సాక్షి,ముంబై: ప్రభుత్వ రంగ టెలికాం సంస్థలు బీఎస్‌ఎన్‌ఎల్, ఎంటీఎన్‌ఎల్ విలీనానికి ఆమోదం లభించింది. ప్రైవేటు రంగం దిగ్గజాల నుంచి పోటీ కారణంగా సంక్షోభంలో పడిపోయిన బీఎస్‌ఎన్‌ఎల్‌ను గట్టెక్కించేలా కేంద్ర కేబినెట్ ఎట్టకేలకు బుధవారం కీలక నిర్ణయం తీసుకుంది. అలాగే ఉద్యోగుల కోసం ఆకర్షణీయమైన స్వచ్ఛంద విరమణ పథకం(వీఆర్‌ఎస్)ప్యాకేజీ 4జీ స్పెక్ట్రం కేటాయింపులకు కూడా క్యాబినెట్ ఆమోదించింది. పునరుజ్జీవనం కోసం రూ. 15,000 కోట్లు సార్వభౌమ బాండ్ల జారీకి సూత్రప్రాయంగా ఆమోదం ఇచ్చింది. అయితే 4జీ స్పెక్ట్రం కేటాయింపు 2016 ధరల కనుగుణంగా ఉంటుందని కేంద్ర టెలికాం మంత్రి రవిశంకర్‌ప్రసాద్ మీడియాకు వెల్లడించారు. అలాగే వీటి ఆస్తుల మానిటైజ్ ద్వారా రూ.38,000 కోట్ల రూపాయల డబ్బునున ఆర్జించనున్నట్టు చెప్పారు.
వీఆర్‌ఎస్ ప్యాకేజీని రెండు కంపెనీలకు వర్తింపచేస్తామని కేంద్రమంత్రి వివరించారు. 53 సంవత్సరాలు అంతకంటే ఎక్కువ వయస్సున్న ఉద్యోగి వీఆర్‌ఎస్‌ను ఎంచుకుంటే, 60 సంవత్సరాల వయస్సు వరకు జీతం, పెన్షన్, 125 శాతం గ్రాట్యుటీ అందిస్తామన్నారు. జాతీయ ప్రయోజనాలకోసం సాహసోపేతమైన పునరుద్ధరణ ప్యాకేజీతో బీఎస్‌ఎన్‌ఎల్,ఎంటీఎన్‌ఎల్ విలీన నిర్ణయం తీసుకున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి కృతజ్ఞతలు తెలిపిన ఆయన ఈ సంస్థలను లాభదాయకంగా మార్చడానికి రెండు సంస్థల ఉద్యోగులు తీవ్రంగా కృషి చేయాలని పిలుపునిచ్చారు.
#Cabinet has decided to offer an attractive Voluntary Retirement plan to the employees of BSNL and MTNL. pic.twitter.com/jaAsIvByrJ
— Ravi Shankar Prasad (@rsprasad) October 23, 2019
Comments
Please login to add a commentAdd a comment