narasimha raju
-
ఎన్ని కుట్రలు చేసిన సీఎం జగన్ గెలుపును ఆపలేరు
-
ఉండిలో వైఎస్సార్సీపీ అభ్యర్థి పీవీఎల్ నరసింహరాజుకు ఘన స్వాగతం
-
టీడీపీ గూండాలతో లోకేశ్ బలప్రదర్శన: పీవీఎల్
-
Anukoni Prayanam: నా మనసుకు నచ్చింది
‘‘అనుకోని ప్రయాణం’ అద్భుతమైన కథ. నా మనసుకు నచ్చింది. నా చిత్రాల్లో ది బెస్ట్‌గా నిలుస్తుంది. ఈ సినిమా ఎలా ఆడుతుందో అనే టెన్షన్ నాలో మొదలైంది’’ అని నటుడు రాజేంద్ర ప్రసాద్ అన్నారు. వెంకటేష్ పెదిరెడ్ల దర్శకత్వంలో రాజేంద్ర ప్రసాద్, నరసింహ రాజు ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘అనుకోని ప్రయాణం’. బెక్కం వేణుగోపాల్ సమర్పణలో డా.జగన్మోహన్ డీవై నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 28న విడుదల కానుంది. ఈ సినిమా ట్రైలర్ విడుదల వేడుకలో రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ– ‘‘ఆ నలుగురు’లో నాది సీరియస్ పాత్ర. అందుకే ఆ సినిమా విడుదలైనప్పుడు కొంత టెన్షన్ పడ్డాను. కానీ, అందరూ నవ్వి నవ్వి వంద రోజులు చూశారు. ఇప్పుడు ‘అనుకోని ప్రయాణం’ కూడా అంత పెద్ద విజయాన్ని అందుకుంటుంది’’ అన్నారు. ‘‘ఈ సినిమా ప్రేక్షకులకు నచ్చుతుంది’’ అన్నారు నరసింహ రాజు. ‘‘కరోనా సమయంలో ఈ కథ రాశాను’’ అన్నారు డా.జగన్ మోహన్ డీవై. ‘‘ఈ చిత్రం అందరి హృదయాలను టచ్ చేస్తుంది’’ అన్నారు వెంకటేష్ పెదిరెడ్ల. ‘‘అనుకోని ప్రయాణం’ సంచలన విజయం సాధించాలి’’ అన్నారు డైరెక్టర్ ఎస్వీ కృష్ణారెడ్డి . ‘‘ఈ చిత్రం కొత్తగా ఉంటుంది’’ అన్నారు బెక్కం వేణుగోపాల్. దర్శకులు కె.విజయభాస్కర్, నందినీ రెడ్డి, వీరభద్రం, నటుడు సోహైల్ పాల్గొన్నారు. -
ఈ కథ విన్నప్పుడు ఫ్రీజ్ అయ్యాను
‘‘ఇన్నేళ్ల నా కెరీర్లో ‘ఆ నలుగురు’, ‘మీ శ్రేయోభిలాషి’ కథలను విన్నప్పుడు షాకయ్యాను. కానీ దర్శకుడు వెంకటేశ్ ‘అనుకోని ప్రయాణం’ కథ చెప్పినప్పుడు ఫ్రీజ్ అయ్యాను’’ అని ప్రముఖ నటుడు రాజేంద్రప్రసాద్ అన్నారు. పెదిరెడ్ల వెంకటేశ్ దర్శకత్వంలో రాజేంద్రప్రసాద్, నరసింహరాజు ప్రధాన పాత్రధారులుగా డా. జగన్మోహన్ నిర్మించిన చిత్రం ‘అనుకోని ప్రయాణం’. ఈ సినిమా రిలీజ్‌కు సిద్ధమైంది. నిర్మాత బెక్కం వేణుగోపాల్ సమర్పణలో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా సోమవారం జరిగిన విలేకర్ల సమావేశంలో రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ– ‘‘కరోనా సమయంలో వలస కూలీల ప్రయాణం నుంచి పుట్టిన కథ ఇది. ఇద్దరి స్నేహితుల కథ. నరసింహరాజుగారిలాంటి గొప్ప నటుడితో కలిసి యాక్ట్ చేయడం చాలా ఆనందంగా ఉంది’’ అని అన్నారు. ‘‘రాజేంద్రప్రసాద్‌గారిలాంటి వారు ఈ కథను ఒప్పుకున్నారంటేనే విజయం కింద లెక్క. డాక్టర్ అయిన జగన్మోహన్ నిర్మాణంలోకి రావడం చాలా సంతోషంగా ఉంది’’ అన్నారు నరసింహరాజు. ‘‘రాజేంద్రప్రసాద్, నరసింహరాజు వంటి నటులు నా సినిమాలో నటించడం ఆనందంగా ఉంది’’ అన్నారు దర్శకుడు వెంకటేశ్. -
‘చంద్రబాబూ నీకో దండం.. నువ్వు మాకోద్దు..’
సాక్షి, పశ్చిమ గోదావరి : ‘‘చంద్రబాబూ నీకో దండం... నువ్వు మాకు వద్దు’’ అంటూ ఏపీ ప్రజలే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడిని తిరస్కరిస్తారని ఉండి నియెజకవర్గ వైఎస్సార్ సీపీ సమన్వయ కర్త పీవీఎల్ నరసింహారాజు అన్నారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబు కారణంగానే ఏపీకి ప్రత్యేక హోదా రాలేదని ఆరోపించారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాత్రమే ఏపీకి ప్రత్యేక హోదా కోసం మొదటినుంచి పోరాడుతున్న ఏకైక నాయకుడని అన్నారు. చంద్రబాబు దుర్మార్గపు పాలనకు రాబోయే ఎన్నికలలో ప్రజలు చరమగీతం పాడతారని జోష్యం చెప్పారు. ఏపీ ప్రజలు చంద్రబాబు చేతిలో రెండోసారి మోసపోవడానికి సిద్దంగా లేరన్నారు. ‘‘ఏపీకి ఏం చేశాడని చంద్రబాబు మళ్లీ రావాలి’’ అంటూ ప్రశ్నించారు. గురువారం నుంచి ‘‘రావాలి జగన్ కావాలి జగన్’’ కార్యక్రమంలో తెలుగుదేశం ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు తెలియజేస్తామని తెలిపారు. -
'సంతృప్తిగా నట జీవితం'
అలనాటి కథానాయకుడు నరసింహరాజు దుర్గాఘాట్‌లో పుష్కర స్నానం.. సీరియల్ షూటింగ్! విజయవాడ: కృష్ణమ్మ ఉరకలు వేస్తోందని అలనాటి కథానాయకుడు నరసింహరాజు అన్నారు. కృష్ణమ్మ ఒడిలో పవిత్ర స్నానమాచరించేందుకు పుష్కరాల సమయంలో ఇక్కడకు రావటం చాలా ఆనందంగా ఉందని అన్నారు. పుష్కర స్నానంతో పాటు సప్తమాత్రికలు అనే టీవీ సీరియల్లో నటించేందుకు నరసింహరాజు మంగళవారం దుర్గాఘాట్‌కు వచ్చిన ఆయన కాసేపు సాక్షితో ముచ్చటించారు. ఆ విశేషాలు సాక్షి :మీ స్వస్థలం ? నరసింహరాజు : నేను పక్క జిల్లా వాడినే. తణుకు సమీపంలోని వడ్డూరు మా ఊరు. సాక్షి : చిత్ర రంగంలోకి ఎప్పుడు వచ్చారు? నరసింహరాజు : 1969వ సంవత్సరంలో సినిమా పరిశ్రమకు వచ్చాను. ఇప్పటి వరకూ 120 చిత్రాల్లో నటించాను. ఆ చిత్రాలన్నీ చాలా సంతృప్తినిచ్చాయి. సాక్షి : కథానాయకుడిగాఎన్ని చిత్రాల్లో నటించారు.? నరసింహరాజు : సుమారుగా 90 చిత్రాల్లో కథానాయకునిగా నటించాను. అవన్నీ మంచి గుర్తింపు తెచ్చాయి. చాలా మంది ప్రముఖ నటులతో కలిసి నటించాను. చాలా సినిమాలు నాకు మంచి పేరు తెచ్చిపెట్టాయి. అందులో జగన్మోహిణి, పునాదిరాళ్ళు, పున్నమినాగు, నీడలేని ఆడది, ఇలా చాలా సినిమాలు నాకు మంచి గుర్తింపును తెచ్చాయి. అదేవిధంగా ఆధ్యాత్మికమైన సినిమాలు ప్రేక్షకాదరణ పొందాయి. చాలా కొన్ని చిత్రాలే ప్రేక్షకాధరణ పొందలేదు. -
'ఆమె ఎవరితోనైనా తలదించుకునే మాట్లాడేది'
‘సాక్షి’ తో అలనాటి కథానాయకుడు నరసింహరాజు పెద్ద వాల్తేర్: అలనాటి వెండితెర రాకుమారుడు...జానపద జగన్మోహనుడు. నలుపు తెలుపు నుంచి రంగుల తెరపై మహేంద్రజాలం చేసిన మాంత్రికుడు విఠలాచార్యుడి చేతిలో కత్తి లాంటి హీరో. నిలువెత్తు నట కౌశలానికి నిదర్శనగా తనకంటూ ఓ ప్రత్యేకతను చాటుకున్న ‘నట’రాజు నరసింహరాజు. శతాధిక చిత్రాల్లో నటించి నేడు బుల్లితెరపై బిజీగా ఉన్నారు. విశాఖ నగరంలో ఓ చిత్రం షూటింగ్‌కు వచ్చిన సందర్భంగా సాక్షితో ముచ్చటించారు. ఈ మధ్యకాలంలో వెండితెరపై గాడ్(గ్రాండ్) ఫాదర్‌గా కనిపిస్తూ నేటి ట్రెండ్‌కు సరిపడేలా తన నటనా ట్రెండ్‌ను సెట్ చేసుకున్నానని చెబుతున్న నరసింహారాజు ముచ్చట్లు ఆయన మాటల్లోనే... ట్రెండీ డాడీలకే నేటి తరం కనెక్ట్ అవుతారు... మారుతున్న ట్రెండ్ కి అనుగుణంగా మన నటనా ట్రెండ్ సెట్ చేసుకోవాలి. నేటి ఆటా పాటా తీరుతెన్నులు అన్నీ పూర్తిగా మారిపోయాయి. నాటి నటన ఒక తీరుంటే నేటి యాక్టింగ్‌కి ఒక ట్రెండ్ ఉంది. నాటి డైలాగ్‌లు మీనింగ్‌ఫుల్‌గా ఉంటే... నేటి మాటలకు పాటలకు చాలా మీనింగ్లు ఉంటున్నాయి. ఇప్పటి చిత్రాలన్నింటినీ మ్యూజిక్ డామినేట్ చేస్తున్నది. హోరెత్తించే బ్రాక్‌డ్రాప్ మ్యూజిక్‌లో మీనింగ్లు, డైలాంగ్లకు అంతగా ప్రాముఖ్యం లేకుండా పోయింది. చాలా ట్రెండీ డాడీలకే నేటి తరం బాగా కనెక్ట్ అవుతున్నారు. చిత్ర పరిశ్రమలో కొనసాగాలంటే మనమే మారాలి అంతే.. అనుకోకుండా హీరోను అయ్యాను.. డ్రామా లాంటి అనుభవం ఏమీ లేకుండానే నేను అనుకోకుండా హీరోనయ్యాను. అప్పటి దర్శకుడు ఏం చెబితే చాలా చేయడం. వారు చెప్పిన డైలాగ్‌లను చెప్పడమే మావంతు. ఫైట్లు, డ్యాన్స్‌లు పూర్తిగా రావు, అన్నీ పూర్తిగా వచ్చిన తరువాత అవకాశాలు లేకుండా పోయాయి. అందువల్లనే మా చిత్రాలు బాగా ఆడాయని చెప్పలేము, లేదనీ చెప్పలేం. ఆనాటి రోజులు చాలా మంచికథ...అందులోనూ కుటుంబ కథాచిత్రాలంటే బాగా ఆదరించేవారు. అభిమాన నటీనటులంటూ ఎవరూ లేరు... నాకు ప్రత్యేకంగా అభిమాన నటులు, నటీమణులంటూ ఎవరూ లేరు. నా పాత్ర వరకు వారితో కలిసి నటించడం తప్ప ఎలాంటి సంబంధాలుండేవి కావు. ఓ షూటింగ్ తరువాత మరో షూటింగ్లో మరొకరితో నటించడం..అంతే తప్ప ఫలానా వారంటే ప్రత్యేకంగా ఇష్టమనేది లేదు. అలాగే ఆనాటి నటీమణులు కూడా సహనటులతో వారి పాత్రల వరకే పరిమితమయ్యేవారు. జయమాలిని గురించి చెప్పాలంటే షూటింగ్లో ఆమె ఎవరితో మాట్లాడాల్సి వచ్చినా తలదించుకునే మాట్లాడేది. ఎవరితో అంత చనువుగా ఉన్నట్టు చూడలేదు. చివరికి ఆమె షూటింగ్‌ల నుంచి బయటకు వచ్చిన తరువాత మీడియా సైతం ఆమెతో మాట్లాడడానికి ఎంతో కష్టపడి ఉంటారు. వెరైటీ పాత్రతో కొత్త చిత్రం షూటింగ్ ప్రస్తుతం విశాఖలో కొత్త చిత్రం షూటింగ్ ప్రారంభమైంది. ఇందులో నా పాత్ర హీరోయిన్ల తండ్రి పాత్ర. ఇది పూర్తి వెరైటీ పాత్ర. ఇది నేటి తరానికి బాగా కనెక్ట్ అవుతుందని భావిస్తున్నాను. ఇంత వరకూ నేను జైహింద్, చందమామ కథలు వంటి చిత్రాల్లో నటించాను. ఇక బుల్లి తెరపై చాలా సీరియల్స్‌లో నటిస్తున్నాను. హీరో కంటే పాత్రకే ప్రాముఖ్యత... నాతో చిరంజీవి కలిసి నటించిన చిత్రం పునాదిరాళ్లు. ఆ చిత్రంలో నేను హీరో కాగా, మరో నలుగురు యువకుల్లో చిరంజీవి ఒకరు. ఆ తరువాత మేమిద్దరం కలిసి నటించిన చిత్రం ‘పున్నమి నాగు’. అందులో చిరంజీవిది యంగ్ రోల్. ఆ చిత్రంలో నేను హీరో అయినప్పటికీ యాంటీ రోల్ చేసిన చిరంజీవే పాపులర్ అయ్యారు. జగన్మోహిని చిత్రంలో అసలు హీరోయిన్ ప్రభ. అయితే జయమాలినే హీరోయిన్ అని అందరూ అనుకుంటారు. అలాగే పున్నమినాగులో చిరంజీవినే హీరోగా అనుకోవచ్చు. ఎవరి పాత్రకు ప్రాముఖ్యం ఉంటుందో వారే హీరో అవుతారు. ఆ చిత్రం తరువాత చిరంజీవితో ఎలాంటి సంబంధాలు లేవు. చాలాకాలం తరువాత శంకర్‌దాదా ఎంబీబీఎస్ చిత్రం షూటింగ్ సమయంలో ఒకసారి మేం కలిశామంతే. వైజాగ్ వండర్ఫుల్ సిటీ వండర్ ఫుల్ వైజాగ్ నాకు అత్తగారి నగరం. మాది పశ్చిమగోదావరి జిల్లా తణుకు దగ్గర వట్లూరు. అయితే మా బంధువులందరూ వైజాగ్‌లో డాబాగార్డెన్స్, గాజువాకలో స్థిరపడ్డారు. నా కూతురు, కొడుకు ఇద్దరూ కూడా కెనడాలో స్థిరపడ్డారు. అయితే అక్కడ ఇమడలేక నేను ఆంధ్రలోనే ఉండిపోయాను. సీరియల్స్, సినిమాలతో కాస్తా బిజీగానే గడుపుతున్నాను. ప్రేక్షకుల ఆదరాభిమానాలు పొందుతున్నాను. -
సుద్దాలకు గురజాడ పురస్కారం
విజయనగరం: ప్రముఖకవి, సినీగేయ రచయిత డాక్టర్ సుద్దాల అశోక్‌తేజకు గురజాడ విశిష్ట పురస్కారాన్ని అందజేయనున్నట్టు గురజాడ సాంస్కృతిక సమాఖ్య అధ్యక్షుడు పి.వి.నరసింహ రాజు తెలిపారు. విజయనగరంలోని గురజాడ స్వగృహంలో శనివారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఈ నెల 30న గురజాడ వర్ధంతిని పురస్కరించుకుని సమాఖ్య ఆధ్వర్యంలో సాహితీ చైతన్యోత్సవాన్ని నిర్వహించనున్నట్టు తెలిపారు. సమాఖ్య ప్రధాన కార్యదర్శి కె.ప్రకాశ్ మాట్లాడుతూ 30వ తేదీ ఉదయం గురజాడ స్వగృహంలో గురజాడ చిత్రపటం వద్ద నివాళులర్పించి ఆయన కలం నుంచి జాలువారిన గీతాలను ఆలపిస్తూ, ఆయన వినియోగించిన వస్తువులతో ఊరేగింపుగా గురజాడ గ్రంథాలయానికి చేరుకుంటారన్నారు. అనంతరం గ్రంథాలయంలో గురజాడ సాహితీ సదస్సు జరుగుతుందని తెలిపారు. సాయంత్రం జరిగే కార్యక్రమంలో సుద్దాల అశోక్ తేజకు పురస్కారం అందజేయనున్నట్టు తెలిపారు.