West godawari
-
నా చివరి శ్వాస వరకు వైఎస్ఆర్సీపీలోనే
సాక్షి, పశ్చమ గోదావరి: తాను పార్టీ మారుతున్నానంటూ వస్తున్న వార్తల్లో నిజం లేదని జిల్లా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ బీసీ సెల్ అధ్యక్షుడు ఘంటా ప్రసాదరావు తెలిపారు. బుధవారం ఆయాన మీడియాతో మాట్లాడుతూ... నా చివరి శ్వాస ఉన్నంత వరకు వైఎస్ఆర్సీపీలోనే కొనసాగుతానని అన్నారు. కొంత మంది టీడీపీ నేతలు కావాలనే తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని ధ్వజమెత్తారు. తెలుగుదేశం పార్టీ నాయకులు తప్పుడు ప్రచారాలు చేయడం మానుకోవాలని హెచ్చరించారు. ఇలాంటి తప్పుడు ప్రచారాలను ప్రజలు నమ్మొద్దాన్నారు. తాను పార్టీ మారే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. -
‘ఆయన సీఎం కావాలని కోరుకుంటున్నారు’
సాక్షి, పశ్చిమ గోదావరి : ఏలూరు నగరంలో టీడీపీకి షాక్ తగిలింది. ఏలూరు మేయర్ నూర్జహాన్ వర్గానికి చెందిన నలుగురు టీడీపీ కార్పొరేటర్లు వైఎస్సార్ సీపీ ఎమ్మెల్సీ ఆళ్ల నాని సమక్షంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఏలూరు కార్పొరేషన్ మాజీ డిప్యూటీ మేయర్ మరియు కార్పొరేటర్ గుడివాడ రామచంద్ర కిషోర్, ఏలూరు కార్పొరేషన్.. కార్పొరేటర్లు జిజ్జువరపు ప్రతాప్, రేవులగడ్డ జాన్సిలక్ష్మిభాయ్, గాడి నాగమణిలు ఏలూరు మేయర్ నూర్జహాన్, పెదబాబు దంపతుల ఆధ్వర్యంలో ఎమ్మెల్సీ ఆళ్ల నాని సమక్షంలో వైఎస్సార్ సీపీలో చేరారు. ఆళ్ల నాని వారిని వైఎస్సార్ సీపీ కండువా వేసి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా మేయర్ నూర్జహాన్, పెదబాబు దంపతులు మీడియాతో మాట్లాడుతూ.. ‘‘ఐదు సంవత్సరాల మేయర్ పదవీ కాలంలో పార్టీల కతీతంగా ఎంతో సేవ చేశాం. తెలుగుదేశం పార్టీలో ఎన్నో అవమానాలకు గురయ్యాం. రాష్ట్ర ప్రజలు, ఏలూరు ప్రజలు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కావాలని గట్టిగా కోరుకుంటున్నారు. ఐదేళ్లలో వచ్చిన మా జీతాన్ని సైతం పేద ప్రజల సంక్షేమంకోసం వెచ్చిచాం. ఐదేళ్ల పదవీకాలంలో ఏనాడూ అధికార దుర్వినియోగానికి పాల్పకుండా నిజాయితీగా పనిచేశాం. రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసం వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేసిన పాదయాత్ర మాకు స్ఫూర్తి. వైఎస్ జగన్‌తోనే రాష్ట్రంలో అభివృద్ధి సాధ్యం. మాతో పాటు ఏలూరు కార్పొరేషన్ నలుగురు కార్పొరేటర్లు నాని సమక్షంలో చేరారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలను కలుపుకుని ఆళ్ల నాని గెలుపుకు కలిసి పనిచేస్తాం’’మని అన్నారు. -
వైఎస్ జగన్‌తోనే మైనార్టీల అభివృద్ధి సాధ్యం
సాక్షి, గుంటూరు : జిల్లాలోని వినుకొండలో ముస్లిం మైనార్టీల ఆత్మీయ సమావేశం జరిగింది. వైఎస్ఆర్ సీపీ నేత బొల్లా బ్రహ్మనాయుడు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో, మైనార్టీ సెల్ జాతీయ అధ్యక్షులు రెహమాన్, ఏపీ రాష్ట్ర అధ్యక్షులు ఖాదర్ బాషా, ఎమ్మెల్యే ముస్తఫా, పార్టీ నేతలు శ్రీకృష్ణదేవరాయలు ప్రసంగించారు. వైఎస్ జగన్‌తోనే మైనార్టీల అభివృద్ధి సాధ్యమని నేతలు అన్నారు. మైనార్టీలందరూ వచ్చే ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని కోరారు. కార్యకర్తల ఆత్మీయ సమావేశం పశ్చిమ గోదావరి : దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి తన ఓంట్లో, ఇంట్లో ఉంటారని, అందుకే తన మనవడికి వైఎస్సార్ పేరు పెట్టుకున్నానని వైఎస్సార్సీపీ నేత రఘురామ కృష్టంరాజు తెలిపారు. ఆదివారం కాళ్ల మండలంలో రఘురామ కృష్టంరాజు ఆధ్వర్యంలో కార్యకర్తల ఆత్మీయ సమావేశం జరిగింది. ఈ కార్యక్రమానికి పార్టీ నేతలు గ్రంధి శ్రీనివాస్ మోసేన్‌రాజుతో పాటు పలువురు నేతలు కార్యకర్తలు హాజరయ్యారు. ఈ సందర్భంగా రఘురామ కృష్టంరాజు మాట్లాడుతూ.. చంద్రబాబు నాయుడుకి ఓటమి అర్థమయ్యే.. వైఎస్సార్ సీపీ కార్యకర్తలు, సానుభూతిపరుల ఓట్లను తొలగిస్తున్నారని విమర్శించారు. ఫారం- 7 పేరుతో రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న కుట్రలను ప్రతి ఒక్కరు గమనించి, తమ ఓటు ఉందో లేదో చూసుకోవాలని రఘురామ సూచించారు. ప్రతి ఒక్కరు వచ్చే ఎన్నికల్లో వైఎస్సార్ సీపీ విజయానికి కృషి చేయాలని కార్యకర్తలకు రఘురామ పిలుపునిచ్చారు. -
మహిళపై దాడి.. అవమానం భరించలేక..
సాక్షి, పశ్చిమ గోదావరి : ఓ మహిళపై కొందరు వ్యక్తులు దాడికి పాల్పడటంతో ఆమె అవమానం భరించలేక ఆత్మహత్య చేసుకుంది. ఈ సంఘటన పశ్చిమ గోదావరి జిల్లాలో గురువారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. షేక్ సిద్దయ్య అనే వ్యక్తి కనబడటం లేదని, దీనికి పెంటపాడు మండలం ప్రత్తిపాడుకు చెందిన బాదవతి మంగతాయారు కారణమంటూ ఆమె, ఆమె కుటుంబంపై తాడేపల్లిగూడెం పట్టణం జువ్వలపాలెంకు చెందిన ఆరుగురు వ్యక్తులు నిన్న రాత్రి కర్రలతో దాడి చేశారు. ఈ అవమానం తట్టుకోలేక మనస్తాపంతో మంగతాయారు పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేసింది. ఆపస్మారక స్థితిలో ఉన్న ఆమెను తాడేపల్లిగూడెం ఏరియా ఆసుపత్రికి తీసుకెళుతుండగా మార్గం మధ్యలో మృతి చెందింది. మంగతాయారు మృతికి షేక్ సిద్దయ్య కుమార్తె, కోడళ్లు, కొడుకులు వారి కుటుంబ సభ్యులే కారణమంటూ మంగతాయారు కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. పెంటపాడు పోలీసులు మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించి, కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. -
‘రెండు నెలల్లో వైఎస్ జగన్‌ను సీఎంగా చూస్తాం’
సాక్షి, పశ్చిమ గోదావరి : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిని రాబోయే రెండు నెలల్లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చూస్తామని వైఎస్సార్సీపీ నేత రఘురామ కృష్ణంరాజు ధీమా వ్యక్తం చేశారు. శుక్రవారం కాళ్ళ మండలం పెద అమిరంలో రఘురామ కృష్ణంరాజు ఆధ్వర్యంలో నరసాపురం పార్లమంటరీ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తల ఆత్మీయ సదస్సు జరిగింది. ఈ కార్యక్రమంలో ముదునూరి ప్రసాదరాజు, కారిమూరి నాగేశ్వరరావు, గుణ్ణం నాగబాబు, గుబ్బల తమ్మయ్య, పాతపాటి సర్రాజు, గూడూరి ఉమాబాల, దాట్ల రంగమ్మ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా 2000 మంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు వైఎస్సార్ సీపీలో చేరారు. తెలుగు యువత సభ్యులు కళ్లేపల్లి సతీష్ రాజు, వాండ్రం సర్పంచ్ గడి గోవిందం, ఎంపీటీసీ నర్సే భారతి, పలువురు సర్పంచ్‌లు, ఎంపీటీసీలు వైఎస్సార్ సీపీలో చేరారు. ఈ సందర్భంగా రఘురామ కృష్ణంరాజు మాట్లాడుతూ.. అనేక మంది తెలుగుదేశం పార్టీ పెద్ద నాయకులు ఎన్నికల కోడ్ అమలులోకి రాగానే వైఎస్సార్ సీపీ తీర్థం పుచ్చుకోనున్నారని చెప్పారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజున తన సొంత గూటికి వచ్చి మహిళల మధ్య ఆత్మీయ సదస్సు నిర్వహించడం శుభ సూచికమన్నారు. నరసాపురం పార్లమెంట్‌లోని ఏడు నియోజక వర్గాల్లో వైఎస్సార్ సీపీ విజయఢంకా మోగించడం ఖాయమన్నారు. -
చెల్లింపులేవి బాబూ!
