kolleru
-
చిత్తడి నేలలు.. పర్యావరణ నేస్తాలు
కైకలూరు: ఉపరితలంపై ఏడాది పొడవునా ఎక్కువ కాలం నీరు నిల్వ ఉండే భూములను చిత్తడి నేలలు అంటారు. ఇవి జీవరాశుల మనుగడకు అనువైనవి. ఇరాన్‌లోని రామ్సర్ నగరంలో 1971 ఫిబ్రవరి 2న నిర్వహించిన అంతర్జాతీయ చిత్తడి నేలల సదస్సులో ప్రపంచవ్యాప్తంగా వీటి ఆవశ్యతను గుర్తించారు. దేశవ్యాప్తంగా 23 రాష్ట్రల్లో 85 రామ్సర్ సైట్లలో 13,688.0903 హెక్టర్లలో చిత్తడి నేలలు ఉండగా, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో 3,719.08 హెక్టర్లలో విస్తరించి ఉన్నాయి. తెలుగు రాష్ట్రాల్లోనే చిత్తడి నేలలగా రామ్సర్ గుర్తించిన ఏకైక కొల్లేరు సరస్సు ఏలూరు, పశ్చిమగోదావరి జిల్లాల్లో వ్యాపించి ఉంది. కొల్లేరు నిలయం కొల్లేరు ప్రాంతంలో 2,22,689 ఎకరాల విస్తీర్ణాన్ని 2002 ఆగస్టు 19న రామ్సర్ సైట్‌గా గుర్తించారు. చిత్తడి నేలల నిలయమైన కొల్లేరుకు ఆస్ట్రేలియా, నైజీరియా, ఈజిప్టు, ఇండోనేషియా వంటి దేశాల నుంచి వలస పక్షులు విడిదికి వస్తున్నాయి. ప్రపంచ పెలికాన్ పక్షుల్లో 40 శాతం శీతాకాలంలో కొల్లేరుకు రావడానికి చిత్తడి నేలలే కారణం. కొల్లేరులో దాదాపు 182 రకాల పక్షులు సంచరిస్తున్నాయి. కృష్ణా, గోదావరి, తుంగభద్ర, కావేరి, హిమాలయాలు వంటి ప్రాంతాల్లో సరస్సులు, మడ అడవులు, పరీవాహక ప్రాంతాలు చిత్తడి నేలల కోవలోకి వస్తాయి. ఈ ఏడాది ‘భవిష్యత్తు కోసం చిత్తడి నేలలను రక్షించడం’ అనే నినాదంతో అవగాహన కార్యక్రమాలు చేపడు తున్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో 56.25 హెక్టార్లు పైగా విస్తీర్ణంలో 1,943 చిత్తడి నేలలు 3,719.08 చరుపు కిలోమీటర్లలో విస్తరించి ఉన్నాయి. ప్రమాదంలో చిత్తడి నేలలు ఇంటర్ గవర్నమెంటల్ సైన్స్–పాలసీ ప్లాట్‌ఫాం ఆన్ బయోడైవర్సిటీ అండ్ ఎకో సిస్టమ్ సర్వీసెస్ (ఐపీబీఈఎస్) గ్లోబల్ అంచనా ప్రకారం చిత్తడి నేలలు అడువుల కంటే మూడు రెట్లు వేగంగా కనుమరుగవుతున్నాయి. చిత్తడి నేలలు భూ ఉపరితలంపై 6 శాతం మాత్రమే ఉన్నా మొత్తం వృక్ష, జంతు జాతులలో 40 శాతం చిత్తడి నేలల్లోనే నివసిస్తున్నాయి. అడవుల నరికివేత, రసాయనాల వాడకం, ఆక్రమణలు వల్ల చిత్తడి నేలలు సహజత్వాన్ని కోల్పోతున్నాయి. కొల్లేరు సరస్సులో ఆక్రమణలను మూడు నెలల్లో తొలగించాలని సుప్రీంకోర్టు రాష్ట్రం ప్రభుత్వానికి ఆదేశించడానికి కొల్లేరు చిత్తడి నేలల ప్రాంతం కావడమే ప్రధాన కారణం. చిత్తడి నేలలు.. ఉపయోగాలు » వరదలను నియంత్రిస్తాయి. » ఫిల్టర్ మాదిరిగా నీటిని శుద్ధి చేస్తాయి. అందుకే వీటిని ప్రకృతి మూత్ర పిండాలుగా వర్ణిస్తారు. »మట్టిలోని ఉత్పాదక సారాన్ని పెంచుతాయి. »సున్నితమైన ప్రకృతి వనరులతో పాటు, జీవరాశులన్నింటికీ అనువైన వాతావరణం. » ఔషధ గుణాలున్న మొక్కల పెరుగుదలకు తోడ్పడతాయి. » రసాయనిక, జెనెటిక్ పదార్థాలను ఇముడ్చుకుని, తిరిగి నేలను మార్పు చేస్తాయి. » అత్యధిక జీవరాసులకు ప్రధాన ఆవాస కేంద్రంగా ఉంటాయి. » ఎక్కువ కాలం నీటి నిల్వకు, భూమి లోపలి నీటి శాతాన్ని పెంచేందుకు దోహదపడతాయి. » సున్నితమైన ప్రకృతి వనరులకు, పక్షులకు నిలయాలుగా ఉన్నాయి. » చిత్తడి నేలల పరిరక్షణ అందరి బాధ్యత అని రామ్సర్ సదస్సు పిలుపునిచ్చింది. పరిరక్షణ అందరి బాధ్యత చిత్తడి నేలల ప్రాంతమైన కొల్లేరును పరిరక్షించుకోవడం అందరి బాధ్యత. కొల్లేరు ప్రాంతానికి ఈ ఏడాది ఎక్కువగా వలస పక్షులు వచ్చాయి. –బి.విజయ, జిల్లా అటవీశాఖ అధికారి, ఏలూరు -
కొల్లేరులోని లంక గ్రామాల్లో పెద్దలదే పెత్తనం
కొల్లేరులో పెదరాయుళ్ల జమానా బలంగా నడుస్తోంది. అడ్డగోలు తీర్పులతో కుటుంబాలను విభజించడం, అన్యాయంగా కొన్ని కేసుల్లో బాధితులను ఇబ్బందులు పెట్టేలాంటి తీర్పులు తరచూ లంక గ్రామాల్లో చర్చనీయాంశంగా మారుతున్నాయి. ఏళ్ల తరబడి ఒకే తరహా తీర్పులతో కుల కట్టుబాట్ల పేరుతో ప్రజలను ఇబ్బంది పెడుతున్నా ఉన్నతాధికారులు నోరుమెదపలేని పరిస్థితి. అనేక ఘటనలు తెర మీదకు వచ్చి ఎస్పీ, కలెక్టర్లకు ఫిర్యాదులు చేసినా విచారణల పేరుతో వదిలేస్తున్నారు. తాజాగా చేతబడి నెపంతో ఒక కుటుంబాన్ని తీవ్రంగా కొట్టి గాయపరచడం, మరో కేసులో అడ్డగోలుగా భార్యాభర్తలకు విడాకులు ఇప్పించడం వివాదాస్పదంగా మారాయి. – సాక్షి ప్రతినిధి, ఏలూరుకొల్లేరులో పంచాయతీలకు సమాంతరంగా బంటాపెద్దలు తీర్పులు చెబుతూ సమాంతర పంచాయితీ నడుపుతున్నారు. సాధారణంగా తప్పు చేస్తే స్టేషన్‌కు వెళ్లే సంస్కృతి లేకుండా తప్పు జరిగితే బంటా పెద్దలకు ఫిర్యాదు చేయడం, వారే సెటిల్మెంట్ చేయడం కొల్లేరులోని ప్రజలు వారి తీర్పును వ్యతిరేకిస్తే గ్రామానికి వచ్చే అక్రమ చేపల చెరువుల ఆదాయంలో వాటాలు ఇవ్వబోమని బెదిరించడం, సాంఘిక బహిష్కరణ చేస్తామని హెచ్చరించడం చేస్తూ నిరాటంకంగా తమ జమానా కొనసాగిస్తున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత కొల్లేరు పెదరాయుళ్ళ హవా రెట్టించింది. అన్ని రాజకీయ పార్టీలకూ కొల్లేరు ఓట్లు అత్యంత కీలకం. 4 నియోజకవర్గాలు.. 9 మండలాల్లో విస్తరించిన కొల్లేరులో 122 గ్రామాలున్నాయి. బంటా పెద్దలదే పెత్తనం, ఓటింగ్ విషయంలో వీరి మాటే చెల్లుతుండటంతో అధికార పార్టీ సహా అందరూ పెద్దల మాటకు తలొగ్గాల్సిన పరిస్థితులున్నాయి.కొల్లేరు స్వరూపం ఇదీ..నియోజకవర్గాలు: ఉంగుటూరు, దెందులూరు, ఉండి, కైకలూరు మండలాలు: కైకలూరు, మండవల్లి, ఏలూరు రూరల్ మండలం, పెదపాడు, దెందులూరు, భీమడోలు, నిడమర్రు, గణపవరం, ఉండిగ్రామాలు : 122జనాభా: 3.50 లక్షలుకుటుంబాలు: 78 వేలుఓట్లు : 1.75 లక్షలుకట్టేసి కొట్టడమే కొన్నింటిలో శిక్షలుఉదాహరణకు భార్య, భర్త విడిపోతే వివాహ సమయంలో భర్త తీసుకున్న లాంచనాలు సర్వం చెల్లించేస్తే విడాకులు మంజూరవుతాయి. వివాహేతర సంబంధం కేసుల్లో అయితే వివాహేతర సంబంధం ఉన్న వ్యక్తి వివాహిత భర్తకు పరిహారం ఇస్తే కేసు సెటిల్ అయిపోతుంది. అది కూడా కేసును బట్టి లక్షల్లోనే ఉంటుంది. ఇక చేతబడులు, ఇతరత్రా అనుమానాలు అయితే కట్టేసి కొట్టడమే శిక్ష. ఇలాంటి అనైతిక చర్యలు నేటికీ కొల్లేరులో కొనసాగుతున్నాయి. తాజాగా కైకలూరు మండలం చటాకాయి గ్రామంలో చేతబడి నేపథ్యంలో ముగ్గురు వ్యక్తులను కొల్లేరు పెద్దల తీర్పుతో చితకబాదారు. అక్టోబరు 25న కమ్యూనిటీ హాలు వద్ద స్తంభాలకు కట్టేసి గ్రామపెద్దల సమక్షంలో 18 మంది కలసి కర్రలతో కొట్టారు. వీరిలో బాధితుడు సైదు రఘు ఏకంగా మంగళగిరి టీడీపీ కార్యాలయానికి వెళ్లి గోడు వెళ్లబోసుకున్నాడు. మరో ఇద్దరు మోరు రాంబాబు, జయమంగళ ధనుంజయ ఏలూరు ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందారు. ఈ కేసులో ఆరుగురిపై కేసులు నమోదు చేసి రిమాండ్‌కు పంపారు. జైలు నుంచి వచ్చిన తర్వాత కూడా కొందరు బాధితులపై వేధింపులకు పాల్పడుతున్నారు. ఏలూరు రూరల్ మండల శ్రీపర్రులో భార్యాభర్తలకు విడాకులు అడ్డగోలుగా ఇప్పించడంపై భార్య ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసింది. శ్రీపర్రు గ్రామానికి చెందిన సుభాష్‌తో కైకలూరు మండలం చటాకాయి గ్రామానికి చెందిన మహిళకు 2012లో వివాహం జరిగింది. వీరికి ఇద్దరు సంతానం. భార్యాభర్తల మధ్య విభేదాలు వచ్చాయి. గత నెల 27న గ్రామ పెద్దలు ఏకంగా రాతపూర్వకంగా విడాకుల తంతు పూర్తి చేశారు. దీంతో బాధిత మహిళ.. జిల్లా కలెక్టర్ వెట్రిసెల్వి, ఎస్పీ కేపీఎస్ కిషోర్‌లకు ఇటీవల ఫిర్యాదు చేసింది.1952 నుంచి తీర్పులుఒడిశాకు చెందిన ఒక తెగ వందల ఏళ్ల క్రితం కొల్లేరు ప్రాంతానికి వచ్చి చేపలు పట్టుకోవడం ప్రధాన వృత్తిగా ఎంచుకుని లంక గ్రామాల్లో స్థిరపడిపోయింది. 1952 నుంచి కొల్లేరులో బంటా పెద్దల పాలనకు తెర లేచింది. అందరికీ ఆదాయాన్ని చూపి పెద్దల పెత్తనం సాగిస్తుంటారు. ఉదాహరణకు ఒక గ్రామ పరిధిలో 500 ఎకరాల్లో అభయారణ్యం ఉంటే దానిలో కొందరు పెట్టుబడిదారులతో చెరువులు వేయించి ఎకరాకు రూ.లక్ష చొప్పున కౌలుకు తీసుకుని గ్రామంలో ఎంతమంది మగవారు ఉంటే అంతమందికి వాటాలేసి ప్రతి ఏటా బంటా పెద్దలు ఆదాయం ఇస్తుంటారు. కొన్ని కీలక ఘటనల్లో బాధితులు స్టేషన్లకువెళ్లినా..ఉన్నతాధికారులను కలిసినా వారిని కట్టుబాట్ల పేరుతో వేధించడం, బహిష్కరణకు గురి చేస్తున్నారు. 122 గ్రామాల్లో పంచాయతీ పాలన ఉండి, సర్పంచులు ఉన్నప్పటికీ వ్యవస్థ నడిపేది బంటా పెద్దలే. ఒక్కో గ్రామంలో 10 మందితో పెద్దలు కమిటీలా ఏర్పడి ప్రతిరోజూ కమ్యూనిటీ హాలు వద్ద పంచాయితీలు చేస్తుంటారు. -
శీతాకాల అతిథుల సందడి
శీతాకాలం వచ్చేసింది.. కొల్లేరు సరస్సుకు విదేశీ అతిథుల రాకా మొదలైంది. వేల మైళ్ల దూరం నుంచి ఎగిరొచి్చన రంగురంగుల పక్షులు కిలకిలారావాలతో పర్యాటకులను అలరిస్తున్నాయి. విదేశీ పక్షుల స్వస్థలాల్లో వాతావరణ మార్పు కారణంగా మనుగడ కోసం తరులు, గిరులు, సాగరాలను దాటి ఏలూరు జిల్లా కొల్లేరుకు చేరుతున్నాయి. ఇక్కడే సంతానోత్పత్తి చేసుకొని పిల్లలతో మార్చి చివర్లో సొంతూర్లకు వెళ్లిపోతాయి. ఏటా వచ్చే ఈ అతిథులను ఇక్కడి ప్రజలు సొంతబిడ్డల్లా ఆదరిస్తారు. వీటిని చూసి ఆనందించేందుకు వచ్చే పర్యాటకులతో పక్షుల విహార కేంద్రాలు కళకళలాడుతున్నాయి.రాష్ట్రంలో పక్షుల విహార కేంద్రాలు ⇒ కొల్లేరు – ఏలూరు జిల్లా⇒ పులికాట్ సరస్సు, నేలపట్టు – నెల్లూరు జిల్లా ⇒ ఉప్పలపాడు – గుంటూరు ⇒ తేలినీలపురం, తేలుకుంచి – శ్రీకాకుళం ⇒ కౌండన్య – చిత్తూరు జిల్లా77,138 ఎకరాల విస్తీర్ణంలో.. ప్రకృతి సోయాగాల ఆరాధకులను కనువిందు చేస్తుంది కొల్లేరు సరస్సు. ఏలూరు జిల్లాలో 77,138 ఎకకాల విస్తీర్ణంలో కొల్లేరు అభయారణ్యం విస్తరించి ఉంది. ఇక్కడ ఆటపాక, మాధవపురం పక్షుల విహార కేంద్రాలు ప్రశిద్ధమైనవి. ఏటా శీతాకాలంలో వందలాది జాతుల పక్షులు ఇక్కడికి వచ్చి సేదతీరుతుంటాయి. మన దేశానికి ఏటా వలస వచ్చే పక్షి జాతులు 1,349 ఉన్నట్లు అంచనా. వీటిలో ఎక్కువగా కొల్లేరు ప్రాంతానికి వస్తుంటాయి. ఏషియన్ వాటర్ బర్ట్స్ నివేదిక ప్రకారం గతేడాది ఇక్కడ 105 పక్షి జాతులకు సంబంధించి 81,495 పక్షులు విడిది చేశాయి. ఈ ఏడాది మార్చిలో 50 వేల పక్షులు ఉన్నట్టు అటవీశాఖ అధికారులు వెల్లడించారు. వలస పక్షులకు విడిది వలస అనేది పక్షుల జీవన శైలి. రుతువుల్లో మార్పులు వచ్చునప్పుడు దాదాపు 4,000 పక్షి జాతులు అనువైన ప్రదేశాలను వెతుక్కుంటూ వలసలు వెళతాయి. వీటిలో సుమారు 1,800 జాతులు అత్యంత సుదూర ప్రాంతాలకు వెళ్తాయి. కొల్లేరుకు సైబీరియా, రష్యా, టర్కీ, తూర్పు యూరప్, అ్రస్టేలియా, దక్షిణాఫ్రికా, బంగ్లాదేశ్ వంటి దేశాల నుంచి పక్షులు వస్తున్నాయి. వీటిలో ఆఫ్రికా నుంచి రెడ్ క్రిస్టెడ్ పోచార్డ్ (ఎర్ర తల చిలువ), అలాస్మా నుంచి పసిఫిక్ గెల్డెన్ ఫ్లోవర్ (బంగారు ఉల్లంకి), ఐర్లండ్ నుంచి కామన్ రెడ్ షాంక్ (ఎర్ర కాళ్ల ఉల్లంకి), ఐరోపా నుంచి యురేíÙయన్ స్పూన్ బిల్ (తెడ్డు మూతి కొంగ), దక్షిణాఫ్రికా నుంచి బ్రాహ్మణి షెల్ డక్ (బాపన బాతు), ఫిలిప్సీన్స్ నుంచి వైట్ పెలికాన్ (తెల్ల చింక బాతు) వంటివి ముఖ్యమైనవి.చిత్తడి నేలల నెలవు ‘కొల్లేరు’ చిత్తడి నేలల ప్రాంతమైన కొల్లేరు పక్షుల జీవనానికి అనువైనది. ఇక్కడి ఆటపాక పక్షుల కేంద్రం పెలికాన్ (గూడబాతు) పక్షుల ఆవాస ప్రాంతంగా పేరుగడించింది. దీనిని పెలికాన్ ప్యారడైజ్‌గా పిలుస్తారు. కొల్లేరు సరస్సులో గూడబాతుతో పాటు ఎర్ర కాళ్ల కొంగ (పెయింటెడ్ స్టార్క్), నల్ల రెక్కల ఉల్లంకి పిట్ట (బ్లాక్ వింగ్డ్ స్టిల్ట్), తెడ్డు ముక్కు కొంగ (ఏషియన్ ఓపెన్‌బిల్ స్టార్క్) కంకణాల పిట్ట (గ్లోబీ ఐబీస్), చిన్న నీటి కాకి (లిటిల్ కార్మోరెంట్), సాధారణ కోయిలలు (స్వాలో), పెద్ద చిలువ బాతు (లార్జ్ విజ్లింగ్ డక్), చెరువు బాతు (గార్గనే), తొండు వల్లంకి (బ్లాక్ టయల్డ్ గాట్‌విట్) వంటి 105 రకాల పక్షి జాతులు ఉన్నాయి.పక్షులు మంచి నేస్తాలు పక్షులు పర్యావరణ సమతుల్యతకు మంచి నేస్తాలు. వాటిని సంరక్షించుకోవాల్సిన బా ధ్యత అందరిపై ఉంది. వలస పక్షుల్లో అనేక జాతులు అంతరించేపోయే ప్రమాదంలో ఉన్నాయని ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్ శాస్త్రవేత్తలు కూడా చెబుతున్నారు. కొల్లేరులో చిత్తడి నేలల ప్రదేశాలు వలస పక్షులకు ఆవాసాలుగా ఉన్నాయి. పక్షులకు ఏ విధమైన హాని తలపెట్టకుండా సంరక్షించుకోవాలి. –దీపక్ రామయ్యన్, వైల్డ్‌లైఫ్ ఎక్స్పర్ట్, హైదరాబాద్ఆకాశమే వాటి హద్దుసమశీతల వాతావరణాన్ని వెతుక్కుంటూ పక్షులు వలస వస్తాయి. ఆకాశమే వాటి హద్దు. కొల్లేరు చిత్తడి నేలల ప్రాంతం వీటికి అనుకూలంగా ఉంటుంది. విదేశాల్లో శీతాకాలంలో మంచుగడ్డ కడుతుంది. అందువల్ల అవి సెంట్రల్ ఆసియన్ ఫ్లైవే (సీఏఎఫ్) మీదుగా మన దేశానికి వస్తాయి. ఆటపాక పక్షుల కేంద్రంలో బోటు షికారు ద్వారా పక్షులను దగ్గరగా తిలకించే అవకాశం ఉంది. –కేవీ రామలింగాచార్యులు, ఫారెస్టు రేంజ్ ఆఫీసర్, వైల్డ్ లైఫ్ మేనేజ్మెంట్, కైకలూరు. -
కొండెక్కిన కొల్లేరు!
సాక్షి ప్రతినిధి, ఏలూరు: ప్రకృతి రమణీయతతో పాటు పక్షుల కేరింతలకు కేరాఫ్ అడ్రాస్‌గా నిలిచిన కొల్లేరు టూరిజంపై కొత్త ప్రభుత్వం నిర్లక్ష్యం చూపుతోంది. ఫలితంగా కొల్లేరు టెంపుల్, ఎకో టూరిజం ప్రాజెక్ట్ తూర్పు గోదావరికి తరలిపోనుంది. వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో కొల్లేరు పర్యాటకాభివృద్ధికి రూ.187 కోట్లతో డీపీఆర్‌లను సిద్ధం చేసి కేంద్ర ప్రభుత్వానికి నివేదించింది. కొద్ది రోజుల క్రితం కొత్త రాష్ట్ర ప్రభుత్వ సిఫార్సులతో కేంద్ర ప్రభుత్వం శ్రీశైలం, సూర్యలంక, రాజమహేంద్రవరం–అఖండ గోదావరి, సంగమేశ్వరం వంటి నాలుగు ప్రాంతాల్లో పర్యాటకాభివృద్ధికి రూ.400 కోట్లు కేటాయించింది. తెలుగు రాష్ట్రాల్లో ఏకైక చిత్తడి ప్రాంతమైన కొల్లేరు టూరిజానికి ఇందులో చోటు దక్కకపోవడంపై సర్వత్రా అసంతృప్తి వ్యక్తమవుతోంది. ఉమ్మడి పశ్చిమగోదావరి, కృష్ణా జిల్లాల్లో 4 నియోజకవర్గాల పరిధిలో కొల్లేరు సరస్సు వ్యాపించి ఉంది. దక్షిణ కశ్మీరంగా దీనికి పేరు. జీవో నంబరు 120 ప్రకారం కొల్లేరు కాంటూరు–5 వరకు 77,138 ఎకరాల్లో కొల్లేరు అభయారణ్యం విస్తరించి ఉంది. మొత్తం 9 మండలాల్లో కొల్లేరు పరీవాహక గ్రామాలుగా 122 ఉన్నాయి. మొత్తం జనాభా 3.2 లక్షల మంది ఉండగా, 1,70,000 మంది ఓటర్లు ఉన్నారు. ప్రధాన వృత్తి చేపల సాగు. కొల్లేరు కాంటూరును 5 నుంచి 3కు కుదిస్తామని ప్రతి ఎన్నికల్లో టీడీపీ నాయకులు చెబుతున్నా అమలు కావడం లేదు. అటకెక్కిన టెంపుల్ టూరిజం ప్రతిపాదనలుకొల్లేరు విస్తరించిన ఏలూరు, పశ్చిమగోదావరి జిల్లాల్లో టెంపుల్ టూరిజం అభివృద్ధి చేసుకోవడానికి చక్కటి అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. రాష్ట్రంలో అత్యధికం భక్తులు వచ్చే 100 ఆలయాల్లో ద్వారకాతిరుమల, మద్ది ఆంజనేయస్వామి, పంచారామ క్షేత్రాలైన భీమవరం ఉమామహేశ్వరస్వామి, పాలకొల్లు క్షీరారామలింగేశ్వస్వామి ఆలయాలు, భీమవరం మావుళ్లమ్మ దేవస్థానాలు ఉన్నాయి. కొల్లేరు ప్రాంతమైన కైకలూరులో నిర్వహించిన ఎన్నికల సభల్లో ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ కొల్లేరు టూరిజాన్ని అభివృద్ధి చేసి స్థానిక ప్రజలకు ఉపాధి అవకాశాలు కల్పిస్తామన్నారు.వైఎస్ జగన్ పాలనలో రూ.187 కోట్ల ప్రణాళికజిల్లాల పునర్విభజన తర్వాత కొల్లేరు ప్రాంతమంతా ఏలూరు జిల్లా పరిధిలోకి చేరింది. కొల్లేరు ఎకో టూరిజానికి రూ.187 కోట్ల ప్రణాళికతో ప్రతిపాదనలను రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి నివేదించింది. కొల్లేరు పరీవాహక ప్రాంతాల్లో 20 ప్రదేశాలను గుర్తించి బోటు షికారు, సంప్రదాయ గేలాలతో చేపలు పట్టుకోవడం, పక్షుల వీక్షణ వంటివి ఏర్పాటు చేయాలని భావించారు. పర్యాటక శాఖ అధికారులు కొల్లేరులో 10 ప్రాంతాలను టూరిజానికి అనుకూలమైన ప్రాంతాలుగా గుర్తించారు. ఇప్పటికే కేంద్రం వద్ద డీపీఆర్‌లు ఉన్నప్పటికీ వాటిని పరిగణనలోకి తీసుకోలేదు. పక్షులపై కానరాని ప్రేమకొల్లేరు సరస్సుపై ఇటీవల జరిగిన ఏషియన్ వాటర్ బర్డ్స్ సెన్సస్‌లో మొత్తం 105 రకాల పక్షి జాతులకు సంబంధించి 81,495 పక్షులను గుర్తించారు. ప్రధానంగా రాష్ట్రంలో పక్షి ప్రేమికుల స్వర్గధామంగా ఏలూరు జిల్లా ఆటపాక పక్షుల కేంద్రం వాసికెక్కింది. ఇక్కడ అరుదైన పెలికాన్ పక్షులు రావడంతో పెలికాన్ ప్యారడైజ్‌గా నామకరణ చేశారు. అటవీ శాఖ 283 ఎకరాల్లో పక్షుల విహారానికి చెరువును ఏర్పాటు చేసింది. పక్షి నమూనా మ్యూజియం ఆకట్టుకుంటుంది. ఇంతటి ప్రాముఖ్యత కలిగిన కేంద్రానికి నిధుల కొరత వేధిస్తోంది. ఆటపాక పక్షుల కేంద్రాన్ని మరింతగా అభివృద్ధి పరిస్తే పర్యాటకుల సంఖ్య పెరుగుతుంది. వలస పక్షుల సందడి షురూకొల్లేరు ప్రకృతి రమణీయతతో పాటు పక్షుల అందాలను తిలకించడానికి ప్రతి ఏటా అక్టోబర్ నుంచి మార్చి వరకు అనువైన కాలం. కొల్లేరు అభయారణ్యంలో 190 రకాల స్వదేశీ, విదేశీ పక్షులు సంచరిస్తుంటాయి. ప్రధానంగా కొల్లేరులో పెలికాన్ పక్షి ఆకర్షణీయంగా ఉంటుంది. అందుకే కైకలూరు మండలం ఆటపాక పక్షుల విహార కేంద్రాన్ని పెలికాన్ ప్యారడైజ్‌గా నామకరణ చేశారు. కొల్లేరు ఇటీవల వరదలు, వర్షాలకు నిండుకుండలా మారింది. ప్రతి ఏటా విదేశీ పక్షులు వలస వచ్చి సంతానోత్పత్తితో తిరిగి స్వస్థలాలకు వెళ్లడం ఇక్కడ ఆనవాయితీగా మారింది. -
AP: భయం గుప్పిట్లో కొల్లేరు
సాక్షి,విజయవాడ: కొల్లేరు వాసులు భయం గుప్పిట్లో ఉన్నారు.కొల్లేరు పరివాహక ప్రాంతంలోని చిన్న అడ్లగడ్డ వద్ద రోడ్డుపై నీరు ప్రవహిస్తోంది. బుడమేరు నుంచి కొల్లేరుకు లింకుండడంతో కొల్లేరుకు నీటి ప్రవాహం ప్రస్తుతం భారీగా వస్తోంది.బుడమేరులో రెండో గండిని పూడ్చివేశారు. మూడో గండిని పూడ్చేందుకు అప్రోచ్‌రోడ్డును నిర్మిస్తున్నారు. మూడో గండిని పూడ్చివేస్తే విజయవాడకు ముంపు ముప్పు తప్పనుందని చెబుతున్నారు. అయితే కొల్లేరుకు వరద పెరిగే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. -
ఆక్రమణలతోనే కొంప ‘కొల్లేరు’
సాక్షి ప్రతినిధి, ఏలూరు: కొల్లేరు ఉగ్రరూపం దాల్చుతోంది. విజయవాడను ముంచెత్తిన బుడమేరు నీరు చివరకు కొల్లేరు సరస్సులో కలవాలి. ఇక్కడ నుంచి 52 కిలోమీటర్ల దూరంలో ఉన్న సముద్రానికి ఆ నీరు చేరాలి. ఎగువ నుంచి చేరుతున్న నీటి ప్రవాహానికి కొల్లేరులో అక్రమ చెరువు గట్లు అడ్డుపడుతున్నాయి. వరదల సమయంలో కొల్లేరుకు 67 డ్రెయిన్లు, వాగుల ద్వారా లక్షా 10 వేల క్యూసెక్కుల నీరు చేరుతోంది. ప్రధానంగా బుడమేరు, తమ్మిలేరు, రామిలేరు, ఎర్ర కాల్వల నుంచి భారీగా వరద నీరు వస్తోంది. ఇలా చేరిన నీరు కేవలం 12 వేల క్యూసెక్కులు మాత్రమే దిగువకు చేరుతోంది. నేడు ఈ పరిస్థితి ఆందోళనకరంగా మారింది. 2,22,300 ఎకరాల్లో కొల్లేరు సరస్సుఏలూరు, పశ్చిమగోదావరి జిల్లాల్లో 12 మండలాల పరిధిలో 2,22,300 ఎకరాల్లో కొల్లేరు సరస్సు విస్తరించి ఉంది. కొల్లేరు పరిధిలో మొత్తం 122 గ్రామాలు ఉన్నాయి. పర్యావరణవేత్తల ఆందోళన కారణంగా కొల్లేరు సరస్సును–5 కాంటూరు వరకు 77,138 ఎకరాల్లో అభయారణ్యంగా గుర్తించారు. ఏలూరు, ఉంగుటూరు, పెదపాడు, దెందులూరు, ఆకివీడు, నిడమర్రు, భీమడోలు, కైకలూరు, మండవల్లి మండలాల్లో కొల్లేరు అభయారణ్యం విస్తరించి ఉంది. కొల్లేరుకు బుడమేరు, రామిలేరు, తమ్మిలేరు, గుండేరు, ఎర్రకాల్వ వంటి వాగుల ద్వారా భారీగా నీరు చేరుతోంది. కొల్లేరుకు చేరే నీటిని సముద్రానికి పంపించే ఏకైక మార్గమైన మండవల్లి మండలం పెద యడ్లగాడి వంతెన వద్ద నీటి మట్టం 12 అడుగులకు చేరింది. మరో అడుగు చేరితే 13 లంక గ్రామాలు ప్రమాదం బారిన పడే అవకాశం ఉంది. అక్రమ చెరువులే అసలు కారణం.. వరదల సమయంలో కొల్లేరుకు చేరే వరద నీరు సముద్రానికి చేరడానికి అడ్డంకిగా ఉన్నది కొల్లేరు సరస్సులో అక్రమంగా తవి్వన చేపల చెరువులేనని అనేక మంది కోర్టులను సైతం ఆశ్రయించారు. ప్రధానంగా గతంలో టీడీపీ పాలనలో వేలాది ఎకరాల కొల్లేరు భూమి ఆక్రమణలకు గురైంది. దీంతో పర్యావరణవేత్తల ఫిర్యాదులతో సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు 2006లో ఆపరేషన్ కొల్లేరు పేరుతో ఇరు జిల్లాల్లో 25,142 ఎకరాల విస్తీర్ణంలో చేపల చెరువులను ధ్వంసం చేశారు.ప్రస్తుతం ఇంకా 15 వేల ఎకరాల పైబడే అక్రమ సాగు జరుగుతున్నట్టు అంచనా. తిరిగి కూటమి పాలన రావడంతో అక్రమ చేపల సాగు అధికమైంది. అధికారంలోకి వచి్చన టీడీపీ కొల్లేరు నాయకులు ఇటీవల అక్రమ దందాలకు తెర తీశారు. సుప్రీంకోర్టు పూర్తిస్థాయిలో కొల్లేరు ప్రక్షాళనకు ఆదేశాలివ్వాలని పర్యావరణవేత్తలు కోరుతున్నారు. గ్రామాలకు రాకపోకలు బంద్.. ఎగువ ప్రాంతాల నుంచి కొల్లేరుకు భారీగా వరద నీరు చేరుతోంది. కొల్లేరు సరస్సులోకి బుడమేరు, తమ్మిలేరు, రామిలేరు చంద్రయ్య కాలువ, పెదపాడు, వట్లూరు, మొండికోడు, పందికోడు, పోల్‌రాజ్, కైకలూరు స్వాంపు, మాదేపల్లి, రాళ్ళకోడు, దోసపాడు, మోటూరు, పోతునూరు వంటి చానల్స్ నుంచి ప్రతి ఏటా నీరు చేరుతుంది. ఈ ఏడాది ఇప్పటికే ఏలూరు జిల్లా మండవల్లి మండలం పెద్ద యడ్లగాడి–పెనుమాకలంక రోడ్డు బుడమేరు నీరు అధికంగా రావడంతో నీట మునిగింది. మూడు రోజులుగా రాకపోకలు నిలిచిపోయాయి. కైకలూరు –ఏలూరు రహదారిలో రోడ్లపైకి వరద నీరు చేరుతోంది. రానున్న రెండు రోజుల్లో కొల్లేరు పరీవాహక ప్రాంతాలకు భారీ ముంపు పొంచి ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. -
చేప ప్రసాదంగా కొల్లేరు కొర్రమీను
కైకలూరు: ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా పరిధిలోని కొల్లేరు కొర్రమీను పిల్లలు (సీడ్) ఆస్తమా నివారణలో ఔషధంగా మారాయి. మృగశిరకార్తె రోజున హైదరాబాద్ నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో బత్తిన సోదరులు అందించే చేప ప్రసాదానికి కొల్లేరు ప్రాంత కొర్రమీను పిల్లలను సరఫరా కానున్నాయి. తెలంగాణ స్టేట్ ఫిషరీస్ కో–ఆపరేటివ్ సొసైటీస్ ఫెడరేషన్ (టీఎస్ ఎఫ్సీఓఎఫ్) ఆధ్వర్యంలో చేప మందు ప్రసాదం నిమిత్తం టెండర్లను ఆహా్వనించింది. దాదాపు 5 లక్షల నుంచి 7 లక్షల వరకు కొర్రమీను పిల్ల అవసరమని గుర్తించారు. తెలంగాణ మత్స్యశాఖ అధికారులు కొర్రమీను సీడ్ అందించే సీడ్ ఫామ్‌లను పరిశీలించి నివేదికను అక్కడి ప్రభుత్వానికి అందించారు. తెలంగాణలో లభ్యత లేకపోవడంతో.. చేప ప్రసాదానికి తెలంగాణలో సరిపడినన్ని చేప పిల్లల లభ్యత లేకపోవడంతో ఏపీ నుంచి కొర్రమీను పిల్లలకు మే 21న టెండర్లు ఆహా్వనించింది. ఏపీ నుంచి కొల్లేరు ప్రాంతాలైన ఏలూరు జిల్లాలోని ముదినేపల్లి మండలం దేవపూడి ఫణిరామ్ ఫిష్ సీడ్ ఫామ్, ఏలూరుకు చెందిన దుర్గమల్లేశ్వర ఫిష్ హేచరీస్, కలిదిండి మండలం పోతుమర్రు, పశ్చిమ గోదావరి జిల్లా పోడూరు నుంచి దుర్గ ఫిష్ సీడ్ ఫామ్‌తో పాటు తెలంగాణలోని నల్గొండ, హైదరాబాద్‌కు చెందిన ముగ్గురు కలిపి మొత్తం ఏడుగురు టెండర్లను దాఖలు చేశారు. తెలంగాణకు చెందిన వనపర్తి, ఖమ్మం, హన్మకొండ, సంగారెడ్డిలకు చెందిన జిల్లా మత్స్యశాఖ అధికారులకు పర్యవేక్షణ బాధ్యతను అక్కడి ప్రభుత్వం అప్పగించింది. ఖమ్మం మత్స్యశాఖ అధికారి డి.ఆంజనేయస్వామి నేతృత్వంలో అధికారులు టెండర్లు వేసిన ఏపీలో సీడ్ ఫామ్‌లను పరిశీలించి ఈ నెల 25 తెలంగాణ ప్రభుత్వానికి నివేదిక అందించారు. పోషకాల గని కొర్రమీను కొర్రమీను పిల్ల చాలా హుషారుగా ఉంటుంది. ఇది మీటరు వరకు పెరుగుతుంది. మంచినీటి సరస్సులు, పొలాల బోదెలు, బురద నేలల్లో ఇవి పెరుగుతాయి. వీటిలో 18–20 శాతం మాంసకృత్తులు ఉంటాయి. ఆకు కూరల్లో లభించే విటమిన్ ‘ఏ’ కంటే కొర్రమీనులో ఉండే విటమిన్ ‘ఏ’ తేలిగ్గా జీర్ణమవుతుంది. వీటిలో గంధకం కలిగిన లైసిన్, మిథియానిక్, సిస్టిన్ అమినో యాసిడ్లు లభిస్తాయి.చేప మందుతో కొర్రమీనుకు గుర్తింపు ఆస్తమా, ఉబ్బసం, దమ్ము, దగ్గు వంటి శ్వాస సంబంధ వ్యాధుల నివారణకు చేప ప్రసాదాన్ని హైదరాబాద్‌లో బత్తిన సోదరులు ఉచితంగా అందిస్తారు. కరోనా కారణంగా మూడేళ్లు ఆగిన ప్రసాదం పంపిణీ ఈ ఏడాది జూన్ 8న మృగశిరకార్తె ప్రారంభమయ్యే ఉదయం 11 నుంచి 9వ తేదీ ఉదయం 11 గంటల వరకు పంపిణీ చేయనున్నారు. వీరు తయారు చేసిన ప్రత్యేక మందును కొర్రమీను పిల్ల సహా నోటిలో వేస్తారు. తెలంగాణకు సరఫరా చేసే కొర్రమీను పిల్ల సైజు 2 అంగుళాల నుంచి 3 అంగుళాలు ఉండాలి. నల్ల రంగులో హుషారుగా ఉండాలి. ప్రస్తుత మార్కెట్లో ఒక్కో కొర్రమీను పిల్ల రూ.30 ధర పలుకుతోంది. పిల్ల సేకరణ ఓ సవాల్ కొర్రమీను పిల్లను సేకరించడం పెద్ద సవాల్‌గా మారుతోంది. కొల్లేరు సరస్సు, పొలాల గుంతల్లో కొర్రమీను తల్లి చేపను గుర్తిస్తారు. తల్లి వద్ద తిరిగే వేలల్లో పిల్లలను సేకరించి సిమెంటుతో చేసిన కుండీలలో ప్రత్యేకంగా పెంచుతారు. రోజుకు మూడుపూటలా నీరు మారుస్తారు. నాలుగు పూటలా మేత వేస్తారు. తెలంగాణ వరకు వ్యాన్లలో అత్యంత జాగ్రత్తగా వీటిని రవాణా చేస్తారు. కొల్లేరు ప్రాంతాల నుంచి వెళ్లే వ్యాన్లలో పిల్లలకు మూడు ప్రాంతాల్లో నీటిని మార్పు చేస్తారు. చేప మందు ప్రసాదం నిమిత్తం జూన్ 6వ తేదీన ఉదయం హైదారాబాద్‌కు కొల్లేరు కొర్రమీను పిల్లల్ని తరలించనున్నారు.కొల్లేరు ప్రాంతం అనుకూలం చిత్తడి నేలల ప్రాంతమైన కొల్లేరు సరస్సులో సహజసిద్ధంగా కొర్రమీను పెరుగుతుంది. నల్లజాతి చేపల్లో కొర్రమీనుకు ప్రత్యేక స్థానం ఉంది. కొల్లేరు పరీవాహక ప్రాంతాల నుంచి ఇతర రాష్ట్రాలకు వీటిని సరఫరా చేస్తారు. కొన్ని ప్రాంతాల్లో కొర్రమీను సాగు సైతం చేస్తున్నారు. కొర్రమీనులో పోషకాహారాలు అధికంగా ఉంటాయి. – షేక్ చాన్‌బాషా, ఫిషరీస్ ఏడీ, కైకలూరు -
తీర్పే బలం, బలగం
⇒ పొద్దు పొడవక ముందే భుజాన వెదురు గెడకు మావులు, సల్దికూడు (సద్దన్నం) క్యారేజీ తగిలించుకుని గోచీ పెట్టుకుని నడిచి వెళ్లి కొల్లేరులో తాటి దోనెలపై తిరిగి సహజసిద్ధంగా చేపలను వేటాడి మార్కెట్‌కు పోయి అయినకాడికి అమ్ముకుని బతుకు నెట్టుకొచ్చిన మట్టి మనుషులు ఒకనాడు. ⇒ సమాజంలో మిగిలిన వారిలాగానే కాలానికి అనుగుణంగా ఆధునికతను అందిపుచ్చుకుని చేపల చెరువులతో ఆదాయం ఆర్జించి అభివృద్ధివైపు అడుగులు వేసిన గట్టి మనుషులు నేడు.⇒ రాష్ట్రంలోని ఏలూరు–పశ్చిమ గోదావరి జిల్లాల నడుమ విస్తరించిన కొల్లేరు ప్రాంతంలో నివసించే ప్రజల జీవన గమనాన్ని పరిశీలిస్తే గొప్ప సందేశాన్ని బాహ్య ప్రపంచానికి పంచుతుంది. ఎన్ని కష్టాలు వచ్చినా కొల్లేరులో ఎదిరీదే బతుకుచిత్రమిదీ. జీవన విధానంలో మార్పులు వచ్చినా కొల్లేరులో మనిషి మారలేదు. వారి మనసూ మారలేదు. కార్పొరేట్ కల్చర్, కుట్రలు, కుతంత్రాలు వారిని ఏమాత్రం ప్రభావితం చేయలేదు.ఎన్ని కష్టాలొచ్చినా ఐక్యమత్యమే మహాబలం అనేదానికి కొల్లేరువాసులు నిలువెత్తు సాక్ష్యం. ఇది ఒకటి రెండేళ్లు కాదు. ఏకంగా 150 ఏళ్ల క్రితం నుంచి వారంతా ఒకే మాట, ఒకే బాట అనే తీరుతో ముందుకు సాగుతున్నారు. పరస్పర సహకారం, గ్రామాభివృద్ధికి తోడ్పాటు, వ్యక్తిగత తగాదాలు, కుటుంబంలోని పేచీలు ఇలా విషయం ఏదైనా సరే వారంతా గ్రామంలోనే నిర్ణయం తీసుకునే కట్టుబాటు ఇప్పటికీ కొనసాగుతోంది. – సాక్షి, అమరావతిఆకాశంలో విహరించే పక్షుల సమూహాలు...నీటిలో జలపుష్పాల పరుగులు ..చుట్టూ నీటి మధ్యలో దీవుల్లాంటి భువిపై వెలిసిన గ్రామాల్లో జీవనం సాగించే అ‘సామాన్యులు’. ఇది మంచినీటి సరస్సుగా ప్రపంచ ప్రసిద్ధి గాంచిన ‘కొల్లేరు’తో పెనవేసుకున్న జీవరాశులతో సహజీవనం.కాంటూరు కుదింపునకు వైఎస్ సర్కారు తీర్మానంకొల్లేరు ఐదో కాంటూరు వరకు 77,138 ఎకరాల విస్తీర్ణాన్ని అభయారణ్యంగా ప్రకటించారు. దీన్ని మూడో కాంటూరుకు కుదించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతూ 2008లో వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ప్రభుత్వం అసెంబ్లీలో తీర్మానం చేసింది. కాంటూరు పరిధి తగ్గించడం వల్ల 43,072 ఎకరాలు అభయారణ్యం పరిధి నుంచి బయటపడతాయి. వాటిలో పట్టా భూములు 14,932 ఎకరాలు, జిరాయితీ భూములు 5,510 ఎకరాలను వాటి హక్కుదారులకు అప్పగించగా మిగిలిన భూమిని పేదలకు పంచాలన్నది అప్పటి వైఎస్ ప్రభుత్వ సంకల్పం. కానీ పర్యావరణ, న్యాయపరమైన అంశాలు ముడిపడి ఉండటంతో కాంటూరు కుదింపు జరగలేదు.వైఎస్ హయాంలో రూ.1300 కోట్లతో కొల్లేరులో ప్రత్యేక పునరావాస ప్యాకేజీని అమలు చేశారు. వైఎస్సార్ హయాంలో ప్రతిపాదించిన రెగ్యులేటర్ నిర్మాణ ప్రతిపాదనకు సీఎం వైఎస్ జగన్ ప్రభుత్వ హయాంలో కదలిక వచ్చింది. కొల్లేరులోని సర్కారు కాలువపై కీలకమైన వంతెన నిర్మాణానికి వైఎస్సార్ హయాంలో నిధులు మంజూరు చేసినప్పటికీ ఆ తర్వాత వచ్చిన చంద్రబాబు ప్రభుత్వం దాన్ని చేపట్టలేదు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం వచ్చాక ఆ వంతెన నిర్మాణం పూర్తి చేయడం గమనార్హం.పెద్దొడ్డి మాటేశిరోధార్యం..కొల్లేరులో భిన్నమైన మనస్తత్వాలు కలిగిన వారు జీవించొచ్చు కానీ వారిలో భిన్నమైన మాటలు మాత్రం ఉండవు. వ్యక్తిగత, సామాజిక, రాజకీయ అంశాలైనా అక్కడ ఊరి పెద్దగా చెలామణి అయ్యే పెద్దొడ్డి (పెద వడ్డి) మాటే శిరోధార్యం. రెండు జిల్లాల్లోని 122 గ్రామాల్లోను ప్రజలందరూ కలిసి కొందరికి పెద్దరికం కట్టబెడతారు. తొలినాళ్లలో బయట వారి నుంచి రక్షణ కల్పించుకునేందుకు, వ్యక్తిగత ఇబ్బందుల నుంచి బయట పడేందుకు తమకు తాముగా సంఘాలు పెట్టుకుని నాయకులను (పెద్దొడ్డి) పెట్టుకునే సంప్రదాయం ఇప్పటికీ కొనసాగుతోంది.గ్రామ పంచాయతీల నుంచి రాష్ట్ర ప్రభుత్వాలకు అతీతంగా ఒక్కో గ్రామంలో నలుగురి నుంచి 12 మంది వరకు పెద్దొడ్డిలుంటారు. ఏ సమస్య వచ్చినా గ్రామం నడిబొడ్డున ఉండే చావిడి, ఆలయంలో పెద్దొడ్డిలను ఆశ్రయిస్తారు. సాధారణంగా అందరూ పనులు పూర్తి చేసుకుని ఇళ్లకు వచ్చాక సాయంత్రం సమయంలో ఈ పంచాయతీలు నడుస్తుంటాయి. రెండు వైపులా వాదనలు విని స్థానిక న్యాయస్థానాలు మాదిరిగా వారిచ్చే తీర్పును ప్రజలు ఆచరిస్తారు. చిత్రం ఏమిటంటే పేచీలు పెట్టుకుని వారు పోలీస్ ఠాణాలు, బయటి వారి గడప తొక్కరు. దశాబ్దాలు గడిచినా అదే కట్టుబాటు ఇప్పటికీ కొనసాగుతుండటం విశేషం.ఒడిశా నుంచి వలసొచ్చి...విస్తరించిపొట్ట చేతపట్టుకుని రాష్ట్ర సరిహద్దులు దాటి ఒడిశా నుంచి వలసొచ్చిన 50 కుటుంబాలు శాఖోపశాఖలుగా విస్తరించి కొల్లేరులో గ్రామాలను నిర్మించాయి. దాదాపు 150 ఏళ్ల కిందట వచ్చిన వడ్డెర (వడ్డీలు) కులానికి చెందిన వలస జనం ప్రధానంగా చేపల వేటపైనే ఆధారపడి బతికేవారు. ఎటుచూసినా నీరు, మధ్య దిబ్బలాంటి ప్రాంతాల్లో దట్టమైన పొదలతో అడవికంటే భయంకరంగా ఉండే ఆ ప్రాంతంలో మానవమాత్రుడు ఉండటం కష్టంగా ఉండే రోజుల్లోనూ నాగరికతకు దూరంగా బతకడం మొదలైంది. పొదలు, తుప్పలను బాగుచేసి కొల్లేరులో దొరికే కిక్కిసకర్రలతో చిన్నపాటి గుడిసె (పాకలు) వేసుకుని జీవించేవారు.కొల్లేరు నీటి అడుగు దొరికే అలిపిరి కాయలు, కాలువ దుంపలను ఆహారంగా తినేవారు. కొల్లేరులో సహజసిద్ధంగా పెరిగే నల్లజాతి చేపలు పుష్కలంగా ఉండటంతో వాటిని వేటాడి బయట ప్రాంతాల్లో విక్రయించి కుటుంబాలను పొషించుకునే వారు. వడ్డీలతోపాటు సమీప ప్రాంతాల్లోని ఎస్సీలు కూడా కొల్లేరులో స్థిరపడి చేపల వేటపై జీవనం సాగిస్తున్నారు.జీవన చిత్రాన్ని మార్చేసిన చెరువులుకొల్లేరులో చేపల చెరువులు ఆ ప్రాంత వాసుల జీవన చిత్రాన్ని మార్చేశాయి. చిత్రం ఏమిటంటే కొల్లేరు వాసులు బతకడం కోసం గతంలో కొల్లేరులో చేపల చెరువులు తవ్వకపోతే ప్రభుత్వం కేసులు పెడితే...జనజీవనానికి ప్రమాదంగా పరిణమించిన కాలుష్యకారక చేపల చెరువులను తొలగించకపోతే కేసులు పెట్టాల్సిన పరిస్థితి వరకూ వచ్చింది. కొల్లేరులో చేపల వేటపైనే ఆధారపడిన వారికి మేలు చేసేలా సొసైటీలుగా ఏర్పడి ప్రభుత్వ భూముల్లో చెరువులు తవ్వుకునేలా 1976లో అప్పటి ముఖ్యమంత్రి జలగం వెంగళరావు నిర్ణయం తీసుకున్నారు.కొల్లేరు వాసులకు దానిపై అవగాహన కల్పిస్తూ శృంగవరప్పాడు గ్రామంలో తొలి సొసైటీ చెరువు తవ్వకానికి శంఖుస్థాపన చేశారు. సహజసిద్ధంగా చేపల వేటపై ఆధారపడి బతికే తమ పొట్ట కొట్టేందుకు ప్రభుత్వం సొసైటీ చెరువులు తవ్విస్తోందంటూ కొల్లేరు వాసులు పెద్ద ఎత్తున ఉద్యమాలు చేపట్టారు. వారిని కట్టడి చేసేలా కేసులు పెట్టి, నిర్బంధంగా చెరువులు తవ్వేలా అప్పట్లో ప్రభుత్వం వ్యహరించింది. క్రమంగా సొసైటీల పేరుతో కొల్లేరులో ప్రాంతాలు విభజించుకుని కొల్లేరు వాసులు చేపలను వేటాడుకుని మెరుగైన జీవనానికి అలవాటు పడ్డారు.కొల్లేరుపై కన్నేసిన పొరుగు ప్రాంతాల వాళ్లు రంగంలోకి సొసైటీలకు డబ్బులు (లీజు)ఇచ్చి చెరువులు తవ్వి పెద్ద ఎత్తున చేపలసాగు చేపట్టడంతో పర్యావరణ సమస్య ఉత్పన్నమైంది. దీంతో పర్యావరణ సంస్థలు పోరాటంతో న్యాయస్థానాల ఆదేశాలతో ప్రభుత్వం కొల్లేరు పరిరక్షణకు 120 జీవో జారీచేయడం, చేపల చెరువుల తొలగింపునకు(కొల్లేరు ఆపరేషన్) నిర్వహించడం చకచకా జరిగిపోయింది.మగ బిడ్డకూ వాటా..రెండు జిల్లాల్లో తొమ్మిది మండలాల్లో విస్తరించిన కొల్లేరు ప్రాంతంలో ఇప్పుడు 80 వేల కుటుంబాల్లో మూడు లక్షల 30 వేల మంది జీవిస్తున్నారు. రెండు లక్షల పది వేల మంది ఓటర్లున్న కొల్లేరులో ఉన్న సొసైటీలు, గ్రామాలు వారీగా ఉన్న చెరువుల ఆదాయం (లీజు)లో ప్రతీ కుటుంబంలోను పెద్దకు వాటాలు ఇస్తారు. పుట్టిన మగ బిడ్డకు కూడా వాటాలు వేస్తారు. కొల్లేరుకు అక్కడివారు వలసరాక ముందే కొల్లేటి కోటలో వెలసిన పెద్దింట్లమ్మ అమ్మవారే ఆయా ప్రాంత వాసులకు పెద్దదిక్కు. ప్రతీఏటా అమ్మవారి ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తుంటారు. పెద్దయ్యాక వాటా ఇస్తారు. -
కొల్లేరు పర్యాటకం.. కొత్త అందాల నిలయం
సాక్షి ప్రతినిధి, ఏలూరు: కొల్లేరు పర్యాటకం కొత్త పుంతలు తొక్కనుంది. కొల్లేరు మండలాల్లో ఎకో టూరిజం, టెంపుల్ టూరిజం అభివృద్ధికి రూ.187 కోట్లు ఖర్చు కాగల ప్రణాళికను రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి పంపించింది. అటవీ, పర్యాటక శాఖల అధికారులు ఇప్పటికే 20 పర్యాటక ప్రాంతాలను కొల్లేరులో గుర్తించారు. రానున్న రోజుల్లో కొల్లేరు రాష్ట్రంలోని పర్యాటక ప్రాంతాల్లో విశిష్ట స్థానాన్ని దక్కించుకుంటుందని పర్యావరణ విశ్లేషకులు భావిస్తున్నారు. విశాఖలో జరిగిన గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్(జీఐఎస్)లో కుదిరిన ఒప్పందాల ప్రకారం ఒబెరాయ్, నోవాటెల్, హయత్ వంటి అంతర్జాతీయ సంస్థలు భారీ పెట్టుబడులతో ముందుకొస్తున్నాయి. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఏకైక చిత్తడి నేలల ప్రాంతం కొల్లేరు కావడంతో విదేశీ పర్యాటకులు సైతం కొల్లేరు పర్యటనకు ఇష్టపడుతున్నారు. దీంతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పర్యాటక రంగానికి పెద్దపీట వేస్తున్నారు. టెంపుల్ టూరిజం సర్కిల్‌గా కొల్లేరు కొల్లేరు అందాలకు అదనపు ఆకర్షణగా టెంపుల్ టూరిజం మారనుంది. రాష్ట్రంలో అత్యధిక భక్తులు వచ్చే 100 ఆలయాల్లో ద్వారకాతిరుమల, మద్ది ఆంజనేయస్వామి, పంచారామ క్షేత్రాలైన భీమవరం ఉమాసోమేశ్వర స్వామి, పాలకొల్లు క్షీరారామలింగేశ్వర స్వామి, భీమవరం మావుళ్లమ్మ, కొల్లేటి పెద్దింట్లమ్మ ఆలయాలు ఉన్నాయి. ఇప్పటికే కొల్లేటికోటలోని పెద్దింట్లమ్మ దేవస్థానం వద్ద రూ.5 కోట్లతో సమీప జిల్లాల్లో ఎక్కడా లేనివిధంగా అనివేటి మండపం నిర్మిస్తున్నారు. మరోవూపు కైకలూరు మండలం సర్కారు కాలువ వంతెన వద్ద రూ.14.70 కోట్ల నిధులతో వారధి నిర్మాణం దాదాపు పూర్తయింది. ఈ వంతెన ద్వారా పశ్చిమ గోదావరి, ఏలూరు జిల్లాలకు ప్రయాణ దూరం తగ్గుతుంది. నేరుగా ఆర్టీసీ బస్సులు కొల్లేరు గ్రామాలకు రానున్నాయి. పర్యాటకానికి పెద్ద పీట ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పర్యాటక రంగానికి పెద్దపీట వేస్తున్నారు. ఇప్పటికే కొల్లేరులో టూరిస్ట్ పాయింట్లను గుర్తించాం. ఎకో, టెంపుల్ టూరిజాలకు కొల్లేరు చక్కటి ప్రాంతం. పర్యాటకులను ఆకర్షించే విధంగా తీర్చిదిద్దుతాం. – ఎండీహెచ్ మెహరాజ్, పర్యాటక శాఖ అధికారి పక్షుల కేంద్రాల్లో పటిష్ట ఏర్పాట్లు ఆటపాక, మాధవాపురం పక్షుల కేంద్రాల్లో యాత్రికుల కోసం అటవీ శాఖ అన్ని ఏర్పాట్లు చేసింది. ఆటపాక పక్షుల కేంద్రం వద్ద పక్షుల విహార చెరువు గట్లను పటిష్టపరిచాం. ఎక్కువగా విదేశీ, స్వదేశీ పక్షులు విహరిస్తున్న, పర్యాటకులు చూసే అవకాశం కలిగిన ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి సారించి అభివృద్థి పనులను చేయిస్తున్నాం. – జె.శ్రీనివాసరావు, ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్, కైకలూరు పర్యాటక రంగానికి ఊతం కోవిడ్ వల్ల దెబ్బతిన్న పర్యాటక శాఖకు ఉపశమనం కలిగించేందుకు రాష్ట్ర ప్రభుత్వం రూ.198.50 కోట్ల ప్యాకేజీని కేటాయించింది. ఇందులో భాగంగా ఇటీవల రూ.2 కోట్లతో కొరటూరు రిసార్ట్స్, జల్లేరు జలాశయం, జీలకర్రగూడెం గుంటుపల్లి గుహలు, పేరుపాలెం బీచ్, సిద్ధాంతం, పట్టిసీమ వంటి ప్రాంతాల్లో పర్యాటక శాఖ వివిధ అభివృద్థి పనులు చేపట్టింది. టెంపుల్ టూరిజంలో భాగంగా ఇప్పటికే ప్రముఖ దేవాలయాల వద్ద హెల్ప్ డెస్క్‌లను ఏర్పాటు చేశారు. కొల్లేరు పరీవాహక ప్రాంతాల్లో పూర్తిస్థాయి పర్యాటకాభివృద్ధి కోసం సుమారు రూ.800 కోట్ల నిధులు అవసరమవుతాయని అంచనా వేసి ప్రతిపాదనల నివేదికను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు అధికారులు సమర్పించారు -
కొల్లేరు ప్రజలకు మంచి రోజులు
కైకలూరు: కొల్లేరు ప్రజలకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పాలనలో మంచి రోజులు వచ్చాయి. చిరకాల కలగా మిగిలిన సర్కారు కాల్వపై వారధి ప్రారంభానికి సిద్ధమైంది. సమీప జిల్లాల్లో ఎక్కడా లేనివిధంగా పెద్దింట్లమ్మ దేవస్థానం వద్ద అతిపెద్ద అనివేటి మండప నిర్మాణం పనులు శరవేగంగా జరుగుతున్నాయి. సర్కారు కాల్వ వారధికి దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ వారధిగా పేరు ఖరారు చేయడానికి ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నారు. కొల్లేరు ప్రజలను కేవలం ఓటు బ్యాంకుగా మాత్రమే గత ప్రభుత్వం భావించింది. వైఎస్సార్సీపీ ప్రభుత్వం అక్కడి ప్రజల సంక్షేమానికి పెద్దపీట వేస్తోంది. కొల్లేరు ప్రజల ప్రధాన వృత్తి చేపల సాగు. ఎన్నికలకు ముందు పాదయాత్రలో ఆక్వా రైతులకు విద్యుత్ యూనిట్ చార్జీలను తగ్గిస్తానని సీఎం జగన్ మోహన్‌రెడ్డి వాగ్దానం చేశారు. అధికారంలోకి రాగానే ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారు. టీడీపీ పాలనలో యూనిట్ ధర రూ.3.85 ఉండగా జగన్ ప్రభుత్వం రూ.1.50కే యూనిట్ విద్యుత్‌ను సరఫరా చేస్తోంది. కొల్లేరు గ్రామాల్లో గడపగడపకూ మన ప్రభుత్వం నిధుల ద్వారా సీసీ రోడ్లను నిర్మిస్తున్నారు. సచివాలయాలు, రైతుభరోసా కేంద్రాలు, నాడు–నేడులో పాఠశాలల నిర్మాణాలు కొల్లేరు గ్రామాల్లో పెద్ద ఎత్తున జరుగుతున్నాయి. వారధి కల సాకారం దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి కొల్లేరు ప్రజల సమస్యల పరిష్కారానికి కృషి చేశారు. కొల్లేరు అభయారణ్య పరిధిని తగ్గిస్తూ అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి నివేదించారు. కొల్లేరు ఆపరేషన్ తర్వాత రూ.3,500 కోట్ల పునరావాస ప్యాకేజీని ప్రజలకు అందించారు. ప్రధానంగా కొల్లేరు ప్రజల చిరకాల కల సర్కారు కాల్వపై వారిధి నిర్మాణానికి 2009లో రూ.12 కోట్లను వైఎస్ కేటాయించారు. ఆయన ఆకస్మిక మరణం తర్వాత పనులు జరగలేదు. గత ప్రభుత్వం అంచనాలు పెంచి రూ.14.70 కోట్లు కేటాయించిన పనులను పూర్తి చేయలేదు. సీఎం ప్రత్యేక శ్రద్ధతో స్థానిక ఎమ్మెల్యే డీఎన్నార్ వారధి నిర్మాణాన్ని పూర్తి చేయించారు. తుది పనులు పూర్తికావడంతో ప్రారం¿ోత్సవ తేదీ ప్రకటించనున్నారు. అతిపెద్ద అనివేటి మండపం.. ఏలూరు జిల్లా కైకలూరు మండలం కొల్లేటికోట పెద్దింట్లమ్మ దేవస్థానం అతి పురాతనమైనది. గత ప్రభుత్వ పాలనలో అమ్మవారి దర్శనానికి వచ్చే భక్తులు ఎండలో నిలబడాల్సి వచ్చేది. ఎమ్మెల్యే డీఎన్నార్ ప్రత్యేక శ్రద్ధ వల్ల ప్రజా విరాళాలు దాదాపు రూ.5 కోట్లతో సమీప జిల్లాల్లో ఎక్కడా లేని విధంగా 305 మీటర్ల పొడవు, 105 మీటర్ల వెడల్పుతో భారీ అనివేటి మండపం పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ప్రధాన పనులు పూర్తయ్యాయి. వివిధ రకాల శిల్పాలను కళాకారులు సిద్ధం చేస్తున్నారు. అదే విధంగా అమ్మవారి జాతరలో కలవబోనాలను అతి వైభవంగా నిర్వహిస్తున్నారు. భక్తుల సంఖ్య పెరుగుతోంది పెద్దింట్లమ్మ దేవస్థాన అబివృద్ధికి ఎమ్మెల్యే డీఎన్నార్ విశేష కృషి చేస్తున్నారు. అతిపెద్ద అనివేటి మండపం త్వరలో పూర్తికానుంది. వారధి నిర్మాణం పూర్తికావడంతో ఏలూరు జిల్లా ప్రధాన కేంద్రానికి అమ్మవారి దేవస్థానం మీదుగా వాహనాలు చేరే అవకావం ఉంటుంది. దీంతో కొల్లేరు పర్యాటకాభివృది్థతో పాటు అమ్మవారి దేవస్థానానికి నేరుగా బస్సు సౌకర్యం ఏర్పడుతోంది. – కేవీ.గోపాలరావు, పెద్దింట్లమ్మ దేవస్థాన ఈవో, కొల్లేటికోట -
కొల్లేట్లో కొండచిలువ.. ఐయూసీఎన్ రెడ్ లిస్టులో ‘రాక్ పైథాన్’
కొల్లేరంటే కిక్కిస పొదలు.. పెద్దింట్లమ్మ ఆలయం.. విభిన్న రకాల చేపలు.. వలస పక్షులు.. నీటి పిల్లులు.. అరుదైన కుక్కలకు మాత్రమే ప్రసిద్ధి అనేది మొన్నటి మాట. ఆ జాబితాలో ఇప్పుడు కొండ పాములుగా పిలిచే కొండచిలువలు(ఇండియన్ రాక్ పైథాన్లు) సైతం చేరిపోయాయి. సుమారు మూడు దశాబ్దాల క్రితం ఎగువ అరణ్య ప్రాంతాల నుంచి బుడమేరు, తమ్మిలేరు, రామిలేరు, గుండేరు వంటి వాగుల ద్వారా కొల్లేరుకు వలస వచ్చి స్థిర నివాసం ఏర్పాటు చేసుకున్నాయి. ఉప్పుటేరుల మధ్య పొదలు.. చేపల చెరువుల గట్లపై ఆవాసాలను ఏర్పాటు చేసుకుని మనుగడ సాగిస్తున్నాయి. కైకలూరు(ఏలూరు జిల్లా): కొండ చిలువలు చెట్లపై మాత్రమే ఉంటాయని భావిస్తుంటారు. ఇవి నీటిలో సైతం వేగంగా ఈదగలవు. ఎక్కువ సమయం ఇవి నీటిలోనే గడుపుతుంటాయి. చిత్తడి నేలలు, గడ్డి భూములు, రాతి పర్వతాలు, నదీ లోయల్లో ఇవి నివసిస్తుంటాయి. పాడుబడిన క్షీరదాల బొరియలు, చెట్లు, మడ అడవుల్లో దాక్కుంటాయి. కోళ్లు, పక్షులు, ఎలుకలు, అడపాదడపా ఇతర జంతువులను సైతం ఆహారంగా తీసుకుంటాయి. అలాంటి కొండచిలువలు ఇప్పుడు కొల్లేరుకు అతిథులయ్యాయి. ఉమ్మడి పశ్చిమ గోదావరి, కృష్ణా జిల్లాల్లోని 9 మండలాల పరిధిలో.. 77,138 ఎకరాల విస్తీర్ణంలో కొల్లేరు అభయారణ్యం విస్తరించి ఉంది. ఇక్కడ 2.80 లక్షల ఎకరాల్లో చేపల చెరువులు సాగవుతున్నాయి. ఈ చెరువుల చెంతకు సుమారు మూడు దశాబ్దాల క్రితం అరణ్య ప్రాంతాల నుంచి బుడమేరు, తమ్మిలేరు, రామిలేరు, గుండేరు వంటి వాగుల ద్వారా కొండచిలువలు వలస రావటం మొదలైంది. కిక్కిస పొదలు, చేపల చెరువుల గట్లపై ఆవాసాలను ఏర్పాటు చేసుకుని ఇక్కడే తిష్టవేశాయి. ఇట్టే పెరిగిపోతాయి ఏలూరు జిల్లా కలిదిండి మండలం కొండంగి, మట్టగుంట, పడమటిపాలెం, కైకలూరు మండలం ఆటపాక, వరాహపట్నం, భుజబలపట్నం, ముదినేపల్లి, పశ్చిమ గోదావరి జిల్లా ఆకివీడు ప్రాంతాల్లో కొండచిలువల సంచారం కనిపిస్తోంది. చేపల చెరువులపై కొండచిలువలు సంతానోత్పత్తి చేస్తున్నాయి. ఇండియన్ రాక్ పైథాన్‌గా పిలిచే కొండచిలువల శాస్త్రీయ నామం పైథాన్ మోలురూస్. ఇవి 12 అడుగుల పొడవు, 52 కేజీల బరువు పెరుగుతాయి. వీటి జీవిత కాలం గరిష్టంగా 21 సంవత్సరాలు. ఇవి పుట్టిన తర్వాత త్వరగా పెద్దవి అవుతాయి. ఏడాది వయసు దాటిన తర్వాత నుంచి జత కడుతుంటాయి. సాధారణంగా మార్చి, ఏప్రిల్ నెలల్లో ఇవి జత కట్టి 2 నుంచి 3 నెలల్లో గర్భం దాలుస్తాయి. అనంతరం మూడు నుంచి నాలుగు రోజుల వ్యవధిలో రోజుకు 20 నుంచి 30 గుడ్ల చొప్పున కనీసం 100 గుడ్ల వరకు పెడతాయి. నాలుగు నెలల పాటు గుడ్లను పొదుగుతాయి. పొదిగిన గుడ్లలో 80 శాతానికి పైగా పిల్లలు అవుతాయి. పుట్టిన పిల్లలు 18–24 అంగుళాల వరకు పొడవు ఉంటాయి. అయితే, పుట్టిన వాటిలో 25 శాతం పిల్లల్ని వరకు తల్లే తినేస్తుంది. ఆహారం అందక ఇంకొన్ని చనిపోతాయి. చివరకు 10–15 పిల్లలు మాత్రమే బతికే అవకాశం ఉంటుంది. ఇవి మాంసాహారులు. క్షీరదాలు, పక్షులు, సరీసృపాలు, ఉభయచరాలను తింటాయి. ఒకసారి ఆహారం తీసుకున్న తర్వాత వారం పాటు ఏమీ తినకుండా ఉండగలవు. ఎక్కువగా ఒంటరి జీవితం గడుపుతాయి. సంభోగ సమయంలో మాత్రమే జత కడతాయి. ప్రపంచంలో అతి పెద్ద పాముల్లో ఇది కూడా ఒకటి. కొండచిలువలకు అండ ఏదీ! కొండచిలువలు విషసర్పాలు కానప్పటికీ ప్రజల చేతిలో హతమవుతున్నాయి. వీటి ఆకారం భారీగా ఉండటంతో ప్రజలు భయపడి చంపేస్తున్నారు. కొద్ది ఘటనల్లో మాత్రమే అటవీ శాఖ అధికారులు వీటిని రక్షించి చింతలపూడి ఎగువన అడవుల్లో వదులుతున్నారు. ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్ (ఐయూసీఎన్) హాని కలిగే జాతుల జాబితా (రెడ్ లిస్ట్)లో వీటిని చేర్చింది. ఐయూసీఎన్ సంస్థ దాదాపు 40 శాతం రాక్ పైథాన్ జాతి అంతరించిందని ఆందోళన వ్యక్తం చేస్తోంది. కొల్లేరు గ్రామాల్లో ఏటా 30 నుంచి 40 కొండచిలువలు ప్రజల చేతిలో హతమవుతున్నట్టు అంచనా. అటవీ శాఖ కొండచిలువలను కూడా షెడ్యూల్–1లో చేర్చింది. వీటిని చంపటం నేరమని ప్రకటించింది. చంపొద్దు.. సమాచారం ఇవ్వండి.. ఇండియన్ రాక్ పైథాన్లు అరుదైన సరీసృపాలు. ఇవి విషపూరితం కావు. చేపల చెరువుల వద్ద ఇవి సంచరిస్తున్నాయి. అరుదుగా జనాలకు తారసపడుతున్నాయి. ఇటీవల మత్స్యకారుల వలల్లో ఇవి చిక్కాయి. అటవీ శాఖ సిబ్బంది వీటిని అడవుల్లో సురక్షితంగా వదులుతున్నారు. కొండచిలువలు కనిపిస్తే వాటిని చంపొద్దు. వీటిని చంపటం నేరం. అందువల్ల ఎక్కడైనా కొండచిలువలు కనిపిస్తే అటవీ అధికారులకు సమాచారం తెలియజేయండి. – జె.శ్రీనివాస్, అటవీ శాఖ రేంజర్, కైకలూరు -
కొల్లేరు అంబాసిడర్‌గా గూడకొంగ
సాక్షి, అమరావతి: కొల్లేరు అంబాసిడర్‌గా గూడకొంగ(స్పాట్ బిల్డ్ పెలికాన్)ను ఎంపిక చేశారు. ఈ విషయాన్ని రాష్ట్ర అటవీ దళాధిపతి ఎన్.ప్రతీప్‌కుమార్ బుధవారం వెల్లడించారు. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ ఐకానిక్ వీక్ కార్యక్రమంలో భాగంగా ఈ పక్షిని అంబాసిడర్‌గా గుర్తించినట్లు చెప్పారు. గుంటూరులోని అటవీ శాఖ రాష్ట్ర ప్రధాన కార్యాలయంలో బుధవారం దీనికి సంబంధించిన పోస్టర్, లోగోను ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఈ వారం దేశవ్యాప్తంగా చిత్తడి నేలల పరిరక్షణ కోసం కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని చెప్పారు. ప్రతి రాష్ట్రంలో చిత్తడి నేలలకు సంబంధించిన ఒక పక్షి లేదా అక్కడి వైవిధ్యమైన జంతువును అంబాసిడర్‌గా ఎంపిక చేయాల్సి ఉందన్నారు. ఏపీలో గూడకొంగను ఎంపిక చేసినట్లు తెలిపారు. ప్రపంచంలో ఉన్న పెలికాన్ పక్షుల్లో 40 శాతం ప్రతి ఏడాదీ కొల్లేరుకు వస్తాయని, అందుకే దీన్ని అంబాసిడర్‌గా ఎంపిక చేశామన్నారు. చిత్తడి నేలల పరిరక్షణ కోసం వెట్ ల్యాండ్ మిత్రాస్‌ను నియమిస్తామని తెలిపారు. స్థానికంగా సేవా దృక్పథం ఉన్నవారిని ఇందుకు ఎంపిక చేస్తామన్నారు. కార్యక్రమంలో డీఎఫ్ఓ సెల్వం తదితరులు పాల్గొన్నారు. -
కొల్లేరు కట్టుబాట్లకు చెల్లుచీటి పలకండి
కైకలూరు: ప్రజాస్వామ్యంలో వజ్రాయుధం వంటి ఓటు హక్కును కొల్లేరు గ్రామాల్లో కట్టుబాట్లు చిదిమేస్తున్నాయని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఏలూరు పార్లమెంటు సభ్యుడు కోటగిరి శ్రీధర్ ఆవేదన వ్యక్తం చేశారు. కృష్ణాజిల్లా కైకలూరు ట్రావెలర్స్ బంగ్లాలో గురువారం జరిగిన కొల్లేరు గ్రామాల ఆత్మీయ సమావేశంలో స్థానిక ఎమ్మెల్యే దూలం నాగేశ్వరరావు(డీఎన్నార్)తో కలసి ఆయన పాల్గొన్నారు. కృష్ణాజిల్లాకు చెందిన 110 మంది కొల్లేరు గ్రామాల పెద్దలు ఎంపీ, ఎమ్మెల్యే సమక్షంలో పార్టీలో చేరారు. మరో 15 గ్రామాల ప్రజలు పార్టీలో చేరాలని తీర్మానం చేసుకున్నారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ ప్రతి ఎన్నికల్లో కుల కట్టుబాట్ల కారణంగా ఒకే పార్టీకి చెందిన వ్యక్తికి ఓట్లు వేయడం మంచి పద్ధతి కాదన్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పాలనలోనైనా కొల్లేరు ప్రజలు కట్టుబాట్లు కాకుండా స్వేచ్ఛగా ఓటు హక్కు వినియోగించుకోవాలని సూచించారు. సీఎం జగన్మోహన్రెడ్డి పాలనలో కొల్లేరులో రెగ్యులేటర్ నిర్మిస్తామన్నారు. రాష్ట్రంలో అన్ని భూములు రీ సర్వే జరుగుతుందని, కొల్లేరు భూములు ఇందులో ఉంటాయని తెలిపారు. వైఎస్సార్ సీసీ నాయకులు ముంగర నరసింహారావు, కొండలరావు, బొడ్డు నోబుల్, వాసిపల్లి యోనా, పంజా రామారావు, కొల్లేరు పెద్దలు సైత సత్యనారాయణ, ఘంటసాల వెంకటేశ్వరరావు, నబిగారి రాంబాబు తదితరులు పాల్గొన్నారు. -
కొల్లేరు సమస్యలు పరిష్కరిస్తాం
సాక్షి, పెదవేగి రూరల్/ఏలూరు(సెంట్రల్): మనందరి ప్రభుత్వం అధికారంలోకి రాగానే కొల్లేరు ప్రజల సమస్యలను పరిష్కరిస్తాం.. కొల్లేరు విషయంలో శాశ్వత పరిష్కారం చూపించేందుకు తిరిగి సర్వే చేయిస్తాం.. కొల్లేరువాసులు ధైర్యంగా ఉండండి’ అంటూ వైఎస్ షర్మిల భరోసా ఇచ్చారు. పెదవేగి మండలం నడిపల్లి గ్రామంలో కొల్లేరు ప్రజలు, మహిళలు, మత్స్యకారులతో ఏర్పాటుచేసిన ముఖాముఖీలో బుధవారం ఆమె మాట్లాడారు. దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ అక్రమాలు, కొల్లేరు సమస్యలపై ప్రజలు ఆమె వద్ద ఏకరువు పెట్టారు. డ్వాక్రా రుణాలు మాఫీకాకపోవడంతో వడ్డీకి అప్పులు చేసి బ్యాంకు రుణాలు చెల్లించామని, పసుపు–కుంకుమ సొమ్ములు వడ్డీలకు కూడా సరిపోవడం లేదని మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామానికి చెందిన ఓ మహిళ తన బిడ్డకు ఫీజు రీయింబర్స్మెంట్ ఇవ్వలేదని, అధికార పార్టీ అనుయాయులకే పథకాలు అందిస్తున్నారని షర్మిల వద్ద గోడు వెళ్లబోసుకున్నారు. మత్స్యకార అభివృద్ధి బోర్డు, రెగ్యులేటర్, ఎస్సీ సొసైటీలు, ఐదో కాంటూర్‌లో జిరాయితీ భూములు, నష్టపరిహారం, రీ సర్వే తదితర సమస్యలను కొల్లేరు గ్రామస్తులు షర్మిలకు వివరించారు. చింతమనేనికి ఓటుతో బుద్ధి చెప్పండి వైఎస్ షర్మిల మాట్లాడుతూ మహిళా తహసీల్డార్ వనజాక్షిని జుట్టు పట్టుకుని కొట్టిన సంఘటన తాను టీవీలో చూశానని.. చింతమనేని దుర్మార్గాలు ఒక్కొక్కటిగా తెలుస్తుంటే అతను మనిషా.. పశువా అని ప్రశ్నించారు. చింతమనేనికి పోయేకాలం వచ్చిందని అతడిపై 38కి పైగా కేసులు ఉన్నాయంటేనే అర్థమవుతుంది అతడు ఏలాంటి వాడో అని అన్నారు. చంద్రబాబు ప్రోత్సాహంతోనే చింతమనేని రెచ్చిపోతున్నారన్నారు. ఇలాంటి అరాచకాలకు పాల్పడుతున్న వ్యక్తికి తిరిగి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చారని.. ఇది అతడిని చంద్రబాబు ప్రోత్సహించడం కాదా అని ప్రశ్నించారు. చింతమనేని ప్రభాకర్‌కు ప్రజలంతా ఓటుతో బుద్ధి చెప్పాలన్నారు. మనందరి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చింతమనేని అక్రమాలపై చర్యలు తీసుకునే బాధ్యత తీసుకుంటామని, కొల్లేరు సమస్యను జగనన్న పరిష్కరిస్తారని, కొల్లేరును రీసర్వే చేసి ప్రజలకు ఇబ్బంది లేకుండా నిర్ణయం తీసుకుంటారన్నారు. నవరత్నాలతో అందరి జీవితాల్లో వెలుగులు జగనన్న నవరత్నాలతో అందరి జీవితాల్లో వెలుగులు నింపుతారని, పిల్లలను బడికి పంపిస్తే ఏడాదికి రూ.15 వేలు ఇస్తారని, డ్వాక్రా రుణమాఫీ చేసి ఆ సొమ్మును నేరుగా అక్క, చెల్లెమ్మలకు అందిస్తారని షర్మిల అన్నారు. వృద్ధులకు పెన్షన్ రూ.2 వేల నుంచి రూ.3 వేలు చేస్తారని, జగనన్నకి ఒక్కసారి అవకాశం ఇస్తే అందరి కష్టాలు తీరుస్తారన్నారు. పిల్లల చదువులకు ఎంత ఖర్చయినా ప్ర భుత్వమే భరించేలా జగనన్న చూస్తారన్నారు. దీంతో పాటు మెస్ ఛార్జీలకు రూ.20 వేలు ఇస్తారన్నారు. ప్రతి రైతుకు మే నెలలో రూ.12 వేలు పెట్టుబడి సాయం అందిస్తారని, రూ.3 వేల కోట్లతో రైతులకు ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు చేస్తారని, కరువు, వరదలతో పంటలు నష్టపోతే ఆదుకునేందుకు రూ.4 వేల కోట్లతో నిధి ఏ ర్పాటుచేస్తారన్నారు. ఫ్యాన్ గుర్తుకు ఓటేసీ టీడీపీ ప్రభుత్వాన్ని ఇంటికి సాగనంపుదామన్నారు. రాజన్నరాజ్యం జగనన్నతోనే సా ధ్యమన్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఏలూరు పార్లమెంటరీ ని యోజకవర్గ అభ్యర్థి కోటగిరి శ్రీధర్, దెందులూరు అసెంబ్లీ అభ్యర్థి కొఠారు అబ్బయ్య చౌదరి, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. జగన్ హామీతో సంతోషం: మండల కొండలరావు నా పేరు మండల కొండలరావు, మాది శ్రీపర్రు. కొల్లేరు చెరువులను చాలా వరకు ధ్వంసం చేయడంతో ఉపాధి కోల్పోతున్నాం. సుమారు లక్ష మంది వరకు ఇతర రాష్ట్రాలకు వలసలు వెళ్లారు. కొల్లేరు ప్రాంతాన్ని రీ సర్వే చేయాలని, సమస్యలు పరిష్కరించాలని జగన్మోహన్రెడ్డికి కొల్లేరు ప్రాంతంలో పాదయాత్ర చేసిన సమయంలో వినతిపత్రం ఇచ్చాం. మా సమస్యలు చట్టసభల్లో చెప్పేందుకు కొల్లేరు ప్రాంతానికి ఎమ్మెల్సీని ఇస్తానని ఆయన హామీ ఇవ్వడం సంతోషం. అన్ని సమస్యలు పరిష్కరిస్తాం: వైఎస్ షర్మిల వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే కొల్లేరు ప్రాంతంలోని ప్రజల సమస్యలు పరిష్కారమవుతాయి. జగన్ ఇచ్చిన మాట తప్పరు. ఐదేళ్లు అధికారంలో ఉన్న ప్రభుత్వం ప్రజల సమస్యలను గాలికి వదిలేసింది. ఉపాధి అవకాశాలు కల్పించడంలో విఫలమైంది. చింతమనేని వేధింపులు ఎక్కువయ్యాయి: జీవమణి నాపేరు జీవమణి, మహిళా సమాఖ్య మాజీ అధ్యక్షురాలిని. మహిళా సమాఖ్య అధ్యక్షురాలుగా పనిచేస్తున్న నన్ను కాలపరిమితి ఉన్నా దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ కావాలనే పదవి నుంచి తొలగించారు. మానసికంగా వేధింపులకు దిగారు. మహిళ అని కూడా చూడకుండా ఇబ్బందులు పెట్టారు. దీంతో నా ఆరోగ్యం కూడా క్షీణించింది. ప్రభుత్వం చెప్పేవన్నీ అబద్ధాలే..: భలే జయలక్ష్మి నా పేరు భలే జయలక్ష్మి, గుడివాకలంక. ఇల్లు నిర్మించుకునేందుకు రుణాలు ఇస్తామని చెప్పి ప్రభుత్వం మోసం చేసింది. ప్రభుత్వ సబ్సిడీ వస్తుంది కదా అని అప్పు చేసి ఇల్లు కట్టుకున్నాం. అయినా సబ్సిడీ రాకపోవడంతో అప్పులు తీర్చలేని పరిస్థితి. మొదట డ్వాక్రా రుణమాఫీ విషయంలో మోసపోయాం. ఇళ్ల సబ్సిడీ విషయంలో మరోసారి మోసపోయాం. కేసులన్నీ బయటకు తీస్తాం: వైఎస్ షర్మిల బాధ్యత గత ఎమ్మెల్యే పదవిలో ఉన్న చింతమనేని ప్రభాకర్ ఆడామగా అనే తేడా లేకుండా ప్రవర్తిస్తున్నారు. మహిళా తహసీల్దార్‌పై దాడిచేశారు. చింతమనేని ప్రభాకర్ మనిషా లేక పశువా. 34 కేసులు ఉన్న ఈ రౌడీ ఎమ్మెల్యేకే సీఎం చంద్రబాబు మళ్లీ టికెట్ ఇచ్చారు. ఇటువంటి వ్యక్తి చట్టసభలకు వెళ్లడం అవసరమా.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత చింతమనేని ప్రభాకర్‌పై నమోదైన కేసులన్నీ బయటకు తీస్తాం. వలసలు పోవాల్సిన దుస్థితి: ఘంటసాల దుర్గ నా పేరు ఘంటసాల దుర్గ, మాది గుడిపాడు గ్రామం. డ్వాక్రా రుణాలను పూర్తిగా మాఫీ చేస్తామని చంద్రబాబు మహిళలను మోసం చేశారు. ఇప్పుడు ఎన్నికల వస్తున్నాయని చెప్పి పసుపు–కుంకుమ పేరుతో రూ.10 వేలు ఇస్తున్నారు. ఇవి వడ్డీలకు కూడా సరిపోవు. కొల్లేరు ప్రాంతంలోని చెరువులను కొట్టివేయడంతో ఉపాధి లేక వలసలు పోవాల్సిన దుస్థితి నెలకొంది. ఇప్పటికే చాలా మంది ఊళ్లు వదిలి వెళ్లిపోతున్నారు. ఓట్ల కోసం మోసం చేస్తున్నారు: వైఎస్ షర్మిల గత ఎన్నికల సమయంలో చంద్రబాబు చాలా హామీలు ఇచ్చారు. ఇప్పుడు మరలా ఎన్నికలు వస్తున్నాయని పసుపు–కుంకుమ అంటూ డబ్బులు ఇస్తూ మభ్యపెడుతున్నారు. ఆ సొమ్ము వడ్డీలకు కూడా సరిపోదు. ఓట్ల కోసం చంద్రబాబు మోసం చేస్తున్నారనే విషయాన్ని మహిళలంతా గుర్తించాలి. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే కొల్లేరు ప్రాంతంలో ప్రజలకు ఉపాధి అవకాశాలు కల్పిస్తాం. చెరువులను స్వాధీనం చేసుకున్న ఎమ్మెల్యే: తిరుపతిరావు నా పేరు సైదు తిరుపతిరావు, మాది ప్రత్తికోళ్లలంక గ్రామం. టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత కొల్లేరు గ్రామాల్లోని చెరువులన్నీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ స్వాధీనం చేసుకుని, చెరువుల్లో చేపలను అమ్ముకున్నారు. ఇలా మూడేళ్లుగా రూ.13 కోట్ల వరకు దోచుకున్నారు. ఐక్యంగా ఉండే గ్రామస్తుల మధ్య గొడవలు పెట్టి వర్గాలుగా తయారుచేయడంతో గ్రామాల్లో ఉండలేని పరిస్థితి. ఏడు నెలల నుంచి ఏలూరులో తలదాచుకుంటున్నా. ఎమ్మెల్యే చింతమనేని చాలా దారుణంగా వ్యవహరిస్తున్నారు. విషయాన్ని సీఎం దృష్టికి తీసుకువెళ్లినా పట్టించుకోకపోగా తిరిగి ఆయనకే ఎమ్మెల్యే టికెట్ కట్టబెట్టారు. చంద్రబాబు ప్రోద్బలంతోనే..: వైఎస్ షర్మిల సీఎం చంద్రబాబు అలా ఉన్నారు కాబట్టే ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ఇలా ఉన్నారు. తెలుగుదేశం పార్టీ, చింతమనేని ప్రభాకర్‌కు తగ్గిన బుద్ధి చెప్పాలని ప్రచారం చేయండి. త్వరలో రాబోయే రాజన్న రాజ్యంలో ప్రజలందరికీ మేలు జరుగుతుంది. కొల్లేరు సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపేలా రీ సర్వే చేయిస్తాం. మీరు ధైర్యంగా ఉండండి.. మనందరి ప్రభుత్వం అధికారంలోకి రాగానే కొల్లేరు ప్రజల సమస్యలు పరిష్కరిస్తాం. -
‘వైఎస్సార్ పాలనలో ప్రజలు ధైర్యంగా ఉన్నారు’
సాక్షి, పశ్చిమ గోదావరి: దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి పాలనలో కొల్లేరు ప్రాంతాల ప్రజలు ధైర్యంగా ఉన్నారని వైఎస్సార్ సీపీ నేతలు ఆళ్ల నాని, కోటగిరి శ్రీధర్, కొఠారు అబ్బయ్య చౌదరి, పుప్పాల వాసుబాబు, దూలం నాగేశ్వరరావు వ్యాఖ్యానించారు. గురువారం కొల్లేరు నేతల సమావేశంలో వైఎస్సార్ సీపీ నేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. కొల్లేరు గ్రామంలో మంచి నీటి సమస్య తీరుస్తామని హామీ ఇచ్చారు. కొల్లేరు డెవలప్మెంట్ బోర్డును పునరుద్ధరిస్తామని భరోసా ఇచ్చారు. తెలుగుదేశం పార్టీ కొల్లేరు అంటే ఆదాయ వనరులుగా, ఆ ప్రాంత భూములను ఎలాగ కాజేయాలని చూస్తున్నారంటూ మండిపడ్డారు. మళ్లీ కొల్లేరుకు పూర్వవైభవం రావాలంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డితోనే సాధ్యం అవుతుందని స్పష్టం చేశారు. కొల్లేరు సమస్యలు పూర్తి స్థాయిలో పరిష్కారం చేస్తామని చెప్పారు. -
జేపీ, జేడీలకు లేని ఆంక్షలు నాకెందుకు: పవన్
కొల్లేరు(పశ్చిమగోదావరి జిల్లా) : జయప్రకాశ్ నారాయణ, జేడీ లక్ష్మీనారాయణ కొల్లేరుకు వచ్చినపుడు లేని ఆంక్షలు తాను వచ్చినపుడే ఎందుకు పెడుతున్నారని జనసేన అధినేత పవన్ కల్యాణ్ ప్రశ్నించారు. కొల్లేరులో యాత్రకు కట్టుబాట్లు విధించడంపై పవన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. సంప్రదాయ మత్స్యకారులు అవినీతి రాజకీయ పార్టీల కుట్రల మధ్యలో నలిగిపోయారని వ్యాఖ్యానించారు. ప్రజలకు న్యాయం చేస్తానని తానంటే ఇక్కడి నాయకులకు భయం పట్టుకుందని విమర్శించారు. అందుకే తన వద్దకు రావద్దని, రాకుండా కట్టుబాట్లు విధించారని ఆరోపించారు. గత రాత్రి తనపై దాడి చేయడానికి కూడా వచ్చారని తెలిపారు. తాను చేతులు కట్టుకుని కూర్చోనని, తన సంగతి తెలుసు కదా మక్కెలు ఇరగదీస్తానని హెచ్చరికలు పంపారు. తన మీద దెబ్బ పడేకొద్దీ తాను ఎదుగుతానే తప్ప తగ్గనని వ్యాఖ్యానించారు. తాను ముఖ్యమంత్రి అయితే రూ.110 కోట్లు పెట్టి కొల్లేరులో రెండు రెగ్యులేటర్లు ఏర్పాటు చేస్తానని పవన్ హామీ ఇచ్చారు. ముఖ్యమంత్రి అయిన వెంటనే కొల్లేరు సమస్య పరిష్కరిస్తానని చెప్పారు. తనను గెలిపించకపోయినా పర్వాలేదు గానీ, తన వెనక ఉండండి చాలు పోరాడి సాధించుకుందామని కొల్లేరు పర్యటనలో పవన్ పిలుపునిచ్చారు. -
కొంప ‘కొల్లేరు’ చేసింది బాబే
సాక్షి, అమరావతి/సాక్షి ప్రతినిధి, ఏలూరు: ‘కొల్లేరు’ రైతులకు న్యాయం చేస్తామని వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ హామీ ఇచ్చిన నేపథ్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబు ఇప్పుడు కొత్త పల్లవి అందుకున్నారు. కొల్లేరు రైతుల గురించి ఇన్నాళ్లూ ఏమాత్రం పట్టించుకోని ముఖ్యమంత్రి ప్రస్తుతం ఎన్నికలు దగ్గర పడుతుండడంతో కాంటూరు 3–5 మధ్య ఉన్న 20,600 ఎకరాల జిరాయితీ, డి.పట్టా భూములను రైతులకు ఇప్పిచ్చేందుకు చర్యలు తీసుకుంటామని ప్రకటించడం చూసి అధికార యంత్రాంగం విస్తుబోతోంది. కేంద్ర ప్రభుత్వం, సుప్రీంకోర్టు సాధికార కమిటీ అనుమతి లేనిదే కొల్లేరు అభయారణ్యంలో సెంటు భూమి కూడా ఎవరికీ ఇవ్వడానికి వీల్లేదు. ఇలాంటి పరిస్థితుల్లో 20,600 ఎకరాలను అభయారణ్యం నుంచి మినహాయిస్తూ నోటిఫికేషన్ జారీ చేసి, రైతులకు ఇచ్చేస్తామని చంద్రబాబు ఎలా ప్రకటిస్తారని అధికారులు, పర్యావరణ నిపుణులు ప్రశ్నిస్తున్నారు. ఈ నాలుగేళ్లూ ఎందుకు పట్టించుకోలేదు? వాస్తవానికి కొల్లేరు అభయారణ్యాన్ని కాంటూరు 3 నుంచి 5కు పెంచడం ద్వారా రైతులను దగా చేసింది చంద్రబాబే. మూడో కాంటూరు వరకూ 135 చదరపు కిలోమీటర్ల పరిధిలో 33,750 ఎకరాలకే పరిమితమైన కొల్లేరు అభయారణ్యాన్ని ఐదో కాంటూరుకు పెంచారు. దీనివల్ల కొల్లేరు అభయారణ్యం విస్తీర్ణం 77,138 ఎకరాలకు(308 చదరపు కిలోమీటర్లకు) విస్తరించింది. ఈ మేరకు 1999 అక్టోబరు 4న చంద్రబాబు ప్రభుత్వం జీవో 120ను జారీ చేసింది. దీనివల్ల 20,000 ఎకరాలకుపైగా జిరాయితీ, డి.పట్టా భూములు కొల్లేరు అభయారణ్యం పరిధిలోకి కొత్తగా చేరాయి. ఫలితంగా ఆయా భూముల్లో పంటలు సాగు చేసుకోవడానికి అవకాశం లేక రైతులు కష్టాలు ఎదుర్కొంటున్నారు. కొల్లేరును కాంటూరు 5 నుంచి 3కు కుదించాలని, తమ భూములను అభయారణ్యం నుంచి మినహాయించాలని పశ్చిమ గోదావరి, కృష్ణా జిల్లాలోని పలు మండలాల రైతులు ఉద్యమించారు. తర్వాత కొల్లేరును కాంటూరు 5 నుంచి 3కు కుదించాలంటూ చంద్రబాబు సర్కారు అసెంబ్లీలో తీర్మానం చేసింది. దీని ప్రకారం సీఎం నేతృత్వంలోని రాష్ట్ర వైల్డ్ లైఫ్ బోర్డు ఇదే తీర్మానం చేసి నేషనల్ వైల్డ్ లైఫ్ బోర్డుకు పంపించి చేతులు దులుపుకుంది. ప్రధానమంత్రి నరేంద్రమోదీ నేతృత్వంలోని జాతీయ వైల్డ్ లైఫ్ బోర్డు 2015 సెప్టెంబరులో ఈ తీర్మానాన్ని తిరస్కరించింది. దీన్నిబట్టే కాంటూరు కుదింపు కోసం రాష్ట్ర ప్రభుత్వం పంపిన తీర్మానం ఆమోదం కోసం మోదీపై చంద్రబాబు ఏమాత్రం ఒత్తిడి తేలేదని తేటతెల్లమవుతోంది. తాజాగా కొల్లేరు రైతులకు ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ ఇచ్చిన హామీతో చంద్రబాబు కళ్లు తెరుచుకున్నాయి. 3–5 కాంటూరు పరిధిలోని జిరాయితీ, పట్టా భూముల రైతులకు ఏదో మేలు చేస్తున్నామనే భ్రమలు కల్పిస్తున్నారు తప్ప చంద్రబాబుకు చిత్తశుద్ధి లేదని స్థానికులు విమర్శిస్తున్నారు. ముఖ్యమంత్రి నిజంగా తమ మేలు కోరే వారే అయితే ఈ నాలుగేళ్లూ ఎందుకు పట్టించుకోలేదని ప్రశ్నిస్తున్నారు. కేంద్రం పరిధిలోని అంశమని తెలిసినా.. కొల్లేరు కాంటూరు 3–5 మధ్య ఉన్న 20,000 ఎకరాలకు పైగా జిరాయితీ, డి.పట్టా భూములను రైతులకు ఇస్తామని చంద్రబాబు చెప్పడం వారిని మోసగించడమేనని అధికారులు అంటున్నారు. జాతీయ వైల్డ్‌లైఫ్ బోర్డు ఆమోదించిన తర్వాత సుప్రీంకోర్టు నేతృత్వంలోని సాధికార కమిటీ దీన్ని ఆమోదించాల్సి ఉంటుంది. కేంద్ర ప్రభుత్వం (జాతీయ వైల్డ్‌లైఫ్ బోర్డు) ప్రతిపాదన పంపితేనే సుప్రీంకోర్టు ఈ విషయాన్ని పరిశీలిస్తుంది. అంటే కేంద్ర ప్రభుత్వం, సుప్రీంకోర్టు పరిధిలోని అంశం. అయినా ఆయా భూములను తానే రైతులకు ఇచ్చేస్తానని చంద్రబాబు చెప్పడం మోసగించే ప్రయత్నమేనని అధికారులు పేర్కొంటున్నారు. సమస్యను పరిష్కరిస్తామన్న జగన్ ప్రజాసంకల్ప యాత్రలో భాగంగా కృష్ణా, పశ్చిమ గోదావరి జిల్లాల్లో పర్యటించిన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహనరెడ్డి కొల్లేరు రైతుల గోడు తెలుసుకున్నారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తే కొల్లేరు సమస్యను పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. కొల్లేరు వాసుల నుంచే ఒకరికి ఎమ్మెల్సీ పదవి ఇస్తామన్నారు. కొల్లేరు భూములు రీ సర్వే చేస్తామని ప్రకటించారు. నిర్ణయాధికారం సుప్రీంకోర్టుదే.. ‘‘కొల్లేరు సరస్సు కాంటూర్ కుదింపు లేదా భూముల మినహాయింపు అధికారం సుప్రీంకోర్టు పరిధిలో ఉంది. సెంట్రల్ సాధికార కమిటీ ఆమోదించాల్సి ఉంటుంది. రాజకీయ నాయకులు, ప్రజాప్రతినిధులు, కొందరు అధికారులు కొల్లేరులో భూములను చేపల చెరువులుగా మార్చేసి, వ్యాపారం చేస్తున్నారు. ఓట్ల కోసం చంద్రబాబు ఇప్పుడు మళ్లీ కొల్లేరు అంశాన్ని ప్రస్తావిస్తూ ప్రజలను మోసం చేసేందుకు ప్రయత్నిస్తున్నారు’’ – తల్లవజ్జుల పతంజలిశాస్త్రి, పర్యావరణవేత్త, రాజమండ్రి(ఫోటో నెంబర్ 1001) చంద్రబాబుకు చిత్తశుద్ధి లేదు ‘‘కొల్లేరు భూముల విషయంలో సీఎం చంద్రబాబుకు చిత్తశుద్ధి లేదు. కొల్లేరు భూములు పంపిణీ చేయాలంటూ నాలుగేళ్లుగా ప్రభుత్వ పెద్దల చుట్టూ తిరిగినా ఎవరూ స్పందించలేదు. దీనిపై కేంద్రమే నిర్ణయం తీసుకోవాలంటూ తిప్పి పంపారు. ఇప్పుడు ఎన్నికలు సమీపిస్తుండంతో మళ్లీ భ్రమల్లో ముంచుతున్నారు’’ – ఘంటసాల లక్ష్మీ, రాష్ట్ర మత్స్యకారుల సంఘం మహిళా అధ్యక్షురాలు (1002) జగన్ హామీ ఇవ్వడం వల్లే.. ‘‘కొల్లేరు కాంటూరును కుదిస్తామంటూ నాలుగేళ్ల క్రితం తెలుగుదేశం పార్టీ ఆశ పెట్టింది. ఎన్నికల్లో ఓట్లు వేయించుకుని అధికారం దక్కించుకున్న తర్వాత మోసం చేసింది. నాలుగేళ్లుగా ఈ విషయాన్ని పట్టించుకోలేదు. మా సమస్యలపై స్పందించిన వైఎస్ జగన్మోహన్రెడ్డి న్యాయం చేస్తామని ఇటీవల హామీ ఇచ్చారు. దీంతో ముఖ్యమంత్రి చంద్రబాబు కొల్లేరు భూములపై మాట్లాడుతున్నారు’’ – ఘంటసాల బలరామయ్య, గుడివాకలంక (1004) -
మరోసారి రెచ్చిపోయిన టీడీపీ ఎమ్మెల్యే
-
పేట్రేగిన చింతమనేని
- కొల్లేరులో చేపల పెంపకాన్ని అడ్డుకున్న అటవీశాఖ అధికారులు - అనుచరులతో వచ్చి దూషణలు, బెదిరింపులకు దిగిన ఎమ్మెల్యే ఏలూరు రూరల్: టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ మరోసారి రెచ్చిపోయారు. అక్రమ చేపల సాగును అడ్డుకున్న అటవీ శాఖ అధికారులపై జులుం ప్రదర్శించారు. కొల్లేరులో శనివారం జరిగిన ఈ సంఘటన అధికార పార్టీ నాయకుల దుర్మార్గాన్ని మరోసారి బహిర్గతం చేసింది. ఏలూరు మండలం ప్రత్తికోళ్లలంక పరిధి అటవీ భూమిలో 100 ఎకరాల విస్తీర్ణం గల 2 చెరువుల్లో చింతమనేని చేప పిల్లలు వేసేందుకు ప్రయత్నించారు. 10 లారీలలో చేప పిల్లలను చెరువు వద్దకు తరలించి అనుచరులకు సూచనలు చేసి వెళ్లిపోయారు. విషయం తెలుసుకున్న పెదపాడు, ఏలూరు, భీమడోలు అటవీ శాఖ డిప్యూటీ రేంజర్లు గంగారత్నం, వెంకటరెడ్డి, ఈశ్వర్ సిబ్బందితో చెరువుల వద్దకు చేరుకుని, చేప పిల్లలను వేయడాన్ని అడ్డుకున్నారు. విషయం తెలుసుకున్న చింతమనేని 50 మంది అనుచరులతో చెరువు వద్దకు చేరుకుని ‘ఎవడ్రా ఇక్కడ పనులు అడ్డుకున్నది. ఏమనుకుంటున్నార్రా. ఎవడు అడ్డుకుంటాడో చూస్తా. చెరువులో పిల్లలు వేయండి’ అని అనుచరులకు చెప్పాడు. అనుచరులు చెరువులో పిల్లలు వేసేందుకు మరోసారి ప్రయత్నించడం తో సిబ్బంంది అడ్డుపడ్డారు. రెచ్చిపోయిన చింతమనేని తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని అధికారులను హెచ్చరించారు. ఈ సంఘటనతో అధికారులు వెనక్కి తగ్గారు. ఇదే అదునుగా చూసుకుని ఆయన అనుచరులు చేప పిల్లలను చెరువుల్లో వేశారు. అనంతరం అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఈ తతంగం ఫొటో లేదా వీడియో తీశారనే అనుమానంతో చింతమనేని అనుచరులు కొందరు అటవీశాఖ అధికారులు, సిబ్బంది సెల్‌ఫోన్స్ లాక్కుని ఫొటోలు డిలీట్ చేశారు. ఈ సంఘటనపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయాలని ఏలూరు రేంజర్ శ్రావణ్‌కుమార్ నిర్ణయించారు. -
నో నెట్వర్క్.. ఓన్లీ వర్క్!
