rajiv gandhi birth anniversary
-
నా భర్త రాజకీయ జీవితం కిరాతకంగా ముగిసింది.. సోనియా
న్యూఢిల్లీ: భారత మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ 79వ జయంతిని పురస్కరించుకుని ఢిల్లీలో జరిగిన ఓ అవార్డు కార్యక్రమంలో తన భర్త రాజకీయ జీవితం అత్యంత క్రూరంగా ముగిసిందని చెబుతూ భావోద్వేగానికి లోనయ్యారు కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ. భారత మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ 79వ జయంతి సందర్బంగా వీర్ భూమిలో ఆయనకు నివాళులర్పించి ఢిల్లీలోని జవహర్ భవన్లో జరిగిన జాతీయ సద్భావన అవార్డు ప్రదానోత్సవ కార్యక్రమానికి హాజరయ్యారు సోనియా గాంధీ. ఈ కార్యక్రమంలో ఆమెతో పాటు కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షులు మల్లిఖార్జున్ ఖర్గే, మరికొంత మంది కాంగ్రెస్ నేతలు పాల్గొన్నారు. 25వ జాతీయ సద్భావన అవార్డు ప్రదానోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న సోనియా గాంధీ రాజీవ్ గాంధీ గురించి మాట్లాడుతూ.. నా భర్త రాజీవ్ గాంధీ రాజకీయ జీవితం చాలా తొందరగా అత్యంత కిరాతకంగా ముగిసినప్పటికీ ఆయన ఈ కొంత కాలంలోనే ఎవ్వరికి సాధ్యం కాయాన్ని ఎన్నో ఘనతలు సాధించారన్నారు. ఆయనకు దొరికిన కొద్దిపాటి సమయంలోనే దేశం కోసం, ముఖ్యంగా మహిళా సాధికారత కోసం ఎంతో చేశారని జ్ఞాపకము చేశారు. రాజీవ్ గాంధీ ముందుచూపుతో వ్యవహరించడం వల్లనే ఈరోజు దేశవ్యాప్తంగా పంచాయతీల్లోనూ, మున్సిపల్ కార్యవర్గాల్లోనూ మహిళలు సుమారు 15 లక్షల మంది ఉన్నారన్నారు. ఇదంతా ఆనాడు రాజీవ్ గాంధీ పంచాయతీల్లోనూ, మున్సిపాలిటీల్లో మహిళలకు మూడో వంతు స్థానం కల్పించడానికి చేసిన కృషి ఫలితమేనన్నారు. అలాగే ఓటు హక్కును 21 ఏళ్ల నుండి 18 ఏళ్లకు కుదించిన ఘనత కూడా ఆయనకే దక్కుతుందన్నారు. ఈ సందర్బంగా సోనియా గాంధీ ప్రస్తుత పరిస్థితుల గురించి వివరిస్తూ మత సామరస్యాన్ని చెడగొట్టి శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తూ విద్వేషాలను రెచ్చగొట్టడమే ప్రధాన ఎజెండాగా చేసుకుంటున్నారు. వీరికి మరికొంత మంది మద్దతు తెలపడం చాలా ఆశ్చర్యంగా అనిపిస్తుందన్నారు. రాజీవ్ గాంధీ మత, జాతి, భాష, సంస్కృతులను సున్నితమైన అంశాలుగా చెబుతూ వీటిని అందరం కలిసి పండగలా నిర్వహించుకుంటేనే జాతి ఐక్యత సాధ్యమని నమ్మేవారన్నారు. దివంగత ప్రధాని రాజీవ్ గాంధీ తన తల్లి ఇందిరా గాంధీ మరణానంతరం 40 ఏళ్ల వయసులో ప్రధాన మంత్రి గా బాధ్యతలు స్వీకరించిన ఆయన 1989 డిసెంబర్ 2 వరకు ఆ పదవిలో కొనసాగారు. 1944, ఆగస్టు 24న జన్మించిన ఆయన ఎల్టీటీఈ ఆత్మాహుతి దాడిలో 1991, మే 21న మృతి చెందారు. ఈ జాతీయ సద్భావనా అవార్డు 2021-22 సంవత్సరానికి గాను రాజస్థాన్ లోని గురుకుల పాఠశాల బానస్థలి విద్యాపీఠ్ మహిళల గురుకుల సంస్థకు అందజేశారు. ఆ సంస్థ తరపున సిద్దార్ధ శాస్త్రి మాజీ ఉపరాష్ట్రపతి హమీద్ అన్సారీ చేతుల మీదుగా అవార్డును స్వీకరించారు. ఇది కూడా చదవండి: ‘వారసత్వ రాజకీయాలు విషతుల్యం’ -
అంగుళం కూడా చైనా ఆక్రమించలేదనడం అబద్ధం
న్యూఢిల్లీ/లేహ్: లద్దాఖ్‌లోని అంగుళం భూమిని కూడా చైనా ఆర్మీ ఆక్రమించుకోలేదంటూ ప్రధాని మోదీ చేసిన ప్రకటన అబద్ధమని కాంగ్రెస్ నేత రాహుల్ అన్నారు. చైనా సైన్యం అక్కడి పచ్చిక బయళ్లను ఆక్రమించుకోవడంపై లద్దాఖ్ వాసులు ఆందోళన చెందుతున్నారని ఆయన తెలిపారు. తన తండ్రి రాజీవ్ గాంధీ జయంతి సందర్భంగా ఆయనకు నివాళులరి్పంచేందుకు శనివారం రాహుల్ లద్దాఖ్‌కు చేరుకున్నారు. ‘చైనా సైన్యం చొచ్చుకువచ్చి పచి్చక బయళ్లను లాగేసుకుందని ఇక్కడి వారంతా చెబుతున్నారు. భూమి ఆక్రమణకు గురి కాలేదంటూ ప్రధాని చెబుతున్నది నిజం కాదని వాళ్లు స్పష్టంగా చెబుతున్నారు’అని రాహుల్ అన్నారు. కాగా, రాహుల్∙చైనా తరఫున వకాల్తా పుచ్చుకుని మాట్లాడుతున్నట్లుగా ఉందని బీజేపీ మండిపడింది. ఇటువంటి ప్రకటనలతో రాహుల్ దేశం పరువు తీస్తున్నారని ఆరోపించింది. -
ఆధునిక సాంకేతిక సారధి.. టెక్నాలజీకి ఆయనొక వారధి!
భారతదేశంలో విప్లవాత్మక మార్పులు తీసుకురావడంలో ప్రధాన పాత్ర పోషించిన దివంగత భారత ప్రధాని 'రాజీవ్ గాంధీ' గురించి అందరికి తెలుసు. ఇందిరాగాంధీ మరణాంతరం ప్రధానమంత్రి పదవిని అలంకరించిన అతి పిన్న వయస్కుడైన ఈయన హయాంలో సమాచార, కమ్యూనికేషన్ పరిశ్రమలో గణనీయమైన అభివృద్ధి జరిగింది. నేడు రాజీవ్ గాంధీ జన్మదిన సందర్భంగా వాటిని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. టెలికామ్ రంగంలో విప్లవం.. అప్పట్లో 'రాజీవ్ గాంధీ' ప్రభుత్వం కమ్యూనికేషన్ నెట్‌వర్క్‌ను విస్తరిస్తూ పట్టణాలలో గ్రామాలలో సహాయక మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేయడానికి అనేక చర్యలను చేపట్టింది. దీనికోసం టెలికమ్యూనికేషన్ ఇంజనీర్ శామ్ పిట్రోడాను సలహాదారుగా నియమించుకుని 'సెంటర్ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ టెలిమాటిక్స్' (C-DOT)ని ప్రారంభించారు. ఆ తరువాత క్రమంగా డిజిటల్ ఇండియా, స్మార్ట్ సిటీలు, భారత్ నెట్, మేక్ ఇన్ ఇండియా వంటి ప్రధాన కార్యక్రమాలు కూడా పురుడుపోసుకున్నాయి. మహానగర్ టెలిఫోన్ నిగమ్ లిమిటెడ్ (MTNL) ప్రారంభం.. రాజీవ్ గాంధీ హయాంలో 1986లో టెలిఫోన్ నెట్‌వర్క్‌ను విస్తరించడం జరిగింది. ఇందులో భాగంగానే మహానగర్ టెలిఫోన్ నిగమ్ లిమిటెడ్ ప్రారంభమైంది. టెలికామ్ నెట్వర్క్ డెవలప్మెంట్.. టెలికామ్ నెట్వర్క్ కూడా ఈయన హయాంలోనే బాగా అభివృద్ధి చెందటం ప్రారంభమైంది. పబ్లిక్ కాల్ ఆఫీస్ (PCO) విప్లవం గ్రామీణ భారతదేశం ఆకాంక్షలను సాకారం చేయడంలో సహాయపడింది. గ్రామీణ & పట్టణ ప్రాంతాల మధ్య అనుసంధానం పెంచడంలో ఇది సహాయపడింది. ఇదీ చదవండి: ఫోన్ కొనుక్కోవడానికి ఏడాది జాబ్.. ఇప్పుడు స్మార్ట్‌ఫోన్ కంపెనీకే సీజీఓ డిజిటల్ ఇండియా.. భారతదేశంలో డిజిటల్ విప్లవం బాగా అభివృద్ధి చెందటానికి రాజీవ్ గాంధీ సైన్స్ అండ్ టెక్నాలజీ, దాని అనుబంధ పరిశ్రమలు చాలా కృషి చేశాయి. అంతే కాకుండా వీరి కాలంలోనే కంప్యూటరైజ్డ్ రైల్వే టిక్కెట్లు కూడా అందుబాటులోకి వచ్చాయి. ఇదీ చదవండి: ఇషా అంబానీ కారు.. దూరం నుంచి అలా.. దగ్గర నుంచి ఇలా! సైన్స్ అండ్ టెక్నాలజీ అభివృద్ధి.. సైన్స్ అండ్ టెక్నాలజీ కూడా వాయువేగంగా అభివృద్ధి చెందటం అప్పుడే ప్రారంభమైంది. ఇందులో భాగంగానే పన్నులు, కంప్యూటర్లు, విమానయాన సంస్థలు, రక్షణ, టెలికమ్యూనికేషన్లపై సుంకాలను (ట్యాక్స్) బాగా తగ్గించారు. దేశ అభివృద్ధికి సైన్స్ అండ్ టెక్నాలజీ కీలకమని భావించి అనేక నిర్ణయాలు తీసుకున్నారు. -
నాన్నా.. మీ బాటలోనే నేను: రాహుల్ గాంధీ
ఢిల్లీ: దివంతగత భారత మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ జయంతి(79వ) నేడు. ఈ సందర్భంలో దేశవ్యాప్తంగా కాంగ్రెస్ శ్రేణులు రాజీవ్‌కు ఘనంగా నివాళులర్పిస్తున్నాయి. లడ్డాఖ్ పర్యటనలో ఉన్న కాంగ్రెస్ నేత, ఎంపీ రాహుల్ గాంధీ.. పాంగోంగ్ సరస్సు తీరం వద్ద తన తండ్రి చిత్రపటానికి నివాళులర్పించారు. మరోవైపు ఢిల్లీలోని వీర్ భూమి వద్ద కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, రాజీవ్ సతీమణి సోనియా గాంధీ, కూతురు ప్రియాంక గాంధీ వాద్రా.. ఆమె భర్త రాబర్ట్ వాద్రా నివాళులర్పించారు. అదే సమయంలో ట్విటర్లో రాహుల్ గాంధీ ఓ భావోద్వేగమైన పోస్ట్ చేశారు. ‘‘నాన్నా.. దేశం కోసం మీరు కన్న కలలు.. అమూల్యమైన జ్ఞాపకాలు. ప్రతీ భారతీయుడి కలల్ని, కష్టాల్ని అర్థం చేసుకోవడం, అన్నింటికి మంచి భరత మాత గొంతుక వినాలని మీరు పడ్డ తపన ఇవాళ నన్ను మీ బాటలో నడిచేలా చేస్తోంది’’ అంటూ పేర్కొన్నారు. ఇక లేహ్ వద్ద జమ్ము కశ్మీర్ కాంగ్రెస్ యూనిట్ సభ్యులు సైతం రాజీవ్‌కు నివాళులర్పించారు. पापा, आपकी आंखों में भारत के लिए जो सपने थे, इन अनमोल यादों से छलकते हैं। आपके निशान मेरा रास्ता हैं - हर हिंदुस्तानी के संघर्षों और सपनों को समझ रहा हूं, भारत मां की आवाज़ सुन रहा हूं। pic.twitter.com/VqkbxoPP7l — Rahul Gandhi (@RahulGandhi) August 20, 2023 #WATCH | Congress MP Rahul Gandhi pays tribute to his father and former Prime Minister Rajiv Gandhi on his birth anniversary from the banks of Pangong Tso in Ladakh pic.twitter.com/OMXWIXR3m2 — ANI (@ANI) August 20, 2023 #WATCH | Congress Parliamentary Party Chairperson Sonia Gandhi pays floral tribute to former Prime Minister Rajiv Gandhi on his birth anniversary at 'Veer Bhumi' in