
సాక్షి, పశ్చిమ గోదావరి : పోలవరం ప్రాజెక్టు సమీపంలో భారీగా పగుళ్లు ఏర్పడ్డాయి. 48 గంటలు కూడా గడవక ముందే మరోసారి ప్రాజెక్టు స్పిల్‌వే రెస్టారెంట్ వద్ద భూమి కంపించి పగుళ్లు సంభవించాయి. పోలవరం ప్రాజెక్ట్ సమీపంలో ఉన్న రెస్టారెంట్ లోపల సైతం భయంకరంగా పగుళ్లు ఏర్పడ్డాయి. దీంతో రెస్టారెంట్ సిబ్బంది భయకంపితులై బయటకు పరుగులు తీశారు. ఆ తర్వాత పోలవరం రోడ్లపైనా పగుళ్లు ఏర్పడ్డాయి. అయితే కొన్ని నెలల క్రితం కూడా పోలవరం రోడ్డుపై పగుళ్లు ఏర్పడినా, ప్రభుత్వం పూర్తి స్ధాయిలో పరిశోధనలు చేయకపోవటం గమనార్హం.







Comments
Please login to add a commentAdd a comment