కార్పొరేషన్ ఎన్నికల్లో నామినేషన్ల హోరు వినిపించింది. మూడోరోజు బుధవారం మంచిరోజు కావడంతో ఒక్క రోజే 281 నామినేషన్లు దాఖల య్యాయి. మొదటిరోజు ఒకటి, రెండోరోజున 22 నామినేషన్లు పడిన సంగతి తెలిసిందే.
దీంతో నామినేషన్లు దాఖలు చేసే ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం, దండమూడి రాజగోపాలరావు ఇండోర్‌స్టేడియం వద్ద పండుగ వాతావరణం కనిపించింది. వివిధ పార్టీల తరఫున కార్పొరేటర్ అభ్యర్థులుగా నామినేషన్ దాఖలు చేసేందుకు భారీ ప్రదర్శనలతో చేరుకున్నారు. అభ్యర్థుల వెంట వచ్చే కార్యకర్తలను కార్యాలయం వద్దకు రాకుండా దూరంగానే నిలిపివేశారు. అనుచరులు దూకుడుకు పోలీసులు అడ్డుకట్ట వేశారు. అభ్యర్థితో పాటు ప్రతిపాదించే వారిని మాత్రమే నామినేషన్ వేసేందుకు పంపించారు.
ఓటరు గుర్తింపు కార్డులున్న వారిని మాత్రమే లోపలికి అనుమతించారు. బుధవారం ఏకాదశి కావటంతో సెంటిమెంట్ ప్రభావం కనిపించింది. నామినేషన్లు వేసిన తర్వాత ఆయా డివిజన్లలో ప్రచారం ప్రారంభించడంతో పూర్తిగా ఎన్నికల సందడి నగరమంతా వ్యాపించినట్లయింది.