న్యూఢిల్లీ: నాలుగో రౌండ్ వేలంలో 99 బొగ్గు గనులను వేలంలో ఉంచగా, కేవలం ఎనిమిది బ్లాకులను మాత్రమే విజయవంతంగా వేలం వేసినట్లు బుధవారం ఆ శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి లోక్‌సభకు తెలిపారు. ఆంధ్రప్రదేశ్, బీహార్, ఛత్తీస్‌గఢ్, జార్ఖండ్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఒడిశా, తెలంగాణ, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో ఈ గనులు ఉన్నాయని తెలిపారు.
కాగా, వాణిజ్య పరిశ్రమల మంత్రిత్వశాఖ సహాయమంత్రి సోమ్ ప్రకాశ్ లోక్‌సభకు ఒక లిఖిత పూర్వక సమాధానం ఇస్తూ, 2019 ఏప్రిల్ నుంచి ఈ ఏడాది మార్చి వరకు దేశవ్యాప్తంగా విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల (ఎఫ్‌డీఐ) నిబంధనలను ఉల్లంఘించినట్లు అనుమానిస్తున్న 281 కేసులను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) విచారణకు స్వీకరించినట్లు తెలిపారు.
చదవండి: యూజర్లకు భారీ షాక్, మోత మొదలైంది..మళ్లీ పెరగనున్న ఫోన్ బిల్!
Comments
Please login to add a commentAdd a comment