
విజయవాడ: ఏపీలో పలుచోట్ల వివిధ కారణాలతో ఖాళీ అయిన డిప్యూటీ మేయర్, మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ స్థానాలకు ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో టీడీపీ(TDP) ప్రలోభాలకు తెరలేపింది. ఈ నేపథ్యంలో అప్రమత్తమైన వైఎస్సార్‌సీపీ(YSRCP).. పార్టీకి చెందిన కార్పోరేటర్లు, కౌన్సిలర్లకు విప్ జారీ చేసింది. రేపు(సోమవారం) రాష్ట్రంలోని పలు చోట్ల డిప్యూటీ మేయర్, మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికలు జరుగునున్నాయి .ఈ తరుణంలో ఓటుకు నోటు వ్యవహారానికి తెరలేపింది టీడీపీ.
కార్పోరేటర్లు, కౌన్సిలర్లకు డబ్బులిచ్చి లోబర్చుకుంటుంది టీడీపీ. కొన్ని చోట్ల బెదిరింపులకు సైతం ాపాల్పడుతోంది టీడీపీ. ఈ ేనేపథ్యంలో వైఎస్సార్‌ీపీ విప్ జారీ చేసింది. సోమవారం(03-02-2025) తిరుపతి, ెనెల్లూరు, ఏలూరు కార్పోరేషన్‌లకు డిప్యూటీ మేయర్ ఎన్నికలతో పాటు, నందిగామ, హిందూపురం, పాలకొండ మున్సిపాలిటీల్లో చైర్‌పర్సన్‌ల ఎంపిక కోసం ఎన్నికలు జరుగుతున్నాయి. ఇక బుచ్చిరెడ్డిపాలెం, నూజివీడు, తుని, పిడుగురాళ్ల మున్సిపాలిటీలకు వైస్ చైర్‌పర్సన్ కోసం ఎన్నికలు జరుగనున్నాయి. దాంతో వీటిని ఎలాగైనా చేజిక్కించుకోవాలనే ఉద్దేశంతో టీడీపీ ప్రలోభాలకు తెరలేపింది.

Comments
Please login to add a commentAdd a comment