
సాక్షి, పశ్చిమ గోదావరి : ‘‘చంద్రబాబూ నీకో దండం... నువ్వు మాకు వద్దు’’ అంటూ ఏపీ ప్రజలే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడిని తిరస్కరిస్తారని ఉండి నియెజకవర్గ వైఎస్సార్ సీపీ సమన్వయ కర్త పీవీఎల్ నరసింహారాజు అన్నారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబు కారణంగానే ఏపీకి ప్రత్యేక హోదా రాలేదని ఆరోపించారు. వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి మాత్రమే ఏపీకి ప్రత్యేక హోదా కోసం మొదటినుంచి పోరాడుతున్న ఏకైక నాయకుడని అన్నారు.
చంద్రబాబు దుర్మార్గపు పాలనకు రాబోయే ఎన్నికలలో ప్రజలు చరమగీతం పాడతారని జోష్యం చెప్పారు. ఏపీ ప్రజలు చంద్రబాబు చేతిలో రెండోసారి మోసపోవడానికి సిద్దంగా లేరన్నారు. ‘‘ఏపీకి ఏం చేశాడని చంద్రబాబు మళ్లీ రావాలి’’ అంటూ ప్రశ్నించారు. గురువారం నుంచి ‘‘రావాలి జగన్ కావాలి జగన్’’ కార్యక్రమంలో తెలుగుదేశం ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు తెలియజేస్తామని తెలిపారు.