రైస్‌ మిల్లులో అగ్ని ప్రమాదం.. కోట్ల ఆస్తి నష్టం | two major fire accidents in andhra pradesh | Sakshi
Sakshi News home page

రైస్‌ మిల్లులో అగ్ని ప్రమాదం.. కోట్ల ఆస్తి నష్టం

Published Thu, Dec 7 2017 10:31 AM | Last Updated on Wed, Sep 5 2018 9:47 PM

two major fire accidents in andhra pradesh - Sakshi

సాక్షి,  పెద్దాపురం:  రైస్‌ మిల్లు గోనేసంచుల గోదాములో అర్ధరాత్రి అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ ఘటన తూర్పు గోదావరి జిల్లా పెద్దాపురం మండలం వాలుతిమ్మాపురం రోడ్డులో ఉన్న శ్రీ లలిత రైస్‌ మిల్లులో చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో సుమారుగా రూ. 4 కోట్ల ఆస్తి నష్టం సంభవించినట్లు అంచనా వేస్తున్నారు. మంటలను ఆర్పేందుకు ఆరు ఆగ్ని మాపట శకటాలు 3 గంటలుగా శ్రమిస్తున్నాయి. రైస్‌ మిల్లు అగ్ని ప్రమాద ప్రదేశాన్ని ఉపముఖ్యమంత్రి నిమ్మకాయల చిన్నరాజప్ప పరిశీలించారు. ఘటనపై పూర్తి స్థాయిలో దర్యాపు చేయాలని  మంత్రి పోలీసులకు చెప్పారు. ఈ ప్రమాదానికి సంబంధించి కారణాలు తెలియాల్సి ఉంది. 

అగ్ని ప్రమాదం.. తొమ్మిది ఇళ్లు దగ్ధం
విజయనగరం జిల్లాలోని మక్కువ మండలం తూరు మామిడి గిరిజన గ్రామంలో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో తొమ్మిది ఇల్లు దగ్ధమయ్యాయి. సుమారు రూ. 15 లక్షల రూపాయల ఆస్తి నష్టం సంభవించింది. ఓ పూరిల్లులో షార్ట్‌ సర్క్యూట్‌ కారణంగా ప్రమాదం సంభవించి ఉండవచ్చని అగ్ని మాపక సిబ్బంది అంచనా వేస్తున్నారు. 

తెల్లవారుజామున జరిగిన ఈ ఘటనలో ఇళ్లన్నీ పూర్తిగా అగ్నికి ఆహుతయ్యాయి. మరోవైపు ఆ మంటల్లో ఇళ్లలోని పత్తి, బియ్యం మొత్తం బూడిదవడంతో బాధితులు కట్టుబట్టలతో మిగిలారు. దీంతో వారు కన్నీరుమున్నీరవుతున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement