
సాక్షి, పశ్చిమ గోదావరి: దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి పాలనలో కొల్లేరు ప్రాంతాల ప్రజలు ధైర్యంగా ఉన్నారని వైఎస్సార్ సీపీ నేతలు ఆళ్ల నాని, కోటగిరి శ్రీధర్, కొఠారు అబ్బయ్య చౌదరి, పుప్పాల వాసుబాబు, దూలం నాగేశ్వరరావు వ్యాఖ్యానించారు. గురువారం కొల్లేరు నేతల సమావేశంలో వైఎస్సార్ సీపీ నేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. కొల్లేరు గ్రామంలో మంచి నీటి సమస్య తీరుస్తామని హామీ ఇచ్చారు. కొల్లేరు డెవలప్‌మెంట్ బోర్డును పునరుద్ధరిస్తామని భరోసా ఇచ్చారు.
తెలుగుదేశం పార్టీ కొల్లేరు అంటే ఆదాయ వనరులుగా, ఆ ప్రాంత భూములను ఎలాగ కాజేయాలని చూస్తున్నారంటూ మండిపడ్డారు. మళ్లీ కొల్లేరుకు పూర్వవైభవం రావాలంటే వైఎస్ జగన్‌మోహన్ రెడ్డితోనే సాధ్యం అవుతుందని స్పష్టం చేశారు. కొల్లేరు సమస్యలు పూర్తి స్థాయిలో పరిష్కారం చేస్తామని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment