దేవరాపల్లి: అక్రమంగా గంజాయి తరలిస్తున్న స్మగ్లర్లను వెంబడించిన పోలీసులు వారిపై ఒక రౌండ్ కాల్పులు జరిపారు. ఈ ఘటన పశ్చిమ గోదావరి దేవరాపల్లి మండలంలో చోటు చేసుకుంది. గంజాయిని డీసీఎం వాహనంలో తరలిస్తున్న స్మగ్లర్లను విజయవాడ పోలీసుల సహకారంతో పశ్చిమ గోదావరిలోని మూడు మండలాల పోలీసులు పక్కా సమాచారంతో జాయింట్ ఆపరేషను నిర్వహించి నిందితులను సినీఫక్కీలో వెంబడించారు. వారు ఎంత సేపటికి ఆగకపోవడంతో గాలిలోకి ఒక రౌండు కాల్పుల జరిపారు. ఆరుగురిని అరెస్టు చేసి, వారినుంచి భారీ స్థాయిలో 500 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్టు పోలీసులు వెల్లడించారు.నిందితులలోని ఎక్కువ మంది వరంగల్ కు చెందిన వారిగా తెలుస్తోంది.
సాక్షి ఏనాడో చెప్పింది
నర్సీపట్నం కేంద్రంగా గతకొంత కాలంగా పశ్చిమ గోదావరి, వరంగల్ మీదుగా హైద్రాబాద్ కు జోరుగా గంజాయి తరళిస్తున్నారని సాక్షి దినపత్రిక కథనాలను ప్రచురించింది. పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరించడంతోనే గంజాయి వ్యాపారులు రెచ్చిపోయారని తెలుస్తోంది.
గంజాయి స్మగ్లర్లపై కాల్పులు జరిపిన పోలీసులు
Published Sun, Aug 28 2016 1:49 PM | Last Updated on Tue, Nov 6 2018 5:21 PM
Advertisement
Advertisement