సాక్షి ప్రతినిధి, ఏలూరు, ఆకివీడు: ధాన్యం కొనుగోలు కేంద్రాలు నిర్వహిస్తున్న డ్వాక్రా సంఘాలకు అన్యాయం జరుగుతోంది. మహిళల కష్టార్జితానికి రెక్కలు వస్తున్నాయి. మహిళల సాధికారతకు కట్టుబడి ఉన్నట్టు చెప్పుకుంటున్న రాష్ట్ర ప్రభుత్వం వారికి ఇవ్వాల్సిన డబ్బులు దారి మళ్లిస్తోంది. టీడీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత పార్టీ నాయకులకు ఇసుక ర్యాంపులు అప్పగించి డబ్బులు కూడబెట్టుకునేలా చేశారు. ఇక ధాన్యం కొనుగోలు కేంద్రాల నిర్వహణ ద్వారా వచ్చే డబ్బులను డ్వాక్రా సంఘాలకు ఇవ్వకుండా ప్రభుత్వమే వాడేస్తోంది. పశ్చిమగోదావరి జిల్లాలో సుమారు 193 ధాన్యం కొనుగోలు కేంద్రాలు డ్వాక్రా మహిళల ఆధీనంలో నడుస్తున్నాయి. కొనుగోలు చేసిన ధాన్యం క్వింటాలుకు రూ.30 చొప్పున కమీషన్ రూపంలో కేంద్రాలకు చెల్లిస్తారు. నాలుగేళ్లుగా సుమారు లక్ష మెట్రిక్ టన్నులకుపైగా ధాన్యాన్ని కొనుగోలు చేశారు. ఈ ప్రకారంగా కేంద్రాలకు రూ.36 కోట్లు కమీషన్లుగా ఆయా డ్వాక్రా గ్రూపులకు మంజూరయ్యాయి. ఈ ఐకేపీ కేంద్రాల ద్వారా ధాన్యం కొనుగోలు కేంద్రాలకు గత 2014–15, 15–16 సంవత్సరాల్లో రూ.16 కోట్లు కమీషన్ల రూపంలో సివిల్‌సప్లయిస్ శాఖ డీఆర్డీఏకు బదిలీ చేసింది. గ్రామ సంఘాల పరిధిలోని మహిళలు కమీషన్ సొమ్మును పంచుకోవలసి ఉంది. 2016–17, 17–18 సంవత్సరాలకు మరో రు.20 కోట్లు కమీషన్ల రూపంలో పౌరసరఫరాల శాఖ నుండి రావాల్సి ఉంది. వీటిని కూడా ఎన్ఆర్ఈజీఎస్ నిధులతో కలిపి భవనాల నిర్మాణాలకు మళ్లించేశారు. ఐకేపీ కేంద్రాల నుంచి మిల్లర్లకు సరఫరా చేసేందుకు ఇవ్వాల్సిన రవాణా ఖర్చులను కూడా వారికి ఇవ్వడం లేదు. గత నాలుగున్నరేళ్లుగా మహిళలకు కమీషన్ల రూపంలో ఒక్క పైసా చెల్లించిన దాఖలాలు లేవు. కేంద్రాల్లో పనిచేసే మహిళలకు మాత్రం ప్రతి రోజూ రూ.500 చొప్పున కూలి కేటాయించి చెల్లిస్తున్నారు. వీటితో పాటు ఆఫీసు మెయింటెనెన్స్, అద్దెలు తదితర వాటికి బిల్లులు చెల్లిస్తున్నారు. మిగిలిన సొమ్ము ప్రభుత్వం దారి మళ్లించి, ప్రభుత్వ కార్యకలాపాలకు వినియోగిస్తోంది. ఒకొక్క గ్రామ సంఘ భవనానికి రూ. 6 లక్షలు, మరో రూ.6 లక్షలు జాతీయ గ్రామీణ ఉపాధి పథకం నిధులు, మండల సమాఖ్య భవనానికి రూ.7 లక్షలు కమీషన్ సొమ్ముతో పాటు జాతీయ గ్రామీణ ఉపాధి పథకం నిధులు రూ.13 లక్షలు కలిపి రూ.20 లక్షలతో మండల సమాఖ్య భవనాలు నిర్మిస్తున్నారు. జిల్లాలో ఇప్పటి వరకూ 700 భవనాల నిర్మాణం వివిధ దశల్లో ఉండగా, 184 గ్రామ సంఘ భవనాలు నిర్మాణం పూర్తి చేసుకున్నాయి. నిర్వహణ ఖర్చులపై ఆసక్తి ఉదయం 9 గంటల నుండి సాయింత్రం 5 గంటల వరకూ ఐకేపీ కేంద్రాల్లో ఉంటూ, ధాన్యం కొనుగోలు నిర్వహణ బాధ్యతలు చేపట్టడంతో మహిళలకు రూ.500 కూలి చెల్లిస్తున్నారు. దీంతో అక్కడ పనిచేసే మహిళలు కనీసం కూలి డబ్బు అయినా వస్తుందని ఆశతో పని చేస్తున్నారు. నిర్వహణ వ్యయం ప్రభుత్వం చెల్లించడంతో ఆ సొమ్ముతో డ్వాక్రా మహిళల్లో విభేదాలు కూడా తలెత్తుతున్నాయి. పర్మినెంట్ అవుతుందని ఆశ ఐకేపీ కేంద్రాల్లో పనిచేస్తే తమ ఉద్యోగాలు పర్మినెంట్ చేస్తారని కొంత మంది మహిళలు ఆశతో కేంద్ర నిర్వహణకు ఆసక్తి చూపుతున్నారు. గ్రామ సమాఖ్యలోని సభ్యులు నిర్వహణా బాధ్యతల కోసం ఆరాటపడుతున్నారు. ఏటా నిర్వహణ బాధ్యతను కొత్త గ్రూపులకు ఇవ్వాల్సి ఉండగా, స్థానిక తెలుగుదేశం నాయకులు, ప్రజాప్రతినిధులు తమకు ఇష్టమైన గ్రూపులకు కేటాయించి కేంద్రాలపై అజమాయిషీ పొందుతున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. పంచాయతీలకు కేటాయింపు పంచాయతీల్లో ఫర్నిచర్ కొనుగోలుకు రూ.2 లక్షల చొప్పున ఐకేపీ కమీషన్ల సొమ్మును దారి మళ్లించారు. పంచాయతీల పరిధిలో ఈపోస్, కంప్యూటర్లు, ఫర్నిచర్, ప్రింటర్ తదితర వాటిని కొనుగోలు చేశారు. ఆయా ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ పంచాయతీలకు చేరింది. ఇసుక అమ్మకాలపైనా ఇదే దందా! డ్వాక్రా మహిళలకు ఇసుక ర్యాంపులు కేటాయించి వారిని ఆర్థికంగా బలోపేతం చేస్తామని ప్రభుత్వం భజన చేసింది. అయితే ఇసుక అమ్మకాలపై తెలుగు తమ్ముళ్లు మహిళా గ్రూపుల్లో తలదూర్చి వారిని పక్కనపెట్టి ఇసుక మాఫియాను ఏర్పాటు చేశారు. దీంతో ఇసుక ర్యాంపుల కేటాయింపును ప్రభుత్వం రద్దు చేసింది. తదనంతరం మాఫియా గుప్పిట్లోకి ఇసుక ర్యాంపులు వెళ్లిపోయాయి. కమీషన్ సొమ్ము ఉచితంగా ఇవ్వరు గ్రామ సంఘాలకు వచ్చే కమీషన్ సొమ్మును వ్యక్తిగతంగా పంపిణీ చేయరు. ఆ సొమ్ము గ్రామ సంఘాల ఖాతాల్లో నిల్వ ఉంటుంది. వడ్డీలకు తీసుకుని సభ్యులు వినియోగించుకోవచ్చు. నాలుగున్నర ఏళ్లుగా కమీషన్ సొమ్ము ఎవరికీ పంచలేదు. గ్రామసంఘాల, మహిళా సమాఖ్య భవనాలకు రూ. 6 లక్షలు, పంచాయతీలలో ఇన్ఫ్రాస్ట్రక్చర్కు రూ.2 లక్షలు చొప్పున కేటాయించాం. – వడ్డి రాజ్యలక్ష్మి, అధ్యక్షురాలు, మహిళా సమాఖ్య, ఆకివీడు -
రెస్టారెంట్లో భారీ పగుళ్లు..
-
రెస్టారెంట్లో భారీ పగుళ్లు.. పరుగులు తీసిన సిబ్బంది
సాక్షి, పశ్చిమ గోదావరి : పోలవరం ప్రాజెక్టు సమీపంలో భారీగా పగుళ్లు ఏర్పడ్డాయి. 48 గంటలు కూడా గడవక ముందే మరోసారి ప్రాజెక్టు స్పిల్‌వే రెస్టారెంట్ వద్ద భూమి కంపించి పగుళ్లు సంభవించాయి. పోలవరం ప్రాజెక్ట్ సమీపంలో ఉన్న రెస్టారెంట్ లోపల సైతం భయంకరంగా పగుళ్లు ఏర్పడ్డాయి. దీంతో రెస్టారెంట్ సిబ్బంది భయకంపితులై బయటకు పరుగులు తీశారు. ఆ తర్వాత పోలవరం రోడ్లపైనా పగుళ్లు ఏర్పడ్డాయి. అయితే కొన్ని నెలల క్రితం కూడా పోలవరం రోడ్డుపై పగుళ్లు ఏర్పడినా, ప్రభుత్వం పూర్తి స్ధాయిలో పరిశోధనలు చేయకపోవటం గమనార్హం. -
మెడికల్ ఆఫీసరు.. మందు తాగితే రెచ్చిపోతారు!..
సాక్షి, పశ్చిమ గోదావరి: రోగులకు సేవ చేయాల్సిన వైద్యుడు గాడి తప్పాడు.. డ్యూటీకి తాగొచ్చి చిన్నా, పెద్దా తేడా లేకుండా అందరిపై విరుచుకుపడటం అలవాటుగా మార్చుకున్నాడు. ప్రశ్నించిన మీడియాపై సైతం చిందులు వేశాడు. వివరాల్లోకి వెళితే.. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం మండలం వెంకటరామన్నగూడెం పీహెచ్సీలో రెండవ మెడికల్ ఆఫీసర్ దుర్గాప్రసాద్ ప్రతిరోజూ మద్యం తాగొచ్చి వీరంగం సృష్టిస్తున్నాడు. డ్యూటీకి తాగొచ్చి సహచర ఉద్యోగులు, స్టాఫ్‌తో పాటుగా రోగులపైనా చిందులు వేస్తున్నాడు. తాగిన మైకంలో ఆయనతో పాటు పని చేస్తున్న సీనియర్ మెడికల్ ఆఫీసర్, స్టాఫ్, వ్యాధిగ్రస్తులపై తిట్ల దండకం ఎత్తుకుంటున్నాడు. తాగి రావడం ఏంటని ప్రశ్నించిన వారిపైనా తిరగబడుతున్నాడు. ఆ దృశ్యాలను చిత్రీకరిస్తున్న మీడియాపైనా డాక్డర్ చిందులు వేశాడు. గత నెల డ్యూటీలో చేరిన దగ్గర నుంచి ఇదే తరహాలో తాగి వచ్చి వీరంగం చేస్తున్నాడంటూ బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అతడి ఆగడాలు మితిమీరటంతో బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు రంగ ప్రవేశం చేశారు. గతంలో దుర్గా ప్రసాద్ పనిచేసిన పూళ్ల, కాగుపాడు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లోనూ ఇదే తరహాలో వ్యవహరించినట్లు పోలీసులు తేల్చారు. అతడిపై చర్యలు తీసుకోవాలంటూ ఆసుపత్రి సిబ్బంది, అభివృద్ధి కమిటీ ఉన్నతాధికారులకు సైతం ఫిర్యాదు చేశారు. డీఎంహెచ్‌వో ఆదేశాలతో ఈనెల 8న కమిటీ వచ్చి విచారణ చేపట్టి, అభియోగాలు వాస్తవమని నిర్ధారించినా ఇప్పటి వరకు అతడిపై చర్యలు తీసుకోకపోవటం గమనార్హం. -
‘వైఎస్సార్ పాలనలో ప్రజలు ధైర్యంగా ఉన్నారు’
సాక్షి, పశ్చిమ గోదావరి: దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి పాలనలో కొల్లేరు ప్రాంతాల ప్రజలు ధైర్యంగా ఉన్నారని వైఎస్సార్ సీపీ నేతలు ఆళ్ల నాని, కోటగిరి శ్రీధర్, కొఠారు అబ్బయ్య చౌదరి, పుప్పాల వాసుబాబు, దూలం నాగేశ్వరరావు వ్యాఖ్యానించారు. గురువారం కొల్లేరు నేతల సమావేశంలో వైఎస్సార్ సీపీ నేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. కొల్లేరు గ్రామంలో మంచి నీటి సమస్య తీరుస్తామని హామీ ఇచ్చారు. కొల్లేరు డెవలప్మెంట్ బోర్డును పునరుద్ధరిస్తామని భరోసా ఇచ్చారు. తెలుగుదేశం పార్టీ కొల్లేరు అంటే ఆదాయ వనరులుగా, ఆ ప్రాంత భూములను ఎలాగ కాజేయాలని చూస్తున్నారంటూ మండిపడ్డారు. మళ్లీ కొల్లేరుకు పూర్వవైభవం రావాలంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డితోనే సాధ్యం అవుతుందని స్పష్టం చేశారు. కొల్లేరు సమస్యలు పూర్తి స్థాయిలో పరిష్కారం చేస్తామని చెప్పారు. -
ఎమ్మెల్యే పీతల సుజాత హడావుడి!
సాక్షి, పశ్చిమ గోదావరి: తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే పీతల సుజాత హడావుడి మొదలుపెట్టారు. ఎన్నికల కోడ్ వస్తుందని తెలిసి ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేస్తూ బిజీబిజీగా ఉంటున్నారు. పనులు పూర్తి కాకుండానే పురపాలక సంఘ కార్యాలయం, అన్నా క్యాంటీన్‌ను ప్రారంభించడం గమనార్హం. దీంతో శిలాఫలకంపై తమ పేర్లు లేవని మున్సిపల్ కౌన్సిలర్లు నిరసన తెలిపారు. ఎర్రకాలువ జలాశయం నుంచి జంగారెడ్డి గూడెం మంచినీటి పథకానికి ఆమె శంకుస్థాపన చేశారు. మీడీయాకు సమాచారం ఇవ్వకుండా హడావిడిగా పలు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేస్తున్నారు. -
‘ట్రాయ్ పాలసీతో వినియోగదారునిపై పెనుభారం’
సాక్షి, పశ్చిమ గోదావరి: ట్రాయ్ కస్టమర్ ఛాయస్ కింద తెస్తున్న నూతన పాలసీతో వినియోగదారునిపై పెనుభారం పడనుందని భీమవరం కేబుల్ నెట్ వర్క్(బీసీఎన్) ఛైర్మన్ శ్రీనివాసరాజు, ఎమ్.డి. గోపాలరాజు తెలిపారు. గురువారం భీమవరం కేబుల్ నెట్ వర్క్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మీడియా ప్రతినిధుల సమావేశంలో వారు మాట్లాడారు. సమావేశంలో ఎమ్.ఎస్.ఓలు కాసాని కృష్ణ, సత్యనారాయణ రాజులు పాల్గొన్నారు. అన్ని చానళ్లను ఆస్వాదించటానికి ప్రస్తుతం చెల్లిస్తున్న రూ.250 కాస్తా రూ.1200లకు పెరిగే అవకాశం ఉందని వారు అభిప్రాయపడ్డారు. ట్రాయ్ నేటితో ముగియాల్సిన పాత పాలసీని, మార్చి 31 వరకూ పొడిగించిందని వెల్లడించారు. మూడు నెలల్లో ఈ విధానం మార్పు చెందే అవకాశం ఉందన్నారు. బీసీఎన్ కేబుల్ 30 ఏళ్లుగా కేబుల్ రంగంలో సేవలు అందిస్తోందని, ఎల్.సి.ఓలు ప్రజలపై భారం లేకుండా 30 ఏళ్లుగా కేబుల్ వ్యవస్థను నడిపారని పేర్కొన్నారు. బీసీఎన్ 2 లక్షల మంది వినియోగదారులకు బ్రాడ్ బ్యాండ్ సేవలను త్వరలో అందుబాటులోకి తీసుకురానుందని తెలిపారు. ఇకపై కూడా మిగిలిన సంస్థలకన్నా బీసీఎన్ తక్కువ ధరలకే ఛానళ్లను అందిస్తుందన్నారు. ఛానల్ సెట్ టాప్ బాక్స్‌పై 18 శాతం జీఎస్టీని కేంద్రం తగ్గించాలని కోరారు. ఈ ట్యాక్స్ వల్ల ఒక్కో వినియోగదారునిపై రూ.100ల ట్యాక్స్ భారం పడుతుందని, 130 రూ.ల మినిమమ్ ఛార్జీ తర్వాత వినియోగదారుడు కావాల్సిన చానల్స్‌కి మాత్రమే చెల్లిస్తే సరిపోతుందని చెప్పారు. -
‘చంద్రబాబు స్వార్థం వల్లే ఆ ముగ్గురు చనిపోయారు’
సాక్షి, పశ్చిమ గోదావరి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు స్వార్థం వల్ల శనివారం జిల్లాలో ముగ్గురు వృద్ధులు మృతి చెందారని మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్ సీపీ కన్వీనర్ కొట్టు సత్యనారాయణ వ్యాఖ్యానించారు. దానికి పూర్తి బాధ్యత చంద్రబాబుదేనన్నారు. ఆదివారం పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం వైఎస్సార్ సీపీ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా కొట్టు సత్యనారాయణ మాట్లాడుతూ.. తాడేపల్లిగూడెం 3వ వార్డులో మృతి చెందిన గొర్రె కొండయ్య అనే వృద్ధుడికి సకాలంలో వైద్యం అందించి ఉంటే బ్రతికి ఉండేవాడని, కళ్లు తిరిగి పడిపోతే కనీసం అక్కడ ఉన్న తెలుగు తమ్ముళ్లు పట్టించుకోలేదని మండిపడ్డారు. మృతుని కుటుంబ సభ్యులు వచ్చి ఆసుపత్రికి తీసుకెళ్లారని తెలిపారు. చంద్రబాబు డ్వాక్రా మహిళలతో.. పసుపు, కుంకుమ పేరు మీద పది వేలు ఇస్తామంటూ దారుణంగా మోసం చేస్తున్నాడని అన్నారు. నిజంగా చిత్తశుద్ధి ఉంటే నగదు రూపంలోనో, వెంటనే చెక్కు క్లియర్ అయ్యేలాగానో డబ్బు ఇవ్వవొచ్చుగా అని ప్రశ్నించారు. ఫిబ్రవరి మూడవ వారంలో ఎన్నికల కోడ్ వస్తుందని ముందే ఊహించి ఓట్ల కోసం, ప్రజల్ని మోసం చేసి గెలవాలని ఏప్రిల్ చివరకు చెక్కుల డేట్లు వేశారని చెప్పారు. ప్రజలు ఇదంతా నమ్మే స్ధితిలో లేరన్నారు. చంద్రబాబు ఓట్ల కోసం చిల్లర రాజకీయాలు చేస్తున్నాడని విమర్శించారు. తాడేపల్లిగూడెంలో ఒక ప్రాంతాన్ని స్పోర్ట్స్ జోన్‌గా మాస్టర్ ప్లాన్‌లో డిక్లేర్ చేశారని, ఆ ప్రాంతాన్ని మున్సిపల్ ఛైర్మన్, కొంతమంది కౌన్సిలర్లు కలిసి.. డీ ఫారాలు ఇచ్చిన స్థలాలను కబ్జా చేసి, పట్టా కల్పించి అమ్మేసి 2కోట్లు కొట్టేశారని ఆరోపించారు. కొన్నింటిని వాళ్ల బినామీ పేర్ల మీద రిజిస్టర్ చేయించారన్నారు. తాడేపల్లిగూడెం మున్సిపాలిటీలో నాన్ లేఅవుట్, అన్ ఆథరైజ్డ్ భూములను లేఅవుట్లుగా మార్చేసి సుమారు 100 కోట్లు కాజేశారన్నారు. చదవండి: పెన్షన్ కోసం వచ్చి.. ప్రాణాలు విడిచి -
పెన్షన్ కోసం వచ్చి.. ప్రాణాలు విడిచి
సాక్షి, పశ్చిమ గోదావరి: తణుకు నియోజకవర్గంలో దారుణం చోటుచేసుకుంది. పెన్షన్ కోసం గంటల తరబడి నిలబడి ఓ వృద్ధుడు ప్రాణాలు కోల్పోయాడు. ఈ సంఘటన అత్తిలి మండలం మంచిలిలో జరిగింది. వివరాలలోకి వెళితే.. మంచిలికి చెందిన కర్రి వెంకటరెడ్డి అనే 75ఏళ్ల వృద్ధుడు పెన్షన్ తీసుకోవటానికి మంచిలి పంచాయితీకి వచ్చాడు. సాయంత్రం నాలుగు గంటలకి ఎమ్మెల్యే వస్తారని.. ఉదయం 9 గంటలలోపు వచ్చిన వారికే పెరిగిన పెన్షన్ ఇస్తామని పంచాయితీ అధికారులు మెలిక పెట్టడంతో ఎక్కువమంది అక్కడికి వచ్చారు. పెన్షన్ కోసం చాలా సేపు నిలబడి అలిసిపోయిన వెంకటరెడ్డి.. చివరకు పెన్షన్ తీసుకోకుండానే ప్రాణాలు విడిచాడు. దీంతో పంచాయతీ సిబ్బంది చనిపోయిన వృద్ధుడి పెన్షన్ డబ్బులు హుటాహుటిన అతడి ఇంటికి తెచ్చి ఇచ్చారు. -
‘చంద్రబాబూ నీకో దండం.. నువ్వు మాకోద్దు..’
