
Centre Begins Auction Of BSNL MTNL Assets: ప్రభుత్వ రంగ టెలికం సంస్థలు బీఎస్‌ఎన్‌ఎల్, ఎమ్‌టీఎన్‌ఎల్‌కు చెందిన రియల్ ఎస్టేట్ ఆస్తులను కేంద్ర ప్రభుత్వం వేలానికి ఉంచనుంది. ఈ వేలంతో సుమారు రూ. 1,100 కోట్లను సేకరించాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. బీఎస్‌ఎన్‌ఎల్, ఎమ్‌టీఎన్‌ఎల్ సంస్థలకు చెందిన ఆస్తుల విక్రయాల జాబితాను డిపార్ట్మెంట్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ అండ్ పబ్లిక్ అసెట్ మేనేజ్‌మెంట్ (దీపం) వెబ్‌సైట్‌లో ఉంచింది.
చదవండి: సామాన్యులకు కేంద్రం షాక్..! భారీగా పెరగనున్న దుస్తులు, చెప్పుల ధరలు
ఆస్తుల విక్రయాల జాబితాలో హైదరాబాద్, ఛండీగడ్, భావనగర్, కోల్‌కతా నగరాల్లోని బీఎస్‌ఎన్‌ఎల్ ప్రాపర్టీలను రూ. 800 కోట్ల రిజర్వ్ ప్రైజ్‌కు వేలం వేయనున్నట్లు తెలుస్తోంది. వాసరి హిల్, గోరెగాన్ (ముంబై) లలోని ఎమ్‌టీఎన్‌ఎల్ ఆస్తులను రూ. 270 కోట్ల రిజర్వ్ ప్రైజ్‌కు వేలం వేయనున్నారు. నాన్ కోర్ అసెట్ మానిటైజేషన్ ప్లాన్‌లో భాగంగా ఎమ్‌టీఎన్‌ఎల్‌కు చెందిన ఓషివారాలోని 20 అంతస్తుల ఫ్లాట్‌ను కూడా అమ్మకానికి పెట్టింది. ఈ ఫ్లాట్‌ను గత ఏడాది డిసెంబర్ 14 న ఈ–వేలం కింద సేల్‌కు ఉంచారు. రివైవల్ స్కీమ్ కింద బీఎస్‌ఎన్‌ఎల్, ఎమ్‌టీఎన్‌ఎల్ సంస్థలకు రూ. 69 వేల కోట్లు ఇవ్వాలని 2019 అక్టోబర్‌లో కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది.
చదవండి: జనరల్ ఇన్స్యూరెన్స్ ఉద్యోగులకు త్వరలో తీపికబురు