
ఉపాధి కూలీల ధర్నా
విజయనగరం : విజయనగరం జిల్లాలో ఉపాధి కూలీలు ధర్నాకు దిగారు. ఈ సంఘటన గురువారం విజయనగరం జిల్లా బొబ్బిలి మండలం కోమటిపల్లి గ్రామంలో జరిగింది. వివరాలు.. గ్రామానికి చెందిన సుమారు 850 మంది గురువారం ఉపాధి కూలీ పనికి హాజరయ్యారు. అయితే, ఫీల్డ్ అసిస్టెంట్ ఎంతసేపటికీ రాకపోవడం, మస్టర్ వేయకపోవడంతో ఆగ్రహించారు. దీంతో అధికారులకు వ్యతిరేకంగా ప్రధాన రహదారిపై ధర్నాకు దిగారు. దీంతో ఇరువైపుల భారీగా ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడి, రాకపోకలు నిలిచిపోయాయి. విషయం తెలిసిన బొబ్బిలి సీఐ, ఉపాధి హామీ ఏపీడీలు సంఘటనా స్థలానికి చేరుకొని పరిస్థితిని సమీక్షించారు. అధికారులు హామీ ఇవ్వడంతో కూలీలు ధర్నా విరమించారు.
(బొబ్బిలి)