వన్‌వే రహదారులపై అధికారుల సర్వే
నాగార్జునసాగర్
పుష్కర స్నానాలకు వచ్చే భక్తులకు ఇబ్బందులు ఎదురుకాకుండా ఉండేందుకు అధికారులు వన్‌వే రహదారుల ఏర్పాటుకు శనివారం సర్వే నిర్వహించారు. నాగార్జునసాగర్‌కు వచ్చి స్నానాలు చేసి తిరుగు ప్రయాణంలో హాలియా వైపు వెళ్లే వారు నెల్లికల్లు క్రాస్‌రోడ్డు నుంచి పిల్లిగుండ్ల తండా మీదుగా పేరూరు నుంచి హాలియాకు చేరేందుకు రోడ్డు ఎలా ఉందో చూడటంతో పాటు ఎంత సమయం పడుతుంది? దూరం ఎన్ని కిలోమీటర్లు వస్తుందనే అంశంపై సర్వే నిర్వహించారు. పుష్కరాలను ప్రతిష్టాత్మకంగా నిర్వహించేందుకు ఉన్న అన్ని అవకాశాలును వినియేగించుకునేందుకు అధికారులు ప్రయత్నాలు మొదలు పెట్టారు. ఈ సర్వేలో స్పెషల్ ఆఫీసర్ మోహన్‌రెడ్డితో పాటు హాలియా సీఐ పార్థసారథి,ఆర్టీసీ అధికారులు ఉన్నారు.