కొల్లేరు కటకట
జలకళ.. పచ్చని పైరులు.. విదేశీ విహంగాల కిలకిలరావాలతో ప్రకృతి హŸయలొలికించే కొల్లేరు వెలవెలబోతోంది...
ఏలూరు : జలకళ.. పచ్చని పైరులు.. విదేశీ విహంగాల కిలకిలరావాలతో ప్రకృతి హŸయలొలికించే కొల్లేరు వెలవెలబోతోంది. ఆసియాలోని పెద్ద మంచినీటి సరస్సు దుస్థితి ఇది. నిత్య జలం.. పచ్చతోరణం అన్నట్టుండే కొల్లేరును కరువు కాటేసింది. ఏప్రిల్ మొదట్లోనే కష్టాలను తెచ్చిపెట్టింది. సరస్సులో పలు ప్రాంతాలు ఎడారిని తలపిస్తున్నాయి. బీటలు వారడంతో పచ్చదనం కనుమరుగై పశుపక్ష్యాదులు అల్లాడుతున్నాయి. చుక్కనీరు జాడ లేక ఆకలితో అలమటిస్తున్నాయి. అక్కడక్కడా కనిపిస్తున్న కొద్దిపాటి నీటి వద్ద విదేశీ పక్షులు సేద తీరుతున్నాయి. మరిన్ని రోజులు గడిస్తే నీటి కష్టాలు మరింత పెరుగుతాయని ఈ ప్రాంత ప్రజలు ఆందోళన చెందుతున్నారు. కొల్లేరు దుర్భిక్షానికి సజీవ సాక్ష్యాలు ఈ దృశ్యాలు.