నో నెట్‌వర్క్‌.. ఓన్లీ వర్క్‌! | Ram Charan enjoying shoot at Kolleru lake | Sakshi
Sakshi News home page

నో నెట్‌వర్క్‌.. ఓన్లీ వర్క్‌!

Published Wed, Apr 19 2017 11:17 PM | Last Updated on Tue, Sep 5 2017 9:11 AM

నో నెట్‌వర్క్‌.. ఓన్లీ వర్క్‌!

నో నెట్‌వర్క్‌.. ఓన్లీ వర్క్‌!

ఓ ఎస్సెమ్మెస్‌ అలర్ట్‌ లేదు... వాట్సాప్‌ చాటింగ్‌ లేదు... మనుషులంతా మొబైల్స్‌తో మింగిల్‌ అవుతోన్న ఈ రోజుల్లో ఎవరి చేతుల్లోనూ ఫోనులే లేవు. మొన్నటి వరకూ రామ్‌చరణ్‌ హీరోగా సుకుమార్‌ దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్‌ సంస్థ నిర్మిస్తున్న సినిమా షూటింగ్‌ లొకేషన్‌లో కనిపించిన దృశ్యమిది. ఓ ఇరవై రోజుల పాటు సెల్‌ఫోన్‌ సిగ్నల్స్‌ లేనిచోట షూటింగ్‌ చేశారు. లొకేషన్‌ కొల్లేరుకు షిఫ్ట్‌ అయిన తర్వాత సిగ్నల్స్‌ వచ్చాయి.

దీనిపట్ల సినిమాటోగ్రాఫర్‌ రత్నవేలు స్పందిస్తూ – ‘‘20 రోజులు చేతిలో మొబైల్‌ లేకపోవడం పీడకలలా అనిపించింది. సిటీకి వచ్చిన తర్వాత మొబైల్‌ డిటాక్స్‌ మంచిదే అనిపించింది’’ అన్నారు. ప్రస్తుతం కొల్లేరులో చరణ్, ఇతర నటీనటులపై కీలక సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు. మరో వారం రోజులు గోదావరి జిల్లాల్లో చిత్రీకరణ జరుపుతారట. సమంత హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్‌ స్వరకర్త.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement