
ఈ చెత్త మాకొద్దు..
విజయనగరం : ఈ చెత్త మాకొద్దంటూ పార్వతీపురం సర్కిల్ ఇన్స్‌పెక్టర్ కార్యాలయం ఎదుట బుధవారం రావికోనబట్టివలస గిరిజనులు ఆందోళన చేశారు. పార్వతీపురం మున్సిపాలిటీ చెత్తను డంపింగ్ చేయడానికి రావికోనబట్టివలస వద్ద డంపింగ్ యార్డును ఏర్పాటు చేయనున్నారు. అందుకోసం మున్సిపాలిటీ అధికారులు సన్నాహాలు చేస్తుండటంతో గిరిజనులు నిన్న రోడ్డుపై వాహనాలను అడ్డుకున్నారు. ఈ ఆందోళనలో చుట్టుపక్కల ఉన్న ఆరు గ్రామాల సర్పంచ్‌లతో పాటు గిరిజనులు పాల్గొన్నారు. ఈ చెత్తతో మాకు నిరంతరం దుర్గంధంతో పాటు రోగాలు వస్తాయని, చెత్తను పాత డంపింగ్ యార్డు వద్దే వేయాలని వారు కోరారు.
(పార్వతీపురం)