
సాక్షి,విజయవాడ: కొల్లేరు వాసులు భయం గుప్పిట్లో ఉన్నారు.కొల్లేరు పరివాహక ప్రాంతంలోని చిన్న అడ్లగడ్డ వద్ద రోడ్డుపై నీరు ప్రవహిస్తోంది. బుడమేరు నుంచి కొల్లేరుకు లింకుండడంతో కొల్లేరుకు నీటి ప్రవాహం ప్రస్తుతం భారీగా వస్తోంది.
బుడమేరులో రెండో గండిని పూడ్చివేశారు. మూడో గండిని పూడ్చేందుకు అప్రోచ్‌రోడ్డును నిర్మిస్తున్నారు. మూడో గండిని పూడ్చివేస్తే విజయవాడకు ముంపు ముప్పు తప్పనుందని చెబుతున్నారు. అయితే కొల్లేరుకు వరద పెరిగే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది.
