కైకలూరు: కొల్లేరు ప్రజలకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పాలనలో మంచి రోజులు వచ్చాయి. చిరకాల కలగా మిగిలిన సర్కారు కాల్వపై వారధి ప్రారంభానికి సిద్ధమైంది. సమీప జిల్లాల్లో ఎక్కడా లేనివిధంగా పెద్దింట్లమ్మ దేవస్థానం వద్ద అతిపెద్ద అనివేటి మండప నిర్మాణం పనులు శరవేగంగా జరుగుతున్నాయి. సర్కారు కాల్వ వారధికి దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ వారధిగా పేరు ఖరారు చేయడానికి ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నారు.
కొల్లేరు ప్రజలను కేవలం ఓటు బ్యాంకుగా మాత్రమే గత ప్రభుత్వం భావించింది. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం అక్కడి ప్రజల సంక్షేమానికి పెద్దపీట వేస్తోంది. కొల్లేరు ప్రజల ప్రధాన వృత్తి చేపల సాగు. ఎన్నికలకు ముందు పాదయాత్రలో ఆక్వా రైతులకు విద్యుత్ యూనిట్ చార్జీలను తగ్గిస్తానని సీఎం జగన్ మోహన్‌రెడ్డి వాగ్దానం చేశారు. అధికారంలోకి రాగానే ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారు.
టీడీపీ పాలనలో యూనిట్ ధర రూ.3.85 ఉండగా జగన్ ప్రభుత్వం రూ.1.50కే యూనిట్ విద్యుత్‌ను సరఫరా చేస్తోంది. కొల్లేరు గ్రామాల్లో గడపగడపకూ మన ప్రభుత్వం నిధుల ద్వారా సీసీ రోడ్లను నిర్మిస్తున్నారు. సచివాలయాలు, రైతుభరోసా కేంద్రాలు, నాడు–నేడులో పాఠశాలల నిర్మాణాలు కొల్లేరు గ్రామాల్లో పెద్ద ఎత్తున జరుగుతున్నాయి.
వారధి కల సాకారం
దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి కొల్లేరు ప్రజల సమస్యల పరిష్కారానికి కృషి చేశారు. కొల్లేరు అభయారణ్య పరిధిని తగ్గిస్తూ అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి నివేదించారు. కొల్లేరు ఆపరేషన్ తర్వాత రూ.3,500 కోట్ల పునరావాస ప్యాకేజీని ప్రజలకు అందించారు.
ప్రధానంగా కొల్లేరు ప్రజల చిరకాల కల సర్కారు కాల్వపై వారిధి నిర్మాణానికి 2009లో రూ.12 కోట్లను వైఎస్ కేటాయించారు. ఆయన ఆకస్మిక మరణం తర్వాత పనులు జరగలేదు. గత ప్రభుత్వం అంచనాలు పెంచి రూ.14.70 కోట్లు కేటాయించిన పనులను పూర్తి చేయలేదు. సీఎం ప్రత్యేక శ్రద్ధతో స్థానిక ఎమ్మెల్యే డీఎన్నార్ వారధి నిర్మాణాన్ని పూర్తి చేయించారు. తుది పనులు పూర్తికావడంతో ప్రారం¿ోత్సవ తేదీ ప్రకటించనున్నారు.
అతిపెద్ద అనివేటి మండపం..
ఏలూరు జిల్లా కైకలూరు మండలం కొల్లేటికోట పెద్దింట్లమ్మ దేవస్థానం అతి పురాతనమైనది. గత ప్రభుత్వ పాలనలో అమ్మవారి దర్శనానికి వచ్చే భక్తులు ఎండలో నిలబడాల్సి వచ్చేది. ఎమ్మెల్యే డీఎన్నార్ ప్రత్యేక శ్రద్ధ వల్ల ప్రజా విరాళాలు దాదాపు రూ.5 కోట్లతో సమీప జిల్లాల్లో ఎక్కడా లేని విధంగా 305 మీటర్ల పొడవు, 105 మీటర్ల వెడల్పుతో భారీ అనివేటి మండపం పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ప్రధాన పనులు పూర్తయ్యాయి. వివిధ రకాల శిల్పాలను కళాకారులు సిద్ధం చేస్తున్నారు. అదే విధంగా అమ్మవారి జాతరలో కలవబోనాలను అతి వైభవంగా నిర్వహిస్తున్నారు.
భక్తుల సంఖ్య పెరుగుతోంది
పెద్దింట్లమ్మ దేవస్థాన అబివృద్ధికి ఎమ్మెల్యే డీఎన్నార్ విశేష కృషి చేస్తున్నారు. అతిపెద్ద అనివేటి మండపం త్వరలో పూర్తికానుంది. వారధి నిర్మాణం పూర్తికావడంతో ఏలూరు జిల్లా ప్రధాన కేంద్రానికి అమ్మవారి దేవస్థానం మీదుగా వాహనాలు చేరే అవకావం ఉంటుంది. దీంతో కొల్లేరు పర్యాటకాభివృది్థతో పాటు అమ్మవారి దేవస్థానానికి నేరుగా బస్సు సౌకర్యం ఏర్పడుతోంది. – కేవీ.గోపాలరావు, పెద్దింట్లమ్మ దేవస్థాన ఈవో, కొల్లేటికోట
Comments
Please login to add a commentAdd a comment