
ప్రతీకాత్మక చిత్రం
సాక్షి, పశ్చిమ గోదావరి : ఓ మహిళపై కొందరు వ్యక్తులు దాడికి పాల్పడటంతో ఆమె అవమానం భరించలేక ఆత్మహత్య చేసుకుంది. ఈ సంఘటన పశ్చిమ గోదావరి జిల్లాలో గురువారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. షేక్ సిద్దయ్య అనే వ్యక్తి కనబడటం లేదని, దీనికి పెంటపాడు మండలం ప్రత్తిపాడుకు చెందిన బాదవతి మంగతాయారు కారణమంటూ ఆమె, ఆమె కుటుంబంపై తాడేపల్లిగూడెం పట్టణం జువ్వలపాలెంకు చెందిన ఆరుగురు వ్యక్తులు నిన్న రాత్రి కర్రలతో దాడి చేశారు.
ఈ అవమానం తట్టుకోలేక మనస్తాపంతో మంగతాయారు పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేసింది. ఆపస్మారక స్థితిలో ఉన్న ఆమెను తాడేపల్లిగూడెం ఏరియా ఆసుపత్రికి తీసుకెళుతుండగా మార్గం మధ్యలో మృతి చెందింది. మంగతాయారు మృతికి షేక్ సిద్దయ్య కుమార్తె, కోడళ్లు, కొడుకులు వారి కుటుంబ సభ్యులే కారణమంటూ మంగతాయారు కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. పెంటపాడు పోలీసులు మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించి, కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
Comments
Please login to add a commentAdd a comment