Corporation election
-
టీడీపీలో ప్రకంపనలు.. నెల్లూరులో రాజకీయ సంక్షోభం
నెల్లూరు (టౌన్): కార్పొరేషన్ ఎన్నికలతో నెల్లూరు టీడీపీలో ఏర్పడిన రాజకీయ సంక్షోభం పెను తుపానులా మారింది. పరిస్థితులు చేయి దాటిపోవడంతో ఏకంగా పార్టీ అధినేతే రంగంలోకి దిగారు. కీలకమైన పార్టీ నగర కమిటీని రద్దు చేయడంతో పాటు సీనియర్ నేతలను పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. మరి కొందరు నేతలకు షోకాజ్ నోటీసులను జారీ చేస్తున్నట్లు ప్రకటించారు. ఎన్నికల్లో అంతా తామై వ్యవహరించిన ఇన్‌చార్జీలపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. నగరపాలక సంస్థ ఎన్నికల ఫలితాలపై మంగళగిరిలోని టీడీపీ రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించిన సమావేశం నెల్లూరు టీడీపీలో ప్రకంపనలు సృష్టిస్తోంది. సస్పెన్షన్లు.. టీడీపీలో తీవ్ర నిర్ణయాలకు చంద్రబాబు శ్రీకారం చుట్టారు. గ్రంథాలయ సంస్థ జిల్లా మాజీ చైర్మన్, సీనియర్ నేత కిలారి వెంకటస్వామినాయుడ్ని సస్పెండ్ చేశారు. పార్టీ రాష్ట్ర కార్యదర్శి వేలూరు రంగారావును పార్టీ నుంచి తొలగిస్తున్నట్లు ప్రకటించారు. తాము బాధ్యత తీసుకున్న డివిజన్లలో అభ్యర్థులను పోటీలో ఉంచలేకపోయారనే ఆరోపణల నేపథ్యంలో టీడీపీ రాష్ట్ర కార్యదర్శి పమిడి రవికుమార్‌చౌదరికి షోకాజ్ నోటీస్‌ను జారీ చేశారు. సమాధానం చెప్పాల్సిందిగా జెన్ని రమణయ్యను ఆదేశించారు. జిల్లా కమిటీ తర్వాత అత్యంత కీలకమైన పార్టీ నెల్లూరు నగర కమిటీ, 54 డివిజన్ల కమిటీలను కూడా రద్దు చేయడం రాజకీయ వర్గాల్లో తీవ్ర చ ర్చనీయాంశంగా మారింది. డివిజన్ల వారీగా సమీక్షను చంద్రబాబు నిర్వహించారు. ప్రతి డివిజన్‌కు సంబంధించిన అంశాల్లో పూర్తిగా విఫలమయ్యారంటూ సిటీ, రూరల్ ఇన్చార్జీలు కోటంరెడ్డి శ్రీనివాసులురెడ్డి, అబ్దుల్ అజీజ్‌పై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం. సమీక్షలు జరిగిన వాతావరణాన్ని గమనిస్తే ఇన్‌చార్జీలపై తీవ్ర చర్యలు తీసుకోనున్నారని, వీరిని పదవుల నుంచి తొలగించనున్నారని పార్టీ వర్గాల్లో చర్చ మొదలైంది. 54 డివిజన్లకు గాను ఒకటి నుంచి 24 డివిజన్ల సమీక్షను శనివారం నిర్వహించారు. పోటీ చేసిన అభ్యర్థులతో స్వయంగా మాట్లాడారు. నామినేషన్ పత్రాలను సైతం కొంతమంది సక్రమంగా పూరించలేకపోయారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మిగిలిన 30 డివిజన్లకు సంబంధించిన సమీక్షను మరో వారంలో నిర్వహించనున్నామని ప్రకటించారు. మరో విడత సమీక్ష ఉన్న తరుణంలో ఇన్‌చార్జీలపై వేటుకు సమయం తీసుకోనున్నారనే చర్చ సాగుతోంది. మలి విడత సమీక్ష అనంతరం చర్యలు మరింత తీవ్రంగా ఉండే అవకాశం ఉందని పార్టీ సీనియర్ నేత ఒకరు తెలిపారు. కాగా తప్పు చేసిన ఇన్చార్జీలను వదిలి చోటా నేతలపై చర్యలు తీసుకోవడం బాధగా ఉందని పలువురు పేర్కొంటున్నారు. -
టీడీపీకి దిమ్మతిరిగే తీర్పు రావాలి
నెల్లూరు(సెంట్రల్): నెల్లూరు కార్పొరేషన్ ఎన్నికల్లో ప్రజలు ఇచ్చే తీర్పు టీడీపీకి దిమ్మతిరిగేలా ఉండాలని వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి, జిల్లా ఇన్చార్జ్ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి పిలుపునిచ్చారు. మొత్తం 54 డివిజన్లలో వైఎస్సార్సీపీ కార్పొరేటర్లను ప్రజలు గెలిపిస్తారనే ధీమా ఉందన్నారు. ఈ ఎన్నికల్లో గెలుపు కన్నా మెజార్టీ ముఖ్యమన్నారు. 2024 ఎన్నికల్లో ఏ పార్టీ పోటీ చేయాలన్నా వెన్నులో వణుకు పుట్టేలా మెజార్టీని తీసుకురావడమే ధ్యేయంగా ప్రతి ఒక్కరూ కష్టపడి పనిచేయాలని సూచించారు. నెల్లూరులోని ఒక హోటల్లో బుధవారం మంత్రి అనిల్‌కుమార్ యాదవ్, రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి కలసి కార్పొరేటర్లుగా పోటీలో ఉన్న అభ్యర్థులను సజ్జలకు, బాలినేనికి పరిచయం చేశారు. ఈ సందర్భంగా సజ్జల మాట్లాడుతూ.. గతంలో ఎవరూ చేయనంత అభివృద్ధి రాష్ట్రంలో జరుగుతోందన్నారు. కార్పొరేషన్‌కు సంబంధించి ఇతర పార్టీల వాళ్లు ఎన్ని కుట్రలు చేసినా ప్రజలు మాత్రం తమవైపే ఉన్నారని తెలిపారు. ఈ ఎన్నికల్లో పార్టీలో క్రియాశీలకంగా ఉన్న వారిని గుర్తించి టికెట్లు ఇచ్చామని