బీఎస్‌ఎన్‌ఎల్, ఎంటీఎన్‌ఎల్‌లో ముగిసిన వీఆర్‌ఎస్‌ | 92700 BSNL And MTNL Employees Opt For Voluntary Retirement | Sakshi
Sakshi News home page

బీఎస్‌ఎన్‌ఎల్, ఎంటీఎన్‌ఎల్‌లో ముగిసిన వీఆర్‌ఎస్‌

Published Wed, Dec 4 2019 2:36 AM | Last Updated on Wed, Dec 4 2019 2:36 AM

 92700 BSNL And MTNL Employees Opt For Voluntary Retirement - Sakshi

న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ టెలికం సంస్థలు బీఎస్‌ఎన్‌ఎల్, ఎంటీఎన్‌ఎల్‌ ప్రవేశపెట్టిన స్వచ్ఛంద పదవీ విరమణ (వీఆర్‌ఎస్‌) పథకం మంగళవారంతో ముగిసింది. రెండు సంస్థల్లో 92,700 మంది ఉద్యోగులు వీఆర్‌ఎస్‌ ఎంచుకున్నట్లు అధికారవర్గాలు తెలిపాయి. బీఎస్‌ఎన్‌ఎల్‌లో 78,300 మంది, ఎంటీఎన్‌ఎల్‌లో 14,378 మంది దీన్ని ఎంచుకున్నారు. ‘ఊహించిన స్థాయిలోనే ఇది ఉంది. మేం సుమారు 82,000 మేర సిబ్బంది సంఖ్య తగ్గుతుందని భావించాం.

78,300 మంది వీఆర్‌ఎస్‌ ఎంచుకోగా, మరో 6,000 మంది రిటైరయ్యారు‘ అని బీఎస్‌ఎన్‌ఎల్‌ సీఎండీ పి.కె. పుర్వార్‌ తెలిపారు. మరోవైపు  14,378 మంది  వీఆర్‌ఎస్‌ ను ఎంచుకున్నట్లు ఎంటీఎన్‌ఎల్‌ సీఎండీ సునీల్‌ కుమార్‌ తెలిపారు. వీఆర్‌ఎస్‌తో ఇరు సంస్థల వేతన భారం రూ. 8,800 కోట్ల మేర తగ్గనుంది. బీఎస్‌ఎన్‌ఎల్‌లో వేతన పరిమా ణం రూ.14,000 కోట్ల నుంచి రూ. 7,000 కోట్లకు దిగివస్తుందని పుర్వార్‌ తెలిపారు. ఎంటీఎన్‌ఎల్‌ వేతన భారం రూ. 2,272 కోట్ల నుంచి రూ. 500 కోట్లకు తగ్గుతుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement