బెంగాల్ మున్సిపల్ ఎన్నికల్లో తృణమూల్ హవా
కోల్కత్తా: పశ్చిమ బెంగాల్ మున్సిపల్ ఎన్నికల్లో సీఎం మమతా బెనర్జీ నేతృత్వంలోని తృణమూల్ కాంగ్రెస్ పార్టీ హవా కొనసాగుతుంది. కోల్కత్తా కార్పొరేషన్తో పాటు రాష్ట్రంలోని వివిధ మున్సిపాలిటీల్లో తృణమూల్ అధిక్యం కనబరుస్తుంది. కోల్కత్తా కార్పొరేషన్లోని 144 డివిజనుల్లో 85 చోట్ల తృణమూల్, 12 చోట్ల వామపక్షాలు, 9 చోట్లు బీజేపీ, 7 చోట్ల కాంగ్రెస్ అభ్యర్థులు అధిక్యంలో ఉన్నారు. అలాగే రాష్ట్రంలోని 91 మున్సిపాలిటీల్లో 51 చోట్ల తృణమూల్, 6 చోట్ల కాంగ్రెస్, 5 చోట్ల వామపక్షాల అభ్యర్థులు ఆధిక్యంలో ఉన్నారు. మరో ఆరు మున్సిపాలిటీల్లో హంగ్ ఏర్పడే పరిస్థితి నెలకొంది.