చెప్పారు. మంత్రి, ఎమ్మెల్యే జట్టుగా అడుగులు వేసి విజయం కోసం కృషి చేస్తారన్నారు. ప్రతి ఇంట్లో నవరత్నాల పథకం వల్ల లబ్ధి పొందిన వాళ్లు ఉన్నారని, వారికి మళ్లీ పథకాల అమలు తీరు, ఏం లబ్ధి పొందుతున్నారు అనేది గుర్తుచేయాలన్నారు. ఎన్నికల్లో తీర్పు అనేది సీఎం జగన్ పాలనకు నిదర్శనంగా ఉండాలని చెప్పారు. జిల్లా ఇన్చార్జ్ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ.. డివిజన్లో ఎలాంటి సమస్యలు ఉన్నా తక్షణమే మంత్రి, ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించుకోవాలని అభ్యర్థులకు సూచించారు. సీఎం అమలు చేస్తున్న పథకాలే మనకు శ్రీరామరక్ష లాగా ప్రజలు ఆశీర్వాదాలు ఉంటాయన్నారు. ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి మాట్లాడుతూ నెల్లూరు సిటీ, రూరల్‌పై ఉంచిన నమ్మకం వమ్ము కాకుండా అధిక మెజార్టీతో 54 డివిజన్లలో వైఎస్సార్సీపీ అభ్యర్థులను గెలిపించుకుంటామని ధీమా వ్యక్తం చేశారు. కార్యక్రమంలో రూరల్ ఎమ్మెల్యే కార్యాలయ ఇన్చార్జ్ కోటంరెడ్డి గిరిధర్‌రెడ్డి, నుడా చైర్మన్ ద్వారకానాథ్, పి.రూప్‌కుమార్ పాల్గొన్నారు. -
ఏలూరు కార్పొరేషన్ ఎన్నికల కేసు విచారణ 19కి వాయిదా
సాక్షి, అమరావతి: ఏలూరు మునిసిపల్ కార్పొరేషన్ ఎన్నికలకు సంబంధించి ప్రభుత్వంతోపాటు మరికొందరు హైకోర్టులో దాఖలు చేసిన అప్పీళ్లపై విచారణ ఈ నెల 19కి వాయిదా పడింది. అంతకుముందు ప్రభుత్వం తరఫున అడ్వొకేట్ జనరల్ (ఏజీ) ఎస్.శ్రీరామ్ వాదనలు వినిపిస్తూ.. 2020 ఫిబ్రవరి 3న తుది ఓటర్ల జాబితా ప్రచురించామని తెలిపారు. అభ్యంతరాల సమర్పణకు గడువు కూడా ఇచ్చామన్నారు. ఎన్నికల నోటిఫికేషన్ ఇచ్చే వరకు తమ దృష్టికి వచ్చిన లోపాలన్నింటినీ సవరిస్తూనే ఉన్నామని కోర్టుకు వివరించారు. ఎన్నికలు కూడా నిర్వహించామని, అయితే హైకోర్టు ఆదేశాల మేరకు ఫలితాలను వెల్లడించలేదన్నారు. ఫలితాల కోసం అందరూ ఎదురు చూస్తున్నారని, ఫలితాల వెల్లడికి అనుమతినిస్తూ ఉత్తర్వులు ఇవ్వాలని అభ్యర్ధించారు. అయితే ఇతర న్యాయవాదుల వాదనల నిమిత్తం విచారణ 19కి వాయిదా పడింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్ అరూప్ కుమార్ గోస్వామి, న్యాయమూర్తి జస్టిస్ చాగరి ప్రవీణ్ కుమార్‌లతో కూడిన ధర్మాసనం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఓటర్ల జాబితాలో తప్పులున్నాయంటూ ఏలూరు మునిసిపల్ కార్పొరేషన్ ఎన్నికలపై స్టే విధిస్తూ సింగిల్ జడ్జి ఉత్తర్వులిచి్చన సంగతి తెలిసిందే. -
‘ఏలూరు’ ఎన్నికలకు గ్రీన్ సిగ్నల్, కానీ..
-
‘ఏలూరు’ ఎన్నికలకు గ్రీన్ సిగ్నల్, కానీ..
సాక్షి, అమరావతి: పశ్చిమగోదావరి జిల్లాలోని ఏలూరు కార్పొరేషన్ ఎన్నికలకు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు మంగళవారం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. ఎన్నికలు జరిపి ఫలితాలు వెల్లడించవద్దని ఆదేశించింది. తదుపరి విచారణను హైకోర్టు మార్చి 23కి వాయిదా వేసింది. ఈ నెల 10న జరగాల్సిన ఎన్నికపై సోమవారం హైకోర్టు స్టే విధిస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ విషయం తెలిసిందే. కాగా, ఆ స్టేను ఎత్తివేస్తూ ఎన్నికలు జరపాలని హైకోర్టు ఆదేశించింది. తుది ఓటర్ల జాబితాలో పెద్ద ఎత్తున తప్పులున్నాయని, అభ్యంతరాలను స్వీకరించకుండానే తుది ఓటర్ల జాబితాను ప్రచురించారంటూ పిటిషన్ దాఖలైన విషయం తెలిసిందే. చదవండి: తుది ఓటర్ల జాబితాలో అనేక తప్పులున్నాయన్న హైకోర్టు -
నేడు కరీంనగర్ కార్పొరేషన్ ఎన్నికలు
-
‘ఓటు’ అడిగే హక్కు కాంగ్రెస్, టీడీపీలకు లేదు
∙ కార్పొరేషన్ ఎన్నికల్లో పార్టీ విజయం తథ్యం ∙ మాజీ మంత్రి ముత్తా, కో–ఆర్డినేటర్ శశిధర్ కాకినాడ : ప్రజల మనోభావాలకు విరుద్ధంగా వ్యవహరించిన, అవినీతి ఊబిలో కూరుకుపోయిన కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలకు కార్పొరేషన్ ఎన్నికల్లో ఓటు అడిగే హక్కులేదని మాజీ మంత్రి ముత్తా గోపాలకృష్ణ, వైఎస్సార్సీపీ కాకినాడ సిటీ కో–ఆర్డినేటర్ ముత్తా శశిధర్ పేర్కొన్నారు. స్థానిక హెలికాన్ టైమ్స్‌లో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో వీరు మాట్లాడుతూ కాకినాడను తాము అభివృద్ధి చేశామంటే తామే అభివృద్ధి చేశామంటూ కాంగ్రెస్, టీడీపీలు చేస్తున్న ప్రచారం హాస్యాస్పదంగా ఉందన్నారు. గడచిన 30 ఏళ్లలో జరిగిన అభివృద్ధికి ఎవరు రూపకల్పన చేశారో వాస్తవాలు పరిశీలిస్తే అర్థమవుతుందన్నారు. రహదారుల విస్తరణ, మూడు ఫ్లై ఓవర్ల నిర్మాణం, రాజీవ్ గృహకల్ప సహా ఎన్నో కార్యక్రమాలు తన హయాంలో రూపుదిద్దుకున్నవేనని ముత్తా పేర్కొన్నారు. ఇద్దరు ముగ్గురు పెట్టుబడిదారుల కోసం యాంకరేజ్ పోర్టుపై ఆధారపడ్డ ఎంతోమంది కార్మికులను రోడ్డున పడేసింది ఎవరని ముత్తా గోపాలకృష్ణ ప్రశ్నించారు. జన్మభూమి కమిటీల ద్వారా సమాంతర వ్యవస్థను నడుపుతూ వ్యవస్థను చిన్నాభిన్నం చేస్తున్నారన్నారు. పేదలకు దక్కాల్సిన పింఛన్లు, ఇళ్లు, రేషన్ కార్డులకు కూడా సొమ్ములు దండుకుంటున్నారని ధ్వజమెత్తారు. జన్మభూమి కమిటీల అస్తవ్యస్త విధానాలను స్వయంగా ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా అంగీకరించారని పేర్కొన్నారు. కాకినాడకు డంపింగ్ యార్డును ఏర్పాటు చేయలేకపోయారని, డ్రైనేజీ వ్యవస్థ గందరగోళంగా ఉందని, ట్రాఫిక్ సమస్యను గాలికి వదిలేశారంటూ ధ్వజమెత్తారు. పిఠాపురం రాజా స్థలాలు, పోర్టు భూములు, పైడా ట్రస్ట్ భూముల కబ్జాలపై విచారణ చేయాలని డిమాండ్ చేశారు. గృహకల్ప మరమ్మతులకు రూ.10 వేలు ఇచ్చినట్టు ప్రకటించి నెలలు గడుస్తున్నా ఒక్క రూపాయి విదల్చకుండా ఉత్తుత్తి ప్రచారం నిర్వహిస్తున్నారంటూ ధ్వజమెత్తారు. సిటీ కో–ఆర్డినేటర్ ముత్తా శశిధర్ మాట్లాడుతూ ఎన్నికలు నిర్వహించకుండా తెలుగుదేశం ప్రభుత్వం మోకాలడ్డిందని, చివరకు న్యాయస్థానం జోక్యంతో కార్పొరేషన్ ఎన్నికలు నిర్వహిస్తోందన్నారు. కార్పొరేషన్ ఎన్నికల్లో వైఎస్సార్సీపీ ఘన విజయం సాధించగలదని ముత్తా శశిధర్ ధీమా వ్యక్తం చేశారు. సమావేశంలో పలువురు కార్పొరేటర్ అభ్యర్థులు పాల్గొన్నారు. -
కార్పొరేషన్ ఎన్నికలపై కార్యాచరణ
⇒నేడు వైఎస్సార్సీపీ విస్తృత సమావేశం ⇒హాజరుకానున్న పార్టీ ప్రముఖులు కాకినాడ : కార్పొరేషన్ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మేయర్ పీఠాన్ని కైవసం చేసుకోవడమే లక్ష్యంగా అవసరమైన కార్యాచరణకు సమాయత్తమవుతోంది. 48 డివిజన్లకుగాను మెజార్టీ స్థానాలతోపాటు మేయర్ పీఠాన్ని గెలుచుకునేందుకు పార్టీ శ్రేణులను సమాయత్తం చేసేందుకు పార్టీ ముఖ్య నేతలంతా శనివారం సమావేశం కానున్నారు. కాకినాడ సినిమా రోడ్డులోని పద్మనాభ ఫంక్షన్ హాలులో మధ్యాహ్నం 3 గంటలకు ఎన్నికల సన్నాహక సమావేశం ఏర్పాటు చేశారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎ మ్మెల్యే కురసాల కన్నబాబు అధ్యక్షతన జరిగే సమావేశానికి పార్టీ రాష్ట్ర ప్రధా న కార్యదర్శి, ఎంపీ వి.విజయసాయి రెడ్డి, జిల్లా పరిశీలకులు, మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు, మరో సీనియర్ నేత, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ, కార్పొరేషన్ ఎన్ని కల పర్యవేక్షకులు, చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కరరెడ్డి తదితర ప్రముఖులు హాజరుకానున్నారు. ఎన్నికల్లో అనుసరించాల్సి న వూహ్యం, ప్రచారాలుపై పార్టీశ్రేణులకు దిశ, నిర్దేశం చేయనున్నారు. పార్లీమెంట్ కో–ఆర్డినేటర్ చలమలశెట్టి సునీల్, సిటీ కో–ఆర్డినేటర్లు ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి, ముత్తా శశిధర్‌లతో ఎన్నికలను ఎదుర్కొనే అంశంపై చర్చించనున్నారు. నంద్యాల ఎన్నికల్లో అధికార బలాన్ని ఉపయోగించి ఓటర్లను మభ్యపెట్టడం, మద్యం, మందు పంపిణీ, వైఎస్సార్సీపీకి అనుకూలంగా ఉండే కార్యకర్తలపై దాడులు, వేధింపుల నేపథ్యంలో ఇక్కడి ఎన్నికలపై పార్టీ శ్రేణులతో చర్చించి దిశ, నిర్ధేశం చేయనున్నారు. ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకోవాల్సిన అవసరంపై చర్చించనున్నారు. ఈ సమావేశానికి తూర్పు, పశ్చిమ, విశాఖ జిల్లాలతోపాటు మ రికొన్ని ప్రాంతాల నుంచి కూడా నియోజకవర్గాల కో–ఆర్డినేటర్లు హాజరవుతారని, పార్టీ జిల్లా అధ్యక్షుడు కురసాల కన్నబాబు ‘సాక్షి’కి చెప్పారు. ఈ సమావేశానికి పార్టీ ముఖ్యనేతలంతా విధిగా హాజరుకావాలని కోరారు. -
కార్పొరేషన్ ఎన్నికల్లో కష్టమే...
వైఎస్సార్సీపీని ఎదుర్కొనే సత్తా లేదాయె టీడీపీ సమావేశంలో భగ్గుమన్న అసంతృప్తి నేతలు సహకరించడం లేదన్న ఎమ్మెల్యే అభివృద్ధి చేయలేకపోతున్నానంటూ కన్నీళ్లు తిరుపతి టీడీపీ నాయకులు, కార్యకర్తల్లో నివురుగప్పిన నిప్పులా పెరిగిన అసంతృప్తి సోమవారం బహిర్గతమైంది. పార్టీ కార్యకర్తలు, డివిజన్ స్థాయి నాయకులు తమలోని అసంతృప్తిని మూకుమ్మడిగా వెళ్లగక్కారు. ఇలాగైతే వచ్చే కార్పొరేషన్ ఎన్నికల్లో వైఎస్సార్సీపీని ఎదుర్కోవడం కష్టమని స్పష్టం చేశారు. రెండేళ్లలో ప్రజలకు చేసిందేమీ లేకుండా పోయిందనీ, ఇప్పటికీ జనం వైఎస్సార్ పేరునే జపిస్తున్నారని పలువురు కార్యకర్తలు ఆవేదన వ్యక్తం చేశారు. ఒక సందర్భంలో శాసనసభ్యురాలు సుగణమ్మ ఉద్వేగానికి లోనై కన్నీటి పర్యంతమయ్యారు. దీంతో పార్టీ కేడర్ విస్మయానికి లోనైంది. తిరుపతి సిటీ: తిరుపతిలోని ఓ ప్రయివేటు హోటల్ సోమవారం సాయంత్రం టీడీపీ నగర కమిటీ అధ్యక్షుడు దంపూరి భాస్కరయాదవ్ అధ్యక్షతన ఆ పార్టీ నగర కమిటీ, అనుబంధ సంఘాల సమావేశం జరిగింది. ముఖ్య అతిథులుగా జిల్లా పార్టీ అధ్యక్షుడు గౌనివారి శ్రీనివాసులు, ఎమ్మెల్యే సుగుణమ్మ హాజరయ్యారు. ముందుగా పార్టీ కేడర్ తమ అభిప్రాయాలు పార్టీ నేతల ముందు వెలిబుచ్చారు. ‘టీడీపీ అధికారంలోకి వచ్చి రెండేళ్లు పైబడినా ఇంతవరకు పార్టీ కార్యకర్తలకు న్యాయం జరగటంలేదు. రాబోయే కార్పొరేషన్ ఎన్నికల్లో వైఎస్సార్సీపీని ఎదుర్కొనే సత్తా మనకు లేదని తెలుగుయువత జిల్లా కార్యదర్శి కంకణాల రజనీకాంత్ నాయుడు ఆవేదన వ్యక్తం చేశారు. ఏ కాలనీల్లోకి వెళ్లి పింఛన్ల గురించి ఆరా తీసినా వైఎస్ పుణ్యంతోనే తీసుకుంటున్నామని చెబుతున్నారని టీడీపీ జిల్లా కార్యదర్శి కుమారమ్మ చెప్పుకొచ్చారు. దీనినిబట్టి మనం ఏవిధంగా ఉన్నామో అర్థమవుతోందని చెప్పారు. తిరుపతిలో వైఎస్సార్సీపీకి బలమైన పార్టీ క్యాడర్ ఉందని, ఇప్పటికే బలమైన అభ్యర్థులను ప్రకటించి డివిజన్లలో పర్యటిస్తున్నారని కొందరు చెప్పారు. కార్పోరేషన్ ఎన్నికలలో ఇబ్బందులు ఎదుర్కొవాల్సిన పరిస్థితి ఏర్పడుతోందని చెప్పారు. నామినేటెడ్, పార్టీ పదవులు ఇవ్వకపోవటం వల్ల చాలా మంది అసంతప్తిగా ఉన్నారన్నారు. ఎమ్మెల్యే సుగుణమ్మ మాట్లాడుతూ తిరుపతిలో కార్యకర్తలకు రెండేళ్లుగా ఏమీ చేయలేకపోతున్నానని కన్నీటీ పర్యవంతమయ్యారు. జిల్లాలో మంత్రులుగానీ, పార్టీలోని సీనియర్ నేతలుగానీ సహకరించడంలేదని వాపోయారు. పార్టీ కార్యకర్తలకు, వార్డుల్లోని ప్రజలకు ఏమీ సమాధానం చెప్పాలని ప్రశ్నించారు. సమావేశంలో పలువురు పార్టీ నాయకులు పాల్గొన్నారు. -
టీడీపీకి చుక్కెదురు
►కార్పొరేషన్ ఎన్నికల నాడిపై సర్వే ► 36 వార్డుల్లో నిఘా బృందాల పరిశీలన ► వైఎస్సార్సీపీకే అనుకూలం ► ప్రభుత్వానికి సర్వే తొలి నివేదిక ► కొనసాగుతున్న మలి సర్వే ఇప్పటికిప్పుడు నగరపాలక సంస్థ ఎన్నికలు జరిగితే ఏ పార్టీకి ఆధిక్యం వస్తుంది? ఈ ఎన్నికలు ప్రత్యక్ష పద్ధతిలో జరుగుతాయా? పరోక్ష పద్ధతిలో నిర్వహిస్తారా? ఎవరికి ప్రాతినిధ్యం వెళ్తుంది? ఏఏ వార్డుల్లో ఎవరి హవా ఉంది? అధికార తెలుగుదేశం పార్టీ పట్ల ప్రజలు ఎలా ఉన్నారు? ప్రతిపక్ష పార్టీ సభ్యులు ప్రజల తరఫున పోరాడే పరిస్థితిలో ఉన్నారా? ఈ అంశాలపై నిఘా బృందాలు సర్వే చేపట్టాయి. హైదరాబాద్‌లోని అదనపు డీజీపీ ఆదేశాల మేరకు శ్రీకాకుళం నగరంలో పరిస్థితిపై ఆరా తీస్తున్నాయి. ఇప్పటికే తొలి నివేదిక ప్రభుత్వానికి అందజేసిన సిబ్బంది రెండో దశ సర్వేకు సిద్ధమయ్యారు. సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం : రానున్న ఎన్నికల్ని ప్రభుత్వం ప్రత్యక్ష పద్ధతిలో జరుపుతుందా. పరోక్ష పద్ధతి వైపే మొగ్గు చూపుతుందా? యువత ఏం కోరుకుంటోంది. మహిళలు ఏం అంటున్నారు, పింఛన్‌దారులు ఏం చెబుతున్నారు, సామాజికవర్గాల విశ్లేషణ ఎలా ఉందన్న అంశాలతో ఇంటెలిజెన్స్ విభాగం ఆరా తీస్తోంది. ఇప్పుడున్న 36 వార్డుల్లోనే ఎన్నికలు జరిపిస్తారా? మునిసిపాలిటీ కార్పొరేట్‌గా రూపాంతరం చెందిన నేపథ్యంలో డివిజన్ల సంఖ్య పెంచి ఎన్నికలు నిర్వహిస్తారా అన్న కోణంలో వివరాలు సేకరిస్తున్నారు. రెండు నెలల క్రితం వార్డుల వారీ జరిపిన సర్వే ఆధారంగా ప్రభుత్వానికి నివేదిక సమర్పించిన అధికారులు, సిబ్బంది బృందం, తాజా గా రెండో నివేదిక సిద్ధంచేసి ప్రభుత్వానికి పంపించే ప్రయత్నంలో ఉన్నట్టు తెలిసింది. తొలి సర్వే టీడీపీకే కాస్త అనుకూలంగా ఉన్నప్పటికీ మారుతున్న పరిస్థితులు వైఎస్సార్సీపీకే పూర్తి మెజార్టీతెచ్చే అవకాశాలున్నాయని తెలుస్తోంది. ప్రభుత్వం తీరు పట్ల నిర్వేదంలో ఉన్న జనం ప్రతిపక్ష వైఎస్సార్సీపీకే మొగ్గుచూపిస్తున్నారు. ఇసుకలో భారీగా సొమ్ములు వెనకేసుకున్న టీడీపీ తమ్ముళ్లపై జనం గుర్రుగా ఉన్నారు. టీడీపీ అధికారం చేపట్టి రెండేళ్లవుతున్నా ఇప్పటికీ ఒక్క ఇల్లూ ఇవ్వలేకపోయింది. రాజకీయాలకు అతీతంగా వ్యవహరించాల్సిన అధికారులు అధికార పార్టీ ఒత్తిళ్లతో పనిచేస్తున్నారు. వృద్ధుల్ని ఇబ్బంది పెడుతున్నారు. తమ వారికే సంక్షేమ ఫలాల్ని అందిస్తున్నారు. నగరంలో 36వార్డులదీ అదే పరిస్థితి. కేసీఆర్ వ్యూహంతోనే తెలంగాణలో కేసీఆర్ ప్రభుత్వం హైదరాబాద్ నగర పాలక సంస్థ ఎన్నికలకు సంబంధించి వ్యూహాత్వకంగా వ్యవహరించి, సర్వే ఫలితాల్ని ముందే తెప్పించుకుని ఎన్నికలకు వెళ్లింది. జనం భావాల్ని అర్థం చేసుకుని దూసుకుపోయి మేయర్ పీఠం దక్కించుకుంది. అదే వ్యూహాన్ని కార్పొరేషన్లు, మునిసిపాలిటీల్లో వ్యవహరించి ఫలితాలు తెచ్చుకునేందుకు టీడీపీ ఆరాటపడుతున్నట్టు తెలిసింది. దీంతో సర్వే చేయాలంటూ పోలీసుశాఖ ద్వారా వివరాలు రప్పించుకుంటున్నట్టు సమాచారం. ఓటర్ల మనోభావాలు ఏ రోజుకారోజు మారిపోతున్నాయి. టీడీపీ పట్ల జనం పూర్తి వ్యతిరేకతతో ఉన్నారు. ఎవరూ సంక్షేమ ఫలాల్ని అందుకోలేకపోతున్నారు. ఇదే విషయాలపై నిఘా బృందాలు ఆరా తీస్తే వైఎస్సార్సీపీకే మెజార్టీ ఇచ్చేందుకు ఓటర్లు సిద్ధమయ్యారని తేలింది. వార్డుల్లో ఇదీ పరిస్థితి నగరంలో బీజేపీ, కాంగ్రెస్‌లకు ఇప్పుడున్న పరిస్థితుల్లో మెజార్టీ లభించే అవకాశాల్లేవని నిఘా బృందాలు తేల్చాయి. టీడీపీ పట్ల కేవలం 17వార్డులకే ప్రజలు మొగ్గు చూప్తున్నారని, మిగతా 19వార్డులూ వైఎస్సార్సీపీయే కైవసం చేసుకోవడంతో పాటు మేయర్ ఫీఠం దక్కించుకుంటుందని వెల్లడైంది. ఎన్నికలు సమీపిస్తున్న కొలదీ వైఎస్సార్సీపీకి మరింత మెజార్టీ వస్తుందని, టీడీపీ అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక కార్యక్రమాలే వైఎస్సార్సీపీకి దగ్గర చేస్తుందని నిఘా బృందాలు తేల్చినట్టు తెలిసింది. వార్డుల్లో 1, 2, 4, 7, 9, 11, 12, 14, 16, 21, 22, 24, 25, 26, 27 వార్డుల్లో దాదాపు వైఎస్సార్సీపీనే ఖరారు చేసేసింది. రిజర్వేషన్ల ప్రతిపాదిక, అభ్యర్థుల గుర్తింపు వంటి అంశాల్ని వైఎస్సార్సీపీ గుర్తిస్తే మిగతా వార్డుల్లోనూ సునాయాసంగా విజయం సాధిస్తుందని నివేదికలో పొందుపర్చినట్టు సమాచారం. -
ఎలా..?
కార్పొరేషన్ ఎన్నికలపై పార్టీల మల్లగుల్లాలు - ఓటర్ల జాబితా వెల్లడితో అభ్యర్థుల వేట - అంగ, అర్థబలం ఉన్నవారి కోసం కసరత్తు - జంప్ జిలానీలపై అధికారపార్టీ అంచనాలు - క్షేత్రస్థాయి బలం లేక గు‘లాబీ’లో గుబులు సాక్షిప్రతినిధి, ఖమ్మం: రాజకీయ పార్టీల్లో ఖమ్మం కార్పొరేషన్ ఎన్నికల వేడి రాజుకుంది. డివిజన్లు, ఓటర్ల జాబితాను ప్రకటించడంతో పార్టీల నేతలు అభ్యర్థుల వేటలో పడ్డారు. ఖమ్మం మున్సిపాలిటీ నుంచి కార్పొరేషన్ స్థారుుకి విస్తరించడంతో ఈ ఎన్నికను అన్ని పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నారుు. ఎవరిని తమ పార్టీ వైపు లాగాలి.. ఎవరికి అంగబలం, అర్థబలం ఉందని ఆరా తీస్తున్నారు. బరిలో నిలిస్తే ప్రత్యర్థిగా ఎవరు ఉంటారు..? డివిజన్లలో ఎన్ని ఓట్లు తమకు వస్తాయనే అంచనాల్లో మునిగారు. హోరాహోరీ పోరు తప్పకపోవచ్చు.. కార్పొరేషన్లో 50 డివిజన్లు ఉన్నారుు. మెజార్టీ డివిజన్లు దక్కించుకున్న వారినే మేయర్ పదవి వరిస్తుంది. 2011 జనాభా లెక్కల ప్రకారం కార్పొరేషన్ పరిధిలో 2, 84, 268 జనాభా ఉంది. గత సంవత్సరం సమగ్ర కుటుంబ సర్వే ప్రకారం 3,50,000 మంది జనాభా, లక్ష కుటుంబాలు ఉన్నట్లు తేలింది. విలీన గ్రామాలతో కలిపి కార్పొరేషన్లో జులై చివరి నాటికి 2,45,600 ఓటర్లు ఉన్నట్లు లెక్కతేలింది. పోలింగ్స్టేషన్ల ఏర్పాట్లు కూడా కొలిక్కి వచ్చాయి. ఓటర్ల జాబితా సవరణలు, పోలింగ్ స్టేషన్ల ఏర్పాట్లు అంతా ఈ నెలతో ముగియనుంది. డిసెంబర్లో ఎన్నికల నగారా మోగనుందన్న ఉద్దేశంతో పార్టీల నేతలు ముందస్తు కసరత్తు మొదలు పెట్టారు. అంగ, అర్థబలం ఉన్న అభ్యర్థుల కోసం.. కార్పొరేటర్‌గా గెలుపొందాలంటే అంగ, అర్థబలం కచ్చితం. ఏ డివిజన్లో ఏ కులం బాగా ఉంది..? వారిలో రాజకీయంగా పరిణతి చెందినవారు ఎవరు? గతంలో పోటీ చేసి విజయం సాధించింది..? ఓడిపోరుుంది ఎవ రు..? తదితర అంశాలను పరిగణలోకి తీసుకుంటున్నారు. అధికారపార్టీ ప్రలోభాలకు లొగకుండా ఉండే బలమైన అభ్యర్థులు ఎవరో ప్రతిపక్షాలు ఆరా తీస్తున్నారుు. ఇంకా ఎన్నికల నోటిఫికేషనే రాలేదు.. పార్టీలు అభ్యర్థులను నిర్ణయించకున్నా.. అన్ని పార్టీల్లో ఆశావహుల సంఖ్య మాత్రం భారీగానే ఉంది. ఎవరికి వా రు తమ అనుంగు నేతలు, ప్రజా ప్రతినిధులు వద్దకు వెళ్లి కార్పొరేషన్ బరిలో నిలబెట్టాలని వేడుకుంటున్నారు. నాలుగైదు డివిజన్లలో 6 వేలకు పైగా, మిగతా వాటిలో 3 వేలకు పైగా ఓట్లు ఉన్నారుు. ఇకపోతే పరపతి ఉండి పైస లు లేనివారు ఒకింత హైరానా పడుతున్నారు. గులాబీలో గుబులు నగరంలో టీఆర్ఎస్కు ఆశించినస్థారుులో బలం లేకపోవడం ఆ పార్టీ నేతలకు గుబులు పుట్టిస్తోంది. జిల్లాపరిషత్ ఎన్నికలతో పోలిస్తే కార్పొరేషన్ ఎన్నికలు ఆ పార్టీ ప్రతిష్టకు సవాల్‌గా మారాయి. ఇప్పటికే కాంగ్రెస్, ఇతర పార్టీల నుంచి మాజీ కౌన్సిలర్లను నయానో..భయానో తమ వైపునకు తిప్పుకున్న పార్టీ నేతలు ఎన్నికల నాటికి జంప్ జిలానీలపైనే దృష్టి పెట్టారు. ఎలాగైనా కార్పొరేషన్‌పై గులాబీ జెండా ఎగురవేస్తేనే ముఖ్యమంత్రి వద్ద తమ పరువు నిలబడుతుందని అంటున్నారు. ఆదిలోనే హంసపాదు అనే రీతిలో ఆ పార్టీ నేతల మధ్య వర్గవిభేదాలు కూడా మొదలవడం పార్టీ పెద్దలకు ఒకింత ఆందోళన కలిగిస్తోంది. ఉద్యమానికి అండగా ఉన్న నేతలను విస్మరిస్తే ఎలా? అనే ప్రశ్న కూడా ఉత్పన్నమవుతోంది. జిల్లా పార్టీ పదవులు, నామినేటెడ్ పదవులు కూడా ఎన్నికల ముందు పార్టీ తీర్థం పుచ్చుకున్న వారికి ఇవ్వడంతో పాత నేతలంతా రగిలిపోతున్నారు. ఉద్యమ జెండా మోసిన వారికి టికెట్లు ఇవ్వకుంటే అధికారపార్టీకి రెబల్ అభ్యర్థుల బెడద తప్పదనే చర్చ నడుస్తోంది. -
తృణమూల్ ప్రభంజనం
-
బెంగాల్ మున్సిపల్ ఎన్నికల్లో తృణమూల్ హవా
కోల్కత్తా: పశ్చిమ బెంగాల్ మున్సిపల్ ఎన్నికల్లో సీఎం మమతా బెనర్జీ నేతృత్వంలోని తృణమూల్ కాంగ్రెస్ పార్టీ హవా కొనసాగుతుంది. కోల్కత్తా కార్పొరేషన్‌తో పాటు రాష్ట్రంలోని వివిధ మున్సిపాలిటీల్లో తృణమూల్ అధిక్యం కనబరుస్తుంది. కోల్కత్తా కార్పొరేషన్‌లోని 144 డివిజనుల్లో 85 చోట్ల తృణమూల్, 12 చోట్ల వామపక్షాలు, 9 చోట్లు బీజేపీ, 7 చోట్ల కాంగ్రెస్ అభ్యర్థులు అధిక్యంలో ఉన్నారు. అలాగే రాష్ట్రంలోని 91 మున్సిపాలిటీల్లో 51 చోట్ల తృణమూల్, 6 చోట్ల కాంగ్రెస్, 5 చోట్ల వామపక్షాల అభ్యర్థులు ఆధిక్యంలో ఉన్నారు. మరో ఆరు మున్సిపాలిటీల్లో హంగ్ ఏర్పడే పరిస్థితి నెలకొంది. -
కో ఆప్షన్ రగడ
- కార్పొరేషన్ ఎన్నికలో పట్టు కోసం ఎమ్మెల్యే యత్నం - ఎంపీ సూచించే అభ్యర్థికి చెక్‌పెట్టే దిశగా పావులు - మైనార్టీ స్థానం కోసం ఇరువర్గాల పట్టు సాక్షి ప్రతినిధి, అనంతపురం : అనంతపురం నగర కార్పొరేషన్లో ‘కో-ఆప్షన్’ సభ్యుల ఎన్నిక చినికి చినికి గాలివానగా మారే అవకాశం కనిపిస్తోంది. కార్పొరేషన్లో ఇప్పటికే ఎమ్మెల్యే వర్గం, మేయర్ వర్గం ‘ఉప్పు-నిప్పు’గా మారిన నేపథ్యంలో కో-ఆప్షన్ సభ్యుల ఎన్నిక పాలక పక్షంలోని విభేదాలను మరింత తీవ్రతరం చేసే అవకాశాలున్నాయని పరిశీలకుల అభిప్రాయం. నగర కార్పొరేషన్ పాలకవర్గాన్ని తన చెప్పు చేతల్లో ఉంచుకోవాలనుకున్న స్థానిక ఎమ్మెల్యే ప్రయత్నాలకు మేయర్ స్వరూప అడ్డుకట్ట వేస్తున్న నేపథ్యంలో అసలు ఆమెకు మద్దతిస్తున్న జేసీ వర్గంతోనే అమీ తుమీ తేల్చుకోవాలని ఎమ్మెల్యే వర్గం పావులు కదుపుతున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో మైనార్టీ కోటా కింద జేసీ వర్గం ప్రతిపాదిస్తున్న అభ్యర్థి ఇషాక్‌కు పోటీగా సర్దాన్‌ను రంగంలోకి తెస్తున్నట్లు సమాచారం. వివరాల్లోకి వెళితే.. కార్పొరేషన్ కౌన్సిల్లో ఐదు కో-ఆప్షన్ స్థానాలకు ఎన్నికలు నిర్వహించాల్సి ఉంది. మూడు స్థానాలకు (వీటిలో ఒకటి మహిళ కోటా) ఉద్యోగ విరమణ చేసిన వారు, మాజీ ప్రజాప్రతినిధులను ఎన్నుకుంటారు. ఈ మూడు స్థానాల్లో ఒకటి రిటైర్డ్ కమిషనర్ నాగభూషణం, రెండవది మాజీ కౌన్సిలర్, టీడీపీ నగర కమిటీ అధ్యక్షుడు కృష్ణకుమార్, మూడవది మాజీ కౌన్సిలర్ శివబాల పేర్లు దాదాపు ఖారారైనట్లు తెలిసింది. మైనార్టీ కోటా కింద రెండు స్థానాలు ఉన్నాయి. ఈ రెండింటిలో ఒక స్థానం ముస్లిం మైనార్టీకి, మరో స్థానం క్రిస్టియన్ లేదా ఇతర మైనార్టీ వర్గానికి ఇవ్వడం ఆనవాయితీ. ఇతర మైనార్టీ వర్గాలకు చెందిన అభ్యర్థులు అధికార పార్టీలో లేనప్పుడు రెండూ ముస్లిం మైనార్టీకి ఇస్తారు. ఈ రెండు స్థానాల్లో ఒకదాన్ని క్రిష్టియన్ మైనార్టీ కింద టీడీపీ మైనార్టీ విభాగం రాష్ట్ర నాయకుడు ఈటెస్వామిదాస్ పేరు ఖరారు చేసినట్లు తెలిసింది. మిగిలిన ఒక మైనార్టీ స్థానాన్ని ఇషాక్‌కు ఇవ్వాలని ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి సూచించినట్లు సమాచారం. జేసీ సోదరులు సూచించిన అభ్యర్థికి స్థానం కల్పిస్తే నగర కార్పొరేషన్లో తన పట్టు మరింత సడలిపోతుందన్న అభిప్రాయంతో ఉన్న ఎమ్మెల్యే తనకు అనుకూలుడైన మరో మైనార్టీ అభ్యర్థి సర్దాన్‌ను తెరమీదకు తీసుకొస్తున్నట్లు సమాచారం. ఎలాగైనా కార్పొరేషన్ పాలక మండలిలో జేసీ వర్గీయులకు స్థానం లేకుండా చేయాలన్న పట్టుదలతో ఎమ్మెల్యే వర్గం ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. నగరంలో ఇటీవల జరిగిన ఒకటి రెండు సంఘటనలు ఈ ప్రచారానికి బలం చేకూరుస్తున్నాయి. ఇటీవల ఇద్దరు మైనార్టీ నేతలను వైఎస్ఆర్సీపీ నుంచి టీడీపీలోకి చేర్చుకునేందుకు ఎమ్మెల్యే పెద్ద ఎత్తున ‘లలిత కళా పరిషత్’లో ఏర్పాట్లు చేసుకున్నారు. నగరమంతా ఫ్లెక్సీలు కట్టించారు. ఈ విషయం తెలిసిన తాడిపత్రి ఎమ్మెల్యే జేసీ ప్రభాకర రెడ్డి మందీ మార్బలంతో సభావేదిక వద్దకు వచ్చి ‘మా అన్న ఎంపీగా ఉన్నాడు. మాకు సమాచారమే లేకుండా మీ ఇష్టానుసారం ఎవరినంటే వారిని పార్టీలో చేర్చుకుంటారా..? ఎంత ధైర్యం మీకు’ అంటూ ఉగ్రరూపం దాల్చారు. జేసీ ప్రభాకర రెడ్డి ఉగ్రరూపం చూసి టీడీపీలో చేరాలని వచ్చిన మైనార్టీ నేతలు చల్లగా జారుకోగా.. వీరిని పార్టీలో చేర్చుకునే కార్యక్రమం ఏర్పాటు చేసిన ఎమ్మెల్యే ఒక్క మాట కూడా జేసీ ప్రభాకర రెడ్డికి ఎదురు చెప్పకుండా మిన్నకుండి పోయారు. ఇలా ఆ కార్యక్రమం రసాభాస అయ్యింది. కార్పొరేషన్లో జేసీ వర్గీయులకు ఎలాంటి పదవులు లేనప్పుడే.. వారి పెత్తనం ఇలా ఉంటే.. రేపు కార్పొరేషన్ పాలకవర్గంలో వారి వర్గీయులకు స్థానం కల్పిస్తే.. పరిస్థితి ఎలా ఉంటుందో అన్న ఆందోళన ఎమ్మెల్యే వర్గంలో నెలకొన్నట్లు పార్టీ వర్గాల సమాచారం. ఈ నేపథ్యంలో ఎట్టి పరిస్థితుల్లోనూ జేసీ వర్గీయులకు కౌన్సిల్లో స్థానం లేకుండా చేయాలని..అందుకోసం అవసరమైతే మేయర్ స్వరూపకు ప్రస్తుతం అనుకూలంగా ఉంటున్న కౌన్సిలర్లతో రాజీ ధోరణితో వ్యవహరించాలని ఎమ్మెల్యే వర్గీయులు భావిస్తున్నట్లు తెలిసింది. ఏది ఏమైనా అనంతపురం నగర కార్పొరేషన్లో పట్టు కోసం ఇంత కాలం మేయర్, ఎమ్మెల్యేల మధ్య సాగుతున్న పోటీ.. ఇకపై జేసీ, ఎమ్మెల్యే మధ్య కొనసాగే పరిస్థితులు కనిపిస్తున్నాయని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. -
చిత్తూరు టీడీపీలో సెగ
అసంతృప్తితో దూరమవుతున్న ఓ వర్గం గంగనపల్లెలో కార్యాలయం మూసివేత తోటపాళెం కార్యాలయం స్థానంలో వైఎస్సార్ సీపీ ఆఫీసు సాక్షి, తిరుపతి: జిల్లా కేంద్రమైన చిత్తూరు అసెంబ్లీ నియోజకవర్గంలో బలిజ సామాజికవర్గం ఓట్లను గంపగుత్తగా కొట్టేయాలని తెలుగుదేశం పార్టీ రచిం చిన వ్యూహం బెడిసికొట్టిం ది. టీడీపీకి ఇప్పటివరకు వెన్నుదన్నుగా ఉంటున్న బలిజ సామాజికవర్గం లోని ఒక బలమైన వర్గం దూరమవుతోంది. టీడీపీ అభ్యర్థి డీకే సత్యప్రభ సమీపబంధువు డీకే బద్రినారాయణ పోకడలు నచ్చకపోవడం తో ఆ సామాజికవర్గం ముఖ్యులు ఎన్నికల్లో ఆ పార్టీకి దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నారు. ముఖ్యంగా కార్పొరేషన్ ఎన్నికల సమయంలో పార్టీ మేయర్ అభ్యర్థిగా బరిలోకి