ఎమ్మెల్యే పీతల సుజాత హడావుడి! | TDP MLA Peethala Sujatha Hurry About Work Over Election Code | Sakshi
Sakshi News home page

ఎమ్మెల్యే పీతల సుజాత హడావుడి!

Published Wed, Feb 13 2019 8:22 PM | Last Updated on Wed, Feb 13 2019 8:53 PM

TDP MLA Peethala Sujatha Hurry About Work Over Election Code - Sakshi

సాక్షి, పశ్చిమ గోదావరి: తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే పీతల సుజాత హడావుడి మొదలుపెట్టారు. ఎన్నికల కోడ్‌ వస్తుందని తెలిసి ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేస్తూ బిజీబిజీగా ఉంటున్నారు. పనులు పూర్తి కాకుండానే పురపాలక సంఘ కార్యాలయం, అన్నా క్యాంటీన్‌ను ప్రారంభించడం గమనార్హం. దీంతో శిలాఫలకంపై తమ పేర్లు లేవని మున్సిపల్‌ కౌన్సిలర్లు నిరసన తెలిపారు. ఎర్రకాలువ జలాశయం నుంచి జంగారెడ్డి గూడెం మంచినీటి పథకానికి ఆమె శంకుస్థాపన చేశారు. మీడీయాకు సమాచారం ఇవ్వకుండా హడావిడిగా పలు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేస్తున్నారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement