రోజుకి 2 జీబీ డేటా..ఎక్కడ..ఏ కంపెనీ? | MTNL takes on Reliance Jio, Bharti Airtel, to offer 2GB data per day | Sakshi
Sakshi News home page

రోజుకి 2 జీబీ డేటా..ఎక్కడ..ఏ కంపెనీ?

Published Fri, Mar 31 2017 11:44 AM | Last Updated on Tue, Sep 5 2017 7:35 AM

రోజుకి 2 జీబీ డేటా..ఎక్కడ..ఏ కంపెనీ?

రోజుకి 2 జీబీ డేటా..ఎక్కడ..ఏ కంపెనీ?

న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ ఎంటిఎన్ఎల్  కూడా టారిఫ్‌ వార్‌ లోకి  ప్రవేశించింది.   తాజాగా సంస్థ  దేశీయ  టెలికాం దిగ్గజాల కంటే చవక ధరలో డేటా సేవలను అందించనుంది. ఏప్రిల్ 1 నుంచి మొదలయ్యే కొత్త ప్లాన్స్‌ను  ప్రకటించింది.  ఎంటీఎన్‌ఎల్‌ 31 వ వార్షికోత్సవం సందర‍్భంగా ఖాతాదారులకు  తక్కువ ధరకే డాటా సేవలను అందించనుంది.

ఎంటిఎన్ఎల్ వినియోగదారుల  కోసం  28 రోజుల వాటిడిటీతో  రూ.319  ల రీచార్జ్‌ పై  2 జీబీ 3జీబీ డేటాను,  కోసం దాని నెట్వర్క్ లోపల  అపరిమిత కాలింగ్  ఆఫర్‌ అందిస్తోంది.  ఇతర నెట్వర్క్లకు 25 నిమిషాల  ఫ్రీ కాలింగ్‌ సదుపాయం,  ఆ తర్వాత నిమిషానికి 25 పైసలు  వసూలు చేయనుంది.

దేశీయ టెలికాం మేజర్లు  బీఎస్‌ఎన్‌ఎల్‌,  భారతి ఎయిర్‌టెల్‌, జియో టారిఫ్‌ ప్లాన్లకంటే తక్కువకే  ఈ డేటా సేవలను అందిస్తోంది. అయితే ఢిల్లీ ముంబై మొబైల్ వినియోగదారులకు ప్రస్తుతం ఈ ప్లాన్‌ అందుబాటులో ఉన్నట్టు సంస్థ ఒక ప్రకటనలో తెలిపింది. ఈ ప్రమోషనల్ ఆఫర్ 90 రోజుల వరకు చెల్లుబాటులో ఉంటుందని పేర్కొంది.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement