
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ టెలికం సంస్థలైన బీఎస్‌ఎన్‌ఎల్–ఎంటీఎన్‌ఎల్‌ల విలీన ప్రక్రియ వచ్చే 18 నుంచి 24 నెలల్లోనే పూర్తికానుందని టెలికం శాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ వెల్లడించారు. లోక్‌సభలో అడిగిన ప్రశ్నకు లిఖితపూర్వక సమాధానం ఇచ్చిన ఆయన ఈ విషయాన్ని స్పష్టంచేశారు. భారీ నష్టాలతో కుదేలవుతున్న ఈ సంస్థలను విలీనం చేసేందుకు అక్టోబర్ 23న కేంద్ర క్యాబినెట్ ఆమోదముద్ర వేసిందని వివరించారు. 2010 నుంచి బీఎస్‌ఎన్‌ఎల్ నష్టాల్లో ఉండగా.. గత పదేళ్ల నుంచి ఎంటీఎన్‌ఎల్ నష్టాలను ప్రకటిస్తోందని చెప్పారు. ఇరు సంస్థల రుణ భారం రూ. 40,000 కోట్లుగా ఉందన్నారు. బీఎస్‌ఎన్‌ఎల్ ప్రకటించిన స్వచ్ఛంద పదవీ విరమణ పథకం (వీఆర్‌ఎస్)కు 77,000 మందికి పైగా, ఎంటీఎన్‌ఎల్ వీఆర్‌ఎస్‌కు 13,532 మంది ఉద్యోగులు దరఖాస్తు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment