భారతదేశంలో వివిధ రకాల ఆహారపు అలవాట్లు ఉన్నాయి. ప్రాంతాల వారీగా విభిన్న రుచులతో కూడిన ఆహారం ఆస్వాదిస్తారు. అవన్నీ సంప్రదాయాలకు అనుగుణంగా ఆరోగ్య స్ప్రుహతో ఏర్పరచుకున్న మధురమైన రెసిపీలు. అందులో ప్రముఖంగా ఆకర్షించేవి చట్నీలు, పచ్చళ్లు, పొడులు, ఆవకాయ తదితరాలు. అబ్బా..! అవి తినేందుకు ఎంతలా స్పైసీగా నోరు మండుతున్న వదులబుద్ధి కాదు. ఎన్ని కూరలు ఉన్నా.. పక్కన కొద్దిగా పచ్చడి లేదా ఏదో ఒక చట్నీ, కొంచెం పొడి ఉంటేగానే భోజనం సంపూర్ణంగా ఉండదు. ఇలా ఇన్ని రకాల పదార్థాల కలయికతో తింటే పొట్ట నిండుగా, మనసు హాయిగా ఉంటుంది. అందుకే మన విభిన్న రుచులను గుర్తించేలా ప్రతి ఏడాది సెప్టెంబర్ 24న చట్నీ డే గా ఏర్పాటు చేసి మరీ సెలబ్రేట్ చేసుకుంటున్నారు. ఆ రోజు విభిన్న చట్నీలతో విందులు ఏర్పాటు చేసుకుని మన పురాతన సంప్రదాయాన్ని గుర్తు చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో చట్నీ, పొడులు, ఆవకాయ, పచ్చళ్ల మధ్య తేడా ఏంటో సవివరంగా చూద్దాం..!.
చట్నీ
చట్నీ అనే పదం 'చాట్నీ' అనే పదం నుండి ఉద్భవించింది, దీని అర్థం 'నొక్కడం'. ఇది మొఘల్ సామ్రాజ్య చరిత్రలో పాతుకుపోయింది. పాలకుడు షాజహాన్ అనారోగ్యానికి గురైనప్పుడు తొలిసారిగా ఈ చట్నీ అనే వంటకం వచ్చిందని అంటారు. ఆ సమయంలో ఆయన అనారోగ్యం నయం అయ్యేందుకు ఆస్థాన వైద్యులు సుగంధ ద్రవ్యాలతో తయారు చేసిన చట్నీ తినాల్సిందిగా సూచించారు. అలా వంట వాళ్లు షాజహాన్ కోసం పుదీనాతో చట్నీ చేసి పెట్టారు.
అయితే బిట్రీష్ పాలనలో చట్నీ అనేదానికి వేరే అర్థాన్ని సంతరించుకుంది. ఎందుకంటే ఈస్ట్ ఇండియా కంపెనీ మన దేశంలో పండే మామిడిపండ్లు, చింతపండు వంటి వాటిని ఇంగ్లండ్‌కి ప్రిజర్వేటివ్‌గా తరలించే క్రమంలో ఒక విధమైన స్వీట్‌నెస్ లిక్విడ్ రూపంలో తరలించింది. దాన్నే వాళ్లు చట్నీ అనిపిలిచేవారు. ఇది యూరోపియన్ చట్నీల సంప్రదాయంగా చెప్పొచ్చు.
పచ్చడి..
ఇది ఉప్పునీటిలో నిల్వ ఉంచేందుకు ఉపయోగించింది కాస్త ఊరగాయ పచ్చడిగా రూపాంతరం చెందింది. మోసొటొటేమియా నాగరికత నుంచి ఈ విధమైన ఆహార సంరక్షణ ఉండేది. 'పికెల్' అనే పదం డచ్ పదం 'పెకెల్' నుంచి వచ్చింది. దీని అర్థం ఉప్పునీరు. భారత్‌లో దోసకాయ, మామిడికాయ వంటి వాటిని ఉప్పువేసి ఇలా నిల్వ ఉంచేవారు. ఆ తర్వాత వాటిని వివిధ మసాల దినుసులతో పచ్చడిగా చేయడం వంటివి చేశారు.
ఆవకాయ...
ఈ పదం పర్షియన్ పదం నుంచి వచ్చింది. పోర్చుగీస్ వైద్యుడు గార్సియా ఓర్టా రచనలలో ఈ పదం గురించి వినిపిస్తుంది. శరీరానికి వేడి కలిగించే వంటకంగా రూపొందించారు. అయితే దీన్ని నూనె మసాలా దినుసులతో నిల్వ చేస్తారు. ఊరగాయ పద్ధతిలోనే.. కాకపోతే ఇక్కడ అధికంగా నూనెతో భద్రపరచడం జరుగుతుంది. ఇక్కడ నూనె, వివిధ మసాలాతో తయారు చేస్తారు.
పొడి..
దక్షిణ భారత పాకశాస్త్ర నిపుణుల క్రియేటివిటీనే ఈ పొడిగా చెప్పొచ్చు. దీన్ని కొందరూ చట్నీగా పిలుస్తారు కూడా. ఇది విజయనగర రాజవంశం సాహిత్యం, తమిళ గ్రంథాల్లోనూ ఎక్కువగా ఈ పొడుల ప్రస్తావన వినిపిస్తుంది. 'పొడి' అనే పదానికి తెలుగు, తమిళ, మలయాళంలో అర్థం మెత్తటి పౌడర్ అని అర్థం.
ఆంధ్రప్రదేశ్‌లో నువ్వుల పొడి, కారప్పొడి ఫేమస్. వీటిని నెయ్యి లేదా నూనెతో తింటే ఉంటుంది రుచి.. అంటుంటేనే నోటిలో నీళ్లూరిపోతుంటాయి. ఎక్కువగా దోస, ఇడ్లీల, వేడి వేడి అన్నంలోనూ తింటుంటారు. అంతేగాదు పలుచోట్ల కాకరకాయ పొడి, బీరకాయ పొట్టు పొడి, కంది పొడి వంటి వివిధ రకాల పొడులు కూడా చేస్తుంటారు.
(చదవండి: మిస్ యూనివర్స్ ఇండియా 2024గా రియా సింఘా! 'తాజ్ మహల్ కిరీటం"..!)
Comments
Please login to add a commentAdd a comment