ఓ ఎస్సెమ్మెస్ అలర్ట్ లేదు... వాట్సాప్ చాటింగ్ లేదు... మనుషులంతా మొబైల్స్‌తో మింగిల్ అవుతోన్న ఈ రోజుల్లో ఎవరి చేతుల్లోనూ ఫోనులే లేవు. మొన్నటి వరకూ రామ్‌చరణ్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తున్న సినిమా షూటింగ్ లొకేషన్లో కనిపించిన దృశ్యమిది. ఓ ఇరవై రోజుల పాటు సెల్‌ఫోన్ సిగ్నల్స్ లేనిచోట షూటింగ్ చేశారు. లొకేషన్ కొల్లేరుకు షిఫ్ట్ అయిన తర్వాత సిగ్నల్స్ వచ్చాయి. దీనిపట్ల సినిమాటోగ్రాఫర్ రత్నవేలు స్పందిస్తూ – ‘‘20 రోజులు చేతిలో మొబైల్ లేకపోవడం పీడకలలా అనిపించింది. సిటీకి వచ్చిన తర్వాత మొబైల్ డిటాక్స్ మంచిదే అనిపించింది’’ అన్నారు. ప్రస్తుతం కొల్లేరులో చరణ్, ఇతర నటీనటులపై కీలక సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు. మరో వారం రోజులు గోదావరి జిల్లాల్లో చిత్రీకరణ జరుపుతారట. సమంత హీరోయిన్గా నటిస్తున్న ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ స్వరకర్త. -
కొల్లేరు కటకట
ఏలూరు : జలకళ.. పచ్చని పైరులు.. విదేశీ విహంగాల కిలకిలరావాలతో ప్రకృతి హŸయలొలికించే కొల్లేరు వెలవెలబోతోంది. ఆసియాలోని పెద్ద మంచినీటి సరస్సు దుస్థితి ఇది. నిత్య జలం.. పచ్చతోరణం అన్నట్టుండే కొల్లేరును కరువు కాటేసింది. ఏప్రిల్ మొదట్లోనే కష్టాలను తెచ్చిపెట్టింది. సరస్సులో పలు ప్రాంతాలు ఎడారిని తలపిస్తున్నాయి. బీటలు వారడంతో పచ్చదనం కనుమరుగై పశుపక్ష్యాదులు అల్లాడుతున్నాయి. చుక్కనీరు జాడ లేక ఆకలితో అలమటిస్తున్నాయి. అక్కడక్కడా కనిపిస్తున్న కొద్దిపాటి నీటి వద్ద విదేశీ పక్షులు సేద తీరుతున్నాయి. మరిన్ని రోజులు గడిస్తే నీటి కష్టాలు మరింత పెరుగుతాయని ఈ ప్రాంత ప్రజలు ఆందోళన చెందుతున్నారు. కొల్లేరు దుర్భిక్షానికి సజీవ సాక్ష్యాలు ఈ దృశ్యాలు. -
ఆక్వా ’బడా’యి
సిండికేట్‌గా బడా రైతులు ఏకమొత్తంలో భారీ చెరువుల తవ్వకం కొల్లేరులోకీ ప్రవేశం నిబంధనలకు తూట్లు జిల్లాలో ఆక్వా బడాయి నానాటికీ పెచ్చుమీరుతోంది. బడా రైతులు సిండికేట్‌గా మారి చిన్నచిన్న కమతాలను లీజుకు తీసుకుని వందలాది ఎకరాల్లో ఏకమొత్తంగా భారీ చెరువులు తవ్వుతున్నారు. నిబంధనలకు నీళ్లొదులుతున్నారు. ఫలితంగా పిల్ల కాలువలు, పంట బోదెలు, గట్లు కనుమరుగవుతున్నాయి. అయినా అధికారులు పట్టించుకోవడం లేదు. జిల్లాలో చెరువుల తవ్వకం పరిస్థితి ఇదీ(మారుగా) చెరువులు అధికారికం అనధికారికం మొత్తం (ఎకరాల్లో ) చేపలు 2,00,000 20,000 2.20,000 రొయ్యలు 15,000 65,000 80,000 ==================================== మొత్తం 2,15,000 80,000 3,00,000 ఆకివీడు : జిల్లా వ్యాప్తంగా, ముఖ్యంగా డెల్టా ప్రాంతంలో పెద్ద మొత్తంలో చెరువులు తవ్వేందుకు వివిధ ప్రాంతాల నుంచి బడా రైతులు తరలివస్తున్నారు. అధిక లీజులు చెల్లిస్తామంటూ చిన్నసన్నకారు రైతులను ఆశపెట్టి వందలాది ఎకరాల్లో ఏకమొత్తంగా చెరువులు తవ్వేస్తున్నారు. తమకున్న పలుకుబడితో నిబంధనలకు నీళ్లొదులుతున్నారు. అధికారులు తమవైపు చూడకుండా చేసుకుంటున్నారు. ఆక్వా రంగాన్ని కార్పొరేట్ బాట పట్టించేందుకు యత్నిస్తున్నారు. ఈ తరహాలో ఇప్పటికే డెల్టాలో 2 వేల ఎకరాలకుపైగా చేపల చెరువులు తవ్వేశారు. మరో 3 వేల ఎకరాలు తవ్వేందుకు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే జిల్లా వ్యాప్తంగా 2 లక్షల ఎకరాల్లో చేపల చెరువులున్నట్టు అధికార వర్గాల సమాచారం. వీటిలో 20వేల ఎకరాల చెరువులకు అనుమతులు లేవని తెలుస్తోంది. ఇదిలా ఉంటే ఇటీవల కాలంలో 80వేల ఎకరాలు రొయ్యల చెరువులుగా మారిపోయాయి. వీటిలో అధికారికంగా 15వేల ఎకరాలు కూడా ఉండవని సమాచారం. అనధికారికంగా రొయ్యల చెరువులనూ భారీగా తవ్వేందుకు బడా రైతులు ముందుకు వస్తున్నారు. బోదెలు, కాలువలు çకనుమరుగు భారీ చెరువుల తవ్వకంతో పంట బోదెలు, పిల్లకాలువలు మాయమవుతున్నాయి. మురుగు కాలువలూ కనుమరుగవుతున్నాయి. వీటితో పాటు వేలాది ఎకరాల ప్రభుత్వం భూమి కూడా మాయమవుతోంది. పంట, మరుగుకాలువల అంతర్ధానంతో భవిష్యత్తులో రానున్న రోజుల్లో నీటి సరఫరా వ్యవస్థ అధ్వానంగా తయారయ్యే ప్రమాదం ఉందని పర్యావరణ వేత్తలు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. పంట కాలవల్లోకి ఉప్పునీరు రొయ్యల చెరువులు విచ్చలవిడిగా తవ్వేయడం వల్ల పంట కాలువల్లో ఉప్పునీటి శాతం పెరిగిపోయింది. రొయ్యల పెంపకానికి ఉప్పునీటి అవసరాన్ని గుర్తించిన రైతులు అనధికారికంగా బోర్లు తవ్వేస్తున్నారు. భూగర్భ జలాలను పీల్చేస్తున్నారు. దీంతో భూగర్భ జలాలు అడుగంటుతున్నాయి. దీంతోపాటు రొయ్యల చెరువుల్లోని ఉప్పునీటిని పంట కాలువల్లోకి వదిలివేయడంతో వాటిల్లో ఉప్పునీటి శాతం పెరిగిపోతోంది. ఈ నీటిని పంట చేలకు పెట్టడంతో భూములు చౌడుబారుతున్నాయి. దీంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కొల్లేరులోకి తిమింగలాలు కొల్లేరు సరస్సులోకి మళ్లీ తిమింగలాలు ప్రవేశిస్తున్నాయి. కొల్లేరులోని ఐదో కాంటూర్ దిగువనున్న డిఫారం భూములకు అక్రమార్కులు గాలం వేస్తున్నారు. ఇప్పటికే డిఫారం భూముల్లో 4 వేల ఎకరాలకుపైగా చేపల చెరువులుగా మారిపోయాయి. మిగిలిన భూములతోపాటు జిరాయితీ, ప్రభుత్వ భూములనూ తవ్వేసేందుకు బడా రైతులు నడుం బిగించారు. అధికార పార్టీకి చెందిన ప్రముఖ నాయకులు కొల్లేరు భూములను చెరువులుగా మార్చడంలో కీలక పాత్ర వహిస్తున్నారు. నాలుగు సార్లు నారుమళ్లు చెరువుల్లోని ఉప్పునీరు పంట కాలువల్లో నుంచి చేలల్లోకి ప్రవేశిస్తోంది. దీంతో చేలు చౌడుబారుతున్నాయి. ఉప్పునీటి వల్ల వేసిన నారుమళ్లు చనిపోతున్నాయి. ఖరీఫ్‌లో మూడు సార్లు, రబీలో నాలుగు సార్లు నారుమళ్లు పోసుకోవలసి వచ్చింది కొట్టు సత్యనారాయణ, సన్నకారు రైతు, దుంపగడప. వరి దండగ అనిపిస్తోంది పెదకాపవరం గ్రామంలో వరి సాగు చేయడం దండగ అనిపిస్తోంది. చుట్టూ చేపలు, రొయ్యల చెరువులతో నిండి ఉన్నాయి. పట్టుబడుల సమయంలో చెరువుల నీటిని పంట కాలువల్లోకి వదిలివేస్తున్నారు. దీనివల్ల వరి పంటకు తీవ్ర నష్టం వస్తోంది. దాళ్వాలో వరి దిగుబడులు తగ్గే ప్రమాదం ఏర్పడింది. రొయ్యల చెరువు నీటి వల్ల నా పొలంలో వేసిన నారుమడి ఎండిపోయింది. సత్యనారాయణ, రైతు, పెదకాపవరం అనుమతుల్లేకుండానే అనుమతుల్లేకుండానే చేపల చెరువులు తవ్వేస్తున్నారు. కొంతమందే జిల్లా కమిటీ అనుమతి తీసుకుంటున్నారు. ఇష్టారాజ్యంగా చెరువుల తవ్వకం వల్ల నీటి పారుదల వ్యవస్థ దెబ్బతినే ప్రమాదం ఉంది. భవిష్యత్తులో ఇబ్బందికర పరిస్థితులు తప్పవు. పంట కాలువల్లోకి చెరువుల నీరు వదలకూడదు. అలాంటి వారిపై చర్యలు తప్పవు. కె.శ్రీనివాస్, సూపరింటెండెంట్, నీటిపారుదలశాఖ -
ఆక్వా ’బడా’యి
సిండికేట్‌గా బడా రైతులు ఏకమొత్తంలో భారీ చెరువుల తవ్వకం కొల్లేరులోకీ ప్రవేశం నిబంధనలకు తూట్లు జిల్లాలో ఆక్వా బడాయి నానాటికీ పెచ్చుమీరుతోంది. బడా రైతులు సిండికేట్‌గా మారి చిన్నచిన్న కమతాలను లీజుకు తీసుకుని వందలాది ఎకరాల్లో ఏకమొత్తంగా భారీ చెరువులు తవ్వుతున్నారు. నిబంధనలకు నీళ్లొదులుతున్నారు. ఫలితంగా పిల్ల కాలువలు, పంట బోదెలు, గట్లు కనుమరుగవుతున్నాయి. అయినా అధికారులు పట్టించుకోవడం లేదు. జిల్లాలో చెరువుల తవ్వకం పరిస్థితి ఇదీ(మారుగా) చెరువులు అధికారికం అనధికారికం మొత్తం (ఎకరాల్లో ) చేపలు 2,00,000 20,000 2.20,000 రొయ్యలు 15,000 65,000 80,000 ==================================== మొత్తం 2,15,000 80,000 3,00,000 ఆకివీడు : జిల్లా వ్యాప్తంగా, ముఖ్యంగా డెల్టా ప్రాంతంలో పెద్ద మొత్తంలో చెరువులు తవ్వేందుకు వివిధ ప్రాంతాల నుంచి బడా రైతులు తరలివస్తున్నారు. అధిక లీజులు చెల్లిస్తామంటూ చిన్నసన్నకారు రైతులను ఆశపెట్టి వందలాది ఎకరాల్లో ఏకమొత్తంగా చెరువులు తవ్వేస్తున్నారు. తమకున్న పలుకుబడితో నిబంధనలకు నీళ్లొదులుతున్నారు. అధికారులు తమవైపు చూడకుండా చేసుకుంటున్నారు. ఆక్వా రంగాన్ని కార్పొరేట్ బాట పట్టించేందుకు యత్నిస్తున్నారు. ఈ తరహాలో ఇప్పటికే డెల్టాలో 2 వేల ఎకరాలకుపైగా చేపల చెరువులు తవ్వేశారు. మరో 3 వేల ఎకరాలు తవ్వేందుకు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే జిల్లా వ్యాప్తంగా 2 లక్షల ఎకరాల్లో చేపల చెరువులున్నట్టు అధికార వర్గాల సమాచారం. వీటిలో 20వేల ఎకరాల చెరువులకు అనుమతులు లేవని తెలుస్తోంది. ఇదిలా ఉంటే ఇటీవల కాలంలో 80వేల ఎకరాలు రొయ్యల చెరువులుగా మారిపోయాయి. వీటిలో అధికారికంగా 15వేల ఎకరాలు కూడా ఉండవని సమాచారం. అనధికారికంగా రొయ్యల చెరువులనూ భారీగా తవ్వేందుకు బడా రైతులు ముందుకు వస్తున్నారు. బోదెలు, కాలువలు çకనుమరుగు భారీ చెరువుల తవ్వకంతో పంట బోదెలు, పిల్లకాలువలు మాయమవుతున్నాయి. మురుగు కాలువలూ కనుమరుగవుతున్నాయి. వీటితో పాటు వేలాది ఎకరాల ప్రభుత్వం భూమి కూడా మాయమవుతోంది. పంట, మరుగుకాలువల అంతర్ధానంతో భవిష్యత్తులో రానున్న రోజుల్లో నీటి సరఫరా వ్యవస్థ అధ్వానంగా తయారయ్యే ప్రమాదం ఉందని పర్యావరణ వేత్తలు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. పంట కాలవల్లోకి ఉప్పునీరు రొయ్యల చెరువులు విచ్చలవిడిగా తవ్వేయడం వల్ల పంట కాలువల్లో ఉప్పునీటి శాతం పెరిగిపోయింది. రొయ్యల పెంపకానికి ఉప్పునీటి అవసరాన్ని గుర్తించిన రైతులు అనధికారికంగా బోర్లు తవ్వేస్తున్నారు. భూగర్భ జలాలను పీల్చేస్తున్నారు. దీంతో భూగర్భ జలాలు అడుగంటుతున్నాయి. దీంతోపాటు రొయ్యల చెరువుల్లోని ఉప్పునీటిని పంట కాలువల్లోకి వదిలివేయడంతో వాటిల్లో ఉప్పునీటి శాతం పెరిగిపోతోంది. ఈ నీటిని పంట చేలకు పెట్టడంతో భూములు చౌడుబారుతున్నాయి. దీంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కొల్లేరులోకి తిమింగలాలు కొల్లేరు సరస్సులోకి మళ్లీ తిమింగలాలు ప్రవేశిస్తున్నాయి. కొల్లేరులోని ఐదో కాంటూర్ దిగువనున్న డిఫారం భూములకు అక్రమార్కులు గాలం వేస్తున్నారు. ఇప్పటికే డిఫారం భూముల్లో 4 వేల ఎకరాలకుపైగా చేపల చెరువులుగా మారిపోయాయి. మిగిలిన భూములతోపాటు జిరాయితీ, ప్రభుత్వ భూములనూ తవ్వేసేందుకు బడా రైతులు నడుం బిగించారు. అధికార పార్టీకి చెందిన ప్రముఖ నాయకులు కొల్లేరు భూములను చెరువులుగా మార్చడంలో కీలక పాత్ర వహిస్తున్నారు. నాలుగు సార్లు నారుమళ్లు చెరువుల్లోని ఉప్పునీరు పంట కాలువల్లో నుంచి చేలల్లోకి ప్రవేశిస్తోంది. దీంతో చేలు చౌడుబారుతున్నాయి. ఉప్పునీటి వల్ల వేసిన నారుమళ్లు చనిపోతున్నాయి. ఖరీఫ్‌లో మూడు సార్లు, రబీలో నాలుగు సార్లు నారుమళ్లు పోసుకోవలసి వచ్చింది కొట్టు సత్యనారాయణ, సన్నకారు రైతు, దుంపగడప. వరి దండగ అనిపిస్తోంది పెదకాపవరం గ్రామంలో వరి సాగు చేయడం దండగ అనిపిస్తోంది. చుట్టూ చేపలు, రొయ్యల చెరువులతో నిండి ఉన్నాయి. పట్టుబడుల సమయంలో చెరువుల నీటిని పంట కాలువల్లోకి వదిలివేస్తున్నారు. దీనివల్ల వరి పంటకు తీవ్ర నష్టం వస్తోంది. దాళ్వాలో వరి దిగుబడులు తగ్గే ప్రమాదం ఏర్పడింది. రొయ్యల చెరువు నీటి వల్ల నా పొలంలో వేసిన నారుమడి ఎండిపోయింది. సత్యనారాయణ, రైతు, పెదకాపవరం అనుమతుల్లేకుండానే అనుమతుల్లేకుండానే చేపల చెరువులు తవ్వేస్తున్నారు. కొంతమందే జిల్లా కమిటీ అనుమతి తీసుకుంటున్నారు. ఇష్టారాజ్యంగా చెరువుల తవ్వకం వల్ల నీటి పారుదల వ్యవస్థ దెబ్బతినే ప్రమాదం ఉంది. భవిష్యత్తులో ఇబ్బందికర పరిస్థితులు తప్పవు. పంట కాలువల్లోకి చెరువుల నీరు వదలకూడదు. అలాంటి వారిపై చర్యలు తప్పవు. కె.శ్రీనివాస్, సూపరింటెండెంట్, నీటిపారుదలశాఖ -
కేంద్రం దృష్టికి కాంటూరు సమస్య
తాడేపల్లిగూడెం : జిల్లాలో నెలకొన్న కొల్లేరు కాంటూరు సమస్యను కేంద్రం దృష్టికి తీసుకువెళ్లామని, పరిష్కారానికి చిత్తశుద్ధితో పనిచేస్తామని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, విశాఖ ఎంపీ కంభంపాటి హరిబాబు అన్నారు. శనివారం ఆయన ఇక్కడ విలేకరులతో మాట్లాడుతూ జిల్లాలో ఆయిల్‌పామ్ మద్దతు ధర పడిపోయిన సమయంలో ధరను పెంచి రైతులకు ఊరట ఇచ్చామన్నారు. రైతులకు అనుకూలంగా నిర్ణయాలు తీసుకొనే క్రమంలో కేంద్రం భూసారపరీక్షలు చేసి శాయిల్ హెల్త్‌కార్డులు ఇచ్చిందన్నారు. ప్రధాన మంత్రి ఫసలీ బీమా యోజన ద్వారా రైతులను ఆదుకుంటున్నామన్నారు. పంట రుణాలు ఆరుశాతం అతితక్కువ వడ్డీకే బ్యాంకులద్వారా అందించడం, రైతులకు వ్యవసాయ ఆదాయం రెట్టింపు కోసం చర్యలను కేంద్రం చేపడుతోందన్నారు. పప్పుధాన్యాల కొరత నివారణకుగాను వాటి కనీస మద్దతు ధర పెంచడం ద్వారా ధరల పెరుగుదలకు కేంద్రం కళ్లెం వేసిందని హరిబాబు చెప్పారు. నోట్ల రద్దు నిర్ణయం సంచలనాత్మకం లంచగొండితనం, అవినీతి, నల్లధనం కట్టడి చేయడం కోసం మోడీ పెద్దనోట్లను రద్దు చేస్తూ సంచలనాత్మకమైన నిర్ణయం తీసుకున్నారన్నారు. దేశంలో చలామణిలో ఉన్న 17 లక్షల 50 వేల కోట్ల రూపాయల్లో 85 శాతం పెద్దనోట్లే అన్నారు. పెద్దనోట్లు రద్దు తర్వాత ఐదు లక్షల కోట్లు బ్యాంకుల్లో డిపాజిట్లుగా వచ్చాయన్నారు. దేశంలో నల్లధన ం వెలికితీయడం, పాకిస్తా¯ŒS నుంచి దేశంలోకి వచ్చే నకిలీ కరెన్సీని అడ్డుకోవడం ద్వారా పారదర్శక లావాదేవీలకు అవకాశం కలిగిందని చెప్పారు. ఈ నెల 26న తాడేపల్లిగూడెంలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా ముఖ్యఅతిథిగా హాజరయ్యే సభను విజయవంతం చేయాలని కోరారు. బీజేపీ మహిళా మోర్చా రాష్ట్ర అ««దl్యక్షురాలు శరణాల మాలతీరాణి, ఎస్ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు దారా సాంబయ్య, మైనార్టీ అధ్యక్షుడు షేక్ బాజీ, కార్యదర్శి వేమా, ఐటీ సెల్ ఇ¯ŒSచార్జి సత్యమూర్తి, బీజేపీ జిల్లా అధ్యక్షుడు భూపతిరాజు శ్రీనివాసవర్మ తదితరులు పాల్గొన్నారు. -
కథ కాదు.. కొల్లేరు వ్యథ!
ఆక్రమణలతో చిక్కిశల్యమైన కొల్లూరు అక్రమంగా కొనసాగుతున్న చేపల సాగు జలమార్గం ద్వారా చేప పిల్లల రవాణా మంత్రి కామినేని పేరు చెప్పి హల్చల్ మూడేళ్లకు పెంచిన లీజులు కొల్లేరమ్మ.. కన్నీరు పెడుతోంది. అక్రమార్కులు చేస్తున్న గాయాలతో చిక్కిశల్యమైన కొల్లేరు తల్లి వ్యథ వర్ణనాతీతంగా మారింది. ఆపరేషన్ కొల్లేరును వెక్కిరిస్తూ ఆక్రమణల పర్వం మళ్లీ కొనసాగుతోంది. కొల్లేరు స్వచ్ఛతకు తూట్లు పొడిచేలా ఇక్కడ వ్యవహారం నడుస్తోంది. అక్రమంగా చేపల చెరువులను సాగు చేస్తున్నా ఎవ్వరికీ పట్టని పరిస్థితి నెలకొంది. ఒక్క మాటలో చెప్పాలంటే ప్రభుత్వం చోద్యం చూస్తోంది. కైకలూరు : కొల్లేరుకు అక్రమార్కుల చెర వీడడంలేదు. పేదల పేర్లు చెప్పి కోట్లాది రూపాయలు కొల్లగొడుతున్నారు. అక్రమంగా చేపల చెరువులు సాగు కొనసాగుతున్నా అటవీశాఖ అడ్డుకునే ధైర్యం చేయడం లేదు. పట్టపగలు అభయారణ్యంలో చెరువుల తవ్వకం, అటవీ అధికారులు సీజ్ చేసిన వాహనాన్ని దౌర్జన్యంగా తీసుకెళ్లడం, ఇష్టారాజ్యంగా వ్యర్థాలు వేయడం ఇటీవల కొల్లేరులో బరితెగింపునకు నిదర్శనంగా నిలుస్తున్నాయి. అంతంలేని అక్రమాల పర్వం.. కొల్లేరు అభయారణ్యంలో ధ్వంసం చేసిన చేపల చెరువులతో పాటు ఇటీవల కొత్తగా తవ్విన వందలాది ఎకరాల్లో చేపల సాగు జరుగుతోంది. కైకలూరు మండలం పందిరిపల్లిగూడెంలో 1200 ఎకరాలు, శృంగవరప్పాడులో 1500, గుమ్మళ్లపాడులో 800 ఎకరాల్లో ధ్వంసం చేసిన చెరువుల్లో తిరిగి చేపల సాగుకు సిద్ధమవుతున్నారు. వీటిలో ఇప్పటికే గుమ్మళ్లపాడులో జీరో సైజు చేప పిల్లలను వదిలారు. మండవల్లి మండలం దయ్యంపాడు, చింతపాడు, కొవ్వాడలంక, పెనుమాకలంక, నందిగామలంక, కైకలూరు మండలం వడ్లకూటితిప్ప, పెంచికలమర్రు, చటాకాయి, నత్తగుళ్లపాడు గ్రామాల్లో అభయారణ్యలో సాగు కొనసాగుతోంది. గతంలో జీరో పాయింట్ చేపల సాగు ఏడు నెలలకు పాట పెట్టేవారు. ఇప్పుడు మూడేళ్లకు రూ.కోట్లలో పాట పెట్టారు. జలమార్గం ద్వారా చేప పిల్లలు.. అక్రమ చెరువుల్లోకి చేప పిల్లల తరలింపునకు కొల్లేరులో జలమార్గాన్ని ఉపయోగిస్తున్నారు. ఆకివీడు, జంగంపాడు రేవుల నుంచి కొట్టాడ, కోటలంక, గుమ్మళ్లపాడు, సింగరాలతోటకు బోట్లలో చేప పిల్లలను తరలిస్తున్నారు. ఇందుకోసం పందిరిపల్లిగూడెం, గుమ్మళ్లపాడు వద్ద 11 పెద్ద బోట్లను సిద్ధం చేశారు. ఒక్కో బోటులో రెండున్నర టన్నుల చేప పిల్లలను తరలించవచ్చు. ఇవేకాకుండా 17 చిన్న బోట్లను సిద్ధం చేసుకున్నారు. రోడ్డు మార్గంలో ఏలూరు నుంచి శృంగవరప్పాడుకు చేప పిల్ల రవాణా అవుతోంది. మంత్రి పేరు చెప్పి హల్చల్.. ఈ నెల 11న సీఎంతో జరిగిన కొల్లేరు సమావేశానికి ఓ చోట నాయకుడు వెళ్లాడు. అక్కడ నుంచి రాగానే ‘కొల్లేరులో ఎక్కడైనా సాగు చేసుకోవచ్చు.. సీఎం చంద్రబాబు, స్థానిక ఎమ్మెల్యే, మంత్రి కామినేని శ్రీనివాస్ అభయం ఇచ్చారు’ అంటూ నమ్మబలుకుతున్నాడు. అటవీ అధికారులకు ఇదే విషయం చెబుతున్నాడు. గతంలో అటవీ, రెవెన్యూ అధికారులను మేనేజ్ చేయాలంటూ ఎకరానికి రూ.1500 వసూలు చేసి, స్వాహా చేశాడనే ఆరోపణలు ఆ చోటా నాయకుడిపై ఉన్నాయి. చెప్పగానే పార్టీ సమావేశాలకు లారీల్లో జనాలను తరలిస్తుండడంతో పాలకులు కూడా అతను ఎన్ని తప్పులు చేసినా వదిలేస్తున్నారనే భావన అందరిలో ఉంది. ఇప్పటికే ఆక్రమణలతో చిక్కిశల్యమైన కొల్లేరును కాపాడాలని పర్యావరణ ప్రేమికులు కోరుతున్నారు. చేప పిల్ల విడుదలను అడ్డుకుంటాం.. అభయారణ్యంగా గుర్తించిన కొల్లేరులో చేపల సాగు నిషేధం. కొల్లేరు ఆపరేషన్ సమయంలో కొట్టేసిన చేపల చెరువులకు గట్లు ఏర్పాటు చేసుకుని మళ్లీ చేపల సాగుకు సిద్ధమవుతున్నారనే సమాచారం అందింది. సిబ్బందిని ఇప్పటికే గస్తీ పెట్టాం. జంగంపాడు నుంచి చేప పిల్లలు జలమార్గం ద్వారా వచ్చే అవకాశం ఉండటంతో అటవీ శాఖ సిబ్బందిని నియమించాం. నిబంధనలను అతిక్రమిస్తే కేసులు నమోదు చేస్తాం. - జి.ఈశ్వరరావు, అటవీశాఖ డెప్యూటి రేంజ్ ఆఫీసరు, కైకలూరు -
కొల్లేరు ప్రజలను ఎన్నాళ్లు మోసం చేస్తారు?
