న్యూఢిల్లీ: దేశంలో రెండో అతిపెద్ద టెలికాం ఆపరేటర్ ఐడియా సెల్యులార్‌కు మార్కెట్ రెగ్యులేటరీ భారీ షాక్చింది. అక్రమంగా అధిక ఛార్జీలు వసూలు చేసినందుకుగా సుమారు మూడుకోట్ల రుపాయలు చెల్లించాలని ఆదేశించింది. రూ. 2.97 కోట్లను చెల్లించాల్సిందిగా టెలికాం రెగ్యులేటరీ ట్రాయ్ ఆదేశించింది.ముఖ్యంగా బిఎస్ఎన్ఎల్, ఎంటిఎన్ఎల్ నెట్‌వర్క్‌కు కాల్ చేసిన తన చందాదారులపై అధిక ఫీజు వసూలు చేసిందని ఆరోపిస్తూ ఈ ఆదేశాలు జారీ చేసింది.
ట్రాయ్ సలహాదారు అబ్బాస్ సంతకం చేసిన ఆగస్టు 24, 2017 నాటి ఉత్తర్వు ప్రకారం రూ. 2,97,90,173 రూపాయల మొత్తాన్ని డిపాజిట్ చేయాలని ఐడియాని ఆదేశించింది. మే 2005 నుంచి 2007 మధ్య కాలంలో కస్టమర్లనుంచి ఈ చార్జీలను వసూలు చేసినట్టు తెలిపింది. అంతేకాదు ఈ సొమ్మును 15 రోజుల్లోగా చెల్లించాలని తెలిపింది.
టెలికాం వినియోగదారుల విద్య మరియు భద్రతా నిధి (టీసీఈపీఎఫ్) లో డిపాజిట్ చేయవలసిందిగా ఆదేశించింది. ఎందుకంటే ఆ కాలానికి సంబంధించిన రేటెడ్ కాల్ డేటా రికార్డు అందుబాటులోలేదని ఈ సొమ్మును ఐడియా చందాదారులకు తిరిగి చెల్లించలేమని ఐడియా పేర్కొన్న కారణంగా టీసీఈపీఎఫ్‌లో జతచేయాలని కోరింది.
ఐడియాకు షాక్: రూ.3కోట్ల ఫైన్
Published Mon, Aug 28 2017 11:00 AM | Last Updated on Tue, Sep 12 2017 1:12 AM
Advertisement