సాక్షి, పశ్చిమ గోదావరి : ‘‘చంద్రబాబూ నీకో దండం... నువ్వు మాకు వద్దు’’ అంటూ ఏపీ ప్రజలే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడిని తిరస్కరిస్తారని ఉండి నియెజకవర్గ వైఎస్సార్ సీపీ సమన్వయ కర్త పీవీఎల్ నరసింహారాజు అన్నారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబు కారణంగానే ఏపీకి ప్రత్యేక హోదా రాలేదని ఆరోపించారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాత్రమే ఏపీకి ప్రత్యేక హోదా కోసం మొదటినుంచి పోరాడుతున్న ఏకైక నాయకుడని అన్నారు. చంద్రబాబు దుర్మార్గపు పాలనకు రాబోయే ఎన్నికలలో ప్రజలు చరమగీతం పాడతారని జోష్యం చెప్పారు. ఏపీ ప్రజలు చంద్రబాబు చేతిలో రెండోసారి మోసపోవడానికి సిద్దంగా లేరన్నారు. ‘‘ఏపీకి ఏం చేశాడని చంద్రబాబు మళ్లీ రావాలి’’ అంటూ ప్రశ్నించారు. గురువారం నుంచి ‘‘రావాలి జగన్ కావాలి జగన్’’ కార్యక్రమంలో తెలుగుదేశం ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు తెలియజేస్తామని తెలిపారు. -
‘రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిన వంచకుడు చంద్రబాబు’
సాక్షి, పశ్చిమగోదావరి : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిన వంచకుడని మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్ సీపీ కన్వీనర్ కొట్టు సత్యనారాయణ విమర్శించారు. శనివారం ఆయన తాడేపల్లిగూడెంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో మాట్లాడుతూ.. రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఆంధ్రుల ఆకాంక్ష అని వ్యాఖ్యానించారు. కేంద్రంతో నాలుగేళ్లు బంధం కొనసాగించి.. ప్రత్యేక హోదా వద్దు ప్యాకేజీ ముద్దు అంటూ పెద్ద ఎత్తున ప్రచారం చేసిన నాయకుడు చంద్రబాబు అంటూ మండిపడ్డారు. వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు, ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాత్రమే ప్రత్యేక హోదా అంశాన్ని సజీవంగా ఉంచిన నాయకుడని కొనియాడారు. చంద్రబాబునాయుడు ధర్మ దీక్షల పేరిట ప్రజలను మోసం చేస్తున్నారన్నారు. అర్బన్ హౌసింగ్ స్కీం అనేది పెద్ద స్కాం.. ఆ స్కీంలో జరుగుతున్న అవినీతిలో రాష్ట్ర ముఖ్యమంత్రికి వాటా ఉందని ఆరోపించారు. ఆయన కనుసన్నలలోనే ఇదంతా నడుస్తోందని చెప్పారు. రాష్ట్ర ప్రజల భవిష్యత్తు కోసం బీజేపీకి వ్యతిరేకంగా అవిశ్వాసం పెట్టి, రాజీనామా చేసిన త్యాగజనులు వైఎస్సార్ సీపీ పార్లమెంట్ సభ్యులంటూ పొగిడారు. బీరు హెల్త్ డ్రింక్ అని వ్యాఖ్యానించిన మంత్రి గారి సమర్థత ఏమిటో ప్రజలకు అర్థమౌతుందని ఎద్దేవా చేశారు. ప్రజలను మోసం చేసిన తెలుగుదేశం పార్టీ వంచకులపై వైఎస్సార్ సీపీ చేస్తున్న పోరాటమే వంచనదీక్ష అని అన్నారు. -
‘వారికి న్యాయం చేయకపోతే ఉద్యమమే’ !
-
‘వారికి న్యాయం చేయకపోతే ఉద్యమమే’ !
సాక్షి, పశ్చిమ గోదావరి : తక్షణమే అగ్రిగోల్డ్ బాధితులకు న్యాయం చేయకపోతే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తామని వైఎస్సార్ సీపీ ఎమ్మెల్సీ ఆళ్లనాని ఏపీ ప్రభుత్వాన్ని హెచ్చరించారు. శనివారం అగ్రిగోల్డ్ బాధితుల ధర్నా కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆళ్లనాని మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఉన్న 19లక్షల 50వేల అగ్రిగోల్డ్ బాధితుల కుటుంబాలకు ప్రభుత్వం తక్షణమే న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. పోలవరం, పట్టిసీమ ఎత్తిపోతల పథకంలో దోచుకున్నది చాలక పేద ప్రజలకు సంబంధించిన అగ్రిగోల్డ్లోనూ ప్రభుత్వ పెద్దలు దోచుకోవటం సిగ్గుచేటని విమర్శించారు. అగ్రిగోల్డ్ అప్పులకన్నా ఆస్తులు ఎక్కువగా ఉన్నా.. బాధితులకు ప్రభుత్వం ఎందుకు న్యాయం చేయటం లేదని ప్రశ్నించారు. అగ్రిగోల్డ్ ఆస్తులు ప్రభుత్వ పెద్దలు కాజేస్తున్నారనే ఆరోపణలు బహిరంగంగా విమర్శలు వస్తున్నా చంద్రబాబు ఎందుకు స్పందించటంలేదని ప్రశ్నించారు. అగ్రిగోల్డ్ ఆస్తులు దోచుకోవటంలో ఉన్న శ్రద్ధ బాధితులకు న్యాయం చేయాలని లేకపోవటం దురదృష్టకరమన్నారు. అగ్రిగోల్డ్ ఆస్తులను కాజేయాలనే ప్రయత్నం : వైఎస్సార్ సీపీ నాయకులు విజయవాడ : అగ్రిగోల్డ్ ఆస్తులను కాజేయాలని టీడీపీ ప్రభుత్వం ప్రయత్నిస్తోందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆరోపించారు. శనివారం అగ్రిగోల్డ్ బాధితుల సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ విజయవాడ ధర్నా చౌక్ వద్ద వైఎస్సార్ సీపీ ఆధ్వర్యంలో రిలే దీక్షలు చేపట్టారు. ఈ దీక్షలో వైఎస్సార్ సీపీ నాయకులు వెల్లంపల్లి శ్రీనివాస్, మల్లాది విష్ణు, అడపా శేషు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. కృష్ణా జిల్లాలోనే అగ్రిగోల్డ్‌కు రూ. వెయ్యికోట్ల ఆస్తులు ఉన్నాయని అన్నారు. ఐదు నిమిషాల్లో పరిష్కరించే సమస్యను ఏళ్ల తరబడి కాలయాపన చేస్తున్నారని మండిపడ్డారు. బాధితులకు న్యాయం జరిగేంత వరకు తమ పోరాటం కొనసాగిస్తామని తెలిపారు. -
పెథాయ్ మిగిల్చిన నష్టంతో.. పొలంలోనే కుప్పకూలి