కైకలూరు : ఎన్నికల ప్రచారంలో కొల్లేరు అభయారణ్య పరిధిని 5 నుంచి 3వ కాంటూరుకు కుదిస్తామని చెప్పి రెండున్నర ఏళ్లు గడుస్తున్నా పట్టించుకోని నాయకులు పెద్దింట్లమ్మ వారధి శంకుస్థాపన పేరుతో అమాయక కొల్లేరు ప్రజలను మోసం చేస్తున్నారని వైఎస్సార్ సీపీ నియోజకవర్గ సమన్వయకర్త దూలం నాగేశ్వరరావు (డీఎన్నార్) విమర్శించారు. స్థానిక పార్టీ కార్యాలయంలో మండల పార్టీ అధ్యక్షుడు పాట్రిక్పాల్ అధ్యక్షతన శుక్రవారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈ నెల 29న సీఎం చంద్రబాబు, కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడులు శంకుస్థాపనకు వస్తున్నారన్నారు. వారు కాంటూరు కుదింపు, సొసైటీ, జిరాయితీ భూముల పంపిణిపై స్పష్టమైన హామీ ప్రకటించాలని కోరారు. కొల్లేరు ప్రజలకు న్యాయం జరగకపోతే పార్టీ తరుపున నిరాహార దీక్ష చేపడతామన్నారు. కొల్లేరులో తాగునీటి చెరువులను మంత్రి కామినేని తవ్వుకోమని చెబుతూ, మరో వైపు కేసులు పెట్టిస్తున్నారని డీఎన్నార్ ఆరోపించారు. కార్యక్రమంలో జిల్లా పార్టీ సంయుక్త కార్యదర్శి పంజా రామారావు, మండల మహిళా అధ్యక్షురాలు చింతల శ్యామలా, రైతు విభాగం జిల్లా సంయుక్త కార్యదర్శి అల్లూరి మంగారావు, నాయకులు అబ్దుల్ హమీద్, దండే రవిప్రకాష్, షేక్ సాలర్, బొల్లా సత్యనారాయణ, శ్యామ్‌సుందర్, మాలిక్, రామ్మోహనరావు, నంగెడ్డ నాగరాజు, సిరాజుద్దిన్, బాషా, రాము, ర ఫాయేలు, మంగిన భాస్కర్లు పాల్గొన్నారు. -
పోలవరం కాలువకు భారీ గండి
సీతారామపురం(నూజివీడు): నూజివీడు మండలం సీతారామపురం వద్ద రామిలేరుపై ఉన్న పోలవరం కుడి కాలువ అండర్‌టన్నెల్ వింగ్‌వాల్‌కు అడుగుభాగంలో సోమవారం తెల్లవారుజామున భారీ గండి పడింది. దీంతో గోదావరి జలాలు రామిలేరు లోకి చేరి అక్కడి నుంచి కొల్లేరుకు తరలుతున్నాయి. గతనెల 8వ తేదీ నుంచి గోదావరి జలాలు వస్తుండగా గండిపడిన సమయంలో దాదాపు 4,800ల క్యూసెక్కులు ప్రవహిస్తున్నాయి. గతంలో పశ్చిమగోదావరి జిల్లా జానంపేట వద్ద తమ్మిలేరుపై ఉన్న అక్విడెక్ట్‌కు గండి పడిన విధంగానే కాలువ లోపల భాగంలో నుంచి అండర్‌టన్నెల్ వింగ్‌వాల్(గోడ) కిందిభాగం గుండా గండి పడింది. భారీ గండి కావడం, నీటి ఉధృతి బాగా ఎక్కువగా ఉండడంతో రామిలేరులోకి 1200ల క్యూసెక్కుల వరకు వెళుతోంది. గండి పడిన విషయం తెలిసిన వెంటనే జలవనరుల శాఖ ఇంజినీర్ ఇన్‌చీఫ్ ఎం. వెంకటేశ్వరరావు, పోలవరం ఎస్ఈ వై శ్రీనివాస్‌యాదవ్, ఈఈ చినబాబు, నూజివీడు డీఎస్పీ వల్లూరి వెంకటేశ్వరరావు, జలవనరుల శాఖ ఎపెక్స్ కమిటీ సభ్యులు ఆళ్ల గోపాలకృష్ణ, తెలుగురైతు జిల్లా అధ్యక్షులు చలసాని ఆంజనేయులు తదితరులు హుటాహుటిన వెళ్లి పరిస్థితిని పరిశీలించారు. సీతారామపురం, ఎంఎన్పాలెం, పల్లెర్లమూడికి చెందిన పలువురు రైతులు, ప్రజలు కూడా సంఘటనా స్థలానికి చేరుకున్నారు. గతంలోనే హెచ్చరించిన ‘సాక్షి’ ..... రామిలేరుపై పోలవరం అండర్‌టన్నెల్ నిర్మాణపనులు జరుగుతున్నప్పుడే ‘సాక్షి’ హెచ్చరించింది. పనులను హడావుడిగా చేయడం వల్ల నీటి సరఫరా జరిగే సమయంలో లీకేజీలు ఏర్పడి గండి పడే అవకాశాలున్నాయని గతనెల 7వ తేదీన సాక్షి ప్రత్యేక కథనాన్ని ప్రచురించింది. అండర్‌టన్నెల్ కాంక్రీట్పనులు హడావుడిగా చేయడం వల్ల ఎక్కడ ఏ చిన్నలోపం జరిగినా గండ్లు పడే అవకశాలుంటాయని కథనంలో హెచ్చరించడం జరిగింది. అయినప్పటికీ జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు పదేపదే ఇంజినీరింగ్ అధికారుల వెంటపడి పనులను పూర్తిచేయించారు. దీనికి పోలవరం ఇంజినీరింగ్ అధికారులతో పాటు ఎన్నెస్పీ ఇంజినీరింగ్ అధికారులకు కూడా విధులు కేటాయించి రాత్రిపగలు అక్కడే డ్యూటీలు వేసి మరీ హడావుడి పనులు చేయించారు. ఎక్కడైనా లోపముంటే ఆ లోపాన్ని సరిదిద్దుకునే అవకాశం కూడా ఇవ్వకుండా చేయడం వల్ల ఈ పరిస్థితి ఉత్పన్నమైందనే విమర్శలు వినిపిస్తున్నాయి. గండి వద్దే కూర్చున్న మంత్రి దేవినేని ఉమా: గండి వద్దకు జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ఉదయం 11గంటలకు చేరుకొని పరిశీలించారు. పోలవరం కాలువ ఉన్నతాధికారులతో మాట్లాడి గండి పూడ్చేవరకు ఇక్కడే ఉండి పరిశీలిస్తానని తెలిపి పొద్దుపోయే వరకు అక్కడే ఉన్నారు. సీతారామపురం, పల్లెర్లమూడికి చెందిన స్థానిక రైతులు కూడా తరలివచ్చి గండి పూడ్చే పనుల్లో నిమగ్నమయ్యారు. -
కొల్లేరుకు తూట్లు
కొల్లేరును మింగేస్తున్నారు. సుప్రీంకోర్టు నిబంధనలకు తూట్లు పొడుస్తున్నారు. అధికార పార్టీనా మజాకా అంటూ హడలెత్తిస్తున్నారు. పచ్చ చొక్కాలంటూ ప్రతాపం చూపుతున్నారు. అడ్డుకోవాల్సిన అటవీశాఖ అధికారులు ప్రేక్షక పాత్ర పోషిస్తున్నారు. అక్రమంగా చేపల చెరువులు తవ్వుతున్నారు. కైకలూరు : రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి, కైకలూరు బీజేపీ ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్ నియోజకవర్గంలో కొల్లేరు అభయారణ్యం కొవ్వొత్తిలా తరిగిపోతోంది. నిబంధనలకు లోబడి చెరువులు తవ్వుకోవాలని, లేదంటే తనకు మాటోస్తుందని మొత్తుకుంటున్నా టీడీపీ నేతలు మంత్రి మాటను సైతం లెక్కచేయడం లేదు. గురువారం మండవల్లి మండలం పులపర్రు, చింతపాడు కొల్లేరు అభయారణ్య పరిధిలో ఏకధాటిగా అక్రమ చెరువుల తవ్వకాలను పట్టపగలే ప్రారంభించారు. అడ్డువచ్చిన అటవీశాఖాధికారులను లెక్కచేయలేదు. కొల్లేరులో చట్టాలు వర్తించవా.. కొల్లేరు అభయారణ్య పరిరక్షణ చట్టం జీవో నంబరు 120 ప్రకారం కనీసం అగ్గిపెట్టె తీసుకువెళ్ళినా నేరం. అటువంటిది ప్రభుత్వ చీఫ్‌విప్, దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ఆటపాక పక్షుల కేంద్రం వద్ద చట్టాలను ధిక్కరించి కోమటిలంక రోడ్డును దగ్గరుండి వేయించారు. తమపై దాడి చేశారంటూ అటవీశాఖ అధికారులు కైకలూరు టౌన్ స్టేషన్లో చేసిన ఫిర్యాదు అధికార బలం సాక్షిగా బుట్ట దాఖలయ్యింది. తర్వాత చింతపాడు వద్ద ఎగనమిల్లి రోడ్‌ను దగ్గరుండి వేయించారు. ఇదే దారిలో స్థానిక పచ్చనేత రెచ్చిపోతున్నాడు. కొద్ది రోజుల్లో కొల్లేటికోటలో మరో 17 ఎకరాలు మంచినీటి చెరువు పేరుతో తవ్వడానికి సిద్ధమవుతున్నారు. అటవీశాఖ ఉన్నట్లా.. లేనట్లా.. ప్రతి అక్రమ చెరువు తవ్వకం వద్దకు అటవీశాఖ క్షేత్ర స్థాయి అధికారులు రావడం, ప్రేక్షక పాత్ర వహించడం పరిపాటిగా మారింది. కళ్ళ ఎదుట పొక్లయిన్‌తో అక్రమ చెరువులు తవ్వుతుంటే ఆపలేని అటవీశాఖ సిబ్బంది ఎందుకు వెళ్ళడం అని పర్యావరణ ప్రేమికులు విమర్శిస్తున్నారు. అంతా అయిపోయాక నలుగురు పెద్దలపై పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేసి చేతులు దులుపుకుంటున్నారు. పై స్థాయిలో అటూ అటవీఅధికారులు, ఇటు పోలీసులు అధికార ప్రజాప్రతినిధులు సిపార్సులకు లొంగి కింద స్థాయి అటవీసిబ్బందిని బలి చేస్తున్నారని పలువురు సిబ్బంది బాధపడుతున్నారు. ఆడవారు దాడి చేస్తున్నా తమకు రక్షణ లేదని మదనపడుతున్నారు. చింతపాడులో గత నెల కొల్లేరు అభయారణ్యంలో రెండు మంచినీటి చెరువుల పేరుతో గ్రామ మహిళలను ముందుపెట్టి తవ్వేశారు. గురువారం మళ్ళీ మహిళలను అడ్డుపెట్టి మరో చెరువును పొక్లయిన్‌తో తవ్వుతున్నారు. ఇదిలా ఉంటే పులపర్రు మంచినీటి చెరువు పక్కన కొల్లేరు అభయారణ్యం లో సుమారు 10 ఎకరాల విస్తీర్ణంలో మంచినీటి చెరువు పేరుతో చెరువు పనులు మొదలు పెట్టారు. అటవీశాఖ సెక్షన్ ఆఫీసరు గంగారత్నం, బీటు ఆఫీసరు వెంకన్న, సిబ్బందితో వెళితే కనీసం లోపలకు వెళ్ళనివ్వలేదు. మీడియాను సైతం అడ్డుకున్నారు. పులపర్రులో మంత్రికి ముఖ్య అనుచరుడినని చెప్పుకునే వ్యక్తి చెరువు తవ్వకంలో పచ్చనేతకు అండగా నిలిచారు. ఏవరైన పనులు ఆపడానికి వస్తే రెచ్చిపోవాలని మహిళలకు బోధిస్తున్నారు. ఉన్నతాధికారులకు నివేదించాం... పట్టపగలు అక్రమ చేపల చెరువుల తవ్వకంపై అటవీశాఖ ఎసీఎఫ్ వినోద్‌కుమార్‌ను వివరణ కోరగా,∙షరా మామూలుగానే ఉన్నతాధికారులకు వివరించామని తెలిపారు. ఇక్కడ జరిగిన విషయాన్ని లిఖిత పూర్వకంగా పైస్థాయి అధికారులకు తెలియచేస్తామన్నారు. -
పర్యాటకంగా కొల్లేరు అభివృద్ధి
ఆటపాక(కైకలూరు) : కొల్లేరు సరస్సు, పరివాహక ప్రాంతాలను పర్యాటక పరంగా అభివృద్ధి చేస్తామని అటవీశాఖ హెడ్ ఆఫ్ డిపార్టుమెంట్ పీసీసీఎఫ్ మిశ్రా అన్నారు. ఆటపాక పక్షుల కేంద్రాన్ని మరో పీసీసీఎఫ్ (అడ్మినిస్ట్రేటీవ్) ఆర్జీ కలగాటితో కలసి బుధవారం సందర్శించారు. పక్షుల దొడ్డి విస్తీర్ణం, ఈఈసీ కేంద్రాన్ని పరిశీలించారు. మిశ్రా మాట్లాడుతూ టూరిజం పాయింటుగా కొల్లేరును అభివృద్ధి పరుస్తామన్నారు. మరో రెండు నెలల్లో సమావేశమై ప్రణాళికపై చర్చిస్తామని తెలిపారు. అటవీశాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ పీవీ రమేష్ కొల్లేరులో నీటి లభ్యతను పరిశీలించారు. కార్యక్రమంలో ఏకో టూరిజం సీసీఎఫ్ రమణారెడ్డి, రాజమండ్రి సీఎఫ్ ఎం.రవికుమార్, ఏసీఎఫ్ వినోద్‌కుమార్, డీఎఫ్‌వో నాగేశ్వరచౌదరి, రేంజర్ అరుణ్‌కుమార్, అటవీశాఖ అధికారులు పాల్గొన్నారు. -
కొల్లేరులోకి వెళ్లు.. నీ సంగతి తేలుస్తారు
సాక్షి విలేకరికి మంత్రి కామినేని ఫోన్లో బెదిరింపు కైకలూరు: ‘కొల్లేరులో ప్రజలే చేపల సాగు చేస్తున్నారు. అక్కడ బడాబాబులెవరూ లేరు. నువ్వు కొల్లేరులోకి వెళ్లు.. నీ సంగతి అక్కడ వాళ్లు చూస్తారు..’ అంటూ వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ కృష్ణాజిల్లా కైకలూరు సాక్షి విలేకరి బి.శ్యామలరాజును బుధవారం ఫోన్లో బెదిరించారు. మంగళవారం విజయవాడలోని ట్రావెలర్స్ బంగ్లాలోని తన క్యాంపు కార్యాలయంలో మంత్రి కామినేని బీజేపీ ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కొల్లేరులో చేస్తున్న అక్రమ చేపల సాగుకు సంబంధించి అటవీ శాఖాధికారి వినోద్‌కుమార్‌తో బహిరంగంగా ఫోన్లో మాట్లాడారు. ఆయన స్వాధీనం చేసుకున్న సరుకుతోపాటు అక్రమ రవాణా చేస్తున్న వ్యక్తి మనవాడేనంటూ.. గంటలోపు వదిలివేయాలని హుకుం జారీ చేశారు. ఆ సమయంలో పార్టీ వార్త కవర్ చేయడానికి వెళ్లిన సాక్షి విలేకరి శ్యామ్.. మంత్రి అటవీశాఖ అధికారితో ఫోన్లో సాగించిన సంభాషణను వార్తగా మలిచారు. ‘ఆ సరుకు మనోడిదే వదిలెయ్’ శీర్షికతో జిల్లా టాబ్లాయిడ్లో మంగళవారం ప్రచురితమైంది. ఇది చదివిన మంత్రి బుధవారం సాక్షి విలేకరికి ఫోన్ చేసి పై విధంగా హెచ్చరించారు. నీవు రాసే వార్తలతో రెండు పత్రికల విలేకరులు ఇబ్బంది పడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. -
చింతమనేనికి 150 ఎకరాల చేపల చెరువులు
ఏలూరు: ప్రభుత్వ విప్, దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ చీటికీమాటికీ ప్రభుత్వ ఉద్యోగులపై దౌర్జన్యాలు, దాడులు చేయడం మానుకోవాలని ఏపీ ఎన్జీవోల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎల్.విద్యాసాగర్ కోరారు. సోమవారం ‘సాక్షి’ ప్రతి నిధితో ఆయన మాట్లాడుతూ చింతమనేని తీరును తీవ్రంగా ఖండించారు. కొల్లేరు అభయారణ్య ప్రాం తంలో నిబంధనలకు విరుద్ధంగా రోడ్డు వేయడాన్ని అడ్డుకోబోయిన అధికారులపై దాడులు చేయడం దారుణమన్నారు. ఏలూరు మండలం కోమటిలంక వాసుల చిరకాల డిమాండ్ పేరిట చింతమనేని తన వ్యక్తిగత అవసరాల కోసమే రోడ్డు వేసుకున్నారని ఆయన పేర్కొన్నారు. అక్కడ ఆయనకు 150 ఎకరాల్లో చేపల చెరువులు ఉన్నాయని ఆయన ఆరోపించారు. ‘ఇది మేం ఇప్పుడు చెబుతున్న మాట కాదు. గతంలోనే అన్నాం. జిల్లా అధికారుల అండతో చింతమనేని ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నాడని గతంలోనే చెప్పాం. అది మరోసారి అక్షరాలా నిజమైంది’ అని సాగర్ వ్యాఖ్యానించారు. చింతమనేని వ్యక్తిగత తీరు తమకు అనవసరమని, కానీ ప్రభుత్వ ఉద్యోగులను భయపెట్టడం ఆయన మానుకోవాలని, లేనిపక్షంలో ఉద్యోగ సంఘాల నేతలతో చర్చించి భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తామని ఆయన పేర్కొన్నారు. -
కొల్లేరు పై ఏరియల్ సర్వే చేసిన కేంద్ర మంత్రులు
కైకలూరు (పశ్చిమ గోదావరి) : కొల్లేరు సమస్యలపై 15 రోజుల్లో అధ్యయనం చేసి పూర్తి వివరాలు అవగాహన చేసుకుంటానని కేంద్ర పర్యావరణ శాఖ మంత్రి ప్రకాశ్ జవదేకర్ చెప్పారు. కేంద్ర మంత్రి ఎం.వెంకయ్యనాయుడుతో కలిసి శుక్రవారం ఆయన హెలికాప్టర్లో కొల్లేరులో ఏరియల్ సర్వే చేశారు. అనంతరం కృష్ణా జిల్లా కైకలూరు మండలం కొల్లేటికోటలో సభావేదికపై జవదేకర్ మాట్లాడుతూ.. కొల్లేరు అంశం సుప్రీంకోర్టు ఎంపవర్ట్ కమిటీ అధీనంలో ఉందన్నారు. మరో 15 రోజుల్లో కొల్లేరులో ప్రజలు, పక్షులు అనే రెండు కోణాలను పరిశీలిస్తానన్నారు. బీజేపీకి 12 ఏళ్లుగా గొంతుకగా పనిచేశానని, కొల్లేరు ప్రజల తరఫున సుప్రీంకోర్టులో అదే విధంగా పనిచేస్తానన్నారు. విదేశాల నుంచి పక్షుల వలసలు వస్తాయి కానీ, ఇక్కడి ప్రజలు అక్కడికి వలసలు పోలేరన్నారు. మరో మంత్రి వెంకయ్యనాయుడు మాట్లాడుతూ.. కొల్లేరు అంశం చట్టపరిధి దాటి సుప్రీం కోర్టు పరిధిలోకి చేరిందన్నారు. ప్రభుత్వం ఉత్తర్వులు ఇస్తే అయ్యే పనికాదన్నారు. న్యాయపరంగా, శాస్త్రీయంగా అధ్యయనం అవసరమన్నారు. భూసేకరణను అడ్డుకోవడమంటే దేశాభివృద్ధిని అడ్డుకోవడమేనన్న కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై వెంకయ్య స్పందించారు. కాంగ్రెస్ పాలనలో భూసేకరణ విధానాన్ని మార్పు చేయాలని ప్రధానిని పలు రాష్ట్రాలు కోరాయన్నారు. దీంతో 2014 జూన్ 27న మొత్తం 32 రాష్ట్ర ప్రతినిధులు హాజరు కాగా వారిలో 28 మంది మార్పు చేయాలని కోరారన్నారు. భూసేకరణ చట్టంలో 9 సవరణలు చేసి కమిటీ ముందు నిర్ణయం కాకముందే అంగుళం భూమి తీసుకోనివ్వం అనడం తగదన్నారు. రాష్ట్ర అటవీశాఖ మంత్రి బొజ్జల గోపాలకష్ణారెడ్డి మాట్లాడుతూ.. అసెంబ్లీలో కొల్లేరుపై తీర్మానం చేసి కేంద్రానికి పంపామన్నారు. చేపల ఉత్పత్తులలో కొల్లేరు ప్రాంతం రాష్ట్రంలోనే అగ్రగామిగా ఉందని ఆరోగ్య శాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ వివరించారు. ఎంపీ మాగంటి బాబు, మాజీ ఎంపీ కావూరి సాంబశివరావు, పలువురు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. -
ఆశలన్నీ అమాత్యులపైనే..!
కైకలూరు : కేంద్ర మంత్రుల పర్యటనతో కొల్లేరు గ్రామాల్లో ఉత్కంఠత నెలకొంది. ఈ సారైనా ఎన్నికల హామీలు నెరవేరతాయో లేదో అన్న మీమాంస ప్రజలను వేధిస్తోంది. ఎన్నికల ప్రచారంలో కొల్లేరు సమస్యలను పరిష్కరిస్తామని ప్రస్తుత ప్రధాని నరేంద్రమోదీ హామీ ఇచ్చారు. కొల్లేటి సమస్యల పరిష్కారంపై గత ప్రభుత్వాలు ఇచ్చిన హామీలు ఏవీ నెరవేరలేదు.కేంద్ర అటవి, పర్యావరణ శాఖ మంత్రి ప్రకాశ్ జవదేకర్, పట్టణాభివృద్ధిశాఖ మంత్రి ఎం.వెంకయ్యనాయుడు తొలిసారిగా శుక్రవారం కొల్లేటికోటకు వస్తున్నారు. కృష్ణా, పశ్చిమగోదావరి జిల్లాల్లోని కొల్లేరు గ్రామాల నుంచి 25 వేల మంది హాజరవుతారని అంచనా వేస్తున్నారు. కాంటూరు లెక్కల్లో గందరగోళం కొల్లేరు కాంటూరు లెక్కల్లో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. కృష్ణా, పశ్చిమగోదావరి జిల్లాల్లో +5 కాంటూరు పరిధి వరకు 77 వేల 138 ఎకరాలను అభయారణ్యంగా 1999లో విడుదల చేసిన 120 జీవోలో పేర్కొన్నారు. ఇప్పుడు కొల్లేరు ప్రజలు కోరినట్లుగా +5 కాంటూరు నుంచి +3 కాంటూరు వరకు కుదిస్తే 33 వేల 361 ఎకరాలకు తగ్గుతుంది. అంటే 43 వేల 777 ఎకరాలు మిగులు భూమిని రెండు జిల్లాల్లోని 90 వేల కుటుంబాలకు పంపిణీ చేయవచ్చు. కైకలూరుకు చెందిన సామాజిక కార్యకర్త గూడపాటి కృష్ణమోహన్ మాత్రం +5 కాంటూరు వరకు లక్షా 21 వేల 600 ఎకరాల అభయారణ్య భూమి ఉందన్నారు. కొందరు కావాలనే 77వేల 138 ఎకరాలుగా చూపించారని, కొల్లేరు ఆపరేషన్ సమయంలో కృష్ణాజిల్లాలో 7500 ఎకరాలు అదనంగా ధ్వంసం చేశారనే వాదనలో నిజం లేదని తేల్చిచెప్పారు. కొల్లేరులో +5 కాంటూరు వరకు ఇంకా 45 వేల భూములను అభయారణ్యం పరిధిలోకి తీసుకోవాల్సి ఉందని, ప్రస్తుతం పంపిణీ చేస్తామంటున్న 7500 ఎకరాలను ఏ విధంగా నిర్ణయిస్తారని ప్రశ్నిస్తున్నారు. సుప్రీంకోర్టు పరిధిలో అంశం కొల్లేరు అంశం సుప్రీకోర్టు పరిధిలో ఉంది. అక్కడ కేంద్ర సాధికారిత కమిటీ నిర్ణయాల ప్రకారం కొల్లేరులో పనులు జరగాలి. ఈ కారణంగానే కొల్లేరు పెద్దింట్లమ్మ వారిధి నిర్మాణం నిలిచింది. కొల్లేరు కాంటూరు కుదింపు జరగాలంటే ప్రధాని ఛైర్మన్‌గా ఉన్న పర్యావరణ కమిటీ నిర్ణయం తీసుకుని పార్లమెంటులో బిల్లు పెట్టాలి. ఇటీవల కొల్లేరులో అక్రమ చెరువులు పెరిగాయంటూ కొందరు కోర్టులో పిల్ వేశారు. మంత్రులు చూద్దాం.. చేద్దాం.. అంటే మరోసారి నిరసన వ్యక్తమయ్యే అవకాశం ఉంది. -
సమస్యల కొల్లేరు ఆశల సెలయేరు
నెరవేరేనా ఈ మారు రేపు కొల్లేటికోటకు కేంద్రమంత్రుల రాక కృష్ణా, పశ్చిమగోదావరి జిల్లాల ప్రజలతో సమావేశం ఆశలన్నీ కాంటూరు కుదింపుపైనే.. కోల్లేటివాసుల జీవనప్రదాయినిగా.. అంతులేని మత్స్యసంపదకు ఆలవాలంగా.. ప్రకృతి రమణీయతకు పట్టుకొమ్మగా విలసిల్లుతున్న కొల్లేరు సిరుల సెలయేరు. ప్రశాంతతకు చిహ్నంగా.. శాంతికపోతంగా పైకి కనిపించే ఈ సరస్సు వెనుక ఏళ్ల తరబడి కన్నీరు ప్రవాహమై ఉరకలేస్తోంది. ఎన్నో సమస్యలు.. ఎంతోమంది పాలకులు.. వచ్చిపోయే వారే గానీ పరిష్కారం చూపేవారే లేక.. కొల్లేరు కన్నీటి ఏరై నెమ్మదిగా కదులుతోంది. ఆ కన్నీళ్లను తుడుస్తానంటూ.. ఆశల పల్లకీని మోసుకొస్తున్న కేంద్ర ప్రభుత్వం కోసం కొల్లేరువాసులు ఆశగా ఎదురుచూస్తున్నారు. ఎన్నికల ప్రచారంలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఇచ్చిన హామీ మేరకు కేంద్ర అటవీ, పర్యావరణ శాఖ మంత్రి ప్రకాశ్ జవదేకర్, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఎం.వెంకయ్యనాయుడు, స్థానిక బీజేపీ ఎమ్మెల్యే, రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి కామినేని శ్రీనివాస్‌తో కలిసి శుక్రవారం హెలికాప్టర్లో కొల్లేరులో ఏరియల్ సర్వే నిర్వహించనున్నారు. అనంతరం కైకలూరు మండలం కొల్లేటికోట గ్రామంలో కృష్ణా, పశ్చిమ గోదావరి జిల్లాల ప్రజలతో బహిరంగ సమావేశం నిర్వహించనున్నారు. కొల్లేటి సమస్యల పరిష్కారానికి ఈ సమావేశం కీలకం కానుంది. - కైకలూరు కొల్లేటి సమస్య ఎప్పుడూ ప్రభుత్వాలకు సవాల్‌గానే మారుతోంది. కృష్ణా, పశ్చిమగోదావరి జిల్లాల్లో 77వేల 131 ఎకరాల విస్తీర్ణంలో కొల్లేరు అభయార ణ్యం విస్తరించి ఉంది. ఇక్కడి ఆక్రమిత చెరువుల వల్ల పర్యావరణం దెబ్బతింటోందని సుప్రీంకోర్టులో పర్యావరణవేత్తలు పిల్ వేయడంతో 2006లో ఇరు జిల్లాల్లోనూ 31వేల 125.75 ఎకరాల విస్తీర్ణంలో ఆక్రమిత చేపల చెరువులను ధ్వంసం చేశారు. అప్పటి నుంచి కొల్లేరు వాసులు కొల్లేరు కాంటూరు పరిధిని +5 నుంచి +3 వరకు కుదించాలని కోరుతున్నారు. అదేవిధంగా కృష్ణాజిల్లాలో కొల్లేరు ఆపరేషన్ సమయంలో ధ్వంసం చేసిన 7,500 ఎకరాలను పంపిణీ చేయాలని చెబుతున్నారు. ఆ ఆశలు నెరవేరేనా.. కొల్లేరు ప్రజల చిరకాల ఆశలు ఈసారైనా నెరవేరుతాయా అనే అనుమానం ఇక్కడి ప్రజల్లో నెలకొంది. ప్రతిసారీ నాయకులు రావడం.. వాగ్దానాలు చేసి వెళ్లడం పరిపాటిగా మారింది. అప్పటి కేంద్ర పర్యావరణ శాఖ మంత్రి జైరాం రమేష్ 2010 ఫిబ్రవరిలో కొల్లేటికోటలో సమావేశం నిర్వహించారు. కాంటూరు కుదింపుపై సానుకూలంగా మాట్లాడారు. అంతా బాగుంటుందనే సమయానికి 2010 మే 21న చిత్తడి నేలల చట్టం పరిధిలోకి కొల్లేరును చేరుస్తూ కేంద్ర పర్యావరణ మంత్రిత్వశాఖ ముసాయిదా విడుదల చేసింది. దేశంలోని 25 చిత్తడి ప్రాంతాల్లో కొల్లేరును చేర్చింది. అనంతరం 2010 సెప్టెంబరు 19 నుంచి 24వ తేదీ వరకు ప్రముఖ పర్యావరణవేత్త ఆజీజ్ నేతృత్వంలో కమిటీ కొల్లేరులో పర్యటించి నివేదిక అందించింది. ఆ నివేదికలో కూడా పర్యావరణానికే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు. వైఎస్ మరణాంతరం 2013లో అప్పటి ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి కొల్లేరుపై సబ్‌కమిటీ వేస్తానని చెప్పారు. ఆ హామీలన్నీ నీటిమూటలుగానే మిగిలిపోయాయి. ప్రస్తుతం వస్తున్న బీజేపీ కేంద్ర మంత్రులు ఏ మేరకు న్యాయం చేస్తారా అని కొల్లేరు ప్రజలు ఆశగా ఎదురుచూస్తున్నారు. కొల్లేరు ప్రజలు వలసపోతున్నారు కొల్లేరు ప్రజలు ఉపాధిలేక వలస పోతున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కొల్లేరు 5 నుంచి 3వ కాంటూరు వరకు కుదించాలి. పేదలకు భూములు పంచాలి. ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానాలను నిలబెట్టుకోవాలి. కొల్లేరు మత్స్యకారుల వేటకు ఉపయోగించే వలలను శుక్రవారం జరిగే కేంద్రమంత్రుల సమావేశంలోనైనా పంపిణీ చేయాలి. - దూలం నాగేశ్వరరావు, వైఎస్సార్ సీపీ కైకలూరు సమన్వయకర్త మిగులు భూములు పంచాలి కొల్లేరు కాంటూరును కుదించి మిగులు భూములను ప్రజలకు పంపిణీ చేయాలి. కాంటూరు కుదింపు అంశం కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉంది. కొల్లేరు ఆపరేషన్ సమయంలో జిల్లాలో అదనంగా ధ్వంసం చేసిన 7,500 ఎకరాల పంపిణీ రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో ఉంది. ఈ భూములను ముందుగా పంపిణీ చేస్తే కొల్లేరు ప్రజలకు ఊరట కలుగుతుంది. - జయమంగళ వెంకటరమణ, మాజీ ఎమ్మెల్యే, కైకలూరు కాంటూరు కుదింపు ప్రమాదం కాంటూరు కుదింపు కొల్లేరు మనుగడకే ప్రమాదం. ఇప్పటికే కొల్లేరుకు ఎగువ నుంచి నీరు రావడం లేదు. కొల్లేరు ఆపరేషన్ సమయంలో అదనంగా ధ్వంసం చేసిన 7,500 ఎకరాలను పంపిణీ చేయాలి. గోదావరి నది నుంచి కొల్లేరుకు నీరు చేరేలా ప్రణాళిక రూపొందించాలి. కొల్లేరులో రెగ్యులేటర్ నిర్మించాలి. దీనివల్ల కొల్లేరులో నీరు ఎప్పుడూ నిల్వ ఉంటుంది. - ఎర్నేని నాగేంద్రనాథ్, కొల్లేరు సరస్సు పునరుద్ధరణ సమితి అధ్యక్షుడు ఆశలు అడియాసలు చేయొద్దు కొల్లేరు ప్రజలు కాంటూరు కుదింపుపై ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. గతంలో మంత్రులు ఇచ్చిన వాగ్దానాలు అమలు కాలేదు. స్థానిక ఎమ్మెల్యే, మంత్రి కామినేని శ్రీనివాస్, ఎంపీ మాగంటి బాబు మాకు న్యాయం చేస్తారని ఆశిస్తున్నాం. కొల్లేరు ఆపరేషన్ సమయంలో చెరువులు కోల్పోయిన జిరాయితీ రైతులు అనేక కష్టాలు పడుతున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కొల్లేరు సమస్యలపై సానుకూలంగా స్పందించాలి. - నబిగారి రాంబాబు, కొల్లేరు అభివృద్ధి సంఘ జిల్లా అధ్యక్షుడు -
