కార్పొరేషన్ ఎన్నికలపై కార్యాచరణ
⇒నేడు వైఎస్సార్‌సీపీ విస్తృత సమావేశం
⇒హాజరుకానున్న పార్టీ ప్రముఖులు
కాకినాడ : కార్పొరేషన్ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మేయర్ పీఠాన్ని కైవసం చేసుకోవడమే లక్ష్యంగా అవసరమైన కార్యాచరణకు సమాయత్తమవుతోంది. 48 డివిజన్లకుగాను మెజార్టీ స్థానాలతోపాటు మేయర్ పీఠాన్ని గెలుచుకునేందుకు పార్టీ శ్రేణులను సమాయత్తం చేసేందుకు పార్టీ ముఖ్య నేతలంతా శనివారం సమావేశం కానున్నారు. కాకినాడ సినిమా రోడ్డులోని పద్మనాభ ఫంక్షన్ హాలులో మధ్యాహ్నం 3 గంటలకు ఎన్నికల సన్నాహక సమావేశం ఏర్పాటు చేశారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎ మ్మెల్యే కురసాల కన్నబాబు అధ్యక్షతన జరిగే సమావేశానికి పార్టీ రాష్ట్ర ప్రధా న కార్యదర్శి, ఎంపీ వి.విజయసాయి రెడ్డి, జిల్లా పరిశీలకులు, మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు, మరో సీనియర్ నేత, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ, కార్పొరేషన్ ఎన్ని కల పర్యవేక్షకులు, చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కరరెడ్డి తదితర ప్రముఖులు హాజరుకానున్నారు.
ఎన్నికల్లో అనుసరించాల్సి న వూహ్యం, ప్రచారాలుపై పార్టీశ్రేణులకు దిశ, నిర్దేశం చేయనున్నారు. పార్లీమెంట్ కో–ఆర్డినేటర్ చలమలశెట్టి సునీల్, సిటీ కో–ఆర్డినేటర్లు ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి, ముత్తా శశిధర్‌లతో ఎన్నికలను ఎదుర్కొనే అంశంపై చర్చించనున్నారు. నంద్యాల ఎన్నికల్లో అధికార బలాన్ని ఉపయోగించి ఓటర్లను మభ్యపెట్టడం, మద్యం, మందు పంపిణీ, వైఎస్సార్‌సీపీకి అనుకూలంగా ఉండే కార్యకర్తలపై దాడులు, వేధింపుల నేపథ్యంలో ఇక్కడి ఎన్నికలపై పార్టీ శ్రేణులతో చర్చించి దిశ, నిర్ధేశం చేయనున్నారు. ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకోవాల్సిన అవసరంపై చర్చించనున్నారు. ఈ సమావేశానికి తూర్పు, పశ్చిమ, విశాఖ జిల్లాలతోపాటు మ రికొన్ని ప్రాంతాల నుంచి కూడా నియోజకవర్గాల కో–ఆర్డినేటర్లు హాజరవుతారని, పార్టీ జిల్లా అధ్యక్షుడు కురసాల కన్నబాబు ‘సాక్షి’కి చెప్పారు. ఈ సమావేశానికి పార్టీ ముఖ్యనేతలంతా విధిగా హాజరుకావాలని కోరారు.