అందరూ అన్ని కూరగాయలు తినరు. చాలావరకు ఎక్కవ మంది కాకరకాయ, వంకాయ తినని చెబుతుంటారు. వంకాయల్లో తెల్ల వాటినే ఇష్టంగా ఎక్కువ మంది తినడం విశేషం. కానీ ఊదారంగులో ఉండే వంకాయలంటే చాలామంది నచ్చదు. దీంతో ప్రముఖ చెఫ్‌లు చాలా రకాల వంటకాలు కూడా చేస్తుంటారు. అయితే ఇదంతా ఎందుకు చెబుతున్నానంటే ఈ ఊదారంగు వంకాయతో చేసే భారతీయ వంటకమే అత్యంత వరస్ట్ కర్రీగా చెత్త ఆహారాల జాబితాలో స్థానం దక్కించుకుంది. ఎందువల్లా అనే కదా?
ప్రముఖ ఆన్‌లైన్ ఫుడ్ పోర్టల్ 'టేస్ట్ అట్లాస్' ప్రతి ఏడాది ప్రపంచంలోనే టాప్ వంద చెత్త ఆహారాల జాబితాలను విడుదల చేస్తుంది. అలానే ఈసారి కూడా విడుదల చేయగా.. మనదేశం నుంచి తక్కువ రేటింగ్స్ పొందిన ఆలు భైంగైన్ ఆ జాబితా స్థానం దక్కించుకుంది. ఇది దాదాపు వంద వంటకాల్లో 60వ స్థానాన్ని దక్కించుకుంది. దీన్ని బంగాళదుంప, వంకాయ, ఉల్లిపాయ, టమాటాలు, అల్లం వెల్లులి పేస్టు వేసి చేస్తారు. ఇది గ్రేవీ వంటకం. దీన్ని ఇష్టపడే వారు మన దేశంలో చాలా తక్కువ మంది ఉన్నారు. అందుకే దీనికి తక్కువ రేటింగ్ వచ్చింది.
చెప్పాలంటే ఈ రకమైన వంటకాన్ని ఉత్తర భారతదేశంలోనే ఎక్కువగా తింటారట. ప్రపంచంలో అత్యంత వరస్ట్ కర్రీ అత్యంత తక్కువ రేటింగ్‌తో తొలి స్థానం దక్కించుకున్న వంటకంగా హాక్లర్ నిలిచింది. ఇది ఐస్లాండ్‌కి చెందిన వంటకం. దీన్ని షార్క్ మాంసంతో మూడు నెలల పాటు పులియబెట్టి చేస్తారట. ఇది చాలా ఘాటైన రుచిన కలిగి ఉండటంతో అంత తేలిగ్గా ఎవరికీ నచ్చదట. పైగా తినేవారి సంఖ్య కూడా తక్కువ. ముఖ్యంగా ఐస్లాండ్‌లో ఉండే స్థానిక ప్రజలే దీన్ని ఇష్టంగా తింటారట. పర్యాటకులు మాత్రం ఆ కూర జోలికి పోనేపోరట.
ఇక రెండో స్థానంలో అమెరికాకు చెందని రామన్ బర్గర్ నిలిచింది. దీన్ని రామన్ న్యూడిల్స్‌తో చేసే బర్గర్ ఇది. మధ్యలో మాంసాన్ని నింపి తయారుచేస్తారు. చాలా తక్కువ మందికి మాత్రమే ఇది నచ్చుతుంది. కాగా, ఈ టేస్టీ అట్లాస్ పోర్టల్‌లో ఎవరికీ ఏ ఆహారం నచ్చలేదో ప్రతి దేశానికి చెందిన ప్రజలు పాల్గొని చెప్పొచ్చు. అయితే ఏ వంటకాలు బాగోవని తక్కువ రేటింగ్ ఇస్తారో వాటన్నంటిని వంద చెత్త వంటకాలలో ఎంపిక చేస్తారు. అలా మన దేశం నుంచి ఆలు భైంగైన్ ఈసారి చోటు దక్కించుకుంది.
(చదవండి: బొటానికల్ వండర్! మానవ పెదవులు పోలిన మొక్క! ఎక్కడుందంటే..?)
Comments
Please login to add a commentAdd a comment