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోవడం గమనార్హం. ప్రధానమంత్రి నరేంద్రమోదీ నేతృత్వంలో కేంద్ర కేబినెట్ బుధవారం సమావేశమైంది. బీఎస్ఎన్ఎల్, ఎంటీఎన్ఎల్ విలీనం ఇక, నష్టాల్లో ఉన్న బీఎస్ఎన్ఎల్, ఎంటీఎన్ఎల్లను గట్టెక్కించాలని కేబినెట్ నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా ఈ రెండు సంస్థలను విలీనం చేసి.. పూర్వవైభవం తీసుకురావాలని నిర్ణయించింది. బీఎస్ఎన్ఎల్, ఎంటీఎన్ఎల్లను మూసివేయబోమని కేంద్ర మంత్రి రవిశంకర్ తెలిపారు. ఆ సంస్థల్లో పెట్టుబడుల ఉపసంహరణ ఉండబోదని ఆయన చెప్పారు. ఈ సంస్థలను తిరిగి గాడిలో పెట్టేందుకు 4జీ స్పెక్ట్రమ్ కేటాయించడంతోపాటు రూ. 15వేల కోట్ల సావరీన్ బాండ్స్ జారీచేయనున్నట్టు ఆయన తెలిపారు. ఈ రెండు సంస్థల నిర్వహణ బాధ్యతలను ప్రైవేటుకు అప్పగించే ప్రసక్తే లేదని చెప్పారు. పంటల కనీస మద్దతు ధర పెంపు కష్టాల్లో ఉన్న రైతాంగాన్ని ఆదుకునేందుకు కేంద్ర కేబినెట్ పలు నిర్ణయాలు తీసుకుంది. గోధుమ సహా మరికొన్ని పంటల కనీస మద్ధతు ధర పెంచుతున్నట్టు కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్ తెలిపారు. -
ఎంటీఎన్ఎల్ కార్యాలయంలో అగ్ని ప్రమాదం
సాక్షి, ముంబై : దేశ ఆర్థిక రాజధాని ముంబైలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. బాంద్రాలోని ఎంటీఎన్ఎల్ టెలిఫోన్ ఎక్స్చేంజ్లో ఒక్కసారిగా మంటలు చెలరేగి ఎగసిపడుతున్నాయి. బిల్డింగ్‌లో దాదాపు 100మంది చిక్కుకుపోయారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది 14 ఫైర్ ఇంజిన్లు ఘటనాస్థలానికి చేరుకుని మంటలను అదుపు చేస్తున్నాయి. లోపల చిక్కుకున్నవారి సురక్షితంగా బయటకు తీసుకొచ్చేందుకు సిబ్బంది చర్యలు చేపడుతున్నారు. అగ్నిప్రమాదంలో 9 అంతస్తుల భవనం మొత్తం దట్టంగా పొగ కమ్మేసింది. మూడు, నాలుగు అంతస్తుల్లో మంటలు ఎగసిపడుతున్నాయి. అగ్నిమాపక శాఖ అధికారి స్పందిస్తూ కార్యాలయం మొత్తం పొగతో నిండిపోయిందని, కొందరు 10వ అంతస్తులో చిక్కుకుపోయారని తెలిపారు. అయితే ఈ ఘటనలో ఎలాంటి ఆస్తి, ప్రాణ నష్టం జరగలేదని తెలిపారు. -
అత్యంత అధ్వాన్న పీఎస్‌యూలు ఏవో తెలుసా?
సాక్షి, న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ సంస్థలు బీఎస్ఎన్ఎల్, ఎయిర్ ఇండియా, ఎంటిఎన్ఎల్ సంస్థలు అప్రతిష్టపాలైన కంపెనీలుగా నిలిచాయి. 2016-17 ఆర్థిక సంవత్సరంలో భారీ నష్టాలతో ఫెర్పామెన్స్లో అత్యంత అధ్వాన్న పీఎస్యూలుగా నిలిచాయి. మరోవైపు ఇండియన్ ఆయిల్, ఓఎన్జీసీ,కోల్ ఇండియా అత్యధిక లాభాలను సాధించిన కంపెనీలుగా నిలిచాయి. ప్రభుత్వ మంగళవారం పార్లమెంటులో ప్రవేశపెట్టిన సర్వే ద్వారా ఈ విషయాలు వెల్లడయ్యాయి. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల పనితీరుపై నిర్వహించే ‘పబ్లిక్ ఎంటర్ప్రైజెస్ సర్వే 2016-17’ ఈ విషయాన్ని తేల్చింది. భారీ నష్టాలనుమూటగట్టుకున్న టాప్ టెన్ ప్రభుత్వ సంస్థలు 84 శాతం నష్టాలను చవి చూడగా...మొత్తం నష్టాలలో వీటి వాటా 82 శాతంగా ఉంది. ముఖ్యంగా బిఎస్ఎన్ఎల్, ఎయిర్ ఇండియా, ఎంటిఎన్ఎల్ మొత్తం నష్టాల్లో 55.66 శాతం వాటాను ఆక్రమించాయి. మరోవైపు అగ్రశ్రేణి కంపెనీలైన ఇండియన్ ఆయిల్ కార్పోరేషన్ లిమిటెడ్, చమురు, సహజవాయువు కార్పొరేషన్ (ఒఎన్జీసీ), కోల్ ఇండియా లిమిటెడ్ అత్యధిక లాభాలతో టాప్ లో నిలిచాయి. ఇవి వరుసగా 19.69 శాతం, 18.45 శాతం, 14.94 శాతం లాభాలు ఆర్జించాయి. -
ఐడియాకు షాక్: రూ.3కోట్ల ఫైన్
న్యూఢిల్లీ: దేశంలో రెండో అతిపెద్ద టెలికాం ఆపరేటర్ ఐడియా సెల్యులార్కు మార్కెట్ రెగ్యులేటరీ భారీ షాక్చింది. అక్రమంగా అధిక ఛార్జీలు వసూలు చేసినందుకుగా సుమారు మూడుకోట్ల రుపాయలు చెల్లించాలని ఆదేశించింది. రూ. 2.97 కోట్లను చెల్లించాల్సిందిగా టెలికాం రెగ్యులేటరీ ట్రాయ్ ఆదేశించింది.ముఖ్యంగా బిఎస్ఎన్ఎల్, ఎంటిఎన్ఎల్ నెట్‌వర్క్‌కు కాల్ చేసిన తన చందాదారులపై అధిక ఫీజు వసూలు చేసిందని ఆరోపిస్తూ ఈ ఆదేశాలు జారీ చేసింది. ట్రాయ్ సలహాదారు అబ్బాస్ సంతకం చేసిన ఆగస్టు 24, 2017 నాటి ఉత్తర్వు ప్రకారం రూ. 2,97,90,173 రూపాయల మొత్తాన్ని డిపాజిట్ చేయాలని ఐడియాని ఆదేశించింది. మే 2005 నుంచి 2007 మధ్య కాలంలో కస్టమర్లనుంచి ఈ చార్జీలను వసూలు చేసినట్టు తెలిపింది. అంతేకాదు ఈ సొమ్మును 15 రోజుల్లోగా చెల్లించాలని తెలిపింది. టెలికాం వినియోగదారుల విద్య మరియు భద్రతా నిధి (టీసీఈపీఎఫ్) లో డిపాజిట్ చేయవలసిందిగా ఆదేశించింది. ఎందుకంటే ఆ కాలానికి సంబంధించిన రేటెడ్ కాల్ డేటా రికార్డు అందుబాటులోలేదని ఈ సొమ్మును ఐడియా చందాదారులకు తిరిగి చెల్లించలేమని ఐడియా పేర్కొన్న కారణంగా టీసీఈపీఎఫ్‌లో జతచేయాలని కోరింది. -
మొబైల్స్ జోరు.. తగ్గిన ల్యాండ్ లైన్లు
న్యూఢిల్లీ : గడచిన ఐదేళ్ల కాలంలో ల్యాండ్ లైన్ ఫోన్ కనెక్షన్లు భారీగా పడిపోయాయని కమ్యూనికేషన్ల మంత్రి మనోజ్‌సిన్హా తెలిపారు. ఒక ప్రశ్నకు సమాధానంగా రాజ్యసభలో శుక్రవారం ఇచ్చిన ఒక లిఖిత పూర్వక సమాధానంలో ఈ విషయాన్ని వెల్లడించారు. 2012 లో ఈ కనెక్షన్ల సంఖ్య 3.21 కోట్లయితే, అవికాస్తా 2016 నాటికి 2.52 కోట్లకు పడిపోయినట్లు తెలిపారు. 2017 జనవరి 31నాటికి దేశంలో ల్యాండ్‌లైన్ ఫోన్ కనెక్షన్లు 2.43 కోట్లు ఉన్నట్టు మంత్రి తెలిపారు. ప్రభుత్వ రంగ సంస్థలైన బీఎస్ఎన్ఎల్, ఎంటీఎన్ఎల్లు వివిధ ఆకర్షణీయమైన పథకాలతో ల్యాండ్‌లైన్ ఫోన్ కనెక్షన్ల సంఖ్యను పెంచడానికి ప్రయత్నిస్తున్నట్లు ఈ సందర్భంగా మంత్రి వివరించారు. కాగా 2017 మార్చి 19 నాటికి 16,833 గ్రామ పంచాయతీలకు బ్రాడ్‌బ్యాండ్ కనెక్టివిటీని కల్పించినట్లు మరో ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. -
రోజుకి 2 జీబీ డేటా..ఎక్కడ..ఏ కంపెనీ?
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ ఎంటిఎన్ఎల్ కూడా టారిఫ్ వార్ లోకి ప్రవేశించింది. తాజాగా సంస్థ దేశీయ టెలికాం దిగ్గజాల కంటే చవక ధరలో డేటా సేవలను అందించనుంది. ఏప్రిల్ 1 నుంచి మొదలయ్యే కొత్త ప్లాన్స్‌ను ప్రకటించింది. ఎంటీఎన్ఎల్ 31 వ వార్షికోత్సవం సందర్భంగా ఖాతాదారులకు తక్కువ ధరకే డాటా సేవలను అందించనుంది. ఎంటిఎన్ఎల్ వినియోగదారుల కోసం 28 రోజుల వాటిడిటీతో రూ.319 ల రీచార్జ్ పై 2 జీబీ 3జీబీ డేటాను, కోసం దాని నెట్వర్క్ లోపల అపరిమిత కాలింగ్ ఆఫర్ అందిస్తోంది. ఇతర నెట్‌వర్క్‌లకు 25 నిమిషాల ఫ్రీ కాలింగ్ సదుపాయం, ఆ తర్వాత నిమిషానికి 25 పైసలు వసూలు చేయనుంది. దేశీయ టెలికాం మేజర్లు బీఎస్ఎన్ఎల్, భారతి ఎయిర్టెల్, జియో టారిఫ్ ప్లాన్లకంటే తక్కువకే ఈ డేటా సేవలను అందిస్తోంది. అయితే ఢిల్లీ ముంబై మొబైల్ వినియోగదారులకు ప్రస్తుతం ఈ ప్లాన్ అందుబాటులో ఉన్నట్టు సంస్థ ఒక ప్రకటనలో తెలిపింది. ఈ ప్రమోషనల్ ఆఫర్ 90 రోజుల వరకు చెల్లుబాటులో ఉంటుందని పేర్కొంది. -
బీఎస్ఎన్ఎల్–ఎంటీఎన్ఎల్
విలీన ప్రతిపాదనలు! న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ టెలికం దిగ్గజాలు బీఎస్ఎన్ఎల్, ఎంటీఎన్ఎల్ విలీన ప్రతిపాదనలు మళ్లీ తెరపైకి వచ్చాయి. తీవ్రమైన పోటీతో నష్టాల్లో ఉన్న ఈ రెండింటిని విలీనం చేసే అంశాన్ని టెలికం విభాగ కార్యదర్శి జేఎస్ దీపక్ సారథ్యంలో రెండు–మూడు వారాల క్రితం జరిగిన అత్యున్నత స్థాయి సమావేశంలో చర్చించినట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. ప్రతిపాదనల ప్రకారం తొలి దశలో ఎంటీఎన్ఎల్కి గుర్గావ్, నోయిడా, ఫరీదాబాద్‌లలో ఉన్న మొబైల్ కార్యకలాపాలను తీసుకోవాలని బీఎస్ఎన్ఎల్ భావిస్తున్నట్లు సమాచారం. అలాగే మెట్రో నగరాలైన ఢిల్లీ, ముంబైలో మొబైల్ కార్యకలాపాలు కొనుగోలు చేయడం మరో ప్రత్యామ్నాయమని సం బంధిత వర్గాలు పేర్కొన్నాయి. నష్టాల్లో ఉన్న ఎంటీఎన్ఎల్కు విలీనం సానుకూలమే అయినప్పటికీ.. బీఎస్ఎన్ఎల్కు మాత్రం భారం కావొచ్చని, అలాగే సిబ్బం ది, జీతభత్యాలు మొదలైనవి సమస్యాత్మక అంశాలు కాగలవని వివరించాయి. గతంలో ప్రమోద్ మహాజన్ టెలికం మంత్రిగా పనిచేసినప్పుడు ఈ విలీన ప్రతిపాదన తొలిసారిగా తెరపైకి వచ్చింది. ఎంటీఎన్ఎల్ ప్రస్తుత రుణభారం రూ. 19,418 కోట్లుగాను, బీఎస్ఎన్ఎల్ రుణాలు రూ. 4,890 కోట్లుగాను ఉన్నాయి. -
బీఎస్ఎన్ఎల్, ఎంటీఎన్ఎల్కు రూ.11 వేల కోట్లు వాపసు
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ టెలికం కంపెనీలు బీఎస్ఎన్ఎల్, ఎంటీఎన్ఎల్లకు రూ.11,000 కోట్లకుపైగా స్పెక్ట్రం ఫీజును కేంద్రం వాపసు ఇవ్వనుంది. 2010లో దక్కించుకున్న బ్రాండ్‌బ్యాండ్ వైర్లెస్ యాక్సెస్(బీడబ్ల్యూఏ) స్పెక్ట్రంను వెనక్కితిరిగిచ్చేయాలని ఈ రెండు కంపెనీలు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆర్థిక మంత్రి చిదంబరం నేతృత్వంలోని మంత్రుల బృందం(జీఓఎం) గురువారం ఇందుకు ఆమోదం తెలిపింది. అదేవిధంగా ఎంటీఎన్ఎల్ సిబ్బందికి పెన్షన్ ప్రతిపాదనకు కూడా ఓకే చెప్పినట్లు జీఓఎం సమావేశం అనంతరం టెలికం మంత్రి కపిల్ సిబల్ వెల్లడించారు. పెన్షన్ కోసం ఏటా రూ.570 కోట్లు వ్యయం అవుతుందని అంచనా. జీఓఎం నిర్ణయానికి ఇక కేబినెట్ ఆమోదం లభించాల్సి ఉంటుం దని సిబల్ చెప్పారు. స్పెక్ట్రం డబ్బు వాపసు లభిస్తే ఈ రెండు కంపెనీలు మళ్లీ గాడిలోపడేందుకు దోహదపడుతుందని భావిస్తున్నట్లు ఆయన వ్యాఖ్యానించారు. బీడబ్ల్యూఏ స్పెక్ట్రం వెనక్కిచ్చేయడం వల్ల బీఎస్ఎన్ఎల్కు రూ.6,725 కోట్లు, ఎంటీఎన్ఎల్కు రూ.5,700 కోట్లు ప్రభుత్వం వావసు చేయనుందని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. ఎంటీఎన్ఎల్ నికర నష్టం 2012-13లో రూ.5,321 కోట్లకు ఎగసింది. అదేవిధంగా బీఎస్ఎన్ఎల్ నికర నష్టం కూడా గతేడాది రూ.8,198 కోట్లుగా ఉండొచ్చని అంచనా. కాగా, జీఓఎం ఆమోదముద్ర నేపథ్యంలో ఎంటీఎన్ఎల్ షేరు గురువారం బీఎస్ఈలో 20% దూసుకెళ్లి రూ.15.35 వద్ద స్థిరపడింది.