దిగిన మాజీ కౌన్సిలర్ కఠారి మోహన్ సతీమణి అనురాధ వర్గీయులు బద్రి వ్యవహారశైలిపై తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ప్రస్తుతానికి కఠారి మోహన్ ఎన్నికల ప్రచారంలో ఉన్నా ఆయన వర్గీయులు మాత్రం దూరమయ్యా రు. అందులో భాగంగానే గంగనపల్లెలో పార్టీ కార్యాలయూన్ని రెండు రోజులుగా మూసేశారు. తోటపాళెంలో ఆ పార్టీ కార్యాలయం స్థానం లో వైఎస్సార్ సీపీ కార్యాలయం వెలసింది. నామినేషన్ల స్వీకరణకు కొద్దిరోజుల ముందు సత్యప్రభను తెలుగుదేశం రంగంలోకి తెచ్చింది. సామాజికవర్గపరంగాను, ఆర్థికంగాను ఆమె బలమైన శక్తిగా చంద్రబాబు భావించారు. చంద్రబాబు సామాజికవర్గానికి చెందిన నేతలు కూడా సత్యప్రభకు టికెట్టు ఇచ్చే విషయంలో అభ్యంతరం చెప్పకపోవడంతో ఆమెను అభ్యర్థిగా ఖరారు చేశారు. ఆ తరువాత డివిజన్లవారీగా పార్టీ కార్యాలయాల ఏర్పాటులో రెండు ప్రధాన సామాజికవర్గాల నేతల మధ్య విభేదాలు పొడసూపాయి. గత నెలలో జరిగిన కార్పొరేషన్ ఎన్నికల్లో ఆయా డివిజన్ల నుంచి పోటీ చేసిన కార్పొరేటర్ అభ్యర్థులకు డివిజన్ బాధ్యతలు అప్పగించాలని తొలుత భావించారు. ఇది కొందరికి నచ్చలేదు. ఆయా డివిజన్లలో బలమైన నాయకులకు బాధ్యతలు అప్పగించాలనే ప్రతిపాదన వచ్చింది. ఈ వ్యవహారాన్ని పరిష్కరించుకునేందుకు ఆ పార్టీ నానా ఇబ్బందులు ఎదుర్కొంది. తాజాగా ఇప్పుడు సత్యప్రభ కుటుం బానికి సన్నిహితంగా ఉంటున్న బలిజ సామాజికవర్గానికి చెందిన నేతలు దూరమయ్యారు. ఈ వర్గానికి నాయకత్వం వహిస్తున్న కఠారి మోహన్ పైకి కనిపించ కపోయినా అంతర్గతంగా బద్రి వ్యవహారశైలిపై కుతకుతలాడుతున్నట్టు సమాచారం. ఆయన వర్గానికి చెందిన ప్రముఖులు ఇప్పటికే ఎన్నికల ప్రచారం నుంచి తప్పుకున్నారు. ఇది చిత్తూరు లో టీడీపీకి పెద్ద షాక్ అని చెప్పకతప్పదు. అంతేకాకుండా చంద్రబాబు సామాజికవర్గానికి చెందిన నాయకులు కూడా కొన్ని రోజులుగా అసంతృప్తితో ఉన్నారు. తాము గట్టిగా పట్టుబట్టి చంద్రబాబును ఒప్పించి సత్యప్రభకు టికెట్టు ఇప్పిస్తే తమను చిన్నచూపు చూస్తున్నారనే భావన కొంతమంది కమ్మ సామాజికవర్గ నేతల్లో ఉంది. ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవడంలో బద్రి సొంత మనుషులకే పరిమితమవుతున్నారని అంటున్నారు. దీంతో టీడీపీ అభ్యర్థికి ఇటు సొంత సామాజికవర్గంతో పాటు కమ్మ సామాజికవర్గం నుంచి కూడా అసంతృప్తులు పెరగడంతో పార్టీ శ్రేణుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. డబ్బులు ఇవ్వలేదని క్యూ కట్టిన నిర్వాహకులు పార్టీ కార్యాలయాల నిర్వహణకు రోజువారీ డబ్బులు ఇవ్వలేదని శనివారం సాయంత్రం ఐదారు డివిజన్ల నిర్వాహకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. వారంతా నేరుగా డీకే బద్రినారాయణ వద్ద అసంతృప్తిని వ్యక్తం చేశారు. ఇదే రకంగా వ్యవహరిస్తే కార్యాలయాలు మూసివేస్తామన్నా రు. దీంతో వారికి అప్పటికప్పుడు డబ్బులు ఇచ్చి పంపినట్టు తెలిసింది. ఒక్కో కార్యాలయానికి రూ.10 వేలు వంతున చెల్లిస్తున్నట్టు సమాచారం. -
ఒకే రోజు 281 నామినేషన్లు
కార్పొరేషన్ ఎన్నికల్లో నామినేషన్ల హోరు వినిపించింది. మూడోరోజు బుధవారం మంచిరోజు కావడంతో ఒక్క రోజే 281 నామినేషన్లు దాఖల య్యాయి. మొదటిరోజు ఒకటి, రెండోరోజున 22 నామినేషన్లు పడిన సంగతి తెలిసిందే. దీంతో నామినేషన్లు దాఖలు చేసే ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం, దండమూడి రాజగోపాలరావు ఇండోర్‌స్టేడియం వద్ద పండుగ వాతావరణం కనిపించింది. వివిధ పార్టీల తరఫున కార్పొరేటర్ అభ్యర్థులుగా నామినేషన్ దాఖలు చేసేందుకు భారీ ప్రదర్శనలతో చేరుకున్నారు. అభ్యర్థుల వెంట వచ్చే కార్యకర్తలను కార్యాలయం వద్దకు రాకుండా దూరంగానే నిలిపివేశారు. అనుచరులు దూకుడుకు పోలీసులు అడ్డుకట్ట వేశారు. అభ్యర్థితో పాటు ప్రతిపాదించే వారిని మాత్రమే నామినేషన్ వేసేందుకు పంపించారు. ఓటరు గుర్తింపు కార్డులున్న వారిని మాత్రమే లోపలికి అనుమతించారు. బుధవారం ఏకాదశి కావటంతో సెంటిమెంట్ ప్రభావం కనిపించింది. నామినేషన్లు వేసిన తర్వాత ఆయా డివిజన్లలో ప్రచారం ప్రారంభించడంతో పూర్తిగా ఎన్నికల సందడి నగరమంతా వ్యాపించినట్లయింది.