మెళియాపుట్టి/తెనాలి రూరల్/పెదవేగి రూరల్ : అన్నదాత గుండె పగిలింది. ఆరుగాలం శ్రమించి పండించిన పంట కళ్లెదుటే తుపాను ప్రభావంతో పాడవుతోందనే ఆవేదన అతని మనసును తొలిచేసింది. ఇంటికి చేరాల్సిన పంట నీటి మునిగితే అన్న ఆలోచనే తీవ్ర ఒత్తిడికి గురిచేసింది. పంట గింజలను కాపాడుకునే ప్రయత్నం చేశాడు. అంతలోనే ఉన్న ఫళంగా పొలంలోనే కుప్పకూలిపోయి మరణించాడు. పెథాయ్ రూపంలో వచ్చిన తుపాను శ్రీకాకుళం జిల్లా మెళియాపుట్టి మండలంలోని ఆ కుటుంబానికి తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. ఇదే తరహాలో గుంటూరు జిల్లా తెనాలి పట్టణానికి చెందిన ఓ రైతు కూడా ప్రాణాలు కోల్పోగా.. పశ్చిమ గోదావరి జిల్లా పెదవేగిలో మరో రైతు తీవ్ర మనస్తాపానికి గురై నిద్రలోనే గుండెపోటుతో మరణించాడు. వివరాల్లోకి వెళ్తే.. శ్రీకాకుళం జిల్లా మెళియాపుట్టి మండలం కొసమాల గ్రామానికి చెందిన రైతు గొట్టిపల్లి చిన్నయ్య (69)కి నాలుగెకరాలు పొలంలో వరిసాగు చేశాడు. కోతలు పూర్తవడంతో కుప్పలు వేశాడు. అయితే పెథాయ్ తుపానుతో సోమ, మంగళవారాల్లో కురిసిన వర్షానికి పొలంలో నీరు చేరింది. దీంతో తీవ్ర ఆందోళనకు గురైన చిన్నయ్య వరికుప్పల చుట్టూ చేరిన నీటిని మళ్లించేందుకు మంగళవారం పొలానికి వెళ్లాడు. అధికంగా నీరుచేరి ఉండడంతో నీటిని మళ్లించే ప్రయత్నం చేస్తుండగా ఒక్కసారిగా కుప్పకూలి అక్కడికక్కడే చనిపోయాడు. స్థానికులు ఇది గమనించి వెళ్లి చూసేలోపే చిన్నయ్య ప్రాణాలు కోల్పోయాడు. కాగా, మృతినికి భార్య శాంతమ్మ, ముగ్గురు కుమారులు, కుమార్తె ఉన్నారు. పంటను కాపానుకోవడానికి వెళ్లిన ఇంటిపెద్ద శవమై రావడంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా రోదిస్తున్నారు. నీటమునిగిన పంటను చూసి.. ఇక గుంటూరు జిల్లా తెనాలి ఐతీనగర్‌కు చెందిన రైతు కనపర్తి సుందరరావు (58) కూడా ఇదే తరహాలో ప్రాణాలు కోల్పోయాడు. కౌలుకు తీసుకున్న ఐదెకరాల్లో వేసిన వరిపంట కోతకు వచ్చింది. రెండ్రోజుల్లో కోతకు సిద్ధమవుతున్న తరుణంలో పెథాయ్ సుందరరావు గుండెల్లో తుపాను రేపింది. పంటను తీవ్రంగా దెబ్బతీసింది. చేనును చూసుకునేందుకు మంగళవారం వెళ్లిన అతను వాలిపోయిన పంటను చూసి తీవ్ర ఆందోళనకు గురై ఒక్కసారిగా అక్కడే కుప్పకూలిపోయాడు. ఇది గమనించిన తోటి రైతులు అతని కుటుంబ సభ్యులకు సమాచారమిచ్చి ఆస్పత్రికి తరలించారు. అక్కడ నుంచి మరో ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలోనే ప్రాణం విడిచాడు. మృతునికి భార్యా, ఇద్దరు కుమారులు. కొట్టుకుపోయిన పంట గురించి కలత చెంది.. మరో ఘటనలో.. ఆరుగాలం పడ్డ కష్టం తుపానుకు కొట్టుకుపోవడంతో పశ్చిమ గోదావరి జిల్లా పెదవేగి గ్రామానికి చెందిన రైతు రాజులపాటి మల్లిఖార్జునరావు (39) కూడా రోజంతా తీవ్రంగా కలత చెంది చివరికి రాత్రి నిద్రలోనే గుండెపోటుతో తుదిశ్వాస విడిచాడు. ఈయన ఐదెకరాల్లో మొక్కజొన్న వేశాడు. ఇప్పటివరకు రూ.రెండుల లక్షల వరకు పెట్టుబడి పెట్టాడు. పైరు ఏపుగా పెరిగింది. మంచి దిగుబడితో కష్టాలు తీరుతాయనుకుంటున్న సమయంలో పెథాయ్ తుపాను విరుచుకుపడడంతో పంట మొత్తం పాడైంది. దీంతో సాగుకు చేసిన అప్పులు తీర్చేదెలా అంటూ సోమవారం ఉదయం నుంచి మల్లికార్జునరావు తీవ్రంగా మథనపడుతున్నాడని అతని భార్య శివదుర్గ తెలిపింది. మంగళవారం తెల్లవారుజామున మూడు గంటల సమయంలో నిద్రలోనే గుండెనొప్పి వచ్చిందని.. ఏలూరు ఆశ్రం ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు ధ్రువీకరించారని కన్నీటిపర్యంతమైంది. -
‘సోనియా గాంధీ అమ్మలాగా హామీ ఇచ్చింది’
సాక్షి, పశ్చిమ గోదావరి : తెలంగాణ ఎన్నికల సభలో సోనియా గాంధీ ఆంధ్రప్రదేశ్‌కు అమ్మలాగా హామీ ఇచ్చిందని ఏపీసీసీ చీఫ్ రఘువీరా రెడ్డి వ్యాఖ్యానించారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ప్రత్యేక హోదాకు తొలిసంతకం ఏపీకి వరమన్నారు. ప్రజాస్వామ్య శక్తులు ఏకమై బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా కాంగ్రెస్‌తో కలిసి రావాలని పిలుపునిచ్చారు. రాష్ట్రానికి మేలు చేయాలనుకునే వారు కాంగ్రెస్‌తో రానున్నారని, రాష్ట్రానికి కీడు చేయాలనుకునేవారు బీజేపీతో ప్రత్యక్షంగా, పరోక్షంగా కలిసి వెళ్తారని పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ ఏపీలో 100 అసెంబ్లీ స్థానాల్లో ఢీ కొనే స్థాయిలో సిద్దంగా ఉందని తెలిపారు. ప్రాంతీయ పార్టీలు ఒంటరిగా పోరాటం చేయవని, జాతీయ పార్టీతోనే కలిసి వెళ్తాయన్నారు. బూత్ కమిటీ ఏర్పాటు, ఇంటింటా కాంగ్రెస్, శక్తి ప్రాజెక్ట్ అంశాలపై పార్టీ శ్రేణులతో సమీక్షించామన్నారు. ఎన్నికల మేనిఫెస్టోని ఇంటింటా కాంగ్రెస్‌లో ప్రజల వద్దకు తీసుకెళ్తున్నామని తెలిపారు. -
పశ్చిమలో విస్తారంగా వర్షాలు.. జనజీవనం అస్తవ్యస్తం
సాక్షి, ఏలూరు : పశ్చిమగోదావరి జిల్లావ్యాప్తంగా గత నాలుగు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలతో జనజీవనం అస్తవ్యస్తమైంది. చింతలపూడి పరిసర ప్రాంతాల్లో నాలుగు రోజులుగా భారీ వర్షం కురుస్తోంది. దీంతో ఇక్కడ ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మల్లయగూడెం, పోతునువు, రాఘవాపురం, పరిసర ప్రాంతాల్లో వరదల కారణంగా నాట్లు వేసిన పొలాలు పూర్తిగా నీట మునిగాయి. నారుమళ్లు మునిగిపోవడంతో రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. చింతకపూడిలోని పలు రహదారులు, గ్రామాలను కలిపే రోడ్లు జలమయం కావడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇక్కడ నివాస ప్రాంతాల్లో భారీ వృక్షాలు నేలకొరిగాయి. ముఖ్యంగా చింతలపూడి బస్టాండ్‌లోకి వర్షపునీరు వచ్చిచేరడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. చింతలపూడి ప్రభుత్వ పాఠశాలలోకి వరదనీరు వచ్చిచేరింది. దీంతో విద్యార్థులు అవస్థలు ఎదుర్కొంటున్నారు. అధికారుల నిర్లక్ష్యం వల్లే చింతలపూడి బస్టాండ్‌లోకి వర్షపు నీరు చేరిందని ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షంతో పలుచోట్ల చెట్లు కూలి విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. విస్తారంగా వర్షాలు.. జిల్లాలోని దెందులూరు, ఉంగుటూరు, గణపవరం, అత్తిలి, తణుకు, ఉండి, ఆకివీడు, భీమవరం, వీరవాసరం, పాలకొల్లు, నరసాపురం, ఆచంట తదితర ప్రాంతాల్లో భారీ వర్షం కారణంగా వేలాది ఎకరాల్లో నారుమళ్లు నీటమునిగాయి. నాట్లు ఆలస్యంగా ప్రారంభమవ్వడం.. ఇంతలోనే వర్షాలు రావడంతో చాలా ప్రాంతాల్లో నారుమళ్లు నీటమునిగి రైతులు ఆందోళన చెందుతున్నారు. 