భారతదేశంలో విప్లవాత్మక మార్పులు తీసుకురావడంలో ప్రధాన పాత్ర పోషించిన దివంగత భారత ప్రధాని 'రాజీవ్ గాంధీ' గురించి అందరికి తెలుసు. ఇందిరాగాంధీ మరణాంతరం ప్రధానమంత్రి పదవిని అలంకరించిన అతి పిన్న వయస్కుడైన ఈయన హయాంలో సమాచార, కమ్యూనికేషన్ పరిశ్రమలో గణనీయమైన అభివృద్ధి జరిగింది. నేడు రాజీవ్ గాంధీ జన్మదిన సందర్భంగా వాటిని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.
టెలికామ్ రంగంలో విప్లవం..
అప్పట్లో 'రాజీవ్ గాంధీ' ప్రభుత్వం కమ్యూనికేషన్ నెట్‌వర్క్‌ను విస్తరిస్తూ పట్టణాలలో గ్రామాలలో సహాయక మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేయడానికి అనేక చర్యలను చేపట్టింది. దీనికోసం టెలికమ్యూనికేషన్ ఇంజనీర్ శామ్ పిట్రోడాను సలహాదారుగా నియమించుకుని 'సెంటర్ ఫర్ డెవలప్‌మెంట్ ఆఫ్ టెలిమాటిక్స్' (C-DOT)ని ప్రారంభించారు. ఆ తరువాత క్రమంగా డిజిటల్ ఇండియా, స్మార్ట్ సిటీలు, భారత్ నెట్, మేక్ ఇన్ ఇండియా వంటి ప్రధాన కార్యక్రమాలు కూడా పురుడుపోసుకున్నాయి.
మహానగర్ టెలిఫోన్ నిగమ్ లిమిటెడ్ (MTNL) ప్రారంభం..
రాజీవ్ గాంధీ హయాంలో 1986లో టెలిఫోన్ నెట్‌వర్క్‌ను విస్తరించడం జరిగింది. ఇందులో భాగంగానే మహానగర్ టెలిఫోన్ నిగమ్ లిమిటెడ్ ప్రారంభమైంది.
టెలికామ్ నెట్‌వర్క్ డెవలప్మెంట్..
టెలికామ్ నెట్‌వర్క్ కూడా ఈయన హయాంలోనే బాగా అభివృద్ధి చెందటం ప్రారంభమైంది. పబ్లిక్ కాల్ ఆఫీస్ (PCO) విప్లవం గ్రామీణ భారతదేశం ఆకాంక్షలను సాకారం చేయడంలో సహాయపడింది. గ్రామీణ & పట్టణ ప్రాంతాల మధ్య అనుసంధానం పెంచడంలో ఇది సహాయపడింది.
ఇదీ చదవండి: ఫోన్ కొనుక్కోవడానికి ఏడాది జాబ్.. ఇప్పుడు స్మార్ట్‌ఫోన్ కంపెనీకే సీజీఓ
డిజిటల్ ఇండియా..
భారతదేశంలో డిజిటల్ విప్లవం బాగా అభివృద్ధి చెందటానికి రాజీవ్ గాంధీ సైన్స్ అండ్ టెక్నాలజీ, దాని అనుబంధ పరిశ్రమలు చాలా కృషి చేశాయి. అంతే కాకుండా వీరి కాలంలోనే కంప్యూటరైజ్డ్ రైల్వే టిక్కెట్లు కూడా అందుబాటులోకి వచ్చాయి.
ఇదీ చదవండి: ఇషా అంబానీ కారు.. దూరం నుంచి అలా.. దగ్గర నుంచి ఇలా!
సైన్స్ అండ్ టెక్నాలజీ అభివృద్ధి..
సైన్స్ అండ్ టెక్నాలజీ కూడా వాయువేగంగా అభివృద్ధి చెందటం అప్పుడే ప్రారంభమైంది. ఇందులో భాగంగానే పన్నులు, కంప్యూటర్లు, విమానయాన సంస్థలు, రక్షణ, టెలికమ్యూనికేషన్లపై సుంకాలను (ట్యాక్స్) బాగా తగ్గించారు. దేశ అభివృద్ధికి సైన్స్ అండ్ టెక్నాలజీ కీలకమని భావించి అనేక నిర్ణయాలు తీసుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment