అక్రమంగా గంజాయి తరలిస్తున్న స్మగ్లర్లను వెంబడించిన పోలీసులు వారిపై ఒక రౌండ్ కాల్పులు జరిపారు. ఈ ఘటన పశ్చిమ గోదావరి దేవరాపల్లి మండలంలో చోటు చేసుకుంది. గంజాయిని డీసీఎం వాహనంలో తరలిస్తున్న స్మగ్లర్లను విజయవాడ పోలీసుల సహకారంతో పశ్చిమ గోదావరిలోని మూడు మండలాల పోలీసులు పక్కా సమాచారంతో జాయింట్ ఆపరేషను నిర్వహించి నిందితులను సినీఫక్కీలో వెంబడించారు.