సుద్దాలకు గురజాడ పురస్కారం | gurajada award to suddala ashok teja | Sakshi
Sakshi News home page

సుద్దాలకు గురజాడ పురస్కారం

Published Sun, Nov 23 2014 2:26 AM | Last Updated on Sat, Sep 2 2017 4:56 PM

సుద్దాలకు గురజాడ పురస్కారం

సుద్దాలకు గురజాడ పురస్కారం

విజయనగరం: ప్రముఖకవి, సినీగేయ రచయిత డాక్టర్ సుద్దాల అశోక్‌తేజకు గురజాడ విశిష్ట పురస్కారాన్ని అందజేయనున్నట్టు  గురజాడ సాంస్కృతిక సమాఖ్య అధ్యక్షుడు పి.వి.నరసింహ రాజు తెలిపారు. విజయనగరంలోని గురజాడ స్వగృహంలో శనివారం  విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఈ నెల 30న గురజాడ వర్ధంతిని పురస్కరించుకుని సమాఖ్య ఆధ్వర్యంలో  సాహితీ చైతన్యోత్సవాన్ని నిర్వహించనున్నట్టు తెలిపారు.

సమాఖ్య ప్రధాన కార్యదర్శి కె.ప్రకాశ్ మాట్లాడుతూ 30వ తేదీ ఉదయం గురజాడ స్వగృహంలో గురజాడ చిత్రపటం వద్ద నివాళులర్పించి  ఆయన కలం నుంచి జాలువారిన  గీతాలను ఆలపిస్తూ,  ఆయన వినియోగించిన వస్తువులతో ఊరేగింపుగా గురజాడ గ్రంథాలయానికి చేరుకుంటారన్నారు. అనంతరం గ్రంథాలయంలో గురజాడ సాహితీ సదస్సు జరుగుతుందని తెలిపారు. సాయంత్రం జరిగే కార్యక్రమంలో సుద్దాల అశోక్ తేజకు పురస్కారం అందజేయనున్నట్టు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement