
కొల్లేరులో 'చేపల చెరువుల' రగడ
కొల్లేరు(ప.గో):కొల్లేరులోని చేపల చెరువుల రగడ మరోసారి రాజుకుంది. దెందులూరు మండలంలోని ప్రత్తికోలలంక గ్రామంలో చేపల చెరువుల వ్యవహారంపై సోమవారం ఇరు వర్గాల మధ్య చోటు చేసుకుంది. ఈ ఘర్ణ కాస్తా తీవ్ర రూపం దాల్చడంతో స్థానికంగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో అక్కడ భారీగా పోలీసుల మోహరించి పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు యత్నిస్తున్నారు.