20 వేల ఎకరాల్లో నారుమళ్లు నీట మునిగిపోయినట్టు అంచనా వేస్తున్నారు. దీంతో ఎకరానికి 3 వేల రూపాయల వరకు నష్టం ఏర్పడిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తాజా వర్షాలకు జిల్లాలో రూ. 6 కోట్ల వరకు పంట నష్టం వాటిల్లి ఉంటుందని భావిస్తున్నారు. నారుమళ్లు నీటమునగడంతో మళ్లీ విత్తనాలు కొనేందుకు ఎకరానికి మూడు వేల రూపాయిల వరకు పెట్డుబడి పెట్టాల్సి ఉందని రైతులు ఆవేదనకు లోనవుతున్నారు. గత నాలుగు రోజులగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో ఆక్వా రైతు ఆందోళన నెలకొంది. తాజా వాతావరణ మార్పులతో రొయ్యల చెరువులకు తీవ్రంగా నష్టంగా వాటిల్లుతోందని, ప్రధానంగా ఆక్సీజన్ అందక రొయ్యలు చెరువుల్లోనే చనిపోతున్నాయని రైతులు అంటున్నారు. దీంతో కోట్ల రూపాయల నష్టం వాటిల్లుతోందని ఆక్వా రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. -
'ఆ మంత్రిని ఆఫ్ట్రాల్ ఫొటోగ్రాఫర్ అనలేదు'
సాక్షి, తాడేపల్లిగూడెం: మంత్రి మాణిక్యాలరావును ఉద్దేశించి తాను అనుచిత వ్యాఖ్యలు చేయలేదని, మాణిక్యాలరావును ఆఫ్ట్రాల్ ఫొటోగ్రాఫర్ అని అనలేదని, ఆఫ్టర్ ఫొటోగ్రాఫర్ మంత్రి అని మాత్రమే అన్నానని తాడేపల్లిగూడెం మున్సిపల్ చైర్మన్ బొలిశెట్టి శ్రీనివాస్ వివరణ ఇచ్చారు. తన వ్యాఖ్యలను వక్రీకరించారని ఆయన చెప్పుకొచ్చారు. మంత్రే తమను ఉద్దేశించి ఆఫ్ట్రాల్ కౌన్సిలర్లు అని ఎద్దేవా చేశారని పేర్కొన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో తెలుగుదేశం, బీజేపీ నాయకుల మధ్య విభేదాలు ముదురుతున్న సంగతి తెలిసిందే. జెడ్పీ చైర్మన్ ముళ్లపూడి బాపిరాజుకు మద్దతుగా మున్సిపల్ చైర్మన్ బొలిశెట్టి శ్రీనివాస్ మంత్రి పైడికొండల మాణిక్యాలరావుపై విమర్శలు చేశారు. ఆయనను ఉద్దేశించి ఆఫ్ట్రాల్ ఫొటోగ్రాఫర్ అని పేర్కొనడం దుమారం రేపింది. బొలిశెట్టి వ్యాఖ్యలపై స్పందించిన మాణిక్యాలరావు.. తాను నిరంతర శ్రామికుడినని, అంచెలంచెలుగా కష్టపడి ఈ స్థాయికొచ్చానని అన్నారు. ‘నన్ను ఆఫ్ట్రాల్ ఫొటోగ్రాఫర్ అని మున్సిపల్ చైర్మన్ కామెంట్ చేశాడు. అవును నేను ఆఫ్ట్రాల్ ఫొటోగ్రాఫర్‌నే. నేను ఈరోజుకీ ఫోటోగ్రాఫర్‌ననే అందరికీ చెప్తా. 24 గంటల్లో 18 గంటలు పనిచేసే నిరంతర శ్రామికుడిని. కష్టపడ్డావోడు సిగ్గుపడక్కర్లేదు, కన్నాలేసేవాడే సిగ్గుపడాలి. నాపై కామెంట్లు చేస్తున్న నీవు నీ చరిత్ర ఏంటో తెలిసుకో, నేను నీ చరిత్ర బయటకు తీయడానికి క్షణం పట్టదు. నీకు దమ్ముంటే నా చరిత్ర గురించి తెలుసుకో. నువ్వెంత వెతికినా నా వెనుక నా కష్టమే కనపడుద్ది. నేను ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపి ఫోటోగ్రాఫర్‌గా పనిచేసి అంచెలంచెలుగా కష్టపడి ఈ స్థాయికొచ్చా. నేను ఫొటోగ్రాఫర్‌కు ఫొటోగ్రాఫర్‌ని, ఆటోడ్రైవర్‌కు ఆటో డ్రైవర్, కూలీకి కూలీని. నేనెప్పుడూ కష్టపడే జీవినే, నిరంతర శ్రామికుడినని గర్వంగా చెబుతాన’ని మంత్రి మాణిక్యాలరావు పేర్కొన్నారు. -
సీఎం టూర్.. ఆదివారం తెరిచిన ప్రైవేటు బడులు
-
సీఎం టూర్.. వెస్ట్‌లో సర్వత్రా విమర్శలు
ఏలూరు, సాక్షి: పశ్చిమ గోదావరి జిల్లాలో ఆదివారం కూడా ప్రైవేటు పాఠశాలలు తెరిచి ఉండటం తీవ్ర విమర్శలకు తావిస్తోంది. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సోమవారం జిల్లా పర్యటనకు వస్తున్న నేపథ్యంలో ఆదివారం ప్రైవేటు పాఠశాలలు నడుపుకోవడానికి ప్రభుత్వం అనుమతి ఇచ్చినట్టు తెలుస్తోంది. సీఎం పర్యటనను దృష్టిలో ఉంచుకొని సోమవారం ప్రైవేటు పాఠశాలలకు యాజమన్యాలు సెలవు ప్రకటించాయి. సోమవారం పోలవరం, వేగేశ్వరపురంలో సీఎం చంద్రబాబు పర్యటించబోతున్నారు. ఈ సందర్భంగా జన్మభూమి సభలకు ప్రజలను తరలించేందుకు ప్రైవేటు స్కూల్ బస్సులను వినియోగించాలని అధికార టీడీపీ నేతలు నిర్ణయించారు. ఇందుకు అనుగుణంగా ఆదివారం ప్రైవేటు పాఠశాలలు నడుపుతున్న యాజమాన్యాలు.. సోమవారం స్కూళ్లకు సెలవు ప్రకటించి మరీ సీఎం సభకు తమ బస్సులను సమకూరుస్తున్నట్టు తెలుస్తోంది. సీఎం కార్యక్రమం కోసం ఇలా ఆదివారం పాఠశాలలు నిర్వహించడం, సోమవారం సెలవు ఇవ్వడం, పిల్లల స్కూల్ బస్సులను సీఎం సభల కోసం ఉపయోగించడంపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అధికార పార్టీ నేతల తీరు, ప్రైవేటు స్కూళ్ల నిర్వాకంపై జిల్లా ప్రజలు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. -
రైస్ మిల్లులో అగ్ని ప్రమాదం.. కోట్ల ఆస్తి నష్టం
సాక్షి, పెద్దాపురం: రైస్ మిల్లు గోనేసంచుల గోదాములో అర్ధరాత్రి అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ ఘటన తూర్పు గోదావరి జిల్లా పెద్దాపురం మండలం వాలుతిమ్మాపురం రోడ్డులో ఉన్న శ్రీ లలిత రైస్ మిల్లులో చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో సుమారుగా రూ. 4 కోట్ల ఆస్తి నష్టం సంభవించినట్లు అంచనా వేస్తున్నారు. మంటలను ఆర్పేందుకు ఆరు ఆగ్ని మాపట శకటాలు 3 గంటలుగా శ్రమిస్తున్నాయి. రైస్ మిల్లు అగ్ని ప్రమాద ప్రదేశాన్ని ఉపముఖ్యమంత్రి నిమ్మకాయల చిన్నరాజప్ప పరిశీలించారు. ఘటనపై పూర్తి స్థాయిలో దర్యాపు చేయాలని మంత్రి పోలీసులకు చెప్పారు. ఈ ప్రమాదానికి సంబంధించి కారణాలు తెలియాల్సి ఉంది. అగ్ని ప్రమాదం.. తొమ్మిది ఇళ్లు దగ్ధం విజయనగరం జిల్లాలోని మక్కువ మండలం తూరు మామిడి గిరిజన గ్రామంలో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో తొమ్మిది ఇల్లు దగ్ధమయ్యాయి. సుమారు రూ. 15 లక్షల రూపాయల ఆస్తి నష్టం సంభవించింది. ఓ పూరిల్లులో షార్ట్ సర్క్యూట్ కారణంగా ప్రమాదం సంభవించి ఉండవచ్చని అగ్ని మాపక సిబ్బంది అంచనా వేస్తున్నారు. తెల్లవారుజామున జరిగిన ఈ ఘటనలో ఇళ్లన్నీ పూర్తిగా అగ్నికి ఆహుతయ్యాయి. మరోవైపు ఆ మంటల్లో ఇళ్లలోని పత్తి, బియ్యం మొత్తం బూడిదవడంతో బాధితులు కట్టుబట్టలతో మిగిలారు. దీంతో వారు కన్నీరుమున్నీరవుతున్నారు. -
నిడదవోలులో భారీ చోరీ
నిడదవోలు: కుటుంబసభ్యులు ఇంటికి తాళం వేసి బంధువుల ఇంటికి వెళ్లివచ్చేసరికి ఇంటిలోని సొత్తు చోరీకి గురైంది. ఈఘటన పశ్చిమగోదావరి జిల్లా నిడదవోలులో శుక్రవారం రాత్రి జరిగింది. స్థానిక ఇందిరానగర్‌కు చెందిన మద్ది సూరిబాబు కుటుంబసభ్యులు ఇంటికి తాళం వేసి బంధువుల ఇంటికి వెళ్లారు. ఇదే అదనుగా గుర్తు తెలియని దుండగులు ఇంట్లోకి ప్రవేశించి బీరువాలో ఉన్న 10 కాసుల బంగారు ఆభరణాలతోపాటు రూ.70వేల నగదును ఎత్తుకుపోయారు. శనివారం ఉదయం బాధితులు ఇంటికి చేరుకోగా దొంగతనం జరిగినట్లు తేలింది. దీంతో వారు పోలీసులను ఆశ్రయించారు. -
గంజాయి స్మగ్లర్లపై కాల్పులు
-
గంజాయి స్మగ్లర్లపై కాల్పులు జరిపిన పోలీసులు
దేవరాపల్లి: అక్రమంగా గంజాయి తరలిస్తున్న స్మగ్లర్లను వెంబడించిన పోలీసులు వారిపై ఒక రౌండ్ కాల్పులు జరిపారు. ఈ ఘటన పశ్చిమ గోదావరి దేవరాపల్లి మండలంలో చోటు చేసుకుంది. గంజాయిని డీసీఎం వాహనంలో తరలిస్తున్న స్మగ్లర్లను విజయవాడ పోలీసుల సహకారంతో పశ్చిమ గోదావరిలోని మూడు మండలాల పోలీసులు పక్కా సమాచారంతో జాయింట్ ఆపరేషను నిర్వహించి నిందితులను సినీఫక్కీలో వెంబడించారు. వారు ఎంత సేపటికి ఆగకపోవడంతో గాలిలోకి ఒక రౌండు కాల్పుల జరిపారు. ఆరుగురిని అరెస్టు చేసి, వారినుంచి భారీ స్థాయిలో 500 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్టు పోలీసులు వెల్లడించారు.నిందితులలోని ఎక్కువ మంది వరంగల్ కు చెందిన వారిగా తెలుస్తోంది. సాక్షి ఏనాడో చెప్పింది నర్సీపట్నం కేంద్రంగా గతకొంత కాలంగా పశ్చిమ గోదావరి, వరంగల్ మీదుగా హైద్రాబాద్ కు జోరుగా గంజాయి తరళిస్తున్నారని సాక్షి దినపత్రిక కథనాలను ప్రచురించింది. పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరించడంతోనే గంజాయి వ్యాపారులు రెచ్చిపోయారని తెలుస్తోంది. -
15న ‘పశ్చిమ’లో జగన్ పర్యటన
జంగారెడ్డిగూడెం రూరల్: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వై.ఎస్.జగన్మోహన్రెడ్డి ఈనెల 15వ తేదీన పశ్చిమ గోదావరి జిల్లాలో పర్యటించనున్నారని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు ఆళ్ల నాని తెలిపారు. ఆదివారం జంగారెడ్డిగూడెంలోని పొగాకు బోర్డు వద్ద నాని విలేకరులతో మాట్లాడారు. జగన్మోహన్రెడ్డి జంగారెడ్డిగూడెంతోపాటు రాష్ట్ర విభజన నేపథ్యంలో జిల్లాలో విలీనమైన కుక్కునూరు మండలంలో పర్యటించనున్నారని వెల్లడించారు. 15న ఉదయం 10 గంటలకు జంగారెడ్డిగూడెం వర్జీనియా పొగాకు బోర్డు వద్ద జగన్మోహన్రెడ్డి రైతులను కలుస్తారని, ఇక్కడ జరిగే సభలో ప్రసంగిస్తారని, పామాయిల్, పొగాకు రైతుల కష్టాలను తెలుసుకుంటారని వివరించారు. అనంతరం 3 గంటలకు జగన్ కుక్కునూరు చేరుకుంటారని, అక్కడ ఏర్పాటు చేసిన సభలో కుక్కునూరుతోపాటు వేలేరుపాడు మండల ప్రజల సమస్యలను తెలుసుకుంటారని వెల్లడించారు. అనంతరం కుక్కునూరు మండలం వేలేరు చేరుకుని అక్కడ సభలో బూర్గంపాడు మండలంలోని ఐదు గ్రామాల ప్రజలతో ముఖాముఖి నిర్వహిస్తారని వెల్లడించారు. తర్వాత భద్రాచలం వెళతారని, ఆ రోజు రాత్రి అక్కడే బస చేస్తారని నాని వివరించారు. -
తణుకులో ఐదేళ్ల బాలుడి కిడ్నాప్
తణుకు: పశ్చిమగోదావరి జిల్లా తణుకులో అక్కతోపాటు పాఠశాలకు వెళుతున్న ఐదేళ్ల బాలుడు కిడ్నాప్ అయ్యాడు. హోండా యాక్టివా మీద వచ్చిన ఓ వ్యక్తి చాక్లెట్ ఇస్తానని మభ్యపెట్టి సోమవారం బాలుడిని అపహరించాడు. బాలుడి అక్క దుండగుడిని ప్రతిఘటించినా... ఆ చిన్నారిని తోసేసి.. ఈ కిడ్నాప్ కు పాల్పడ్డాడు. కిడ్నాప్ దృశ్యాలను సీసీటీవీ కెమెరా బంధించింది. ఈ దృశ్యాల ఆధారంగా కిడ్నాపర్ ను గుర్తించి.. బాలుడిని చెర విడిపించేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. బాలుడి ఆచూకీ కోసం తీవ్రంగా గాలిస్తున్నారు. కిడ్నాప్ కు గురయిన ఐదేళ్ల బాలుడి పేరు హేమంత్ అని, కంటికిరెప్పలా చూసుకునే తమ చిన్నారిని విడిచిపెట్టాలని అతని తల్లిదండ్రులు విజ్ఞప్తి చేస్తున్నారు. -
తణుకులో ఐదేళ్ల బాలుడి కిడ్నాప్
-
వైఎస్ జగన్ జనభేరికి జననీరాజనం
ఏలూరు: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పశ్చమగోదావరి జిల్లాలో నిర్వహిస్తున్న వైఎస్ఆర్ జనభేరికి అపూర్వ స్పందన లభిస్తోంది. భీమవరంలో జగన్‌కు అడుగడుగునా అభిమానులు ఘనస్వాగతం పలికారు. దివంగత మహానేత వైఎస్ఆర్ స్నేహితుడు వేగిరాజు రామకృష్ణంరాజును వైఎస్ జగన్ పరామర్శించారు. అంతకుముందు పాలకొల్లులో జగన్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. వైఎస్ జగన్‌కి అండగా ఉండటానికి వేలాది మంది తరలిరావడం కనిపించింది. వైఎస్ జగన్ పయనించే ప్రతిదారి జన గోదావరి అయింది. తన కోసం వచ్చిన ప్రతి ఒక్కర్ని వైఎస్ జగన్ ఆప్యాయంగా పలకరించారు. కష్టాలు అడిగి తెలుసుకున్నారు. మహిళలు పెద్ద ఎత్తున తరలివచ్చిన రాజన్న బిడ్డను ఆశీర్వదించి వెళ్లారు. తల్లులు తమ బిడ్డలను తీసుకొచ్చి జగన్ చేతిలో పెట్టి ఆశీర్వదించమని అడగటం కనిపించింది. వైఎస్ జగన్ నాయకత్వం వర్ధిల్లాలి అనే నినాదాలతో పశ్చిమ గోదావరి జిల్లా మారుమోగుతుంది. ప్రజాసేవ చేయడానికే వైఎస్ జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని స్థాపించారని స్వాతంత్ర్య సమరయోధుడు సత్యనారాయణ బాబు చెప్పారు. వైఎస్ జగన్‌కు కోట్ల మంది ఆశీర్వాదం ఉందన్నారు. వైఎస్ఆర్ ఆశయాలను నెరవేర్చే శక్తి జగన్‌కే ఉందన్నారు ఎన్నికల ప్రచారంలో పాల్గొనడానికి వచ్చిన వృద్దులు.