కొల్లేరులో ఆగని రగడ
మరోసారి చేపలు పట్టిన గ్రామస్తులు తెరవెనుక ఓ ప్రజాప్రతినిధి ! ఏలూరు రూరల్ : కొల్లేరులో అక్రమంగా తవ్విన చేపల చెరువు విషయమై మరోసారి రగడ చోటుచేసుకుంది. ఓ ప్రజా ప్రతినిధి అండతో రెండేళ్లకు పైగా సాగుతున్న ఈ గొడవ లంక గ్రామాల ప్రజలను తీవ్ర ఆందోళనకు గురి చేస్తోంది. ఆదివారం గ్రామస్తులు వివాదాస్పద చెరువులో చేపలు పట్టేందుకుప్రయత్నించడంతో గొడవ మరోసారి రాజుకుంది. ఏలూరు డీఎస్పీ కేజీవీ సరిత ఆధ్వర్యంలో పోలీసులు గ్రామానికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. ఉదయం 9 గంటలకు గ్రామస్తులు 16 ఎకరాల విస్తీ ర్ణంలోని చెరువులో చేపలు పట్టేందుకు ఉపక్రమిం చారు. ఈ విషయం తెలుసుకున్న మాజీ సర్పంచ్ ఘంటసాల మహలక్ష్మిరాజు వర్గీయులు చెరువు తమదంటూ అడ్డుపడ్డారు. దీన్ని గ్రామస్తులు తీవ్ర స్థాయిలో వ్యతిరేకించారు. చేపలు పట్టేందుకు హైకోర్టు అనుమతి ఇచ్చిందని గ్రామస్తులు ఆర్డర్ కాపీ చూపించారు. దీనిపై స్పందించిన మాజీ సర్పంచ్ వర్గీయులు హైకోర్టులో తప్పుడు కౌంటర్లు వేయించి ఆర్డర్ తెచ్చుకున్నారంటూ దుయ్యబట్టారు. చివరకు పోలీసుల సహకారంతో గ్రామస్తులు సుమారు 12 టన్నుల చేపలు పట్టి తరలించారు. దీనిపై మాజీ సర్పంచ్ వర్గీయులు తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. తమకు చెందిన చెరువులో చేపలను పట్టుకుపోతున్నా పోలీసులు పట్టించుకోవడం లేద ని ఆవేదన వ్యక్తం చేశారు. తర్వాత మహలక్ష్మిరాజు పలువురిపై ఏలూరు రూరల్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. నాయకులే సూత్రధారులు సుమారు రెండేళ్లుగా సాగుతున్న ఈ రగడకు నాయకుల కనుసన్నల్లో అధికారులే సూత్రధారులుగా ఉన్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ గ్రామంలోని వివాదాస్పద చేపల చెరువులు కొల్లేరు అభయారణ్య పరిధిలో ఉన్నాయి. ఐదేళ్ల క్రితం కొల్లేరులో సాగిన అక్రమ తవ్వకాలను అటవీ శాఖ అధికారులు చూసీచూడనట్టు వదిలేశారు. తర్వాత ఈ చెరువులకు రెవెన్యూ అధికారులు 254/1, 255/1 లాంటి తప్పుడు సర్వే నంబర్లతో పట్టాలు మంజూరు చేశారు. వీటిని ఆధారం చేసుకుని మత్స్య శాఖ అధికారులు అనుమతులు ఇచ్చేశారు. ఈ తతంగాన్ని చేతులు మారిన డబ్బు సంచులు నడిపించాయన్న సంగతి జగమెరిగిన సత్యం. దీనివెనుక అధికార పార్టీ నేతలు ఉన్నారు. నేడు ఈ చెరువుల్లో కోట్లాది రూపాయల విలువైన చేపలు ఉన్నాయి. దీంతో ప్రలోభాలకు గురైన అధికారులు చెరువు అభయారణ్య పరిధిలో ఉందని చెప్పడం లేదు. ఓ ప్రజాప్రతినిధి వెనకుండి కథ నడిపించడం మరో కారణం. ఇదే అదునుగా చేపలు పట్టేందుకు గ్రామస్తులు కోర్టులో పిటీషన్ వేశారు. కోర్టు అధికారులను వివరణ అడిగింది. అధికారులు సైతం తప్పుడు సమాచారం ఇచ్చారు. దీంతో చేపలు పట్టేందుకు కోర్టు అనుమతి ఇచ్చిందని మహలక్ష్మిరాజు చెబుతున్నారు. దీన్ని పరిష్కరించేందుకు చొరవ చూపకపోవడంతో ఈ రగడ ఎక్కడకు దారి తీస్తుందోనని లంక గ్రామాల ప్రజలు ఆందోళన చెందుతున్నారు. -
కొల్లేరులో 'చేపల చెరువుల' రగడ
కొల్లేరు(ప.గో):కొల్లేరులోని చేపల చెరువుల రగడ మరోసారి రాజుకుంది. దెందులూరు మండలంలోని ప్రత్తికోలలంక గ్రామంలో చేపల చెరువుల వ్యవహారంపై సోమవారం ఇరు వర్గాల మధ్య చోటు చేసుకుంది. ఈ ఘర్ణ కాస్తా తీవ్ర రూపం దాల్చడంతో స్థానికంగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో అక్కడ భారీగా పోలీసుల మోహరించి పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు యత్నిస్తున్నారు. -
కొల్లేరుపై ఏకగ్రీవ తీర్మానం
కాంటూర్ స్థాయిని 3కు తగ్గించాలని కేంద్రానికి విజ్ఞప్తి చేస్తూ ఏపీ శాసనసభ ఏకగ్రీవ తీర్మానం వైఎస్ హయాంలో 2008లోనూ ఇలాంటి తీర్మానమే చేసిన సభ మళ్లీ కొత్తగా చేసినట్లు బాబు బిల్డప్ ఇస్తున్నారని విమర్శించిన జగన్ హైదరాబాద్: కొల్లేరు కాంటూర్ స్థాయిని +5 మీటర్ల నుంచి +3 మీట ర్లకు తగ్గించాలని కేంద్రానికి విజ్ఞప్తిచే స్తూ శాసనసభ మంగళవారం ఏకగ్రీ వంగా తీర్మానం చేసింది. మంత్రి గోపాలకృష్ణారెడ్డి తీర్మానం ప్రవేశపెట్టగా సభ ఆమోదించినట్లు స్పీకర్ కె. శివప్రసాదరావు ప్రకటిస్తున్న తరుణం లో వైఎస్సార్సీపీ సభ్యుడు శ్రీకాంత్‌రెడ్డి అభ్యంతరం వ్యక్తం చేశారు. కొల్లేరు కాంటూరు స్థాయి తగ్గించాలనే తీర్మానానికి తాము సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నామని, అయితే ఏకగీవ్ర తీర్మానం చేసే ముందు విపక్ష సభ్యులకు మాట్లాడే అవకాశం ఇవ్వడం సంప్రదాయన్నారు. దానికి స్పీకర్ అంగీకరించారు. ‘2008లోనే కాంటూ రుస్థాయి తగ్గించాలని శాసనసభ ఏకగ్రీవంగా తీర్మానం చేసి కేంద్రానికి పంపించిం దని, ఇప్పుడు కొత్తగా చేయాల్సిన అవసరం ఏముంది. గతంలో చేసిన తీర్మానంపై కేంద్రం మీద ఒత్తిడి తెచ్చి కాంటూరుస్థాయి తగ్గించే ప్రయత్నాలు చేస్తే సమయం కలిసొస్తుంది’ అని సూచించారు. కొల్లేరు రైతులకు వైఎస్ అన్యాయం చేశారన్న అధికార పక్ష సభ్యుల విమర్శలకు ప్రతిపక్ష నేత జగన్ సమాధానమిచ్చారు. కొల్లేరు ప్రజల ఇబ్బంది చూసే నాడు వైఎస్ తీర్మానం చేశారు ‘‘చంద్రబాబు తన పార్టీ ఎమ్మెల్యేలతో చక్కగా కట్టుకథలు చెప్పిస్తున్నారు. తొమ్మి దేళ్లు సీఎంగా ఉన్న బాబు.. తన హయాంలో కాంటూరు స్థాయిని తగ్గించే తీర్మానం ఎందుకు చేయలేదు? వైఎస్ సీఎం అయిన తర్వాతే తీర్మానం ఎందుకు చేశారు? వైఎస్ ప్రభుత్వం చేసిన తీర్మానం గురించి ఎక్కడా ప్రస్తావించకుండా, కొత్తగా తానే చేస్తున్నట్లు చంద్రబాబు బిల్డప్ ఇస్తున్నారు. బాంబులతో చేపల చెరువులను పేల్చారని చెబుతున్నారు. సుప్రీంకోర్టు తీర్పు ఇస్తే, స్పందించాలి కాబట్టి అప్పటి ప్రభుత్వం స్పందించింది. తీర్పును అమలు చేసిన తర్వాత.. కొల్లేరు ప్రజలు ఇబ్బంది పడుతున్నారని గుర్తించిన వైఎస్ శాసనసభలో ఏకగ్రీవంగా తీర్మానం చేసి కాం టూరు స్థాయిని 3కు తగ్గించడానికి కేంద్రం మీద ఒత్తిడి తెచ్చారు. కానీ కేంద్రం ఆ పని చేయలేదు. తీర్మానం చేసిన ఆరు నెలల్లో దురదృష్టవశాత్తూ మహానేత వైఎస్ చనిపోయారు. కేంద్రంపై ఒత్తిడితెచ్చి కాంటూరు స్థాయిని తగ్గించేలా పనిచేయించుకుందాం. కలిసిరావడానికి మేం సిద్ధంగా ఉన్నాం’’ అని విపక్ష నేత పేర్కొన్నారు. ఇప్పటికే పడిన అడుగుల్లో ముందుకు సాగుదాం.. విపక్ష నేత వివరణ ఇచ్చిన తర్వాతా అధికార పక్ష సభ్యుల విమర్శలు ఆగలేదు. మళ్లీ జగన్ జోక్యం చేసుకొని ‘కొల్లేరు కాంటూరు స్థాయిని తగ్గించాలనే ప్రతిపాదనపై అధ్యయనం చేసిన సలీం అలీ సెంటర్ ఫర్ ఆర్నితాలజీ అండ్ నేచురల్ హిస్టరీ డెరైక్టర్ పి.ఎ.అజీజ్ నేతృత్వంలో అధ్యయన కమిటీ నివేదిక కూడా సమర్పించింది. ఈ దిశగా ఇప్పటికే కొన్ని అడుగులు పడిన నేపథ్యంలో.. అక్కడ నుంచి మొదలుపెడితే కేంద్రం త్వరగా చర్యలు చేపట్టే అవకాశం ఉంది. లేదంటే.. శాసనసభలో తీర్మానం చేశామని, కేంద్రం చేయలేదని అంటూ నెపాన్ని నరేంద్ర మోదీ మీదకు నెట్టేసి ఐదేళ్లూ కాలం గడిపేసే ప్రమాదం ఉంది’’ అని అన్నారు. అనంతరం తీర్మానాన్ని సభ ఏకగ్రీవంగా ఆమోదించినట్లు స్పీకర్ ప్రకటించారు. -
బాబు తవ్విస్తే...వైఎస్ఆర్ పూడ్చేసినట్లు..
హైదరాబాద్ : కొల్లేరు సరస్సును చంద్రబాబు నాయుడు తవ్విస్తే...వైఎస్ రాజశేఖరరెడ్డి పూడ్చివేసినట్లు అధికార పార్టీ సభ్యులు చెబుతున్నారని వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యే కొడాలి నాని అన్నారు. కొల్లేరు కాంటూరుపై మంగళవారం సభలో చర్చ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అక్రమ చెరువులు తొలగించాలని సుప్రీంకోర్టు 2006లో ఆదేశిస్తే అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి చెరువులు తొలగించటం జరిగిందన్నారు. అనంతరం ఆయన అసెంబ్లీలో కొల్లేరు కాంటూరుపై ఏకగ్రీవ తీర్మానం చేసి కేంద్రానికి పంపించారన్నారు. అనంతరం ఆరు నెలలకే దురదృష్టవశాత్తూ వైఎస్ఆర్ చనిపోవటంతో ఆ తర్వాత వచ్చిన ప్రభుత్వాలు ఈ సమస్యపై పట్టించుకోలేదని కొడాలి నాని అన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం చిత్తశుద్ధితో సమస్యను పరిష్కరించాలని అన్నారు. -
కొల్లేరుకు కొత్త అందాలు!
రాష్ట్ర విభజనతో కొల్లేరుకు పెరిగిన ప్రాధాన్యం పర్యాటక రంగ అభివృద్ధికి ప్రతిపాదనలు సిద్ధం ఆటపాక పక్షుల కేంద్రానికి ఆధునిక హంగులు కైకలూరు : ప్రకృతి రమణీయతకు మారుపేరైన కొల్లేరు తీరం సరికొత్త అందాలను సంతరించుకోనుంది. విదేశీ పక్షుల సందడితో పర్యాటకులకు కనువిందు చేసే ఆటపాకలో ఆధునిక వసతులు కొలువుదీరనున్నాయి. రాష్ట్ర విభజన నేపథ్యంలో కొల్లేరు ప్రాంతాన్ని పర్యాటకంగా అభివృద్ధి చేయాలని అధికారులు ప్రణాళికలు సిద్ధం చేశారు. మరోవైపు తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాల మీదుగా పర్యాటక రూట్ మ్యాప్‌కు అధికారులు ప్రణాళిక రూపొందిస్తున్నారు. కొల్లేరు మత్స్య సంపద ద్వారా కూడా ఆదాయం సమకూర్చుకోవాలని భావిస్తోంది. ఇందుకోసమైనా కొల్లేరు ప్రాంతంలో వసతులు మెరుగుపరిచే అవకాశం ఉందని స్థానికులు భావిస్తున్నారు. ప్రస్తుత రాష్ట్ర బడ్జెట్లో అటవీ, పర్యావరణ అభివృద్ధికి ప్రభుత్వం రూ.418 కోట్లు కేటాయించింది. ఈ నిధుల్లో కొంత అయినా ఖర్చు చేసి కొల్లేరు ఆభయారణ్యంలో వసతులు కల్పించే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. కొల్లేరు తీరం ఇలా... కృష్ణా, పశ్చిమగోదావరి జిల్లాల పరిధిలో 77,125 ఎకరాల్లో కొల్లేరు అభయారణ్యం విస్తరించి ఉన్నట్లు నిర్ధారించారు. కైకలూరు, మండవల్లి మండలాల్లో 14 గ్రామాలు కొల్లేరు పరిధిలో ఉన్నాయి. అరుదైన పక్షులను తిలకించేందుకు పశ్చిమగోదావరి జిల్లాలో గుడివాకలంక, మొండికోడు, కృష్ణా జిల్లాలో ఆటపాక, మణుగునూరులంక గ్రామాల్లో ప్రదేశాలు ఉన్నాయి. విదేశీ పక్షులను దగ్గర నుంచి చూసే అవకాశం మాత్రం కైకలూరు మండలం ఆటపాక పక్షుల విహార కేంద్రంలోనే ఉంది. ఈ కేంద్రం పర్యాటకులను విశేషంగా ఆకట్టుకుంటోంది. ప్రతిపాదనలకే పరిమితం.. కొల్లేరు ప్రాంతంలో పర్యాటక రంగ అభివృద్ధికి దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి చర్యలు చేపట్టారు. ఆయన కృషి మేరకు కొల్లేరు అభివృద్ధి, యాత్రికులకు సదుపాయాల కోసం రూ.950 కోట్లు అవసరమని 2009లో విస్సా అనే ప్రయివేటు సంస్థ నివేదికను సిద్ధం చేసింది. ఈ నివేదికను అప్పటి ప్రధానమంత్రి మన్మోహన్‌సింగ్‌కు అందజేసింది. ఈ నిధులతో రహదారులు, రిసార్ట్లు, పక్షుల సంరక్షణ కేంద్రాల నిర్మాణం వంటివి ఏర్పాటు చేయాలని సూచించారు. వైఎస్ మరణానంతరం ఆ ప్రతిపాదనలు కార్యరూపం దాల్చలేదు. మళ్లీ 2013లో కోస్తా ప్రాంత పర్యాటక అభివృద్ధికి రూ.500 కోట్లతో ప్రణాళిక రూపొందిస్తున్నట్లు అప్పటి కేంద్ర పర్యాటక శాఖ మంత్రి చిరంజీవి ప్రకటించారు. కొండపల్లి హెరిటేజ్ పేరుతో విజయవాడలోని భవానీ ద్వీపం, గాంధీహిల్, కూచిపూడి, మొవ్వ, హంసలదీవి, పెడన కలంకారీ, కొల్లేరులో పర్యాటక అభివృధికి రూ.50 కోట్లును కేటాయిస్తున్నట్లు చిరంజీవి చెప్పారు. కొల్లేరుకు వచ్చే పర్యాటకులు విశ్రాంతి తీసుకోడానికి ఆలపాడు ఉప్పుటేరు వద్ద కాటేజీలు నిర్మించాలని భావించారు. కృత్తివెన్ను మండలం చినగొల్లపాలెం రేవు వద్ద నుంచి ఉప్పుటేరు మీదుగా కొల్లేటికోట పెద్దింట్లమ్మ దేవస్థానం వరకు బోటు యాత్ర, ఆటపాక పక్షుల కేంద్రం నుంచి కొల్లేటి పెద్దింట్లమ్మ దేవస్థానం వరకు బోటు యాత్రకు ఏర్పాట్లు చేయాలని నిర్ణయించారు. ఉప్పుటేరు వద్ద కాటేజీలు నిర్మిస్తే కృష్ణా, పశ్చిమగోదావరి జిల్లాల యాత్రికులకు అనుకూలంగా ఉంటుందని ప్రణాళికలు రూపొందించినా, పనులు పూర్తికాలేదు. పుణ్యక్షేత్రాలకు అనుసంధానం : బాపూజీ కృష్ణా, గుంటూరు, ఉభయగోదావరి జిల్లాలకు చెందిన ప్రముఖ పుణ్యక్షేత్రాలను అనుసంధానం చేస్తూ కొల్లేరు ప్రాంతాన్ని పర్యాటక కేంద్రంగా అభివృద్ది చేయాలని భావిస్తున్నట్లు టూరిజం డీఎం బాపూజీ చెప్పారు. అదే విధంగా కొల్లేరులో బోటు షికారు, కాటేజీల ఏర్పాటుకు సంబంధించిన ప్రతిపాదనలు ప్రభుత్వానికి పంపామని తెలిపారు. ఇప్పటికే పశ్చిమగోదావరి జిల్లా ఆగడాలలంక వద్ద కొల్లేరు సందర్శకుల కోసం రిసార్ట్లు ఏర్పాటు చేశామని ఆయన చెప్పారు. అటవీ పర్యావరణాన్ని అభివృద్ధి చేస్తాం : శ్రీదర్ ఆటపాక పక్షుల కేంద్రం మాదిరిగా మరిన్ని విహార కేంద్రాలను ఏర్పాటు చేయాలని ఉందని అటవీ శాఖ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్టు శ్రీధర్ చెప్పారు. విదేశీ పక్షులు విడిది కేంద్రంగా కొల్లేరు నిలిచిందని పేర్కొన్నారు. ఆటపాక పక్షుల కేంద్రంలో ఇప్పటికే పక్షుల ఆవాసల కోసం కృత్రిమ స్టాండ్లను ఏర్పాటు చేశామన్నారు. మణుగునూరులంక వద్ద మరో విహార కేంద్రాన్ని అభివృద్ధి చేశామన్నారు. రానున్న రోజుల్లో పక్షుల సంరక్షణ కేంద్రాలకు అధిక ప్రాధాన్యత కల్పిస్తామని ఆయన తెలిపారు. -
మంత్రులను కలిసిన కొల్లేరు రైతులు
భీమడోలు : కొల్లేరులో అటవీ శాఖ అధికారులు చెరువులను ధ్వంసం చేయడంతో పలువురు రైతులు, ఆక్వా అసోసియేషన్ నాయకులు హైదరాబాద్‌లో పలువురు మంత్రులను కలిశారు. ఉంగుటూరు ఎమ్మెల్యే గన్ని వీరాంజనేయులు ద్వారా వ్యవసాయ శాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు, వైద్యశాఖ మంత్రి కామినేని శ్రీనివాస్, అటవీ శాఖ మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డిలను రైతులు కలిసి తమ గోడును తెలిపారు. ఐదో కాంటూరు పక్కనే వంద మీటర్ల దూరంలో ఉన్న చెరువులను కూడా తొలగిస్తామని జిల్లా యంత్రాంగం హెచ్చరిస్తోందని అసోసియేషన్ నాయకుడు నంబూరి శివాజీరాజు మంత్రులకు తెలిపారు. కొల్లేరులో జిరాయితీ భూములను ధ్వంసం చేస్తున్నారని దీంతో రైతుల పరిస్థితి ఆధ్వానంగా మారుతుందని వాపోయారు. ఈ విషయాలను ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లి న్యాయం చేస్తామని మంత్రులు తెలిపినట్టు ఎమ్మెల్యే గన్ని వీరాంజనేయులు, రైతులు తెలిపారు. -
కొల్లేరులో నకిలీ చేపలు
భారీగా నకిలీ కరెన్సీ చెలామణి టీడీపీ సర్పంచ్ కీలకపాత్ర గుడివాడ, కైకలూరు, కలిదిండిలతో లింకు రూ.500, 1,000 నోట్లు కర్ణాటక నుంచి వచ్చేవి కొల్లేరు తీరంలో నక్కిన నకిలీ చేపలు ఎట్టకేలకు పోలీసుల వలకు చిక్కాయి. పెద్దమనిషి ముసుగులో పెద్ద మొత్తంలో దొంగనోట్లు చెలామణి చేసిన టీడీపీ నేత నిజ స్వరూపం బయటపడింది. ఇక్కడే కొందరు నకిలీ నోట్ల తయారీకి ఏర్పాట్లు చేయడం కలకలం రేపింది. కైకలూరు/గుడివాడ/కలిదిండి : జిల్లాలో కలకలం రేపిన నకిలీ కరెన్సీ నోట్ల కేసును పోలీసులు ఛేదించారు. పోలీసుల విచారణలో వెలుగుచూసిన అంశాలు అందరినీ నివ్వెరపోయేలా చేశాయి. టీడీపీ నాయకుడు జనానికి నకిలీ నోట్లు అంటగట్టినట్లు తెలియడం సంచలనం సృష్టించింది. కొల్లేరు ప్రాంతాన్ని లక్ష్యంగా చేసుకుని నకిలీ కరెన్సీ రాకెట్ తమ కార్యకలాపాలను కొనసాగించినట్లు తెలుస్తోంది. సులభంగా డబ్బు సంపాదించాలనుకునే కొందరు వారికి సహరించారు. కర్ణాటక నుంచి.. కర్ణాటక రాష్ట్రంలోని రాయచూర్‌కు చెందిన నాయక్ ద్వారా కైకలూరు నియోజకవర్గంలోని పలువురు నకిలీ నోట్లను భారీ ఎత్తున చెలామణి చేశారు. తొలుత కలిదిండికి చెందిన జలసూత్రం వెంకన్న మాత్రమే నాయక్ నుంచి నకిలీ నోట్లు తెచ్చుకుని చెలామణి చేసేవాడు. ఆ తర్వాత ఇదే ప్రాంతానికి చెందిన సూదాబత్తుల రాంప్రసాద్, సిరిగిరి సూర్యనారాయణ, కలిదిండిలో సెల్పాయింట్ నిర్వహిస్తున్న మండా ప్రసాద్, పశ్చిమగోదావరి జిల్లా కాళ్లలో సెల్పాయింట్ నిర్వహిస్తున్న దొడ్డనపూడికి చెందిన కొల్లి నాగవెంకట సత్యనారాయణ, కలిదిండి మండలం సానారుద్రవరానికి చెందిన వడ్లాని రాము, మొగల్తూరుకు చెందిన గాదె ప్రదీప్ కూడా నకిలీ నోట్ల చెలామణి ప్రారంభించారు. వీరితోపాటు మరి కొందరు కూడా దొంగనోట్లు మార్పిడి చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. నోట్ల మార్పిడి ఇలా.. నకిలీ కరెన్సీ రాకెట్లో ఆరితేరిన నాయక్‌తో పరిచయం పెంచుకున్న జలసూత్రం వెంకన్న గత డిసెంబర్ నుంచి ఈ వ్యాపారం నిర్వహిస్తున్నారు. నాయక్ నుంచి వచ్చే ఫోన్ కాల్స్ ఆధారంగా విజయనగరం, శ్రీకాకుళం, గుంతకల్లు, హౌరా రైల్వేస్టేషన్లకు వెళ్లి అతను పంపిన మనిషి వద్ద నుంచి వెంకన్న దొంగనోట్లు తెచ్చుకునేవాడు. అతను రూ.5వేలు కమీషన్‌పై ఇతరులకు దొంగనోట్లు సరఫరా చేస్తాడు. నాయక్ నుంచి వెంకన్నకు రూ.500, రూ.1,000 నకిలీ నోట్లు వచ్చేవి. వెంకన్న ద్వారా రూ.28.25లక్షల విలువైన నకిలీ కరెన్సీని పలువురు చెలామాణి చేశారు. వెంకన్న సొంతంగా కలర్ ప్రింటర్, స్కానర్, పేపర్ కట్టర్‌ను కొనుగోలు చేసి రూ.100 నకిలీ నోట్లను ముద్రించి మార్పిడి చేశాడు. గుడివాడలోనూ ముగ్గురు.. కలిదిండి మండలంలో పట్టుబడిన దొంగనోట్ల ముఠాలో గుడివాడకు చెందిన ముగ్గురు ఉన్నట్లు తేలడంతో ఈ ప్రాంతంలో కలకలం మొదలైంది. గుడివాడకు చెందిన బండారు రమేష్ రూ.3లక్షలు, కోతిబొమ్మ సెంటర్లో ఉండే వడ్డీ వ్యాపారి రాజేష్ రూ.1.50లు విలువైన నకిలీ కరెన్సీని చెలామణి చేసినట్లు వార్తలు రావడంతో ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు. ఆటో ఫైనాన్స్ వ్యాపారం చేసే కిరణ్ కూడా ఈ దొంగనోట్లును పెద్ద ఎత్తున చెలామణి చేసినట్లు పోలీసులు గుర్తించారు. ఈ ముగ్గురినీ ప్రస్తుతం అదుపులోకి తీసుకున్నట్లు సమా చారం. కర్ణాటకకు చెందిన నాయక్ ద్వారా వీరు దొంగనోట్ల వ్యాపారం చేస్తున్నారు. ఇక్కడి నుంచి నాయక్ అకౌంట్లో డబ్బులు జమచేస్తే అందుకు తగినంత దొంగనోట్లను ఓ వ్యక్తి గుడివాడ రైల్వేస్టేషన్ వద్దకు వచ్చి అందజేస్తాడు. పట్టణంలోని ఎన్టీఆర్ కాలనీలో కొద్ది మంది గుట్టుచప్పుడు కాకుండా ఈ వ్యవహారం సాగిస్తున్నారని తెలుస్తోంది. నాయక్ ఖాతా నకిలీదే.. కర్నాటకకు చెందిన నాయక్ పేరుతో నిర్వహిస్తున్న బ్యాంకు ఖాతా కూడా నకిలీదేనని పోలీసులు గుర్తించారు. నాయక్ పేరుతో ఇక్కడి ఏజెంట్లు డబ్బు జమ చేస్తున్న ఖాతా మరో వ్యక్తి పేరుతో ఉన్నట్లు సమాచారం. కలిదిండిలో రెండేళ్లుగా చెలామణి! కలిదిండి మండలంలో రెండేళ్లుగా దొంగనోట్ల చెలామణి చేస్తున్నట్లు సమాచారం. గతంలో మండలంలోని తాడినాడకు చెందిన ఒక వ్యక్తి విజయవాడలోని కనకదుర్గమ్మ అమ్మవారి దర్శనానికి కుటుంబ సభ్యులతో సహా వెళ్లాడు. అక్కడ కౌంటరులో లడ్డూలు కొనుగోలు చేయటానికి ముందుగా రూ.500 నోటు ఇవ్వగా.. అది దొంగనోటు అని గుర్తించారు. మరొకటి ఇవ్వగా అది కూడా దొంగనోటు కావడంతో పోలీసులకు సమాచారం అందించారు. అప్పట్లో ఆ వ్యక్తిని విచారించగా పశ్చిమగోదావరి జిల్లా మొగల్తూరు గ్రామానికి చెందిన ఒక కొబ్బరికాయల వ్యాపారి ఆ నోట్లు ఇచ్చినట్లు పోలీసుల విచారణలో తేలింది. అప్పటి నుంచి కలిదిండి మండలంలో విచ్చలవిడిగా దొంగనోట్లు చెలామణి చేస్తున్నట్లు సమాచారం. కలిదిండి మండలంలో ఎక్కువగా చేపల చెరువులు ఉండటంతో ఈ ముఠాలు సులభంగా దొంగనోట్లు చెలామణి చేస్తున్నారు. ఎట్టకేలకు దొంగనోట్ల ముఠాను పోలీసులు అరెస్ట్‌చేయడంతో ప్రజలు ఊపిరిపీల్చుకున్నారు. భవిష్యత్తులో ఇటువంటివి పునరావృతం కాకుండా పటిష్ట నిఘా పెట్టాలని కొల్లేరు ప్రాంతవాసులు కోరుతున్నారు. రూ.15లక్షలు చెలామణి చేసిన టీడీపీ నేత నకిలీ నోట్ల ముఠాతో ముదినేపల్లి మండలంలోని వీరావిగుంట సర్పంచ్ భూపతి నాగరవీంద్రకు సంబంధం ఉంది. అతనికి రూ.15లక్షల విలువైన నకిలీ కరెన్సీ ఇచ్చినట్లు ఈ కేసులో ప్రధాన నిందితుడు వెంకన్న పోలీసుల ఎదుట చెప్పాడు. రవీంద్ర భార్య నాగకళ్యాణి ముదినేపల్లి జెడ్పీటీసీ సభ్యురాలిగా టీడీపీ తరఫున గెలుపొందారు. మండల టీడీపీ రాజకీయాల్లో కీలకపాత్ర పోషించే రవీంద్ర దొంగనోట్లు చెలామణి చేసినట్లు తెలియడంతో ఈ ప్రాంతంలో సంచలనం సృష్టించింది. ఆయన్ను శుక్రవారం మధ్యాహ్నమే పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. -
కొల్లేరులో కాసుల వేట!