Delhi. pic.twitter.com/kajhf62T3Y — ANI (@ANI) August 20, 2023 #WATCH | Delhi: Congress National President Mallikarjun Kharge, Congress general secretary Priyanka Gandhi Vadra and Robert Vadra pay tribute to former Prime Minister Rajiv Gandhi on his birth anniversary today, at Veer Bhumi pic.twitter.com/1NKCAyeDqn — ANI (@ANI) August 20, 2023 1944 ఆగష్టు 20వ తేదీన జన్మించిన రాజీవ్ గాంధీ.. భారత దేశానికి ఏడవ ప్రధానిగా (1984 నుంచి 1989) దాకా సేవలందించారు.ఇదిలా ఉంటే.. ఆర్టికల్ 370 తర్వాత రాహుల్ ఆ కేంద్ర పాలిత ప్రాంతంలో పర్యటించడం ఇదే తొలిసారి. బైక్ రైడ్‌తో సందడి చేసిన రాహుల్ గాంధీ.. లేహ్ పర్యటనకు వెళ్లి, అక్కడే మరికొన్నిరోజుల ఉండాలని నిర్ణయించుకున్నారు. ఆగష్టు 25 వరకు అక్కడే పలు కార్యక్రమాల్లో ఆయన పాల్గొంటారు. -
రాజీవ్‌ది చెరగని ముద్ర
సాక్షి, హైదరాబాద్: అనూహ్య పరిస్థితుల్లో ప్రధానిగా పదవి చేపట్టిన రాజీవ్ గాంధీ దేశ చరిత్రలో చెరగని ముద్ర వేశారని టీపీసీసీ అధ్యక్షుడు, ఎంపీ ఎన్.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారు. ప్రపంచంలో భారత్ అగ్రగామిగా ఉండాలనే ఆకాంక్షతో దేశాభివృద్ధికి అనేక సంస్కరణలు ప్రవేశపెట్టిన ఘనత ఆయన దని కొనియాడారు. గురువారం మాజీ ప్రధాన మంత్రి రాజీవ్ గాంధీ 76వ జయంతి సందర్భంగా కాంగ్రెస్ శ్రేణులు ఘనంగా నివాళులర్పించాయి. గాంధీభవన్‌లో జరిగిన కార్యక్రమంలో రాజీవ్ చిత్రపటానికి ఉత్తమ్‌కుమార్ రెడ్డి పూలమాలలు వేసి, దేశానికి ఆయన చేసిన సేవలను స్మరించుకున్నారు. సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, ఎమ్మెల్యే జగ్గారెడ్డి, మాజీ ఎంపీ వి.హనుమంతరావు, మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య, సీఎల్పీ మాజీనేత జానారెడ్డి, ఏఐసీసీ కార్యదర్శి సంపత్ కుమార్, టీపీసీసీ నేతలు అంజన్ కుమార్ యాదవ్, మల్లు రవి, దాసోజు శ్రవణ్, ఉజ్మా షకీర్, ఫిరోజ్ ఖాన్ తదితరులు పాల్గొన్నారు. ఉత్తమ్ మాట్లాడుతూ రాజీవ్‌గాంధీ 40 ఏళ్ల వయసులో ప్రధానిగా బాధ్యతలు చేపట్టి సమర్థంగా పాలించారని అన్నారు. దేశంలో సైన్స్ అండ్ టెక్నాలజీ, ఐటీ అభివృద్ధికి ఆయనే కారణమని పేర్కొ న్నారు. గాంధీ, నెహ్రూ కుటుంబాలు ఈ దేశానికి చేసిన సేవలను మోదీ ప్రభుత్వం తక్కువ చేసి చూపే ప్రయత్నం చేస్తోందని విమర్శించారు. రాజీవ్ బాటలో నడుస్తూ జీహెచ్ ఎంసీ, వరంగల్, ఖమ్మం మున్సిపల్ ఎన్నికల్లో మంచి ఫలితాలు సాధిస్తామన్నారు. -
రాజీవ్ గాంధీకి ఘనంగా నివాళులు
భారత మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ 69వ జయంతి సందర్భంగా మంగళవారం జాతి యావత్తు ఆయన్ని స్మరించుకుంది. న్యూఢిల్లీలోని 'వీర్ భూమి' వద్ద ప్రముఖ నేతలు, కుటుంబ సభ్యులు పుష్పగుచ్ఛాలు ఉంచి ఘనంగా నివాళులర్పించారు.