అభయారణ్యంలో అడ్డగోలుగా చేపల సాగు రూ.1.60కోట్ల విలువైన చేపల పట్టివేత అడ్డుకోలేని అటవీ శాఖ అధికారులు ఎన్నికల తర్వాత పట్టపగలే పట్టుబడులు కైకలూరు : కొల్లేరు అభయారణ్యంలో అక్రమంగా చేపల సాగుకు అడ్డూ అదుపు లేకుండాపోయింది. యథేచ్ఛగా చేపలు సాగుచేసి పట్టపగలు చేపల ఎగుమతులు చేస్తున్నా అటవీ శాఖ అధికారులు కన్నెత్తి చూడటం లేదు. కైకలూరు మండలం కొల్లేటికోట పెద్దింట్లమ్మ దేవస్థానం స్నానాల రేవుకు సమీపంలోని ముక్కుపెడగా పిలిచే 40 ఎకరాల చెరువులో గురువారం పట్టపగలు చేపల పట్టుబడులు సాగాయి. ఈ చేపల విలువ సుమారు 40లక్షలు ఉంటుంది. కొల్లేరు ఆపరేషన్ సమయంలో ఈ చెరువును ధ్వంసం చేశారు. గతంలో గుట్టుచప్పుడు కాకుండా జరిగే ఈ అక్రమ తంతును ఇప్పుడు కొల్లేరు పెద్దల అండదండలతో బహిరంగంగానే కొనసాగిస్తున్నారు. దేవస్థానం వద్దకు ఏకంగా ఓ భారీ లారీని తీసుకువచ్చి దర్జాగా లోడింగ్ చేస్తున్నారు. వడ్లకూటితిప్ప గ్రామ సమీపంలోని 120 ఎకరాల అభయారణ్య చెరువులోనూ రెండు రోజులుగా చేపల లోడింగ్ జరుగుతోంది. ఇక్కడ నుంచి సుమారు రూ.1.20కోట్ల విలువైన మత్స్య సంపదను తరలిస్తున్నట్లు తెలుస్తోంది. శుక్రవారం కొల్లేటికోట లాంచీల రేవు వద్ద 50 ఎకరాల తాడిమెట్ట చెరువులో చేపలను పట్టేందుకు అక్కడ పెద్దలు రంగం సిద్ధం చేశారు. అడ్రస్ లేని అటవీ శాఖ అధికారులు... కొల్లేరు అభయారణ్యంలో చేపల చెరువులు తవ్వినా, సాగు చేపట్టినా చట్టరిత్యా నేరం. కొల్లేరును పరిరక్షించాల్సిన బాధ్యత అటవీ అధికారులపై ఉంది. కైకలూరు మండలంలో ఓ రే ంజర్ స్థాయి అధికారి, 14 మంది సిబ్బంది విధులు నిర్వహిస్తున్నారు. ఒక్క గురువారమే కొల్లేటికోట, వడ్లకూటితిప్పా గ్రామాల్లో పట్టపగలు బహిరంగంగా చేపల పట్టుబడి జరుగుతుంటే కనీసం ప్రశ్నించేందుకు సిబ్బంది రాకపోవడంపై స్థానికులు తీవ్ర విమర్శలు చేస్తున్నారు. నిరుపయోగంగా చెక్‌పోస్టు ఆలపాడు వద్ద అటవీ శాఖ ఏర్పాటు చేసిన చెక్‌పోస్టు నిరుపయోగంగా మారింది. చేపల మేతలతో లారీలు దూసుకుపోతున్నా అడ్డుకునే నాథుడే అక్కడ కరువయ్యాడు. అభయారణ్యంలో పట్టుకున్న చేపలను గుండుగొలును మీదుగా ఏలూరు తరలిస్తున్నారు. వడ్లకూటితిప్ప గ్రామం నుంచి ఆకివీడుకు చేపలు ఎగుమతి చేస్తున్నారు. కొల్లేరులో ఎన్నికల తర్వాత అక్రమాలు తారాస్థాయిలో ఊపందుకున్నాయని, అధికారులు అడ్డుకట్ట వేయాలని పలువురు కోరుతున్నారు. కొల్లేరు కొంప మునగడం ఖాయం ! కొల్లేరు ఆపరేషన్ సమయంలో ధ్వంసం చేసిన చెరువుల స్థానంలో యథావిధిగా చేపల సాగు కొనసాగుతోంది. స్థానిక రెవెన్యూ సిబ్బంది కళ్ల ఎదుటే ఈ తంతు జరుగుతున్నా రాజకీయ నాయకుల ఒత్తిళ్ల కారణంగా ఏమీ చేయలేని పరిస్థితి లంక గ్రామాల్లో నెలకొంది. కొల్లేరులో నీటి ప్రవాహానికి అక్రమ చేపల చెరువు గట్లు అడ్డుపడటంతో గతంలో అనేక గ్రామాలు ముంపునకు గురయ్యాయి. చేపల చెరువుల తవ్వకాలు కొనసాగితే రానున్న రోజుల్లో మరింత ప్రమాదం తప్పదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అక్రమ పట్టుబడులను అడ్డుకుంటాం : రేంజర్ కొల్లేరు గ్రామాల్లో అక్రమ చేపల పట్టుబడులను అడ్డుకుంటామని రేంజర్ రామ్మోహన్ సింగ్ ‘సాక్షి’తో చెప్పారు. తన దృష్టికి ఈ విషయం వచ్చిందని, సిబ్బందిని పంపి నిలుపుదల చేయిస్తానని తెలిపారు. -
మంత్రి గారూ.. గోడు వినరూ
సాగు జాప్యంతో ఖరీఫ్ రైతు ఆందోళన జీవనోపాధి కోల్పోతున్న మత్స్యకారులు కొలిక్కిరాని కొల్లేరు సమస్యలు నేడు జిల్లాకు రానున్న వ్యవసాయ మంత్రికి సమస్యలు నివేదించనున్న నేతలు కైకలూరు : రాష్ట్ర వ్యవసాయ, మత్స్యశాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు ఆదివారం మొదటిసారిగా జిల్లాకు రానున్నారు. ఈ సందర్భంగా జిల్లాలోని మత్స్యకారులు, రైతుల సమస్యలను ఆయన దృష్టికి తీసుకొచ్చేందుకు ఆయా సంఘాల నేతలు సిద్ధమవుతున్నారు. రాష్ట్ర చేపల రైతుల సంఘం ఆధ్వర్యంలో మంత్రి కామినేని శ్రీనివాస్, ఎంపీ మాగంటి బాబులతో పాటు ఆయనకు కైకలూరులో ఆదివారం సన్మాన కార్యక్రమం ఏర్పాటుచేశారు. ఈ సందర్భంగా రైతులు, మత్స్యకారులు, చేపల రైతులు తాము ఎదుర్కొంటున్న సమస్యలను వారి దృష్టికి తీసుకువెళ్లనున్నారు. సాగు.. బహు జాగు... జిల్లాలో వరి రైతు పరిస్థితి మరీ దారుణంగా మారింది. ఖరీఫ్ ముంచుకొచ్చేసినా అదునులో వర్షాలు లేకపోవడం, తీవ్ర నీటి కొరతతో రైతులు ఆందోళన చెందుతున్నారు. జిల్లా మొత్తం మీద 8.81 లక్షల పంట సాగుకు ప్రణాళిక సిద్ధమైంది. ఇందులో వరి 6.34 లక్షలు, పత్తి 1.41 లక్షలు, చెరుకు 36 వేలు, మిర్చి 25 వేలు, మొక్కజొన్న ఇతరత్రా పంటలు 43 వేల 892 ఎకరాల్లో సాగు చేయడానికి రైతులు సిద్ధమయ్యారు. సాధారణంగా జూన్ మొదటి వారం దాటాక రైతులు నారుమడులు పోస్తారు. జూలై మొదటి వారంలో నాట్లు ప్రారంభిస్తారు. తీవ్ర వర్షభావం ప్రభావంతో జూన్ నెలాఖరు కావస్తున్నా వ్యవసాయ పనులు ఊపందుకోలేదు. మరోవైపు జాతీయ ఆహార భద్రత పథకం నుంచి జిల్లాను మినహాయించడంతో రాయితీపై విత్తనాలు అందే పరిస్థితి లేదు. కొద్ది రోజుల క్రితం కేంద్రం సాధారణ రకం ధాన్యంపై క్వింటాలుకు మద్దతు ధర రూ.50 పెంచింది. ప్రస్తుతం క్వింటాలు పంటకు రూ. 2,104 ఖర్చవుతుండగా, మద్దతు ధర రూ.1400 మాత్రమే ఉందని, ఇది రైతులకు ఏ విధంగా మేలు చేస్తుందని పలువురు ప్రశ్నిస్తున్నారు. ప్రోత్సాహకాలు కరువు... జిల్లాలో 111 కిలోమీటర్ల తీర ప్రాంతం ఉంది. మొత్తం లక్షా 15 వేల మంది మత్స్యకారులు ఉన్నారు. వీరిలో 40 వేల మంది సముద్రపు వేటపై ఆధారపడ్డారు. ప్రభుత్వం నుంచి ప్రొత్సహకాలు లేకపోవడంతో జీవనోపాధి కోల్పోతున్నారు. వీరికి సముద్రపు వేట ఆశాజనకంగా లేదు. ఎన్ఎఫ్డీబీని సీమాంధ్రలో ఏర్పాటు చేయాలి... మత్స్యరంగం అభివృద్ధికి కేంద్ర స్థాయిలో సాయమందించే నేషనల్ ఫిషరీస్ డెవలప్మెంట్ బోర్డు (ఎన్ఎఫ్డీబీ) కార్యాలయం హైదరాబాదులో ఉంది. రాష్ట్ర విభజన నేపథ్యంలో ఎన్ఎఫ్డీబీని కోస్తాంధ్రకు మార్పు చేయాలని ఇక్కడి ఆక్వా రైతులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా మత్స్యశాఖలో అన్ని కేటగిరీలకు సంబంధించి 1,400 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. విభజన నేపథ్యంలో తెలంగాణ ప్రాంతానికి చెందిన 500 మంది విడిగా వెళ్లారు. కార్యాలయం కూడా రెండుగా విడిపోయింది. కోస్తాంధ్రలో విస్తరించిన ఆక్వా రంగాన్ని దృష్టిలో ఉంచుకుని ఎన్ఎఫ్డీబీని ఇక్కడ ఏర్పాటు చేయాలనే డిమాండ్ రైతుల నుంచి వస్తోంది. ఇక ఆంధ్రప్రదేశ్‌లో ఆక్వా ఉత్పత్తులను నిల్వ చేసుకోడానికి ప్రభుత్వపరంగా ఒక్కటంటే ఒక్క కోల్డ్‌స్టోరేజీ కూడా అందుబాటులో లేదు. గతంలో బ్రాకిష్ వాటర్ ఫిష్ ఫార్మర్స్ ఏజెన్సీ (బీఎఫ్డీఏ), ఫ్రెష్ వాటర్ ఫిష్ ఫార్మర్స్ ఏజెన్సీ (ఎఫ్ఎఫ్డీఏ)ల ద్వారా కేంద్రం సబ్సిడీపై రైతులకు నిధులు అందించేది. పదేళ్లుగా అవి మనుగడలో లేవు. వాటిని రాష్ట్ర ప్రభుత్వం పునరుద్ధరిస్తే రైతులకు మేలు జరగటంతో పాటు రాష్ట్రంపై భారం తగ్గుతుందని ఆక్వా రైతులు చెబుతున్నారు. మత్స్యకారుల సమస్యలివీ... సముద్రంలో చేపల వేటకు ఉపయోగించే మర బోటులకు ప్రభుత్వం అందించే డీజిల్ సబ్సిడీని రూ.6 నుంచి రూ.10కి పెంచాలని మత్స్యకారులు కోరుతున్నారు. 2002 ఏడాదికి ముందు ఇంజన్ బోట్లకు మాత్రమే డీజిల్ సబ్సిడీ అందిస్తామనే మెలిక పెడుతున్నారు. అందరికీ సబ్సిడీ అందించాలి. ఏటా 50 శాతం సబ్సిడీతో వలలు పంపిణీ చేయాలి. ఎకో టూరిజం ద్వారా సముద్రంలో తిరిగే విహార బోట్లకు మచిలీపట్నంలో శిక్షణ కేంద్రాన్ని ఏర్పాటుచేయాలి. హార్బర్ పూడుకుపోవడంతో వేటకు వెళ్లిన మత్స్యకారులు పోటు సమయం వరకు వేచివుండాల్సి వస్తోంది. కొల్లేరు వాసుల కష్టాలివీ... కొల్లేరు ప్రాంత మత్స్యకారులు వేటకు ఉపయోగించే వెదురు గెడల పంపిణీ రెండేళ్లకోసారి చేసేవారు. పంపిణీ నిలిచిపోవడంతో మత్స్యకారులు ఇబ్బందులు పడుతున్నారు. కొల్లేరు సొసైటీలకు అందించే వలల పంపినీ పథకం వివాదాల వల్ల నిలిచిపోయింది. కొల్లేరులో వేటకు ఉపయోగించే తాటి దోనెల స్థానంలో ఫైబర్ దోనెలు అందించాలని కొల్లేరు మత్స్యకారులు కోరుతున్నారు. చేపల ఉత్పత్తులను విక్రయించేందుకు ఉపయోగించే మోటారు సైకిళ్లు, ఐస్ బాక్సుల పంపిణీ జరగడం లేదు. కొల్లేరు ఆపరేషన్ సమయంలో ధ్వంసం చేసిన జిరాయితీ భూములకు నష్టపరిహారం చెల్లించలేదు. మత్స్యశాఖలో సిబ్బంది కొరత కారణంగా సేవలు సన్నగిల్లుతున్నాయి. తీవ్ర తాగునీటి ఎద్దడి కొల్లేరు గ్రామాల ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. -
కొల్లేరు సమస్యలు పరిష్కరిస్తాం
ఎంపీ మాగంటి కైకలూరు, న్యూస్‌లైన్ : కొల్లేరు ప్రాంత ప్రజల సమస్యల పరిష్కారానికి చిత్తశుద్ధితో కృషి చేస్తామని ఏలూరు ఎంపీ మాగంటి వెంకటేశ్వరరావు (బాబు) అన్నారు. పార్లమెంటు సభ్యునిగా ఎన్నికయిన తర్వాత గురువారం ఆయన మొదటిసారిగా కైకలూరు వచ్చారు. స్థానిక రైల్యేస్టేషన్ నుంచి భారీ ర్యాలీగా ఆయనను కార్యకర్తలు ఊరేగింపుగా తీసుకొచ్చారు. తర్వాత ఆటపాకలోని ఆయన నివాసంలో కార్యకర్తలను కలుసుకున్నారు. తన విజయానికి సహకరించిన అందరికీ ఆయన కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ కేంద్రంలో మోడి, సీమాంధ్రాలో చంద్రబాబు పాలనలో అన్ని రంగాల్లో అభివృద్ధి సాధిస్తామన్న ఆశాభావం వ్యక్తం చేశారు. కృష్ణా, పశ్చిమ గోదావరి జిల్లాల్లో విస్తరించి ఉన్న కొల్లేరు ప్రాంతాలను అభివృద్ధి చేయడానికి రానున్న రోజుల్లో ప్రణాళిక రుపొందిస్తామన్నారు. ప్రధానంగా నియోజకవర్గంలోని కైకలూరు, మండవల్లి మండలాల్లో కొల్లేరు ఆపరేషన్ సమయంలో అధనంగా ధ్వంసం చేసిన 7500 ఎకరాల చేపల చెరువుల భూములను తిరిగి పేదలకు పంపిణీ చేసే విషయాన్ని చంద్రబాబు దృష్టికి తీసుకువెళ్లామన్నారు. కొల్లేరు ఆపరేషన్ సమయంలో పనిచేసిన అప్పటి కలెక్టర్ నవీన్‌మిట్టల్‌తో సంప్రదించి పరిష్కార మార్గాలను అన్వేషించే ఆలోచన ఉందన్నారు. అదే విధంగా కొల్లేరు అభయారణ్యాన్ని కాంటూరు 5 నుంచి 3వరకు కుదించే అంశాన్ని కేంద్రానికి విన్నవిస్తామన్నారు. కొల్లేరు ప్రాంతంలో రహదారులు, తాగునీటి సౌకర్యాలపై ప్రత్యేక దృష్టి సారిస్తామని తెలిపారు. పోలవరం అర్డినెన్స్‌పై కేంద్రం తీసుకున్న నిర్ణయంపై ఆయన సంతోషం వ్యక్తం చేశారు. నల్లదనం వెలికితీతపై ప్రధాని మోడి సాహసోపేత నిర్ణయాన్ని ప్రజలు స్వాగతిస్తున్నారన్నారు. నియోజకవర్గ అభివృద్ధికి శాయశక్తుల కృషి చేస్తానని చెప్పారు. టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు ఈడ్పుగంటి వెంకట్రామయ్య, చలమలశెట్టి రామానుజయ్య, కైకలూరు, కలిదిండి, ముదినేపల్లి జెడ్పీటీసీలు బొమ్మనబోయిన విజయలక్ష్మీ, నున్న రమాదేవి, రాష్ట్ర పార్టీ ఎస్సీసెల్ కార్యదర్శి మత్తె సూర్యచంద్రరావు, బూపతి నాగకల్యాణి, నాలుగు మండలాల పార్టీ అధ్యక్షులు త్రినాథరాజు, విజయబాబు, శ్రీనివాసచౌదరి, విఠల్, పార్టీ నాయకులు కెవిఎన్‌ఎం.నాయుడు, దోనెపూడి రంగారావు, కమతం విశ్వాసం, ఎంఎ.రహీం, బీజేపీ నాయకులు లావేటి వీరశివాజీ, అమృత కమలాకరరావు తదితరులు పాల్గొన్నారు. -
'ఏలూరును మోడల్ నగరంగా తీర్చిదిద్దుతా'
ఏల్లూరు: కొల్లేరు సమస్యను పరిష్కరించే సత్తా వైఎస్ జగన్మోహన్ రెడ్డికే ఉందని ఏలూరు లోక్‌సభ వైఎస్ఆర్ సీపీ అభ్యర్థి డాక్టర్ తోట చంద్రశేఖర్ తెలిపారు. కొల్లేరును 5వ కాంటూరు నుంచి 3వ కాంటూరుకు తగ్గిస్తామని ఆయన హామీయిచ్చారు. పోలవరం ప్రాజెక్ట్‌ను 3 నుంచి 5 ఏళ్లలోపు పూర్తి చేస్తామని అన్నారు. ఐఏఎస్ అధికారిగా రెండున్నర దశాబ్దాలు ప్రజలతో కలిసి ఉన్నానని తెలిపారు. ప్రజా సమస్యల పరిష్కారానికే తన తొలి ప్రాధాన్యత అని చెప్పారు. ఏలూరును మోడల్ నగరంగా తీర్చిదిద్దుతానని అన్నారు. చంద్రబాబు చీకటి పాలనను ప్రజలెవరూ కోరుకోవద్దని విజ్ఞప్తి చేశారు. చంద్రబాబు పాలనను గుర్తుచేస్తే ప్రజలు ఒక్కసారిగా భయాందోళనలు చెందుతున్నారన్నారు. ప్రస్తుతం చంద్రబాబు స్వయంగా నడవలేక సినిమా యాక్టర్‌ను, మతతత్వ నాయకుడిని ఊతకర్రలుగా చేసుకుని ప్రచారం సాగిస్తున్నారని ఎద్దేవా చేశారు. చంద్రబాబు ఉచిత వాగ్దానాలను నమ్మి ఓటేస్తే మళ్లీ చీకటి రోజులు వస్తాయని చంద్రశేఖర్ హెచ్చరించారు. -
చంద్రబాబు వల్లే కొల్లేరు ప్రజలకు కష్టాలు
ఏలూరు రూరల్, న్యూస్‌లైన్ : టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు జారీ చేసిన 120 జీవో వల్లే కొల్లేరులోని మూడున్నర లక్షల మంది ప్రజలు అష్టకష్టాలు పడుతున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఏలూరు పార్లమెం టరీ నియోజకవర్గ అభ్యర్థి తోట చంద్రశేఖర్ దుయ్యబట్టారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన మరుక్షణం వైఎస్ జగన్మోహన్రెడ్డి కాంటూరు కుదింపునకు చర్యలు చేపట్టి కొల్లేరు ప్రజలను ఆదుకుంటారని హామీ ఇచ్చారు. దెందులూరు ఎమ్మెల్యే అభ్యర్థి కారుమూరి నాగేశ్వరరావుతో కలిసిఆదివారం ఆయన కొల్లేరు గ్రామాల్లో ప్రచారం నిర్వహించారు. ఈ సందర్బంగా గుడివాకలంకలో నిర్వహించిన సభలో చంద్రశేఖర్ మాట్లాడుతూ కొల్లేరు ప్రజల కష్టాలను తెలుసుకున్న మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి కాంటూరును 5నుంచి 3కు కుదించాలని అసెం భ్లీలో తీర్మానం చేయించారని గుర్తుచేశారు. మహానేత మరణంతో కొల్లేరు ప్రజల ఆశలు ఆవిరయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఆయన ఆశయాలను నెరవేర్చి, కొల్లేరు ప్రజలను ఆదుకునేందుకు వైఎస్ జగన్మోహన్రెడ్డి పార్టీ మేనిఫెస్టోలో కొల్లేరు అంశాన్ని పొందుపరిచారని పేర్కొన్నారు. ఎమ్మెల్యే అభ్యర్థి కారుమూరి నాగేశ్వరరావు మాట్లాడుతూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారం చేపట్టిన మరుక్షణం కాంటూరును కుదించి భూమిలేని పేదలకు భూమి అందించేందుకు కృషి చేస్తామని హామీ ఇచ్చారు. మహానేత దూరం కాకుండా ఉంటే రాష్ట్రం అన్నిరంగాల్లో అభివృద్ది చెందేదని వివరించారు. ఆయన ఆశయాలు నెరవేర్చేందుకు వైఎస్ జగన్ ప్రజల ముందుకొచ్చారని, ఆయనను ముఖ్యమంత్రి చేయాలని పిలుపునిచ్చారు. టీడీపీ నాయకులను నిలదీయండి కొల్లేరు ప్రజలను ఓట్లు అడగటానికి వచ్చే టీడీపీ నాయకులను 120 జీవోను ఎలా తెచ్చారనే విషయమై నిలదీయాలని తోట చంద్రశేఖర్ కొల్లేరు ప్రజలకు పిలుపునిచ్చారు. జీతాలు పెంచమని అడిగిన అంగన్వాడీ కార్యకర్తలను గుర్రాలతో తొక్కించిన ఘనత చంద్రబాబుదేనన్నారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచేందుకు వైఎస్ జగన్మోహన్రెడ్డి ఉద్యమాలు చేస్తుంటే చంద్రబాబురెండు కళ్ల సిద్ధాంతంతో రాష్ట్రాన్ని ముక్కలు చేశారని దుయ్యబట్టారు. అలాంటి నాయకుడు అధికారంలోకి వస్తే మళ్లీ రాక్షసపాలన వస్తుందని హెచ్చరిం చారు. ఎందరో పేదల జీవితాల్లో వెలుగులు నింపిన ఆరోగ్యశ్రీ పథకాన్ని కాం గ్రెస్ ప్రభుత్వం నీరుగార్చిందని విమర్శించారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే 108, 104తోపాటు ఆరోగ్యశ్రీ పథకాలను పూర్తిస్థాయిలో అమలు చేస్తామన్నారు. వైఎస్ జగన్మోహన్రెడ్డి రూపకల్పన చేసిన తల్లిఒడి పథకం ద్వారా ప్రతి తల్లి తన బిడ్డను డిగ్రీ వరకూ చదివించుకుంటూ తమ ఖాతాల్లో రూ.500 నుంచి రూ.వెయ్యి వరకూ పొందవచ్చని వివరించారు. రూ.200 పింఛన్‌ను రూ.700కు పెంచుతామని వివరించారు. పేదలకు రూ.వందకే 150 యూనిట్ల విద్యుత్, డ్వాక్రా రుణాలు రద్దు, రైతులను ఆదుకునేం దుకు రూ.2 వేల కోట్లతో ప్రత్యేక నిధి ఏర్పాటు చేయనున్నారని వివరించారు. అడుగడుగునా ఘన స్వాగతం తోట చంద్రశేఖర్, కారుమూరి నాగేశ్వరరావులకు కొల్లేరు ప్రజలు ఘనస్వాగతం పలికారు. పూలమాల లతో అభినందించారు. అడుగడుగునా జై జగన్, జోహార్ వైఎస్సార్ అంటూ నినాదాలు చేశారు. ప్రచారానికి వచ్చిన అభ్యర్థుల కోసం గుడివాకలంక సర్పంచ్ ఘంటసాల లక్ష్మీరాంబాబు, ఉప సర్పంచ్ మోరు వీరమ్మతోపాటు మాజీ సర్పంచ్ జయమంగళ భద్రగిరి స్వామి, గ్రామపెద్దలు సభ ఏర్పాటు చేశారు. చేపల వేట సాగిస్తున్న మత్స్యకారులను, ప్యాకింగ్ చేస్తున్న కొల్లేరు కూలీల సమస్యలను అభ్యర్థులు అడిగి తెలుసుకున్నారు. వారివెంట కొల్లేరు నాయకుడు ముంగర సంజీవ్‌కుమార్, ఊదరగొండి చంద్రమౌళి, ఘంటా ప్రసా ద్, మరడాని రంగారావు ఉన్నారు. -
విహంగమై వాలిపోదాం
పచ్చని చెట్లు తెల్లటి దుప్పటి కప్పుకున్నాయా! నీలాల ఝరులు ముత్యాల దండలను అలంకరించుకున్నాయా..! అన్నంతగా ఈ సరస్సులు సంభ్రమాన్ని కలిగించే విహార క్షేత్రాలు. విదేశాల నుంచి అరుదెంచిన అరుదైన పక్షిజాతులకు ఆవాసాలు. ఇవన్నీ ఎక్కడో కాదు మన రాష్ట్రంలోనే ఉన్నాయి.వలస వచ్చేసిన ఈ పక్షులు ఐదారు నెలల పాటు ఇక్కడే ఉల్లాసంగా గడిపి, సంతానాన్ని పెంపొందించుకొని... మరో రెండు నెలల్లో తిరిగి తమ స్వస్థలాలకు వెళ్లబోతున్నాయి. ఆ లోపే వీటిని తిలకించడానికి పయనమవుదాం రండి. కొల్లేరు కృష్ణా, పశ్చిమగోదావరి జిల్లాలో విస్తరించి ఉన్న మంచినీటి సరస్సు కొల్లేరు. విదేశీ విహంగాలకు విడిదిగా పేరొందిన ఈ కేంద్రం పెలికాన్ పక్షులకు ప్రఖ్యాతి గాంచినది. సైబీరియా, ఫిజీ దీవుల నుంచి వేల కిలోమీటర్లు ప్రయాణం చేసి పెలికాన్ (గూడబాతు)తో పాటు దేశ, విదేశాల నుంచి ఎర్రకాళ్ల కొంగ, నత్తగుళ్ల కొంగ, కంకణాల పిట్ట వంటి 189 కి పైగా రకాల పక్షులు ఇక్కడకు వలస వస్తాయి. కేంద్రప్రభుత్వం అటవీశాఖకు 2007లో ఈ పక్షికేంద్ర బాధ్యతలను అప్పజెప్పడంతో మొదట్లో పదుల్లోనే వచ్చే పెలికాన్ల సంఖ్య ఇప్పుడు మూడు వేలకు పైగా పెరిగింది. ఈ వందల జాతుల పక్షులను వీక్షించడానికి మార్చి వరకు అనువైన సమయం. పక్షులను దగ్గరగా వీక్షించడానికి కొల్లేరు సరస్సులో బోటు సదుపాయం కూడా ఉంది. ఈ పక్షి కేంద్రానికి దగ్గరలోనే పిల్లల కోసం ప్రత్యేకమైన పార్క్‌ను ఏర్పాటు చేశారు. పెలికాన్ కాకుండా 189 రకాల పక్షులను, ఇవి కాకుండా 41 రకాల వలస పక్షులను ఇక్కడ గుర్తించారు అధికారులు. పక్షి కేంద్రాన్ని సందర్శించిన తర్వాత పక్షుల వివరాలు తెలిపే ఎలక్ట్రానిక్ బర్డ్స్ మ్యూజియం, అక్కడి పిల్లల పార్క్, కొల్లేటి కోటలో పెద్దింట్లమ్మ అమ్మవారి దేవాలయం, వెస్ట్ గోదావరిలో త్వరలో ప్రారంభం కానున్న రిసార్ట్లు, ఆటపాక పర్యావరణ అభ్యాస కేంద్రం సందర్శించవచ్చు. ఆటపాకలో బోటు, లాంచి షికారు ఉంటుంది. కొల్లేరు పక్షి కేంద్రాన్ని సందర్శించిన తర్వాత మరో ప్రాంతానికి వెళ్లాలనుకునేవారు ఏలూరు నుంచి 40 కి.మీ దూరంలో ఉన్న ద్వారకా తిరుమలకు చేరుకోవచ్చు. పులికాట్ ప్రకృతి సౌందర్యంలో పక్షుల సోయగాలను చూడటానికి అనువైన సమయం ఉదయం - సాయంత్రాలు. ఆంధ్రప్రదేశ్ - తమిళనాడు రాష్ట్రాలలో విస్తరించి ఉన్న, దేశంలోనే రెండవ అతిపెద్ద ఉప్పునీటి సరస్సు పులికాట్! 60 కిలోమీటర్ల పొడవు, ప్రదేశాన్ని బట్టి 17.5 కిలోమీటర్ల వెడల్పున ఉంటుంది ఈ సరస్సు. అటవీ ప్రాంతం కూడా ఉండటంతో పర్యాటకులు అటు నీటి ఝరులను, ఇటు పచ్చని వృక్ష సిరులను తిలకిస్తూ ప్రకృతి ఒడిలో మైమరచిపోవచ్చు. ప్రకృతి సహజసిద్ధ సుందర దృశ్యాలకు నెలవైన ఈ సరస్సు వలస విహంగాలకు సరిపడినంత స్థలాన్ని, అనువైన వాతావరణాన్ని కలిగి ఉండటంతో సమూహాలుగా ఇక్కడికి వలస పక్షులు వస్తుంటాయి. వీటిలో ఫ్లెమింగోలు ప్రధానమైనవి. అయితే ఇక్కడి నీటి కాలుష్యం కారణంగా పక్షులు ఇక్కడ నుంచి నేలపట్టుకు, సౌత్ చెన్నై వైపుకు తరలి వెళుతున్నాయి. వేసవిలో ఎండిన చేపల కోసం కాళ్ల కొంగలు విరివిగా ఇక్కడకు చేరుకుంటాయి. చిత్తూరు జిల్లాలోని శ్రీ కాళహస్తి నుంచి 27 కి.మీ దూరం ప్రయాణిస్తే ఈ సరస్సును చేరుకోవచ్చు. నేలపట్టు నేలపట్టు నెల్లూరు జిల్లాలోని చిన్న గ్రామం. సూళ్లూరు పేట నుంచి 10 కి.మీ, ఉత్తర పులికాట్ నుంచి 20 కి.మీ దూరంలో ఉంటుంది నేలపట్టు. దీనిని దొరవారి సత్రం అని కూడా అంటారు. శీతాకాలంలో ఇక్కడకు ఆఫ్రికా, అమెరికా, చైనా దేశాల నుంచి వలస పక్షులు అధికంగా వస్తుంటాయి. వాటిలో ప్రధానంగా గూడబాతులు (స్పాట్ బిల్డ్ పెలికాన్), తెడ్డు ముక్కు కొంగలు, (స్పూన్ బిల్), వైట్ ఇబిస్ (తెల్ల కొంగలు) నైట్ హారన్(శబరి కొంగ)లకు ఈ పక్షి కేంద్రం పేరుగాంచింది. అక్టోబర్‌లో వచ్చిన ఈ వలస పక్షులు నాలుగైదు నెలల పాటు సంతానోత్పత్తి గావించి, వేసవి మొదట్లో తిరిగి వచ్చిన చోటుకే వెళ్లిపోతాయి. ఇవే గాకుండా నారాయణ పక్షులు, నీటి కాకి, సముద్రపు కొంగ, గుళ్ల కొంగ, నల్లకంకణాలు, పరజ, నీలిరెక్కల పరజ, సూది తోక బాతు, ఎర్రతల బాతు, చుక్కకోడి, చుక్కమూతి బాతు... మరో 21 రకాల పక్షులు, ఇక్కడే ఉన్న ఇంకో 50 రకాల పక్షులు సందడితో నేలపట్టు ప్రతి ఉదయం మేలుకొంటుంది. సందర్శన సమయం: అక్టోబర్ నుంచి మార్చి వరకు విరివిగా ఉండే ఈ పక్షుల సోయగాలను తిలకించడానికి అనువైన సమయం. ఉప్పలపాడు రాష్ట్రంలో మరో పేరెన్నికగన్న పక్షి స్థావరం ఉప్పలపాడు. గుంటూరు జిల్లా పెదకాకాని మండలంలో ఉంది ఈ గ్రామం. సెప్టెంబర్, అక్టోబర్ మాసాలలో సైబీరియా, ఆస్ట్రేలియాల నుంచి గూడబాతుల గుంపులు, ఎర్రకాళ్ల కొంగల వరసలు, నత్తకొట్టు కొంగలు సమూహాలు.. వీటితో పాటు మరో 70 రకాల జాతి పక్షులతో ఈ ప్రాంతం కిక్కిరిసిపోయి ఉంటుంది. పక్షిస్థావరానికి వెళ్లే దారికిరువైపులా పచ్చని చేలు, ఆ చేలపై ఎగురుతున్న మైనగోరలు, కత్తిరిపిట్టలు, అక్కడక్కడ పాలపిట్టలు, కొంగలు... పొలాలను ఆశిస్తున్న మిడతలను, పురుగులను లాఘవంగా వేటాడుతూ కనువిందు చేస్తాయి. గాలిలో ఎగురుతున్న పురుగులను నేర్పరులైన నల్లంచులు వేటాడటం చూడవలసిందే! దారిలో సందడిగా ఉన్న ఊళ్ల గుండా ప్రయాణిస్తూ ఈ గ్రామాన్ని చేరుకుంటాం. గ్రామాన్ని చేరుకొని పక్షల స్థావరాన్ని చేరుకోగానే కలిగే అనుభూతి చెప్పనలవి కాదు. అది ఒక అందమైన దృశ్యకావ్యం. కాలాలననుసరించి వివిధ రకాల పక్షులరాక ఎన్నిసార్లు చూసినా తనివి తీరదు. ప్రతిసారి కొత్తగానే ఉంటుంది. పక్షులు వాటి గూళ్లలో పిల్లలకు ఆహారాన్ని అందిస్తుంటే చూడడం ఒక ఆనందానుభూతి. పక్షి ప్రేమికులకయితే చెప్పనవసరం లేదు. గంటలతరబడి చూస్తూ అనేకమార్లు వచ్చి వాటి అలవాట్లు గమనిస్తూ నోట్సులు తయారుచేసుకుంటారు. పక్షి శాస్త్రజ్ఞులు ఇక్కడ తమ పరిశోధనలు జరిపి పరిశోధనా పత్రాలు, గ్రంథాలు తయారుచేస్తారు. ఈ పక్షి కేంద్రానికి నత్తకొట్టుకొంగలు, తెల్ల కంకణాలు, ఎర్రకాళ్ల కొంగలు, చుక్కల ముక్కు గూడ బాతులు, చిత్త ఒక్కలు, చుక్కమూతి బాతులు, నల్ల బోలి కోడి, కలికి పక్షులు, జకానాలూ... మొదలైన 70 జాతులకు పైగా పక్షులు వస్తుంటాయి. గుంటూరు నుండి నందివెలుగు మీదుగా తెనాలికి వెళ్లే మార్గంలో 7 కి.మీ దూరంలో ఉంది ఈ పక్షి కేంద్రం. గుంటూరు నుండి ఆర్.టి.సి బస్సులు, ఆటోల ద్వారా ఈ గ్రామాన్ని చేరుకోవచ్చు. చెన్నై-హోరా రైలు మార్గాన ప్రయాణించేవారు తెనాలిలో దిగి నందివెలుగు మీదుగా 18 కి.మీ దూరంలో ఈ గ్రామానికి చేరుకోవచ్చు. సందర్శన సమయం: కిక్కిరిసిన ఈ పక్షులను, వాటి సోయగాలను చూడడానికి ఫిబ్రవరి చివరి వారం మార్చి మొదటి వారం వరకు అనువైనది. ఆంధ్రప్రదేశ్‌లోని ముఖ్యమైన పక్షి కేంద్రాలను సందర్శించా లనుకునేవారు... ఏలూరు నుంచి కొల్లేరు - గుంటూరులోని ఉప్పలపాడు - నెల్లూరులోని నేలపట్టు - పులికాట్ లను సందర్శించవచ్చు. కొల్లేరు సరస్సు చేరడానికి... గుడివాడ - కైకలూరు, ఏలూరు మీదుగా కొల్లేరుకు చేరుకోవచ్చు. కొల్లేరు టౌన్‌కు నాలుగు వైపులా ఆటపాక 2.5 కి.మీ, భుజబలపట్నం 6 కి.మీ, కొవ్వాడ లంక7 కి.మీ దూరంలో ఉన్నాయి. రోడ్డు మార్గాన ... విజయవాడ నుంచి 60 కి.మీ, ఏలూరు నుంచి 15 కి.మీ, కైకలూరు నుంచి 1.5 కి.మీ, నిడమనూరు నుంచి 8 కి.మీ, గుడివాడకలంక నుంచి 3 కి.మీ దూరంలో ఉన్న కొల్లేరుకు చేరుకోవచ్చు. రైలు మార్గాన వెళ్లాలనుకుంటే విజయవాడ నుంచి 60 కి.మీ దూరంలో ఉంది కొల్లేరు. ఉప్పలపాడు పక్షి కేంద్రంతో పాటు చుట్టుపక్కల ప్రదేశాలు చూడాలనుకునేవారు.. గుంటూరు టౌన్ నుంచి 35 కి.మీ దూరంలో ఉన్న అమరావతికి బస్సు ద్వారా చేరుకోవచ్చు. బస్‌స్టేషన్ ఎదురుగా అమరావతి మ్యూజియం ఉంటుంది. శుక్రవారం మినహా మిగతా అన్ని రోజుల్లోనూ ఈ మ్యూజియాన్ని ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు సందర్శించవచ్చు. నేలపట్టు అందాలను ఒడిసిపట్టుకోవాలంటే... ఆంధ్రప్రదేశ్-తమిళనాడు రాష్ట్రాల్లో సుమారు 404 చ.కి.మీ విస్తీర్ణంలో నేలపట్టు పక్షి కేంద్రం కొలువుదీరింది. సైబీరియన్ కొంగల జాతులు 160 ఉన్నట్టు గర్వంగా చెప్పుకుంటుంది నేలపట్టు. నెల్లూరు జిల్లాలో ఉన్న ఈ నేలపట్టుకు అక్టోబర్‌లో పెలికాన్ పక్షులు ఎక్కువగా వస్తుంటాయి. సూళ్లూరుపేట రైల్వేస్టేషన్ నుంచి 23కి.మీ. నేలపట్టు ఫ్లెమింగోలకు, పెలికాన్ పక్షులకు దక్షిణాసియాలో ఇదే అతిపెద్ద ఆవాసంగా చెబుతారు. పులికాట్ సరస్సులో... మంచినీరు, సముద్రపునీరు కలిసిన సరస్సు ఇది. 60 కిలోమీటర్ల పొడవు పదిహేడున్నర కిలోమీటర్ల వెడల్పు విస్తీర్ణంలో ఈ సరస్సు ఉంది. సూళ్లూరుపేట రైల్వే స్టేషన్ నుంచి పులికాట్‌కు 10 కి.మీ దూరం. పర్యాటకులు చేయకూడనివి వలస పక్షులు ప్రశాంతమైన వాతావరణాన్ని కోరుకుంటాయి. ఏ మాత్రం అనుకూలంగా లేనట్టు అవి పసిగట్టినా అవి ఎప్పటికీ ఆ ప్రాంతాలకు రావు. పక్షులు ఉన్న చోటుకు ఇష్టం వచ్చినట్టుగా వెళ్లకూడదు. సరదా కోసం రాళ్లను విసరకూడదు. అగ్నిప్రమాదాలకు కారణమయ్యే చుట్ట, బీడి, సిగరెట్ పీకలను ఆ ప్రాంతాలలో వదిలేయకూడదు. నీటి కాలుష్యానికి కారకమయ్యే ఆహారపదార్థాలు, ప్లాస్టిక్, పాలిథిన్ బ్యాగ్స్.. వంటివి చెరువులు, సరస్సులలో వేయకూడదు. వలసపక్షులున్న చెరువులు, సరస్సులలో ఈతకు వెళ్లరాదు. శబ్దాలు చేయకూడదు. ఇన్పుట్స్ - గ్రేసెస్,అటవీశాఖాధికారి, కొల్లేరు - కోకా మృత్యుంజయ రావు, ఉప్పలపాడు - శ్రీనివాస్, నెల్లూరు, సాక్షి ఫొటోలు: ఆకుల శ్రీనివాస్, ఏలూరు -
వచ్చిన మూడు నెలల్లోనే...పట్టుబిగిస్తున్న కలెక్టర్
=ఇసుక, చెరువులపై ఆరా =సుతిమెత్తని కత్తిలా పాలన =శాఖల వారీగా సమాచారం సేకరణ =జిల్లా అధికారుల్లో ఇదే హాట్ టాపిక్! సాక్షి, మచిలీపట్నం : ‘జిల్లాలో కీలకమైన శాఖను చూడాల్సిన మీరు మూడు మండలాలకు ప్రత్యేక అధికారిగా అదనపు బాధ్యతలు చూస్తే ఏం న్యాయం చేస్తారు..’ అంటూ ఒక అధికారికి ఊరడింపు. ‘ఇతర శాఖలో పనిచేసే మీరు రెవెన్యూ శాఖకు చెందిన ఆర్డీవోపై కూడా విచారణ నిర్వహించేలా అవకాశం ఎలా వచ్చింది.. మీ రికార్డు చూస్తే చాలా మంది అధికారులపై మీరే విచారణ అధికారిగా వ్యవహరించారు..’ అంటూ మరో అధికారిపై ఆరా. ‘ఫైళ్లు, కాగితాల్లో మునిగిపోకుండా కాస్తయినా హాస్టల్ విద్యార్థుల సంక్షేమం కోసం ఆలోచించండి..’ అంటూ ఇంకో అధికారికి సుతిమెత్తని హెచ్చరిక. ‘జిల్లాలో అవినీతిరహితంగా ప్రజలకు సేవలు అందించలేమా.. చిత్తశుద్ధితో పనిచేయండి..’ అంటూ అధికారంతో కూడిన ఆదేశం. ఇలా వేర్వేరు సందర్భాల్లో కలెక్టర్ ఎం.రఘునందనరావు జిల్లా యంత్రాంగం విషయంలో ముక్కుసూటిగా వ్యవహరించిన తీరు చర్చనీయాంశంగా మారింది. జిల్లాలో బాధ్యతలు చేపట్టి మూడు నెలలు నిండకముందే పాలనా యంత్రాంగంపై ఆయన పట్టు బిగిస్తున్నారు. ప్రతి చిన్న విషయాన్నీ సునిశితంగా పరిశీలిస్తున్నారు. సీరియస్‌గా స్పందించినట్టు లేకపోయినా సుతిమెత్తని కత్తిలా విషయాన్ని నరుక్కుని పోతున్నారు. దీంతో ఆయన తమకు కొరుకుడుపడటం లేదని పలువురు కీలక అధికారులు తమ సొంత మనుషుల వద్ద మధనపడాల్సిన పరిస్థితి వచ్చింది. పనిచేయని బిల్డప్‌లు... కలెక్టర్‌ను బుట్టలో వేసుకుని తమ పని కానిచ్చుకునేందుకు పలువురు అధికారులు చేసిన ప్రయత్నాలు పనిచేయలేదని సమాచారం. జిల్లాలో ఇప్పటివరకు పనిచేసిన కలెక్టర్లు ఒక్కొక్కరు ఒక్కో తీరుతో వ్యవహరించి తక్కువ సమయంలోనే బదిలీ అయ్యారు. దీంతో జిల్లాలోని పలు శాఖల్లో పనిచేసినవారి నీడ ఆయా కలెక్టర్లపై పడటంతో అపకీర్తిని మూటగట్టుకోవాల్సి వచ్చింది. ఏళ్ల తరబడి ఇదే జిల్లాలో పలు శాఖల ఉన్నతాధికారులుగా ఉన్నవారు కొందరు జిల్లా కలెక్టర్లను తమ దారికి తెచ్చుకుని పబ్బం గడుపుకొనేందుకు ప్రాధాన్యతఇచ్చేవారు. గతంలో ఇక్కడ పనిచేసిన ఒక కలెక్టర్‌కు మరో కీలక అధికారి రకరకాల మాంసాహారాలు, నోరూరించే వంటకాలతో క్యారేజీ తీసుకెళ్లి మరీ పెట్టి అవన్నీ తానే చేసినట్టు బిల్డప్ ఇచ్చి ఆకట్టుకున్నట్టు ప్రచారం జరిగింది. గతంలో ఇక్కడ పనిచేసిన ఒక కలెక్టర్‌కు మరో అధికారి సర్వం తానే అన్నట్టుగా హంగామా చేసుకుని ఆయన పేరు చెప్పుకొని అవకాశం ఉన్నంతమేర ‘పోగేసుకున్నట్టు’ సమాచారం. ఇలాంటి ఎత్తులు కొత్త కలెక్టర్ వద్ద ఎలా వేయాలా అని ఆలోచించే పలువురు అధికారులు ఇప్పుడు కంగారుపడే పరిస్థితి వచ్చింది. ఇప్పటికే కొత్త కలెక్టర్‌ను బుట్టలో వేసేందుకు అప్పుడే జిల్లాలో పలు శాఖల ఉన్నత అధికారులు చేసిన ప్రయత్నాలు బెడిసికొట్టినట్టు విశ్వసనీయ సమాచారం. ఇసుక, ఆక్వాపై ఆరా.. జిల్లాను పాడికుండగా మలుచుకున్న కొందరు అధికారులు ఇప్పుడు కంగారుపడుతున్నారు. ఇక్కడ ఏమాత్రం హడావుడి చేయకుండానే కాసులు కురిపించే వనరులను పలువురు తమకు అనుకూలంగా మలుచుకుని కాలక్షేపం చేసేవారు. ఈ ఏడాది అక్టోబర్ 14న బాధ్యతలు చేపట్టిన కలెక్టర్ ఇక్కడి ఇసుక మాఫియా, ఆక్వా చెరువుల తవ్వకం, భూదందాలు, మడ అడవుల ఆక్రమణలపై ఇప్పటికే ఆరా తీసినట్టు సమాచారం. అనుమతి లేకుండా కాసులు కురిపిస్తున్న ఇసుక తవ్వకాలపై జిల్లా అధికారులు కొందరు చూసీచూడనట్టుగానే వ్యవహరించడంలో పలువురి ప్రయోజనాలు ముడిపడి ఉన్నాయన్నది బహిరంగ రహస్యం. కొల్లేరు, తీర ప్రాంత మండలాల్లోనూ అనుమతి లేకుండా ఇష్టానుసారం చేపల చెరువుల తవ్వకాలు సాగిపోతున్నాయి. జీవ వైవిధ్యానికి కీలకంగా ఉండే తీరప్రాంతంలోని మడ అడవులు ఆక్రమణ కోరల్లో చిక్కిశల్యమవుతున్నాయి. జిల్లాలోని ప్రభుత్వ భూములు, ఆక్రమణలు, వాటిపై కోర్టు వ్యాజ్యాలు తదితర విషయాలపై కూడా ఆయన సమాచారం రప్పించుకుంటున్నారు. వచ్చి మూడు నెలలు నిండకముందే వీటన్నిటిపై కొత్త కలెక్టర్ దృష్టిపెట్టడం కొందరు అధికారుల్లో కంగారుపుట్టిస్తోంది. గతానికి భిన్నంగా.. గతంలో ఇక్కడ పనిచేసి కలెక్టర్లు సోమవారం ప్రజావాణికి మాత్రమే జిల్లా కేంద్రం మచిలీపట్నం వచ్చి మిగిలిన రోజుల్లో విజయవాడ క్యాంపు ఆఫీసుకు పరిమితమయ్యేవారు. కలెక్టర్ రఘునందనరావు మాత్రం వారంలో కనీసం నాలుగు రోజులు బందరులో ఉండేలా ప్రణాళిక రూపొందించుకున్నారు. ఇటీవల వచ్చిన తుపాను సమయంలో తన చాంబర్‌కే పరిమితం కాకుండా దిగువస్థాయి అధికారులకు సైతం అందుబాటులో ఉండేలా రెండు రోజులపాటు జాయింట్ కలెక్టర్ చాంబర్లో కూర్చుని విధులు నిర్వర్తించారు. క్రమంగా తనదైన తరహాలోనే ప్రతి శాఖ సమాచారం, అధికారుల పనితీరును ఆరా తీసుకుంటూ ఓ కంట కనిపెడుతుండటం వారిలో వణుకు పుట్టిస్తోంది. -
‘కొల్లేర’వుతున్నా పట్టించుకోరా?
=యథేచ్ఛగా చేపల చెరువులు తవ్వకం = నిబంధనలు గాలికి... = పట్టించుకోని అధికారగణం ముదినేపల్లి రూరల్, న్యూస్‌లైన్ : పట్టా, అసైన్డ్, పోరంబోకుతో సహా పచ్చని పైరుతో కళకళలాడుతున్న ముదినేపల్లి మండలంలోని భూములన్నీ నేడు కొల్లేరును తలపిస్తున్నాయి. ఈ ప్రాంతంలోని బడా బాబులు సెంటు భూమినీ వదలకుండా విచ్చలవిడిగా చేపలు, రొయ్యల చెరువులుగా మార్చేయడమే దీనికి కారణం. ఓ వైపు రాజ కీయ పలుకుబడి, మరోవైపు ధనబలంతో ఉన్న వారు లొంగదీసుకుంటున్నందు వల్లే సంబంధిత అధికారులు ప్రేక్షకపాత్ర వహిస్తున్నారనే ఆరోపణలున్నాయి. భూములను చెరువులుగా మార్చాలంటే చిత్తడి నేలలు మాత్రమే ఉండాలి. ఇతర భూముల్లో కానీ.. పంటభూముల్లోకానీ చెరువులు తవ్వేందుకు నిబంధనలు అనుమతించవు. అలాగే సాగునీటిని అస్సలు వినియోగించకూడదు. వీటన్నింటికీ తోడు సరిహద్దు రైతులు ఎలాంటి అభ్యంతరాలు వ్యక్తం చేయకూడదు. ఇవన్నీ ఉంటేనే మండల స్థాయి కమిటీ దరఖాస్తులు పరిశీలిస్తుంది. ఆపై డివిజన్, జిల్లా స్థాయి కమిటీలు ఆమోదించిన తరువాత మాత్రమే చెరువుల తవ్వకాలు చేపట్టాలి. మండలంలో మాత్రం ఇలాంటి నిబంధనలు ఎక్కడా పాటించడంలేదనే విమర్శలొస్తున్నాయి. అనేక గ్రామాల్లో పంట భూములన్నీ చెరువులుగా మారిపోయినా రెవెన్యూ రికార్డుల్లో మాత్రం ఇప్పటికీ ఆ భూముల్లో వరిసాగు జరుగుతున్నట్లు నమోదు చేయడం గమనార్హం. వైవాక, ఊటుకూరు, దేవపూడి, చిగురుకోట, పెదగొన్నూరు తదిత ర గ్రామాల్లో నిబంధనలు అతిక్రమించి చెరువులు తవ్వినా సంబంధిత వ్యక్తులపై ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు. పత్రికల్లో వార్తలు వెలువడిన రోజున మాత్రం మొక్కుబడిగా ఒకటి రెండు పొక్లెయిన్లు స్వాధీనం చేసుకుని నామమాత్రపు జరిమానా వేసి వదలివేస్తున్నారు. తవ్వకాలకు పెద్ద మొత్తంలో వ్యయం చేస్తున్న బడా బాబులపై ఇలాంటి జరిమానాలు ఏమాత్రం ప్రభావం చూపడంలేదు. మాట వినని రెవెన్యూ అధికారులపై రాజకీయ పలుకుబడి ఉపయోగిస్తూ భయబ్రాంతులకు గురి చేస్తున్నారు. దీంతో ఉద్యోగ భద్రతకోసం అధికారులు ప్రేక్షక పాత్ర వహిస్తూ తవ్వకాలకు పరోక్షంగా తమవంతు సహకారాన్ని అందిస్తున్నట్లు ఆరోపణలు వినవస్తున్నాయి. కొంతమంది వీఆర్వోలు బడా బాబులను రెవెన్యూ అధికారుల కార్యాలయాలకు తీసుకెళ్లి తవ్వకాలకు ఆమోద ముద్ర వేయిస్తున్నారు. పరిస్థితులు ఇదే విధంగా కొనసాగితే అతి తక్కువ కాలంలోనే మండలం మొత్తం కొల్లేరుకు ప్రతిరూపంగా మారుతుందనడంలో సందేహం లేదనే అభిప్రాయాన్ని పలువురు వ్యక్తం చేస్తున్నారు. కలెక్టర్ వెంటనే జోక్యం చేసుకుని చెరువుల తవ్వకాలపై ఉక్కుపాదం మోపాలని కోరుతున్నారు. -
'చెట్టున్నపాలెం' ఘటనలో ప్రత్యర్థులు లొంగుబాటు
ఏలూరు : పశ్చిమ గోదావరి జిల్లా భీమడోలు మండలం చెట్టున్నపాడులో చేపల చెరువుల లీజు వివాదంపై రెండు వర్గాల మధ్య జరిగిన ఘర్షణ ఘటనలో ఓ వర్గం వారు శనివారం పోలీసులకు లొంగిపోయారు. గత సోమవారం రాత్రి రెండు వర్గాల మధ్య జరిగిన ఘటనలో ముగ్గురు మృతి చెందగా, మరో ఆరుగురు తీవ్రంగా గాయపడిన విషయం తెలిసిందే. ఈ సంఘటనలో అప్పటి నుంచి పరారీలో ఉన్న ఓ వర్గం వారు ఈరోజు ఉదయం భీమడోలు పోలీస్ స్టేషన్లో లొంగిపోయారు. ఎస్ఐ సుధాకర్ వారిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. వివరాల్లోకి వెళితే చెరువు లీజు సొమ్ము విషయమై రెండువర్గాల మధ్య ఏర్పడిన వివాదం చినికిచినికి గాలివానగా మారి హత్యలకు దారితీసింది. ప్రత్యర్థుల చేతిలో గ్రామానికి చెందిన దేవదాసు లలిత్ (64) అనే వృద్ధుడు, నేతల రంగరాజు (50), బొంతు జయరాజు (50) హత్యకు గురైన విషయం తెలిసిందే. -
కొల్లేరులో రక్తచరిత్ర
భీమడోలు/ఏలూరు క్రైం, న్యూస్‌లైన్ : ప్రశాంతంగా ఉండే కొల్లేటి గ్రామం చెట్టున్నపాడు భగ్గుమంది. చెరువు లీజు సొమ్ము విషయమై రెండువర్గాల మధ్య ఏర్పడిన వివాదం చినికిచినికి గాలివానగా మారి హత్యలకు దారితీసింది. ప్రత్యర్థుల చేతిలో గ్రామానికి చెందిన దేవదాసు లలిత్ (64) అనే వృద్ధుడు, నేతల రంగరాజు (50), బొంతు జయరాజు (50) హత్యకు గురయ్యూరు. రెండువర్గాల మధ్య కక్షలను చల్లార్చలేని అధికారుల వైఫల్యం, ప్రత్యర్థుల కిరాతకం వెరసి మూడు నిండు ప్రాణాలను బలి తీసుకున్నాయి. సోమవారం అర్ధరాత్రి భీమడోలు మండలం చెట్టున్నపాడులో చోటుచేసుకున్న ఈ హత్యలు జిల్లా కేంద్రాన్ని కుదిపేశాయి. సమాచారం తెలుసుకుని రంగంలోకి దిగిన పోలీసు, రెవెన్యూ అధికారులపై బాధిత కుటుంబాలు విరుచుకుపడ్డాయి. జిల్లా కేంద్ర ప్రభుత్వాస్పత్రిలో సీఐను నిర్బంధించి ధర్నా చేశారు. తిరిగి ఊరు వెళితే ప్రత్యర్థులు చంపేస్తారని మొత్తుకున్నా పట్టించుకోని పోలీసు, రెవెన్యూ అధికారులను సస్పెండ్ చేయాలని బాధితులు ఫైర్‌స్టేషన్ వద్ద అర్థరాత్రి వరకూ మృతదేహాలతో రాస్తారోకో చేశారు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. లీజు సొమ్ము పంపకాల్లో తేడాలు భీమడోలు మండలం చెట్టున్నపాడు గ్రామస్తులకు 73 ఎకరాల చేపల చెరువులు ఉన్నాయి. దానిని గ్రామ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో లీజుకు ఇచ్చారు. అలా వచ్చిన సొమ్మును 552 వాటాలు వేసి గ్రామస్తులకు పంచుతుంటారు. ఈ వ్యవహారాన్ని గ్రామ పెద్దల కమిటీ నిర్వహించేది. కొంతకాలం క్రితం కమిటీ మారడంతో గొడవలు మొదలయ్యాయి. పాత కమిటీ, కొత్త కమిటీల మధ్య లీజు సొమ్ము పంపకాల వివాదం ఏర్పడింది. దీంతో గ్రామం రెండు వర్గాలుగా విడిపోయింది. నేతల రంగరాజు పాత కమిటీ వర్గానికి, చిగురుపాటి రత్నాకరరావు కొత్త పెద్దల కమిటీకి నేతృత్వం వహించేవారు. రెండువర్గాలు గొడవలు పడుతూనే సొమ్ములు పంచుకునేవారు. లీజు మారడంతో వివాదం ఐదేళ్ల క్రితం పైడిచింతపాడు గ్రామానికి చెందిన ముంగర వెంకటేశ్వరరావు, కూచింపూడి అచ్యుతరాజులకు సంవత్సరానికి రూ.15 లక్షల చొప్పున చెరువును లీజుకిచ్చారు. కొద్దినెలల క్రితం గడువు ముగియడంతో లీజుదారుడు ప్రస్తుత గ్రామ కమిటీ పెద్ద రత్నాకరరావు వద్దకు వెళ్లి లీజు ఒప్పం దాన్ని పొడిగించుకున్నారు. తమకు తెలియకుండా మళ్లీ లీజు ఎలా తీసుకుంటారని, కొత్త కమిటీకి ఇచ్చిన సొమ్ములో తమ వాటా తమకివ్వాలని పాత కమిటీకి చెందిన రత్నరాజు ఆగస్టు 2న లీజుదారులను అడిగారు. అయినా లీజుదారులు కొత్త కమిటీకే డబ్బు ఇచ్చారు. దీంతో రంగరాజు వర్గానికి చెందినవారు అదేరోజు లీజుదారుల ఇంటికి వెళ్లి నిలదీశారు. అక్కడ రంగరాజు వర్గానికి, లీజుదారులకు గొడవ జరిగింది. దీనిపై రంగరాజు వర్గం భీమడోలు పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. అప్పటి నుంచి ఈ రెండు వర్గాల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి నెలకొంది. కేసు పోలీస్‌స్టేషన్ నుంచి తహసిల్దార్ కార్యాలయానికి, అక్కడి నుంచి ఏలూరు ఆర్డీవో కోర్టుకు బదిలీ అయింది. మూడు నెలల నుంచి రెండువర్గాల వారు ఏలూరు ఆర్డీవో కోర్టుకు హాజరవుతూనే ఉన్నారు. వివాదం సర్దుబాటు కాలేదు. ఈ సమయంలోనే ఒకరిపై ఒకరు దాడులు చేసుకుంటూనే ఉన్నారు. ఆర్డీవో సమక్షంలోనే ఘర్షణ సోమవారం ఉదయం ఏలూరు ఆర్డీవో కోర్టుకు రెండు వర్గాలకు చెందిన వ్యక్తులు హాజరయ్యారు. రాత్రి 8 గంటల సమయంలో ఆర్డీవో శ్రీనివాస్ ఇరువర్గాలను తన కార్యాలయంలో విచారించారు. అదే సమయంలో ఏలూరు డీఎస్పీ రజనీ, భీమడోలు తహసిల్దార్ సోమశేఖర్ కూడా అక్కడ ఉన్నారు. చెరువు లీజు తదితర విషయాలను వివరిస్తూనే రెండువర్గాలు ఆర్డీవో, డీఎస్పీ ఎదుటే గొడవకు దిగారు. దీంతో ఆర్డీవో శ్రీనివాస్ రెండువర్గాల వారిని బయటకు పంపివేసి కేసును టి. నర్సాపురం కోర్టుకు ఈ నెల 26కి వాయిదా వేశారు. బయటకు వచ్చిన వెంటనే రెండువర్గాల వారు మళ్లీ గొడవపడ్డారు. ఈ సమయంలోనే రత్నాకరరావు అతని అనుచరులు గ్రామంలోకి అడుగుపెడితే చంపేస్తామని రంగరాజు వర్గాన్ని బెదిరించినట్టు బాధితులు చెబుతున్నారు. పట్టించుకోని పోలీసులు ప్రత్యర్థి వర్గం బెదిరింపులతో భయపడిన రంగరాజు వర్గీయులు ప్రత్యర్థులు తమను చంపడానికి ప్రయత్నిస్తున్నారని, రక్షణ కల్పించాలని బయటకు వస్తున్న డీఎస్పీ రజనీని అడిగారు. ఆమె పట్టించుకోకుండా వెళ్లిపోవడంతో రంగరాజు వర్గంలోని జయరాజు, లలిత్, రాజ్‌కుమార్, బాబూరావు, జోజప్ప, జయమ్మ సోమవారం రాత్రి 11 గంటల సమయంలో ఏలూరు నుంచి నాలుగు మోటార్ సైకిళ్లపై చెట్టున్నపాడు బయలుదేరారు. వారు గ్రామంలోకి వస్తున్నట్టు ప్రత్యర్థి వర్గానికి సమాచారం అందింది. గ్రామ శివారున గల ఒక పాకలో మాటువేసిన ప్రత్యర్థులు సరుగుడు బాదులు, కర్రలతో దాడి చేసి ఇష్టం వచ్చినట్టు కొట్టారు. రక్తపుమడుగులో స్పృహతప్పి పడి ఉన్న వారిని చాలాసేపు కొట్టారని బతికిబయటపడిన వారు రోదిస్తూ చెబుతున్నారు. కొద్దిసేపటికి అందులో ఒకరు గ్రామంలోకి వెళ్ళి విషయాన్ని చెప్పడంతో వారు భీమడోలు పోలీస్‌స్టేషన్‌కు సమాచారం ఇచ్చారు. వారు స్పందించకపోవడంతో 100కి ఫోన్ చేశారు. ఈలోపు ప్రత్యర్థులు గ్రామంలో ఉన్న రంగరాజు మనుషుల ఇళ్లకు వెళ్లి దాడులు చేశారు. కొంతసేపటి తర్వాత గ్రామం నుంచి రంగరాజు వర్గం మనుషులు ఘటనా స్థలానికి చేరుకుని రక్తపుమడుగులో పడి ఉన్న వారిని ఆటోల్లో ఏలూరు ప్రభుత్వాసుపత్రికి తీసుకెళ్లారు. అప్పటికే రంగరాజు, జయరాజు మృతి చెందారని వైద్యులు ధ్రువీకరించారు. లలిత్, రాజ్‌కుమార్ బాబూరావు, జోజప్ప పరిస్థితి ఆందోళనకరంగా ఉండటంతో గుంటూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. మార్గమధ్యంలో లలిత్ మృతి చెందడంతో అతన్ని తిరిగి ఏలూరు ప్రభుత్వాసుపత్రికి తీసుకొచ్చారు. ఆస్పత్రి వద్ద ఉద్రిక్తత తమవారు మృతి చెందడంతో బాధిత కుటుంబాలకు చెందినవారు జిల్లా కేంద్ర ప్రభుత్వాసుపత్రి వద్దకు చేరుకుని భోరున విలపించారు. ప్రత్యర్థుల చేతిలో మృతి చెందిన జయరాజు, రంగరాజు, లలిత్ కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులు, గ్రామస్తులు పోలీసులపై విరుచుకుపడ్డారు. పోలీసులు పట్టించుకోకపోవడం వల్లే తమ వారు చనిపోయారని, ఏలూరు డీఎస్పీ, భీమడోలు సీఐ, ఎస్ఐలను వెంటనే సస్పెండ్ చేయాలంటూ ఆందోళనకు దిగారు. ఇంతలో భీమడోలు సీఐ భాస్కరరావు ఆసుపత్రికి చేరుకోవడంతో బాధితులు ఆయనను ఓపీ రూంలో నిర్బంధించారు. తమకు న్యాయం చేసేవరకూ సీఐను వెళ్లనీయమని విరుచుకుపడ్డారు. బాధితులపై విరుచుకుపడిన పోలీసులు బాధితుల ఆందోళన అదుపు తప్పుతుందనే అంచనాతో పోలీసు ఉన్నతాధికారులు మరో బెటాలియన్‌ను రంగంలోకి దించారు. బాధితులు వారిని చూసి మరింత రెచ్చిపోయారు. దీంతో పోలీసులు, బాధితుల మధ్య తోపులాట జరిగింది. చివరకు పోలీసులు బాధితులను ఆస్పత్రి బయటకు పంపిం చడంతో పరిస్థితి సద్దుమణిగింది. మృతదేహాలకు పోస్టుమార్టం చేసి వారి కుటుంబ సభ్యులకు అప్పగించారు. మృతదేహాలతో అర్ధరాత్రి వరకూ రాస్తారోకో మృతదేహాలను ఫైర్‌స్టేషన్ సెంటర్లో ఉంచి చెట్టున్నపాడు గ్రామస్తులు ఆందోళనకు దిగారు. మూడు మృతదేహాలను మూడువైపులా ఉంచి రాస్తారోకో చేశారు. అధికారులు ఎంతగా బతిమిలాడినా వినలేదు. డీఎస్పీ రజని, సీఐ భాస్కరరావును సస్పెండ్ చేస్తేనే ఆందోళన విరమిస్తామని తెగేసి చెప్పారు. రాత్రి 9.30 గంటల సమయంలో డీఆర్వో ప్రభాకరరావు మాట్లాడినా వినకపోవడంతో కలెక్టర్ సిద్ధార్థజైన్, ఎస్పీ హరికృష్ణ బాధితులతో చర్చలు జరిపారు. కలెక్టర్ హామీతో ఆందోళన విరమణ రాత్రి 10.30 గంటల వరకు రాస్తారోకో కొనసాగగా అక్కడకు చేరుకున్న జిల్లా కలెక్టర్ సిద్ధార్థజైన్ మృతుల కుటుంబాలకు రూ.5లక్షలు చొప్పున ఎక్స్‌గ్రేషియా చెల్లిస్తామని హామీ ఇచ్చారు. డీఎస్పీ, సీఐలపై దర్యాప్తు చేసి చర్యలు తీసుకుంటామని కలెక్టర్, జిల్లా ఎస్పీ హరికృష్ణ చెప్పారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం చేయిస్తామని హామీ ఇవ్వడంతో బాధిత కుటుంబాలు, గ్రామస్తులు ఆందోళనను విరమించారు. -
చేపల చెరువుల లీజు చిచ్చు, ముగ్గురు మృతి
ఏలూరు : పచ్చని కొల్లేరులో చిచ్చు రేగింది. చేపల చెరువుల లీజు విషయంలో రెండు వర్గాల మధ్య ఘర్షణ జరిగి ముగ్గురు మృతి చెందగా, ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారు. పశ్చిమగోదావరిజిల్లా భీమడోలు మండలం చెట్టున్నపాడు గ్రామంలో ఈ ఘటన చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన సుమారు 80 ఎకరాల చేపల చెరువుల లీజు విషయంపై గత ఏడాది కాలంగా గ్రామంలోని రెండు వర్గాల మధ్య వివాదం నడుస్తోంది. చేపల చెరువుపై వచ్చే ఆదాయం తమకు చెందాలంటే తమకే చెందాలని రెండు వర్గాలు కూడా పట్టుపడుతున్నాయి. ఈ వివాదం ఆర్డీవో దృష్టి వరకు వెళ్లినా లాభం లేకపోయింది. గత ఏడాది ఈ వివాదం ముదిరి గ్రామంలోని ఒక వర్గానికి చెందిన 12 కుటుంబాలను వెలివేశారు. ఇదే విషయమైన ఆర్డీవో కోర్టులో వివాదం నడుస్తున్నా ఇంతవరకూ ఏమీ తేలలేదు. దీంతో రెండో వర్గానికి చెందిన కొందరు తమకు న్యాయం జరగట్లేదంటూ ... అధికారులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు రెవెన్యూ, పోలీసులు చర్యలు తీసుకునేలోపే ఫిర్యాదుచేసిన వారిపై ఇనుపరాడ్లు, కర్రలు, కత్తులతో దాడి జరిగింది. ఈ ఘటనలో బొంతు జయరాజు, నేతల రంగరాజు, దేవదాసు లలిత మృతి చెందారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే రంగంలోకి దిగారు. డిఎస్పీ ఆధ్వర్యంలో పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేసి పరిస్ధితిని సమీక్షిస్తున్నారు. గాయపడినవారిని చికిత్స నిమిత్తం ఏలూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. వారిలో ఇద్దరి పరిస్థితి ఆందోళనకరంగా ఉండటంతో మెరుగైన చికిత్స నిమిత్తం విజయవాడ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. -
కన్నీటి కొల్లేరు